Players
-
CSK స్టార్స్ ఒలింపిక్స్‌లో ఈ ఈవెంట్లలో పోటీపడితే?.. (ఫొటోలు)
-
ప్యారిస్ ఒలింపిక్స్: 117 మంది.. ఓల్డెస్ట్, యంగెస్ట్ ఎవరంటే? (ఫోటోలు)
-
Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
-
నాటి పాల బుగ్గల చిన్నారులు.. నేడు క్రికెట్ ప్రపంచానికి మకుటం లేని మహారాజులు
-
IPL 2024- MI Punishment Jumpsuit: ఆలస్యం చేశారో అందరికీ ఇదే పనిష్మెంట్! (ఫోటోలు)
-
‘డిగ్రీ’లో క్రీడా రిజర్వేషన్ ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: క్రీడాకారులను ప్రోత్సహించేందుకు డిగ్రీ సీట్లలో రిజర్వేషన్ కల్పించాలన్న నిబంధన కార్యరూపం దాల్చకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. దీనివల్ల ఏటా 9 వేల మంది క్రీడాకారులు నష్టపోతున్నారని క్రీడారంగ నిపుణులు చెపుతున్నారు. ఈ అంశాన్ని ఉన్నత విద్యా మండలి దృష్టికి తెచ్చినా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,080 డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిల్లో 4.68 లక్షల సీట్లు అందుబాటులో ఉండగా.. విద్య, ఉద్యోగాల్లో క్రీడాకారులకు స్పోర్ట్స్ కోటా కింద 2 శాతం రిజర్వేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటినుంచో అమలు చేస్తోంది. కానీ ఉన్నత విద్యామండలి అమలు చేస్తున్న ‘దోస్త్’ప్రవేశాల విధానంలో మాత్రం క్రీడాకారులకు కనీసం ఒక్క సీటూ కేటాయించలేదు. అసలు ఆ కాలమే ఎత్తివేయడంపై క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యమేనా..? దోస్త్‌లో దివ్యాంగులు, ఎన్సీసీ నేపథ్యం ఉన్న వారికి ప్రత్యేక రిజర్వేషన్ కల్పించారు. వారికి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ కేంద్రాలూ నిర్వహిస్తున్నారు. అయితే క్రీడాకారుల విషయానికొచ్చే సరికి మాత్రం ప్రభుత్వం జీవో ఇవ్వకపోవడం వల్లే దోస్త్‌లో స్పోర్ట్స్ కోటా పెట్టలేదని అధికారులు చెబుతున్నారు. కాగా, క్రీడారంగ విద్యార్థులు ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రీడాకారుల అసోసియేషన్లు కూడా ఉన్నత విద్యామండలికి అనేక సార్లు విజ్ఞప్తి చేశాయని, అయినా పట్టించుకోవడంలేదని అంటున్నారు. అన్నివిభాగాలతో పాటు క్రీడాకారులకూ 2 శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే నిబంధన ఉన్నప్పుడు మళ్లీ ప్రత్యేకంగా జీవో ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం ఉన్నత విద్యామండలి అధికారుల నిర్లక్ష్యం వల్లే జరుగుతోందని చెబుతున్నారు. న్యాయం జరిగేనా..? డిగ్రీ కోర్సుల్లో తమకు రిజర్వేషన్ కల్పించాలని ఇటీవల కొంతమంది క్రీడాకారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏటా తమకు అన్యాయం జరుగుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం దీనిపై దృష్టి పెట్టిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్నతాధికారుల నుంచి సీఎం కార్యాలయం సమాచారం సేకరిస్తోంది. డిగ్రీలో క్రీడాకారుల కోటా అమలుకు జీవో ఇవ్వాల్సిన అవసరం ఉందన్న అధికారుల వాదన మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశించింది. త్వరలో దీనిపై ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. -
IPL 2024: ఎవరెవరు ఏ జట్టులో...
కోల్‌కతా నైట్‌రైడర్స్ (10) మిచెల్ స్టార్క్ (రూ. 24 కోట్ల 50 లక్షలు; ఆ్రస్టేలియా), ముజీబ్ రెహ్మాన్ (రూ. 2 కోట్లు; అఫ్గానిస్తాన్), షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్ (రూ. కోటీ 50 లక్షలు; వెస్టిండీస్), అట్కిన్సన్ (రూ. 1 కోటీ; ఇంగ్లండ్), మనీశ్ పాండే (రూ. 50 లక్షలు; భారత్), కేఎస్ భరత్ (రూ. 50 లక్షలు; భారత్), చేతన్ సకారియా (రూ. 50 లక్షలు; భారత్), అంగ్క్రిష్ రఘువంశీ (రూ. 20 లక్షలు; భారత్), రమణ్‌దీప్ సింగ్ (రూ. 20 లక్షలు, భారత్), సకీబ్ హుస్సేన్ (రూ. 20 లక్షలు; భారత్). ఢిల్లీ క్యాపిటల్స్ (9) కుమార్ కుశాగ్ర (రూ. 7 కోట్ల 20 లక్షలు; భారత్), జై రిచర్డ్సన్ (రూ. 5 కోట్లు; ఆ్రస్టేలియా), హ్యారీ బ్రూక్ (రూ. 4 కోట్లు; ఇంగ్లండ్), సుమిత్ కుమార్ (రూ. 1 కోటీ; భారత్), షై హోప్ (రూ. 75 లక్షలు; వెస్టిండీస్), ట్రిస్టన్ స్టబ్స్ (రూ. 50 లక్షలు; దక్షిణాఫ్రికా), రికీ భుయ్ (రూ. 20 లక్షలు; భారత్), స్వస్తిక్ చికారా (రూ. 20 లక్షలు; భారత్), రసిక్ ధార్ (రూ. 20 లక్షలు; భారత్). గుజరాత్ టైటాన్స్ (8) స్పెన్సర్ జాన్సన్ (రూ. 10 కోట్లు; ఆస్ట్రేలియా), షారుఖ్ ఖాన్ (రూ. 7 కోట్ల 40 లక్షలు; భారత్), ఉమేశ్ యాదవ్ (రూ. 5 కోట్ల 80 లక్షలు; భారత్), రాబిన్ మింజ్ (రూ. 3 కోట్ల 60 లక్షలు; భారత్), సుశాంత్ మిశ్రా (రూ. 2 కోట్ల 20 లక్షలు; భారత్), కార్తీక్ త్యాగి (రూ. 60 లక్షలు; భారత్), అజ్మతుల్లా ఒమర్జాయ్ (రూ. 50 లక్షలు; అఫ్గానిస్తాన్), మానవ్ సుథర్ (రూ. 20 లక్షలు; భారత్). ముంబై ఇండియన్స్ (8) గెరాల్డ్ కొయెట్జీ (రూ. 5 కోట్లు; దక్షిణాఫ్రికా), నువాన్ తుషారా (రూ. 4 కోట్ల 80 లక్షలు; శ్రీలంక), దిల్షాన్ మదుషంక (రూ. 4 కోట్ల 60 లక్షలు; శ్రీలంక), మొహమ్మద్ నబీ (రూ. 1 కోటీ 50 లక్షలు; అఫ్గానిస్తాన్), శ్రేయస్ గోపాల్ (రూ. 20 లక్షలు; భారత్), శివాలిక్ శర్మ (రూ. 20 లక్షలు; భారత్), అన్షుల్ కంబోజ్ (రూ. 20 లక్షలు; భారత్), నమన్ ధీర్ (రూ. 20 లక్షలు; భారత్). పంజాబ్ కింగ్స్ (8) హర్షల్ పటేల్ (రూ. 11 కోట్ల 75 లక్షలు; భారత్), రిలీ రోసో (రూ. 8 కోట్లు; దక్షిణాఫ్రికా), క్రిస్ వోక్స్ (రూ. 4 కోట్ల 20 లక్షలు; ఇంగ్లండ్), తనయ్ త్యాగరాజన్ (రూ. 20 లక్షలు; భారత్), విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ (రూ. 20 లక్షలు; భారత్), అశుతోష్ శర్మ (రూ. 20 లక్షలు; భారత్), శశాంక్ సింగ్ (రూ. 20 లక్షలు; భారత్), ప్రిన్స్ చౌధరీ (రూ. 20 లక్షలు; భారత్). సన్‌రైజర్స్ హైదరాబాద్ (6) ప్యాట్ కమిన్స్ (రూ. 20 కోట్ల 50 లక్షలు; ఆ్రస్టేలియా), ట్రవిస్ హెడ్ (రూ. 6 కోట్ల 80 లక్షలు; ఆ్రస్టేలియా), జైదేవ్ ఉనాద్కట్ (రూ. 1 కోటీ 60 లక్షలు; భారత్), హసరంగ (రూ. 1 కోటీ 50 లక్షలు; శ్రీలంక), జథవేద్ సుబ్రమణ్యన్ (రూ. 20 లక్షలు; భారత్), ఆకాశ్ సింగ్ (రూ. 20 లక్షలు; భారత్). లక్నో సూపర్ జెయింట్స్ (6) శివమ్ మావి (రూ. 6 కోట్ల 40 లక్షలు; భారత్), సిద్ధార్థ్ (రూ. 2 కోట్ల 40 లక్షలు; భారత్), డేవిడ్ విల్లీ (రూ. 2 కోట్లు; ఇంగ్లండ్), ఆష్టన్ టర్నర్ (రూ. 1 కోటీ; ఆస్ట్రేలియా), అర్షిన్ కులకర్ణి (రూ. 20 లక్షలు; భారత్), అర్షద్ ఖాన్ (రూ. 20 లక్షలు; భారత్). చెన్నై సూపర్ కింగ్స్ (6) డరైల్ మిచెల్ (రూ. 14 కోట్లు; న్యూజిలాండ్), సమీర్ రిజ్వీ (రూ. 8 కోట్ల 40 లక్షలు; భారత్), శార్దుల్ ఠాకూర్ (రూ. 4 కోట్లు; భారత్), ముస్తఫిజుర్ రెహా్మన్ (రూ. 2 కోట్లు; బంగ్లాదేశ్), రచిన్ రవీంద్ర (రూ. 1 కోటీ 80 లక్షలు; న్యూజిలాండ్), అవినాశ్ రావు (రూ. 20 లక్షలు; భారత్). రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (6) అల్జారీ జోసెఫ్ (రూ. 11 కోట్ల 50 లక్షలు; వెస్టిండీస్), యశ్ దయాల్ (రూ. 5 కోట్లు; భారత్), ఫెర్గూసన్ (రూ. 2 కోట్లు; న్యూజిలాండ్), టామ్ కరన్ (రూ. 1 కోటీ 50 లక్షలు; ఇంగ్లండ్), సౌరవ్ చౌహాన్ (రూ. 20 లక్షలు; భారత్), స్వప్నిల్ సింగ్ (రూ. 20 లక్షలు; భారత్). రాజస్తాన్ రాయల్స్ (5) రోవ్‌మన్ పావెల్ (రూ. 7 కోట్ల 40 లక్షలు; వెస్టిండీస్), శుభమ్ దూబే (రూ. 5 కోట్ల 80 లక్షలు; భారత్), నాండ్రె బర్జర్ (రూ. 50 లక్షలు; దక్షిణాఫ్రికా), టామ్ కోలెర్ కాడ్మోర్ (రూ. 40 లక్షలు; ఇంగ్లండ్), ఆబిద్ ముస్తాక్ (రూ. 20 లక్షలు; భారత్). ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమీర్ రిజ్వీ దూకుడైన బ్యాటింగ్‌తో యూపీ టి20 లీగ్‌లో సత్తా చాటాడు. ఈ టోర్నీలో కాన్పూర్ సూపర్‌స్టార్స్ తరఫున 9 ఇన్నింగ్స్‌లలోనే 455 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. దాంతో మూడు ఐపీఎల్ టీమ్‌లు ట్రయల్స్‌కు పిలిచాయి. యూపీ టీమ్ అండర్–23 టైటిల్ గెలుచుకోవడంలో అతనిదే కీలక పాత్ర. అండర్–16 విజయ్ మర్చంట్ ట్రోఫీ మ్యాచ్‌లో ఒకే రోజు 280 పరుగులు చేసి రికార్డు రిజ్వీకి ఉంది. జార్ఖండ్ వికెట్ కీపర్ అయిన కుమార్ కుశాగ్ర కూడా ధాటిగా ఆడగల సమర్థుడు. విజయ్ హజారే టోర్నీలో మహారాష్ట్రపై 355 పరుగుల ఛేదనలో 37 బంతుల్లో 67 పరుగులు చేసి జట్టును గెలిపించడం అతడిని హైలైట్ చేసింది. మనోళ్లు నలుగురు... తాజా వేలంలో ఆంధ్ర ఆటగాళ్లు కేఎస్ భరత్ (రూ. 50 లక్షలు; కోల్‌కతా), రికీ భుయ్ (రూ. 20 లక్షలు; ఢిల్లీ), హైదరాబాద్ క్రికెటర్లు అరవెల్లి అవినాశ్ రావు (రూ. 20 లక్షలు; చెన్నై), తనయ్ త్యాగరాజన్ (పంజాబ్ కింగ్స్)లను ఆయా జట్లు ఎంచుకున్నాయి. స్మిత్‌కు మళ్లీ నిరాశే... టెస్టుల్లో దిగ్గజంగా, వన్డేల్లోనూ మంచి బ్యాటర్‌గా గుర్తింపు ఉన్న ఆ్రస్టేలియా స్టార్ స్టీవ్ స్మిత్‌ను టి20లకు తగడని ఐపీఎల్ ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. అందుకే గత ఏడాదిలాగే ఈసారి కూడా కనీస విలువ రూ.2 కోట్లకు కూడా ఎవరూ తీసుకోలేదు. వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్‌లో ఉన్న ఆసీస్ బౌలర్ హాజల్వుడ్నూ ఎవరు ఎంచుకోలేదు. వేలంలో అమ్ముడుపోని ఇతర గుర్తింపు పొందిన ఆటగాళ్లలో జేసన్ హోల్డర్ (వెస్టిండీస్), జిమ్మీ నీషమ్ (న్యూజిలాండ్), క్రిస్ జోర్డాన్ (ఇంగ్లండ్), టిమ్ సౌతీ (న్యూజిలాండ్), స్యామ్ బిల్లింగ్స్ (ఆ్రస్టేలియా), మిల్నే (న్యూజిలాండ్), తబ్రీజ్ షమ్సీ (దక్షిణాఫ్రికా), హనుమ విహారి, సర్ఫరాజ్ ఖాన్ (భారత్) తదితరులు ఉన్నారు. -
చైనాపై నిరసనల హోరు.. జిన్‌పింగ్ దిష్టిబొమ్మ దహనం
ఇటానగర్: ఉషు ఆటగాళ్లను ఆసియా క్రీడల్లో పాల్గొనకుండా చేసినందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు అరుణాచల్ ప్రదేశ్వాసులు. తమ రాష్ట్రానికి చెందిన ముగ్గురు క్రీడాకారులకు చైనా వీసాలు నిరాకరించడాన్ని నిరసించారు. అఖిల భారత విద్యార్థి పరిషత్‌లోని లోహిత్ యూనిట్, ఆల్ అరుణాచల్ ప్రదేశ్ యూత్ ఆర్గనైజేషన్ తిరప్, చాంగ్లాంగ్, లాంగ్డింగ్ స్టూడెంట్స్ యూనియన్ సహకారంతో రాష్ట్రంలో ఆందోళన నిర్వహించారు. ముగ్గురు క్రీడాకారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ముగ్గురు క్రీడాకారులు ఒనిలు తేగా, నేమన్ వాంగ్సు, మెపుంగ్ లాంగులకు చైనా వీసాలను రద్దు చేయడంతో చైనాలో జరిగిన ఆసియా క్రీడలలో పాల్గొనలేకపోయారు. అరుణాచల్ ప్రదేశ్ భూభాగాన్ని తమదిగానే పేర్కొంటూ చైనా ఈ చర్యకు పాల్పడింది. అరుణాచల్‌ను ప్రత్యేక దేశంగా పరిగణించనందున వీసాలను రద్దు చేసినట్లు స్పష్టం చేసింది. తమ రాష్ట్ర ఆటగాళ్లు అవకాశం కోల్పోవడంతో అరుణాచల్ ప్రదేశ్వాసులు నిరసనలు చేపట్టారు. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ స్పందించారు. ఆటగాళ్లు భారత ఉషు జట్టులో పాల్గొనేవారుగానే పరిగణించబడతారని చెప్పారు. రూ.20 లక్షల ప్రోత్సాహకం అందిస్తామని తెలిపారు. ఆటగాళ్ల కోచ్‌కు కూడా ప్రోత్సాహకంలో కొంత భాగం కేటాయించినట్లు సీఎం ఖండూ చెప్పారు. 2026లో టోక్యోలో జరగనున్న ఆసియా గేమ్స్‌కు అవకాశం దక్కుతుందని హామీ ఇచ్చారు. ఆటగాళ్ల భవిష్యత్‌కు తాను భరోసా ఇస్తున్నట్లు పేర్కొన్న సీఎం.. ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. ఇదీ చదవండి: కెనడా ప్రధాని క్షమాపణలు -
వరల్డ్ బెస్ట్ వికెట్ కీపర్స్
-
వాళ్ళిద్దరిని అవుట్ చేస్తేనే ఆస్ట్రేలియాకి ఛాన్స్ , కీలక వ్యాఖ్యలు చేసిన రిక్కీపాంటింగ్..!
-
అదరగొట్టిన టీం ఇండియా... మనమే నెంబర్ 1
-
Jr NTR: ఎన్టీఆర్‌ను కలిసిన టీమిండియా ప్లేయర్స్..ఫోటోలు వైరల్
-
భార్యలతో కలిసి టీమిండియా ఆటగాళ్ల షికార్లు.. ఫొటోలు వైరల్
-
పతకాలే లక్ష్యంగా రాణించాలి
సాక్షి, అమరావతి: రాష్ట్ర క్రీడాకారులు పతకాలే లక్ష్యంగా జాతీయ పోటీల్లో రాణించాలని పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసులశాఖ మంత్రి ఆర్కే రోజా కోరారు. ఈ నెల 28 నుంచి అక్టోబర్ 10 వరకు గుజరాత్లో జరగనున్న 36వ నేషనల్ గేమ్స్‌లో పాల్గొనేందుకు పయనమైన 170 మంది రాష్ట్ర క్రీడాకారులను బుధవారం ఆమె అభినందించారు. కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ధర్మాన కృష్ణదాస్, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జగనన్న స్పోర్ట్స్ క్లబ్‌లతో క్రీడలకు మహర్దశ
సత్తెనపల్లి: గల్లీ, గ్రామీణ క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం జగనన్న స్పోర్ట్స్ క్లబ్ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. దీనికోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. దీనిని క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 19న పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ ఆవిష్కరించారు. ఈ నెల 31వ తేదీ వరకు యాప్‌లో క్రీడాకారుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టనున్నారు. పల్నాడు జిల్లాలో 28 మండలాలు, 366 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లోని పాఠశాలల్లో ఇప్పటికే క్రీడాపోటీలు నిర్వహించి ప్రతిభావంతులను ఎంపిక చేస్తున్నారు. దీంతో ఎంతోమంది మెరికల్లా తయారవుతున్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించేందుకు జగనన్న స్పోర్ట్స్ క్లబ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దీనిలో వెటరన్ క్రీడాకారులనూ భాగస్వాములను చేసేందుకు చర్యలు చేపడుతోంది. ఇదీ ప్రణాళిక జగనన్న స్పోర్ట్స్ క్లబ్‌ల ఏర్పాటుకు రెండు నెలల క్రితమే ఉత్తర్వులొచ్చాయి. అప్పటి నుంచి పూర్తి మార్గదర్గకాలు రూపొందించేందుకు వివిధ రంగాల్లో నిపుణులైన క్రీడాకారుల సలహాలు, సూచనలు తీసుకున్నారు. తాజాగా దీనిపై ఒక ప్రణాళిక రూపొందించారు. గ్రామ/వార్డు సచివాలయాల నుంచే క్రీడాకారుల ఎంపిక, తర్ఫీదు, పోటీల నిర్వహణ చేపట్టనున్నారు. క్షేత్ర స్థాయిలో గ్రామ పంచాయతీ, కార్పొరేషన్, మున్సిపాలిటీల్లోని సచివాలయ అడ్మిన్లకు ఈ బాధ్యతలు అప్పగించారు. గ్రామస్థాయి నుంచి ప్రత్యేక కమిటీలు స్పోర్ట్స్ క్లబ్‌ల నిర్వహణకు గ్రామస్థాయి నుంచి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. పంచాయతీ పరిధిలో క్రీడాప్రాధికార సంస్థ కమిటీ చైర్మన్‌గా సర్పంచ్ వ్యవహరిస్తారు. క్రీడలను ప్రోత్సహించే దాతలనూ ఇందులో భాగస్వాములను చేయనున్నారు. రూ.50 వేలు, ఆపైన విరాళంగా అందించే దాతలు, అదే గ్రామం నుంచి జిల్లా, రాష్ట్ర, జాతీయ జట్లకు ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు, పీఈటీలు సభ్యులుగా వ్యవహరిస్తారు. మండల స్థాయిలో మండల పరిషత్ చైర్మన్ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా, తహసీల్దార్, ఎంఈవో, మండల ఇంజినీర్, ఎంపీడీవో, ఎస్సై, క్రీడాకారుడు, క్రీడాకారిణి, దాత.. ఇలా 11 మంది సభ్యులుగా ఉంటారు. స్పోర్ట్స్ క్లబ్లో రిజిస్ట్రేషన్ ఇలా ► మొదటగా గూగుల్ ప్లే స్టోర్‌లో జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ► డౌన్లోడ్ అయిన తర్వాత పేరు, మొబైల్ నంబర్ తో రిజిస్ట్రేషన్ చేయాలి. మొబైల్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ► రిజిస్టర్ అయిన తర్వాత గ్రామం, సచివాల యం, పాఠశాల వివరాలు నమోదు చేయాలి. ► ఏ క్రీడపై ఆసక్తి ఉంటే దానిపై టచ్ చేసి రిజిస్టర్ కావాలి. ► అప్పటి నుంచి జగనన్న స్పోర్ట్స్ క్లబ్‌లలో సభ్యులుగా మారుతారు. ఆ తర్వాత నోటిఫికేషన్ల రూపంలో క్రీడల వివరాలు అందుతాయి. పల్లె మట్టి వాసనల్లో మరుగున పడిన క్రీడా ఆణిముత్యాలు ఇకపై అంతర్జాతీయ వేదికపై మెరిసేందుకు బాటలు పడ్డాయి. మారుమూల వీధుల్లో ఖోఖో అంటూ కూత పెట్టే యువతరం ఇక ఉన్నత స్థాయిలో మోత మోగించనుంది. మెరికల్లాంటి ఆటగాళ్లలో ప్రతిభను వెలికి తీస్తూ కబడ్డీ తొడగొట్టనుంది. సీనియర్ సిటిజన్స్ నుంచి చిన్నారి బుడతల వరకు ప్రతి ఒక్కరినీ ఆటలో అందలమెక్కిస్తూ శారీరక దారుఢ్యం పెంచుతూ క్రీడా రంగానికి ఉజ్వల భవిష్యత్ తీసుకొచ్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్కా ప్రణాళిక రూపొందించింది. జగనన్న స్పోర్ట్స్ క్లబ్‌ల ద్వారా క్రీడాకారుల తర్ఫీదు, పోటీల నిర్వహణకు సమగ్ర విధివిధానాలు రూపొందించింది. పోటీల నిర్వహణ ఇలా.. ► పంచాయతీ కార్మదర్శులు, సచివాలయ అడ్మిన్ ప్రతి నెలా స్పోర్ట్స్ క్లబ్ సమావేశం నిర్వహిస్తారు. తొలుత వీఆర్వో, సర్వేయర్ల ద్వారా ఆట స్థలాన్ని గుర్తిస్తారు. క్రీడాకారులను ఇందులో భాగస్వాములను చేస్తారు. ఒక్కో క్రీడాంశానికి ఒక్కో క్లబ్‌ను ఏర్పాటు చేస్తారు. ► వెటరన్స్ కోసం జగనన్న వాకింగ్ క్లబ్‌లు రూపొందించారు. మహిళలకు స్కిప్పింగ్, టెన్నికాయిట్, త్రోబాల్ తదితర ఆటలు నిర్వహిస్తారు. ► సామాజిక భవనాలు, పంచాయతీ హాళ్లలో వసతులు గుర్తించి చెస్, క్యారమ్స్, ఉచిత యోగా శిక్షణ ఏర్పాటు చేస్తారు. ► క్రీడా స్థలాలు లేకపోతే వీధుల్లోనే దీనికి అనువైన ప్రదేశాలను గుర్తించి కబడ్డీ, వాలీబాల్, రబ్బర్ బాల్‌తో క్రికెట్ వంటి అనువైన ఆటలు ఆడిస్తారు. ఎన్ఆర్ఐలు, వ్యాపారులు, ఉద్యోగుల నుంచి క్రీడా సామగ్రి సమకూరుస్తారు. ► మండల క్రీడాప్రాధికార సంస్థ సభ్యులు దేశీయ క్రీడలను ప్రోత్సహించడం, ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్, క్రీడా మైదానాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థకు అందజేస్తారు. టోర్నమెంట్లు, మ్యాచులు, స్పోర్ట్స్ ఈవెంట్లు నిర్వహించి స్పోర్ట్స్ అథారిటీకి ఆదాయాన్ని పెంచుతారు. ► ప్రతి మూడు నెలలకోసారి మండల, నియోజకవర్గ స్థాయి పోటీలు నిర్వహిస్తారు. మండల, జిల్లా పరిషత్‌ల ఆదాయం నుంచి నాలుగు శాతాన్ని క్రీడలకు వెచ్చిస్తారు. మంచి వేదిక క్రీడలపై ఆసక్తి ఉన్నవారికి స్పోర్ట్స్ క్లబ్ మంచి వేదిక. జగనన్న స్పోర్ట్స్ క్లబ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జిల్లాలో ప్రారంభమైంది. యువత తమకు ఏ క్రీడలో ఆసక్తి ఉందో యాప్‌లో నమోదు చేసుకోవాలి. క్రీడలు, వ్యాయామం, వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అందుకే ప్రభుత్వం ప్రత్యేకంగా జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్‌ను రూపొందించింది. – ఎ.మహేష్ బాబు చీఫ్ కోచ్, జిల్లా క్రీడాప్రాధికార సంస్థ, పల్నాడు -
క్రీడాకారులకు అండగా ఉంటాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ క్రీడాకారులకు ఎల్లవేళలా అండగా ఉంటానని సీఎం కేసీఆర్ చెప్పారు. క్రీడారంగాన్ని ప్రోత్సహించి, రేపటి తరాలను శారీకంగా, మానసికంగా దృఢంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. తెలంగాణ గడ్డకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిన బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఇషా సింగ్‌లను చూసి తెలంగాణ యువతీ యువకులు స్ఫూర్తి పొందాలని పిలుపునిచ్చారు. నిఖత్, ఇషా సింగ్‌లతో పాటు వారి తల్లిదండ్రులను గురువారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌కు ఆహ్వానించిన ఘనంగా సన్మానించి, ఆతిధ్యం ఇచ్చారు. వారితో కలిసి భోజనం చేశారు. కాసేపు ముచ్చటించారు. బాక్సింగ్ క్రీడపట్ల చిన్నతనం నుంచే మక్కువ చూపించడానికి గల కారణాలను, గోల్డ్ మెడల్ సాధించడానికి పడిన శ్రమను నిఖత్‌ను అడిగి తెలుసుకున్నారు. శిక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం, చేసిన ఆర్థిక సాయం తనలో ఎంతో ఆత్మస్థైర్యాన్ని నింపిందంటూ ధన్యవాదాలు తెలిపారు. నిఖత్ పట్టుదల, ఆత్మస్థైర్యాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు. మరొకసారి కేసీఆర్ ‘పంచ్’ 2014లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నగదు బహుమతిగా తనకు రూ.50 లక్షల చెక్కును అందిస్తూ, తన అభ్యర్థన మేరకు సీఎం బాక్సింగ్ పంచ్ పోజిచ్చిన విషయాన్ని నిఖత్ గుర్తు చేశారు. ‘మీరిచ్చిన స్ఫూర్తితోనే ఇంతటి విజయాన్ని సాధించాను. నేను విజయంతో తిరిగి వచ్చినందుకు మరోసారి ఆరోజు మాదిరి పిడికిలి బిగించండి’అని సీఎంను కోరారు. ఆమె విన్నపాన్ని అంగీకరించిన కేసీఆర్ పిడికిలి బిగించి ఫొటో దిగారు. రూ.2 కోట్ల నగదు బహుమతిని అందించి, విలువైన నివాస స్థలాన్ని ఇస్తున్నందుకు ఆమె తల్లిదండ్రులు జమీల్ అహ్మద్, పర్వీన్ సుల్తానా సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. కాగా, ఇషాతో కూడా సీఎం మాట్లాడారు. ఆమె తల్లిదండ్రు లు సచిన్ సింగ్, శ్రీలతను అభినందించారు. -
ఆటకు ఆర్థిక అండ... దాదాపు రూ.9.60 కోట్ల నగదు ప్రోత్సాహకాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధితో పాటు క్రీడాకారులకు ఆర్థిక భరోసా కల్పించడంలో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తోంది. మూడేళ్ల కాలంలో జాతీయ, అంతర్జాతీయస్థాయిలో పతకాలు సాధించిన 1,500 మంది క్రీడాకారులకు రూ.9,59,99,859 నగదు ప్రోత్సాహకాలను అందజేసింది. సుమారు 80 క్రీడాంశాల్లోని ఆటగాళ్ల ప్రతిభకు పట్టంకడుతూ.. వారిని మరింతగా ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా శిక్షణకు అవసరమైన ఆర్థిక సాయానిచ్చింది. అంతకుముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రత్యేక విధానమంటూ లేకపోవడంతో చాలామంది క్రీడాకారులు నష్టపోయారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ క్రీడాప్రోత్సాహకాలను ప్రవేశపెట్టారు. గతంలో ఇచ్చే నగదు మొత్తాన్ని భారీగా పెంచారు. ఇందులో భాగంగానే జాతీయ పోటీల్లో పతకాలు గెలుపొందిన క్రీడాకారులకు రూ.4.58 కోట్లు ఇవ్వడం విశేషం. దీంతో 2014–19 మధ్య కాలంలో పతకాలు సాధించినా అప్పటి ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన ఎందరో క్రీడాకారులకు లబ్ధిచేకూరింది. ఎన్నికల ముందు హడావుడిగా.. టీడీపీ ఐదేళ్ల పాలనలో రూ.13.76 కోట్లు అందించినప్పటికీ చిన్న క్రీడాకారులకు ఏమాత్రం మేలు జరగలేదు. క్రీడలను కూడా రాజకీయాలతో చూసే చంద్రబాబు ఎన్నికలకు ముందు హడావుడిగా 2018–19లో 115 మందికి రూ.7.75 కోట్లు ఇచ్చారు. అంతకుముందు ఇచ్చింది కేవలం రూ.6 కోట్లు అయితే వీటిల్లో సింహభాగం అంతర్జాతీయ క్రీడాకారులకు కేటాయించినదే కావడం గమనార్హం. జాతీయస్థాయిలో పతకాలు పొందినవారికి నామమాత్రంగా ఆర్థిక సాయం దక్కేది. (చదవండి: ఉద్యాన విస్తరణకు డిజిటల్ సేవలు) -
20 మంది రిటైర్డ్ ఆటగాళ్లతో సినిమా..
చెన్నై సినిమా: క్రీడల నేపథ్యంలో ఇంతకుముందు చాలా చిత్రాలు వచ్చాయి. వాటికి భిన్నంగా 20 మంది విశ్రాంతి ఫుట్‌బాల్ క్రీడాకారులతో రూపొందుతున్న చిత్రం 'పోలామా ఊర్ కోలం'. గజ సింహ మేకర్స్ పతాకంపై ప్రభుజిత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగరాజ్ బాయ్ దురైలింగం దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకుముందు దర్శకుడు కళాప్రభు, విఘ్నేష్ శివన్, హెచ్. వినోద్ వద్ద సహ దర్శకుడిగా పని చేశారు. ప్రభుజిత్, మధుసూదన్ కథానాయకులుగా నటిస్తున్న ఇందులో శక్తి మహేంద్ర నాయకిగా పరిచయమవుతున్నారు. వీరితో పాటు 1980లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఫుట్‌బాల్ క్రీడల్లో పాల్గొని ప్రఖ్యాతిగాంచిన 20 మంది క్రీడాకారులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషించారని దర్శకుడు తెలిపారు. వారి చుట్టూనే ఈ చిత్ర కథ తిరుగుతుందని, ఉత్తర చెన్నైలో జరిగిన యదార్థ ఘటన నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు పేర్కొన్నారు. చిత్రం షూటింగ్‌ను 80 శాతం ఆంధ్రలోనూ, 20 శాతం తమిళనాడులోనూ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. -
హైదరాబాద్ బేగంపేటలో పేకాట రాయుళ్లు అరెస్ట్
-
గచ్చిబౌలి స్టేడియంలో క్రీడాకారుల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి స్టేడియంలో క్రీడాకారులు అథ్లెట్లు శుక్రవారం ఆందోళనకు దిగారు. స్టేడియాన్ని కాపాడాలని ధర్నా చేపట్టారు. టిమ్స్ ఆసుపత్రి కోసం ఇప్పటికే 9 ఎకరాలు కేటాయించగా.. గచ్చిబౌలి స్టేడియంలోని మరో 5 ఎకరాలు టిమ్స్‌కు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రభుత్వం నిర్ణయంపై అథ్లెట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఒకే ఒక స్టేడియం గచ్చిబౌలి స్టేడియమని, దాన్ని కూడా హాస్పిటల్‌కు ఇవ్వడం అన్యాయం అంటూ ఆందోళన చేపట్టారు. ఆరోగ్యంగా ఉండాలంటే స్పోర్ట్స్ ఫిట్నెస్ తప్పనిసరి అని అథ్లెట్లు చెబుతున్నారు. సిధూ ఒలంపిక్ పథకం సాధించింది అంటే అది గచ్చిబౌలి స్టేడియం వల్లనే అని, అలాంటి స్టేడియం విచ్చినం చేయడం సరైనది కాదని అంటున్న ఆధ్లెట్స్ , వారి తల్లిద్రందుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
‘అమ్మాయిలూ మీరు పతకం తేండి.. ఇల్లు.. కారు నేనిస్తా’
అహ్మదాబాద్: ఒలింపిక్స్ పోటీల్లో భారతీయ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు వీరోచితంగా పోరాడుతున్నారు. ఇప్పటివరకు ఐదు పతకాలు రాగా వాటిలో మూడు అమ్మాయిలు సాధించినవే. తాజాగా ఈ పోటీల్లో భారత మహిళల హాకీ జట్టు ఆశలు కల్పిస్తోంది. సెమీ ఫైనల్‌కు వెళ్లిన రాణి జట్టు ఎలాగైనా పతకం సాధించాలనే పట్టుతో ఉంది. ఇప్పటికే పురుషుల హాకీ జట్టు నాలుగు దశాబ్దాల అనంతరం ఒలింపిక్ పతకం సొంతం చేసుకుంది. ఇప్పుడు మహిళలపై ఆశలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో ఆ అమ్మాయిలకు నగదు ప్రోత్సహాకాలు, కానుకల ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయి. తాజాగా గుజరాత్‌కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి, హెచ్‌కే గ్రూప్ అధినేత సావ్జీ ఢోలాకియా అమ్మాయిల హాకీ జట్టుకు వరాలు ప్రకటించారు. ‘మీరు పతకం తీసుకురండి.. మీకు ఇల్లు లేదా కారు ఇస్తా’ అని ప్రకటించారు. అమ్రేలీ జిల్లాలోని ధుహల గ్రామానికి చెందిన ధోలాకియా హరికృష్ణ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ ప్రారంభించి ప్రస్తుతం రూ.7 వేల కోట్ల టర్నోవర్ పొందుతున్నారు. మొదటిసారి మహిళల జట్టు సెమీ ఫైనల్‌కు చేరింది. 130 కోట్ల భారతీయుల కలను మోస్తున్నారు. నేను వారికి అందించే ఇది చిన్న సహాయం. ఇది వారి నైతిక సామర్థ్యం పెంపునకు.. ప్రోత్సాహానికి దోహదం చేస్తుందని భావిస్తున్నా. రజత పతక విజేత మీరాబాయి చానును స్ఫూర్తిగా తీసుకున్నట్లు తెలిపారు. అతి చిన్న ఇంట్లో ఉంటూనే చాను ఒలింపిక్స్‌లో పతకం సాధించింది. ఈ నేపథ్యంలోనే హాకీ క్రీడాకారులకు రూ.11 లక్షలు ఇంటి నిర్మాణం కోసం ఇస్తున్నట్లు ధోలాకియా వివరించారు. ఇల్లు వద్దనుకునే వారికి కారు కొనుగోలు కోసం రూ.5 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతోపాటు తన స్నేహితుడు డాక్టర్ కమలేశ్ డేవ్ ప్రతీ క్రీడాకారుడికి రూ.లక్ష నగదు బహుమతి ఇచ్చేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. ధొలాకియా తన సంస్థలోని ఉద్యోగులను కుటుంబసభ్యుల్లాగా చూసుకుంటారు. ప్రతి దీపావళికి ఉద్యోగులకు భారీ కానుకలు ఇస్తుంటారు. చాలాసార్లు ఉద్యోగులకు ఖరీదైన కార్లు, ఆభరణాలు, ప్లాట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. The group has also decided to award others (who have a house) with a brand-new car worth Rs 5 lakhs if the team brings home a medal. Our girls are scripting history with every move at Tokyo 2020. We’re into the semi-finals of the Olympics for the 1st time beating Australia. — Savji Dholakia (@SavjiDholakia) August 3, 2021 -
క్రీడాకారులకు బంపర్ ఆఫర్.. పసిడి గెలిస్తే రూ.3 కోట్లు, వెండికి రూ.2 కోట్లు..
టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లే తమిళ క్రీడాకారులకు సీఎం ఎంకే స్టాలిన్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. బంగారు పతకం సాధిస్తే రూ.3 కోట్లు, వెండికి రూ.2 కోట్లు, కాంస్య పతకానికి రూ.కోటి బహుమతి ఇవ్వనున్నట్టు తెలిపారు. అలాగే రాష్ట్రంలో నాలుగు చోట్ల ఒలింపిక్స్ అకాడమీలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. క్రీడాకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సాక్షి, చెన్నై(తమిళనాడు): క్రీడాకారులకు కరోనా వ్యాక్సిన్ డ్రైవ్‌కు శనివారం శ్రీకారం చుట్టారు. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం ఎంకే స్టాలిన్ పాల్గొని తమిళనాడు నుంచి ఒలింపిక్స్ వెళ్తున్న ఏడుగురు క్రీడాకారులకు తలా రూ.ఐదు లక్షల ప్రోత్సాహకాన్ని అందించారు. ఆయన మాట్లాడుతూ క్రీడను ఆటగా కాకుండా సత్తా చాటాలన్న ఆకాంక్షతో ముందుకు సాగితే పతకం విజయం సాధించవచ్చని తెలిపారు. రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. క్రీడాకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టనున్నామని తెలిపారు. పతకంతో వస్తే నజరానా.. రాష్ట్రంలో నాలుగు చోట్ల ఒలింపిక్ అకాడమీలను ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల్ని ప్రోత్స హిస్తూ రవాణాతో సహా అన్ని ఖర్చులు భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. క్రీడల్లో మెరుగైన శిక్షణ ఇస్తామన్నారు. క్రీడాకారులు పతకాలు సాధించి రాష్ట్ర గౌరవాన్ని ఎలుగెత్తి చాటాలని పిలుపునిచ్చారు. చెన్నైలో క్రీడా నగరం ఏర్పాటు చేయనున్నామని, ఇక్కడ అన్ని రకాల క్రీడలకు శిక్షణ ఇవ్వడంతోపాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రం నుంచి టోకియో ఒలింపిక్స్‌కు వెళ్తున్న క్రీడాకారులు పతకాలతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఒలింపిక్‌లో బంగారు పతకం సాధిస్తే రూ.3 కోట్లు, వెండి పతకానికి రూ.2 కోట్లు, కాంస్య పతకానికి రూ.కోటి నగదు బహుమతి ఇస్తామని వివరించారు. కార్యక్రమంలో ఆరోగ్య మంత్రి ఎం సుబ్రమణ్యం, క్రీడాశాఖ మంత్రి మయ్యనాథన్, దేవాదాయ శాఖ మంత్రి శేఖర్‌బాబు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ పాల్గొన్నారు. ఇంగ్లాండ్‌కు పయనమా? రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని శాఖల్లో సాగుతున్న అభివృద్ధి, చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమీక్షించాలని సీఎం స్టాలిన్ నిర్ణయించారు. మొదట శనివారం పరిశ్రమల శాఖ వర్గాలతో సమావేశమయ్యారు. పెట్టుబడుల ఆహ్వానం, ప్రస్తుతం పెట్టుబడులు పెట్టిన సంస్థలు, సాగుతున్న పనులపై సమీక్షించారు. రాష్ట్రంలోకి పెట్టుబడుల్ని ఆహ్వానించడమే లక్ష్యంగా జూలై లేదా ఆగస్టులో స్టాలిన్ ఇంగ్లాండ్‌కు పయనమయ్యేలా చర్చ సాగినట్టు సమాచారం. ఇక తన నియోజకవర్గం కొళత్తూరులో సాయంత్రం స్టాలిన్ పర్యటించారు. పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రారంభించారు. అలాగే రంగు చేపల పెంపకం, ఉత్పత్తి, విక్రయదారులతో సమావేశమయ్యారు. చదవండి: Delta Variant:: రేపటి నుంచి మళ్లీ కఠిన ఆంక్షలు -
మూవీ క్విజ్: రాజమౌళి ‘సై’లో రగ్బీ కోచ్ ఎవరు?
సినిమాలోని పాత్రల కోసం ఒక్కోసారి కొత్త విద్యలు నేర్చుకుంటూ ఉంటారు నటీనటులు. క్రీడల నేపథ్యంలోని సినిమాలకు ఆయా ఆటలు నేర్చుకుంటారు. అలా టాలీవుడ్, బాలీవుడ్ నటులు స్పెషల్‌గా నేర్చుకున్న ఆటల గురించి క్విజ్. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1501341623.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1511341623.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
దూరం మరచి... వైరం పెరిగి...
చైనీస్ తైపీ: కరోనా కారణంగా స్టేడియంలో ఆటగాళ్లే ఉన్నారు. ప్రేక్షకుల్ని అనుమతించలేదు. ఈలగోలల్లేని మైదానంలో ఎంచక్కా ఆడుకోవాల్సిన ఆటగాళ్లు దెబ్బలాడుకున్నారు. ఈ తగువులాటలో భౌతిక దూరం సంగతే మరిచారు. మ్యాచ్ ప్రసారం కావాల్సిన టీవీల్లో కొట్లాట ‘ప్రత్యక్ష’ ప్రసారమైంది. చైనీస్ తైపీ బేస్‌బాల్ లీగ్‌లో భాగంగా ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. రకుటెన్ మంకీస్, ఫుబొన్ గార్డియన్స్ జట్ల మధ్య బేస్‌బాల్ మ్యాచ్ ప్రేక్షకుల్లేకుండా జరిగినా ... ఇరుజట్ల ఆటగాళ్ల తగవుతో అల్లరిపాలైంది. భౌతిక దూరం పాటించాలనే ఉద్దేశంతో ఎవరినీ అనుమతించని స్టేడియంలో... విచక్షణ మరిచి ఒకరిమీద ఒకరుపడి మరీ కొట్టుకోవడం తైపీ వర్గాల్ని కలవరపెట్టింది. ఇక ఈ ద్వీప దేశం బేస్‌బాల్ తగవుతో వార్తల్లోకెక్కినా... ప్రపంచాన్నే వణికిస్తున్న వైరస్‌నే పకడ్బందీ చర్యలతో కట్టడి చేసిన దేశంగా కితాబులందు కుంటోంది. -
క్రీడాకారులు ఎవ్వరు అధైరపడవద్దు..
సాక్షి, విజయవాడ : క్రీడాకారులు ఎవ్వరు అధైరపడవద్దు.. ఎవ్వరికి అన్యాయం జరగకుండా చూస్తామని కృష్ణా జిల్లా కబడ్డీ అసోసియేషన్ నూతన చైర్మన్ కడియాల బుచ్చిబాబు చెప్పారు. బుధవారం ఆయన మాట్లాడుతూ గతంలో కబడ్డీ అసోసియేషన్‌లో తలెత్తిన వివాదాల కారణంగా స్వచ్చందంగా జిల్లా అసోసియేషన్‌ను రద్దు చేశామన్నారు. ‘ మే 29న కర్నూలులో ఏపీ కబడ్డీ అసోసియేషన్ సమావేశం జరిగింది. దీనిలో భాగంగా కృష్ణాజిల్లాకు నూతనంగా హడక్ కమిటీని నియమించారు. నూతన అసోసియేషన్‌కు చైర్మన్‌తో పాటు మరో ఆరుగురిని సభ్యులను ఎంపిక చేశారు. ఇంకా వివాదాలకు తావు లేకుండా అసోసియేషన్‌ను ముందుకు తీసుకువెళ్తాం. కబడ్డీలో కృష్ణా జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని’ బుచ్చిబాబు పేర్కొన్నారు. ‘ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉన్న అసోసియేషన్ రూమ్‌ను హడక్ కమిటీ స్వాధీనం చేసుకుంటుంది. అసోసియేషన్‌లో ఉన్న విభేదాలపై పోలీసులకు ఫిర్యాదు చేశాం.. ఇంకా వారు చూసుకుంటారు. ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులు ఉన్న హడక్ కమిటీ దృష్టికి తీసుకురావచ్చని’ కడియాల బుచ్చిబాబు తెలిపారు. -
ఐపీఎల్లో ఫ్లాప్ స్టార్స్
సాక్షి, ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11వ సీజన్ ముగిసింది. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్ ఫైట్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి ట్రోఫీని ముద్దాడింది. ఈ సీజన్ వేలంలో ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తారనుకున్న ఆటగాళ్ల కోసం ప్రాంచైజీలు కోట్లు కుమ్మరించాయి. అయితే కోట్లు పెట్టిన ఆటగాళ్లు విఫలం కావడంతో ఆయా ప్రాంఛైజీలు వరుస ఓటములను చవిచూశాయి. వేలానికి కోట్లు కుమ్మరించిన ఆటగాళ్లు అంచనాలు అందుకోవడంలో ఘోరంగా చతికిలబడ్డారు. సదరు ఆటగాళ్ల పేలవ ప్రదర్శనతో జట్టు అవకాశాలను కోల్పయింది. వేలంలో కోట్లు పలికి ఈ సీజన్లో అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చిన టాప్ 5 ఆటగాళ్లు వీరే. అరోన్ ఫించ్( కింగ్స్ లెవన్ పంజాబ్) టీ20 ఫార్మాట్లో ప్రత్యేకంగా స్థానమున్న ఆస్ట్రేలియా ఓపెనర్ అరోన్ ఫించ్‌ను కింగ్స్ లెవన్ పంజాబ్ పోటీపడి రూ. 6.2 కోట్లకు వేలంలో సొంతం చేసుకుంది. కానీ, ఈ సీజన్లో అరోన్ ఒక్క మ్యాచ్‌లోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేకపోయాడు. సీజన్లో ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. కొన్ని మ్యాచ్‌ల్లో మిడిలార్డర్‌గా, మరికొన్ని మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగడంతో ఆటతీరుపై ప్రభావం పడింది. మొత్తంగా ఈ సీజన్లో 134 పరుగులు మాత్రమే ఫించ్ చేయగలిగాడు. గ్లెన్ మాక్స్వెల్(ఢిల్లీ డేర్‌డెవిల్స్) సుడిగాలి ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌లను అమాంతం మలుపు తిప్పగల ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్. దీంతో మ్యాక్స్‌వెల్‌ను దక్కించుకునేందుకు ప్రాంచైజీలు పోటీపడ్డాయి. ఐపీఎల్లో మంచి అనుభవం కూడా ఉండడంతో ఢిల్లీ డేర్‌డెవిల్స్ రూ. 9 కోట్లు పోసి వేలంలో దక్కించుకుంది. కానీ మ్యాక్స్‌వెల్ మెరుపులు మెరిపించడంలో దారుణంగా విఫలమయ్యాడు. ఈ సీజన్లో కేవలం 169 పరుగులు సాధించి, 5 వికెట్లు మాత్రమే తీశాడు. బెన్‌స్టోక్స్(రాజస్తాన్ రాయల్స్) 10 వ సీజన్లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ ఫైనల్ వరకు చేరిందంటే దానికి కారణం ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్. అదే జోరు ఈ ఏడాది కొనసాగిస్తాడని ఆశించిన రాజస్తాన్ రాయల్స్ జట్టుకు అతను షాకిచ్చాడు. ఐపీఎల్-11 సీజన్ ఆటగాళ్ల వేలంలో అత్యధికంగా రూ.12.5 కోట్ల ధర పలికిన స్టోక్స్.. ఈ ధరకు న్యాయం చేయలేకపోయాడు. ఆల్‌రౌండర్‌గా పేరొందిన స్టోక్స్ 196 పరుగులు చేసి, 8 వికెట్లు తీశాడు. మనీశ్ పాండే(సన్‌రైజర్స్ హైదరాబాద్) ఈ ఏడాది జరిగిన వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మనీశ్ పాండేను రూ.11.5 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించి కొనుగోలు చేసింది. అయితే జట్టు తనపై పెట్టుకున్న ఆశల్ని మాత్రం మనీశ్ నెరవేర్చలేకపోయాడు. పంజాబ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌లు మినహాయిస్తే.. మిగతా మ్యాచుల్లో మనీశ్ పాండే స్వల్పస్కోర్‌కే పరిమితమయ్యాడు. తమ జట్టు కోసం ఆడకుండా.. ప్రత్యర్థి జట్టు గెలుపు కోసం మనీశ్‌కు కష్టపడుతున్నాడని సోషల్ మీడియాలో సెటైర్లు కూడా పేలేయాయి. ఈ టోర్నీలో మనీశ్ కేవలం 284 పరుగులు మాత్రమే చేశాడు. జయ్‌దేవ్ ఉనాద్కత్(రాజస్తాన్ రాయల్స్) ఈ ఐపీఎల్ సీజన్లో అత్యధిక ధర రూ.11.5 కోట్లు పలికిన భారత ఆటగాడు జయ్‌దేవ్ ఉనాద్కత్. టీ20ల్లో స్పెషలిస్ట్ బౌలర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉనాద్కత్‌ను రాజస్తాన్ రాయల్స్ భారీ మొత్తంతో కొనుగోలు చేసింది. గత సీజన్లో పుణె తరపున 12 మ్యాచ్‌ల్లో 24 వికెట్లతో అదరగొట్టడంతో ఉనాద్కత్‌పై రాజస్థాన్ కోట్లు కుమ్మరించింది. కానీ ఈ సీజన్లో అతడు పేలవ ప్రదర్శన చేసి రాజస్థాన్ అంచనాలను తలక్రిందు చేశాడు. ఈ టోర్నీలో ఉనాద్కత్ 11 వికెట్లు మాత్రమే తీశాడు. -
అప్పుడే 20 ఏళ్ల యువతిలా యాక్ట్ చేస్తోంది.. రైనా
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో సురేశ్ రైనా చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున అడుతున్న విషయం తెలిసిందే. రైనా తన కూతురు గ్రేసియా బర్త్‌డే వేడుకను ఢిల్లీలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, బ్రావో తదితరులు పాల్గొని సందడి చేశారు. చెన్నై జట్టు ఈ నెల 18న ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో తలపడనుంది. ఇందులో భాగంగా ప్లేయర్స్ ఢిల్లీ చేరుకున్నారు. ఈ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్‌కు చేరుకున్న విషయం విదితమే. చెన్నై సూపర్ కింగ్స్ తదుపరి మ్యాచ్ పంజాబ్ జట్టుతో ఆడనుంది. బంధువులు, సన్నిహితుల మధ్య గ్రేసియా పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. హర్భజన్ సింగ్ తన భార్య గీతా బస్రా కుమార్తె హినయాతో కలిసి వేడుకకు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ వేడుకలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో హాచ్చల్ చేస్తున్నాయి. సురేశ్ రైనా ఓ వీడియోను తన ట్విటర్లో పోస్టు చేశాడు. 20 సంవత్సరాల ఉన్న యువతిలా ఆమె యాక్ట్ చేస్తోందని రైనా ట్విట్ పెట్టాడు. -
కొలువుల్లో క్రీడాకారులకు కోటా
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ నియామకాల్లో క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ శాఖల డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఈ రిజర్వేషన్లు వర్తించనున్నాయి. ఈ మేరకు క్రీడలశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి ఈ రిజర్వేషన్లు ఉమ్మడి రాష్ట్రంలోనే ఉన్నప్పటికీ తెలంగాణ ఏర్పాటు తర్వాత అమలు కాలేదు. వీటిని అమలు చేయాలంటే రూల్–22లో సవరణలు చేయాలని టీఎస్పీఎస్సీ సూచించింది. దీంతో ప్రభుత్వం అందుకు సంబంధించిన సవరణలు చేసింది. తాజా రిజర్వేషన్లు 29 రకాల క్రీడాకారులకు, 90 రకాల క్రీడల్లో పాల్గొన్న వారికి, పతకాలు సాధించిన వారికి వర్తించనున్నాయి. క్రీడాకారులకు వరం: మంత్రి పద్మారావుగౌడ్ క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్లు వరమని మంత్రి పద్మారావుగౌడ్ పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న రిజర్వేషన్లను పరిశీలించి రాష్ట్రంలో అమలు చేయాలన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ప్రతిపాదనలు తయారు చేశామని, వాటికి సీఎం ఆమోదం తెలిపారన్నారు. ఇటీవల కామన్వెల్త్ క్రీడల్లో విజయం సాధించిన వారితో మాట్లాడిన ముఖ్యమంత్రి ప్రత్యేక రిజర్వేషన్ల హామీ ఇచ్చారని, ఆ హామీని నెరవేర్చారన్నారు. సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి బుర్రా వెంకటేశం, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, వీసీఎండీ దినకర్‌బాబు పాల్గొన్నారు. -
ఆటలకు ప్రభుత్వం టాటా!
విజయవాడ స్పోర్ట్స్: రాష్ట్ర్రంలో క్రీడాకారులనూ చంద్రబాబు సర్కార్ మాటలతో నాలుగేళ్లు మభ్యపెట్టింది. మరోవైపు క్రీడా సంఘాలతోనూ ఆటలాడుతూ పబ్బం గడుపుతోంది. బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేసినట్లే.. బాబు వస్తే క్రీడా రంగానికి స్వర్ణయుగమే అని ప్రచారం చేశారు. వాస్తవానికి నవ్యాంధ్రలో ఒక్క అంతర్జాతీయ స్థాయి స్టేడియం కూడా లేదు. ఈ నాలుగేళ్లలో ఒక్క స్టేడియాన్ని కూడా అభివృద్ధి చేయలేదు. స్థానిక క్రీడాకారులకు సాయమే లేదు. సీఎం చంద్రబాబు మాటలు నమ్మి ఎన్నో ఆశలు పెట్టుకున్న క్రీడాకారులకు చివరకు నిరాశే మిగిలింది. క్రీడా సంఘాల మధ్య చిచ్చు చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఎన్నికల సమయంలో క్రీడాకారులకు ఇచ్చిన హామీల గురించి చర్చ జరగకుండా క్రీడా సంఘాల్లో చిచ్చు పెట్టారని క్రీడా నిపుణులు ఆరోపిస్తున్నారు. జాతీయ క్రీడలు నిర్వహించే అవకాశం వస్తే రాష్ట్రానికి రూ.2 వేల కోట్లు వస్తాయని ప్రభుత్వ పెద్దలు భావించారు. ఈ మేరకు జాతీయ క్రీడల నిర్వహణలో కీలకపాత్ర పోషించే రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్‌లో పదవులు దక్కించుకోవడం కోసం ఇద్దరు అధికార పార్టీ ఎంపీలు రంగంలోకి దిగి పోటీపడ్డారు. జాతీయ క్రీడల నిర్వహణను సాధించలేకపోయినా ఒలింపిక్ అసోసియేషన్‌ను మాత్రం రెండు ముక్కలు చేశారు. ఈలోగా రియో ఒలింపిక్స్ వచ్చాయి. అంతే.. ఏకంగా రాజధాని అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తామంటూ సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. అంతటితో ఆగకుండా ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తే నోబెల్ బహుమతి ఇస్తానని చెప్పి తనకు క్రీడలపై ఉన్న అవగాహన రాహిత్యాన్ని బయటపెట్టుకున్నారు. రాజధానిలో క్రీడా రంగం కోసం 1,200 ఎకరాలు కేటాయించామని చెప్పిన ప్రభుత్వం మరోవైపు ఉన్న స్టేడియాలను నిర్వీర్యం చేసింది. విజయవాడలో ఉన్న ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియాన్ని ప్రభుత్వ, అధికార పార్టీ కార్యకలాపాలకు వేదికగా మార్చేసింది. హెలిప్యాడ్ కోసం వినియోగిస్తూ దాన్ని ధ్వంసం చేసింది. రూ.కోట్లాది నిధులు గోల్మాల్ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది క్రీడలకు రూ.200 కోట్లు బడ్జెట్ కేటాయించింది. అయితే 13 జిల్లాల్లో జిల్లాకు కనీసం రూ.2 కోట్ల నిధులు కేటాయింపు కూడా జరగలేదని సమాచారం. రూ.కోట్ల పక్కదారి పట్టాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంత మంది అధికారుల సహకారంతో రూ.వందల కోట్లు గోల్మాల్ చేసినట్లు క్రీడా సంఘాలే విమర్శిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం ఇవ్వడానికి కూడా క్రీడలను ప్రభుత్వం అసరాగా చేసుకుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రీడా వికాస్ కేంద్రాల పేరుతో ఆ మైదానాల చుట్టూ భూములను రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. రాజధాని విషయంలో సింగపూర్, మలేషియా తదితర దేశాల పేర్లు చెప్పే చంద్రబాబు ప్రభుత్వం.. క్రీడల విషయంలో కెనడాను ఎంచుకుంది. రాష్ట్రంలో దాదాపు 50 మందికి పైగా వ్యాయామ విద్యలో పీహెచ్‌డీలు చేసినవారు ఉంటే వాళ్లు పనికిరారని వ్యాయామ విద్యలో ఫిజికల్ లిటరసీ పేరుతో కెనడా నుంచి కొంత మందిని తీసుకొచ్చారు. దీనికోసం దాదాపు రూ.100 కోట్లు ఖర్చుపెట్టారని, భారీగా నగదు చేతులు మారిందని క్రీడా సంఘాలు ఆరోపిస్తున్నాయి. గుజరాత్, రాజస్థాన్, హరియాణా రాష్ట్రాల్లో తిరిగి అక్కడి కంటే మెరుగైన క్రీడా పాలసీ తీసుకొచ్చామని అధికారులు ప్రకటించారు. అయితే, ఆ పాలసీ ద్వారా ఎవరికి మేలు జరిగిందో చెప్పాలని క్రీడా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. స్పోర్ట్స్ అకాడమీల స్థాపన పేరుతో కర్ణాటకలోని ఓ సంస్థకు అజమాయిషీ అప్పజెప్పడం, నిధులు దుబారా చేస్తుండటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగాలు ఇక్కడ.. ఇంటర్య్వ్లు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) కోచ్‌ల నియామకం అంతా తెలంగాణలో నిర్వహించారు. అవి కూడా అవుట్సోర్సింగ్ నియామకాలు. క్రీడా సంఘాలను సంప్రదించకుండా.. కనీసం క్రీడలపై అవగాహన లేనివారిని, సర్టిఫికెట్లు కొనుక్కున్నవారికి కోచ్‌ల పోçస్టులు కట్టబెట్టారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కోచ్‌ల నియామకాల్లో భారీ అవకతవకలు జరిగాయని పత్రికల్లో ఆధారాలతో సహా వచ్చినా ప్రభుత్వం స్పందించలేదు. కర్ణాటకలో కోచ్‌కు నెలకు రూ.39,960 ఇస్తుంటే.. మన రాష్ట్రంలో అది కేవలం రూ.17,500 మాత్రమే. ఈ మొత్తాన్ని మూడు నెలలకొకసారి ఇస్తున్నారంటే çక్రీడా రంగంపై ప్రభుత్వ చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు. శ్వేతపత్రం విడుదల చేయాలి సీఎం చంద్రబాబు పొరుగు రాష్ట్రాల క్రీడాకారులకు అందిస్తున్న నజరానాలు, ప్రోత్సాహకాలు రాష్ట్ర క్రీడాకారులకు అందించకపోవడం శోచనీయం. రాష్ట్రానికి చెందిన ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ ప్రపంచ కప్‌లో పతకం సాధిస్తే పట్టించుకోకపోవడం బాధాకరం. అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తామని చెప్పడం హాస్యాస్పదం. క్రీడలపై అవగాహన లేని వ్యక్తులు క్రీడా మంత్రులుగా ఉండడం మన దౌర్భాగ్యం. గతేడాది రాష్ట్ర బడ్జెట్లో క్రీడలకు కేటాయించిన రూ.200 కోట్ల నిధులు ఖర్చులకు శ్వేతపత్రం విడుదల చేయాలి. –పున్నయ్య చౌదరి, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉపా«ధ్యక్షుడు, ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కొనుగోళ్లపై సీబీఐతో విచారణ చేయించాలి రాష్ట్రంలో రూ.కోట్లతో కొనుగోలు చేసిన క్రీడా సామాగ్రి ఎక్కడ డంప్ చేశారు? ఎక్కడెక్కడికి పంపించారు? ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఫ్లడ్‌లైట్ల కొనుగోలు లావాదేవీలపై, జల క్రీడల కోసం కొన్న బోట్ల కొనుగోళ్లపై సీబీఐతో విచారణ జరిపించాలి. –రంభా ప్రసాద్, ఆట్యపాట్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
దుమ్ములేస్తున్న క్రీడామైదానం
ఆదిలాబాద్‌కల్చరల్ : జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో కాలిపడితే దుమ్ములేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోనే మూడో క్రీడా పాఠశాలగా ఉన్న జిల్లా కేంద్రంలోని క్రీడాకారులకు మైదానంలో అసౌకర్యాలు దర్శనమిస్తున్నాయి. క్రీడాకారులు రన్నింగ్ చేసిన, వాకింగ్ చేసినా దుమ్ములేస్తోంది. స్టేడియంలోని 800 ట్రాక్, 400 ట్రాక్‌లు నడిస్తేనే దుమ్ములేస్తున్నాయి. దీనికి తోడు కోచ్‌లు క్రీడా షెడ్యూల్డ్ ప్రకారం స్పోర్ట్స్ అకాడమి విద్యార్థులు శిక్షణ నివ్వకపోవడంతో ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. వృద్ధులు, పెద్దలు, క్రీడాకారులు, మహిళలు, చిన్నారులు, అనారోగ్యం నుంచి విముక్తి పొందేందుకు మరికొందరు మైదానానికి వస్తుంటారు. ఇక్కడి పరిస్థితులతో వచ్చేందుకు పలువురు జంక్కుతున్నారు. కనిపించని ఉద్యోగులు సేవలు... ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో, పాఠశాల క్రీడా ఆకాడమిలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగుల, కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలు కనిపించడం లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగులపై పర్యవేక్షణ లేక, కాంట్రాక్టర్ కరీంనగర్ జిల్లాకు చెందినవాడు కావడంతో సమస్యాత్మకంగా మారింది. కోచ్‌లు క్రీడాకారులకు అనువుగా గ్రౌండ్‌మెన్లు మైదానాన్ని తీర్చిదిద్దేలా చూడాలి. క్రీడాకారులకు ఏ ఆటల ఆడిస్తున్నారు. ఆటల మైదానం సంక్రమంగా ఉందా లేదా పరిశీలించి అనుగుణంగా తీర్చిదిద్దేలా చూడాలి. కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, హకీ, పుడ్‌బాల్, క్రికెట్మైదానాలను వాటరింగ్చేసి, వాటిలో గ్రీస్వేసి క్రీడాకారులకు చేదోడువాదోడుగా ఉండాలి. ఆనారోగ్యంగా మైదానం... ప్రస్తుత సమాజంలో చాలా వరకు కాలుష్యం పెరిగి, దుమ్ముధూళీతో అనారోగ్యం బారీన పడే వారి సంఖ్యలో ఎక్కుగానే ఉంటుంది. క్రీడాకారులపై దుమ్మునుంచి వచ్చే ప్రభావం తీవ్రంగా చూపే ప్రమాదం వుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. వృద్ధులకు, చిన్న పిల్లలకు అస్వస్థతకు గురిచేసి ప్రాణాంతకంగా మారే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ప్రజలకు ఆరోగ్యాన్నిచ్చే మైదానాలు క్రీడాకారులకు శాపంగా మారవద్దని చెబుతున్నారు. మైదానం ఆరోగ్యాన్నిచ్చేలా చూడాలి ప్రభుత్వం మైదానాలలో నడిస్తే ఆరోగ్యంగా ఉండేలా చూడాలని కానీ, దుమ్ముధూళీతో అనారోగ్యం బారీనపడేలా ఉండకూడదు. అధికారులు చోరవతీసుకుని వాటరింగ్ చేసి దుమ్ములేకుండా చూడాలి. క్రీడాకారులుకు, ప్రజలకు అనువుగా మైదానాలను తీర్చిదిద్దాలి. –శ్రీనివాస్, కైలాస్‌నగర్ ఆదిలాబాద్ సిబ్బందిని అదనంగా నియమించాలి ప్రజల ఆరోగ్యం కోసం పనిచేసేందుకు క్రీడామైదానంలో సౌకర్యాలు సిబ్బంది కల్పించాలి. అలా పనిచేయని కాంట్రాక్ట్ సోసైటీ పై ఫిర్యాదు చేసి కాంట్రాక్ట్ రద్దు చేసేలా చూడాలి. పనిచేయని సిబ్బందిని తొలగించి పనిచేసే వారికే ప్రాదాన్యత కల్పించాలి. క్రీడాకారుల ఆరోగ్యం విషయంలో దృష్టిసారించాలి. – ప్రవీణ్, రాంనగర్, ఆదిలాబాద్ విచారించి చర్యలు తీసుకుంటాం గతంలో ఇటువంటి సమస్యలు తలెత్తలేదు. ఇకముందు ఇటువంటి సమస్యలు తలెత్తకుండా విచారించి బాధ్యుల పై చర్యలు తీసుకుంటాం. ప్రత్యక్షంగా పరిశీలించి క్రీడాకారులు సౌకర్యాలు కల్పిస్తాం. కోచ్‌లకు సైతం నిబంధనల కూడిన షెడ్యూల్డ్‌లను అందిస్తాం. – వెంకటేశ్వర్లు, డీవైఎస్వో, ఆదిలాబాద్ -
ఘోర ప్రమాదం.. అథ్లెట్ల దుర్మరణం
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీని ఆవరించిన పొగమంచు నలుగురు అథ్లెట్ల ప్రాణాలను బలితీసుకుంది. ఆదివారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు పవర్ లిఫ్టింగ్ క్రీడాకారులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్నవారి పరిస్థితి కూడా విషయంగానే ఉన్నట్లు తెలిసింది. ఆరుమంది అథ్లెట్లు.. స్విఫ్ట్ డిజైర్ కారులో ఉదయం ఢిల్లీ నుంచి పానిపట్‌కు బయల్దేరారు. రోడ్డు మీద పొగమంచు విపరీతంగా ఉండడంతో.. ఎదురుగా ఉన్నవేవీ కనిపించలేదు. మంచి వేగంతో వెళుతున్న కారు సింధు ప్రాంతంలో ప్రమాదానికి గురయింది. కారులో ప్రయాణిస్తున్న పవర్ లిఫ్టర్లు తికమ్ చంద్, సౌరభ్, యోగేష్, హరీష్ అక్కడిక్కడే మృతి చెందారు. ప్రపంచ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ సాక్ష్యం యాదవ్, మరో క్రీడాకారుడు బాలి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ఢిల్లీలోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించారు. -
ఐపీఎల్లో ఏ జట్టుకు ఏ ఆటగాళ్లు?
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గురువారం అధికారికంగా అట్టిపెట్టుకున్న (రిటెయిన్) ఇండియన్ ప్రీమియల్ లీగ్ ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. ఈ రిటెయిన్ పాలసీ 2018 నుంచి 2020 వరకు మూడేళ్ల పాటు అమల్లో ఉంటుంది. టీమిండియా అయినా... ఐపీఎల్ అయినా... కోహ్లి, ధోనీలే టాప్ స్టార్స్. అట్టిపెట్టుకునే అవకాశమే ఉన్నప్పుడు వీళ్లిద్దరినీ ఏ ఫ్రాంచైజీ అయినా ఎందుకు వదిలేస్తుంది. కాబట్టి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పంచనే విరాట్ కోహ్లి, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) పెద్ద దిక్కుగా మహేంద్ర సింగ్ ధోని ఖాయమయ్యారు. ఈ ఏడాది ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ రెండు జట్లు తమ రెండేళ్ల నిషేధాన్ని పూర్తి చేసుకుని ఆడనున్న విషయం తెలిసిందే. వీరితో పాటు ఇంకా ఎవరెవరు ఏ ఏ ఫ్రాంచైజీ చేతిలో ఉన్నారంటే.. 1.చెన్నై సూపర్ కింగ్స్: మహేంద్రసింగ్ ధోని, సురేశ్ రైనా, రవీంద్రజడేజా 2.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, డివిలియర్స్, సర్ఫరాజ్‌ఖాన్ 3.రాజస్థాన్ రాయల్స్: స్టీవ్ స్మిత్(ఆస్ట్రేలియా కెప్టెన్) 4.సన్‌రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్, భువనేశ్వర్ కుమార్(బౌలర్) 5.దిల్లీ డేర్‌డెవిల్స్: రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, క్రిస్‌మోరీస్(దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్) 6.కోల్‌కతా నైట్ రైడర్స్: సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ 7.కింగ్స్ ఎలెవన్ పంజాబ్: అక్షర్‌పటేల్ 8.ముంబయి ఇండియన్స్: రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, బుమ్రా జనవరి 27, 28వ తేదీల్లో జరిగే వేలంలో చాలా మంది స్టార్ ఆటగాళ్లు అందుబాటులోకి రానున్నారు. -
మాకు రవిశాస్త్రే కావాలి..
ముంబై: భారత జట్టు ఆటగాళ్లు ప్రధాన కోచ్ గా రవిశాస్త్రినే గట్టిగా కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆటగాళ్లు క్రికెట్ దిగ్గజం సచిన్ ముందు ఉంచడంతో రంగంలోకి దిగిన మాస్టర్ రవిశాస్త్రిని కోచ్ పదవి దరఖాస్తు చేయించాడనే ప్రచారం జరుగుతోంది. రవిశాస్త్రి 2014 నుంచి 2016 భారత జట్టుకు డైరెక్టర్ గా సేవలిందించాడు. ఈ సమయంలో రవిశాస్త్రితో ఆటగాళ్లకు సాన్నిహిత్యం ఏర్పడింది. దీంతోనే వారు రవిశాస్త్రిని కోచ్ గా కోరుకుంటున్నట్లు సమాచారం. రవిశాస్త్రి డైరెక్టర్ గా ఉన్నపుడు భారత జట్టు అద్భుతంగా రాణించింది. 2015 వరల్డ్ కప్ లో సెమీస్ చేరింది. 22 ఏళ్ల తర్వాత శ్రీలంకతో టెస్టు సిరీస్ నెగ్గింది. సౌతాఫ్రికాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ ను 3-0 తో కైవసం చేసుకుంది. రవిశాస్త్రి గత సంవత్సరం కూడా కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు కానీ గంగూలీ, సచిన్, లక్ష్మణ్ నేతృత్వంలోని సలహాదారుల కమిటీ కుంబ్లే వైపే మొగ్గు చూపింది. ఈ విషయంలో రవిశాస్త్రి గంగూలీ మధ్య అప్పట్లో మాటల యుద్దం బాహాటంగానే నడిచింది. తొలుత చాంపియన్స్ ట్రోఫీకి ముందు కోచ్ పదవికి దరఖాస్తుల ఆహ్వానించిన బీసీసీఐ కుంబ్లే రాజీనామా చేయడంతో ఆ గడవును జులై 9 కి పొడగించింది. ముందు కోచ్ పదవికి సుముఖత చూపని రవిశాస్త్రి సచిన్ సూచనతో దరఖాస్తు చేశాడని తెలుస్తోంది. బీసీసీఐ గడువు కూడా రవిశాస్త్రి కోసమే పెంచిందని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కోచ్ పదవికి రవిశాస్త్రితో పాటు వీరేంద్ర సెహ్వాగ్, టామ్ మూడీ, దొడ్డ గణేష్, రిచర్డ్ పైబస్, లాల్ చంద్ రాజ్ పుత్ లు దరఖాస్తు చేసుకున్నారు. జులై 10 న సలహాదారుల కమిటి ఇంటర్వ్యూలు చేయనుంది. ఆరోజే ఈ కోచ్ పదవి సందిగ్ద వీడనుంది. -
జాతీయ స్థాయి టెన్నిస్ పోటీలు
భీమవరం: క్లబ్లంటే కేవలం ప్లేయింగ్ కార్డ్స్ ఆడుకునే ప్రదేశమనే అపోహ ప్రజల్లో ఉందని అయితే భీమవరం కాస్మో పాటిలిన్ క్లబ్లో నిర్వహిస్తున్న క్రీడలు, సామాజిక సేవాకార్యక్రమాలు అలాంటి అపోహలు తొలగిస్తున్నాయని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) నండూరి సాంబశివరావు అన్నారు. భీమవరం కాస్మోక్లబ్ ఆధ్వర్యంలో కాస్మోపాలిటన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆదివారం అల్లూరి రవితేజ మెమోరియల్ నేషనల్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భీమవరం క్లబ్‌లలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమన్నారు. ప్రముఖులను కలుసుకుని సరికొత్త ఆలోచనలు పంచుకోడానికి, సేద తీరడానికి క్లబ్‌లు వేదికగా ఉపయోగపడతాయన్నారు. భీమవరం పట్టణానికి దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు రావడానికి ఇక్కడ నిర్వహిస్తున్న కార్యక్రమాలే కారణమని సాంబశివరావు పేర్కొన్నారు. ఎంపీ గోకరాజు గంగరాజు మాట్లాడుతూ భీమవరం లాంటి చిన్న పట్టణంలో జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు) మాట్లాడుతూ కాస్మోక్లబ్లో నిర్వహిస్తున్న పలు ప్రజాహిత కార్యక్రమాలు ఆదర్శనీయమని కొనియాడారు. కార్యక్రమంలో ఎస్పీ భాస్కర్ భూషన్, క్లబ్ గౌరవాధ్యక్షుడు యు.కృష్ణప్రసాద్, అల్లూరి పద్మనాభరాజు, కార్యదర్శి తటవర్తి కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. సాంబశివరావుకు సత్కారం డీజీపీ సాంబశివరావును గజమాల, దుశ్శాలువాతో సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. అనంతరం టెన్నిస్ కోర్టులో క్రీడాకారులను పరిచయం చేసుకున్న సాంబశివరావు బెలూన్లు వదిలి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాస్మోక్లబ్ వేదికపై ఉద్దరాజు ధర్మరాజు, అల్లూరి రవితేజ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. హోరాహోరీగా క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు భీమవరం: భీమవరం కాస్మోక్లబ్ ఆధ్వర్యంలో కాస్మో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహిస్తున్న అల్లూరి రవితేజ మెమోరియల్ నేషనల్ ర్యాకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లు ఆదివారం హోరాహోరీగా సాగాయి. మహిళల ఫైనల్ రౌండ్లో సారా యాదవ్ (మధ్యప్రదేశ్), సృష్టిదాస్ (మహారాష్ట్ర)పై 6–4, 6–4 స్కోరుతో విజయం సాధించగా, అద్రిజా బిస్వాస్ (వెస్ ్టబెంగాల్) ప్రగతి ప్రసాద్ (కర్నాటక)పై 6–0, 6–1, ఆనంద్ అల్మాస్ (ఒడిశా) ఎస్.ప్రవీణ (తమిళనాడు)పై 6–2, 6–4, ఆర్.ప్రియాంక (మధ్యప్రదేశ్) గొట్టిపాటి శ్రీలక్ష్మి (కర్నాటక)పై 6–0, 6–2, అక్షయ సురేష్ (తమిళనాడు) రేష్న గణపతి (తమిళనాడు)పై 6–2, 6–0, అవిష్క గుప్త (జార్ఖండ్), ఎన్.పూర్వారెడ్డి (తెలంగాణ)పై 6–0, 6–2, తటవర్తి శ్రేయ (ఏపీ) ఎస్.సమీరపై 6–0, 6–0, షేక్ హుమేరా (తెలంగాణ) రెహానా తస్కీన్ (తెలంగాణ)పై 6–0, 6–0 తేడాతో విజయం సాధించారు. పురుషుల విభాగం ఫైనల్ రౌండ్లో పి.జయేష్ (మహారాష్ట్ర), ఎస్.దుర్గ (తెలంగాణ)పై 7–5, 6–4 తేడాతో విజయం సాధించగా, షేక్ ఓస్మా (ఏపీ) రాజేంద్రప్రసాద్రాయ్ (ఉత్తరప్రసాద్)పై 6–4, 6–1 తేడాతో, త్యేజో ఓజెస్ (తమిళనాడు) అంకం కృష్ణతేజ (తెలంగాణ)పై 4–6, 7–5, 6–4 తేడాతో, చిలకలపూడి తరుణ్ (ఏపీ) ఓజెస్ రాతే (హరియాణ)పై 6–2, 6–0 తేడాతో, చిన్మయ్ ప్రధా¯ŒS (ఒడిశా) యాష్వర్దన్(హరియాణ)పై 6–4, 6–2 తేడాతో, గంటా సాయికార్తీక్ (తెలంగాణ) ఒమిందర్ బాయ్సోయా (హరియాణ)పై 6–3, 6–4 తేడాతో, ఇషాన్ హుస్సేన్ (తమిళనాడు) అజయ్ పృథ్వీ (తెలంగాణ)పై 6–4, 7–5 తేడాతో విజయం సాధించారు. -
జేఎన్టీయూ-కే ఖోఖో బాలికల జట్టు ఎంపిక
గుడ్లవల్లేరు(గుడివాడ): కాకినాడ జేఎన్టీయూ ఖోఖో బాలికల జట్టును మంగళవారం గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్లో ఎంపిక చేశారు. ఎనిమిది జిల్లాల్లోని అనుబంధ కళాశాలల నుంచి 70 మంది క్రీడాకారిణులు పాల్గొన్నారు. జేఎన్టీయూ-కె జట్టుకు కె.పూర్ణ, ఎస్.తులసి (దువ్వాడ విజ్ఞాన్ ఇంజినీరింగ్), సీహెచ్ నవ్యశ్రీ,, కె.బాలనాగమ్మ (కోరంగి కైట్), టి.పండు (నూజివీడు సారధి), ఎం.శ్రీదేవి, ఇ.ప్రియాంక (సూరంపాలెం ప్రగతి), పి.మౌనిక, పి.లహరి (చీరాల ఇంజినీరింగ్), ఆర్.సాయిలక్ష్మి ప్రసన్న (నున్న వికాస్), ఎల్.భార్గవి(విజయనగరం జేఎన్టీయూ), ఎ.కీర్తి, జి.నాగబిందు (గుడ్లవల్లేరు ఇంజినీరింగ్), ఎం.జ్యోతి (బూడంపాడు సెయింట్ మేరీస్), ఎల్.పుష్పలత (నర్సరావుపేట తిరుమల ఇంజినీరింగ్), ఎ.మాధురి(గుంటూరు ఎన్నారై) ఎంపికయ్యారని ప్రోగ్రామ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం.శివశంకర్ తెలిపారు. ఈ జట్టుకు ఈ నెల 31వ తేదీ వరకు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లోనే శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే నెల 2వ తేదీ నుంచి 6 వరకు తమిళనాడులోని కాంచీపురం సమీపంలోని చిట్టినాడు అకాడమీలో జరిగే దక్షిణ భారత అంతర విశ్వవిద్యాలయాల ఖోఖో బాలికల పోటీల్లో ఈ జట్టు పాల్గొంటుందని చెప్పారు. కార్యక్రమంలో కాకినాడ జేఎన్టీయూ యూనివర్సిటీ డీన్ డాక్టర్ జీవీఎన్ ప్రసాద్, అబ్జర్వర్ డాక్టర్ బీపీ రాజు, సెలక్షన్ కమిటీ మెంబర్స్ కె.వెంకట్రావు (విజయవాడ), ఎన్.ఆదినారాయణ (కాకినాడ), కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.నాగేశ్వరరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రవీంద్రబాబు, పీడీలు దేశపతి, లావణ్య, శ్రీనివాస్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా..
రెండో రోజుకు చేరిన ప్రీమియర్ కబడ్డీ పోటీలు కలవరపడిన చీతాస్..సమన్వయంతో గెలిచిన స్టాలియన్స్ దూకుడుతో ‘బుల్స్’ విజయం.. గ్లాడియేటర్స్ గందరగోళం వరంగల్ స్పోర్ట్స్ : గ్రామీణ క్రీడ కబడ్డీకి ఆదరణ కల్పించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ప్రీమియర్ కబడ్డీ మ్యాచ్‌లకు జిల్లాలో ప్రజలు, క్రీడాభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అభిమానుల కేరింతలతో క్రీడాకారులు రెట్టింపు ఉత్సాహంతో పోటీల్లో పాల్గొంటున్నారు. స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న తెలంగాణ కబడ్డీ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లు ఆదివారం రెండో రోజు ఉల్లాసంగా జరిగాయి. క్రీడాకారులు పోటాపోటీగా తలప డి పాయింట్లు సాధించారు. కార్యక్రమంలో చింతల స్పోర్ట్స్ ఎండీ రెడ్డి, కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగదీష్‌యాదవ్, జిల్లా అధ్యక్షుడు సారంగపాణి, కార్యదర్శి ఎండీ అజీజ్‌ఖాన్, వరంగల్ రూరల్ డీవైఎస్ఓ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. హోరాహోరీగా ఖమ్మం చీతాస్– సిద్దిపేట స్టాలియన్స్.. రెండో రోజు మొదటగా ఖమ్మం చీతాస్ వర్సెస్ సిద్దిపేట స్టాలియన్స్ జట్లు తలపడ్డాయి. తొలుత రైడింగ్ వెళ్లిన ఖమ్మం క్రీడాకారులు మొదటి పది నిమిషాలు చాకచక్యంగా ఆడి లీడింగ్ పాయింట్లతో సిద్దిపేట స్టాలియన్స్‌కు చెమటలు పట్టించారు. అయితే చీతాస్‌లో లీడర్షిప్ లోపించడంతో ప్రత్యర్థులకు పాయింట్లు సునాయసంగా ప్రారం భించారు. ఈ మేరకు సిద్దిపేట స్టాలియన్స్ రెట్టింపు ఉత్సాహంతో హాఫ్ టైం అయ్యే సరికి 16 పాయింట్లు సాధిం చగా.. చీతాస్ 9 పాయింట్ల వద్ద డీలాపడింది. తిరిగి ఆట మొదలయ్యాక అదే ఉత్సాహంతో సిద్దిపేట స్టాలియన్స్ 33–21తో ఖమ్మం చీతాస్పై 12 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. కాగా, సిద్దిపేట స్టాలియన్స్ జట్టులో క్రీడాకారుడు చోగల్ అత్యుత్సాహం ప్రదర్శించడంతో రెఫరీలు గ్రీన్‌కార్డుతో హెచ్చరించారు. దీంతో ఆయన వెనక్కి తగ్గాడు. అనంతరం బెస్ట్ రైడర్‌గా పవన్, బెస్ట్ డిఫెండర్‌గా సుప్రియోకు చింతల స్పోర్ట్స్ చెరో రూ. 5వేల నగదు అందజేసింది. హైదరాబాద్ బుల్స్ దూకుడు.. రెండో మ్యాచ్‌లో హైదరాబాద్ బుల్స్ వర్సెస్ గద్వాల గ్లాడియేటర్స్ జట్లు తలపడ్డాయి. ఈ రెండు టీంలకు చెందిన క్రీడాకారులు మొదటి నుంచి నువ్వా.. నేనా అన్నట్లు దూకుడు ప్రదర్శించినప్పటికీ బుల్స్ ముందు గ్లాడియేటర్స్ చతికలబడక తప్పలేదు. హాఫ్‌టైం అయ్యేసరికి ఒక్క పాయింట్ తేడాతో హైదరాబాద్– గద్వాల జట్ల మధ్య 13–12 పాయింట్లు ఉన్నప్పటికీ తిరిగి ఆట మొదలయ్యాక బుల్స్ సమన్వయం దూకుడు ప్రదర్శించి గ్లాడియేటర్స్‌కు అందనంత దూరంగా 40–22 పాయింట్ల సాధించి గ్లాడియేటర్స్‌పై 20 పాయింట్ల అత్యధిక స్కోరుతో విజయం సాధించింది. ఇందులో బెస్ట్ రైడర్‌గా విష్ణుకు చింతల స్పోర్ట్స్ నుంచి రూ. 5వేలు, బెస్ట్ డిఫెండర్ గా అనుజ్ రూ. 5వేల నగదు అందజేశారు. -
క్రీడలతో కీర్తి ప్రతిష్టలు
- ఐఆర్ఎఈఫ్ అధినేత బిషప్ డాక్టర్ ఇమ్మానియేలురెబ్బా రేపల్లె : క్రీడలతో దేశ కీర్తి ప్రతిష్టలు పెంపొందించేందుకు కృషిచేస్తున్నట్లు ఐఆర్ఈఎఫ్ అధినేత బిషప్ డాక్టర్ ఇమ్మానియేలురెబ్బా చెప్పారు. తహసీల్దార్ కార్యాలయ సమీపంలో యార్లగడ్డ శ్రీకృష్ణ మోహనరావు (వైఎస్‌కే) జ్ఞాపకార్థం లయన్స్ క్లబ్ ఆఫ్ గుంటూరు ఎలైట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ క్రీడా పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. క్రీడల్లో రాణించిన వారికి ఎప్పుడూ మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పారు. ఎస్టీయు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కోడే గేరీశంకర్ మాట్లాడుతూ సింధు, సైనా నెహ్వాల్, శ్రీకాంత్ వంటి క్రీడాకారులను ఎంతో సాధన చేస్తే ఈ రోజు ఉన్నత స్థాయికి ఎదిగారన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గుంటూరు ఎలైట్ అధ్యక్షుడు దాసరి శివప్రసాద్, జనసేన నియోజకవర్గ సెక్రటరీ నల్లూరి వాసుదేవ్, లయన్స్‌క్లబ్ జిల్లా పీఆర్వో కే.విజయ్‌చంద్, క్లబ్ క్యాబినెట్ కే.నగేష్, ఎన్ఏయుపి స్కూలు మేనేజర్ దాసరి బాబూరావు, లయన్స్‌క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ దాసరి స్వతంత్రప్రసాద్, సీపీఐ ఏరియా కార్యదర్శి కన్నెగంటి రమేష్, కమిటీ మెంబర్లు కిషోర్, కే.శ్రీనివాసరాజు, తదితరులు పాల్గొన్నారు. విజేతలు వీరే... ఆంధ్రప్రదేశ్ సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ క్రీడా పోటీలలో పురుషుల విభాగంలో మీడియా విజన్(వైజాగ్) ప్రథమస్థానంలో నిలవగా, ఆదికవి నన్నయ్య యూనివర్శిటి(రాజమండ్రి) టీమ్ ద్వితీయస్తానంలో నిలిచింది. అదేవిధంగా రేపల్లె వైఎస్‌కే మోమోరియల్ టీమ్, నూజువీడు టీమ్‌లు తృతీయ, చతుర్ధస్థానాలలో నిలిచాయి. మహిళల విభాగంలో విశాఖపట్నం టీమ్ ప్రధమస్థానంలో నిలవగా, మచిలీపట్నం టీమ్ ద్వితీయస్థానంలో, బిక్కవోలు టీమ్ తృతీయస్థానంలో, రేపల్లె ఆర్సీ కళాశాల నాల్గవస్థానంలో నిలిచాయి. పురుషులు బెస్ట్ప్లేయర్స్గా వి.శ్యామ్(వైజాగ్), సిహెచ్ విజయ్(ఆదికవి నన్నయ్య యూనివర్శిటి టీమ్), ఎం.సురేష్(నూజివీడు), ఎ.నీలాద్రి(రేపల్లె), ఎం.కన్నా (మచిలీపట్నం)లు నిలవగా, మహిళల విభాగంలో బెస్ట్ ప్లేయర్స్‌గా బి.రేవతి(బిక్కవోలు), డి.వాణి (ఆచార్య నాగార్జున యూనివర్శిటి టీమ్), టి.చాందిని(రేపల్లె ఆర్సీ కళాశాల) నిలిచారు. టోర్నమెంట్ ఆఫ్ బెస్ట్ ప్లేయర్‌గా కే.శ్రావణి(వైజాగ్) నిలిచింది. వీరిని పలువురు అభినందించారు. -
8న సీనియర్ హాకీ క్రీడాకారుల ఎంపిక పోటీలు
కర్నూలు (టౌన్): ఈ నెల 8 వ తేదీన జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాలలోని స్థానిక ఎస్పీజీ హైస్కూలు మైదానంలో సీనియర్ హాకీ క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి డి. సుధీర్ గురువారం ప్రకటనలో తెలిపారు. 16 సంవత్సరాలు దాటి, ఆసక్తి కలిగిన క్రీడకారులు రూ. 10 ప్రవేశ రుసుంతో ఈ పోటీలలో పాల్గొనవచ్చని తెలిపారు. ఎంపికైన జిల్లా హాకీ సీనియర్ జట్టు ఈనెల 26 నుంచి 29 వరకు విశాఖపట్నంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లాల హాకీ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. -
అంతర్ రాష్ట్ర పోటీలకు క్రీడాకారుల ఎంపిక
అనంతపురం టౌన్ : కర్ణాటక రాష్ట్రం బెల్గాంలో శుక్రవారం నుంచి 8వ తేదీ వరకు నిర్వహించే అంతర్ రాష్ట్ర సౌత్‌జోన్ వింటర్ అక్వాటిక్ చాంపియన్‌షిప్ పోటీలకు జిల్లా క్రీడాకారులు ఎంపికైనట్లు జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు రవిశేఖర్‌రెడ్డి, కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. బాలుర విభాగంలో రాము, మణిదీప్, కుషిధర్రెడ్డి, బాలికల విభాగంలో శ్రేయ, నియతి, నాగవైష్ణవి, శ్రీహర్షిత ఎంపికయ్యారు. వీరు ఇటీవల కాకినాడలో జరిగిన అంతర్ జిల్లా వింటర్ అక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించి సౌత్‌జోన్‌కు ఎంపికైనట్లు పేర్కొన్నారు. -
పద పదవే వయ్యారి గాలిపటమా..
ఓరుగల్లులో పతంగుల విహారం మొదటిసారిగా ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ హన్మకొండ ఆర్ట్స్ కళాశాల వేదికగా ఈనెల 17న సంబురాలు ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేందుకు సరికొత్త ఆట వీక్షకుల కోసం స్టాళ్లు, ఫుడ్ కోర్టుల ఏర్పాటు హాజరుకానున్న30 దేశాల ప్రతినిధులు హన్మకొండ : ఆకాశంలో రివ్వు రివ్వున ఎగురుతూ.. వివిధ రకాల రంగులతో ఊయలూగుతూ.. చిన్నారులు, యువకులతో కేరింతలు కొట్టించే పతంగుల పండుగ సంబురాలకు వరంగల్ నగరం వేదిక కానుంది. ఆకర్షణీయమైన ఆకృతులతో నింగిలోకి ఎగిరే గాలిపటాలు ప్రజలను కనువిందు చేయనున్నాయి. ఈ మేరకు మహానగరంలో ఈనెల 17న ఆంతర్జాతీయ పతంగుల పం డుగను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచ పర్యాటకుల దృష్టిని వరంగల్ జిల్లా వైపునకు మరలించేందుకు ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇంటర్ నేషనల్ కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లో ఈనెల 14, 15 తేదీల్లో, యాదాద్రి భువనగిరి జిల్లాలో 16న, వరంగల్‌లో 17న ఉత్సవాలను నిర్వహించేందుకు సిద్ధమైంది. వరంగల్ కేంద్రంగా నిర్వహిస్తున్న సంబురాల ఏర్పాట్లపై జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు హన్మకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో వేడఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. 30 దేశాల నుంచి క్రీడాకారులు.. అంతర్జాతీయ పతంగుల పండుగలో 30 దేశాల నుంచి ఔత్సాహిక క్రీడాకారులు పాల్గొననున్నారు. వీరితో పాటు మన రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన వారు కూడా హాజరుకానున్నారు. సంబురాల్లో భాగంగా ఈనెల 17వ తేదీన ఉదయం ఖిలా వరంగల్‌లో హెరిటేజ్ వాక్ నిర్వహిస్తారు. అనంతరం అల్ఫాహారం చేసి ఆర్ట్స్ కళాశాలకు చేరుకుని పతంగులను ఎగురవేస్తారు. కాగా, గాలిపటాల ఆటను నిర్వహిస్తున్న చోట క్రాఫ్ట్‌బజార్, ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. వీటి నిర్వహణకు ప్రత్యేకంగా స్టాళ్లను కూడా అందుబాటులో ఉంచనున్నారు. అలాగే వరంగల్ జర్రీస్, పెంబర్తి కళా ఖండాలు, చేర్యాల నకాషీ చిత్రాలు, హస్త కళలు, చేనేత ఉత్పత్తులను స్టాళ్లలో పెట్టనున్నారు. వీటితో పాటు పండుగను వీక్షించేందుకు వచ్చే ప్రజల కోసం ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. టూరిజం ప్రమోషన్లో భాగంగా అంతర్జాతీయ పతంగుల పండుగను ఇక్కడ నిర్వహిస్తుండడంతో జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పర్యాటక రంగాన్ని పరిచయం చేసేందుకే.. పాత వరంగల్ జిల్లాలోని పర్యాటక రంగాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాం. అంతర్జాతీయస్థాయి పతంగుల సంబురాల్లో విదేశాల్లోని ఔత్సాహిక క్రీడాకారులు ఈనెల 16న హన్మకొండకు చేరుకుంటారు. 17న ఉదయం వారితో పాటు తెలంగాణలో ఆసక్తి కలిగిన క్రీడాకారులు పతంగుల పోటీలో పాల్గొంటారు. వీక్షకుల కోసం క్రాఫ్ట్‌బజార్, ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నాం. – శివాజీ, జిల్లా పర్యాటక అధికారి -
హోరాహోరీగా క్రీడా పోటీలు
సూరేపల్లి (భట్టిప్రోలు): గుంటూరు జిల్లా సెకండరీ స్కూల్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాపట్ల డివిజన్ బాలికల ఆటల పోటీలు భట్టిప్రోలు మండలంలోని సూరేపల్లి వీపీ అండ్ జీఎస్ఎం హైస్కూల్లో హోరాహోరీగా కొనసాగుతున్నాయి. క్రీడాకారులు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. బాపట్ల డివిజన్ పరిధిలోని నగరం, కాకుమాను, చెరుకుపల్లి, కర్లపాలెం, నిజాంపట్నం, పిట్టలవానిపాలెం, పొన్నూరు, బాపట్ల, భట్టిప్రోలు, రేపల్లె మండలాల పరిధిలోని హైస్కూళ్ళకు చెందిన బాలికలు పోటీల్లో పాల్గొన్నారు. క»బడ్డీ, వాలీబాల్, ఖోఖో, టెన్నికాయిట్ పోటీలు సీనియర్స్, జూనియర్స్ విభాగాలలో నిర్వహించారు. ఇన్ఛార్జ్ ఎంఈవో గల్లా మధుసూదనకుమార్, హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు ఆర్.రామకృష్ణ, జోనల్ కార్యదర్శి జీవీఎస్ నాగేశ్వరరావు, మండల స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ గార్యాల వెంకటేశ్వరరావు, పాఠశాలల పీఈటీలు పోటీలను పర్యవేక్షించారు. పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల మండలాల విద్యార్థులు, ఉపాధ్యాయులు విచ్చేశారు. ఆదివారం క్రీడల ముగింపు, బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం జరుగనున్నది. క్రీడాకారులకు, పీఈటీలకు వేమవరం, సూరేపల్లి గ్రామాలకు చెందిన తాడేపల్లి వెంకటశివ సుబ్రహ్మణ్యం(హోస్టన్ టెక్సాస్–యూఎస్ఏ) కుటుంబసభ్యులు భోజన సదుపాయాన్ని, క్రీడాకారులకు షీల్డులు, జ్ఞాపికలను తాడేపల్లి లోహిత్ భార్గవ, అల్పాహారాన్ని వల్లూరి బాబు ఏర్పాటు చేశారు. -
జాతీయ రెజ్లింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారులు
గంటూరు స్పోర్ట్స్ : విశాఖపట్నంలో ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించిన రాష్ట్ర స్థాయి జూనియర్ రెజ్లింగ్ పోటీలలో జిల్లా రెజ్లింగ్ జట్టు ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించిందని రెజ్లింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జి.భూషణం, కోశాధికారి పి.ఆనంద కుమార్ సోమవారం తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలలో కారంపూడి గురుకుల పాఠశాలకు చెందిన బి.నరేంద్ర, నర్సరావుపేట ఎస్ఎస్ఎన్ కళాశాలకు చెందిన ఎన్.పెదరాయుడు, సత్తెనపల్లి›ఎస్వి డిగ్రీ కళాశాలకు చెందిన కె.అనిల్ అత్యంత ప్రతిభ కనబర్చి బంగారు పతకాలు సాధించి, జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపికయ్యారని చెప్పారు. వీరితో పాటు వై.రత్నకుమార్, ఎన్.శివ, సి.హెచ్ రాజు, కె.ప్రసాద్ బాబు కాంస్య పతకాలు సాధించారన్నారు. మహిళల విభాగంలో బి.సం««ధ్య రజత, కె.వెంకట రమణ, పి.శిరీష కాంస్య పతకాలు సాధించారని పేర్కొన్నారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు జనవరిలో బీహర్ రాష్ట్రంలోని పాట్నాలో జరిగే జాతీయ పోటీలలో పాల్గొంటారన్నారు. -
క్రీడాకారిణులకు అభినందన
ఇంటర్ బోర్డు ఆర్ఐవో కె.వి.కోటేశ్వరరావు గుంటూరు స్పోర్ట్స్: చదువుకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఆటలకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని ఇంటర్ బోర్డు ఆర్ఐవో కె.వి.కోటేశ్వరరావు విద్యార్థినులకు సూచించారు. గుంటూరు ప్రభుత్వ జూనియర్ కళాలలో మూడు రోజులుగా నిర్వహించిన జిల్లా జూనియర్ కళాశాలల విద్యార్థినుల క్రీడా పోటీల శనివారం ముగిశాయి. కళాశాల ప్రాంగంణంలో జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్ఐవో కోటేశ్వరరావు విజేతలకు బహుమతులు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు, ఓటములు సమానంగా స్వీకరించే గుణం విద్యార్థినులకు జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు, వ్యక్తిత్వ వికాసాభివృద్ధికి క్రీడలు దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్్స టి.శారద, ఉదయభాస్కర్, ఎం.ఎ హకీమ్, ఎం.సంజీవరెడ్డి, జుబేర్, బి.వి.సుబ్బారెడ్డి, వై పెద్దబ్బాయి, టి.భాగ్యశ్రీ, పూర్ణనందం, పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు. -
కరాటేలో సత్తాచాటిన క్రీడాకారులు
నిడదవోలు :ఈ నెల 6న రాజస్థాన్‌లోని జైపూర్‌లో నిర్వహించిన జాతీయస్థాయి కరాటే పోటీల్లో నిడదవోలుకు చెందిన ఎస్కే సలీం, ఎం.జావేద్ రెహమాన్ ఖురేషి రాష్ట్రం తరఫున పాల్గొని వెండి పతకాలు సా«ధించారు. ఈ విషయాన్ని ఆంధ్రరాష్ట్ర జట్టు మేనేజర్ ఎంవీఆర్ రాజు శుక్రవారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గుజోరియో కరాటే అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు సత్తి వేణుమాధవరెడ్డి, గౌరవాధ్యక్షుడు బండి రాంబాబు, రోటరీ క్లబ్ అధ్యక్షుడు కేదారిశెట్టి రవికుమార్ క్రీడాకారులను అభినందించారు. -
క్రీడల్
- పీఈటీలు లేరు.. మైదానాలు కానరావు - టోర్నమెంట్ల స్థానంలో సెలక్షన్లు - చర్యలు తీసుకోని విద్యాశాఖ పాపన్నపేట: మానసిక ఆరోగ్యానికి పుస్తక పఠనం, శారీరక ఆరోగ్యానికి క్రీడలు అవసరం. అరుుతే నేటి విద్యావిధానంలో క్రీడలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వడంలేదనేది విద్యావేత్తల అభిప్రాయం. విద్యార్థి మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువుపై దృష్టి కేంద్రీకరించగలుగుతాడని పలు పరిశోధనలు కూడా రుజువు చేశారుు. క్రీడలు దేహధారుడ్యానికే కాకుండా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, స్వీయనియంత్రణ, సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవడం అలవడుతుందని క్రీడానిపుణుల విశ్లేషణ. క్రీడలు లేకపోతే విద్యార్థి దశ నుంచే మానసిక ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకు తగిన విధంగా ప్రభుత్వాలు స్పందించాల్సి ఉంది. పాపన్నపేట మండలంలో 10 ఉన్నత పాఠశాలలు, 9 ప్రాథమిక ఉన్నత, 42 ప్రాథమిక పాఠశాలలున్నారుు. అరుుతే పొడిచన్పల్లి ఉన్నత పాఠశాల, గాంధారిపల్లి, నాగ్సన్పల్లి పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులు (పిఈటీలు) లేరు. ఇక కొత్తపల్లి పాఠశాలలో మైదాన సౌకర్యం ఉన్నా పిఈటీ లేడు. అలాగే యూసఫ్పేట, చీకోడ్లింగాయపల్లి, కేజీవీబీ పాఠశాలల్లో పిఈటీలు ఉన్నా ఆటలు ఆడేందుకు చాలినంత మైదానం లేదు. కొడుపాక పాఠశాలలో పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్‌తో నెట్టుకొస్తున్నారు. ఉన్నత పాఠశాలల తీరు ఇలాఉంటే ప్రాథమికోన్నత పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులు లేరు. అలాగే 90 శాతం మైదానాలు లేవు. నిధుల లేమితో క్రీడా సామగ్రిని కొనుగోలు చేయడంలేదని తెలుస్తోంది. ఆర్‌ఎంఎస్‌ఏ కింద వచ్చిన రూ.50 వేలల్లో సుమారు 5 నుంచి 7 వేల వరకు క్రీడల కోసం కేటారుుస్తున్నట్లు పిఈటీలు తెలిపారు. ఈ కేటారుుంపులు ఆగస్టు 15, జనవరి 26 జెండా పండుగలకే సరిపోతాయని చెబుతున్నారు. పాఠశాలల్లో ప్రతి తరగతికి ఆటల పీరియడ్లు ఉండాలన్న నిబంధనలు ఉన్నప్పటికీ ఆటను విస్మరిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. టోర్నమెంట్ల నిర్వహణపై శీతకన్ను గతంలో ఏటా మండల, తాలుకా స్థారుు టోర్నమెంట్లు నిర్వహించేవారు. ఇటీవల కాలంలో అవి కనుమరుగయ్యారుు. కేవలం పైకా పేరిట క్రీడాకారుల ఎంపికలు జరుగుతున్నారుు. క్రీడాకారుల నైపుణ్యాలపై అంచనా సాధ్యం కావడం లేదని తెలుస్తోంది. దీంతో ఆశించిన స్థారుులో క్రీడాకారులు తయారు కావడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నారుు. క్రీడలకు ప్రాధాన్యంఇవ్వడంలేదు క్రీడలపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు తగిన ప్రోత్సాహం అందించాలి. ప్రస్తుతం క్రీడలకు తగినంత ప్రాధాన్యం ఇవ్వడంలేదు. అన్ని పాఠశాలల్లో క్రీడలకు పీరియడ్ కేటారుుంచాలి.అలాగే క్రీడా సామగ్రిని అందుబాటు ఉంచాలి. - శ్రీకాంత్, టీటీఆర్ఎస్, నర్సాపూర్ -
పట్టుదలతోనే పతకాల సాధన
గుంటూరు స్పోర్ట్స్: పట్టుదల, క్రమశిక్షణతో రాణిస్తే విజయాలు సొంతం చేసుకోవచ్చని ఆర్వీఆర్ కాలేజీ ఆధ్యాపకులు కొల్లా శ్రీనివాసరావు అన్నారు. స్థానిక ఏసీ కళాశాల ఎదురు గల ఉల్ఫ్ హాలులోని ఆంధ్ర క్రిస్టియన్ కళాశాల చిన్నారులకు టెన్నిస్ సెంటర్లో శనివారం టాలెంట్ కప్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించారు. ముఖ్యఅతిధిగా హాజరైన శ్రీనివాసరావు విజేతలకు పతకాలు బహూకరించారు. అనంతరం మాట్లాడుతూ టోర్నమెంట్లు క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు దోహదపడుతాయన్నారు. టెన్నిస్ సెంటర్ కోచ్ ఎం.ఇజ్రాయిల్ మాట్లాడుతూ క్రీడలపై చిన్నారుల్లో ఆసక్తి కల్గించేందుకు టోర్నమెంట్లు నిర్వహించి ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వై.షేక్, సీనియర్ క్రీడాకారుడు జోయల్, అస్టింట్ కోచ్‌లు జయకర్, గోపి, సురేంద్ర, క్రీడాకారులు మనోహర్, చేతన్, రామ్‌చరణ్, చేతన్ ప్రాఖ్యత్ రెడ్డి, షేక్ చిష్టి, కొల్లా గోష్ప«ద్నాథ్, విహర్, జితేంద్ర నాగసాయి, తదితరులు పాల్గొన్నారు. -
నిరంతర సాధనతో విజయం తథ్యం
పెదపూడి : రాష్ట్ర స్థాయిలో జిల్లా క్రీడాకారుల సత్తా చాటడానికి నిరంతరం సాధన చేసి, విజయ సాధించాలని జిల్లా వాలీబాల్ అసోసియేష¯ŒS కార్యదర్శి వై.బంగార్రాజు సూచించారు. శనివారం స్థానిక గాంధీ మెమోరియల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఐదు రోజుల పాటు నిర్వహించిన అండర్–18 బాలుర వాలీబాల్ జిల్లా క్రీడాకారుల శిక్షణ ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే నెల రెండున కడపలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో వీరు పాల్గొంటారన్నారు. మంచి శిక్షణ నిచ్చి ప్రోత్సహించిన పీఈటీ ఎం.వెంకన్న చౌదరిని క్రీడాకారులు ఘనంగా సత్కరించారు. కోచ్ మణిరాజు, పెదపూడి సొసైటీ అధ్యక్షుడు పుట్టా గంగాధర చౌదరి గ్రామ పెద్దలు, పూర్వ విద్యార్థులు, గ్రౌండ్ యూత్ సభ్యులు గుణ్ణం శ్రీను, పట్టాభి, అప్పసాని శ్రీను, ఆర్.రాజు, తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపిక
సత్తెనపల్లి: రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు పట్టణంలోని సుగాలీ కాలనీ జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. గత ఆదివారం స్థానిక ఆర్సీఎం పాఠశాలల్లో నిర్వహించిన జిల్లా స్థాయి సాఫ్ట్‌బాల్ అండర్– 14, అండర్–17 బాలబాలికల ఆటల పోటీల్లో సుగాలీ కాలనీ జెడ్పీ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు వీరు గుంటూరు జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహించనున్నారు. కె.రమ్య (హాకీ), షేక్ ఆయేషా సుంతాన్ (సాఫ్ట్‌బాల్), జి.అంజలిబాయి (హాకీ), ఎస్.ప్రవల్లిక బాయి(సాఫ్ట్‌బాల్), ఎం.గోపీ (సాఫ్ట్‌బాల్), ఒ.ఆశోక్ (సాఫ్ట్‌బాల్), ఎస్.భువనేశ్వరిభాయ్ (హాకీ), ఎం.కోమలి (ఫుట్‌బాల్), ఒ.త్రివేణి (ఫుట్‌బాల్), ఎ.శ్రీనివాస్ (ఫుట్‌బాల్), షేక్ఆరీఫ్ (ఫుట్‌బాల్, స్టాండ్‌బై), పి.హుస్సేన్ (ఫుట్‌బాల్, స్టాండ్‌బై) అనే విద్యార్థులు వివిధ పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థులను మంగళవారం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆర్.వసుంధారాదేవి, పీఈటీలు ఎ.శ్రీనివాసరెడ్డి, ఎం.నరసింహారావు, ఉపాధ్యాయులు అభినందించారు. -
మైదానంలో చెమటోడుస్తున్న ధోనీ సేన!
-
135 మంది క్రీడాకారులకు ఈఎస్ఐసీలో ఉద్యోగాలు
► రాష్ట్రం నుంచి ఎంపికైన 8 మంది ఆటగాళ్లు ► నియామక పత్రాలు అందించిన కేంద్ర మంత్రి దత్తాత్రేయ సాక్షి, న్యూఢిల్లీ: క్రీడాకారులను ఒలింపిక్స్‌కు వెళ్లేలా ప్రోత్సహిస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ హామీ ఇచ్చారు. దేశ వ్యాప్తంగా వివిధ క్రీడలకు చెందిన 135 మంది ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ)లో ఉద్యోగాలు ఇస్తూ బండారు దత్తాత్రేయ వారికి నియామక పత్రాలను అందించారు. గురువారం ఇక్కడ జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణకు చెందిన 8 మంది క్రీడాకారులు కూడా ఈ పత్రాలను అందుకున్నారు. రాష్ట్రం నుంచి టేబుల్ టెన్నిస్ విభాగంలో పి. బాలదుర్గారావు, వి. శ్రీకాంత్, ఎం.నికిత, కబడ్డీ విభాగంలో నల్ల గోవర్ధనరెడ్డి, ఎం. లింగం యాదవ్, బ్యాడ్మింటన్ విభాగంలో కె.ఆదిత్య కిరణ్, పి.అరుణ్ కుమార్, ఆర్చరీ విభాగంలో జి. లక్ష్మణ్ ఎంపికయ్యారు. కేంద్ర క్రీడల శాఖ మంత్రి విజయ్ గోయల్, కేంద్ర నైపుణ్యాభివృధ్ది శాఖ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ, ఎంపీలు మనోజ్ తివారీ, మీనాక్షి లేఖి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ, క్రీడలను ప్రోత్సహించడానికి 135 మంది క్రీడాకారులకు ఉద్యోగాలు కల్పించినందుకు ఈఎస్ఐసీని అభినందించారు. ఎన్ని సార్లు ఓటమి ఎదురైనా దీక్ష, పట్టుదలతో క్రీడాకారులు విజయంకోసం కృషి చేయాలని దత్తాత్రేయ సూచించారు. క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయి పతకాలను అందుకునే విధంగా ప్రయత్నించాలని, కార్మిక మంత్రిత్వ శాఖ తగిన ప్రోత్సాహాన్ని అందిస్తుందని తెలిపారు. తాను కూడా క్రీడాకారుడినేనని, గతంలో కబడ్డీ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించానని ఆయన పాత రోజులను గుర్తు చేసుకున్నారు. క్రీడల మంత్రి విజయ్ గోయల్ మాట్లాడుతూ, ఈఎస్ఐసీ చొరవను అభినందించారు. కార్మిక శాఖను ఆదర్శంగా తీసుకుని ఇతర శాఖలు కూడా క్రీడాకారులను ప్రోత్సాహించాలని సూచించారు. -
ఫుట్‌బాల్ పోటీలు ప్రారంభం
చీరాల : జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఐఎల్టీడీ కంపెనీ క్రీడా మైదానంలో శనివారం లీగ్ కం సూపర్ లీగ్ ఫుట్‌బాల్ పోటీలు ప్రారంభించారు. జిల్లా ఫుట్‌బాల్ కోచ్ పాల్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలో ఒంగోలు, చీరాల, కందుకూరు ప్రాంతాల్లో మాత్రమే పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 10వ తేదీ వరకు పోటీలు నిర్వహిస్తామని, ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలిచిన జట్లు ఒంగోల్లో సూపర్ లీగ్ పోటీల్లో పాల్గొం టాయని తెలిపారు. సూపర్ లీగ్‌లో ఉత్తమ ఆటతీరు కనబరిచిన క్రీడాకారులను సీనియర్ నేషనల్స్‌కు రాష్ట్రం తరఫున ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కావూరి విన్సెంట్, జిల్లా సెక్రటరీ కావూరి ప్రసన్న, వైస్ ప్రెసిడెంట్ నూతలపాటి బాలశౌరి పాల్గొన్నారు. -
టెన్నిస్ క్రీడాకారులకు అభినందన
గుంటూరు స్పోర్ట్స్: చెనైలోని సవిత్రా యూనివర్సిటీలో ఈనెల 13 నుంచి జరుగనున్న సౌత్ జోన్ అంతర్ విశ్వవిద్యాలయాల టెన్నిస్ పోటీలకు ఎన్టీఆర్ స్టేడియం క్రీడాకారులు అల్లంశెట్టి క్రిష్ణ ప్రసాద్, గిరిష్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా స్టేడియంలో శనివారం జరిగిన కార్యక్రమంలో వారిని మిర్చి యార్డు చైర్మన్ అభినందించారు. అనంతరం మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాల టెన్నిస్ పోటీలలో రాణించి జిల్లా ఖ్యాతిని పెంపొందించాలన్నారు. కార్యక్రమంలో స్టేడియం కార్యదర్శి దామచర్ల శ్రీనివాసరావు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ లాల్ వజీర్, రాష్ట్ర హస్తకళల సంస్థ డైరెక్టర్ వట్టికూటి హర్షవర్థన్,టెన్నిస్ కోచ్ జి.వి.ఎస్ ప్రసాద్, స్టేడియం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
చురుకుగా బీచ్ కబడ్డీ శిక్షణ
బాపట్ల: అంతర్ జిల్లాల స్త్రీ, పురుషుల బీచ్కబడ్డీ పోటీల్లో పాల్గొనే టీంలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. స్థానిక ఆర్ట్స్ అండ్ సైన్సు కళాశాలలో కోచ్క్యాంపును బీచ్కబడ్డీ రాష్ట్ర అసోసియేషన్ ఉపాధ్యక్షులు తాతా బసవశంకరరావు ఆదివారం పరిశీలించారు. సామర్లకోటలో ఈనెల 6వ తేదీ నుంచి 9వతేదీ వరకు జరిగే 64వ అంతర జిల్లాల స్త్రీ, పురుషుల బీచ్ కబడ్డీలో గుంటూరు జిల్లాకు పతకం వచ్చే విధంగా కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. బాపట్ల ఏరియా వైద్యశాల పాలకవర్గం అధ్యక్షులు కర్పూరపు రామారావు, కబడ్డీ జిల్లా అసోసియేషన్ ప్రధానకార్యదర్శి ఊసా రాంబాబు, జంపని శ్రీరామమూర్తి తదితరులు కోచ్క్యాంపును పరిశీలించిన వారిలో ఉన్నారు. -
రైఫిల్ షూటింగ్ జిల్లా జట్ల ఎంపిక
గుంటూరు స్పోర్ట్స్: అండర్–19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాలలో బాలబాలికల జిల్లా రైఫిల్ షూటింగ్ జట్ల ఎంపిక నిర్వహించినట్లు ఫెడరేషన్ కార్యదర్శి ప్రసాద్ తెలిపారు. ఎంపికలను వ్యాయామ ఉపా«ధ్యాయుడు సంజీవరెడ్డి పర్యవేక్షించారు. బాలుర విభాగంలో హర్షవర్ధన్‌రెడ్డి, వరుణ్ అవినాష్, బాలికల విభాగంలో వై.శ్రీనిత్య, ఎం.రిషిత ఎంపికైనట్టు చెప్పారు. -
కుంగ్ ఫూలో జిల్లా క్రీడాకారుల ప్రతిభ
గుంటూరు స్పోర్ట్స్: జాతీయ స్థాయి ఉషూ కుంగ్ ఫూ పోటీలలో తమ అకాడమి క్రీడాకారులు అత్యంత ప్రతిభ కనబర్చి బంగారు పతకాలు సాధించారని ది షావలిన్ కుంగ్ ఫూ అకాడమి మాస్టర్ సి.హెచ్ మస్తాన్ చెప్పారు. జాతీయ స్థాయి కుంగ్ ఫూ పోటీలలో బంగారు పతకాలు సాధించిన బి.దినేష్, ఎస్.సాయి శాండిల్య, కె.సాయి మౌళిలను గురువార స్థానిక లాడ్జి సెంటర్లోని ఏఎల్ బీఈడీ కళాశాల ఆవరణలోఅభినందించారు. ఈ సందర్భంగా కుంగ్ ఫూ మాస్టార్ మస్తాన్ మాట్లాడుతూ సెప్టెంబర్ 24, 25 తేదీలలో గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో జరిగిన ఉషూ కుంగ్ ఫూ నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలలో రాష్ట్ర జట్టులో పాల్గొన్న వీరు బంగారు పతకాలు సాధించారని వివరించారు. విజేతలను కుంగ్ ఫూ మాస్టర్ షేక్ సంధాని, క్రీడాకారులు తదితరులు అభినందించారు. -
తైక్వాండోలో గిన్నిస్ రికార్డు అటెంప్ట్
మంగళగిరి: తైక్వాండోలో ఒకే సారి మూడు వందల మంది క్రీడాకారులతో 30 నిమిషాల పాటు నిర్విరామంగా కిక్స్, పంచెస్, బ్లాక్స్‌ను ప్రదర్శించి గిన్నిస్ బుక్ అటెంప్ట్ నిర్వహించినట్లు అభి తైక్వాండో అకాడమి మాస్టర్ చిల్లపల్లి నరేంద్రకుమార్ తెలిపారు. నాగార్జున యూనివర్సిటీ ఎదుట జెమ్స్ పబ్లిక్ స్కూలు ఆవరణలో ఆదివారం క్రీడాకారులు చేసిన ప్రదర్శనలను వీడియో తీశారు. ఆ వీడియోను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్‌కు పంపించనున్నట్లు ఆయన తెలిపారు. క్రీడాకారులను మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి అభినందించారన్నారు. -
వెయిట్‌లిఫ్టింగ్‌లో పతకాల పంట
ఏలూరు రూరల్ : రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారిణులు సత్తా చాటారు. ఈ నెల 20, 21 తేదీల్లో అనంతపురంలో నిర్వహించిన పోటీల్లో వీరు ప్రతిభ చూపారు. ఏలూరు ఈదర సుబ్బమ్మదేవి పాఠశాలకు చెందిన ఎన్.సత్యవతి 44 కే జీలు, కె.శివకుమారి 48 కేజీలు, ఎం.దీపనయోమి 53 కేజీల విభాగంలో బంగారు పతకాలు సాధించారు. మరో క్రీడాకారిణి డి.అశ్విని 58 కేజీల విభాగంలో వెండి పతకాన్ని సొంతం చేసుకుంది. బంగారు పతకాలు సాధించిన ముగ్గురు లిఫ్టర్లు జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. వచ్చేనెల 3, 4 తేదీల్లో తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న పోటీల్లో వీరు పాల్గొంటారని ఆయా పాఠశాలల హెచ్ఎంలు వి.దుర్గరమ, కె.మాధవీలత, వ్యాయామ ఉపాధ్యాయుడు పి.గోపాల్ అభినందించారు. విద్యార్థినులను వీరు అభినందించారు. -
క్రీడాకారుల క్యాంప్ ఫైర్
కరీమాబాద్ : నగరంలోని ఖిలావరంగల్ మధ్యకోటలోని ఖుష్‌మహల్ వద్ద నిర్వహిస్తున్న తెలంగాణ స్థాయి రెండో హ్యాండ్‌బాల్ పోటీలలో భాగంగా సోమవారం రాత్రి క్రీడాకారుల క్యాంప్ ఫైర్ నిర్వహించారు. ఈ సందర్భంగా పది జిల్లాల నుంచి వచ్చిన సుమారు 450 మంది క్రీడాకారులు ఆట పాటలు, నృత్యాలతో ఉత్సాహంగా గడిపారు. క్యాంప్ ఫైర్‌ను 8వ డివిజ¯ŒS కార్పొరేటర్ బైరబోయిన దామోదర్‌యాదవ్ ప్రారంభించారు. కార్యక్రమానికి హ్యాండ్‌బాల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యామల పవ¯ŒSకుమార్, విష్ణు, మీరిపెల్లి రాజు, పోశాల సురేష్, బైరబోయిన రవీందర్, గై.రమేష్, కుమారస్వామి, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. -
క్రీడాకారులు ఉన్నత శిఖరాలకు చేరాలి
తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ ఖిలా వరంగల్‌లో రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలు ప్రారంభం కరీమాబాద్ : క్రీడాకారులు తమలోని నైపుణ్యాలను చాటుకుంటూ ఉన్నత శిఖరాలకు ఎదగాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు. నగరంలోని ఖుష్‌మహల్ వద్ద ఆదివారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర రెండో హ్యాండ్‌బాల్ పోటీల ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇక్కడ క్రీడా పోటీలు నిర్వహించేందుకు పాటుపడిన రాష్ట్ర హ్యాండ్‌బాల్ అసోసియేష¯ŒS సెక్రెటరీ శ్యామల పవ¯ŒSకుమార్ అభినందనీయులన్నారు. ఈసందర్భంగా పది జిల్లాల నుంచి వచ్చిన సుమారు 400 మంది క్రీడాకారులు, అఫీషియల్స్ మార్చ్ఫాస్ట్ నిర్వహించారు. అంతకుముందు క్రీడా ప్రాంగణానికి చేరుకున్న గ్రేటర్ వరంగల్ కార్పొరేష¯ŒS మేయర్ నన్నపునేని నరేందర్ క్రీడాకారులను పరిచయం చేసుకొని, హ్యాండ్‌బాల్ పోటీలను ప్రారంభించారు. మేయర్ నరేందర్ మాట్లాడుతూ చారిత్రక ఓరుగల్లు కోటలో హ్యాండ్ బాల్ పోటీలు నిర్వహించడం సంతోషకరమన్నారు. నగరంలో శాశ్వతంగా ఆరు క్రీడా మైదానాలను ఏర్పాటు చేసి నిరంతరం క్రీడలపై శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్లాటినమ్ జూబ్లీ విద్యార్థులు ప్రదర్శించిన తెలంగాణ నృత్యరూపకం ఆకట్టుకుంది. స్థానిక కార్పొరేటర్ బైరబోయిన దామోదర్, హ్యాండ్‌బాల్ అసోసియేష¯ŒS రాష్ట్ర కార్యదర్శి పవ¯ŒSకుమార్, బండా ప్రకాష్, బైరబోయిన కైలాష్యాదవ్, సీహెచ్.ఫ్రాంక్లి¯ŒS, అలెగ్జాండర్, నాగేశ్వర్రావు, ఖాజాపాష, తోట సంపత్‌కుమార్, కార్పొరేటర్లు మేడిది రజిత, లీలావతి, కవిత, బయ్య స్వామి, బిల్ల కవిత, ఏకశిలా క్రీడా మండలి బాధ్యులు, తదితరులు పాల్గొన్నారు. వర్షంతో అంతరాయం.. కాగా, ఆదివారం సాయంత్రం హ్యాండ్‌బాల్ పోటీల నిర్వహణకు భారీ వర్షంతో ఆటంకం కలిగింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో కొంతమంది క్రీడాకారులు స్టేజీ కింద తలదాచుకున్నారు. వర్షంలో తడవకుండా ఇంకొందరు కుర్చీలను తలపై పెట్టుకున్నారు. కొంతమంది ఖుష్మహల్లోకి వెళ్లారు. క్రీడా మైదానం పూర్తిగా తడవడంతో సోమవారం హ్యాండ్‌బాల్ పోటీలు నిర్వహణపై సందేహాలు నెలకొన్నాయి. అంతకుముందు పోటీల ప్రారంభోత్సవం సందర్భంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాష్ట్రస్థాయి పోటీలకు జనరేటర్ సదుపాయాన్ని కల్పించడంపై నిర్వాహకులు దృష్టిసారిస్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడ్డారు. మహిళలకు ప్లాటినం జూబ్లీ హైస్కూల్, పురుషులకు ఆరెల్లి బుచ్చయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో వసతి కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు. -
ఉత్తమ క్రీడాకారులను తయారు చేయాలి
నల్లగొండ టూటౌన్: దేశం గర్వేపడేలా తెలంగాణ రాష్ట్రంలో క్రీడాకారులను తయారు చేయాలని టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి, టోర్నమెంట్ కన్వీనర్ దుబ్బాక నర్సింహారెడ్డి అన్నారు. స్థానిక ఏన్జీ కళాశాలలో జరిగిన మూడో తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్ పురుషులు, మహిళల సాఫ్ట్‌బాల్ పోటీల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులకు అన్ని వసతులు కల్పించి వారికి వెన్నంటి వుంటుందన్నారు. సోమవారం జరిగిన ఫైనల్ మహిళా విభాగంలో హైదరాబాద్ ప్రథమ, రంగారెడ్డి, నిజామాబాద్ తృతీయ బహుమతి సాధించాయి. అదేవిధంగా పురుషుల విభాగంలో రంగారెడ్డి ప్రథమ, హైదరాబాద్ ద్వితీయ, వరంగల్ తృతీయ బహుమతి సాధించాయి. గెలుపొందిన జట్లకు ట్రోఫీలు, వ్యాయామ ఉపాధ్యాయులకు షీల్డ్, మెమెుంటోలు అందజేశారు. కార్యక్రమంలో సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కె.శోభన్‌బాబు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.సురేష్‌రెడ్డి, ఎం.నాగిరెడ్డి, జయపాల్‌రెడ్డి, కోకన్వీనర్ కసిరెడ్డి శేఖర్‌రెడ్డి, నిర్వాహకుడు మార్త యాదగిరిరెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్. ప్రభాకర్‌రెడ్డి, ఎస్జీఎఫ్ కార్యదర్శి జె.పుల్లయ్య, ఉస్మాన్, రాజశేఖర్‌రెడ్డి, ధర్మేందర్‌రెడ్డి, శంభు, జి. శ్రీనివాస్, ఆనంద్ ఉన్నారు. -
క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ
కొండమల్లేపల్లి పట్టణానికి చెందిన బొడ్డుపల్లి శంకర్ – విజయలక్ష్మి దంపతుల ఆర్థికసాయంతో పట్టణంలోని ఉన్నత పాఠశాల క్రీడాకారులకు శుక్రవారం రూ.10 వేల విలువ చేసే క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నర్రా గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ దాతలు క్రీడాకారులకు సహకారం అందించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పీడీ భావన, ఉపాధ్యాయులు లోక్యానాయక్, పెద్దన్న, గంగాధర్, నర్సింహ, శ్రీను, విద్యార్థులు ఉన్నారు. -
ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించాలి
కోయిల్‌కొండ : తెలంగాణ ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచే క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించాలని అంతర్జాతీయ అథ్లెట్ శంకర్, అంతర్జాతీయ యోగా క్రీడాకారుడు సుందర్రాజు అన్నారు. సోమవారం వారు మండలంలోని మనికొండ ఉన్నతపాఠశాలలో ఆజాద్ యువజన సంఘం ఆధ్వర్యంలో జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆటపోటీల బహుమతుల ప్రదానోత్సవానికి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. గ్రామీణ స్థాయి నుంచి వచ్చే యువతీ, యువకులు ఎక్కువగా క్రీడల్లో రాణిస్తున్నారని వారిని ప్రభుతంతోపాటు గ్రామాల్లో ఉండే వివిధ స్వచ్ఛంద సంఘాల నాయకులు ప్రోత్సహించాలన్నారు. క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా లక్ష్యం పెట్టుకొని కషి చేయాలని అప్పుడే అనుకున్నది సాధించగలమన్నారు. అనంతరం వారిని పాఠశాల బందం ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో యోగా అసోసియేషన్ జిల్లా ప్రధానకార్యదర్శి బాలరాజు, సర్పంచ్ ఆంజనేయులు, నాయకులు గోరిసతీష్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రహమాన్, పీఈటీ నిరంజన్, రాజు, శేఖర్, మురళీ పాల్గొన్నారు. -
రేపు సబ్‌జూనియర్ అత్యపత్య ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: త్వరలో హైదరాబాద్‌లో నిర్వహించే సబ్‌జూనియర్ రాష్ట్రస్థాయి అత్యపత్య పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల ఎంపికలను నారాయణపేట మండలం జాజాపూర్‌లో ఈ నెల 31న నిర్వహించనున్నట్లు జిల్లా అత్యపత్య సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సోహైల్ ఉర్రహెమాన్, ముంతాజుద్దీన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఉదయం 10 గంటలకు రిపోర్ట్ చేయాలని, మిగతా వివరాలకు సెల్ నెం.9985313150, 9985979007 లను సంప్రదించాలని వారు కోరారు. -
జీవితమే ఒక ఆట
క్రీడారంగంలో రాణించడమే వారి లక్ష్యం. అదే వారి స్వప్నం. అహర్నిశలు శ్రమించి క్రీడా మెళకువలు నేర్చుకొని.. జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నా జిల్లా క్రీడాకారులకు గుర్తింపు దక్కడం లేదు. పతకాల పంట పండించినా.. ప్రశంసా పత్రాలు కైవసం చేసుకున్నా వారికి కించిత్తు ప్రోత్సాహం కూడా సర్కారు వైపు నుంచి లభించడం లేదు. దీంతో ఎంతోమంది ప్రతిభావంతులైన క్రీడాకారులు స్వయం ఉపాధి బాటలో పయనిస్తున్నారు. ఇంకొంతమంది వ్యవసాయ కూలీ పనులకు వెళ్తూ దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. వారి క్రీడా ప్రస్థానంపై ‘జాతీయ క్రీడా దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేక కథనం. ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం కరువు స్వయం ఉపాధి బాటలో కొందరు, కూలీ పనులకు ఇంకొందరు.. నేడు జాతీయ క్రీడా దినోత్సవం పాన్‌షాప్ నడుపుకుంటూ.. మహబూబాబాద్ : మానుకోటకు చెందిన ఆ క్రీడాకారుడి పేరు అక్తర్ పాషా. ఖోఖో మైదానంలో చిరుతలా రయ్‌మని దూసుకుపోయే వేగం ఆయనకు సొంతం. అనన్య సామాన్యమైన క్రీడా నైపుణ్యాలున్నా సర్కారు చేదోడు మాత్రం అందలేదు. దీంతో పాన్‌షాప్ నడుపుతూ స్వయం ఉపాధిని పొందుతున్నారాయన. జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో 12 సార్లు పాల్గొని ప్రతిభ కనబరిచారాయన. 1989 సంవత్సరంలో జరిగిన జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో బంగారు పతకాన్ని సాధించారు. 1993లో మధ్యప్రదేశ్‌లో జరిగిన 38వ జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. 1996లో తమిళనాడులో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో, అదే ఏడాది అక్కడే జరిగిన సీనియర్ సౌత్‌జోన్ పోటీల్లో తెలంగాణ జట్టు తరఫున పాల్గొన్ని కాంస్య పతకాన్ని చేజిక్కించుకున్నారాయన. 1995, 1996, 1997 సంవత్సరాల్లో జరిగిన అంతర్ విశ్వవిద్యాలయ స్థాయి పోటీల్లో కాకతీయ యూనివర్సిటీ జట్టు తరఫున పాల్గొన్నారు. నడక పోటీలు, లాంగ్‌జంప్‌లోనూ.. కడపలో జరిగిన 5 కిలోమీటర్ల నడక పోటీల్లో తృతీయ బహుమతిని సాధించారు అక్తర్‌పాషా. వరంగల్‌లో నిర్వహించిన 200 మీటర్ల పరుగు పందెంలో రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతిని సాధించారు. వరంగల్‌లో నిర్వహించిన లాంగ్‌జంప్ పోటీల్లో ద్వితీయ బహుమతిని కైవసం చేసుకున్నారు. డిగ్రీ (బీఏ) పూర్తి చేసిన ఆయనకు అనంతర కాలంలో క్రీడారంగంలోని ప్రతిభ ఆధారంగా ఉద్యోగ అవకాశాలు లభించలేదు. దీంతో తొర్రూరు బస్టాండ్‌లో పాన్‌షాప్ ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందుతున్నారు. ఆయన కుమారుడు అఫ్రోజ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా, కుమార్తె సమ్రీన్ 9వతరగతి చదువుతోంది. తనకు మెుండిచెయ్యి చూపిన క్రీడలపై తన పిల్లలు దృష్టిసారించకుండా ఆయన చూస్తున్నారు. చదువులపై ఎక్కువ శ్రద్ధపెట్టాలని తమ పిల్లలకు ఆయన సూచిస్తున్నారు. వ్యవసాయ పనులకు వెళ్తూ కుటుంబానికి ఆసరాగా.. కేసముద్రం : ‘క్రీడలు వద్దు.. చదువులే ముద్దు’ అని తల్లిదండ్రులు, తోటివారు స్వర్ణలతకు చెప్పారు. ఆమె ఉప్పరపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఏడోతరగతి చదువుతున్న సమయమది. ఎవరు ఎన్ని చెప్పినా.. ఆమె తనకు ఇష్టమైన క్రీడ తైక్వాండోపై ఆసక్తిని మాత్రం తగ్గించుకోలేదు. అందులో క్రీడా నైపుణ్యాలను పెంచుకుంటూ జాతీయస్థాయిలో పోటీల్లో ప్రతిభ కనబరిచేలా ఎదిగింది. అనంతర కాలంలో ఆమె ఉత్సాహాన్ని చూసి తల్లిదండ్రులు సైతం తమ ఆలోచనా ధోరణిని మార్చుకున్నారు. అప్పు చేసి మరీ డబ్బులు తెచ్చి తన కుమార్తె క్రీడా పోటీలకు వెళ్లేందుకు డబ్బులు ఇచ్చేవారు. స్వర్ణలతలోని క్రీడా స్ఫూర్తి ఓ వైపు.. కన్నబిడ్డకు చేదోడునిచ్చేందుకు అప్పులు చేసేందుకు సిద్ధమైన తల్లిదండ్రులు రాజబోయిన వెంకన్న, అరుణల ప్రోత్సాహం మరోవైపు. ఇవన్నీ వెరసి రాష్ట్ర, జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో స్వర్ణలత ఓ మెరుపై మెరిసింది. ఆమెలోని ప్రతిభను గుర్తించి కేసముద్రం విలేజ్‌లోని శ్రీవివేకవర్ధిని స్కూల్ కరస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ స్వర్ణలతను ప్రోత్సాహించారు. తన పాఠశాలలో 9,10 తరగతులను చదివించారు. ఇదే సమయంలో కేసముద్రం స్టేషన్లో తైక్వాండో క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించే వేసవి శిక్షణా శిబిరం, ప్రతి ఆదివారం నిర్వహించే శిబిరాలకు ఆమె హాజరయ్యేది. ఈ శిక్షణతో పలు పతకాలను సాధించింది. ప్రస్తుతం ఆమె వ్యవసాయ కూలీ పనులకు వెళ్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటూనే, స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. తండ్రికి ఇటీవలæనడుము నొప్పితో ఆపరేషన్ జరగడంతో ఆయన ఇంటికే పరిమితమయ్యారు. దీంతో కుటుంబ బాధ్యతను స్వర్ణలత పంచుకుంటోంది. అంతేకాకుండా ప్రతి ఆదివారం కేసముద్రం స్టేషన్ పరిధిలోని జెడ్పీఎస్‌ఎస్‌లో నిర్వహించే క్రీడా శిబిరానికి హాజరై విద్యార్థులకు తైక్వాండోపై అవగాహన కల్పిస్తోంది. ప్రైవేట్ స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా.. డోర్నకల్ : డోర్నకల్‌కు చెందిన మండలోజు సుధాకర్ దశాబ్ద కాలంగా వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ క్రీడల్లో విశేషంగా రాణిం చాడు. స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగం కోసం అనేక ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. దీంతో గార్లలోని ఓ ప్రైవేటు పాఠశాలలో అతి తక్కువ వేతనంతో వ్యాయామ ఉపాధ్యాయుడిగా ఆయన పనిచేస్తున్నారు. డోర్నకల్‌లో వ్యాయామశాల నిర్వహిస్తూ ఉత్సాహవంతులైన యు వతీ యువకులకు వెయిట్ లిఫ్టిం గ్లో శిక్షణ ఇస్తున్నారు. కూలీ పనులే దిక్కాయె.. నర్సింహులపేట : 12 సార్లు జాతీయ స్థాయి, 50 సార్లు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొన్నారు మండలంలోని కొమ్ములవంచకు చెందిన తాళ్ల శ్రీలత. ఆయా టోర్నమెంట్లలో ప్రతిభ కనబర్చి పలు మెడల్స్, ప్రశంసా పత్రాలను ఆమె కైవసం చేసుకున్నారు. అయినా సర్కారు చేదోడు మాత్రం అందలేదు. హైదరాబాద్ నగరంలోని దోమలగూడలో ఉన్న ఓ కళాశాలలో వ్యాయామ ఉపాధ్యాయ కోర్సు(బీపీడీ) పూర్తి చేశారు శ్రీలత. ఆ పట్టా ఆధారంగా ఆమెకు నర్సంపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పీఈటీగా కొంతకాలం పనిచేశారు. అయితే అతి తక్కువ వేతనం లభిస్తుండటంతో ఆ పనికి వెళ్లడం లేదు. ప్రస్తుతం కూలీ పనులకు వెళ్తూ ఉపాధి పొందుతోంది శ్రీలత. తమ కుమార్తెకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవాలని ఆమె తల్లిదండ్రులు యాకయ్య, లక్ష్మి కోరుతున్నారు. కబడ్డీ రంగన్నకు కరువైన ప్రోత్సాహం కురవి : అంతర్జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించినా ఆ క్రీడాకారుడికి ప్రభుత్వ ప్రోత్సాహం మాత్రం అందనే లేదు. మైదానంలోకి దిగగానే పాయింట్ల పట్టిక పరుగులు తీయించే క్రీడా నైపుణ్యం ఉన్నా.. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయి. సర్కారు పట్టించుకోనితనం ఓ వైపు.. చిమ్మచీకటిలా చుట్టుముట్టిన పేదరికం మరోవైపు ఆవరించినా చెక్కుచెదరని ఆత్మసై్థర్యంతో వ్యవసాయ పనులు చేసుకుంటూ ముందుకుసాగుతున్నారు జెర్రిపోతుల రంగన్నగౌడ్. ఆయన కురవి మండలంలోని చింతపల్లివాసి. పాఠశాల స్థాయి నుంచే క్రీడాపోటీల్లో ప్రతిభ కనబరిచారాయన. ఉపాధ్యాయుల ప్రోత్సాహం తోడవడంతో అనంతర కాలంలో ఇంతింతై వటుడింతై అన్నట్లుగా దూసుకుపోయారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయ క్రీడా పోటీల్లో పాల్గొని సత్తాచాటారు. ఈక్రమంలో ఎన్నో బహుమతులను కైవసం చేసుకున్నారు. సీనియర్ క్రీడాకారుడు అజీజ్‌ఖాన్ శిష్యరికంలో రంగన్న కబడ్డీలో రాటుదేలారు. ఆ క్రీడలో ఆల్‌రౌండర్‌గా పేరు గడించారు. తాను ఎంతో ఇష్టపడిన క్రీడా రంగంలో అవకాశాలు దరిచేరకున్నా.. సొంతూరు మాత్రం రంగన్నకు రాజకీయ రంగంలో ఓ అవకాశాన్ని కల్పించింది. దీంతో చింతపల్లికి సర్పంచ్‌గా ఐదేళ్లపాటు అంకితభావంతో సేవలు అందించారు. జీవిత పయనంలో అందరికీ ఆదర్శంగా ఉండేలా ఓ గిరిజన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నారు. కొబ్బరి బోండాలు అమ్ముతూ.. మడికొండ : నాడు కుంగ్‌ఫూ జాతీయ స్థాయి పోటీల్లో రాణించిన నల్ల రామకృష్ణ, నేడు కుటుంబ పోషణ కోసం కొబ్బరిబోండాలు అమ్ముతున్నారు. స్వయం ఉపాధిని నమ్ముకొని స్ఫూర్తిదాయకంగా ముందుకుసాగుతున్నారు. 1986లో కుంగ్‌ఫూలో మెళకువలు నేర్చుకున్న ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ జాతీయ స్థాయి పోటీల్లో సత్తాచాటారు. 1987లో హైదరాబాద్ హెచ్‌సీఎల్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే, కుంగ్‌ఫూ పోటీల్లో రెండో స్థానంలో నిలిచాడు. 1988లో వైజాగ్‌లోని గాజువాకలో జరిగిన కుంగ్‌ఫూ పోటీలో మొదటిస్థానంలో నిలిచారు. 1990లో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో బ్రౌన్‌బెల్ట్ విభాగంలో మొదటి స్థానం కైవసం చేసుకున్నారు. 1996లో బ్లాక్ బెల్ట్‌లో మూడో డిగ్రీని పూర్తి చేశారు రామకృష్ణ. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం దక్కకపోవడంతో ఉన్నత స్థాయి పోటీల్లో ఆయన పాల్గొనలేకపోయారు. బాధ్యత మరిచిన క్రీడా సంఘాలు వరంగల్ స్పోర్ట్స్ : దశాబ్దాల క్రితమే ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ క్రీడల్లో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన ఘనుడాయన. భారత జాతీయ క్రీడ హాకీ వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన క్రీడాకెరటం ఆయన. అంతర్జాతీయ క్రీడా వేదికల్లో మన దేశానికి ఎన్నెన్నో పతకాలు, అపురూప విజయాలను సాధించిపెట్టిన ధ్యాన్‌చంద్‌ను భారత జాతి మరిచిపోలేదు. నేడు(సోమవారం) ఆయన జయంతిని ‘జాతీయ క్రీడా దినోత్సవం’గా జరుపుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత క్రీడా సంఘాలలో విబేధాలు ఏర్పాడ్డాయి. ఎక్కువ సంఖ్యలో క్రీడాసంఘాలు రెండుగా చీలిపోయి కొనసాగుతున్నాయి. ఒలింపిక్ సంఘంలోనూ రెండు వర్గాలు ఏర్పడ్డాయి. దీంతో అసలు సంఘం మాదేనంటే మాదే అంటూ ఆయా వర్గాలు ప్రకటించుకుంటున్నాయి. అంతే కానీ ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని తమ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడంపై వారు దృష్టిసారించడం లేదు. పాఠశాలల వార్షికోత్సవాలు, పండుగలకు సైతం ఆటల పోటీలు నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అలాంటిది ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా కనీసం రెండు రోజులైనా జిల్లా స్థాయి క్రీడాపోటీలు నిర్వహిస్తే బాగుండు అనే అభిప్రాయం చాలామందిలో వ్యక్తమవుతోంది. ధ్యాన్‌చంద్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి ప్రపంచ స్థాయిలో భారత్ పేరు ప్రఖ్యాతులను నిలబెట్టిన క్రీడా దిగ్గజం ధ్యాన్‌చంద్ విగ్రహాన్ని హన్మకొండలోని జేఎన్ఎస్లో ఏర్పాటు చేయాలి. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా సీనియర్ క్రీడాకారులను సన్మానించాలి. ఇందుకోసం జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ కృషిచేయాలి. ఈవిషయంలో కలెక్టర్ చొరవ చూపాలి. – రాజనాల శ్రీహరి, శాప్ మాజీ డైరెక్టర్ నేడు జేఎన్ఎస్లో క్రీడాపోటీలు జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు(సోమవారం) హన్మకొండలోని జేఎన్ఎస్లో హాకీ, జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నాం. ఉదయం క్రీడాకారులు, క్రీడాభిమానులు, క్రీడా సంఘాలతో ర్యాలీ నిర్వహిస్తున్నాం. అందరూ హాజరుకావాలి. – ఇందిర, డీఎస్డీఓ క్రీడాకారులను సన్మానించాలి గతంలో స్పోర్ట్స్ డే సందర్భంగా ఆర్డీడీ సారయ్య హయాంలో జాతీయ స్థాయి పోటీల్లో రాణించిన జిల్లా క్రీడాకారులను సన్మానించేవాళ్లం. అంతేకాకుండా సన్మాన వేదిక నుంచే క్రీడాకారులకు స్పోర్ట్స్ స్కాలర్షిప్ను ఇచ్చేవారు. ఈ ఆనవాయితీ తర్వాత కాలంలో కొనసాగకపోవడం బాధాకరం. – మంచిక అభినయ్ వినయ్‌కుమార్, సాఫ్ట్‌బాల్ జాతీయ క్రీడాకారుడు -
ఉత్సాహంగా వైఎస్ఆర్ స్మారక పోటీలు
నిజామాబాద్ స్పోర్ట్స్ : దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా వైఎస్ఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో క్రీడా పోటీలు జరుగుతున్నాయి. శనివారం సీఎస్ఐ మైదానంలో క్రికెట్ పోటీలు ప్రారంభించారు. సెప్టెంబర్ 2న వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఈ పోటీలు నిర్వహిస్తున్న ట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైన క్రికెట్ పోటీల్లో ఆరు జట్లు పాల్గొన్నాయి. లీగ్‌స్థాయి మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఆదివారం సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. అలాగే వాలీవాల్ పోటీలు డీఎస్ఏ మైదానంలో జరగనున్నాయి. వైఎస్ఆర్ అభిమాన సంఘం ప్రతినిధులు, నిర్వాహకులు జయప్రసాద్, జ్యోతిరాజ్, సుభాష్, శోభన్‌బాబు, బెనర్జీ, చరణ్‌లు పాల్గొన్నారు. -
రెజ్లింగ్ క్రీడాకారుల ఎంపిక
కారంపూడి: గురుకుల పాఠశాలలో రెజ్లింగ్ సబ్ జూనియర్స్ జిల్లా స్థాయి బాలుర, బాలికల ఎంపికలు బుధవారం నిర్వహించారు. గ్రీకో రోమన్ సై్టల్ విభాగంలో గురుకుల పాఠశాల, కళాశాలకు చెందిన బి.అబేజ్, ఎం. వాగ్యానాయక్, ఎ.వెంకటేష్, జి.అరవింద్, కె.రవికుమార్, కె.అజయ్, ఎం. విజయ్, డి.బాలకృష్ణ, చండ్రాజుపాలెంకు చెందిన కె.వెంకటరావు ఎంపికయ్యారు. ప్రీ స్టెయిల్ బాలుర విభాగంలో స్థానిక గురుకులానికి చెందిన వై.వీరబ్రహ్మనాయుడు, సీహెచ్ కోటేశ్వరరావు, ఎస్.ఫిలిప్‌రాజు, పి.నాగరాజు, అచ్చెంపేట గురుకుల పాఠశాల, కళాశాలకు చెందిన ఎం.శివనాగేంద్రప్రసాద్, పి.మరియబాబు, చుండూరు గురుకుల పాఠశాల, కళాశాలకు చెందిన ఇ. తరుణ, నరేంద్ర, నిజాంపట్నం గురుకుల పాఠశాల కళాశాలకు చెందిన ఐ. కార్తీక్ ఎంపికయ్యారు. ఫ్రీ స్టెయిల్ బాలికల విభాగంలో వీపీ సౌత్ గురుకుల పాఠశాల, కళాశాలకు చెందిన వై.కవిత, వై.శైలజ, ఎం.జీవిత, ఎన్.రూతురాణి, జి.శ్రావణి, వినుకొండ గురుకుల పాఠశాలకు చెందిన జి.మీనాకుమారి, ఎస్. రోషిత, పి.పార్వతి ఎంపికయ్యారని అమెచ్యూర్ జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి స్ధానిక గురుకుల పీడీ గుడిపూడి భూషణం తెలిపారు. ఎంపికైన వారు ఈ నెల 28, 29 తేదీలలో కాకినాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. గురుకుల ప్రిన్సిపల్ సుధాకర్ పోటీలను ప్రారంభించారు. -
ఒలింపిక్స్-ఫ్లాష్‌బ్యాక్..
కారు.. పతకం బేకారు.. 1904 ఒలింపిక్స్‌లో మారథాన్‌లో పాల్గొన్న క్రీడాకారులు వీరు. ఇందులో 31వ నంబరు బనియన్ వేసుకున్న ఫ్రెడ్రిక్ లార్జ్ ఈ పోటీలో గెలిచాడు. అయితే.. అతడిని తర్వాత అనర్హుడిగా ప్రకటించారు. ఎందుకో తెలుసా? సగం దూరం పరిగెత్తకుండా.. కారులో లిఫ్ట్ అడిగి వచ్చేశాడట. తర్వాత బాగా పరిగెత్తినట్లు పోజిచ్చి.. ప్రైజు కొట్టేశాడట. దీంతో 20వ నంబరు బనియన్ వేసుకున్న థామస్ హిక్స్ను విజేతగా ప్రకటించారు. ఈయన ఏం చేశాడో తెలుసా? పరిగెత్తినంత సేపూ అలా బ్రాందీ తాగుతూనే ఉన్నాడట. హెల్ప్ కావాలా.. నాయనా.. 1908 ఒలింపిక్స్‌లోని సీన్ ఇది. ఇటలీకి చెందిన రన్నర్ డొర్నాడో మారథాన్‌లో ఒకటికి పదిసార్లు కింద పడిపోయాడు. ఓసారైతే రివర్స్‌లో పరిగెత్తాడు. దీంతో కొందరు ఒలింపిక్స్ అధికారులు ‘దయ’తో సాయం కావాలా నాయనా.. అంటూ దగ్గరుండి మరీ.. ఇలా విజయం సాధించేలా చేశారు. తర్వాత డొర్నాడోను అనర్హుడిగా ప్రకటించినా.. రేసును పూర్తి చేసినందుకు కన్సొలేషన్ ప్రైజును ఇచ్చారు. సర్ఫ్ ఎక్సెల్ ఉందిగా.. ఒలింపిక్స్ అంటే.. ఎన్నో సదుపాయాలు ఉంటాయి. ఈ ఫొటో చూడండి.. క్రీడాకారులు తమ బట్టలను తామే ఉతుక్కుని ఆరేసుకుంటున్నారు. 1948 లండన్ ఒలింపిక్స్ పరిస్థితి ఇదీ.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో ఇలాంటి ఆదా చర్యలు చేపట్టారు. అంతేకాదు.. ఎవరి టవల్స్ వారే తెచ్చుకోవాలని చెప్పారట. కొందరైతే.. తమ ఆహారం తామే తెచ్చుకున్నారట. ఇప్పటి లెక్కల ప్రకారం చూసినా.. ఆ ఒలింపిక్స్ కోసం బ్రిటన్ పెట్టిన ఖర్చు రూ.6.39 కోట్లు మాత్రమే. జనం.. జంప్.. ఇది 1908 లండన్ ఒలింపిక్స్‌లోని సీన్. స్వీడన్‌కు చెందిన క్రీడాకారిణి హైజంప్ చేస్తోంది.. జంప్ చేయాల్సినంత హైటు అక్కడ లేదన్న సంగతిని పక్కనపెడితే.. వెనుక చూశారా గ్యాలరీలో.. జనం కనిపిస్తే ఒట్టు. జనం లేకున్నా.. మన పని మనం చేసుకుందాం అన్నట్లు క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. దూకుడు.. లాగుడు.. 1904లో అమెరికాలో జరిగిన ఒలింపిక్స్‌లోని సన్నివేశాలివీ.. అప్పటి ఒలింపిక్స్‌లో ఇలా బ్యారెల్ జంపింగ్, టగ్ ఆఫ్ వార్ వంటి పోటీలు ఉండేవి. అంటే దూకుడు.. లాగుడు అన్నమాట. 1900 ప్యారిస్ ఒలింపిక్స్‌లో అయితే షూటింగ్ కోసం నిజమైన పావురాలను వాడారు. గోల్డెన్ లెగ్గు ఇతడు అమెరికాకు చెందిన జిమ్నాస్ట్ జార్జ్ ఈజర్ 1904 ఒలింపిక్స్ లో పోల్గోన్నాడు.అయితే..ఇక్కడో ట్విస్టుంది...ఇతడు వికలాంగుడు .చెక్క కాలు పెట్టుకుని పోటీల్లో పోల్గోన్న జార్జ్ ఏకంగా ఆరు పతకాలు గెలుచుకోవడం విశేషం. -
ఆగస్టు 15న కడుపులు మాడాయి...
రియో డి జనీరో: పంద్రాగస్టు సంబరాల సంగతేమో కానీ రియోలో భారత హాకీ క్రీడాకారులు ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడి భారత దౌత్య కార్యాలయంలో క్రీడా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కోసం అథ్లెట్లను ఆహ్వానించారు. హాకీ క్రీడ ముగియడంతో ఇరు జట్ల ఆటగాళ్లు వెళ్లారు. అక్కడ ఎలాగూ విందు ఏర్పాటు చేస్తారని, పసందైన భారత వంటకాల రుచి చూడవచ్చనే కోరికతో ఒలింపిక్ విలేజిలో తమ డిన్నర్‌ను రద్దు చేసుకున్నారు. అయితే కార్యక్రమంలో పరిస్థితి మాత్రం మరోలా ఉంది. వేడుక ముగిశాక కూల్ డ్రింక్స్, కాసిన్ని పల్లి గింజలు పెట్టేసరికి అంతా అవాక్కయ్యారు. దీంతో మాంచి ఆకలి మీదున్న ఆటగాళ్లు అధికారుల తీరుతో తీవ్రంగా నిరుత్సాహపడ్డారు. రెండు బస్సులు మారి ఇంత దూరం వస్తే కనీసం భోజనాలు కూడా పెట్టకపోవడం దారుణమని ఓ ఆటగాడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
పతకాలు సరే.. డబ్బేది?
ముంబై: ఒలింపిక్స్ తరహా మెగా ఈవెంట్లలో పతకాలు సాధించడం గొప్ప విషయమైనా, ఆయా క్రీడాకారులకు ఆర్థికంగా చేయూతనివ్వాల్సిన అవసరం చాలా ముఖ్యమని బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమర్ అభిప్రాయపడ్డాడు. క్రీడాకారులు సాధించిన పతకాలు ఒక ఎత్తైతే, వారికి నజరానాలను అందజేయడం అంతకంటే ముఖ్యమన్నాడు. 'ఒక పతకాన్ని కానీ, సర్టిఫికెట్‌ను కానీ సాధించడం అనేది చాలా గొప్ప విషయం. మరి అవి సాధించిన క్రీడాకారులను ఆర్థికంగా కూడా ఆదుకోవాలి. మనం ప్రాక్టికల్ గా ఆలోచిస్తే పతకం కంటే డబ్బే ప్రధానం. నేను చాలా మంది బీద క్రీడాకారుల్ని చూశాను. పలు సందర్భాల్లో ఆర్థికపరిస్థితి బాలేక వారు పతకాలను కూడా అమ్మేసి పరిస్థితి ఏర్పడుతూనే ఉంది. ఇదంతా వారికి డబ్బు లేకపోవడం వల్లే కదా. అమెరికా, చైనా క్రీడాకారులు పతకాల పట్టికలో అగ్రస్థానంలో ఉండటానికి, భారత్ లాంటి దేశం సింగిల్ డిజిట్ పతకానికే పరిమితం కావడం కూడా ఆయా క్రీడాకారులు ఆర్థిక పరిస్థితే కారణం' అని 'రుస్తుమ్' సక్సెట్ మీట్ సందర్భంగా అక్షయ్ పేర్కొన్నాడు. -
క్రీడాకారులకు కలెక్టర్ అభినందనలు
నల్లగొండ టూటౌన్: తాంగ్–టా పెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గత నెల 29 నుంచి ఈ నెల 3వ తేది వరకు జమ్ముకాశ్మీర్ లో జరిగిన తాంగ్–టా ఫెడరేషన్ కప్ –2016 జాతీయ పోటీల్లో విజయం సాధించిన క్రీడాకారులను శుక్రవారం జిల్లా కలెక్టర్ పి. సత్యనారాయణరెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయి పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు బంగారు, వెండి, రజిత పథకాలు సాధించడం గర్వించదగినదన్నారు. ఈ కార్యక్రమంలో తాంగ్–టా జిల్లా అధ్యక్షుడు కందిమళ్ల చలపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కరుణాకర్, టి. హనుమంతరెడ్డి, అంజి, మారుతి అమరేందర్‌రెడ్డి, గాదె ర వీందర్‌రెడ్డి, రాజు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యర్థులను స్నేహితుల్లా భావించాలి
1994లో గోపీచంద్‌తో ఇక్కడికి వచ్చాను.. ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఎస్ఎం ఆరీఫ్ ముగిసిన రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు వరంగల్ స్పోర్ట్స్ : క్రీడాకారులు పోటీల్లో తమ ప్రత్యర్థులను స్నేహితులుగా భావిస్తే ఆడాలని ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఎస్.ఎం.ఆరిఫ్ సూచిం చారు. వరంగల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆద్వర్యంలో సుబేదారిలోని ఆఫీసర్స్ క్లబ్లో నాలుగు రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి జూనియర్స్ అండర్–17, 19 బాలబాలికల బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభకు ఆరిఫ్ హాజరై మాట్లాడారు. 1994లో మొదటిసారి పుల్లెల గోపీచంద్, మనోజ్ వంటి అంతర్జాతీయ క్రీడాకారులను జూనియర్స్ టోర్నమెంట్లో ఆడించేందుకు వరంగల్‌కు వచ్చానని గుర్తు చేసుకున్నారు. పోటీలో విజయం సాధించాలనే తపన, పట్టుదల, శ్రమ ఉంటే అవే లక్ష్య సాదన దిశగా తీసుకువెళ్తాయని తెలి పారు. అలాగే, క్రీడాకారులు ఏకాగ్రత కోసం పుస్తక పఠనం అలవర్చుకోవాలని సూచించా రు. అసోసియేషన్ జిల్లా కార్యదర్శి డాక్టర్ పింగిళి రమేష్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ముగిం పు కార్యక్రమంలో భారత బ్యాడ్మింటన్ ఫెడరేషన్ రెఫరీ వేమూరి సుధాకర్, అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ టి.రవీందర్రావు, కోశాధికారి నాగకిషన్, ఆఫీసర్స్ క్లబ్ కార్యదర్శి గండ్ర సత్యనారాయణరెడ్డి, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పరిశీలకులు పాణిరావు, ఫణికిషోర్, అంపైర్లు కొమ్ము రాజేందర్, శ్యామ్ పాల్గొన్నారు. ఆ తర్వాత విజేతలకు బహుమతులు అందజేశారు. విజేతలు వీరే.. రాష్ట్ర స్థాయి జూనియర్స్ బ్యాడ్మింటన్ పోటీల్లో భాగంగా అండర్–17 విభాగంలో విజేతల వివరాలిలా ఉన్నాయి. బాలుర సింగిల్స్‌లో పి.విష్ణువర్దన్(హైదరాబాద్) విజేతగా, ఖమ్మంకు చెందిన టి.పవన్‌కృష్ణ రన్నర్‌గా నిలిచారు. బాలికల విభాగంలో విజేతగా రంగారెడ్డికి చెందిన గాయత్రి గోపీచంద్, హైదరాబాద్‌కు చెందిన సమియా ఇమాద్ ఫారూఖీ రన్నర్‌గా, బాలుర డబుల్స్‌లో విన్నర్స్‌గా మెదక్‌కు చెందిన బి.నవనీత్, రంగారెడ్డికి చెందిన పి.శ్రీకృష్ణసాయికుమార్, రన్నర్స్‌గా హైదరాబాద్‌కు చెందిన పి.విష్ణువర్ధన్, ఎం.డీ.ఖదీర్ మెుయినొద్దీన్, బాలికల డబుల్స్‌లో విన్నర్స్‌గా రంగారెడ్డికి చెందిన గాయత్రి గోపీచంద్, హైదరాబాద్‌కు చెందిన సమియా ఇమాద్ ఫారూఖీ, రన్నర్స్‌గా మెదక్‌కు చెందిన బండి సాహితి, మెదక్‌కు చెందిన జె.శ్రీష్తి నిలిచారు. ఇక అండర్–19 బాలుర సింగిల్స్ లో ఖమ్మంకు చెందిన ఆదిత్య బాపినీడు విజేతగా, హైదరాబాద్‌కు చెందిన సాయంబోత్రా రన్నర్‌గా, బాలికల సింగిల్స్‌లో రంగారెడ్డికి చెందిన కె.వైష్ణవి విజేతగా, రంగారెడ్డికి చెం దిన గాయత్రి గోపీచంద్ రన్నర్‌గా నిలిచారు. బాలుర డబుల్స్‌లో రంగారెడ్డికి చెందిన పి.శ్రీకృష్ణ సాయికుమార్, ఇ.సిద్ధార్థ విజేతలుగా, మెదక్‌కు చెందిన బి.నవనీత్, కిరో తరుణ్‌కుమార్ రన్నర్స్‌గా, బాలికల డబుల్స్‌లో మెదక్‌కు చెందిన బండి సాహితి, జె.శ్రీష్టి విజేతలుగా, రన్నర్స్‌గా హైదరాబాద్‌కు చెందిన రుహిరాజు, ఇషితరాజు నిలిచారు. -
మన ఘనతపై మచ్చ
ఎన్నడూ లేని విధంగా ఈసారి భారత్ నుంచి ఏకంగా 120 మంది క్రీడాకారులు రియో ఒలింపిక్స్‌కు వెళుతున్నారని సంబరపడ్డాం. దేశంలో క్రీడల పట్ల ఆసక్తి పెరగడం, ప్రభుత్వం కూడా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తుండటంతో రియోకు భారీ బృందం వెళుతోంది. గతంతో పోలిస్తే ఈసారి పతకాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, సుమారు 10 పతకాలు మనోళ్లు తెస్తారని అంచనా. ఇప్పటికే ఆర్చరీ క్రీడాకారులు బ్రెజిల్ చేరిపోయి సాధన మొదలెట్టారు. మిగిలిన క్రీడలకు సంబంధించిన క్రీడాకారులు అమెరికా, యూరోప్‌లలో రకరకాల ప్రదేశాలలో ప్రాక్టీస్ చేస్తూ రియోకు సన్నద్ధమవుతున్నారు. అంతా సాఫీగా సాగుతుందనుకుంటున్న సమయంలో డోపింగ్ కలకలం వెలుగులోకి రావడం పెద్ద షాక్. సాక్షి క్రీడావిభాగం: రెజ్లర్ నర్సింగ్ యాదవ్ డోపింగ్‌లో దొరికినా అతడిపై ఎంతో కొంత సానుభూతి కనిపించింది. రెజ్లింగ్ సమాఖ్య కూడా నర్సింగ్ గత చరిత్రను దృష్టిలో ఉంచుకుని మద్దతుగా నిలబడింది. నర్సింగ్ అంశంపై చర్చ వాడిగా సాగుతున్న సమయంలోనే మరో అథ్లెట్ ఇందర్జీత్ సింగ్ డోపింగ్‌లో దొరికిపోవడం మన ప్రతిష్టను దిగజార్చింది. గతంలో అడపాదడపా భారత అథ్లెట్లు డోపింగ్‌లో పట్టుబడ్డా... ఈసారి ఒలింపిక్స్‌కు ముందు భారీ అంచనాలతో ఉన్న అథ్లెట్లు దొరికిపోవడం దేశానికి చెడ్డపేరు తెస్తోంది. భారత్‌లో క్రీడాకారులు డోపీలుగా దొరకడం ఇది తొలిసారేం కాదు. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్ సమయంలోనూ భారత్‌లో డోపింగ్ కలకలం రేగింది. అప్పుడు ఇద్దరు వెయిట్‌లిఫ్టర్లు పట్టుబడ్డారు. దీంతో ఒక రకంగా వెయిట్లిఫ్టింగ్కు ఆదరణ బాగా తగ్గిపోయింది. 2000లో డిస్కస్ త్రోయర్ సీమా అంటిల్, 2001లో కుంజరాణి, 2010లో సనామచా చాను కూడా డోపింగ్‌లో దొరికారు. అయితే అప్పటితో పోలిస్తే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. క్రీడల పట్ల, క్రీడాకారుల పట్ల ఆదరణ పెరిగింది. గత రెండు ఒలింపిక్స్‌లలో పతకాల సంఖ్య పెరగడంతో దేశంలో క్రీడాసంస్కృతి పెరిగింది. రియోకు వెళ్లే అథ్లెట్లకు ప్రభుత్వం భారీగా డబ్బు ఇచ్చింది. ‘టాప్’ స్కీమ్ పేరిట అందరికీ ఆర్థిక సహాయం అందజేసింది. దీంతో పాటు పలు ప్రైవేట్ సంస్థలు వ్యక్తులు కూడా సహకారం అందించారు. ఈ నేపథ్యంలో అథ్లెట్లు పతకాలు తెస్తారని ఆశలూ పెరిగాయి. అయితే ఆటల ప్రారంభానికి ముందే ఇద్దరు అథ్లెట్లు దొరకడంతో అందరిలోనూ సంశయం మొదలైంది. క్లీన్చిట్ ఎలా ఇచ్చారు? జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) భారత అథ్లెంట్లందరికీ వారం రోజుల క్రితం ‘క్లీన్చిట్’ ఇచ్చింది. రియోకు వెళుతున్న వారందరికీ పరీక్షలు నిర్వహించామని, అందరూ క్లీన్ అని ప్రకటించింది. కానీ వారం తిరిగే సరికే ఇద్దరు అథ్లెట్ల పేర్లను అదే ‘నాడా’ బయటపెట్టింది. నిజానికి ఇప్పుడు బయటపడ్డ ఫలితాలు గత నెలలో తీసుకున్న శాంపిల్స్వి. మరి ఆ ఫలితాలను చూడకుండానే ముందుగా ఎందుకు ప్రకటన చేశారనేది ప్రశ్నార్థకం. అటు రెజ్లర్ నర్సింగ్ యాదవ్, ఇటు షాట్‌పుటర్ ఇందర్జీత్ ఇద్దరూ తాము అమాయకులమే అని, తమపై కుట్ర జరిగిందని ఆరోపిస్తున్నారు. ఒక అథ్లెట్ బ్లడ్, యూరిన్ శాంపిల్ ఇచ్చిన సమయంలో అథ్లెట్ సమక్షంలోనే దానిని లాక్ చేస్తారు. ఆ తర్వాత మిషన్ల సహాయంతో మాత్రమే వాటిని తెరుస్తారు. కాబట్టి అథ్లెట్ శాంపిల్‌ను మార్చారనే ఆరోపణల్లో నిజం లేదనుకోవాలి. ఇక నర్సింగ్ యాదవ్ చేసిన ఆరోపణలు భిన్నంగా ఉన్నాయి. అతడితో పాటు అతడి రూమ్మేట్ కూడా డోపింగ్‌లో దొరికాడు. ఈ ఇద్దరూ తినే ఆహారంలో ఏదో కలిపారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. వీళ్లిద్దరూ భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) శిక్షణా కేంద్రంలోనే శిక్షణ తీసుకుంటున్నారు. హరియాణాలోని సోనేపట్‌లో ఉన్న ఈ కేంద్రంలోనే రెజ్లర్లందరికీ శిక్షణ ఇస్తున్నారు. తనపై కుట్ర జరిగిందని, దీనిపై సీబీఐ విచారణ జరపాలని నర్సింగ్ కోరుతున్నాడు. గతంలో నర్సింగ్కు మంచి రికార్డు ఉంది. ఎప్పుడూ ఏ స్థాయిలోనూ డోపింగ్‌కు పాల్పడిన ఆనవాళ్లు లేవు. ఇంతకాలం ఇంత క్లీన్‌గా ఉన్న వ్యక్తి ఒలింపిక్స్ సమయంలో డోపింగ్ చేయకపోవచ్చు. నిజానికి గత నెలలో అతనికి మూడుసార్లు డోపింగ్ పరీక్షలు నిర్వహిస్తే అందులో రెండుసార్లు క్లీన్చిట్ వచ్చింది. మూడో సందర్భంలో బ్లడ్ శాంపిల్‌లో ఎలాంటి సమస్యా లేదు. కేవలం యూరిన్ శాంపిల్‌లో మాత్రమే తేడా ఉంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని నర్సింగ్కు రెజ్లింగ్ సమాఖ్య నుంచే కాకుండా అన్ని వైపుల నుంచీ మద్దతు లభించింది. కానీ ఇందర్జీత్ విషయంలో పరిస్థితి అలా లేదు. భారత అథ్లెట్లందరికీ నిర్వహించే జాతీయ క్యాంప్‌లో ఇందర్జీత్ శిక్షణ తీసుకోలేదు. తన వ్యక్తిగత కోచ్‌తో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నాడు. అక్కడ ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలియదు. అలాగే ప్రతి నెలా క్రీడాకారులు తాము ఎక్కడ ఉండేదీ ‘నాడా’కు తెలపాలి. కానీ గత నెల ఇందర్జీత్ జూన్‌లో ఓ పరీక్షకు హాజరు కాలేదు. రెండో పరీక్షకు హాజరై దొరికిపోయాడు. అయితే ఇంకా తన ‘బి’ శాంపిల్ పరీక్ష ఫలితం రాలేదు. ఒకవేళ ఆ పరీక్షలో కూడా అతను పాజిటివ్‌గా తేలితే ఇక రియోకు వెళ్లడం సాధ్యం కాదు. అంతేకాకుండా రెండు నుంచి నాలుగేళ్లు నిషేధం కూడా పడుతుంది. తమ కెరీర్లో ఒకసారైనా ఒలింపిక్స్‌లో పాల్గొనాలని క్రీడాకారులందరూ కలలు కంటారు. దీనిని సాకారం చేసుకోవడం కోసం ఏళ్ల పాటు కష్టపడతారు. కుటుంబాలను, వ్యక్తిగత సంతోషాలను వదిలేస్తారు. కాబట్టి కావాలని డోపింగ్‌కు పాల్పడే క్రీడాకారుల సంఖ్య తక్కువగానే ఉంటుంది. కానీ కొంతమంది మరీ అత్యాశకు వెళతారు. ఏదో ఒకటి చేసి పతకం గెలవాలనే ఉద్దేశంతో, పరీక్షలకు దొరక్కుండా రకరకాల మార్గాల ద్వారా నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకుంటారు. కానీ ప్రస్తుతం టెక్నాలజీ రోజు రోజూకూ మెరుగుపడుతున్నందున ఇలాంటివి దాగవు. తప్పు చేసిన అథ్లెట్ ఏదో ఒక రోజు దొరకాల్సిందే. ఏమైనా రియోకు ముందు ఈ పరిణామాలు ఎంతమాత్రం మంచివి కాదు. ఈ ఇద్దరితోనే ఇది ఆగిపోవాలని కోరుకుందాం. ఇందర్జిత్ తీసుకున్న ఆండ్రోస్టెరాన్, ఎథియోక్లొనోలోన్ రెండూ నిషిద్ధ జాబితాలో ఉన్నాయి. జీవనిర్మాణ క్రియల్లో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. కండరాల పెరుగుదల, శరీరాకృతిని తీర్చిదిద్దుకోవడానికి ఈ ఉత్ప్రేరకాలు బాగా దోహదపడతాయి. బరువైన వస్తువులు మోసే వాళ్లు లేదా శక్తిని బాగా ఉపయోగించే అథ్లెట్లు వీటిని తీసుకుంటారు. దీనివల్ల శరీరంలోని శక్తి ఒక్కసారిగా బయటకు వచ్చేస్తుంది. షాట్‌పుట్, హామర్ త్రో అథ్లెట్లు ఈ డ్రగ్స్‌ను నోటి ద్వారా లేదా ఇంజెక్షన్ల రూపంలో ఎక్కువగా తీసుకుంటారు. కొన్నిసార్లు ఒకే డ్రగ్‌ను లేదా రెండింటిని కలిపి తీసుకుంటారు. -
రష్యా బతికిపోయింది...
‘సంపూర్ణ నిషేధం’ లేదని ప్రకటించిన ఐఓసీ * షరతులతో అథ్లెట్లకు ఒలింపిక్స్‌లో అనుమతి * డోపీలకు స్థానం లేదని స్పష్టీకరణ లుసానే: రియో ఒలింపిక్స్‌లో అగ్ర దేశం రష్యా పాల్గొనడంపై ఉన్న సందిగ్ధత తొలగిపోయింది. ఈ క్రీడల్లో ఆ దేశ క్రీడాకారులు పాల్గొనేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అనుమతి ఇచ్చింది. రష్యాను చుట్టుముట్టిన భారీ డోపింగ్ వివాదం నేపథ్యంలో రియో ఒలింపిక్స్‌లో పాల్గొనకుండా నిషేధం విధించే పరిస్థితి కనిపించింది. అయితే చివరకు సుదీర్ఘ చర్చల అనంతరం ఆదివారం జరిగిన ప్రత్యేక సమావేశంలో ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు తమ నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే రష్యా దేశంపై పూర్తిగా నిషేధం విధించకపోయినా... ఆ జట్టు అథ్లెట్లపై మాత్రం నిఘా నేత్రం పెట్టింది. ఆటగాళ్లకు వేర్వేరు షరతులు పెట్టిన ఐఓసీ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు కొన్ని నిర్దేశిత ప్రమాణాలు కూడా సూచించింది. వాటిని అందుకునే అథ్లెట్లకే అవకాశం లభిస్తుందని స్పష్టం చేసింది. ‘రష్యాకు అనుమతి ఇస్తూనే ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు మేం కొన్ని కఠిన ప్రమాణాలను రూపొందించాం. రియోలో పోటీ పడాలనుకునే ప్రతీ ఒక్కరు వీటిని అందుకోవాలి. ఒకవైపు హెచ్చరిక జారీ చేస్తూనే, మరోవైపు ఒలింపిక్స్‌లో పాల్గొనాలనుకునే ప్రతీ అథ్లెట్ హక్కును భంగం కలగకుండా మేం సమన్యాయం పాటించాం’ అని ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ వ్యాఖ్యానించారు. * రియో ఒలింపిక్స్‌లో రష్యా ఆటగాళ్లను అనుమతించే విషయంపై ఆయా క్రీడల అంతర్జాతీయ సమాఖ్యలే తుది నిర్ణయం తీసుకుంటాయి. అర్హత గల ఆటగాళ్లను తమ వివరాలను సమాఖ్యకు పంపించాలి. వాటిని పరిశీలించిన తర్వాత సం తృప్తి చెందితేనే ఆడేందుకు అవకాశం ఇస్తారు. * ఒక్కో ఆటగాడి వ్యక్తిగత రికార్డును పరీక్షిస్తారు. గతంలో ఒక్కసారైనా డోపింగ్‌లో పట్టుబడిన అథ్లెట్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ రియోకు అనుమతి లేదు. డోపింగ్ ఆరోపణలపై శిక్షకు గురై, శిక్షా కాలం పూర్తి చేసుకున్నా సరే... అవకాశం లేదు. * డోపింగ్ వివాదాన్ని బయటపెట్టడంలో కీలక పాత్ర పోషించి, విచారణకు సహకరించిన రష్యా అథ్లెట్ యూలియా స్టెపనోవాను ప్రత్యేకంగా అభినందించిన ఐఓసీ... ఆమె ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు మాత్రం అనుమతించలేదు. గతంలో డోపింగ్ పరీక్షలో విఫలమైన స్టెపనోవాకు తాజా నిబంధనల ప్రకారం అర్హత లేదు. వివాద క్రమం... రష్యా జట్టులో 99 శాతం మంది అథ్లెట్లు డోపింగ్‌కు పాల్పడుతున్నట్లు, వారికి అధికారులే అండగా నిలుస్తున్నట్లు 2014 డిసెంబర్లో తొలిసారిగా జర్మనీ మీడియా సంస్థ ఒక వీడియో డాక్యుమెంటరీలో బయటపెట్టింది. దాంతో ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) స్వతంత్ర విచారణ అనంతరం గత ఏడాది నవంబర్‌లో రష్యా అథ్లెటిక్స్ సమాఖ్యపై నిషేధం విధించారు. గత జూన్ నెలలో డోపింగ్‌లో తమకు సంబంధం లేదని, రియో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని 67 మంది రష్యా అథ్లెట్లు విడిగా చేసిన అభ్యర్థనను కూడా కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్స్ (కాస్) కొట్టివేసింది. అయితే రష్యాను ఒలింపిక్స్‌లో పాల్గొనకుండా నిషేధించాలని ‘వాడా’ స్వతంత్ర నివేదిక ఇచ్చినా... చివరకు ఐఓసీ దానిని పక్కన పెడుతూ రష్యాకు ఉపశమనం కలిగించింది. ఒలింపిక్స్ చరిత్రలో రష్యా ఇప్పటివరకు 132 స్వర్ణాలతో కలిపి మొత్తం 395 పతకాలు సాధించింది. -
ప్రతిభతో క్రీడల్లో గుర్తింపు
ఆదిలాబాద్ స్పోర్ట్స్: క్రీడాకారులోని ప్రతిభతోనే గుర్తింపు లభిస్తుందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వివేకానందరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైధానంలో శనివారం టీసీఏ 2డే లీగ్ మ్యాచ్‌లు నిర్వహించారు. ఆదిలాబాద్ అర్బన్, ఆసిఫాబాద్ మ్యాచ్‌ల మధ్య క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హజరై క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు అత్యుత్తమ క్రీడాకారులుగా ఎదిగేందుకు సాధన అవసరమని, ప్రతిభతోనే గుర్తింపు చేకూరుతుందని చెప్పారు. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో క్రికెట్ క్రీడాకారులు మంచి భవిష్యత్తు వస్తుందని చెప్పారు. క్రీడాకారులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదన్నారు. క్రీడానైపుణ్యాలతో అవకాశాలు వస్తాయని చెప్పారు. ఇందులో టీసీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి నరోత్తమ్‌రెడ్డి, జిల్లా జట్టు కోచ్ జయేంద్రపటాస్కర్లు , క్రీడాకారులు ఉన్నారు. ఇంద్రనీల్ అల్రౌండర్ ప్రతిభ... ఆసిపాబాద్ జుట్ట టాస్‌గెలిచి మొదటి ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆదిలాబాద్ అర్బన్ జట్టు 359 పరుగులు చేసి 7 వికేట్ల నష్టపోయింది. ఇందులో ఇంద్రనీల్ పటాస్కర్ 156 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. జయగణేష్ 52 పరుగులతో నాటౌట్, అన్వేష్‌రెడ్డి 51 పరుగులు చేసి ఔట్ అయ్యారు. తర్వాత బ్యాటింగ్ చేసిన ఆసిఫాబాద్ జట్టు 98 పరుగులు చేసి 9 వికేట్ల నష్టపోయింది. ఇందులో ఇంద్రనీల్ 5 వికేట్లు తీసుకోగా , ప్రణయ్ 2 వికేట్లు తీసుకున్నారు. -
జాక్‌పాట్ కొడతాడా!
