Major League Cricket 2023: Washington Freedom Win By 6 Wickets, LA Knight Riders 4th Consecutive Loss - Sakshi
Sakshi News home page

MLC 2023 LAKR Vs WSH: ప్రత్యర్థిని చితక్కొట్టినా తప్పని ఓటమి.. వరుసగా నాలుగోది

Published Fri, Jul 21 2023 1:38 PM | Last Updated on Fri, Jul 21 2023 1:49 PM

Washington-Freedom Win-By 6 Wkts-LA Knight Riders 4th-Successive Loss - Sakshi

మేజర్‌ లీగ్‌ క్రికెట్(MLC 2023)లో లాస్‌ ఏంజిల్స్‌ నైట్‌ రైడర్స్‌ వైఫల్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. లీగ్‌లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓటమి చవిచూసిన నైట్‌ రైడర్స్‌ ఖాతా తెరవలేకపోతుంది. తాజాగా వాషింగ్టన్‌ ఫ్రీడమ్‌తో జరిగిన మ్యాచ్‌లో నైట్‌రైడర్స్‌ ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలయ్యింది. నైట్‌రైడర్స్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌(37 బంతుల్లో 70 నాటౌట్‌, 6 ఫోర్లు, ఆరు సిక్సర్లు ) విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడినా జట్టును గెలిపించలేకపోయాడు.

తొలుత బ్యాటింగ్‌ చేసిన లాస్‌ ఏంజిల్స్‌ నైట్‌రైడర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. రసెల్‌ 70 నాటౌట్‌, రిలీ రొసౌ 41 పరుగులు మినహా మిగతావారు పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రత్యర్థి బౌలర్లలో హెన్రిక్స్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. మార్కో జాన్సెన్‌ రెండు, నెత్రావల్కర్‌, అకిల్‌ హొసెన్‌లు చెరొక వికెట్‌ తీశారు.

176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వాషింగ్టన్‌ ఫ్రీడమ్‌ 18.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. వాషింగ్టన్‌ ఇన్నింగ్స్‌లో అందరు బ్యాటర్లు సమిష్టిగా రాణించారు. ఓపెనర్లు మాథ్యూ స్కాట్‌(43 పరుగులు), ఆండ్రీస్‌ గౌస్‌(40 పరుగులు) చేయగా.. గ్లెన్‌ పిలిప్స్‌ 29, ఒబెస్‌ పియనర్‌ 26 పరుగులు నాటౌట్‌ జట్టును గెలిపించాడు. నైట్‌రైడర్స్‌ బౌలర్లలో సునీల్‌ నరైన్‌, అలీ ఖాన్‌, స్పెన్సర్‌ జాన్సన్‌, ఆడమ్‌ జంపాలు తలా ఒక వికెట్‌ తీశారు. కాగా వాషింగ్టన్‌ ఫ్రీడమ్‌ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా.. నైట్‌రైడర్స్‌ నాలుగు పరాజయాలతో ఆఖరి స్థానంలో ఉంది.

చదవండి: దాయాదుల సమరం.. ఆసుపత్రి బెడ్లను కూడా వదలడం లేదు!

Indian Football Team: ఫిఫా ర్యాంకింగ్స్‌.. టాప్‌-100లో భారత జట్టుకు చోటు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement