
కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో బార్బడోస్ రాయల్స్ ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయ్యింది. ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయిన తొలి జట్టు రాయల్సే. ఇవాళ (సెప్టెంబర్ 18) జరిగిన మ్యాచ్‌లో రాయల్స్ సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పేట్రియాట్స్.. రకీమ్ కార్న్‌వాల్ (4-0-16-5), నవీన్ ఉల్ హక్ (4-0-21-3), ఓబెద్ మెక్‌కాయ్ (2.1-0-11-2) ధాటికి 110 పరుగులకే (19.1 ఓవర్లలో) కుప్పకూలింది. పేట్రియాట్స్ ఇన్నింగ్స్‌లో ఆండ్రీ ఫ్లెచర్ (32), జాషువ డసిల్వ (25), అన్రిచ్ నోర్జే (22), హసరంగ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్ 11.2 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. క్వింటన్ డికాక్ (59 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించాడు. ఈ సీజన్‌లో డికాక్‌కు ఇది మూడో ఫిఫ్టి ప్లస్ స్కోర్. డికాక్ గత మ్యాచ్‌లో సెంచరీ చేశాడు.
పాయింట్ల పట్టిక విషయానికొస్తే.. ఈ సీజన్‌లో రాయల్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. మరోవైపు సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శనలు కనబరుస్తూ పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పరిమితమైంది.
ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క దాంట్లో మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సెయింట్ లూసియా కింగ్స్ రెండో స్థానంలో, గయానా అమెజాన్ వారియర్స్ మూడు, ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ నాలుగో స్థానంలో, ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్ ఐదో స్థానంలో ఉన్నాయి.
చదవండి: ఐదు వికెట్లతో చెలరేగిన భారీకాయుడు
Comments
Please login to add a commentAdd a comment