మేజర్ లీగ్ క్రికెట్ 2024 ఎడిషన్‌లో శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ ప్లే ఆఫ్స్‌కు చేరింది. ముంబై ఇండియన్స్ న్యూయార్క్‌తో ఇవాళ (జులై 19) జరిగిన మ్యాచ్‌లో 3 పరుగుల తేడాతో గెలుపొంది, ఫైనల్ ఫోర్‌కు చేరిన రెండో జట్టుగా నిలిచింది. యూనికార్న్స్‌కు ముందు వాషింగ్టన్ ఫ్రీడం ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. యూనికార్న్స్ చేతిలో ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపుగా చేజార్చుకుంది. ఈ ఎడిషన్‌లో ఎంఐ టీమ్‌కు ఇది వరుసగా నాలుగో పరాజయం.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన యూనికార్న్స్... కెప్టెన్ కోరె ఆండర్సన్ (59 నాటౌట్), హస్సన్ ఖాన్ (44) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. యూనికార్న్స్ ఇన్నింగ్స్‌లో ఆండర్సన్, హసన్ ఖాన్‌తో పాటు కమిన్స్ (13), రూథర్‌ఫోర్డ్ (14) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ఎంఐ బౌలర్లలో నోష్తుష్ కెంజిగే, ట్రెంట్ బౌల్ట్ తలో 2, రొమారియో షెపర్డ్, రషీద్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు.
149 పరుగల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఎంఐ.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరి ఓవర్‌లో ఎంఐ గెలుపుకు 20 పరుగులు అవసరం కాగా.. హీత్ రిచర్డ్స్, రషీద్ ఖాన్ జోడీ 16 పరుగులు మాత్రమే రాబట్టగలిగింది. ఆఖరి బంతికి బౌండరీ అవసరం కాగా.. హరీస్ రౌఫ్ హీత్ రిచర్డ్స్‌ను ఎల్బీడబ్ల్యూ చేశాడు. దీంతో ఎంఐకు పరాజయం తప్పలేదు. యూనికార్న్స్ బౌలర్లలో మాథ్యూ షార్ట్ 3, బ్రాడీ కౌచ్ 2, హరీస్ రౌఫ్, హస్సన్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. ఎంఐ ఇన్నింగ్స్‌లో డెవాల్డ్ బ్రెవిస్ (56) అర్ద సెంచరీతలో రాణించాడు.
కాగా, ఈ ఎడిషన్‌లో మరో ఐదు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. వాషింగ్టన్ ఫ్రీడం, యూనికార్న్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగా.. మిగతా రెండు బెర్త్‌ల కోసం టెక్సాస్ సూపర్ కింగ్స్, లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్, ఎంఐ న్యూయార్క్, సీయాటిల్ ఓర్కాస్ పోటీపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment