Rahkeem Cornwall Smashes 77 Ball 205 In American T20 Competition - Sakshi
Sakshi News home page

Rahkeem Cornwall: వెస్టిండీస్‌ ఆల్‌ రౌండర్‌ తుపాన్‌ ఇన్నింగ్స్‌.. టీ20ల్లో డబుల్‌ సెంచరీ

Published Thu, Oct 6 2022 2:19 PM | Last Updated on Thu, Oct 6 2022 3:22 PM

Rakheem Cornwall smashes 77 ball 205 in American T20 competition - Sakshi

వెస్టిండీస్ ఆల్ రౌండర్ రఖీమ్ కార్న్‌వాల్ టీ20 క్రికెట్‌లో డబుల్ సాధించాడు. అట్లాంటా ఓపెన్-2022లో అట్లాంటా ఫైర్ జట్టుకు కార్న్‌వాల్ ప్రాతినిద్యం వహిస్తున్నాడు. ఈ లీగ్‌లో భాగంగా బుధవారం స్క్వేర్ డ్రైవ్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో  కార్న్‌వాల్ 77 బంతుల్లో 205 పరుగులో ఆజేయంగా నిలిచాడు. అతడి తుపాన్‌ ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, 22 సిక్స్‌లు ఉన్నాయి.

కార్న్‌వాల్‌ సునామీ ఇన్నింగ్స్‌ ఫలితంగా అట్లాంటా జట్టు 20 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 326 పరుగులు చేసింది.  ఇక కార్న్‌వాల్ డబుల్‌ సెంచరీ విషయాన్ని ప్రఖ్యాత గణాంకవేత్త మోహన్‌దాస్ మీనన్ ట్విటర్‌ వేదికగా తెలిపారు. "వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ రఖీమ్ కార్న్‌వాల్ అట్లాంటా ఓపెన్-2022లో అట్లాంటా ఫైర్ తరపున ఆడుతున్నాడు.

అతడు  స్క్వేర్ డ్రైవ్‌ జట్టుపై కేవలం 77 బంతుల్లో 22 సిక్స్‌లు, 17 ఫోర్లతో 205 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ టోర్నీలో విజేత జట్టుకు  75 వేల డాలర్ల ప్రైజ్ మనీ అందిస్తారని" మీనన్ పేర్కొన్నాడు. అదే విధంగా అతడి హిట్టింగ్‌కు సంబంధించిన వీడియోను మైనర్‌ లీగ్‌ క్రికెట్‌ కూడా ట్విటర్‌లో షేర్‌ చేసింది. కాగా ఇటీవల ముగిసిన కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో కూడా  కార్న్‌వాల్‌ విధ్వంసం సృష్టించాడు.


చదవండి: Womens Asia Cup 2022: పాకిస్తాన్‌కు భారీ షాకిచ్చిన థాయ్‌లాండ్‌.. క్రికెట్‌ చరిత్రలో తొలి విజయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement