స్మిత్‌ చెప్పిందంతా కట్టుకథ..! | Moises Henriques Claims Steve Smith Lied About Ball Tampering Plan | Sakshi
Sakshi News home page

స్మిత్‌ చెప్పిందంతా కట్టుకథ..!

Published Mon, Mar 26 2018 4:52 PM | Last Updated on Mon, Mar 26 2018 4:52 PM

Moises Henriques Claims Steve Smith Lied About Ball Tampering Plan - Sakshi

ఆస్ట్రేలియా క్రికెటర్లు హెన్రిక్స్‌, స్మిత్ (ఫైల్ ఫొటో)

సాక్షి, స్పోర్ట్స్: బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిన ఆస్ట్రేలియా క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌పై ఇప్పటికే అభిమానులతో పాటు పలువురు ఆటగాళ్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతనిపై జీవితకాల నిషేధం విధిస్తారనే ప్రచారం జరగడంతో రాజస్థాన్‌ రాయల్స్‌ టీమ్‌ కెప్టెన్సీ నుంచి స్మిత్‌ను తొలగించింది. షాక్‌ల మీద షాక్‌లకు గురవుతున్న స్మిత్‌పై సహచర ఆటగాడు, ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మోజెస్‌ హెన్రిక్స్‌ చేసిన ట్వీట్‌ అతని వ్యక్తిత్వంపై అనుమానాలు రేకెత్తించేలా ఉంది.

ఈ వివాదంపై స్పందించిన హెన్రిక్స్‌.. ‘నా అభిప్రాయం ప్రకారం సీనియర్‌ ఆటగాళ్లెవరూ ఈ విధమైన మోసంలో భాగస్వాములుగా ఉండరు. బెన్‌క్రాఫ్ట్‌ను రక్షించడం కోసమే స్మిత్‌ జట్టు సభ్యులతో కలిసి నిర్ణయం తీసుకున్నామని కట్టుకథ అల్లాడు. కెప్టెన్‌గా స్మిత్‌ యువ ఆటగాళ్లను రక్షించే ప్రయత్నంలో ఇలా ప్రవర్తిస్తున్నాడంటూ’  ట్వీట్‌ చేశాడు.

ట్యాంపరింగ్‌ వివాదం గురించి స్మిత్‌ మాట్లాడుతూ.. ఇదంతా జట్టు సమష్టి నిర్ణయమేనని చెప్పిన విషయం తెలిసిందే. ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు వీడియోలో కనిపించడంతో కామెరున్‌ బెన్‌క్రాప్ట్‌.. ఈ తప్పిదానికి తాను పర్యవసానాలు ఎదుర్కోక తప్పదని వివరణ కూడా ఇచ్చుకున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement