Los Angeles Knight Riders
-
పోలార్డ్ వీర బాదాడు.. ప్లే ఆఫ్స్‌లోకి ముంబై ఇండియన్స్
మేజర్ లీగ్ క్రికెట్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ న్యూయార్క్ వరుసగా రెండో ఏడాది ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్‌తో ఇవాళ (జులై 22) జరిగిన కీలక మ్యాచ్‌లో ఆ జట్టు 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉండింది.తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్.. రషీద్ ఖాన్ (4-0-22-3), నోష్తుష్ కెంజిగే (4-0-22-2), ట్రెంట్ బౌల్ట్ (4-0-38-2), రొమారియో షెపర్డ్ (4-0-30-1), కీరన్ పోలార్డ్ (0.1-0-0-1) ధాటికి 19.1 ఓవర్లలో 130 పరుగులకు ఆలౌటైంది. నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌లో ఆండ్రీ రసెల్ (21 బంతుల్లో 35; 6 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలువగా.. జేసన్ రాయ్ (23 బంతుల్లో 27; 3 ఫోర్లు, సిక్స్), నితీశ్ కుమార్ (15), స్పెన్సర్ జాన్సన్ (10) రెండంకెల స్కోర్లు చేశారు. సునీల్ నరైన్ (6), ఉన్ముక్త్ చంద్ (9), డేవిడ్ మిల్లర్ (6), సైఫ్ బదార్ (9), కోర్నే డ్రై (1), అలీ ఖాన్ (0) నిరాశపరిచారు.131 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. 17 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. డెవాల్డ్ బ్రెవిస్ (19 బంతుల్లో 27; 5 ఫోర్లు), నికోలస్ పూరన్ (28 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరు స్కోర్లతో రాణించగా.. ఆఖర్లో పోలార్డ్ (12 బంతుల్లో 33 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) వీర బాదుడు బాదాడు. నైట్‌రైడర్స్ బౌలర్లలో నరైన్ 2, స్పెన్సర్ జాన్సన్, డ్రై, రసెల్, అలీ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ ఓటమితో నైట్‌రైడర్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. వాషింగ్టన్ ఫ్రీడం, శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, టెక్సాస్ సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ న్యూయార్క్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. -
సౌతాఫ్రికా ఓపెనర్ ఊచకోత.. 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో! అయినా పాపం
మేజర్ లీగ్ క్రికెట్ 2024లో సీటెల్ ఓర్కాస్ వరుసగా మూడో ఓటమి చవి చూసింది. ఈ లీగ్‌లో భాగంగా లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఓర్కాస్ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీటెల్ ఓర్కాస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది.ఓర్కాస్ బ్యాటర్లంతా విఫలమైనప్పటకి ఆ జట్టు ఓపెనర్, దక్షిణాఫ్రికా స్టార్ ర్యాన్ రికెల్టన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. రికెల్టన్ నైట్ రైడర్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో 52 బంతులు ఎదుర్కొన్న రికెల్టన్.. 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 89 పరుగులు చేసి ఔటయ్యాడు.నైట్‌రైడర్స్ బౌలర్లలో జాన్సన్, రస్సెల్, నరైన్, డ్రై తలా వికెట్ సాధించారు. అనంతరం 143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నైట్‌రైడర్స్.. 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. నైట్‌రైడర్స్ బ్యాటర్లలో భారత మాజీ అండర్-19 కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు.47 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 62 పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించాడు. అతడితో పాటు జాసన్ రాయ్ 27 పరుగులతో రాణించాడు. సీటెల్ ఓర్కాస్ బౌలర్లలో గనూన్, హార్మత్ సింగ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ఎంగిడీ, కీమో పాల్ చెరో వికెట్ సాధించారు. ఏదమైనప్పటకి సీటెల్ ఓర్కాస్ ఓటమి పాలవ్వడంతో ర్యాన్ రికెల్టన్ అద్భుత ఇన్నింగ్స్ వృథాగా మిగిలిపోయింది. -
శివాలెత్తిన రొస్సో.. నైట్ రైడర్స్ ఖాతాలో తొలి విజయం
మేజర్ లీగ్ క్రికెట్ సీజన్ 2023లో లాస్ ఏంజెలెస్ నైట్ రైడర్స్ తొలి విజయం నమోదు చేసింది. నిన్న (జులై 23) సీయాటిల్ ఆర్కాస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. రిలీ రొస్సో (38 బంతుల్లో 78 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) అజేయమైన మెరుపు హాఫ్ సెంచరీతో విరుచుకుపడి నైట్ రైడర్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. రొస్సోకు ఆండ్రీ రసెల్ (29 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సహకరించాడు. ఫలితంగా నైట్ రైడర్స్.. ఆర్కాస్ నిర్ధేశించిన 171 పరుగుల లక్ష్యాన్ని 8 వికెట్లు కోల్పోయి మరో 5 బంతులు మిగిలుండగానే ఛేదించింది. One of the innings of the tournament 👏 Rilee Rossouw wins the Player of the Match award for his impressive 7️⃣8️⃣* (3️⃣8️⃣)#MLC2023 pic.twitter.com/WQhNFWn3UH — Major League Cricket (@MLCricket) July 23, 2023 ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్కాస్.. షెహన్ జయసూర్య (45 బంతుల్లో 60 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. స్టార్ బ్యాటర్ డికాక్ (10) విఫలం కాగా.. నౌమన్ అన్వర్ (32; 5 ఫోర్లు), క్లాసెన్ (13 బంతుల్లో 25; 3 ఫోర్లు, సిక్స్) పర్వాలేదనిపించాడు. నైట్ రైడర్స్ బౌలర్లలో ఆడమ్ జంపా 2 వికెట్లు పడగొట్టగా.. స్పెన్సర్ జాన్సన్, ఆండ్రీ రసెల్, వాన్ షాల్విక్, కెప్టెన్ సునీల్ నరైన్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్ రైడర్స్‌కు మంచి ఆరంభం లభించనప్పటికీ.. రొస్సో, రసెల్ ఆ జట్టును గెలిపించారు. 8 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో బరిలోకి దిగిన రొస్సో ఆఖరి వరకు క్రీజ్‌లో నిలబడి నైట్ రైడర్స్‌కు సీజన్ తొలి విజయాన్ని అందించాడు. నైట్ రైడర్స్ ఇన్నింగ్స్‌లో జేసన్ రాయ్ (2), జస్కరన్ మల్హోత్రా (2), గజానంద్ సింగ్ (3),సునీల్ నరైన్ (8) విఫలం కాగా.. సైఫ్ దర్బార్ (10), వాన్ షాల్విక్ (12), ఆడమ్ జంపా (12) రెండంకెల స్కోర్లు చేశారు. ఆర్కాస్ బౌలర్లలో కెమరాన్ గానన్ 3 వికెట్లతో రాణించగా.. ఆండ్రూ టై 2, ఇమాద్ వసీం, కెప్టెన్ వేన్ పార్నెల్, హర్మీత్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు. -
'చిన్నా.. నేను క్రీజులో ఉన్నానంటే బంతిపై కన్నేసి ఉంచాలి'
మేజర్ క్రికెట్ లీగ్(MLC 2023)లో లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ ఇప్పటివరకు భోణీ చేయలేకపోయింది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ పరాజయాలే చవిచూసిన నైట్‌రైడర్స్ జట్టు ఎప్పుడు గెలుపు బాట పడుతుందనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో జరిగిన మ్యాచ్‌లో లాస్ ఏంజిల్స్ నైట్‌రైడర్స్ ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలయ్యింది. అయితే మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ మాత్రం సక్సెస్ అయ్యాడు. 37 బంతుల్లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 70 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. తాను విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన బౌలింగ్ వైఫల్యంతో నైట్‌రైడర్స్ ఓటమి పాలైంది. ఈ సంగతి పక్కనబెడితే రసెల్ కొట్టిన సిక్సర్లలో ఒక బంతి పిల్లాడిని గాయపరిచింది. ఇన్నింగ్స్ 13వ ఓవర్లో అకీల్ హొసెన్ వేసిన రెండో బంతిని రసెల్ లాంగాఫ్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. స్టాండ్సలోకి వెళ్లిన బంతి నేరుగా పిల్లాడి తలకు తాకింది. దీంతో పిల్లాడు నొప్పితో విలవిల్లాడిపోయాడు. ఆ తర్వాత పిల్లాడి తండ్రి ఐస్ప్యాక్తో తలకు మర్దన చేస్తూ స్టేడియంలోకి వచ్చాడు. ఇది గమనించిన రసెల్ పిల్లాడి దగ్గరకు వచ్చి ఒక హగ్ ఇచ్చాడు. ఆ తర్వాత అతనికి సిగ్నేచర్ చేసిన బ్యాట్‌తో పాటు టోపీలు గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ సందర్భంగా పిల్లాడికి రసెల్ ఒక సలహా కూడా ఇచ్చాడు.. చూడు చిన్న.. రసెల్ బ్యాటింగ్‌లో ఉన్నాడంటే బంతిపై కూడా ఒక కన్నేసి ఉంచు.. ఓకేనా అని తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తొలుత బ్యాటింగ్ చేసిన లాస్ ఏంజిల్స్ నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. రసెల్ 70 నాటౌట్, రిలీ రొసౌ 41 పరుగులు మినహా మిగతావారు పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రత్యర్థి బౌలర్లలో హెన్రిక్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. మార్కో జాన్సెన్ రెండు, నెత్రావల్కర్, అకిల్ హొసెన్‌లు చెరొక వికెట్ తీశారు. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వాషింగ్టన్ ఫ్రీడమ్ 18.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. వాషింగ్టన్ ఇన్నింగ్స్‌లో అందరు బ్యాటర్లు సమిష్టిగా రాణించారు. ఓపెనర్లు మాథ్యూ స్కాట్(43 పరుగులు), ఆండ్రీస్ గౌస్(40 పరుగులు) చేయగా.. గ్లెన్ పిలిప్స్ 29, ఒబెస్ పియనర్ 26 పరుగులు నాటౌట్ జట్టును గెలిపించాడు. Dre Russ made sure to check on the kid who took a blow to his head from one of his sixes in Morrisville 💜 We’re glad the impact wasn’t too bad, and the li’l champ left with a smile and some mementos for a lifetime.#LAKR #LosAngeles #WeAreLAKR #MLC23 #AndreRussell @Russell12A… pic.twitter.com/EtLO5z2avx — Los Angeles Knight Riders (@LA_KnightRiders) July 22, 2023 చదవండి: IND vs WI: అశ్విన్‌తో అట్లుంటది మరి.. విండీస్ కెప్టెన్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో వైరల్ -
ప్రత్యర్థిని చితక్కొట్టినా తప్పని ఓటమి.. వరుసగా నాలుగోది
మేజర్ లీగ్ క్రికెట్(MLC 2023)లో లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ వైఫల్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. లీగ్‌లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓటమి చవిచూసిన నైట్ రైడర్స్ ఖాతా తెరవలేకపోతుంది. తాజాగా వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో జరిగిన మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలయ్యింది. నైట్‌రైడర్స్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్(37 బంతుల్లో 70 నాటౌట్, 6 ఫోర్లు, ఆరు సిక్సర్లు ) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడినా జట్టును గెలిపించలేకపోయాడు. తొలుత బ్యాటింగ్ చేసిన లాస్ ఏంజిల్స్ నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. రసెల్ 70 నాటౌట్, రిలీ రొసౌ 41 పరుగులు మినహా మిగతావారు పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రత్యర్థి బౌలర్లలో హెన్రిక్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. మార్కో జాన్సెన్ రెండు, నెత్రావల్కర్, అకిల్ హొసెన్‌లు చెరొక వికెట్ తీశారు. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వాషింగ్టన్ ఫ్రీడమ్ 18.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. వాషింగ్టన్ ఇన్నింగ్స్‌లో అందరు బ్యాటర్లు సమిష్టిగా రాణించారు. ఓపెనర్లు మాథ్యూ స్కాట్(43 పరుగులు), ఆండ్రీస్ గౌస్(40 పరుగులు) చేయగా.. గ్లెన్ పిలిప్స్ 29, ఒబెస్ పియనర్ 26 పరుగులు నాటౌట్ జట్టును గెలిపించాడు. నైట్‌రైడర్స్ బౌలర్లలో సునీల్ నరైన్, అలీ ఖాన్, స్పెన్సర్ జాన్సన్, ఆడమ్ జంపాలు తలా ఒక వికెట్ తీశారు. కాగా వాషింగ్టన్ ఫ్రీడమ్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా.. నైట్‌రైడర్స్ నాలుగు పరాజయాలతో ఆఖరి స్థానంలో ఉంది. THE DRE RUSS SHOW!🌟 What a WAY to bring up his FIFTY AND BEYOND!📈 1⃣4⃣5⃣/4⃣ (17.0) pic.twitter.com/EBPLKpQ13u — Major League Cricket (@MLCricket) July 20, 2023 And that closes the first game in Morrisville 😁 The Washington Freedom 🔵 🔴 score 2️⃣ points, ending the tournament for the LA Knight Riders who drop to 0-4 😔 #MLC2023 pic.twitter.com/sOKjJHdmkA — Major League Cricket (@MLCricket) July 21, 2023 A disappointing season for LAKR, but one man has shined bright ✨ throughout. Andre Russell picks up today's Player of the Match for his 7️⃣0️⃣* (3️⃣7️⃣)#MLC2023 pic.twitter.com/BU3ZCxbfdh — Major League Cricket (@MLCricket) July 21, 2023 చదవండి: దాయాదుల సమరం.. ఆసుపత్రి బెడ్లను కూడా వదలడం లేదు! Indian Football Team: ఫిఫా ర్యాంకింగ్స్.. టాప్-100లో భారత జట్టుకు చోటు -
మాథ్యూ వేడ్ వీరవిహారం.. రసెల్, నరైన్ మెరుపులు వృధా
మేజర్ లీగ్ క్రికెట్-2023 సీజన్లో భాగంగా లాస్ ఏంజెలెస్ నైట్ రైడర్స్‌తో ఇవాళ (జులై 19) జరిగిన మ్యాచ్‌లో శాన్ఫ్రాన్సిస్కో యునికార్న్స్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యునికార్న్స్, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ మాథ్యూ వేడ్ (41 బంతుల్లో 78; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) బౌండరీలు, సిక్సర్లతో వీరవిహారం చేయగా.. మరో ఓపెనర్ ఫిన్ అలెన్ 2 సిక్సర్లు, బౌండరీతో 20 పరుగులు, స్టోయినిస్ 37 (18 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కోరె ఆండర్సన్ 39 పరుగులు (20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశారు. కెప్టెన్ ఫించ్ 12 పరుగులతో (10 బంతుల్లో 2 ఫోర్లు) అజేయంగా నిలిచాడు. నైట్‌రైడర్స్ బౌలర్లలో ఆడమ్ జంపా 3 వికెట్లు పడగొట్టగా.. అలీ ఖాన్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 213 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్‌రైడర్స్.. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులకే పరిమితమైంది. ఆరంభంలో జేసన్ రాయ్ (21 బంతుల్లో 45; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), నితీశ్ కుమార్ (23 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్).. ఆఖర్లో ఆండ్రీ రసెల్ (26 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), సునీల్ నరైన్ (17 బంతుల్లో 28 నాటౌట్; 3 సిక్సర్లు) రాణించినప్పటికీ నైట్‌రైడర్స్ విజయతీరాలకు చేరలేకపోయింది. నైట్ రైడర్స్ ఇన్నింగ్స్‌లో రిలీ రొస్సో (8) నిరాశపరిచాడు. యునికార్న్స్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టగా.. హరీస్ రౌఫ్, బిష్ణోయ్, ఆండర్సన్ తలో వికెట్ చేజిక్కించుకున్నారు. ఈ ఓటమితో నైట్‌రైడర్స్ లీగ్‌లో హ్యాట్రిక్ ఓటములను నమోదు చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ అనుబంధ ఫ్రాంచైజీ అయిన లాస్ ఏంజెలెస్ నైట్ రైడర్స్ మేజర్ లీగ్ క్రికెట్ సీజన్ 2023లో ఇంకా బోణీ కొట్టాల్సి ఉంది. -
మిల్లర్ కిల్లర్ ఇన్నింగ్స్.. రసెల్ పోరాటం వృధా.. బోణీ కొట్టిన సూపర్ కింగ్స్
అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ) తొలి సీజన్ నిన్నటి (జులై 13) నుంచి ప్రారంభమైంది. సీజన్ ఆరంభ మ్యాచ్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్.. లాస్ ఏంజెలెస్ నైట్ రైడర్స్‌పై విజయఢంకా మోగించింది. భారతకాలమానం ప్రకారం ఇవాళ ఉదయం ప్రారంభమైన మ్యాచ్‌లో సూపర్ కింగ్స్ 69 పరుగుల తేడాతో గెలుపొంది, ఎంఎల్సీ-2023లో బోణీ విజయం దక్కించుకుంది. మిల్లర్ కిల్లర్ ఇన్నింగ్స్.. కాన్వే సూపర్ ఫిఫ్టి.. బ్రేవో మెరుపులు ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్.. కాన్వే (37 బంతుల్లో 55; 7 ఫోర్లు, సిక్స్), డేవిడ్ మిల్లర్ (42 బంతుల్లో 61; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ధసెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఆఖర్లో మిచెల్ సాంట్నర్ (14 బంతుల్లో 21; 2 సిక్సర్లు), డ్వేన్ బ్రేవో (6 బంతుల్లో 16 నాటౌట్; 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. సూపర్ కింగ్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తానెదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. నైట్‌రైడర్స్ బౌలరల్లో అలీ ఖాన్, లోకీ ఫెర్గూసన్ తలో 2 వికెట్లు.. సునీల్ నరైన్, ఆడమ్ జంపా చెరో వికెట్ దక్కించుకున్నారు. రసెల్ పోరాటం వృధా.. 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్ రైడర్స్.. సూపర్ కింగ్స్ బౌలర్ల ధాటికి 14 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. సూపర్ కింగ్స్ స్పిన్నర్ మొహమ్మద్ మొహిసిన్ (4/8) నైట్‌రైడర్స్ పతనాన్ని శాశించగా.. గెరాల్డ్ కొయెట్జీ, రస్టీ థెరన్ తలో 2 వికెట్లు, కాల్విన్ సావేజ్, డ్వేన్ బ్రేవో చెరో వికెట్ పడగొట్టారు. నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌లో మిగతా బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కడుతుంటే విండీస్ విధ్వంసర వీరుడు ఆండ్రీ రసెల్ (34 బంతుల్లో 55; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒక్కడే ఒంటరిపోరాటం చేశాడు. జస్కరన్ మల్హోత్రా (22), సునీల్ నరైన్ (15) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతావారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. మార్టిన్ గప్తిల్ (0), ఉన్ముక్త్ చంద్ (4), రిలీ రొస్సో (4), జంపా (3), ఫెర్గూసన్ (1) నిరాశపరిచారు. కాగా, ఐపీఎల్ ఫ్రాంచైజీల యాజమాన్యాలే ఎంఎల్సీ జట్లను కూడా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం.. టెక్సాస్ సూపర్ కింగ్స్‌ను, కోల్‌కతా నైట్‌రైడర్స్ యాజమాన్యం.. లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్‌ను సొంతం చేసుకున్నాయి. లీగ్‌లో భాగంగా రేపు (భారతకాలమానం ప్రకారం) సీటిల్ ఓర్కాస్, వాషింగ్టన్ ఫ్రీడం జట్లు.. ముంబై ఇండియన్స్ న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ జట్లు తలపడతాయి.