రాణించిన కాన్వే.. సూపర్‌ కింగ్స్‌ను గెలిపించిన డుప్లెసిస్‌ | MLC 2024: Faf Du Plessis Slams Blasting Fifty, TSK Beat MINY By 9 Wickets In Eliminator Match | Sakshi
Sakshi News home page

రాణించిన కాన్వే.. సూపర్‌ కింగ్స్‌ను గెలిపించిన డుప్లెసిస్‌

Published Thu, Jul 25 2024 10:34 AM | Last Updated on Thu, Jul 25 2024 11:07 AM

MLC 2024: Faf Du Plessis Slams Blasting Fifty, TSK Beat MINY By 9 Wickets In Eliminator Match

మేజర్‌ లీగ్‌ క్రికెట్‌లో టెక్సాస్‌ సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (జులై 25) జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఫాఫ్‌ మరో అర్ద సెంచరీ బాదాడు. ఫలితంగా సూపర్‌ కింగ్స్‌ 9 వికెట్ల తేడాతో ఎంఐ న్యూయార్క్‌పై ఘన విజయం సాధించింది.

రషీద్‌ ఖాన్‌ మెరుపు ఇన్నింగ్స్‌
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎంఐ.. రషీద్‌ ఖాన్‌ (30 బంతుల్లో 55; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు హాఫ్‌ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఎంఐ ఇన్నింగ్స్‌లో రషీద్‌తో పాటు మెనాంక్‌ పటేల్‌ (48), షయాన్‌ జహంగీర్‌ (26) మాత్రమే రాణించారు. సూపర్‌కింగ్స్‌ బౌలర్లలో స్టోయినిస్‌, ఆరోన్‌ హార్డీ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. జియా ఉల్‌ హక్‌, నూర్‌ అహ్మద్‌, బ్రావో తలో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సూపర్‌ కింగ్స్‌.. ఓపెనర్లు డుప్లెసిస్‌ (72), డెవాన్‌ కాన్వే (43 బంతుల్లో 51 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్స్‌), సత్తా చాటడంతో అలవోకగా (18.3 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) విజయం సాధించింది. బంతితో రాణించిన ఆరోన్‌ హార్డీ బ్యాట్‌తోనూ (22 బంతుల్లో 40 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటాడు. 

ఈ మ్యాచ్‌లో గెలుపుతో సూపర్‌ కింగ్స్‌ ఛాలెంజర్‌ మ్యాచ్‌కు అర్హత సాధించగా.. ముంబై ఇండియన్స్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. రేపు జరుగబోయే క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో వాషింగ్టన్‌ ఫ్రీడం, శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌ పోటీపడతాయి. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టుతో సూపర్‌ కింగ్స్‌ ఛాలెంజర్‌ మ్యాచ్‌ ఆడతుంది. క్వాలిఫయర్‌ విజేత, ఛాలెంజర్‌ గేమ్‌ విజేత జులై 28న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.

ఎంఎల్‌సీ 2024లో డుప్లెసిస్‌ స్కోర్లు..
14(14), 100(58), 34(17), 61(38), 55(32), 39(17), 72(47)
7 ఇన్నింగ్స్‌ల్లో 168.16 స్ట్రయిక్‌రేట్‌తో 53.57 సగటున సెంచరీ, 3 అర్ద సెంచరీల సాయంతో 375 పరుగులు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement