
Aus Vs SL T20 Series: శ్రీలంకతో జరుగనున్న టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. లంక జట్టుతో స్వదేశంలో తలపడబోయే తమ ఆటగాళ్ల పేర్లను మంగళవారం వెల్లడించింది. స్టార్ ఓపెనర్, టీ20 ప్రపంచకప్-2021 ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ విజేత డేవిడ్ వార్నర్‌కు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. అతడితో పాటు మిచెల్ మార్ష్ కూడా ఈ సిరీస్‌కు దూరం కానున్నాడు. ఇక స్థానిక బిగ్‌బాష్ లీగ్‌లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న వికెట్‌కీపర్ బెన్ మెక్‌డెర్మాట్‌కు ఈ జట్టులో చోటు దక్కడం విశేషం.
అదే విధంగా... యాషెస్ హీరో ట్రవిస్ హెడ్, ఆల్‌రౌండర్ మోజెస్ హెన్రిక్స్ తదితరులు లంకతో తలపడే టీమ్‌లో ఉన్నారు. ఇక ఆసీస్ హెడ్‌కోచ్ జస్టిన్ లాంగర్ లంకతో సిరీస్‌కు దూరం కానున్నాడు. మార్చిలో కంగారూల పాకిస్తాన్ పర్యటన నేపథ్యంలో ప్రణాళికలు సిద్ధం చేసేందుకు ఈ విరామాన్ని అతడు ఉపయోగించుకోనున్నాడు. కాగా ఫిబ్రవరి 11 నుంచి మొదలు కానున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం శ్రీలంక ఆస్ట్రేలియాలో పర్యటించనుంది.
శ్రీలంకతో టీ20 సిరీస్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన జట్టు:
ఆరోన్ ఫించ్(కెప్టెన్), ఆష్టన్ ఆగర్, ప్యాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, మోజెస్ హెన్నిక్స్, జోష్ ఇంగ్లిస్, బెన్ మెక్‌డెర్మాట్, గ్లెన్ మాక్స్‌వెల్, జై రిచర్డ్‌సన్, కేన్ రిచర్డ్‌సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టొయినిస్, మాథ్యూ వేడ్, ఆడం జంపా.
చదవండి: Dinesh Karthik: టీమిండియా మిడిలార్డర్ ప్లేయర్‌పై ప్రశంసలు కురిపించిన డీకే
Comments
Please login to add a commentAdd a comment