♦ మళ్లీ యువరాజ్పైనే అందరి దృష్టి ♦ శనివారం ఐపీఎల్-9 వేలం ♦ అందుబాటులో 351 మంది క్రికెటర్లు రెండేళ్ల క్రితం ఐపీఎల్ వేలంలో రూ. 14 కోట్ల రికార్డు ధర, అందరిలో ఒక్కసారిగా ఆశ్చర్యం. అయితే బెంగళూరుతో ఈ సంబరం ఒక్క ఏడాదికే సరి. వరల్డ్ కప్ ఫైనల్ వైఫల్య భారాన్ని మోస్తూ రావడంతో 2015 వేలంలో అతని విలువపై వేల సందేహాలు ఉన్నా...అది మరో రూ. 2 కోట్లు పెరిగిందే కానీ ఏ మాత్రం తగ్గలేదు. ఈసారీ ఒక సీజన్‌తోనే ఢిల్లీ బంధం తెగిపోయింది. మరి ఇప్పుడు ఎన్ని కోట్లు దక్కుతాయి...ఎవరు అతడిని ఎంచుకుంటారు...ఇలా ఐపీఎల్ వేలంలో మరోసారి స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ప్రస్తుతం భారత టి20 జట్టు సభ్యుడిగా కూడా ఉన్న అతను గతంలోకంటే ఎక్కువ మొత్తం రాబట్టి జాక్‌పాట్ కొడతాడా? లేక గత రెండు జట్ల అనుభవాలు దృష్టిలో ఉంచుకొని ఫ్రాంచైజీలు భారీ మొత్తం చెల్లించడంలో వెనుకడుగు వేస్తాయా? అనేది ఆసక్తికరం. సాక్షి క్రీడా విభాగం ఇండియన్ ప్రీమియర్ లీగ్-2016 కోసం ఆటగాళ్ల వేలం ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ఈ నెల 6న (శనివారం) బెంగళూరులో ఐపీఎల్ వేలం జరుగుతుంది. చెన్నై, రాజస్థాన్ జట్టు రద్దు కావడంతో కొత్తగా పుణే, రాజ్‌కోట్ జట్లు బరిలో నిలిచాయి. ప్రస్తుతానికి ఐదుగురేసి ప్రధాన ఆటగాళ్లను మాత్రమే తీసుకున్న ఈ టీమ్‌లు తమ పూర్తి స్థాయి జట్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంది. దాంతో గత కొన్నేళ్లతో పోలిస్తే ఈ సారి లీగ్ వేలంకు ప్రాధాన్యత పెరిగింది. పైగా ఆరు జట్లు కలిపి మొత్తం 61 మంది ఆటగాళ్లను విడుదల చేశాయి. దాంతో ఫ్రాంచైజీల వద్ద చెప్పుకోదగ్గ మొత్తమే మిగిలింది. వేలం మొత్తం ఒక్కరోజులోనే ముగుస్తుంది. ఢిల్లీనుంచి కేదార్జాదవ్ను బెంగళూరు తీసుకోవడం ఒక్కటే ఈ ఏడాది ట్రేడింగ్ విండోలో జరిగిన మార్పు. యువీ హవా సాగుతుందా దాదాపు రెండేళ్ల తర్వాత టి20ల్లో భారత జట్టు తరఫున ఆడిన యువరాజ్ సింగ్ తాజా ఫామ్ వేలంలో కీలకం కావచ్చు. ఆసీస్‌తో రెండు మ్యాచ్‌లలో బ్యాటింగ్ అవకాశం రాలేదు కానీ బౌలింగ్‌లో ఫర్వాలేదనిపించాడు. చివరి మ్యాచ్‌లో కాస్త నెమ్మదించినా కీలక సమయంలో ఫోర్, సిక్స్ బాది తన ‘హిట్టింగ్’లో ఇంకా పదును ఉందని చూపించాడు. దేశవాళీలో 2015-16 సీజన్లో వన్డేల్లో ఆరు మ్యాచ్‌లలో దాదాపు 70 సగటుతో 346 పరుగులు చేసి ఫామ్‌లోకి వచ్చిన యువీ, ముస్తాక్ అలీ టి20లో మూడు ఇన్నింగ్స్‌లలో ఒక అర్ధ సెంచరీ చేసినా మిగతా రెండు మ్యాచ్‌లలో విఫలమయ్యాడు. 2 వికెట్లూ పడగొట్టాడు. శుక్రవారం ప్రకటించే ప్రపంచకప్ టీమ్‌లోనూ అతను ఎంపికయ్యే అవకాశం ఉంది. పైగా రెండు కొత్త ఫ్రాంచైజీలు స్టార్ వ్యాల్యూ కోసం యువీ ఉంటేదని మంచిదని భావిస్తాయి. 2014 సీజన్లో ఆర్సీబీ తరఫున 14 మ్యాచ్‌లలో 376 పరుగులే చేసిన యువీ...గత ఏడాది డేర్‌డెవిల్స్ సభ్యుడిగా 13 ఇన్నింగ్స్‌లలో 248 పరుగులే చేశాడు. ఈ నేపథ్యంలో టీమ్ యజమానులు గతంలోలాగా గుడ్డిగా వెళ్లకపోవచ్చు. ఇషాంత్ విలువెంత..? ఇతర భారత ప్రధాన ఆటగాళ్లలో పేసర్ ఇషాంత్ శర్మ, ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీతో పాటు భారత జట్టులోకి పునరాగమనం చేసిన ఆశిష్ నెహ్రా కూడా వేలంలో అందుబాటులోకి రానున్నారు. వీరి ప్రారంభ విలువ రూ. 2 కోట్లుగా ఉంది. సన్‌రైజర్స్ జట్టులో గత ఏడాది పేసర్లు బౌల్ట్, భువనేశ్వర్ ఎక్కువ భాగం లీగ్ బరిలోకి దిగడంతో ఇషాంత్‌కు 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడే అవకాశం దక్కింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో గొప్ప రికార్డు లేకపోయినా... భారత పేసర్లందరిలో సీనియర్ ఆటగాడు కావడంతో అతనికి మంచి మొత్తం దక్కవచ్చు. చెన్నై రద్దు కావడంతో నెహ్రా కూడా వేలం బరిలో నిలిచాడు. పీటర్సన్ సిద్ధం విదేశీ ఆటగాళ్లలో ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న ఆటగాడు కెవిన్ పీటర్సన్. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అన్ని లీగ్‌లలో దుమ్ము రేపుతున్న పీటర్సన్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. గత రెండేళ్లుగా మెరుపు ప్రదర్శనను ఇచ్చిన కివీస్ బ్యాట్స్‌మన్ మార్టిన్ గప్టిల్‌కు కూడా మంచి విలువ పలికే అవకాశం ఉంది. ఇక 40 ఏళ్లు దాటినా ఇటీవల బిగ్‌బాష్‌లో సిడ్నీ థండర్‌ను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించిన మైక్ హస్సీతో పాటు పాటు భారత్‌తో చివరి టి20లో భారీ సెంచరీతో చెలరేగిన షేన్‌వాట్సన్ వేలంలో భారీ మొత్తాన్ని ఆశిస్తున్నాడు. కుర్రాళ్లు రెడీ గత కొన్నేళ్లుగా దేశవాళీ క్రికెట్లో సత్తా చాటుతున్న పలువురు వర్ధమాన ఆటగాళ్లు కూడా ఐపీఎల్ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. భారీ విలువ దక్కకపోయినా...కనీస మొత్తానికే లీగ్‌లో అడుగుపెడితే చాలని వీరంతా ఆసక్తిగా ఉన్నారు. వీరిలో కొందరు గతంలో కొన్ని ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన వారు కాగా... మరికొందరు పూర్తిగా తొలి చాన్స్ కోసం సిద్ధమయ్యారు. సంజు శామ్సన్, కరుణ్ నాయర్, నాథూసింగ్, కరియప్ప, అవేశ్ ఖాన్, రిషభ్ పంత్, ఆదిత్య తారే, కేఎస్ భరత్, పవన్ నేగి, దీపక్ హుడా తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. 2016 వేలం విశేషాలు... మొత్తం వేలంలో ఉన్న ఆటగాళ్ల సంఖ్య: 351 భారత క్రికెటర్లు: 230 విదేశీయులు: 121 క్యాప్డ్: 130, అన్క్యాప్డ్: 219, అసోసియేట్ ఆటగాళ్లు: 2 (కెనడా/ఐర్లాండ్) ఎంత మందిని వేలంలో తీసుకునే అవకాశముంది: 116. మొత్తంగా ఒక జట్టులో ఆటగాళ్లు 27కు మించరాదు. వీరిలో 9 మంది మాత్రమే విదేశీయులు ఉండాలి. ఎవరి వద్ద ఎంత మొత్తం ఉంది? ఢిల్లీ రూ. 37.15 కోట్లు హైదరాబాద్ రూ. 30.15 కోట్లు పుణే రూ. 27 కోట్లు రాజ్‌కోట్ రూ. 27 కోట్లు పంజాబ్ రూ. 23 కోట్లు బెంగళూరు రూ. 21.62 కోట్లు కోల్‌కతా రూ. 17.95 కోట్లు ముంబై 14.40 కోట్లు ♦ రూ. 2 కోట్ల ప్రాథమిక ధరతో ఉన్న ఆటగాళ్లు (12 మంది): యువరాజ్, పీటర్సన్, వాట్సన్, ఇషాంత్, మిషెల్ మార్ష్, నెహ్రా, దినేశ్ కార్తీక్, బిన్నీ, సంజు శామ్సన్, ధావల్ కులకర్ణి, మైక్ హస్సీ, కేన్రిచర్డ్సన్. ♦ రూ. 1.50 కోట్ల జాబితా (8 మంది): డేల్ స్టెయిన్, కామెరాన్ వైట్, జయవర్ధనే, ప్యాటిన్సన్, మోహిత్ శర్మ, హాడిన్, బట్లర్, దిల్షాన్. -
బాలీవుడ్ వర్సెస్ శివసేన
ముంబై: పాకిస్తానీ నటులు, కళాకారులు, క్రీడాకారుల పట్ల శివసేన వైఖరిపై బాలీవుడ్ మండిపడుతోంది. సంస్కృతీ, సంప్రదాయాలను రాజకీయాల నుంచి వేరుచేసి చూడాలని సూచిస్తోంది. ముంబైలో 'ద బ్యూటీ అండ్ ద బీస్ట్' పేరుతో నిర్వహిస్తున్న ఓ సంగీత కార్యక్రమానికి హాజరైన పలువురు బాలీవుడ్ ప్రముఖులు తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. కళాకారులకు హద్దులు నిర్ణయించడం సరైనది కాదన్నారు. కళలకు ఎల్లలు ఉండవంటూ వ్యాఖ్యానించారు. ఇటీవల ప్రముఖ గజల్ గాయకుడు గులాం అలీ కచేరీని అడ్డుకున్న శివసేన వైఖరిపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దర్శకులు కబీర్ ఖాన్, ఓమంగ్ కుమార్, మోహిత్ సూరి, నటుడు ఇమ్రాన్ హష్మీ, హీరోయిన్ సోహా అలీ ఖాన్, నటి నిమ్రాత కౌర్, రచయిత, గాయకుడు స్వానంద్ కిర్ కిరే తదితరలు శివసేన వైఖరిని ఖండించారు. ఇలాంటి హెచ్చరికల వల్ల బాలీవుడ్ కు జరిగే నష్టం ఏమీ ఉండదని వ్యాఖ్యానించారు. ఇలాంటి నిషేధాలు విధించడం విచారకరమని, ప్రపంచంలో ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా ఖండిచాలని అన్నారు. నైపుణ్యం కలిగిన కళాకారులకు ప్రపంచంలో ఎక్కడైనా స్వేచ్ఛగా తన కళను ప్రదర్శించుకునే హక్కు ఉంటుందని తేల్చి చెప్పారు. ప్రఖ్యాత సంగీతకారుడు, 8 సార్లు ఆస్కార ఆవార్డు విజేత అలెన్ మెంకెన్ తొలిసారిగా ఇండియాలో 'బ్యూటీ అండ్ బీస్ట్' పేరుతో ప్రదర్శన ఇస్తున్నారు. ముంబై, ఢిల్లీ నగరాలలో సంగీత కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. -
మైదానంలో మరో ప్రమాదం!
లండన్ : ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ లో ఆదివారం అనూహ్య ఘటన చోటు చేసుకుంది. నాట్ వెస్ట్ టి 20 బ్లాస్ట్ టోర్నీలో భాగంగా అరుండేల్ మైదానంలో ససెక్స్, సర్రే జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఇది జరిగింది. ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకునే ప్రయత్నంలో ఎదురెదురుగా ఢీకొన్ని ఆటగాళ్లు తీవ్రంగా గాయపడి మైదానంలో కుప్పకూలిపోయారు. అరెండెల్ వేదికగా సర్రే, సస్సెక్స్ జట్ల మధ్య జరుగిన డొమెస్టిక్ టీ 20 మ్యాచ్‌లో.. సర్రే ఆటగాళ్లు మోసెస్ హెన్రిక్స్, రోరీ బర్న్స్ తీవ్రంగా గాయపడటంతో ఆంబులెన్స్ ద్వారా వారిని ఆసుపత్రికి తరలించినట్లు, అనంతరం మ్యాచ్‌ను నిలిపివేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆటగాళ్లకు ప్రాణహాని లేదని డాక్టర్లు చెప్పారు. గడిచిన కొద్ది నెలలుగా మైదానంలో క్రికెట్ ఆటగాళ్ల మరణవార్తలు క్రీడా ప్రపంచాన్ని కుదిపేసిన నేపథ్యంలో తాజా ప్రమాదంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఆస్ట్రేలియన్ అయిన మోసెస్ హెన్రిక్స్ ఐపీఎల్- 8లో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఆల్ రౌండ్ ప్రతిభతో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. -
క్రీడా‘తారలు’
నగరానికి చెందిన క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించడం... వీరిలో కొందరి జీవిత విశేషాలు ఒక పూర్తి స్థాయి సినిమాను తలపించే రీతిలో ఉండడం మనకు తెలిసిందే. రన్నింగ్‌లో నేషనల్ ఛాంపియన్ మిల్కాసింగ్ కథతో వచ్చిన ‘భాగ్ మిల్కా భాగ్’తో పాటు బాక్సింగ్ క్రీడాకారిణి మేరీకోమ్ జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన హిందీ చిత్రం కూడా విజయవంతమయ్యాయి. దీంతో నగరం వేదికగా ఎదిగిన క్రీడాకారులు కూడా తమ ‘జీవితం’తెరకెక్కాలని కోరుకుంటున్నారు. వీరిలో కొందరిని సినిమా రూపకర్తలే సంప్రదిస్తుండగా... కొంతమంది తామే చొరవ తీసుకుని లైఫ్‘షో’కి సై అంటున్నారు. దీంతో స్పోర్ట్స్స్టార్స్ బయోపిక్స్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. - బయోపిక్స్‌పై స్పోర్ట్స్స్టార్ల ఆసక్తి - ‘అజహర్’ సినిమా ఫస్ట్‌లుక్ విడుదల - తెరపైకి మరికొందరి జీవితాలు? వెండితెర ఇప్పుడు క్రీడాకారుల జీవిత విశేషాలకు వేదికవుతోంది. క్రీడాతారల జీవిత విశేషాలతో రూపొందిన కథలకు ఆదరణ లభిస్తుండడంతో... మరికొన్ని చిత్రాలు వరుసలోకి వస్తున్నాయి. దీనికి స్టార్ ఆటగాళ్లు సైతం పచ్చజెండా ఊపుతున్నారు. కొందరైతే ఓ అడుగు ముందుకేసి తమ పాత్రలలో ఏ హీరో, హీరోయిన్లు తెరపై కనిపిస్తే బాగుంటుందో సూచిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ క్రికెట్ క్రీడాకారుడు అజహరుద్దీన్ జీవితం తెరపైకి వస్తున్న నేపథ్యంలో...మిగిలిన కథలూ ‘క్యూ’లో ఉన్నాయి. జయాపజయాల సంగతి పక్కన పెడితే ఈ క్రీడాతారల జీవితంలోని ఘట్టాల గురించి తెలుసుకునే అవకాశం ప్రేక్షకులకు దక్కుతోంది. సానియా... ఎవరయా? నగరంలో పుట్టి నాజర్ స్కూల్లో చదివి... తెలుగు రాష్ట్రాల్లో టెన్నిస్ క్రీడకు వెలుగు తెచ్చిన అసమాన క్రీడాకారిణి సానియా మీర్జా. ఆటలో అంతర్జాతీయ కీర్తి గడించిన ఈ సిటీ స్టార్... అందం... ఫ్యాషన్ స్టైల్స్‌తోనూ అందరినీ ఆకట్టుకుంటారు. పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్మాలిక్తో ప్రేమ పెళ్లి ద్వారా మీడియాకు కావాల్సినంత మసాలా అందించిన సానియా జీవితం కూడా విశేషాల మయమే. ఎంతో మంది సినిమాల్లో నటించాలనిఅడిగినా ‘నో’ చెప్పిన సానియా... తన జీవిత చరిత్రను సినిమాగా తీయడానికి మాత్రం ఇటీవలే ఓకే చెప్పారు. మరుక్షణం నుంచి తన బయోపిక్ రూపొందించేందుకు టాలీవుడ్, బాలీవుడ్ నిర్మాతలు ప్రయత్నిస్తున్నారని వినికిడి. సానియా కథతో తీసే సినిమాలో హీరోయిన్గా నటించేందుకు పలువురి పేర్లు ప్రస్తావనకు వస్తుంటే... తన పాత్ర పోషించాలంటే ప్రస్తుత నటీమణుల్లో దీపికా పదుకొనెమాత్రమే సరైన ఎంపిక అని... తన భర్త షోయబ్ పాత్రకు సల్మాన్‌ఖాన్‌ను సూచించడం ద్వారా సానియా ఈ సమస్యకు పరిష్కారం చూపారు. ఇక ఈ బయోపిక్ తెరకెక్కడమే తరువాయి. వెండితెర ‘చంద్’మామ అకస్మాత్తుగా వెలుగులోకి వచ్చిన బయోపిక్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్‌ది. నగర వాసిగా బ్యాడ్మింటన్ రంగంలో రాణించడం మాత్రమే కాకుండా సైనా నెహ్వాల్ లాంటి నెంబర్‌వన్ క్రీడాకారిణిని తీర్చిదిద్ది... నగరానికి మరిన్ని క్రీడారంగ విజయాలు దక్కేలా చేసిన గోపీచంద్ బయోపిక్ ఇప్పుడు వార్తల్లో అంశం. సూపర్ స్టార్ కృష్ణ మేనల్లుడు, హీరో సుధీర్‌బాబు (ప్రేమ కథా చిత్రం ఫేం) ఈ సినిమాలో గోపీచంద్ పాత్రలో నటి స్తున్నారు. వ్యక్తిగతంగా గోపీచంద్‌కి స్నేహితుడైన సుధీర్‌బాబు... ఈ సినిమా పట్ల అత్యంత ఆసక్తిగా ఉన్నాడని సమాచారం. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం త్వరలోనే పట్టాలకెక్కనుంది. సై... అంటూ.. బ్యాడ్మింటన్ స్టార్‌గానూ, గ్లామర్, స్టైల్స్నూ పండిస్తూ... మన సిటీ వేదికగా రాణిస్తున్న నగర క్రీడాకారిణి సైనా నెహ్వాల్ సైతం తన బయోపిక్ రూపకల్పనపై ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం వరల్డ్ నెంబర్ వన్‌గా వెలుగొందుతున్న ఈ సిటీ స్టార్... గతంలో బ్యాడ్మింటన్ ఆడిన అనుభవమున్న దీపికా పదుకొనె తన పాత్ర పోషిస్తే బాగుంటుందని... హీరోగా షారూఖ్ తన ఛాయిస్ అంటున్నారు. వ్యక్తిగతంగా తనను కాక బ్యాడ్మింటన్‌ను ప్రమోట్ చేసేలా ఆ సినిమా ఉండాలంటున్న సైనా.. మిగలిన క్రీడా నేపథ్యాల నుంచి వచ్చిన సినిమాల్లా కాక... తన సినిమా తీసేవారికి ఆటలో సాంకేతిక అంశాలపై కూడా పట్టుంటేనే... అది లక్ష్యాన్ని చేరుకుంటుందని అభిప్రాయపడుతున్నారు. అజహర్గా ఇమ్రాన్ మహ్మద్ అజహరుద్దీన్. క్రికెట్ ప్రేమికులు ముద్దుగా అజ్జూ అని పిలుచుకునే మన నగరవాసి. క్రికెట్ క్రీడాకారుడిగా, భార త టీమ్ కెప్టెన్‌గా సాధించిన విజయాలు సాధారణమైనవి కావు. ఇక్కడే పుట్టి... ఇక్కడే చదువుకుని... ఇక్కడే ఎదిగిన ఈ హైదరాబాదీ...ప్రస్తుతం పొలిటీషియన్‌గానూ రాణిస్తున్నారు. టాప్ ఫీల్డర్‌గా ప్రశంసలు... మ్యాచ్ ఫిక్స్‌ర్‌గా ఆరోపణలతో అటు క్రీడా జీవితంలో... పెళ్లి... విడాకులు... సినీ నటితో ప్రేమ... పెళ్లి... మళ్లీ.. విడాకులు... ఎదిగిన కొడుకు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం... ఇలా వ్యక్తిగత జీవితంలోనూ రకరకాల సవాళ్లను ఎదుర్కొన్న అజహర్ కథ... ఒక కలర్‌ఫుల్ సినిమాకు అవసరమైన అద్భుత ముడిసరుకు. ప్రస్తుతం ఏక్తాకపూర్ నిర్మాతగా ‘అజహర్’ పేరుతో రూపొందుతున్న బయోపిక్‌లో హిందీ హీరో ఇమ్రాన్హీష్మి నటిస్తున్నాడు. సంగీతా బిజిలానీతో ప్రేమ వ్యవహారానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ దీన్ని రూపొందిస్తున్నారని సమాచారం. ఇటీవలే దీని ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. -
ఫుట్‌బాల్ కోర్టులో ఫుడ్‌కోర్టా..?
సీపీ నిర్ణయంపై క్రీడాకారుల ఆవేదన స్టేడియం భద్రత ఇక ప్రశ్నార్థకం! ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఇటీవల ప్రారంభించిన మిడ్నైట్ ఫుడ్‌కోర్టు.. స్టేడియం మనుగడనే ప్రశ్నిస్తోంది. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున రెండింటి వరకు నగరవాసులకు అందుబాటులో ఉండేలా ఏర్పాటుచేసిన దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నారుు. అసలు ఫుట్‌బాల్ కోర్టులో ఫుడ్‌కోర్టు పెట్టడం ఏమిటని క్రీడాకారులు ప్రశ్నిస్తుంటే.. అర్ధరాత్రి వేళ నేరగాళ్లు, తీవ్రవాదులు దర్జాగా స్టేడియంలోకి ప్రవేశించే అవకాశం ఉందని కొంతమంది పోలీసులే చెబుతున్నారు. దీంతో సరికొత్త రాజధానిలో అత్యంత కీలకమైన ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం భద్రతపై నీలినీడలు కమ్ముకుంటున్నారుు. విజయవాడ స్పోర్ట్స్ : పోలీస్ కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు ఇటీవలి కాలంలో నగరవాసులహితం కోరి వినూత్న నిర్ణయూలతో అటు జనాన్ని, ఇటు పాలకుల్ని ఆకట్టుకునే ప్రయత్నంలో బిజీ అరుుపోయూరంటే అతిశయోక్తి కాదు. కాబోయే రాజధాని ప్రాంత పరిరక్షణకు, నేరగాళ్లకు బ్రేకులు వేసేందుకు ‘ఆపరేషన్ నైట్ డామినేషన్’ మొదలుపెట్టి సిటీలో పోలీసుమార్క్ డామినేషన్‌ను ప్రదర్శించే ప్రయత్నం చేశారు. ఉన్నత న్యాయస్థానం స్టే ఇచ్చినా పండుగల సీజన్లో నేరాలు జరగకుండా అనధికారికంగానైనా ఈ ఆపరేషన్‌తో మంచి ఫలి తాలే వచ్చాయంటూ పోలీసు బాస్‌కు కితాబులొచ్చారుు. ఈ విషయూన్ని పక్కన పెడితే.. తాజాగా క్రీడాకారులు దేవాలయంగా భావించే ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంపై ఆయన తీసుకునే కొన్ని నిర్ణయూలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నారుు. రాత్రిపూట జనజీవనాన్ని అడ్డుకోవటానికి తాము డామినేషన్ ప్రదర్శించడం లేదని, అర్ధరాత్రి అపరాత్రి లేకుండా తమ ఇలాకాలో జనం కోరింది కోరినట్టు ఆరగించేందుకు చక్కటి ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్టు నిరూపించుకునే ప్రయత్నం చేశారు. మెట్రో కల్చర్‌లో భాగంగానే ఓపెన్ మిడ్నైట్ కోర్టు పెట్టాలన్న ఆలోచన రావడమే కాకుండా.. చక్కటి పాత పాటల మధ్య ఆహ్లాదకర వాతావరణంలో ఫుట్‌బాల్ కోర్టులో ‘మిడ్నైట్ ఫుడ్‌కోర్టు’ను ప్రారంభించేశారు. సెకండ్ షో సినిమా చూసుకుని ఇంటికి వెళ్తూ వేడి వేడి బిర్యానీలో రెండు లెగ్ పీసులు పట్టుబట్టే అవకాశం ఓపెన్‌గా, అధికారికంగా కల్పించినందుకు పోలీస్ బాస్‌ను అంతా తెగ పొగిడేస్తున్నారు. ఇదంతా నాణేనికి ఒకవైపే.. మరోవైపు అనేక ప్రశ్నలు.. క్రీడాకారుల ప్రశ్నలివీ.. ఈ ఫుడ్‌కోర్టును ఏకంగా ఫుట్‌బాల్ కోర్టులో ఏర్పాటు చేయడంతో క్రీడాలోకం నివ్వెరపోయింది. ‘ఇదోదే ఫుట్‌బాల్ కోర్టే కదా..’ అనే చులకన భావం స్టేడియం కస్టోడియన్లకు కలగడం తమను బాధిస్తోందని క్రీడావర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. నిత్యం స్టేడియం షాపింగ్ కాంప్లెక్స్ నుంచి వచ్చే డ్రెరుునేజీ మురుగునీరుకు మట్టిగుట్టలు అడ్డుపెట్టుకుని ఆడుకునే ఫుట్‌బాల్ క్రీడాకారులు మిడ్నైట్ ఫుడ్కోర్టుతో భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులపై ఆందోళన చెందుతున్నారు. తెల్లారేసరికి ఫుడ్‌కోర్టు పెట్టిన ఆనవాళ్లు లేకుండా రోజూ శానిటేషన్ కచ్చితంగా నిర్వహిస్తామని చెబుతున్న మునిసిపల్ కమిషనర్ బదిలీ కాకుండా ఇక్కడే స్థిరంగా ఉంటారా? అని క్రీడాకారులు ప్రశ్నిస్తున్నారు. స్టేడియంలో దుర్గంధం వెదజల్లుతున్న బాత్రూమ్లను పట్టించుకోని శానిటేషన్ అధికారులు ఫుడ్‌కోర్టు విషయంలో ఎలా స్పందిస్తారంటున్నారు. చీకటి కార్యకలాపాలు జరగవన్న భరోసా ఉందా..? ఫుడ్‌కోర్టు పుణ్యమా అని అధికారికంగానే అర్ధరాత్రి స్టేడియంలోకి ప్రవేశించే వెసులుబాటు కల్పించినపుడు చీకటి కార్యకలాపాలు జరగవని గ్యారెంటీ ఏమిటన్నది క్రీడాకారుల మరో ప్రశ్న. రాత్రి రెండు గంటల వరకు ఫుడ్‌కోర్టుకు అనుమతి ఉన్నపుడు మందుబాబులు గ్యాలరీలోకి వెళ్లి కుర్చుంటామంటే అడ్డు చెప్పేదెవరు? ఇందుకు ఎవరు బాధ్యత తీసుకుంటారంటున్నారు. ఇప్పటికే నగరం నడిబొడ్డున ఉన్న ఈ స్టేడియం గోడలకు రంధ్రాలు పెట్టి లోపల ఉన్న క్రీడా సంఘాల కార్యాలయాల్లో ఏసీలు, విలువైన వస్తువులు, ఇతర సామగ్రిని అందినకాడికి దొంగిలిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజధాని నగరంలో కీలకమైన ప్రధాన స్టేడియాన్ని సీసీ కెమెరాల భద్రతల నడుమ చూడాల్సిన అధికారులు మిడ్నైట్ ఫుడ్‌కోర్టులకు నిలయం చేయడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టేడియం భద్రత ఎంత? కాబోయే రాజధాని నగరం అనేక కీలక కార్యక్రమాలకు వేదిక కానుంది. ఇలాంటి సమయంలో మిడ్నైట్ ఫుడ్‌కోర్టులకు తరలివచ్చే అపరిచితులతో స్టేడియం భద్రతకు ముప్పుతప్పదనే విషయం పోలీసు బాస్‌కు తెలియంది కాదు గానీ, ఫుడ్‌కోర్టు ఏర్పాటు వెనుక దాగి ఉన్న ఆంతర్యం అర్థం కావడం లేదని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఫుడ్‌కోర్టుకు వచ్చినోళ్లు కేవలం తినేసి వెళ్లిపోతారనుకుంటే పొరపాటే. రాత్రిపూట ఖాళీ ప్రదేశం దొరికిందని అక్కడే తిష్ట వేసే ప్రమాదం ఉంది. అసాంఘిక కార్యకలాపాలతో పాటు మలమూత్రాలు స్టేడియంలో విసర్జించి ఆ ప్రాంతాన్ని నాశనం చేసే అవకాశం ఉంది. ఇక.. ఉగ్రవాదులు, తీవ్రవాదులు రెక్కీ జరుపుకోవటానికి అవకాశం కల్పించినట్టేనని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. అంతర్జాతీయ ఖ్యాతి పొందిన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఇలాంటి తోపుడు బళ్ల మిడ్నైట్ ఫుడ్‌కోర్టులు లేవు. అక్కడ కూడా మెట్రో కల్చర్‌కు అనుగుణంగా ఫుడ్‌కోర్టులు ఉన్నాయి. కానీ, ఏ క్రీడా మైదానాన్ని వీటికి వేదికగా మార్చలేదు. -
క్రీడాకారులకు అండగా ఉంటాం: కవిత
నిజామాబాద్: తెలంగాణలో క్రీడాకారులకు అన్ని రకాలుగా వెన్నుదన్నుగా ఉంటామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు. ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తుం దని, క్రీడాకారులు ధైర్యంతో ఆడాలని సూచించారు. బుధవా రం నిజామాబాద్ కలెక్టరేట్ మైదానంలో రాష్ట్రస్థాయి వాలీ బాల్ టోర్నమెంట్‌ను ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మన రాష్ట్రం మనకు ఏర్పడిన తర్వాత క్రీడాకారులు, కళాకారులకు మంచి రోజులు వచ్చాయన్నారు. నిజామాబాద్ జిల్లాలోనే ముగ్గురు అంతర్జాతీయ క్రీడాకారిణులకు సీఎం కేసీఆర్ రూ.కోటి వరకు ఆర్థిక సాయం అందించారన్నారు.