మైదానంలో మరో ప్రమాదం! | Australia's Moises Henriques in fielding collision with Rory Burns | Sakshi
Sakshi News home page

మైదానంలో మరో ప్రమాదం!

Published Sun, Jun 14 2015 11:11 PM | Last Updated on Sun, Sep 3 2017 3:45 AM

Australia's Moises Henriques in fielding collision with Rory Burns

లండన్ : ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ లో ఆదివారం అనూహ్య ఘటన చోటు చేసుకుంది. నాట్ వెస్ట్ టి 20 బ్లాస్ట్ టోర్నీలో భాగంగా అరుండేల్ మైదానంలో ససెక్స్, సర్రే జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఇది జరిగింది.  ప్రత్యర్థి బ్యాట్స్మన్ ఇచ్చిన క్యాచ్ను అందుకునే ప్రయత్నంలో ఎదురెదురుగా ఢీకొన్ని ఆటగాళ్లు తీవ్రంగా గాయపడి మైదానంలో కుప్పకూలిపోయారు. అరెండెల్ వేదికగా సర్రే, సస్సెక్స్ జట్ల మధ్య జరుగిన డొమెస్టిక్ టీ 20 మ్యాచ్లో.. సర్రే ఆటగాళ్లు మోసెస్ హెన్రిక్స్, రోరీ బర్న్స్ తీవ్రంగా గాయపడటంతో ఆంబులెన్స్ ద్వారా వారిని ఆసుపత్రికి తరలించినట్లు, అనంతరం మ్యాచ్ను నిలిపివేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు.



ప్రాథమిక చికిత్స అనంతరం ఆటగాళ్లకు ప్రాణహాని లేదని డాక్టర్లు చెప్పారు. గడిచిన కొద్ది నెలలుగా మైదానంలో క్రికెట్ ఆటగాళ్ల మరణవార్తలు క్రీడా ప్రపంచాన్ని కుదిపేసిన నేపథ్యంలో తాజా ప్రమాదంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఆస్ట్రేలియన్ అయిన మోసెస్ హెన్రిక్స్ ఐపీఎల్- 8లో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఆల్ రౌండ్ ప్రతిభతో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement