మేజర్ లీగ్ క్రికెట్(MLC 2023) తొలి ఎడిషన్‌లో భాగంగా సీటెల్ ఓర్కాస్ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. లీగ్‌లో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున(భారత కాలామాన ప్రకారం) టెక్సస్ సూపర్‌కింగ్స్‌తో జరిగిన క్వాలిఫయర్-1లో సీటెల్ ఓర్కాస్ జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. సీటెల్ ఆర్కాస్ ఓపెనర్ క్వింటన్ డికాక్(50 బంతుల్లో 88 నాటౌట్, 10 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడడంతో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 127 పరుగుల లక్ష్యాన్ని సులువుగా చేధించింది.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన టెక్సస్ సూపర్ కింగ్స్ సీటెల్ ఆర్కాస్ బౌలర్ల దాటికి పెద్దగా పరుగులు చేయలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. సూపర్‌కింగ్స్ బ్యాటింగ్‌లో డేనియల్ సామ్స్ 26 నాటౌట్ టాప్ స్కోరర్ కాగా.. కోడి చెట్టి, డెవాన్ కాన్వేలు తలా 24 పరుగులు చేశారు. సీటెల్ బౌలర్లలో ఆండ్రూ టై మూడు వికెట్లు తీయగా.. ఇమాద్ వసీమ్ రెండు, గానన్, హర్మీత్ సింగ్ చెరొక వికెట్ తీశారు.
అనంతరం 127 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సీటెల్ ఓర్కాస్ 15 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. నుమాన్ అన్వర్ రెండు పరుగులకే వెనుదిరిగినప్పటికి స్నేహన్ జయసూరియా(34 బంతుల్లో 31 నాటౌట్)తో కలిసి డికాక్ జట్టును విజయతీరాలకు చేర్చాడు.
ఎలిమినేటర్‌లో వాషింగ్టన్‌ను చిత్తు చేసిన ముంబై న్యూయార్క్
కాగా ముంబై న్యూయార్క్, వాషింగ్టన్ ఫ్రీడమ్ మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై న్యూయార్క్ 16 పరుగులతో విజయం సాధించి చాలెంజర్‌లో అడుగుపెట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై న్యూయార్క్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసిది. అనంతరం బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడమ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేయగలిగింది.
శనివారం తెల్లవారుజామున చాలెంజర్ మ్యాచ్‌లో ముంబై న్యూయార్క్.. టెక్సస్ సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. చాలెంజర్‌లో నెగ్గిన జట్టు ఆదివారం జరగబోయే ఫైనల్లో సీటెల్ ఓర్కాస్ జట్టుతో టైటిల్ పోరులో తలపడనుంది.
A TRUE QDK masterclass! @MLCSeattleOrcas clinch their spot in the inaugural #MajorLeagueCricket Championship Final! 💚 🐳 🏏 pic.twitter.com/3v71g4bn52
— Major League Cricket (@MLCricket) July 28, 2023
QDK GOES BIG WITH TWO SIXES!
— Major League Cricket (@MLCricket) July 28, 2023
Quinton De Kock sends TWO SIXES over the LEG 🦵side boundaries to RAISE🖐️ his FIFTY and MORE!
7⃣9⃣/1⃣ (10.3) pic.twitter.com/hEjU1GIweU
చదవండి: బ్యాటింగ్‌కు రాకపోయినా అరుదైన రికార్డుతో మెరిసిన కోహ్లి
AB De Villiers: 'రొనాల్డో, ఫెదరర్‌లానే కోహ్లి కూడా చాలా గొప్పోడు'
Comments
Please login to add a commentAdd a comment