క్రీడాకారుల క్యాంప్ ఫైర్
Published Tue, Sep 20 2016 12:42 AM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM
కరీమాబాద్ : నగరంలోని ఖిలావరంగల్ మధ్యకోటలోని ఖుష్‌మహల్ వద్ద నిర్వహిస్తున్న తెలంగాణ స్థాయి రెండో హ్యాండ్‌బాల్ పోటీలలో భాగంగా సోమవారం రాత్రి క్రీడాకారుల క్యాంప్ ఫైర్ నిర్వహించారు. ఈ సందర్భంగా పది జిల్లాల నుంచి వచ్చిన సుమారు 450 మంది క్రీడాకారులు ఆట పాటలు, నృత్యాలతో ఉత్సాహంగా గడిపారు. క్యాంప్ ఫైర్‌ను 8వ డివిజ¯ŒS కార్పొరేటర్ బైరబోయిన దామోదర్‌యాదవ్ ప్రారంభించారు. కార్యక్రమానికి హ్యాండ్‌బాల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యామల పవ¯ŒSకుమార్, విష్ణు, మీరిపెల్లి రాజు, పోశాల సురేష్, బైరబోయిన రవీందర్, గై.రమేష్, కుమారస్వామి, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement