మేజర్ లీగ్ క్రికెట్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ న్యూయార్క్ వరుసగా రెండో ఏడాది ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్‌తో ఇవాళ (జులై 22) జరిగిన కీలక మ్యాచ్‌లో ఆ జట్టు 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉండింది.
తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్.. రషీద్ ఖాన్ (4-0-22-3), నోష్తుష్ కెంజిగే (4-0-22-2), ట్రెంట్ బౌల్ట్ (4-0-38-2), రొమారియో షెపర్డ్ (4-0-30-1), కీరన్ పోలార్డ్ (0.1-0-0-1) ధాటికి 19.1 ఓవర్లలో 130 పరుగులకు ఆలౌటైంది. నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌లో ఆండ్రీ రసెల్ (21 బంతుల్లో 35; 6 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలువగా.. జేసన్ రాయ్ (23 బంతుల్లో 27; 3 ఫోర్లు, సిక్స్), నితీశ్ కుమార్ (15), స్పెన్సర్ జాన్సన్ (10) రెండంకెల స్కోర్లు చేశారు. సునీల్ నరైన్ (6), ఉన్ముక్త్ చంద్ (9), డేవిడ్ మిల్లర్ (6), సైఫ్ బదార్ (9), కోర్నే డ్రై (1), అలీ ఖాన్ (0) నిరాశపరిచారు.
131 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. 17 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. డెవాల్డ్ బ్రెవిస్ (19 బంతుల్లో 27; 5 ఫోర్లు), నికోలస్ పూరన్ (28 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరు స్కోర్లతో రాణించగా.. ఆఖర్లో పోలార్డ్ (12 బంతుల్లో 33 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) వీర బాదుడు బాదాడు.
నైట్‌రైడర్స్ బౌలర్లలో నరైన్ 2, స్పెన్సర్ జాన్సన్, డ్రై, రసెల్, అలీ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ ఓటమితో నైట్‌రైడర్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. వాషింగ్టన్ ఫ్రీడం, శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, టెక్సాస్ సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ న్యూయార్క్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి.
Comments
Please login to add a commentAdd a comment