handball
-
పేదరికాన్ని జయించి.. ఆంధ్రజట్టు కెప్టెన్‌గా! విధికి కన్నుకుట్టిందేమో..
బాపట్ల: చిరుతలా దూసుకుపోతూ.. ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టే ఆట అతని సొంతం. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి ఏదైనా తనదైన శైలితో హ్యాండ్‌బాల్ పోటీల్లో సత్తాచాటేవాడు. జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతని అప్రతిహత ప్రస్థానం చూసి విధికి కన్నుకుట్టిందో ఏమో.. అనారోగ్యం రూపంలో కబళించింది. ఆట గుండె ఆగినట్టు క్రీడాలోకం దిగ్భ్రాంతికి గురైంది. కన్నీటితో క్రీడావీరుడు హర్షవర్ధన్‌కు కడసారి వీడ్కోలు పలికింది. పేదరికాన్ని జయించి.. కోటపాడు గ్రామానికి చెందిన ఆవుల హర్షవర్ధన్ రెడ్డి (23) హ్యాండ్‌బాల్ క్రీడాకారుడు. జాతీయస్థాయిలో రాణిస్తూ అంతర్జాతీయ శిక్షణకు ఎంపికయ్యాడు. తన కలలు త్వరలో తీరతాయని ఆనందపడిపోయాడు. అంతలోనే విధి అతనితో వింత ఆట ఆడింది. అనారోగ్యంతో సోమవారం రాత్రి మరణించాడు. మంగళవారం గ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. హర్షవర్ధన్‌ది అతి నీరు పేద కుటుంబం. ఐదేళ్ల క్రితం అతడి తండ్రి శ్రీనివాసరెడ్డి మృతి చెందాడు. కోటపాడు గ్రామంలో ఉండటానికి ఇల్లు కూడా లేదు, తల్లి శ్రీదేవి కూలి పనులు చేసుకుంటూ కొడుకును చదివించింది. హర్షవర్ధన్ పేదరికాన్ని జయించి హ్యాండ్‌బాల్ క్రీడలో ప్రతిభ కనబరిచాడు. భారత్ తరఫున ఆడాలని ఎన్నో కలలు కన్నాడు. మంచి ఉద్యోగం సాధించి తన తల్లిని మంచిగా చూసుకోవాలని తోటి క్రీడాకారులు, స్నేహితులకు చెబుతుండేవాడు. ఆ కలలు నెరవేరకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. నిత్యం చలాకీగా ఉరుకుతూ ఉండే కొడుకు విగతజీవిగా పడి ఉండడం చూసి తల్లి శ్రీదేవి గుండెలవిసేలా రోదించింది. తోటి క్రీడాకారులు, స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. హ్యాండ్‌బాల్‌పై అమితమైన ప్రేమ.. హర్షవర్ధన్ రెడ్డి చిన్ననాటి నుంచి క్రీడలపై ఎంతో ఆసక్తి కనబరిచేవాడు. 9వ తరగతి నుంచి తను హ్యాండ్‌బాల్ ఆడటం ప్రారంభించాడు. ఆసక్తి గమనించిన తల్లిదండ్రులు కుమారుడిని మరింత ప్రోత్సహించారు. ఇంటర్మీడియెట్ నుంచి కర్నూలులోని ఉస్మానియా కళాశాలలో చేరాడు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) సహకారంతో హ్యాండ్‌బాల్‌లో శిక్షణ పొందాడు. ఎన్నో పతకాలు సాధించాడు. ఆంధ్రజట్టుకు కెప్టెన్‌గా.. ఇప్పటికి రెండుసార్లు ఆంధ్ర జట్టుకు కెప్టెన్‌గా ప్రాతినిథ్యం వహించాడు. హ్యాండ్లోబాల్లో ఉన్న 16 మంది క్రీడాకారుల్లో 4వ వాడిగా మంచి గుర్తింపు సాధించాడు. ప్రస్తుతం అంతర్జాతీయ హ్యాండ్ బాల్ శిక్షణకు ఆంధ్రజట్టు నుంచి ఎంపికై నట్లు తోటి క్రీడాకారులు చెబుతున్నారు. కుక్క కాటే.. ప్రాణం తీసిందా.. ప్రస్తుతం డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న హర్షవర్ధన్ 15 రోజుల క్రితం ఐదో సెమిస్టర్ పరీక్షలు రాసి ఇంటికి వచ్చాడు. మూడు రోజుల క్రితం సాయంత్రం తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. వణికిపోతూ ఉండడంతో తల్లి, స్థానికులు స్థానిక ఆర్ఎంపీ వద్ద చూపించి అక్కడి నుంచి మేదరమెట్ల వైద్యశాలకు తీసుకువెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఒంగోలులోని ప్రైవేటు వైద్యశాలకు తరలించగా అక్కడ పరిస్థితి విషమించి సోమవారం రాత్రి మరణించాడు. మూడు నెలల క్రితం గ్రామంలో హర్షవర్ధన్‌ను కుక్క కరిచింది. ఇంజక్షన్ చేసుకొని కళాశాలకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఎలాంటి చికిత్స తీసుకోలేదు. దీనివల్ల ర్యాబిస్ వ్యాధితో చనిపోయి ఉంటాడని వైద్యులు చెప్పారు. జాతీయ స్థాయిలో రాణింపు.. 2023–24 సంవత్సరానికి రెండు నెలల క్రితం తమిళనాడులోని సేలంలో సౌత్ జోన్ జూనియర్ నేషనల్ క్రీడల్లో పాల్గొన్నాడు. 2022 మార్చిలో జూనియర్ నేషనల్ విజయవాడలో ఆడి మంచి ప్రతిభను కనబరిచి గోల్డ్ మెడల్ సాధించాడు. 2021–22లో మధ్యప్రదేశ్‌లో సీనియర్ నేషనల్ గేమ్స్‌లో ఆడాడు. 2023–24 రాయలసీమ యూనివర్సిటీ గేమ్‌లో మొదటి స్థానం సాధించాడు. 2021–22 ఢిల్లీలో జరిగిన జూనియర్ నేషనల్ హ్యాండ్ బాల్ చాంపియన్‌షిప్‌లో ఆడాడు. 2019 అండర్–17 స్కూల్ గేమ్స్‌లో కర్నాటకలో ఆడాడు. -
సెమీఫైనల్ ‘షూటౌట్’లో ఓడిన తెలుగు టాలన్స్
ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్‌లో తెలుగు టాలన్స్ ఆట సెమీఫైనల్లో ముగిసింది. శనివారం జైపూర్‌లో జరిగిన సెమీస్‌లో తెలుగు టాలన్స్పై గోల్డెన్ ఈగల్స్ ఉత్తరప్రదేశ్ జట్టు విజయం సాధించింది. నిర్ణీత 60 నిమిషాల సమయంలో ఇరు జట్లు 35–35 గోల్స్‌తో సమంగా నిలవగా, ఆపై 10 నిమిషాల అదనపు సమయం తర్వాత స్కోరు 40–40తో మళ్లీ సమమైంది. టాలన్స్ తరఫున కైలాశ్ పటేల్ 15 గోల్స్ సాధించగా, యూపీ తరఫున భూషణ్ షిండే 15 గోల్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తొలి అర్ధభాగంలో 16–12తో టాలన్స్ ఆధిక్యంలో ఉన్నా... రెండో అర్ధభాగంలో జట్టు పట్టు కోల్పోయింది. అనంతరం ‘షూటౌట్’లో యూపీ 4–3 తేడాతో తెలుగు టాలన్స్‌ను ఓడించింది. మరో సెమీస్‌లో మహారాష్ట్ర ఐరన్‌మెన్ 38–28తో రాజస్తాన్ పేట్రియాట్స్‌పై విజయం సాధించింది. -
‘గ్లోబల్ టీమ్‌ను తయారు చేస్తాం’
సాక్షి, హైదరాబాద్: భారత క్రీడల్లో గత కొన్నేళ్లుగా వేర్వేరు లీగ్‌లు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. వివిధ క్రీడాంశాల్లో సాగుతున్న ఈ లీగ్‌లపై అటు ఫ్యాన్స్‌ను ఆకర్షిస్తుండగా, ఇటు పలు వ్యాపార వర్గాలు లీగ్‌లతో జత కట్టి తమ ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. ఇదే కోవలో ఇప్పుడు ‘ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్’ నడుస్తోంది. జైపూర్ వేదికగా ఈ నెల 8న ప్రారంభమైన టోర్నీ 25 వరకు సాగనుంది. ఇందులో హైదరాబాద్‌కు చెందిన ‘తెలుగు టాలన్స్’ జట్టుకు కంకణాల అభిషేక్ రెడ్డి యజమానిగా ఉన్నారు. అభిషేక్‌కే చెందిన ‘హైదరాబాద్ బ్లాక్ హాక్స్’ టీమ్ ఇప్పటికే ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో ఆడుతోంది. అంతకుముందే ఆయన ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌తో పాటు బాక్సింగ్ లీగ్‌లో కూడా భాగస్వామిగా ఉన్నారు. క్రీడలపై అభిరుచితో పాటు ఎక్కువ మందికి ఆయా క్రీడాంశాలకు మరింత ప్రాచుర్యం కల్పించే ప్రయత్నంలో భాగంగానే ఇలా చేస్తున్నట్లు అభిషేక్ రెడ్డి చెప్పారు. ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్, అందులో తన టీమ్ తెలుగు టాలన్స్ పాత్రకు సంబంధించి వివిధ అంశాలపై అభిషేక్ ‘సాక్షి’తో మాట్లాడారు. విశేషాలు ఆయన మాటల్లోనే... వరుసగా లీగ్‌లలో జట్లను కొనడంపై... మొదటి నుంచి నాకు క్రీడలపై అమితాసక్తి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అన్ని పెద్ద ఈవెంట్లను అనుసరించేవాడిని. విదేశాల్లో ఉన్నప్పుడు అక్కడి పోటీలకు ప్రత్యక్షంగా తిలకిస్తున్న సమయంలో అక్కడి అభిమానులు చూపించే ఆసక్తి, ఆట పట్ల అక్కడ ఉండే క్రేజ్ నన్ను ఆశ్చర్యపర్చాయి. మన దేశంలో క్రికెటేతర క్రీడల్లో మనం ఇలాంటిది చాలా తక్కువగా చూస్తాం. అయితే లీగ్‌లు రంగప్రవేశం చేశాక ఫ్యాన్స్ కూడా సదరు ఆటవైపు ఆకర్షితులవుతున్నారు. నా ప్రవృత్తి క్రీడలు. అందుకే ఏదో రూపంలో వాటితో జత కట్టాలని భావించాను. వాలీబాల్ లీగ్‌కు వచ్చిన బ్రహ్మాండమైన స్పందన చూసి ఇప్పుడు హ్యాండ్‌బాల్ వైపు వచ్చాం. హ్యాండ్‌బాల్‌లో లీగ్ అవసరం గురించి... మన దగ్గర కూడా హ్యాండ్‌బాల్ పోటీలను రెగ్యులర్‌గా చూసే అభిమానులు ఉన్నారు. అయితే దురదృష్టవశాత్తూ చాలా చోట్ల అది అవుట్డోర్ గేమ్‌గా, మట్టి కోర్టులలో కనిపిస్తుంది. కానీ ఆధునిక యూరోపియన్ శైలిలో ఇండోర్ హ్యాండ్‌బాల్ బాగా పాపులర్. అలాంటి ఆటను ఇప్పుడు లీగ్ ద్వారా అందరికీ చేరువ చేస్తున్నాం. తెలుగు టాలన్స్ ప్రదర్శనపై... చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే సెమీఫైనల్లోకి అడుగు పెట్టాం. తొలి లీగ్ విజేతగా కూడా నిలుస్తామనే నమ్మకం ఉంది. లీగ్‌లోని ఆరు జట్లలోనూ మా ఒక్క టీమ్‌కే విదేశీ కోచ్ (ఫెర్నాండో న్యూనెస్–పోర్చుగల్) ఉన్నాడు. ఆయన నేతృత్వంలో టీమ్ చాలా బాగా ఆడటమే కాదు, లీగ్‌లో ఒక టీమ్‌ను, ఆటగాళ్లను ఎలా తీర్చిదిద్దాలో కూడా దిశానిర్దేశం చేసేలా కోచింగ్ సాగింది. తెలుగు రాష్ట్రాల్లో ఆటగాళ్ల గురించి... ఈ విషయంలో కొంత నిరాశ ఉన్న మాట వాస్తవం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కొందరు చక్కటి హ్యాండ్‌బాల్ ఆటగాళ్లు ఉన్నా... మా లీగ్‌కు తగినట్లుగా కొన్ని ప్రమాణాల ప్రకారం మాకు తగిన ఆటగాళ్లు లభించలేదు. అయితే రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి మారడం ఖాయం. లీగ్ కూడా అందుకు సహకరిస్తుంది. ఈసారి జట్టులో హైదరాబాద్‌లో ఆర్మీలో పని చేస్తున్న ఏడుగురు ఏఓసీ ఆటగాళ్లను మాత్రం తీసుకున్నాం. టీమ్ యజమానిగా ఆర్థిక అంశాలపై... లీగ్లలోకి అడుగు పెట్టేటప్పుడే నాకు దానిపై స్పష్టమైన అవగాహన ఉంది. ఇవి ఇతర వ్యాపారాల్లాగా ఇప్పటికిప్పుడు లాభాలు తెచ్చిపెట్టేవి కావు. మా ఉత్సాహం మాత్రమే టీమ్‌ను నడిపిస్తుంది. అయితే లాభం గురించి బెంగ లేదు. లీగ్‌తో పాటు సదరు క్రీడ కూడా పైస్థాయికి ఎదగడం ముఖ్యం. స్పాన్సర్లు ముందుకు రావడం కూడా సానుకూల పరిణామం. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో తలపడే గ్లోబల్ టీమ్‌ను తయారు చేయడమే మా లక్ష్యం. -
రాజస్తాన్ పేట్రియాట్స్ చిత్తు.. తెలుగు టాలన్స్ ఖాతాలో ఐదో విజయం
జైపూర్: ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ (పీహెచ్ఎల్)లో హైదరాబాద్‌కు చెందిన తెలుగు టాలన్స్ జట్టు అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో తెలుగు టాలన్స్ 33–22 పాయింట్ల తేడాతో రాజస్తాన్ పేట్రియాట్స్ జట్టును ఓడించింది. కైలాష్ పటేల్ ఏడు గోల్స్ చేయగా... దవిందర్ భుల్లర్ ఐదు గోల్స్ సాధించి తెలుగు టాలన్స్ విజయంలో కీలకపాత్ర పోషించారు. దవిందర్కు ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్’ అవార్డు దక్కించుకున్నాడు. కంకణాల అభిషేక్ రెడ్డి యజమానిగా ఉన్న తెలుగు టాలన్స్ జట్టుకిది ఐదో విజయం కావడం విశేషం. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ లీగ్‌లో ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న తెలుగు టాలన్స్ పది పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో మహారాష్ట్ర ఐరన్‌మెన్ 33–32తో గర్విత్ గుజరాత్ జట్టును ఓడించి 12 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. సెమీస్‌లో భారత్ ‘ఎ’ హాంకాంగ్: ఎమర్జింగ్ కప్ ఆసియా అండర్–23 మహిళల టి20 క్రికెట్ టోర్నమెంట్లో భారత ‘ఎ’ జట్టు సెమీఫైనల్ చేరింది. భారీ వర్షం కారణంగా భారత్ ‘ఎ’, పాకిస్తాన్ ‘ఎ’ జట్ల మధ్య శనివారం జరగాల్సిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్ రద్దయింది. దాంతో రెండు జట్లకు ఒక్కో పాయింట్ కేటాయించారు. లీగ్ మ్యాచ్‌లు ముగిశాక భారత్, పాక్ జట్లు నాలుగు పాయింట్లతో గ్రూప్ ‘ఎ’ నుంచి సెమీఫైనల్‌కు చేరాయి. గ్రూప్ ‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లకు సెమీఫైనల్ బెర్త్‌లు ఖరారయ్యాయి. సోమవారం జరిగే సెమీఫైనల్స్‌లో శ్రీలంకతో భారత్; బంగ్లాదేశ్‌తో పాకిస్తాన్ తలపడతాయి. -
జైపూర్‌లో ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ ఆరంభ సీజన్
హ్యాండ్‌బాల్‌కు ఆదరణ పెంచే క్రమంలో మరో ముందడుగు. జైపూర్ వేదికగా ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది జూన్ 8 నుంచి జూన్ 25 వరకు రాజస్తాన్‌లోని జైపూర్‌లో గల సవాయ్ మాన్సింగ్ ఇండోర్ స్టేడియంలో ఈ లీగ్ నిర్వహించనున్నారు. ఇందులో రాజస్తాన్ పేట్రియాట్స్, గర్విత్ గుజరాత్, మహారాష్ట్ర ఐరన్‌మెన్, గోల్డెన్ ఈగల్స్ ఉత్తర్‌ప్రదేశ్, తెలుగు టాలోన్స్, ఢిల్లీ పంజెర్స్ పేరిట ఆరు జట్లు బరిలోకి దిగనున్నాయి. ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ మ్యాచ్‌లను వయాకామ్ 18, జియో సినిమా, స్పోర్ట్స్ 18 ఖేల్లో వీక్షించవచ్చు. -
హ్యాండ్‌బాల్ అభివృద్ధికి రూ. 240 కోట్లు
న్యూఢిల్లీ: దేశంలో హ్యాండ్‌బాల్ క్రీడకు మరింత గుర్తింపు తెచ్చేందుకు కార్పొరేట్ సంస్థ బ్లూ స్పోర్ట్ ఎంటర్టైన్మెంట్ ముందుకు వచ్చింది. వచ్చే ఐదేళ్లలో హ్యాండ్‌బాల్ అభివృద్ధికి రూ. 240 కోట్లు అందజేస్తామని బ్లూ స్పోర్ట్స్ ప్రకటించింది. పురుషుల, మహిళల టీమ్‌ల కోసం రూ. 120 కోట్ల చొప్పున, మరో రూ. 35 కోట్లు ప్రాథమిక స్థాయిలో ఆట కోసం ఇస్తామని వెల్లడించింది. హ్యాండ్‌బాల్ సమాఖ్య ఆధ్వర్యంలో జరగనున్న ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ నిర్వహణా హక్కులు ఈ సంస్థ వద్దే ఉన్నాయి. కెప్టెన్‌గా ఆర్యన్ సాక్షి, హైదరాబాద్: ఇన్లైన్ హాకీ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్న భారత సీనియర్ జట్టుకు తెలంగాణకు చెందిన ఆర్యన్ కర్రా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇటలీలోని రొకారాసోలో ప్రస్తుతం ఈ టోర్నీ జరుగు తోంది. పురుషుల విభాగంలో 16 మంది సభ్యుల, మహిళల విభాగంలో 10 మంది సభ్యుల జట్టు పోటీల్లో తలపడుతోంది. చదవండి: Prime Volleyball League: త్వరలోనే కొత్త లీగ్.. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ సహా 6 జట్లు -
37 ఏళ్ల తర్వాత ఫ్రాన్స్ తొలిసారి; బ్రిటన్ సైక్లిస్ట్ సరికొత్త చరిత్ర
టోక్యో: హ్యాండ్‌బాల్‌లో ఫ్రాన్స్ సరికొత్త చరిత్రను లిఖించింది. టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా ఆదివారం మహిళల విభాగంలో జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్ 30–25తో రష్యా ఒలింపిక్ కమిటీ (ఆర్ఓసీ)పై గెలుపొంది స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే పురుషుల విభాగంలోనూ ఫ్రాన్స్ జట్టే స్వర్ణాన్ని నెగ్గడంతో... 37 ఏళ్ల తర్వాత రెండు విభాగాల్లోనూ ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ నెగ్గిన తొలి జట్టుగా ఫ్రాన్స్ నిలిచింది. కాంస్యం కోసం జరిగిన పోరులో నార్వే 36–19తో స్వీడన్‌పై నెగ్గింది. జేసన్ కెన్నీ రికార్డు స్వర్ణాలు ఒలింపిక్స్‌లో బ్రిటన్ సైక్లిస్ట్ జేసన్ కెన్నీ చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన పురుషుల 200 మీటర్ల కీరిన్ ఫైనల్ రేసులో జేసన్ అందరి కంటే ముందుగా 10.481 సెకన్లలో గమ్యాన్ని చేరి స్వర్ణాన్ని నెగ్గాడు. తద్వారా ఒలింపిక్స్‌లో ఏడో స్వర్ణాన్ని సాధించిన జేసన్... బ్రిటన్ తరఫున అత్యధిక పసిడి పతకాలు నెగ్గిన క్రీడాకారుడిగా ఘనతకెక్కాడు. 0.763 సెకన్లు వెనుకగా రేసును ముగించిన మొహమ్మద్ అజీజుల్లాస్ని (మలేసియా) రజతాన్ని... హ్యారీ లావ్రిసెన్ (నెదర్లాండ్స్) కాంస్యాన్ని సొంతం చేసుకున్నారు. చదవండి: భజ్జీ నువ్వు కరెక్టే.. కానీ అలా అనకూడదు: గౌతమ్ గంభీర్ -
24 నుంచి ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్
జైపూర్: ఇప్పటికే క్రికెట్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఫుట్‌బాల్, వాలీబాల్, బాస్కెట్‌బాల్, టేబుల్ టెన్నిస్, చెస్ తదితర క్రీడాంశాల్లో లీగ్‌లు జరుగుతుండగా తాజాగా ఈ జాబితాలో హ్యాండ్‌బాల్ కూడా చేరింది. జైపూర్ వేదికగా ఈనెల 24 నుంచి ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ (పీహెచ్ఎల్) జరగనుంది. భారత హ్యాండ్‌బాల్ సమాఖ్య (హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికయిన తెలంగాణకు చెందిన అరిశెనపల్లి జగన్మోహన్ రావు ఈ లీగ్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ టోర్నీలో ఆరు జట్లు (తెలంగాణ టైగర్స్, మహారాష్ట్ర హ్యాండ్‌బాల్ హస్లర్స్, పిట్‌బుల్స్ పంజాబ్, బెంగాల్ బ్లూస్, కింగ్ హాక్స్ రాజస్తాన్, యూపీ ఐకాన్స్) తలపడతాయి. జనవరి 10న ఫైనల్ జరుగుతుంది. ‘ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్‌తో భారత హ్యాండ్‌బాల్ చరిత్రలో నవశకం ఆరంభం కానుంది’ అని జగన్మోహన్ రావు తెలిపారు. -
ఆసియా హ్యాండ్‌బాల్ పోస్టర్ ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం మరో అంతర్జాతీయ స్థాయి క్రీడా ఈవెంట్‌కు సిద్ధమవుతోంది. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఈనెల 20 నుంచి 30 వరకు ‘ఆసియా పురుషుల హ్యాండ్‌బాల్ టోర్నమెంట్’ జరుగనుంది. ఈ సందర్భంగా టోర్నీకి సంబంధించిన పోస్టర్‌ను సోమవారం ‘శాట్స్’ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ టోర్నీలో మొత్తం 9 దేశాలకు చెందిన 10 జట్లు పాల్గొంటున్నాయి. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర అర్బన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కో ఆపరేషన్ చైర్మన్ విప్లవ్ కుమార్, హ్యాండ్‌బాల్ సంఘం అధ్యక్షులు ఎ.జగన్మోహన్ రావు, కార్యదర్శి పవన్ కుమార్, కోచ్‌లు డా. రవి కుమార్, దీపక్ ప్రసాద్, ప్రవీణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ విజేత కర్నూలు
– బాలికల విభాగంలో నెల్లూరు జయకేతనం కర్నూలు (టౌన్): రాష్ట్ర స్థాయి అండర్ –17 హ్యాండ్‌బాల్ బాలుర పోటీల్లో కర్నూలు జట్టు విజేతగా నిలిచింది. నగరంలోని స్థానిక బి.క్యాంపు ప్రభుత్వ బాలుర పాఠశాల క్రీడా మైదానంలో కర్నూలు, ప్రకాశం జిల్లాల మధ్య ఫైనల్ పోరు ఆసక్తికరంగా సాగింది. 10–17 గోల్స్‌తో కర్నూలు విజేతగా నిలిచింది. రెండో స్థానం ప్రకాశం జిల్లా, మూడో స్థానం పశ్చిమ గోదావరి జిల్లా కైవసం చేసుకున్నాయి. బాలికల విభాగంలో ప్రకాశం, నెల్లూరు జిల్లాలు జట్టు ఫైనల్స్‌లో తలపడ్డాయి. 4–3 గోల్స్‌తో నెల్లూరు విజేతగా నిలిచింది. రెండో స్థానంలో ప్రకాశం, మూడో స్థానంలో కడప నిలిచింది. ముఖ్య అతి«థిగా హాజరైన ఆర్సి రెడ్డి కళశాల కరస్పాండెంట్ విజేతలకు ట్రోఫీలు , మెడల్స్, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎన్నికైన క్రీడాకారులు బెంగళూరులో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి పోటీల్లోనూ రాణించాలన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుందరమ్మ , జిల్లా స్కూల్‌గేమ్స్ ఇన్చార్జి లక్ష్మీనరసయ్య, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు శ్రీనాథ్, కార్యదర్శి జాకీర్, ఒలింపిక్ సంఘం కార్యదర్శి రామాంజనేయులు, ఎస్జీఎఫ్ రాష్ట్ర అబ్జ్ర్వర్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
సెమీస్‌కు కర్నూలు
హోరాహోరీగా రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలు కర్నూలు (టౌన్): రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో కర్నూలు జిల్లా జట్టు సెమీఫైనల్స్‌కు చేరుకుంది. కర్నూలులోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణంలో 62వ రాష్ట్రస్థాయి అండర్ 17 బాలబాలికల పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. శుక్రవారం క్వార్టర్స్ ఫైనల్లో కర్నూలు బాలుర జట్టు విశాఖపట్నం జట్టుపై 22–06 తేడాతో గెలిచి సెమీ ఫైనల్‌కు చేరుకుంది. అలాగే బాలికల మ్యాచ్‌లో కర్నూలు బాలికలపై నెల్లూరు బాలికలు 10–05 తేడాతో గెలుపొంది సెమీఫైనల్‌కు చేరుకున్నారు. మరో క్వార్టర్స్ ఫైనల్ మ్యాచ్‌లో కడప జిల్లాపై వెస్టుగోదావరి 13–19 పాయింట్ల తేడాతో గెలుపొంది సెమీస్‌కు చేరుకుంది. మరో బాలికల మ్యాచ్‌లో అనంతపురం జిల్లా జట్టు ప్రకాశం జిల్లా జట్టుపై గెలుపొంది క్వార్టర్స్‌కు చేరుకుంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంటర్ ఇంచార్జి చెన్నారెడ్డి ఈ మ్యాచ్‌లను పర్యవేక్షించారు. కార్యక్రమంలో జిల్లా స్కూల్‌గేమ్స్ సమాఖ్య ఇంచార్జి కార్యదర్శి నరసయ్య, పీఈటీల సంఘం అధ్యక్షులు శ్రీనాథ్, కార్యదర్శి జాకీర్‌హుసేన్, క్రీడల నిర్వహణ కార్యదర్శి డీవీ సుబ్బారెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
జాతీయ హ్యాండ్‌బాల్ పోటీలకు జిల్లా క్రీడాకారులు
కర్నూలు (టౌన్): సాయి స్పోర్ట్సు హాస్టల్‌కు చెందిన ముగ్గురు క్రీడాకారులు జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. వీరు బీహార్‌లోని పాట్నాలో జరుగునున్న జాతీయ స్థాయి జూనియర్ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్నట్లు జిల్లా హ్యాండ్‌బాల్ సంఘం కార్యదర్శి సి. రామాంజనేయులు బుధవారం విలేకరులకు తెలిపారు. సెప్టెంబర్ 1, 2 తేదీలలో ఒంగోలులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో ఇ. జగన్మోహన్రెడ్డి, ఎల్.ఎస్. ప్రదీప్, పి. లక్ష్మీ ప్రతాప్‌లు ప్రతిభ కనబరిచారని, వీరిని ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపిక చేశారన్నారు. -
రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలు ప్రారంభం
కల్లూరు : డీఎస్ఏ అవుట్డోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి స్కూల్‌గేమ్స్ అండర్ 19 బాలబాలికల హ్యాండ్‌బాల్, అథ్లెటిక్స్ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఇన్చార్జ్ డీఎస్డీఓ మల్లికార్జునతోపాటు జిల్లా వృత్తి విద్యాధికారి సుబ్రమణ్యేశ్వరరావు, ఒలింపిక్ సంఘం కార్యదర్శి రామాంజనేయులు, ఆర్ఐఓ పరమేశ్వరరెడ్డి, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ చెన్నయ్య..అండర్ 19 కార్యదర్శి చలపతిరావు ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. ముందుగా 13 జిల్లాల నుంచి హాజరైన క్రీడాకారులు మార్చ్ఫాస్ట్ నిర్వహించారు. క్రీడావందనాన్ని ముఖ్య అతిథులు స్వీకరించారు. అనంతరం క్రీడా పతకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ డీఎస్డీఓ మల్లికార్జున మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తూ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలన్నారు. పోటీల పర్యవేక్షలు భాస్కర్‌రెడ్డి, షాజహాన్, అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి హర్షవర్దన్, పీడీలు, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు. -
క్రీడాకారుల క్యాంప్ ఫైర్
కరీమాబాద్ : నగరంలోని ఖిలావరంగల్ మధ్యకోటలోని ఖుష్‌మహల్ వద్ద నిర్వహిస్తున్న తెలంగాణ స్థాయి రెండో హ్యాండ్‌బాల్ పోటీలలో భాగంగా సోమవారం రాత్రి క్రీడాకారుల క్యాంప్ ఫైర్ నిర్వహించారు. ఈ సందర్భంగా పది జిల్లాల నుంచి వచ్చిన సుమారు 450 మంది క్రీడాకారులు ఆట పాటలు, నృత్యాలతో ఉత్సాహంగా గడిపారు. క్యాంప్ ఫైర్‌ను 8వ డివిజ¯ŒS కార్పొరేటర్ బైరబోయిన దామోదర్‌యాదవ్ ప్రారంభించారు. కార్యక్రమానికి హ్యాండ్‌బాల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యామల పవ¯ŒSకుమార్, విష్ణు, మీరిపెల్లి రాజు, పోశాల సురేష్, బైరబోయిన రవీందర్, గై.రమేష్, కుమారస్వామి, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా జట్ల ఎంపిక
సంస్థాన్ నారాయణపురం: అండర్ – 19 హ్యాండ్‌బాల్, యోగా బాలుర, బాలికల జిల్లా జట్లను సోమవారం సర్వేల్ గురుకుల కళాశాలలో అధికారులు ఎంపిక చేశారు. విద్యార్థులకు క్రీడలు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా క్రీడలను ప్రిన్సిపాల్ వి. రాఘవరావు ప్రారంభించి, క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రిన్సిపాల్ సీతారాములు, పీడీలు సాంబశివరావు, రహమత్, శారదలు పాల్గొన్నారు. ఎంపికైన క్రీడాకారులు – హ్యాండ్‌బాల్ బాలుర విభాగంలో డి.నిఖిల్, గణేష్, వెంకట్, అరుణ్, గోపాల్, ఈశ్వర్, ఉదయ్, నిఖిల్, కృష్ణ, జాషువా, రాము, ప్రవీణ్, సూర్య, శ్రీనాథ్, శివ, రామాంజనేయులను ఎంపిక చేయగా, స్టాండ్‌బైగా సందీప్‌ను ఎంపికచేశారు. అదే విధంగా బాలికల విభాగంలో విజయభాను, కళ్యాణి, మహేశ్వరి, వందన, నాగజ్యోతి, సంధ్య, శ్రీవాణీలను ఎంపిక చేశారు. – యోగా బాలుర విభాగంలో వై.అజయ్, నవీన్, మోజస్, మహేష్, నిఖిల్, మణికంఠ, గణేష్‌లను ఎంపిక చేయగా, బాలికల విభాగంలో అనిత, సంధ్యలను ఎంపిక చేశారు. -
హ్యాండ్ బాల్ జిల్లా జట్టు ఎంపిక
ఏలూరు: త్వరలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి హేండ్‌బాల్ పోటీల్లో పాల్గొనే జిల్లా పురుషుల జట్టును ఎంపిక చేసినట్టు జిల్లా హేండ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి టి.కొండలరావు చెప్పారు. ఆదివారం ఏలూరు ఇండోర్ స్టేడియంలో జిల్లా జట్టు ఎంపిక పోటీలు నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన 60 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో తలపడ్డారు. వీరిలో ప్రతిభ చాటిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేశామని కార్యదర్శి వివరించారు. జిల్లా జట్టును ప్రకటించారు. పోటీలను డీఎస్డీవో ఎస్ఏ అజీజ్, అసోసియేషన్ అధ్యక్షుడు పీఆర్ఎం లెనిన్తో పాటు పలువురు పీఈటీలు పర్యవేక్షించారు. జిల్లా జట్టు సభ్యులు వీరే.. ఎన్వీవీ కుమార్, పి.ఉదయ్‌కుమార్, కె.శ్రీకుమార్, జి.వెంకటేష్, ఆర్.రాంబాబు, ఆర్ఎంఆర్ కుమార్, ఎం.వినోద్, ఎం.శివకృష్ణ, ఈ.సాయి, ఈ.పవన్, డి.సుధీర్, టి.గణేష్, బి.సాయికుమార్, వి.చంటి, సీహెచ్ఎస్వీఎస్ దుర్గాప్రసాద్ ఎంపికయ్యారు. స్టాండ్‌బైగా కె.శ్రీను, జి.ప్రవీణ్, కె.సాయికుమార్‌ను ఎంపిక చేశార -
హేండ్‌బాల్ జిల్లా జట్టు ఎంపిక
ఏలూరు రూరల్ : త్వరలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి హేండ్‌బాల్ పోటీల్లో పాల్గొనే జిల్లా పురుషుల జట్టును ఎంపిక చేసినట్టు జిల్లా హేండ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి టి.కొండలరావు చెప్పారు. ఆదివారం ఏలూరు ఇండోర్ స్టేడియంలో జిల్లా జట్టు ఎంపిక పోటీలు నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన 60 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో తలపడ్డారు. వీరిలో ప్రతిభ చాటిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేశామని కార్యదర్శి వివరించారు. జిల్లా జట్టును ప్రకటించారు. పోటీలను డీఎస్డీవో ఎస్ఏ అజీజ్, అసోసియేషన్ అధ్యక్షుడు పీఆర్ఎం లెనిన్తో పాటు పలువురు పీఈటీలు పర్యవేక్షించారు. జిల్లా జట్టు సభ్యులు వీరే.. ఎన్వీవీ కుమార్, పి.ఉదయ్‌కుమార్, కె.శ్రీకుమార్, జి.వెంకటేష్, ఆర్.రాంబాబు, ఆర్ఎంఆర్ కుమార్, ఎం.వినోద్, ఎం.శివకృష్ణ, ఈ.సాయి, ఈ.పవన్, డి.సుధీర్, టి.గణేష్, బి.సాయికుమార్, వి.చంటి, సీహెచ్ఎస్వీఎస్ దుర్గాప్రసాద్ ఎంపికయ్యారు. స్టాండ్‌బైగా కె.శ్రీను, జి.ప్రవీణ్, కె.సాయికుమార్‌ను ఎంపిక చేశార -
జిల్లా స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలు
సింహాచలం : క్రీడలు శారీరక,మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని సింహాచలం దేవస్థానం ఏఈవో మోర్తా వెంకట కష్ణమాచార్యులు తెలిపారు. సింహాచలంలోని మహాత్మాజ్యోతీబాఫూలే ఏపీ బీసీ బాలుర గురుకుల పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాలోని పాఠశాలల విద్యార్థులకు అండర్–17, అండర్–14 హ్యాండ్‌బాల్ టోర్నీ నిర్వహించారు. రాష్ట్రస్థాయి టోర్నీలో పాల్గొనే విద్యార్థుల జట్లను ఎంపిక చేసేందుకు నిర్వహించిన ఈటోర్నీ ప్రారంభ కార్యక్రమంలో కష్ణమాచార్యులు మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లోను విద్యార్థులు ప్రావీణ్యం సంపాదించాలన్నారు. క్రీడల ద్వారా అత్యున్నత శిఖరాలను చేరుకోవచ్చన్నారు. ఈసందర్భంగా పాఠాశాల పీడీ కె.సుధారాణి టోర్నీలో పాల్గొనే విద్యార్థులను పరి^è యం చేశారు. టోర్నీలో జిల్లావ్యాప్తంగా 20 పాఠశాలల నుంచి మొత్తం 36 జట్లు పాల్గొన్నాయి. వీటిలో అండర్–17 సంబంధించి 10 బాలల జట్లు, 8 బాలికల జట్లు, అండర్–14కి సంబంధించి 10 బాలల జట్లు, 8 బాలికల జట్లు ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కె.సత్యవతి, ఉపాధ్యాయులు కష్ణ, వెంకటరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సతీష్, పీఈటీలు రఘు, శ్రీనివాస్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. బాలికల విభాగంలో విజేతలు వీరే.... అండర్–14 బాలికల విభాగంలో స్టీల్‌ప్లాంట్‌లోని శ్రీచైతన్య పబ్లిక్ స్కూల్ టీం ప్రథమస్థానంలోను, పోర్టు హైస్కూల్ టీం ద్వితీయ స్థానంలో నిలిచింది. అలాగే అడర్–17 విభాగంగా పోర్టు హైస్కూల్ టీం ప్రథమ స్థానంలోను, స్టీల్‌ప్లాంట్ శ్రీచైతన్య పబ్లిక్ స్కూల్ ద్వితీయస్థానంలోను నిలిచింది. బాలుర విబాగంలో ఫైనల్స్ ఇంకా జరగాల్సి ఉంది. అన్ని జట్ల నుంచి ఉత్తమ ప్రదర్శన కనబర్చిన విద్యార్థులను రాష్ట్రస్థాయి టోర్నీలకు పంపిస్తామని ఈసందర్భంగా పాఠశాల పిడి సుధారాణి తెలిపారు. -
రైజింగ్ ‘హ్యాండ్స్’
హ్యాండ్‌బాల్‌లో మెరుస్తున్న జిల్లా క్రీడాకారులు మెరుగైన శిక్షణతో ఆటలో ప్రతిభ పతకాల పరంపరతో ప్రత్యేక గుర్తింపు ‘‘మందలో ఒకరిగా కాదు.. వందలో ఒకరిగా ఉండు..’’ అని స్వామి వివేకానందుడు చెప్పిన మాటలను వీరు ఒంట పట్టించుకున్నారు. శ్రమయేవ జయతే సూక్తితో ముందుకు సాగుతూ తాము ఎంచుకున్న క్రీడలో రాణిస్తూ పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నారు. రేజింగ్ గేమ్‌గా విలసిల్లుతున్న హ్యాండ్‌బాల్ క్రీడలో మెరుపు విజయాలు సాధిస్తూ తమదైన ముద్ర వేసుకుంటున్న ఓరుగల్లు ఆణిముత్యాలపై ప్రత్యేక కథనం. – న్యూశాయంపేట మారుమూల ప్రాంతాల్లో పుట్టినప్పటికీ వారు మొక్కవోని దీక్షతో సాధన చేస్తున్నారు. క్రీడలపై ఉన్న మక్కువతో వా రు నిత్యం కఠోరంగా శ్రమిస్తూ అందులో రాణిస్తున్నారు. అంతర్జాతీయ హ్యాండ్‌బాల్ క్రీడాకారుల నిలయమైన ఓరుగల్లులో సీనియర్స్‌ను స్ఫూర్తిగా తీసుకుని పలువురు రాష్ట్ర, జాతీయస్థా యి పోటీల్లో రాణిస్తున్నారు. హ్యాండ్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్యామల పవన్ పర్యవేక్షణలో, శాయ్ కోచ్ దేవేం దర్, రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్లు ఐలయ్య, కిషన్, అనూప్‌కుమార్, రామ్మూర్తి, నిమ్మ మోహన్‌రావు శిక్షణలో, అంతర్జాతీయ క్రీడాకారులు రవి, జగన్, మెహన్, ప్రవీణ్, అశోక్ సలహాలతో జిల్లా లో వందలకొద్ది రాష్ట్ర, జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ క్రీడాకారు లు వెలుగులోకి వచ్చారు. హ్యాండ్‌బాల్ క్రీడా గ్రామాలుగా వడ్డెపల్లి, పైడిపల్లి వెలుగొందుతున్నాయి. రాష్ట్రస్థాయి సీనియర్, జూనియర్, సబ్‌జూనియర్ హ్యాండ్‌బాల్ పోటీలు ఎక్కడ జరి గిన జిల్లాజట్లు విజయకేతనం ఎగురవేస్తున్నాయి. అలాగే హ న్మకొండలోని హ్యాండ్‌బాల్ అకాడమీలో పలువురు క్రీడాకారు లు జాతీయస్థాయిలో రాణిస్తూ జిల్లా కీర్తిని చాటుతున్నారు. క్రీడా నేపథ్యం 19వ సెంచరీలో నార్తెర్న్ యూరప్, జర్మనీ హ్యాండ్‌బాల్ ఆట ప్రారంభమైంది. నూతన రూల్స్‌తో 1917లో జర్మనీలో మొదటి ఇంటర్నేషనల్, 1925లో పురుషుల, 1930లో మహిళల అంతర్జాతీయ హ్యాండ్‌బాల్ పోటీలు నిర్వహించారు. తర్వాత ఈస్ట్నార్త్ ఆఫ్రికా, సాత్ ఆఫ్రికాల్లో విస్తరించింది. 1972లో సమ్మర్ ఒలింపిక్స్ మచిబస్ ఇండోర్ స్టేడియాల్లో ఆడారు. 1946లో ఇంటర్నేషనల్ హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ ఫోరం ఏర్పాటైంది. భారతదేశంలో మొదట 1972లో సీనియర్ పురుషుల జాతీయస్థాయి చాంపియన్‌షిప్ పోటీలు హర్యానాలోని రోహతక్‌లో జరి గాయి. హర్యానాకు చెందిన జగత్సింగ్ లో హన్ను హ్యాండ్‌బాల్ ఫాదర్‌గా పిలుస్తారు. డిఫెన్స్‌లో దిట్ట సుధీర్ నగరంలోని గీసుకొండ మండలం ధర్మారం గ్రామానికి చెందిన సుధీర్ హ్యాండ్‌బాల్ క్రీడలో రాణిస్తూ పతకాలు సాధిస్తున్నాడు. సుధీర్. 10వ తరగతిలో కెరీర్ ప్రారంభించి ఇప్పటి వరకు జాతీయ,రాష్ట్ర పోటీల్లో పాల్గొన్నా డు. 2011–12 మధ్యప్రదేశ్‌లో జరి గిన సబ్ జూనియ ర్స్ నేషనల్స్, 2012–13లో పంజాబ్ లుథియానాలో జరిగిన అండర్–19 స్కూల్‌గేమ్స్, 2014–15లో కర్ణాటక మంగుళూర్‌లో జరిగిన సౌత్‌జోన్ సీనియర్ నేషనల్స్, 2015–16 తమిళనాడులో జూనియర్ నేషనల్ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాడు. వీటితో పాటు సౌత్ ఇంటర్ యూనివర్సిటీ, సీనియర్ రాష్ట్రస్థాయి పోటీల్లో పోటీల్లో ప్రతిభ కనబరిచాడు. బాల్æపడితే...గోలే ఏటూరునాగారానికి చెందిన పి.కుమార్‌స్వామి హ్యాండ్‌బాల్‌లో ప్రతిభను కనబరిచాడు. వరంగల్ హ్యాండ్‌బాల్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఆయన ఇప్ప టి వరకు పలు పతకాలు సాధిం చాడు 2011లో ఢిల్లీ జరి గిన అండర్–14 నేషనల్స్‌లో, 2013 లో మధ్యప్రదేశ్‌లో జూనియర్ బాలుర నేషనల్స్, అండర్–19 డిల్లీ జరిగిన సౌత్‌జోన్ పోటీల్లో ప్రతిభ చాటి స్వర్ణ పతకం సొంతం చేసుకున్నాడు. అలాగే 2016లో ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో కేయూ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన కుమార్ బంగారు పతకం కైవసం చేసుకున్నాడు, విశాఖపట్నం, కర్నూల్, రంగారెడ్డిజిల్లాల్లో జరిగిన రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్స్ పోటీల్లో పతకాలు సాధించాడు. ఆనంద్ అదుర్స్ ఏటూరునాగారానికి చెందిన ఆనంద్ జాతీయస్థాయి హ్యాండ్పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి పలువరి మన్ననలు పొందుతున్నాడు. గ్రామీణ నేపథ్యం ఉన్నా తమ ప్రతిభకు కొదవలేదంటూ పలు పోటీల్లో ప్రతిభ కనబరుస్తు జిల్లా పేరు ప్రతిష్టలు నలుదిక్కుల చాటుతున్నాడు. కేడీసీ డిగ్రీ చదువుతున్న ఆనంద్ వరంగల్ హ్యాండ్‌బాల్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. 6వ తరగతిలోనే హ్యాండ్‌బాల్‌లో కెరీర్‌ను ప్రారంభించి తన హవా కొనసాగిస్తున్నాడు. ఇప్పటి వరకు ఎనిమిది జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని పలు పతకాలు సాధించాడు. 2010లో మధ్యప్రదేశ్ సబ్‌జూనియర్స్, 2011లో అండర్–14, 2012లో సబ్ జూనియర్స్‌లో, 2013లో అండర్–19 జూనియర్ నేషనల్స్‌లో పాల్గొని చక్కని ప్రతిభను చాటాడు. హర్యానాలో అండర్–17 జూనియర్స్‌లో, తమిళనాడులో ఇంటర్ యూనివర్సిటీ టోర్నీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచాడు. అలాగే రంగారెడ్డి, నల్లగొండ, గుంటూరు, ఏలూర్లో జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్స్, సీనియర్స్ పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకున్నాడు. -
హ్యాండ్‌బాల్ బాలికల విజేత ఖమ్మం
వరంగల్ స్పోర్ట్స్ : తెలంగాణ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన అంతర్ జిల్లాల సబ్ జూనియర్స్ బాలికల హ్యాండ్‌బాల్ పోటీలు ఆదివారం ముగిశాయి. హోరాహోరీగా కొనసాగిన పోటీల్లో ఖమ్మం జట్టు విజేతగా నిలిచింది. రన్నరప్ స్థానాన్ని నిజామాబాద్ జట్టు దక్కించుకోగా, మూడో స్థానంలో హైదరాబాద్, నాలుగో స్థానంలో వరంగల్ జట్లు నిలిచాయి. ఈ మేరకు ఆదివారం సాయంత్రం తెలంగాణ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్యామల పవన్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ముగింపు సభకు స్థానిక కార్పొరేటర్ సోబియా సబహత్ ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమన్నారు. ఓటమితో కుంగిపోకుండా.. మరింత పట్టుదలతో సాధన చేయాలని సూచించారు. జిల్లా క్రీడాభివద్ధి అధికారిణి ఇందిర, హన్మకొండ సీఐ అవిర్నేని సంపత్‌రావు, ఒలంపిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కైలాస్యాదవ్తో పాటు ఇంద్రసేనారెడ్డి, విష్ణు తదితరులు పాల్గొన్నారు. -
హ్యండ్ బాల్ జిల్లా జట్టు ఎంపిక
టౌన్: పట్టణంలోని ఇండియా మిషన్ హైస్కూల్ల్లో హ్యండ్ బాల్ సబ్ జూనియర్ బాలికల జట్లు ఎంపిక పోటీలను శుక్రవారం గెజిటేడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం భువనగిరి మండల ప్రధాన కార్యదర్శి జి. వెంకటేశ్వర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ ఎంపిక పోటిల్లో జిల్లా నుంచి 60 మంది క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు. వీరి నుంచి రాష్ట్రస్థాయి పోటీలకు పదిహేడు మందిని ఎంపిక చేశారు. ఎంపికైన జిల్లా జట్టు మాదాపూర్ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల నుంచి ³. కావేరి, డి.స్రవంతి, ప్రియాంక, ప్రసన్న, కావ్వ, మాధవి, బేబీ, సంగీత, గూడురు పాఠశాల నుంచి పి. ప్రియాంక, నల్లగొండ డైట్ స్కూల్ నుంచి అస్మా, పుష్పలత, కె.అనుప్రియ, ఇక్రారుమానా, భువనగిరి పాఠశాల నుంచి ఎం.తులసి, ఎస్.మాన్మిత, అమ్మనబోలు నుంచి కె.కళ్యాణీ, స్వేత ఎంపికైనట్లు తెలిపారు. వీరు ఈ నెల 6 నుంచి 8వ తేది వరకు వరంగల్ జిల్లా హన్మకొండలోని జేఎన్ఎస్ స్టేడియంలో నిర్వహిచే రాష్ట్రస్థాయి హ్యండ్‌బాల్ పోటీల్లో పాల్గొననున్నట్లు హ్యాండ్ బాల్ అట సంఘం కార్యదర్శి డి. ఆనంద్, సయూక్త కార్యదర్శి బుగ్గ కేశనాగులు తెలిపారు. -
ముగిసిన జిల్లాస్థాయి హ్యాండ్‌బాల్ ఎంపికలు
కరీంనగర్ స్పోర్ట్స్ : జిల్లా హ్యాండ్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో శనివారం అంబేద్కర్ స్టేడియంలో సబ్‌జూనియర్ బాలికలకు నిర్వహించిన జిల్లాస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలు ముగిశాయి. ఈ ఎంపిక పోటీలకు జిల్లా వ్యాప్తంగా గుల్లకోట, రామడుగు, గోపాల్రావుపేట, చింతకుంట, రామడుగు, బెజ్జంకి, ధర్మపురి, గర్రెపల్లి నుంచి దాదాపు 80 మంది క్రీడాకారిణిలు హాజరయ్యారు. ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. ఆగష్టు 6 నుంచి 8 వరకు హన్మకొండలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించనున్నారు. పీఈటీలు జిట్టబోయిన శ్రీనివాస్, లక్ష్మణ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. జట్టు ఇదే.. జి.రోషిణి, ఎండీ సనా, మౌనిక, బి.స్వర్ణలత, ఎ.రాజేశ్వరీ, చేతన, వి.నాగ, అనూష, రవళి, కల్పన, బి.లావణ్య, నాగజ్యోతి, స్టాండ్‌బైగా కె.రవళి, అంజలి సంఘమిత్ర, అఖిల, రమాదేవి. -
రాష్ట్రహ్యాండ్బాల్ ట్రోఫి కర్నూలుకే
కల్లూరు (రూరల్): జిల్లా హ్యాండ్ బాల్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి స»Œ జూనియర్స్ హ్యాండ్‌బాల్ పోటీల్లో బాలుర విభాగంలో కర్నూలు, బాలికల విభాగంలో కడప జట్లు విజేతలుగా నిలిచారు. ఎస్డీఆర్ వరల్డ్ స్కూల్ సౌజన్యంతో జరిగిన పోటీలకు సంబంధించి విజేతలుగా నిలిచిన వారికి శనివారం బీ క్యాంపు క్రీడా మైదానంలో బహుమతులు ప్రదానం చేశారు. నంద్యాల ఎస్డీఆర్ వరల్డ్ స్కూల్ డైరెక్టర్ కొండారెడ్డి, మూడవ పట్టణ సీఐ మధుసూదన్‌రావు విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ట్రోఫీలు, పతకాలు అందజేసి అభినందించారు. విజేతల వివరాలు.. బాలుర విభాగంలో కర్నూలు విన్నర్స్, ప్రకాశం జట్టు రన్నర్స్, తూర్పు గోదావరి జట్టు తతీయ స్థానం సాధించింది. బాలికల విభాగంలో కడప విన్నర్స్, ప్రకాశం రన్నర్స్, శ్రీకాకుళం జట్టు తతీయ స్థానంలో నిలిచింది. కార్యక్రమంలో రాష్ట్ర హ్యాండ్‌బాల్ కార్యదర్శి వెంకటేశ్వరరావు, కోశాధికారి లెనిన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రామాంజనేయులు, ఒలింపిక్ సంఘం అధ్యక్షులు విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బికినీకి 70 ఏళ్ళు!
ప్రపంచ అతిచిన్న బాతింగ్ సూట్ గా ప్రకటనల్లో ప్రసిద్ధి చెంది, ఫిలిప్పీన్స్, బాలి, హవాలి, గోవా వంటి ఎన్నో దేశాల్లో రంగు రంగులతో ఆకట్టుకున్న బికినీల వెనుక.. పెద్ద చరిత్రే ఉంది. బికినీలు రూపొందిన తర్వాత మొదట్టో ఎన్నో అభ్యంతరాలు వెల్లువెత్తినా... అనంతరం ఈతకోసం స్త్రీలు ధరించే ప్రత్యేక దుస్తులుగా గుర్తింపు పొంది, ప్రపంచవ్యాప్తంగా అందర్నీ ఆకట్టుకున్నాయి. అతి కురుచ దుస్తులైన బికినీల వెనుక అభ్యంతరాలు కోకొల్లలైనా... ప్రాచుర్యంలోకి వచ్చి 70 ఏళ్ళు పూర్తి చేసుకున్నాయి. భారతదేశంలో సాధారణ ప్రజలు బికినీలను ధరించడం అరుదుగా కనిపించినా.. బాలీవుడ్ సినిమాల్లో తారలు తమ అందాలను ఆరబోసేందుకు బికినీలను ధరించడం దశాబ్దాల క్రితమే కనిపిస్తుంది. సముద్ర తీరాల్లోనూ, స్విమ్మింగ్ పూల్స్ లోనూ ఈతకోసం స్త్రీలు ధరించే ఈ ప్రత్యేక దుస్తులైన బికినీలు శరీరభాగాలను బహిర్గతం చేస్తున్నాయన్న కారణంతో చాలా దేశాల్లో ఈ దుస్తులపై నిషేధం కూడా విధించారు. టూ పీస్ డ్రెస్ అంటూ మొట్టమొదటిసారి ఈ దుస్తులను ఫ్రాన్స్ దేశస్థుడు లూయిజ్ రియర్డ్ రూపొందించగా..బెర్నార్గీ అనే ఫ్రెంచ్ మోడల్ ధరించి జూలై 5, 1946 లో జరిగిన ప్యారిస్ ఫ్యాషన్ షోలో ప్రదర్శించి ప్రపంచ ప్రజలను ఆకట్టుకుంది. సంప్రదాయాలకు పెద్ద పీట వేసే భారతదేశంలో సాధారణ ప్రజలు బికినీలకు వ్యతిరేకమైనా.. తారల అందచందాలను ఒలకబోసేందుకు సినీరంగం ఈ దుస్తులను బాగానే ఆదరించింది. బాలీవుడ్ తార మీనాక్షీ శిరోద్కర్ ఓ మరాఠీ సినిమాలో సింగిల్ స్విమ్ సూట్ లో కనిపించి, చరిత్రను తిరగరాసింది. అనంతరం యాన్ ఈవెనింగ్ ఇన్ ప్యారిస్ సినిమాలో షర్మిలా ఠాగూర్, బాబీ సినిమాలో డింపుల్ కపాడియా.. స్విమ్ సూట్ (బికినీ) లో కనిపించగా... తర్వాత ఎందరో నటీమణులు ఆ సంప్రదాయాన్ని ధైర్యంగా కొనసాగించారు. అలాగే తెలుగు సినిమాల్లోనూ నాటితరం నుంచి నేటివరకూ బికినీ భామలు హొయలొలికిస్తూనే ఉన్నారు. రోమన్ చిత్ర పటాల్లోని బికినీలను పోలిన దుస్తులను చూస్తే ఎన్నో వేల ఏళ్ళ క్రితమే స్త్రీలు బికినీలు ధరించినట్లు తెలుస్తుంది. 1700 సంవత్పరాల క్రితం ఛాంబర్ ఆఫ్ టెన్ మెయిడెన్స్ అనే రోమన్ మొజాయిక్ చరిత్రను చూస్తే.. క్రీడాకారిణులు బికినీలు ధరించినట్లు కనిపిస్తుంది. అనంతరం అనేక రకాల ఆధునిక బికినీలు ప్రపంచానికి పరిచయమయ్యాయి. బీచ్ లాంజెర్ లో రిలాక్స్ అయ్యేందుకు మొట్టమొదటి సౌరశక్తి బికినీ 'ఐకిని' ని డిజైనర్ ఆండ్రూ స్కూనైడర్ రూపొందించారు. 1951 లో జరిగిన ప్రిమియర్ మిస్ వరల్డ్ పోటీల్లో విజేతగా నిలిచిన స్వీడన్ కు చెందిన కికి హాకన్ సన్ బికినీని ధరించి టైటిల్ గెలుచుకొంది. అయితే అనంతరం బ్యూటీ పేజెంట్లలో ప్రపంచవ్యాప్తంగా బికినీలపై నిషేధం విధించడంతో.. బికినీ ధరించి మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్న మొట్టమొదటి, చివరి మహిళగా ఆమె మిగిలిపోయింది. అలాగే 30 మిలియన్ డాలర్ల అతి ఖరీదైన బికినీని డైమండ్స్ తో సుసాన్ రోజెన్ రూపొందించారు. స్టార్ వార్స్ 6వ ఎపిసోడ్ లో ప్రిన్సెస్ లీయా డోన్డ్ సైతం మెటాలిక్ బికినీ ధరించి కనిపిస్తుంది. 90వ శకంలో ఇంటర్నేషనల్ వాలీబాల్ ఫెడరేషన్ బీచ్ వాలీబాల్ పోటీలకు 'శాండ్ రిలీజ్ సిస్టమ్' కలిగిన బికినీని మహిళల యూనిఫాంగా అనుమతించింది. జంతు హింసను నిరోధించి జనం శాకాహారులుగా మారాలంటూ చేసిన ప్రచారానికి సైతం మహిళలు.. ముఖ్యంగా ఆకులు అలములతో రూపొందించిన బికినీలు ధరించినట్లు ఆధారాలను బట్టి తెలుస్తోంది.