Rahkeem Cornwall
-
రాణించిన రకీమ్, డికాక్.. ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయిన రాయల్స్
కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో బార్బడోస్ రాయల్స్ ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయ్యింది. ఈ సీజన్లో ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయిన తొలి జట్టు రాయల్సే. ఇవాళ (సెప్టెంబర్ 18) జరిగిన మ్యాచ్‌లో రాయల్స్ సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పేట్రియాట్స్.. రకీమ్ కార్న్‌వాల్ (4-0-16-5), నవీన్ ఉల్ హక్ (4-0-21-3), ఓబెద్ మెక్కాయ్ (2.1-0-11-2) ధాటికి 110 పరుగులకే (19.1 ఓవర్లలో) కుప్పకూలింది. పేట్రియాట్స్ ఇన్నింగ్స్‌లో ఆండ్రీ ఫ్లెచర్ (32), జాషువ డసిల్వ (25), అన్రిచ్ నోర్జే (22), హసరంగ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్ 11.2 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. క్వింటన్ డికాక్ (59 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించాడు. ఈ సీజన్లో డికాక్‌కు ఇది మూడో ఫిఫ్టి ప్లస్ స్కోర్. డికాక్ గత మ్యాచ్‌లో సెంచరీ చేశాడు.పాయింట్ల పట్టిక విషయానికొస్తే.. ఈ సీజన్లో రాయల్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. మరోవైపు సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ ఈ సీజన్లో పేలవ ప్రదర్శనలు కనబరుస్తూ పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పరిమితమైంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క దాంట్లో మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సెయింట్ లూసియా కింగ్స్ రెండో స్థానంలో, గయానా అమెజాన్ వారియర్స్ మూడు, ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ నాలుగో స్థానంలో, ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్ ఐదో స్థానంలో ఉన్నాయి.చదవండి: ఐదు వికెట్లతో చెలరేగిన భారీకాయుడు -
ఐదు వికెట్లతో చెలరేగిన భారీకాయుడు
కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో క్రికెట్ భారీకాయుడు రకీమ్ కార్న్‌వాల్ చెలరేగిపోయాడు. బార్బడోస్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించే రకీమ్.. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీశాడు. భారీ సిక్సర్లు అలవోకగా కొట్టగలడని పేరున్న రకీమ్ ఈసారి బంతితో సత్తా చాటాడు. FIVE WICKET HAUL FOR RAHKEEM CORNWALL. ⚡🤯- The Magician of Barbados Royals in CPL 2024...!!!! pic.twitter.com/49zUlypBjZ— Johns. (@CricCrazyJohns) September 18, 2024ఈ మ్యాచ్‌లో రకీమ్ తన కోటా నాలుగు ఓవర్లలో కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. రకీమ్‌తో పాటు నవీన్ ఉల్ హక్ (4-0-21-3), ఓబెద్ మెక్కాయ్ (2.1-0-11-2) రాణించడంతో పేట్రియాట్స్ 110 పరుగులకే (19.1 ఓవర్లలో) కుప్పకూలింది. పేట్రియాట్స్ ఇన్నింగ్స్‌లో ఆండ్రీ ఫ్లెచర్ (32), జాషువ డసిల్వ (25), అన్రిచ్ నోర్జే (22), హసరంగ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.కాగా, ప్రస్తుత కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఎడిషన్‌లో బార్బడోస్ రాయల్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ సీజన్లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట విజయాలు సాధించింది. తద్వారా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. మరోవైపు సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ ఈ సీజన్లో పేలవ ప్రదర్శనలు కనబరుస్తూ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతుంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క దాంట్లో మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సెయింట్ లూసియా కింగ్స్ రెండో స్థానంలో, గయానా అమెజాన్ వారియర్స్ మూడు, ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ నాలుగో స్థానంలో, ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్ ఐదో స్థానంలో ఉన్నాయి.చదవండి: ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీ విజేతగా భారత్.. -
విండీస్ బహుబలి విధ్వంసకర సెంచరీ.. 12 సిక్స్‌లతో ఊచకోత! వీడియో వైరల్
కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో బార్బడోస్ రాయల్స్ ఆల్ రౌండర్, విండీస్ బహుబలి రఖీమ్ కార్న్‌వాల్ విధ్వంసం సృష్టించాడు. ఈ లీగ్‌లో భాగంగా సెయింట్ కిట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు శతకంతో కార్న్‌వాల్ చెలరేగాడు. కేవలం 45 బంతుల్లోనే సెంచరీ సాధించి ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు. సీపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన మూడో ఆటగాడిగా కార్న్‌వాల్ రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా 48 బంతులు ఎదుర్కొన్న కార్న్‌వాల్ 12 సిక్స్‌లు, 4 ఫోర్లతో 102 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. టీ20 క్రికెట్లో కార్న్‌వాల్‌కు ఇదే తొలి సెంచరీ. బార్బడోస్ రాయల్స్ ఘన విజయం.. ఇక ఈ మ్యాచ్‌లో సెయింట్ కిట్స్‌పై 8 వికెట్ల తేడాతో బార్బడోస్ రాయల్స్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ కిట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. సెయింట్ కిట్స్ బ్యాటర్లలో ఫ్లెచర్(56), విల్ స్మిద్(63), రుథర్ఫర్డ్(65) పరుగులతో అదరగొట్టారు. బార్బోడస్ బౌలర్లలో కార్నవాల్ రెండు వికెట్లు,బ్రాత్‌వైట్ ఒక్క వికెట్ పడగొట్టారు. అనంతరం 221 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బార్బడోస్ కేవలం రెండు వికెట్లు కోల్పోయి 18.1 ఓవర్లలోనే ఛేదించింది. బార్బడోస్ బ్యాటర్లలో కార్న్‌వాల్‌తో పాటు కెప్టెన్ పావెల్(49) పరుగులతో అదరగొట్టాడు. చదవండి: Asia cup 2023: నేపాల్‌తో మ్యాచ్‌కూ వర్షం గండం.. రద్దయితే టీమిండియా పరిస్థితేంటి..? Wait for the bat drop 🔥 (via @CPL) pic.twitter.com/3SbYJCnZW6 — ESPNcricinfo (@ESPNcricinfo) September 4, 2023 It was never in doubt, the Republic Bank Play of the Day is Rahkeem Cornwall's sensational century.#CPL23 #BRvSKNP #RepublicBank #CricketPlayedLouder #BiggestPartyInSport #Cornwall pic.twitter.com/ELvirLOtZk — CPL T20 (@CPL) September 4, 2023 -
అయ్యో విండీస్ క్రికెటర్.. పరిగెత్తి అలిసిపోయి..రనౌట్‌గా! వీడియో వైరల్
ప్రపంచక్రికెట్లో భారీకాయం ఉన్న ఆటగాళ్లు ఎవరంటే మనకు టక్కను గుర్తు వచ్చేది వెస్టిండీస్ క్రికెటర్ రఖీమ్ కార్నివాల్. కార్నివాల్‌కు అద్బుతమైన టాలెంట్ ఉన్నప్పటికీ.. ఫిట్నెస్ మాత్రం అతడికి పెద్ద సమస్యగా ఉంది. అతడు దాదాపు 6 అడుగుల ఆరు అంగుళాల ఎత్తు.. 140 పైగా కిలోల బరువు ఉంటాడు. ఇంతటి భారీ కాయం ఉన్న రఖీమ్ వికెట్ల మధ్య పరిగెత్తడానికి చాలా కష్టపడతుంటాడు. మరోసారి కార్నివాల్ తన ఫిట్నెస్ సమస్యకు బలైపోయాడు. పాపం కార్నివాల్.. కార్నివాల్ ప్రస్తుతం కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో బార్బడోస్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ లీగ్‌లో భాగంగా బార్బడోస్,సెయింట్ లూసియా మధ్య జరిగిన మ్యాచ్‌లో కార్నివాల్ రనౌట్‌గా వెనుదిరిగాడు. బార్బోడస్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన ఫోర్డే బౌలింగ్‌లో మొదటి బంతిని షార్ట్‌లెగ్ దిశగా కార్నివాల్ ఆడాడు. అయితే అక్కడ ఉన్న ఫీల్డర్ బంతిని సరిగ్గా అందుకోలేకపోయాడు. ఈ క్రమంలో నాన్‌స్ట్రైక్‌లో ఉన్న కైల్ మైర్స్ పరుగు కోసం కార్నివాల్‌కు పిలుపునిచ్చాడు. అవతలి ఎండ్ నుంచి మైర్స్ వికెట్ కీపర్‌వైపు చేరుకున్నప్పటికీ.. కార్నివాల్ మాత్రం బౌలింగ్ ఎండ్‌వైపు చేరుకోలేకపోయాడు. కార్నివాల్ వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లలేకపోయాడు. ఈ క్రమంలో క్రిస్ సోలే డైరక్ట్ త్రో చేయడంతో కార్నివాల్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాపం కార్నివాల్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: #Virat Kohli: అరంగేట్రంలో విఫలం.. కట్ చేస్తే.. ప్రపంచంలోనే రారాజుగా! ఏకంగా సచిన్‌తో పోటీ Tonight's @BetBarteronline magic moment is the run out of Rahkeem Cornwall that set the Saint Lucia Kings off on a fantastic PowerPlay! #CPL23 #SLKvBR #CricketPlayedLouder #BiggestPartyInSport #BetBarter pic.twitter.com/HgDtLWTjmK — CPL T20 (@CPL) August 18, 2023 -
వెస్టిండీస్ ఆల్ రౌండర్ తుపాన్ ఇన్నింగ్స్.. టీ20ల్లో డబుల్ సెంచరీ
వెస్టిండీస్ ఆల్ రౌండర్ రఖీమ్ కార్న్‌వాల్ టీ20 క్రికెట్లో డబుల్ సాధించాడు. అట్లాంటా ఓపెన్-2022లో అట్లాంటా ఫైర్ జట్టుకు కార్న్‌వాల్ ప్రాతినిద్యం వహిస్తున్నాడు. ఈ లీగ్‌లో భాగంగా బుధవారం స్క్వేర్ డ్రైవ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కార్న్‌వాల్ 77 బంతుల్లో 205 పరుగులో ఆజేయంగా నిలిచాడు. అతడి తుపాన్ ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, 22 సిక్స్‌లు ఉన్నాయి. కార్న్‌వాల్ సునామీ ఇన్నింగ్స్ ఫలితంగా అట్లాంటా జట్టు 20 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 326 పరుగులు చేసింది. ఇక కార్న్‌వాల్ డబుల్ సెంచరీ విషయాన్ని ప్రఖ్యాత గణాంకవేత్త మోహన్‌దాస్ మీనన్ ట్విటర్ వేదికగా తెలిపారు. "వెస్టిండీస్ ఆల్‌రౌండర్ రఖీమ్ కార్న్‌వాల్ అట్లాంటా ఓపెన్-2022లో అట్లాంటా ఫైర్ తరపున ఆడుతున్నాడు. West Indian Rahkeem Cornwall, while playing for Atlanta Fire, blasted an unbeaten 205 in just 77 balls (SR 266.23) that included 22 sixes and 17 fours in an American T20 competition known as the Atlanta Open. A prize money of $75,000 is available to the winning team. — Mohandas Menon (@mohanstatsman) October 6, 2022 అతడు స్క్వేర్ డ్రైవ్ జట్టుపై కేవలం 77 బంతుల్లో 22 సిక్స్‌లు, 17 ఫోర్లతో 205 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ టోర్నీలో విజేత జట్టుకు 75 వేల డాలర్ల ప్రైజ్ మనీ అందిస్తారని" మీనన్ పేర్కొన్నాడు. అదే విధంగా అతడి హిట్టింగ్‌కు సంబంధించిన వీడియోను మైనర్ లీగ్ క్రికెట్ కూడా ట్విటర్లో షేర్ చేసింది. కాగా ఇటీవల ముగిసిన కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో కూడా కార్న్‌వాల్ విధ్వంసం సృష్టించాడు. View this post on Instagram A post shared by Atlanta Fire Cricket (@atlantafirecricket) ARE YOU NOT ENTERTAINED?! Rahkeem Cornwall put Atlanta Fire on top with a DOUBLE century going 205*(77) with 2️⃣2️⃣ MASSIVE sixes 🤯🤯🤯 pic.twitter.com/1iRfyniiUw — Minor League Cricket (@MiLCricket) October 6, 2022 View this post on Instagram A post shared by Atlanta Fire Cricket (@atlantafirecricket) చదవండి: Womens Asia Cup 2022: పాకిస్తాన్‌కు భారీ షాకిచ్చిన థాయ్‌లాండ్.. క్రికెట్ చరిత్రలో తొలి విజయం -
33 నెలలు తర్వాత తొలి స్పిన్నర్‌గా రికార్డు
లక్నో: వెస్టిండీస్ స్పిన్నర్, భారీ స్థూలకాయ క్రికెటర్ రాకిమ్ కార్న్‌వాల్ అరుదైన రికార్డును సాధించాడు. లక్నో వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో 10 వికెట్లు సాధించి విండీస్ ఘన విజయంలో కీలక పాత్ర పోషించిన రాకిమ్.. ఆ దేశం తరఫున ఒక టెస్టులో 10 వికెట్లు సాధించిన 7 స్పిన్నర్‌గా నిలిచాడు. అదే సమయంలో భారత్‌లో 33 నెలల తర్వాత ఒక టెస్టులో 10 వికెట్లు సాధించిన తొలి స్పిన్నర్‌గా రికార్డును నమోదు చేశాడు. 2017 ఫిబ్రవరిలో పుణెలో భారత్‌తో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా స్పిన్నర్ స్టీవ్ ఓకీఫ్ 12 వికెట్లను సాధించగా, ఆ తర్వా ఇంతకాలానికి భారత్ వేదికగా 10 వికెట్ల మార్కును చేరిన స్పిన్నర్‌గా రాకిమ్ రికార్డు పుస్తకాల్లోకెక్కాడు. 2016లో ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో భాగంగా రవి చంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు ఒక టెస్టులో 10 వికెట్లను సాధించారు. ఆ తర్వాత ఏడాది వ్యవధిలో ఓకీఫ్ 10 వికెట్లకు పైగా సాధించి ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మళ్లీ ఇప్పుడు రాకిమ్ 10 వికెట్లతో మెరిసి విండీస్ గెలుపులో అతి పెద్ద పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు సాధించిన రాకిమ్.. రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ 9 వికెట్ల తేడాతో విజయం నమోదు చేసింది. అఫ్గాన్ 31 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించగా, దాన్ని 6.2 ఓవర్లలో విండీస్ ఛేదించింది. . క్రెయిగ్ బ్రాత్‌వైట్(8) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరగా, క్యాంప్‌బెల్(19 నాటౌట్), షాయ్ హోప్(6 నాటౌట్)లు మరో వికెట్ పడకుండా విండీస్‌కు గెలుపును అందించారు. అఫ్గాన్ 31 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 6.2 ఓవర్లలో వికెట్ కోల్పోయి విజయం సాధించింది. క్రెయిగ్ బ్రాత్‌వైట్(8) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరగా, క్యాంప్‌బెల్(19 నాటౌట్), షాయ్ హోప్(6 నాటౌట్)లు మరో వికెట్ పడకుండా విండీస్‌కు విజయాన్ని అందించారు. దాంతో విండీస్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అఫ్గాన్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 187 పరుగులకే ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో 120 పరుగులకే చాపచుట్టేసింది. వెస్టిండీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో 277 పరుగులకు ఆలౌటైంది. -
మూడుసార్లూ భారత్‌లోనే..
లక్నో: అఫ్గానిస్తాన్ మరో చెత్త రికార్డును మూట గట్టుకుంది. వెస్టిండీస్‌తో లక్నో వేదికగా జరిగిన ఏకైక టెస్టులో అఫ్గానిస్తాన్ తన రెండో ఇన్నింగ్స్‌లో 120 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా మూడో అత్పల్ప స్కోరును నమోదు చేసిన అపప్రథను సొంతం చేసుకుంది. అంతకుముందు బెంగళూరులో జరిగిన టెస్టులో అఫ్గానిస్తాన్ 109, 108 పరుగులకు చాపచుట్టేసింది. ఆ తర్వాత అఫ్గాన్‌కు ఇదే అత్యల్ప స్కోరు. కాకపోతే మూడు సందర్భాల్లో అఫ్గానిస్తాన్ నమోదు చేసిన అత్యల్ప స్కోర్లు భారత్‌లోనే ఉండటం గమనార్హం. భద్రతా కారణాల వల్ల అఫ్గానిస్తాన్ తమ మ్యాచ్‌లను భారత్‌లో ఆడుతోంది. వెస్టిండీస్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో అఫ్గానిస్తాన 31 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. అఫ్గానిస్తాన్ తన రెండో ఇన్నింగ్స్‌లో 43.1 ఓవర్లలో 120 పరుగులకే చాపచుట్టేసింది.. ఓపెనర్ జావెద్ అహ్మదీ(62) మినహా అంతా నిరాశపరిచారు. వెస్టిండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్, రాకిమ్ కార్న్‌వాల్, రోస్టన్ ఛేజ్‌లు తలో మూడు వికెట్లు సాధించి అఫ్గాన్ పతనాన్ని శాసించారు. మూడో రోజు ఆటలో హోల్డర్ మూడు వికెట్లు సాధించి అఫ్గాన్‌ను దెబ్బ కొట్టాడు. అంతకుముందు వెస్టిండీస్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 277 పరుగులకు ఆలౌటైంది. అదే సమయంలో అఫ్గాన్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 187 పరుగులకే విండీస్ కట్టడి చేసింది. దాంతో అఫ్గాన్ 31 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 6.2 ఓవర్లలో వికెట్ కోల్పోయి విజయం సాధించింది. క్రెయిగ్ బ్రాత్‌వైట్(8) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరగా, క్యాంప్‌బెల్(19 నాటౌట్), షాయ్ హోప్(6 నాటౌట్)లు మరో వికెట్ పడకుండా విండీస్‌కు విజయాన్ని అందించారు. దాంతో విండీస్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. -
విండీస్ లక్ష్యం 31
లక్నో: వెస్టిండీస్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో అఫ్గానిస్తాన్ 31 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. అఫ్గానిస్తాన్ తన రెండో ఇన్నింగ్స్‌లో 43.1 ఓవర్లలో 120 పరుగులకే చాపచుట్టేసింది.. ఓపెనర్ జావెద్ అహ్మదీ(62) మినహా అంతా నిరాశపరిచారు. వెస్టిండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్, రాకిమ్ కార్న్‌వాల్, రోస్టన్ ఛేజ్‌లు తలో మూడు వికెట్లు సాధించి అఫ్గాన్ పతనాన్ని శాసించారు. మూడో రోజు ఆటలో హోల్డర్ మూడు వికెట్లు సాధించి అఫ్గాన్‌ను దెబ్బ కొట్టాడు. అంతకుముందు వెస్టిండీస్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 277 పరుగులకు ఆలౌటైంది. బ్రూక్స్(111) సెంచరీ సాధించడంతో పాటు క్యాంప్‌బెల్(55) మెరవడంతో విండీస్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. అదే సమయంలో అఫ్గాన్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 187 పరుగులకే విండీస్ కట్టడి చేసింది. ఈ మ్యాచ్‌లో మొత్తంగా రాకిమ్ కార్న్‌వాల్ 10 వికెట్లు సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు సాధించిన రాకిమ్.. రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లతో మెరిశాడు. తద్వారా ఒక టెస్టులో 10 వికెట్లు సాధించిన ఏడో విండీస్ స్పిన్నర్‌గా నిలిచాడు. -
ఆడుతున్న రెండో టెస్టులోనే రికార్డు బౌలింగ్
లక్నో: ప్రపంచ క్రికెట్లో భారీ స్థూలకాయ క్రికెటర్‌గా గుర్తింపు పొందిన వెస్టిండీస్ స్పిన్నర్ రాకిమ్ కార్న్‌వాల్ అరుదైన క్లబ్లో చేరిపోయాడు. అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో తన స్పిన్ మ్యాజిక్ రుచిని చూపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు సాధించిన రాకిమ్.. రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. దాంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి రాకిమ్ మొత్తంగా 10 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా విదేశాల్లో ఆడే టెస్టుల్లో పది అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన ఏడో వెస్టిండీస్ స్పిన్నర్‌గా గుర్తింపు సాధించాడు. మరొకవైపు ఆడుతున్న రెండో టెస్టులోనే 10 వికెట్లను సాధించిన స్పిన్నర్‌గా నిలిచాడు. అఫ్గానిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 187 పరుగులకు ఆలౌట్ కావడంలో రాకిమ్ కీలక పాత్ర పోషించాడు. ఏడు వికెట్లు సాధించి అఫ్గాన్ పతనాన్ని శాసించాడు. ఆ తర్వాత గురువారం రెండో రోజు ఆటలో వెస్టిండీస్ 277 పరుగులకు ఆలౌట్ అయ్యింది. షామరాహ్ బ్రూక్స్(111) తన తొలి టెస్టు సెంచరీని సాధించాడు. దాంతో వెస్టిండీస్ 90 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన అఫ్గానిస్తాన్ ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్లు కోల్పోయి 109 పరుగులే చేసింది. రాకిమ్ మూడు వికెట్లకు జతగా, రోస్టన్ ఛేజ్ మూడు వికెట్లతో రాణించాడు.భద్రతపరమైన ఇబ్బందుల వల్ల అఫ్గానిస్తాన్ తమ మ్యాచ్‌లను స్వదేశంలో కాకుండా భారత్‌లో ఆడుతోంది. -
కార్న్‌వాల్‌కు 7 వికెట్లు
లక్నో: ఆరున్నర అడుగుల ఆజానుబాహుడు, వెస్టిండీస్ ఆల్‌రౌండర్ రాకిమ్ కార్న్‌వాల్ తన ఆఫ్‌స్పిన్ బౌలింగ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. అఫ్గానిస్తాన్‌తో బుధవారం ఇక్కడ ప్రారంభమైన ఏకైక టెస్టులో కార్న్‌వాల్ 75 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా అఫ్గాన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 187 పరుగులకే ఆలౌటైంది. జావేద్ అహ్మదీ (39), అమీర్ హమ్జా (34), అఫ్సర్ జజాయ్ (32) ఫర్వాలేదనిపించారు. హోల్డర్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం విండీస్ ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది. క్రెయిగ్ బ్రాత్‌వైట్ (11), షై హోప్ (7) విఫలం కాగా... క్యాంప్‌బెల్ (30 బ్యాటింగ్), బ్రూక్స్ (19 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం విండీస్ మరో 119 పరుగులు వెనుకబడి ఉంది. భద్రతాకారణాలరీత్యా అఫ్గానిస్తాన్ తమ దేశంలో కాకుండా అంతర్జాతీయ మ్యాచ్‌లను భారత్ కేంద్రంగా ఆడుతోంది. -
క్రికెట్ ‘బాహుబలి’ ఫన్నీ రనౌట్
సెయింట్ లూసియా: ప్రపంచ క్రికెట్లో అత్యంత బరువున్న ఆటగాడిగా వెస్టిండీస్ ఆటగాడు రకీమ్ కార్న్‌వాల్ రికార్డు సాధించిన సంగతి తెలిసిందే. ఇటీవల భారత్‌తో జరిగిన రెండో టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన రకీమ్ ఆరు అడుగులకు పైగా ఉండగా, 140 కేజీలకు పైగా బరువు ఉన్నాడు. దాంతో అత్యంత బరువు కల్గిన క్రికెటర్‌గా రికార్డు సాధించాడు. ఇప్పటివరకూ ఆసీస్ మాజీ క్రికెటర్ వార్విక్ ఆర్మ్‌స్ట్రాంగ్ పేరిట(133 కేజీల నుంచి-139 కేజీల వరకూ) ఉండగా, దాన్ని కార్న్‌వాల్ బ్రేక్ చేశాడు. ఇదిలా ఉంచితే, కరీబియర్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో కార్న్‌వాల్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. అంత బరువు ఉన్న ఆటగాడు పరుగు పెట్టడమే కష్టం అనే విమర్శకుల నోటికి పని చెప్పాడు. సెయింట్ లూసియా జౌక్స్ తరఫున ఆడుతున్న కార్న్‌వాల్.. గయానా అమెజాన్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రనౌట్ అయ్యాడు. సాధారణంగా పరుగు కోసం యత్నించే సమయంలో క్రీజ్‌లోకి రాకపోతే సదరు బ్యాట్స్‌మన్ రనౌట్ అవుతాడు. మరీ భారీ కాయుడు కార్న్‌వాల్ మాత్రం క్రీజ్‌లోకి వచ్చినా వంగలేక బ్యాట్‌ను పెట్టలేకపోయాడు. దాంతో పెవిలియన్‌కు చేరాల్సి వచ్చింది. కేవలం 12 బంతుల్లో ఆరు పరుగులు మాత్రమే చేసిన కార్న్‌వాల్.. సింగిల్ తీసే క్రమంలో పెవిలియన్ చేరాడు. అది ఈజీ సింగిల్ అయినప్పటికీ కార్న్‌వాల్ క్రీజ్‌లోకి చేరినా బ్యాట్‌ను గాల్లోనే ఉంచాడు. దాంతో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. -
భారీకాయుడిగా కార్న్‌వాల్ రికార్డు
-
భారీకాయుడిగా కార్న్‌వాల్ రికార్డు
జమైకా: టీమిండియా- వెస్టిండీస్ జట్ల మధ్య శుక్రవారం ప్రారంభమైన కింగ్స్టన్ టెస్టు ఒక అరుదైన రికార్డుకు వేదికైంది. ఈ టెస్టులో విండీస్ భారీ కాయుడు రకీమ్ కార్న్‌వాల్ అరంగేట్రం చేశాడు. ఆరడుగుల ఐదు అంగుళాలు ఎత్తు కల్గిన కార్న్‌వాల్.. 140 కిలోలపైగా ఉన్నాడు. దాంతో క్రికెట్ చరిత్రలో భారీ కాయుడిగా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకూ ఆసీస్ మాజీ క్రికెటర్ వార్విక్ ఆర్మ్‌స్ట్రాంగ్ పేరిట(133 కేజీల నుంచి-139 కేజీల వరకూ) ఉండగా, దాన్ని తాజాగా కార్న్‌వాల్ బ్రేక్ చేశాడు. భారత్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు ఎంపికైన 26 ఏళ్ల కార్న్‌వాల్.. రెండో టెస్టులో బరిలోకి దిగాడు. కమిన్స్ స్థానంలో చోటు దక్కించుకున్న రకీమ్ కార్న్‌వాల్ తన తొలి టెస్టులోనే అద్భుత ప్రదర్శన చేశాడు.(ఇక్కడ చదవండి: భారత్ 264/5) ఈ మ్యాచ్‌లో మంచి బౌన్స్ రాబట్టిన కార్న్‌వాల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తన తొలి అంతర్జాతీయ వికెట్‌ను సాధించాడు. అది కూడా టెస్టు స్పెషలిస్టు చతేశ్వర పుజారాది కావడం విశేషం. కార్న్‌వాల్ వేసిన బంతిని అంచనా వేయడంలో తడబడిన పుజారా వికెట్‌ను సమర్పించుకున్నాడు. మరొకవైపు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఇచ్చిన క్యాచ్‌లను కూడా అతడే అందుకున్నాడు. భారీ సిక్స్‌లు కొట్టగల కార్న్‌వాల్.. ఇటీవలి కాలంలో విండీస్ దేశవాళీ క్రికెట్లో చాలా నిలకడగా రాణించాడు. 2018-19 వెస్టిండీస్ చాంపియన్‌షిప్స్‌లో 17.68 సగటుతో 54 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా 55 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 260 పడగొట్టిన కార్న్‌వాల్.. 2224 పరుగులు సాధించాడు. -
సిక్సర్లతో చెలరేగి.. ఆపై కడుపునొప్పితో!
క్రికెట్ బాహుబలిగా పేరొందిన వెస్టిండీస్ ప్లేయర్ రకీమ్ కార్న్‌వాల్ మరోసారి అద్బుత ఇన్నింగ్స్ తో మెరుపులు మెరిపించాడు. అయితే మ్యాచ్ ఉత్కంఠగా జరుగుతున్న సమయంలో రిటైర్డ్ హర్ట్‌గా రకీమ్ వెనుదిరడగంతో అతడు ప్రాతినిధ్యం మహిస్తున్న జట్టు ఓటమి పాలైంది. దాదాపు 150 కిలోల బరువుతో, తనదైన బ్యాటింగ్ శైలితో అభిమానులకు ఆకట్టుకుంటున్నాడు రకీమ్. తాజాగా కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో భాగంగా 27వ మ్యాచ్‌లో అలవోకగా సిక్సర్లు బాదుతూ పరుగుల వరద పారించాడు. సీపీఎల్‌లో బార్బడోస్ ట్రిడెంట్స్, సెయింట్ లూసియా స్టార్స్ మధ్య హోరాహోరీ మ్యాచ్ జరిగింది. తొలుత బార్బడోస్ ప్లేయర్ డ్వేన్ బ్రావో సెంచరీ చేయడంతో ఆ జట్టు 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. 196 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సెయింట్ లూయిస్ వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. అయితే క్రికెట్ 'బాహుబలి' రకీమ్ కార్న్‌వాల్ ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదడంతో జట్టు విజయానికి చేరువైంది. ఐతే 18వ ఓవర్ రెండో బంతికి కార్న్‌వాల్ రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. అంతకు ముందే ఫిజియోను సంప్రదించిన రకీమ్ మళ్లీ బ్యాటింగ్ చేయాలని చూశాడు. కడుపు నొప్పితో విలవిల్లాడిన అతడు తన భారీకాయంతో పరుగులు తీయలేనని చెప్పి రిటైర్డ్ హర్ట్ గా వెళ్లిపోయాడు. ఆపై ఆ జట్టు 29 పరుగుల తేడాతో ఓడింది. ఆరు సిక్సర్ల బాదిన రకీమ్ 44 బంతుల్లోనే 78 పరుగులు చేసినా.. ఆట మధ్యలోనే మైదానాన్ని వీడటంతో సెయింట్ లూసియాకు ఓటమి తప్పలేదు.