టోక్యో: భారత పురుషుల హాకీ జట్టు ‘టోక్యో’లో చెలరేగుతోంది. ఆతిథ్య జట్టు జపాన్‌పై అదిరే విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం జరిగిన పూల్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో భారత్ 5–3 గోల్స్ తేడాతో జపాన్‌పై జయభేరి మోగించింది. నాలుగు విజయాలు సాధించిన భారత్ పూల్ ‘ఎ’లో రెండో స్థానంలో నిలిచింది. ఆగస్టు 1న జరిగే క్వార్టర్ ఫైనల్లో బ్రిటన్ జట్టుతో టీమిండియా తలపడుతుంది. జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ తరఫున స్ట్రయికర్ గుర్జంత్ సింగ్ (17వ, 56వ ని.) రెండు గోల్స్ సాధించగా, హర్మన్‌ప్రీత్ సింగ్ (13వ ని.), శంషెర్ సింగ్ (34వ ని.), నీలకంఠ శర్మ (51వ ని.) తలా ఒక గోల్ చేశారు. జపాన్ జట్టులో కెంట తనక (19వ ని.), కొట వతనబె (33వ ని.), కజుమా మురట (59వ ని.) ఒక్కో గోల్ చేశారు. పూల్ ‘ఎ’ నుంచి ఆ్రస్టేలియా, భారత్, అర్జెంటీనా, స్పెయిన్ జట్లు... పూల్ ‘బి’ నుంచి బెల్జియం, జర్మనీ, బ్రిటన్, నెదర్లాండ్స్ జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించాయి.
Comments
Please login to add a commentAdd a comment