Moises Henriques
-
ఆరు వికెట్లతో అదరగొట్టాడు.. ఎవరీ సౌరబ్ నేత్రావల్కర్?
మేజర్ లీగ్ క్రికెట్(MLC 2023)లో వాషింగ్టన్ ఫ్రీడమ్ మూడో విజయాన్ని నమోదు చేసింది. శాన్ఫ్రాన్సిస్కో యునికార్న్స్‌తో జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్ 30 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. వాషింగ్టన్ ఫ్రీడమ్ బౌలర్.. భారత సంతతికి చెందిన సౌరబ్ నేత్రావల్కర్ ఆరు వికెట్లతో చెలరేగి ప్రత్యర్థిని శాసించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడమ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. మొయిసిస్ హెన్రిక్స్ 30 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. పియనార్ 29, అండ్రీస్ గౌస్ 23 పరుగులు చేశారు. శాన్ఫ్రాన్సిస్కో బౌలర్లలో హారిస్ రవూఫ్ మూడు వికెట్లు తీయగా.. ప్లంకెట్ రెండు, స్టోయినిస్ ఒక వికెట్ తీశాడు. అనంతరం 134 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శాన్ఫ్రాన్సిస్కో యునికార్న్స్ 19.5 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. సౌరబ్ నేత్రావల్కర్ బౌలింగ్ దాటికి టాపార్డర్ కకావికలమైంది. మధ్యలో కోరే అండర్సన్ (34 పరుగులు), ఆరోన్ ఫించ్ (14 పరుగులు) ప్రతిఘటించినప్పటికి లాభం లేకపోయింది. ఆ తర్వాత నేత్రావల్కర్ టెయిలెండర్ల పని పట్టడంతో శాన్ఫ్రాన్సిస్కో ఓటమి పాలైంది. ఎవరీ నేత్రావల్కర్? భారత్ సంతతికి చెందిన సౌరబ్ నేత్రావల్కర్ ముంబై ప్రాంతంలో జన్మించాడు. అండర్-19 క్రికెట్లో ముంబైకి ప్రాతినిధ్యం వహించాడు. అయితే ఇక్కడ అవకాశాల్లేక అమెరికాకు వెళ్లిపోయాడు. మంచి లెఫ్టార్మ్ పేసర్‌గా ఎదిగిన నేత్రావల్కర్ ప్రస్తుతం అమెరికా జట్టులో కీలక బౌలర్‌గా ఉన్నాడు. యూఎస్ఏ తరపున 2019లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన నేత్రావల్కర్ 48 వన్డేల్లో 73 వికెట్లు, 9 టి20ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. అమెరికా జట్టుకు నేత్రావల్కర్ కెప్టెన్‌గానూ వ్యవహరించడం విశేషం. "KING OF SWING"😎 Saurabh Netravalkar takes a BRILLIANT😍 SIX-FOR to set his team up for success! pic.twitter.com/oY6o1cMqrK — Major League Cricket (@MLCricket) July 23, 2023 చదవండి: #LinDan: సినిమాల్లో 'డాన్'లు చాలా మందే.. బ్యాడ్మింటన్‌లో మాత్రం ఒక్కడే 'డాన్' -
ప్రత్యర్థిని చితక్కొట్టినా తప్పని ఓటమి.. వరుసగా నాలుగోది
మేజర్ లీగ్ క్రికెట్(MLC 2023)లో లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ వైఫల్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. లీగ్‌లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓటమి చవిచూసిన నైట్ రైడర్స్ ఖాతా తెరవలేకపోతుంది. తాజాగా వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో జరిగిన మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలయ్యింది. నైట్‌రైడర్స్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్(37 బంతుల్లో 70 నాటౌట్, 6 ఫోర్లు, ఆరు సిక్సర్లు ) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడినా జట్టును గెలిపించలేకపోయాడు. తొలుత బ్యాటింగ్ చేసిన లాస్ ఏంజిల్స్ నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. రసెల్ 70 నాటౌట్, రిలీ రొసౌ 41 పరుగులు మినహా మిగతావారు పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రత్యర్థి బౌలర్లలో హెన్రిక్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. మార్కో జాన్సెన్ రెండు, నెత్రావల్కర్, అకిల్ హొసెన్‌లు చెరొక వికెట్ తీశారు. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వాషింగ్టన్ ఫ్రీడమ్ 18.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. వాషింగ్టన్ ఇన్నింగ్స్‌లో అందరు బ్యాటర్లు సమిష్టిగా రాణించారు. ఓపెనర్లు మాథ్యూ స్కాట్(43 పరుగులు), ఆండ్రీస్ గౌస్(40 పరుగులు) చేయగా.. గ్లెన్ పిలిప్స్ 29, ఒబెస్ పియనర్ 26 పరుగులు నాటౌట్ జట్టును గెలిపించాడు. నైట్‌రైడర్స్ బౌలర్లలో సునీల్ నరైన్, అలీ ఖాన్, స్పెన్సర్ జాన్సన్, ఆడమ్ జంపాలు తలా ఒక వికెట్ తీశారు. కాగా వాషింగ్టన్ ఫ్రీడమ్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా.. నైట్‌రైడర్స్ నాలుగు పరాజయాలతో ఆఖరి స్థానంలో ఉంది. THE DRE RUSS SHOW!🌟 What a WAY to bring up his FIFTY AND BEYOND!📈 1⃣4⃣5⃣/4⃣ (17.0) pic.twitter.com/EBPLKpQ13u — Major League Cricket (@MLCricket) July 20, 2023 And that closes the first game in Morrisville 😁 The Washington Freedom 🔵 🔴 score 2️⃣ points, ending the tournament for the LA Knight Riders who drop to 0-4 😔 #MLC2023 pic.twitter.com/sOKjJHdmkA — Major League Cricket (@MLCricket) July 21, 2023 A disappointing season for LAKR, but one man has shined bright ✨ throughout. Andre Russell picks up today's Player of the Match for his 7️⃣0️⃣* (3️⃣7️⃣)#MLC2023 pic.twitter.com/BU3ZCxbfdh — Major League Cricket (@MLCricket) July 21, 2023 చదవండి: దాయాదుల సమరం.. ఆసుపత్రి బెడ్లను కూడా వదలడం లేదు! Indian Football Team: ఫిఫా ర్యాంకింగ్స్.. టాప్-100లో భారత జట్టుకు చోటు -
Aus Vs SL: లంకతో ఆసీస్ టీ20 సిరీస్... స్టార్ ప్లేయర్లు, హెడ్‌కోచ్ దూరం..
Aus Vs SL T20 Series: శ్రీలంకతో జరుగనున్న టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. లంక జట్టుతో స్వదేశంలో తలపడబోయే తమ ఆటగాళ్ల పేర్లను మంగళవారం వెల్లడించింది. స్టార్ ఓపెనర్, టీ20 ప్రపంచకప్-2021 ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ విజేత డేవిడ్ వార్నర్‌కు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. అతడితో పాటు మిచెల్ మార్ష్ కూడా ఈ సిరీస్‌కు దూరం కానున్నాడు. ఇక స్థానిక బిగ్‌బాష్ లీగ్‌లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న వికెట్‌కీపర్ బెన్ మెక్‌డెర్మాట్‌కు ఈ జట్టులో చోటు దక్కడం విశేషం. అదే విధంగా... యాషెస్ హీరో ట్రవిస్ హెడ్, ఆల్‌రౌండర్ మోజెస్ హెన్రిక్స్ తదితరులు లంకతో తలపడే టీమ్‌లో ఉన్నారు. ఇక ఆసీస్ హెడ్‌కోచ్ జస్టిన్ లాంగర్ లంకతో సిరీస్‌కు దూరం కానున్నాడు. మార్చిలో కంగారూల పాకిస్తాన్ పర్యటన నేపథ్యంలో ప్రణాళికలు సిద్ధం చేసేందుకు ఈ విరామాన్ని అతడు ఉపయోగించుకోనున్నాడు. కాగా ఫిబ్రవరి 11 నుంచి మొదలు కానున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం శ్రీలంక ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. శ్రీలంకతో టీ20 సిరీస్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన జట్టు: ఆరోన్ ఫించ్(కెప్టెన్), ఆష్టన్ ఆగర్, ప్యాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, మోజెస్ హెన్నిక్స్, జోష్ ఇంగ్లిస్, బెన్ మెక్‌డెర్మాట్, గ్లెన్ మాక్స్వెల్, జై రిచర్డ్సన్, కేన్ రిచర్డ్సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టొయినిస్, మాథ్యూ వేడ్, ఆడం జంపా. చదవండి: Dinesh Karthik: టీమిండియా మిడిలార్డర్ ప్లేయర్‌పై ప్రశంసలు కురిపించిన డీకే -
అదృష్టం బాగుండి ఆ బ్యాట్ ఎవరిపై పడలేదు
అహ్మదాబాద్: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా సోమవారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ మొయిసిస్ హెన్రిక్స్ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పంజాబ్ ఇన్నింగ్స్ సమయంలో 12వ ఓవర్ వేసిన సునీల్ నరైన్.. నాలుగో బంతిని ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా విసిరాడు. హెన్రిక్స దానిని స్వ్కేర్ కట్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో బ్యాట్‌ని బలంగా ఊపడంతో అతని చేతి నుంచి జారిపోయింది.ఈలోగా బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి వెనక్కి వెళ్లింది. కానీ దినేశ్ కార్తీక్ లేటుగా స్పందించడంతో అతని కాళ్ల మధ్యలో నుంచి బంతి వెనక్కి వెళ్లిపోయింది. క్యాచ్ చేజారడంతో సునీల్ నరైన్, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ నిరాశ వ్యక్తం చేశారు. అయితే హెన్రిక్స్ చేతి నుంచి చేజారిన బ్యాట్ ఏ ఫీల్డర్‌కి తాకకపోవడంతో అక్కడున్నవారు ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. ఇక ఈ మ్యాచ్‌లో కేకేఆర్ పంజాబ్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పంజాబ్ విధించిన 124 పరుగుల లక్ష్యాన్ని 16.4 ఓవర్లలోనే చేధించింది. మోర్గాన్ 47 పరుగులు నాటౌట్ చివరివరకు నిలిచి జట్టును గెలిపించాడు. ఇక కేకేఆర్ తన తర్వాతి మ్యాచ్‌లో ఏప్రిల్ 29న అహ్మదాబాద్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. చదవండి: రవి బిష్ణోయ్ సూపర్ క్యాచ్.. వీడియో వైరల్ హర్షల్ వస్తుంటే.. ధోని జోకులు.. రైనా నవ్వులు pic.twitter.com/G5njqh5R1Y — Aditya Das (@lodulalit001) April 26, 2021 -
ఆత్మహత్య ఆలోచనలో నా భార్య గుర్తొచ్చింది..
సిడ్నీ: మానసిక ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని ఆస్ట్రేలియా క్రికెటర్ మోజెస్ హెన్రిక్స్ పేర్కొన్నాడు. ఒకానొక సమయంలో ఏం చేయాలో అర్థం కాక జీవితాన్ని ముగించాలని ఫిక్స్ అయిపోయినట్లు చెప్పుకొచ్చాడు. వేగంగా కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి పిల్లర్ ఢీకొట్టి ఆత్మహత్యకు యత్నిద్దామని అనుకున్నట్లు తెలిపాడు. తాను కారులో డ్రైవ్ చేసుకుంటూ ఇంటికొచ్చే సమయంలో ఈ ఆలోచన వచ్చిందన్నాడు. అయితే తన భార్య క్రిష్టాతో పాటు కుటుంబం గుర్తుకు రావడంతో ఆత్మహత్య ఆలోచనను నుంచి బయటకు వచ్చానన్నాడు. ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. ‘ నేను మానసికంగా చాలా సతమతమయ్యా. మానసిక ఆందోళన లక్షణాలను గూగుల్ శోధించి మరీ అవునా..కాదా అని తెలుసుకున్నా. నాలో మానసిక ఆందోళన లక్షణాలు ఎక్కువగా ఉన్నాయనిపించింది. (ఆన్లైన్ పాఠాల్లో అశ్లీల చిత్రాల కలకలం..!) ఎక్కువ సేపు పడుకోవాలని ఉండేది. మందులు కోసం తీవ్రంగా ప్రయత్నించా. విశ్రాంతి తీసుకోవడానికి మత్తు మందులు వాడాలనిపించింది. అసలు ఆలోచనలు లేకుండా ఉండటం కోసం మందులు వేసుకోవాలనుకునే వాడిని. ఇలా ఒకానొక సమయంలో బ్యాంక్స్టౌన్ నుంచి ఇంటికి కారులో వస్తుండగా చనిపోవాలని అనిపించింది. 110 కి.మీ వేగంతో వెళ్లి పోల్‌ను ఢీకొట్టాలనుకున్నా. ఏదో ప్రమాదంలా కాకుండా నేరుగా వెళ్లి పోల్ గుద్దేయాలనుకున్నా. అప్పుడు అలా చేయడం కరెక్ట్ కాదనిపించింది. నా సోదరులను వదిలి ఎలా వెళ్లి పోగలను. నా భార్యను ఒంటిరిని చేసి ఆత్మహత్య చేసుకోవడం సరైనది కాదనిపించింది. నన్ను ప్రేమించే వారి కోసం బతకాలనుకున్నా. దాంతో ఒక్కసారిగా ఏడుపు వచ్చేసింది. ఆ ఆలోచన నుంచి బయటపడటానికి రెండు రోజుల పాటు 10 మందితో కూడిన నా జట్టుతోనే ఉన్నా’ అని హెన్రిక్స్ తెలిపాడు. (నాతో తప్పుగా ప్రవర్తిస్తావా అన్నాడు ..!) -
స్మిత్ చెప్పిందంతా కట్టుకథ..!
సాక్షి, స్పోర్ట్స్: బాల్ ట్యాంపరింగ్ వివాదంలో పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిన ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్‌పై ఇప్పటికే అభిమానులతో పాటు పలువురు ఆటగాళ్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతనిపై జీవితకాల నిషేధం విధిస్తారనే ప్రచారం జరగడంతో రాజస్థాన్ రాయల్స్ టీమ్ కెప్టెన్సీ నుంచి స్మిత్‌ను తొలగించింది. షాక్‌ల మీద షాక్‌లకు గురవుతున్న స్మిత్‌పై సహచర ఆటగాడు, ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మోజెస్ హెన్రిక్స్ చేసిన ట్వీట్ అతని వ్యక్తిత్వంపై అనుమానాలు రేకెత్తించేలా ఉంది. ఈ వివాదంపై స్పందించిన హెన్రిక్స్.. ‘నా అభిప్రాయం ప్రకారం సీనియర్ ఆటగాళ్లెవరూ ఈ విధమైన మోసంలో భాగస్వాములుగా ఉండరు. బెన్క్రాఫ్ట్ను రక్షించడం కోసమే స్మిత్ జట్టు సభ్యులతో కలిసి నిర్ణయం తీసుకున్నామని కట్టుకథ అల్లాడు. కెప్టెన్‌గా స్మిత్ యువ ఆటగాళ్లను రక్షించే ప్రయత్నంలో ఇలా ప్రవర్తిస్తున్నాడంటూ’ ట్వీట్ చేశాడు. ట్యాంపరింగ్ వివాదం గురించి స్మిత్ మాట్లాడుతూ.. ఇదంతా జట్టు సమష్టి నిర్ణయమేనని చెప్పిన విషయం తెలిసిందే. ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు వీడియోలో కనిపించడంతో కామెరున్ బెన్‌క్రాప్ట్.. ఈ తప్పిదానికి తాను పర్యవసానాలు ఎదుర్కోక తప్పదని వివరణ కూడా ఇచ్చుకున్నాడు. In my uneducated opinion, I dare say there was never a senior players meeting to discuss cheating - Smith made that up to take the heat of a young Cameron Bancroft not realising the outrage that would follow. — Moises Henriques (@Mozzie21) March 26, 2018 Ps. Not saying no one was aware of Cameron doing it, just highly doubt there was a ‘senior players meeting’ to decide to cheat. I think it was the captain attempting to protect a young player. They had 10 mins of panic between end of play & press conference. — Moises Henriques (@Mozzie21) March 26, 2018 -
హెన్రిక్స్‌కు నేడు శస్త్ర చికిత్స
లండన్: కౌంటీ మ్యాచ్‌లో సహచరుడిని బలంగా ఢీకొని గాయపడిన ఆస్ట్రేలియా ఆటగాడు మోజెస్ హెన్రిక్స్‌కు నేడు (మంగళవారం) శస్త్ర చికిత్స చేయనున్నారు. ససెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో క్యాచ్‌ను పట్టుకునేందుకు సర్రే ఆటగాళ్లు హెన్రిక్స్, రోరి బర్న్స్ ప్రయత్నిస్తుండగా అనుకోకుండా ఒకరినొకరు ఢీకొన్నారు. ఈక్రమంలో హెన్రిక్స్ దవడ మూడు చోట్ల విరిగింది. అటు బర్న్స్ తల, కంటికి గాయమైంది. ఇద్దరినీ వెంటనే ఆస్పత్రిలో చేర్పించగా ప్రమాదమేమీ లేదని డాక్టర్లు ప్రకటించారు. ‘ఇది నిజంగా దురదృష్టకరమైన వార్త. హెన్రిక్స్‌కు తొలి సర్జరీ చేయనున్నారు. పూర్తిగా కోలుకునే వరకు తను ఇంగ్లండ్‌లోనే ఉంటాడు’ అని క్రికెట్ న్యూసౌత్ వేల్స్ సీఈవో ఆండ్రూ జోన్స్ తెలిపారు. మరోవైపు హెన్రిక్స్ ప్రియురాలిని యూకే పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం తను మాట్లాడే స్థితిలో లేకపోయినా సంక్షిప్త సందేశాలతో బదులిస్తున్నట్టు హెన్రిక్స్ మేనేజర్ నిక్ ఫోర్దమ్ తెలిపారు. -
మైదానంలో మరో ప్రమాదం!
లండన్ : ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ లో ఆదివారం అనూహ్య ఘటన చోటు చేసుకుంది. నాట్ వెస్ట్ టి 20 బ్లాస్ట్ టోర్నీలో భాగంగా అరుండేల్ మైదానంలో ససెక్స్, సర్రే జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఇది జరిగింది. ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకునే ప్రయత్నంలో ఎదురెదురుగా ఢీకొన్ని ఆటగాళ్లు తీవ్రంగా గాయపడి మైదానంలో కుప్పకూలిపోయారు. అరెండెల్ వేదికగా సర్రే, సస్సెక్స్ జట్ల మధ్య జరుగిన డొమెస్టిక్ టీ 20 మ్యాచ్‌లో.. సర్రే ఆటగాళ్లు మోసెస్ హెన్రిక్స్, రోరీ బర్న్స్ తీవ్రంగా గాయపడటంతో ఆంబులెన్స్ ద్వారా వారిని ఆసుపత్రికి తరలించినట్లు, అనంతరం మ్యాచ్‌ను నిలిపివేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆటగాళ్లకు ప్రాణహాని లేదని డాక్టర్లు చెప్పారు. గడిచిన కొద్ది నెలలుగా మైదానంలో క్రికెట్ ఆటగాళ్ల మరణవార్తలు క్రీడా ప్రపంచాన్ని కుదిపేసిన నేపథ్యంలో తాజా ప్రమాదంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఆస్ట్రేలియన్ అయిన మోసెస్ హెన్రిక్స్ ఐపీఎల్- 8లో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఆల్ రౌండ్ ప్రతిభతో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.