ఐదు వికెట్లతో చెలరేగిన భారీకాయుడు | CPL 2024: Rahkeem Cornwall Took A Five Wicket Haul In A Match Vs St Kitts And Nevis Patriots | Sakshi
Sakshi News home page

ఐదు వికెట్లతో చెలరేగిన భారీకాయుడు

Published Wed, Sep 18 2024 7:14 AM | Last Updated on Wed, Sep 18 2024 9:23 AM

CPL 2024: Rahkeem Cornwall Took A Five Wicket Haul In A Match Vs St Kitts And Nevis Patriots

కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో క్రికెట్‌ భారీకాయుడు రకీమ్‌ కార్న్‌వాల్‌ చెలరేగిపోయాడు. బార్బడోస్‌ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించే రకీమ్‌.. సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పేట్రియాట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీశాడు. భారీ సిక్సర్లు అలవోకగా కొట్టగలడని పేరున్న రకీమ్‌ ఈసారి బంతితో సత్తా చాటాడు. 

ఈ మ్యాచ్‌లో రకీమ్‌ తన కోటా నాలుగు ఓవర్లలో కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. రకీమ్‌తో పాటు నవీన్‌ ఉల్‌ హక్‌ (4-0-21-3), ఓబెద్‌ మెక్‌కాయ్‌ (2.1-0-11-2) రాణించడంతో పేట్రియాట్స్‌ 110 పరుగులకే (19.1 ఓవర్లలో) కుప్పకూలింది. పేట్రియాట్స్‌ ఇన్నింగ్స్‌లో ఆండ్రీ ఫ్లెచర్‌ (32), జాషువ డసిల్వ (25), అన్రిచ్‌ నోర్జే (22), హసరంగ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.

కాగా, ప్రస్తుత కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఎడిషన్‌లో బార్బడోస్‌ రాయల్స్‌ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ సీజన్‌లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట విజయాలు సాధించింది. తద్వారా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. 

మరోవైపు సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పేట్రియాట్స్‌ ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శనలు కనబరుస్తూ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతుంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క దాంట్లో మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సెయింట్‌ లూసియా కింగ్స్‌ రెండో స్థానంలో, గయానా అమెజాన్‌ వారియర్స్‌ మూడు, ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ నాలుగో స్థానంలో, ఆంటిగ్వా అండ్‌ బార్బుడా ఫాల్కన్స్‌ ఐదో స్థానంలో ఉన్నాయి.

చదవండి: ఆసియా ఛాంపియ‌న్స్ హాకీ ట్రోఫీ విజేతగా భారత్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement