Rahkeem Cornwall Run Out Breaks Internet - Sakshi
Sakshi News home page

CPL 2023: అయ్యో విండీస్‌ క్రికెటర్‌.. పరిగెత్తి అలిసిపోయి..రనౌట్‌గా! వీడియో​ వైరల్‌

Published Fri, Aug 18 2023 1:28 PM | Last Updated on Fri, Aug 18 2023 2:53 PM

Rahkeem Cornwalls Run Out Breaks Internet - Sakshi

ప్రపంచక్రికెట్‌లో భారీకాయం ఉన్న ఆటగాళ్లు ఎవరంటే మనకు టక్కను గుర్తు వచ్చేది వెస్టిండీస్‌ క్రికెటర్‌ రఖీమ్‌ కార్నివాల్‌. కార్నివాల్‌కు అద్బుతమైన టాలెంట్‌ ఉన్నప్పటికీ.. ఫిట్‌నెస్‌ మాత్రం అతడికి పెద్ద సమస్యగా ఉంది. అతడు దాదాపు 6 అడుగుల ఆరు అంగుళాల ఎత్తు.. 140 పైగా కిలోల బరువు ఉంటాడు. ఇంతటి భారీ కాయం ఉన్న రఖీమ్‌ వికెట్ల మధ్య పరిగెత్తడానికి చాలా కష్టపడతుంటాడు. మరోసారి కార్నివాల్‌ తన ఫిట్‌నెస్‌ సమస్యకు బలైపోయాడు.

పాపం కార్నివాల్‌..
కార్నివాల్‌ ప్రస్తుతం కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో బార్బడోస్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ లీగ్‌లో భాగంగా బార్బడోస్,సెయింట్‌ లూసియా మధ్య జరిగిన మ్యాచ్‌లో కార్నివాల్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు. బార్బోడస్‌ ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ వేసిన ఫోర్డే బౌలింగ్‌లో మొదటి బంతిని షార్ట్‌లెగ్‌ దిశగా కార్నివాల్‌ ఆడాడు. అయితే అక్కడ ఉన్న ఫీల్డర్‌ బంతిని సరిగ్గా అందుకోలేకపోయాడు.

ఈ క్రమంలో నాన్‌స్ట్రైక్‌లో ఉన్న కైల్‌ మైర్స్‌ పరుగు కోసం కార్నివాల్‌కు పిలుపునిచ్చాడు. అవతలి ఎండ్‌ నుంచి మైర్స్‌ వికెట్‌ కీపర్‌వైపు చేరుకున్నప్పటికీ.. కార్నివాల్‌ మాత్రం బౌలింగ్‌ ఎండ్‌వైపు చేరుకోలేకపోయాడు. కార్నివాల్‌ వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లలేకపోయాడు. ఈ క్రమంలో క్రిస్‌ సోలే డైరక్ట్‌ త్రో చేయడంతో కార్నివాల్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పాపం కార్నివాల్‌ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: #Virat Kohli: అరంగేట్రంలో విఫలం.. కట్‌ చేస్తే.. ప్రపంచంలోనే రారాజుగా! ఏకంగా సచిన్‌తో పోటీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement