MI New York
-
రాణించిన కాన్వే.. సూపర్ కింగ్స్‌ను గెలిపించిన డుప్లెసిస్
మేజర్ లీగ్ క్రికెట్లో టెక్సాస్ సూపర్ కింగ్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (జులై 25) జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఫాఫ్ మరో అర్ద సెంచరీ బాదాడు. ఫలితంగా సూపర్ కింగ్స్ 9 వికెట్ల తేడాతో ఎంఐ న్యూయార్క్‌పై ఘన విజయం సాధించింది.FAF DU PLESSIS - THE LEGEND OF THE SUPER KINGS FAMILY. ⭐- 72 (47) with 6 fours and 3 sixes in the Eliminator against MI New York in the MLC. The captain at the age of 40 keeps getting better. 👌pic.twitter.com/GrURm0QS7U— Mufaddal Vohra (@mufaddal_vohra) July 25, 2024రషీద్ ఖాన్ మెరుపు ఇన్నింగ్స్ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ.. రషీద్ ఖాన్ (30 బంతుల్లో 55; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఎంఐ ఇన్నింగ్స్‌లో రషీద్‌తో పాటు మెనాంక్ పటేల్ (48), షయాన్ జహంగీర్ (26) మాత్రమే రాణించారు. సూపర్‌కింగ్స్ బౌలర్లలో స్టోయినిస్, ఆరోన్ హార్డీ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. జియా ఉల్ హక్, నూర్ అహ్మద్, బ్రావో తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సూపర్ కింగ్స్.. ఓపెనర్లు డుప్లెసిస్ (72), డెవాన్ కాన్వే (43 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), సత్తా చాటడంతో అలవోకగా (18.3 ఓవర్లలో వికెట్ నష్టానికి) విజయం సాధించింది. బంతితో రాణించిన ఆరోన్ హార్డీ బ్యాట్‌తోనూ (22 బంతుల్లో 40 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో సూపర్ కింగ్స్ ఛాలెంజర్ మ్యాచ్‌కు అర్హత సాధించగా.. ముంబై ఇండియన్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. రేపు జరుగబోయే క్వాలిఫయర్ మ్యాచ్‌లో వాషింగ్టన్ ఫ్రీడం, శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ పోటీపడతాయి. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టుతో సూపర్ కింగ్స్ ఛాలెంజర్ మ్యాచ్ ఆడతుంది. క్వాలిఫయర్ విజేత, ఛాలెంజర్ గేమ్ విజేత జులై 28న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.ఎంఎల్సీ 2024లో డుప్లెసిస్ స్కోర్లు..14(14), 100(58), 34(17), 61(38), 55(32), 39(17), 72(47)7 ఇన్నింగ్స్‌ల్లో 168.16 స్ట్రయిక్‌రేట్‌తో 53.57 సగటున సెంచరీ, 3 అర్ద సెంచరీల సాయంతో 375 పరుగులు. -
పోలార్డ్ వీర బాదాడు.. ప్లే ఆఫ్స్‌లోకి ముంబై ఇండియన్స్
మేజర్ లీగ్ క్రికెట్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ న్యూయార్క్ వరుసగా రెండో ఏడాది ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్‌తో ఇవాళ (జులై 22) జరిగిన కీలక మ్యాచ్‌లో ఆ జట్టు 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉండింది.తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్.. రషీద్ ఖాన్ (4-0-22-3), నోష్తుష్ కెంజిగే (4-0-22-2), ట్రెంట్ బౌల్ట్ (4-0-38-2), రొమారియో షెపర్డ్ (4-0-30-1), కీరన్ పోలార్డ్ (0.1-0-0-1) ధాటికి 19.1 ఓవర్లలో 130 పరుగులకు ఆలౌటైంది. నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌లో ఆండ్రీ రసెల్ (21 బంతుల్లో 35; 6 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలువగా.. జేసన్ రాయ్ (23 బంతుల్లో 27; 3 ఫోర్లు, సిక్స్), నితీశ్ కుమార్ (15), స్పెన్సర్ జాన్సన్ (10) రెండంకెల స్కోర్లు చేశారు. సునీల్ నరైన్ (6), ఉన్ముక్త్ చంద్ (9), డేవిడ్ మిల్లర్ (6), సైఫ్ బదార్ (9), కోర్నే డ్రై (1), అలీ ఖాన్ (0) నిరాశపరిచారు.131 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. 17 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. డెవాల్డ్ బ్రెవిస్ (19 బంతుల్లో 27; 5 ఫోర్లు), నికోలస్ పూరన్ (28 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరు స్కోర్లతో రాణించగా.. ఆఖర్లో పోలార్డ్ (12 బంతుల్లో 33 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) వీర బాదుడు బాదాడు. నైట్‌రైడర్స్ బౌలర్లలో నరైన్ 2, స్పెన్సర్ జాన్సన్, డ్రై, రసెల్, అలీ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ ఓటమితో నైట్‌రైడర్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. వాషింగ్టన్ ఫ్రీడం, శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, టెక్సాస్ సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ న్యూయార్క్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. -
ముంబై ఇండియన్స్‌కు మరో పరాభవం..ప్లే ఆఫ్స్‌కు యూనికార్న్స్
మేజర్ లీగ్ క్రికెట్ 2024 ఎడిషన్‌లో శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ ప్లే ఆఫ్స్‌కు చేరింది. ముంబై ఇండియన్స్ న్యూయార్క్‌తో ఇవాళ (జులై 19) జరిగిన మ్యాచ్‌లో 3 పరుగుల తేడాతో గెలుపొంది, ఫైనల్ ఫోర్కు చేరిన రెండో జట్టుగా నిలిచింది. యూనికార్న్స్‌కు ముందు వాషింగ్టన్ ఫ్రీడం ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. యూనికార్న్స్ చేతిలో ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపుగా చేజార్చుకుంది. ఈ ఎడిషన్‌లో ఎంఐ టీమ్‌కు ఇది వరుసగా నాలుగో పరాజయం.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన యూనికార్న్స్... కెప్టెన్ కోరె ఆండర్సన్ (59 నాటౌట్), హస్సన్ ఖాన్ (44) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. యూనికార్న్స్ ఇన్నింగ్స్‌లో ఆండర్సన్, హసన్ ఖాన్‌తో పాటు కమిన్స్ (13), రూథర్‌ఫోర్డ్ (14) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ఎంఐ బౌలర్లలో నోష్తుష్ కెంజిగే, ట్రెంట్ బౌల్ట్ తలో 2, రొమారియో షెపర్డ్, రషీద్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు.149 పరుగల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఎంఐ.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరి ఓవర్లో ఎంఐ గెలుపుకు 20 పరుగులు అవసరం కాగా.. హీత్ రిచర్డ్స్, రషీద్ ఖాన్ జోడీ 16 పరుగులు మాత్రమే రాబట్టగలిగింది. ఆఖరి బంతికి బౌండరీ అవసరం కాగా.. హరీస్ రౌఫ్ హీత్ రిచర్డ్స్‌ను ఎల్బీడబ్ల్యూ చేశాడు. దీంతో ఎంఐకు పరాజయం తప్పలేదు. యూనికార్న్స్ బౌలర్లలో మాథ్యూ షార్ట్ 3, బ్రాడీ కౌచ్ 2, హరీస్ రౌఫ్, హస్సన్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. ఎంఐ ఇన్నింగ్స్‌లో డెవాల్డ్ బ్రెవిస్ (56) అర్ద సెంచరీతలో రాణించాడు.కాగా, ఈ ఎడిషన్‌లో మరో ఐదు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. వాషింగ్టన్ ఫ్రీడం, యూనికార్న్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగా.. మిగతా రెండు బెర్త్‌ల కోసం టెక్సాస్ సూపర్ కింగ్స్, లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్, ఎంఐ న్యూయార్క్, సీయాటిల్ ఓర్కాస్ పోటీపడుతున్నాయి.