double century
-
డబుల్ సెంచరీతో కదంతొక్కిన ఖ్వాజా.. దిగ్గజాల సరసన చోటు
గాలే వేదికగా శ్రీలంక (Sri Lanka), ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో రికార్డుల మోత మోగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా (Australia) రికార్డు స్కోర్ సాధించింది. వ్యక్తిగతంగానూ ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి. ఆసీస్ వెటరన్ బ్యాటర్ ఉస్మాన్ ఖ్వాజా (Usman Khawaja) కెరీర్లో తొలి డబుల్ సెంచరీ సాధించగా.. స్టీవ్ స్మిత్ టెస్ట్‌ల్లో తన 35వ సెంచరీని నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో మరో ఆసీస్ ఆటగాడు సెంచరీతో మెరిశాడు. జోస్ ఇంగ్లిస్ ఆసీస్ తరఫున తన అరంగేట్రం టెస్ట్‌లోనే శతక్కొట్టి రికార్డుల్లోకెక్కాడు. జట్టు స్కోర్ పరంగానూ ఆసీస్ ఈ మ్యాచ్‌లో రికార్డు సృష్టించింది. ఆసియా పిచ్‌లపై ఆసీస్‌కు ఇదే అత్యధిక స్కోర్.దిగ్గజాల సరసన చేరిన ఖ్వాజాఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా ఈ మ్యాచ్‌లో 352 బంతులు ఎదుర్కొని 16 బౌండరీలు, సిక్సర్ సాయంతో 232 పరుగులు చేశాడు. కెరీర్లో తన డబుల్ సెంచరీని ఖ్వాజా 38 ఏళ్ల 43 రోజుల వయసులో సాధించాడు. ఆసీస్ తరఫున క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ మాత్రమే ఖ్వాజా కంటే లేటు వయసులో డబుల్ సెంచరీలు చేశాడు. బ్రాడ్‌మన్ 38 ఏళ్ల 108 రోజుల వయసులో ఒకసారి.. 39 ఏళ్ల 149 రోజుల వయసులో మరోసారి డబుల్ సెంచరీలు చేశాడు. టెస్ట్ క్రికెట్లో అత్యంత లేటు వయసులో డబుల్ సెంచరీ చేసిన రికార్డు సౌతాఫ్రికాకు చెందిన ఎరిక్ రోవన్‌కు దక్కుతుంది. రోవన్ 42 ఏళ్ల 6 రోజుల వయసులో డబుల్ సెంచరీ సాధించాడు. టెస్ట్ క్రికెట్లో ఖ్వాజా కంటే లేటు వయసులో డబుల్ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో జాక్ హాబ్స్, వినూ మన్కడ్, గ్రహం గూచ్, యూనిస్ ఖాన్, శివ్‌నరైన్ చంద్రపాల్ వంటి దిగ్గజాలు ఉన్నారు. వీరిలో భారత్‌కు చెందిన వినూ మన్కడ్ 38 ఏళ్ల వయసులో రోజుల వ్యవధిలో రెండు సార్లు డబుల్ సెంచరీలు సాధించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. ఉస్మాన్ ఖ్వాజా (232) డబుల్ సెంచరీతో.. స్టీవ్ స్మిత్ (141), జోస్ ఇంగ్లిస్ (102) సెంచరీలతో కదంతొక్కడంతో ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 654 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఖ్వాజా, స్మిత్, ఇంగ్లిస్‌తో పాటు ట్రవిస్ హెడ్ (57), అలెక్స్ క్యారీ (46 నాటౌట్) కూడా రాణించారు. లబూషేన్ (20), వెబ్‌స్టర్ (23), స్టార్క్ (19 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. లంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య, జెఫ్రీ వాండర్సే తలో మూడు వికెట్లు పడగొట్టారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది.లంక బ్యాటర్లు ఒషాడో ఫెర్నాండో, దిముత్ కరుణరత్నే, ఏంజెలో మాథ్యూస్ తలో ఏడు పరుగులు చేసి ఔట్ కాగా.. చండీమల్ (9), కమిందు మెండిస్ (13) క్రీజ్‌లో ఉన్నారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు శ్రీలంక ఇంకా 610 పరుగులు వెనుకపడి ఉంది. -
డబుల్ సెంచరీతో మెరిసిన ఖావాజా.. తొలి ఆసీస్ క్రికెటర్‌గా
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ఉస్మాన్ ఖావాజా(Usman Khawaja) అద్బుతమైన ద్విశకతంతో చెలరేగాడు. 290 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్సర్‌తో ఖావాజా తన తొలి డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే అచితూచి ఆడుతూ శ్రీలంకకు కొరకరాని కొయ్యగా ఈ ఆసీస్ వెటరన్ మారాడు.తొలి రోజు ఆటలో ట్రావిస్ హెడ్,స్టీవ్ స్మిత్‌తో కలిసి భాగస్వామ్యాలను నెలకొల్పిన ఖావాజా.. రెండో రోజు ఆటలో జోష్ ఇంగ్లీష్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపిస్తున్నాడు. ఇదే అతడికి మొట్టమొదటి అంతర్జాతీయ డబుల్ సెంచరీ. ఇప్పటివరకు 79 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఖావాజా.. 45.26 సగటుతో 5839 పరుగులు చేశాడు.అతడి టెస్టు కెరీర్లో 16 సెంచరీలతో పాటు 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే భారత్‌తో జరిగిన సిరీస్‌లో మాత్రం ఖావాజా తీవ్ర నిరాశపరిచాడు. కానీ అతడిపై నమ్మకం ఉంచిన సెలక్టర్లు శ్రీలంక పర్యటకు ఎంపిక చేశారు. సెలక్టర్ల నమ్మకాన్ని వమ్ము చేయని ఖావాజా తొలి మ్యాచ్‌లోనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు,.భారీ స్కోర్ దిశగా ఆస్ట్రేలియా..తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా దూసుకుపోతుంది. రెండో రోజు ఆట లంచ్ సమయానికి ఆస్ట్రేలియా 3 వికెట్ల నష్టానికి 475 పరుగులు చేసింది. క్రీజులో ఖావాజా(204 నాటౌట్), జోష్ ఇంగ్లీష్(44 నాటౌట్) ఉన్నారు. 330/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా.. స్టీవ్ స్మిత్(141) రూపంలో మూడో వికెట్ కోల్పోయింది.తొలి ఆసీస్ క్రికెటర్‌గా..ఈ మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన ఖావాజా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. శ్రీలంక గడ్డపై టెస్టు డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆస్ట్రేలియా ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఏ ఆసీస్ క్రికెటర్ కూడా ఈ ఫీట్ సాధించలేదు.ఖావాజా కంటే ముందు శ్రీలంక గడ్డపై ఆస్ట్రేలియా బ్యాటర్ చేసిన అత్యధిక టెస్ట్ స్కోరు రికార్డు జస్టిన్ లాంగర్ పేరిట ఉండేది. 2004 కొలంబో వేదికగా లంకతో జరిగిన టెస్టులో లాంగర్ 295 బంతుల్లో 166 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో లాంగర్ ఆల్‌టైమ్ రికార్డును ఖావాజా బ్రేక్ చేశాడు. కాగా ఆస్ట్రేలియాకు ఇదే నామమాత్రపు టెస్టు సిరీస్ మాత్రమే. కంగారులు ఇప్పటికే వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు ఆర్హత సాధించింది.చదవండి:జనాయ్ భోంస్లే కాదు.. సిరాజ్ డేటింగ్లో ఉన్నది ఆమెతోనే? -
SA Vs PAK: 2025లో తొలి డబుల్ సెంచరీ
2025లో తొలి టెస్ట్ డబుల్ సెంచరీ నమోదైంది. పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆటగాడు ర్యాన్ రికెల్టన్ ద్విశతకం బాదాడు. ఈ ఏడాది ఇదే మొట్టమొదటి డబుల్ సెంచరీ. ఈ ఏడాది తొలి టెస్ట్ సెంచరీని కూడా రికెల్టనే సాధించాడు. రికెల్టన్ కెరీర్లో తన తొలి డబుల్ సెంచరీని 266 బంతుల్లో సాధించాడు. ఇందులో 24 ఫోర్లు, ఓ సిక్సర్ ఉన్నాయి. పాక్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌ల్లో డబుల్ సెంచరీ సాధించిన నాలుగో సౌతాఫ్రికా క్రికెటర్‌గా రికెల్టన్ రికార్డుల్లోకెక్కాడు. రికెల్టన్కు ముందు ఏబీ డివిలియర్స్ (278 నాటౌట్), గ్రేమ్ స్మిత్ (234), హెర్షల్ గిబ్స్ (228) పాక్‌పై డబుల్ సెంచరీలు చేశారు.తొలిసారి ఓపెనర్‌గా వచ్చి డబుల్ సెంచరీలు బాదిన క్రికెటర్లు..ర్యాన్ రికెల్టన్ టెస్ట్‌ల్లో తొలిసారి ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. రికెల్టన్ ఓపెనర్‌గా దిగిన తొలి మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీ సాధించాడు. తొలిసారి ఓపెనర్‌గా వచ్చి అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడు కూడా రికెల్టనే. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు నలుగురు ఆటగాళ్లు తొలిసారి ఓపెనర్‌గా వచ్చి డబుల్ సెంచరీలు బాదారు.ర్యాన్ రికెల్టన్ (సౌతాఫ్రికా)- 211 నాటౌట్బ్రెండన్ కురుప్పు (శ్రీలంక)- 201 నాటౌట్గ్రేమీ స్మిత్ (సౌతాఫ్రికా)- 200డెవాన్ కాన్వే (న్యూజిలాండ్)- 200నాలుగో వేగవంతమైన ద్విశతకంపాక్పై రికెల్టన్ చేసిన ద్విశతకం టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున నాలుగో వేగవంతమైన ద్విశతకం. రికెల్టన్ 266 బంతుల్లో డబుల్ బాదాడు. టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున వేగవంతమైన డబుల్ సెంచరీని హెర్షల్ గిబ్స్ సాధించాడు. 2003లో పాక్‌పై గిబ్స్ 211 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేశాడు.టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున వేగవంతమైన డబుల్ సెంచరీలు..హెర్షల్ గిబ్స్- 211 బంతుల్లోగ్రేమీ స్మిత్- 238 బంతుల్లోగ్యారీ కిర్‌స్టన్- 251 బంతుల్లో రికెల్టన్- 266 బంతుల్లోజాక్ కల్లిస్- 267 బంతుల్లోశతక్కొట్టిన బవుమాపాక్తో రెండో టెస్ట్‌లో రికెల్టన్ డబుల్ సెంచరీ సాధించగా.. కెప్టెన్ టెంబా బవుమా సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో బవుమా 106 పరుగులు (9 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి ఔటయ్యాడు. టెస్ట్‌ల్లో బవుమాను ఇది నాలుగో శతకం. ఇటీవలి కాలంలో భీకర ఫామ్‌లో ఉన్న బవుమా.. గత ఏడు ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు చేశాడు.భారీ స్కోర్ దిశగా సౌతాఫ్రికాపాక్తో మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా భారీ స్కోర్ దిశగా సాగుతుంది. ఆ జట్టు 102 ఓవర్లు పూర్తయ్యే సరికి 5 వికెట్లు కోల్పోయి 405 పరుగులు చేసింది. రికెల్టన్ (211), కైల్ వెర్రిన్ (53) క్రీజ్‌లో ఉన్నారు.సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఎయిడెన్ మార్క్రమ్ (17), వియాన్ ముల్దర్ (5), ట్రిస్టన్ స్టబ్స్ (0), బవుమా (106), డేవిడ్ బెడింగ్హమ్ (5) ఔటయ్యారు. పాకిస్తాన్ బౌలర్లలో సల్మాన్ అఘా , మొహమ్మద్ అబ్బాస్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఖుర్రమ్ షెహజాద్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో సౌతాఫ్రికా తొలి మ్యాచ్‌లో జయభేరి మోగించిన విషయం తెలిసిందే. తొలి టెస్ట్ విజయానంతరం సౌతాఫ్రికా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు క్వాలిఫై అయ్యింది. -
రికార్డు డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్
ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది సరికొత్త చరిత్ర సృష్టించాడు. జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో డబుల్ సెంచరీ (246) చేసిన షాహిది.. ఆఫ్ఘనిస్తాన్ తరఫున టెస్ట్‌ల్లో రెండు డబుల్ సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. షాహిది 2021లో జింబాబ్వేపై తొలి డబుల్ సెంచరీ (200) చేశాడు.తాజాగా డబుల్‌తో షాహిది మరో రికార్డు కూడా సాధించాడు. ఆఫ్ఘనిస్తాన్ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ (246) సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఇదే మ్యాచ్‌లో మరో ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ రహ్మత్ షా (234) కూడా డబుల్ సెంచరీ చేశాడు. షాహిదికి ముందు రహ్మత్ షాదే ఆఫ్ఘనిస్తాన్ తరఫున అత్యధిక స్కోర్‌గా ఉండేది.మొత్తంగా ఆఫ్ఘనిస్తాన్ తరఫున టెస్ట్‌ల్లో మూడు డబుల్ సెంచరీలు మాత్రమే నమోదయ్యాయి. ఈ మూడింటిలో రెండు ఇదే మ్యాచ్‌లో నమోదు కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో మరో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు (అఫ్సన్ జజాయ్) సెంచరీ (113) చేశాడు.రహ్మత్, షాహిది డబుల్.. జజాయ్ సెంచరీ సాధించడంతో ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ (699) చేసింది. టెస్ట్‌ల్లో ఆఫ్ఘనిస్తాన్‌కు ఇదే అత్యధిక స్కోర్. ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు ఆఫ్ఘన్ ఆటగాళ్లు మూడంకెల స్కోర్లు సాధించడం కూడా ఇదే మొదటిసారి. 639 పరుగుల వరకు 3 వికెట్లు మాత్రమే కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్.. ఆతర్వాత 60 పరుగుల వ్యవధిలో మిగిలిన ఏడు వికెట్లు కోల్పోయింది. జింబాబ్వే బౌలర్లలో బ్రియాన్ బెన్నెట్ ఐదు వికెట్లు పడగొట్టగా.. సీన్ విలియమ్స్ 2, ముజరబానీ, గ్వాండు, న్యామ్హురి తలో వికెట్ దక్కించుకున్నారు.అంతకుముందు జింబాబ్వే సైతం తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ (586) చేసింది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో సైతం ముగ్గురు మూడంకెల స్కోర్లు సాధించారు. సీన్ విలియమ్స్ (154), కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (104), బ్రియాన్ బెన్నెట్ (110 నాటౌట్) సెంచరీలు చేశారు. కెరీర్లో తొలి టెస్ట్ ఆడుతున్న బెన్ కర్రన్ (ఇంగ్లండ్ ఆటగాడు సామ్ కర్రన్ అన్న) అర్ద సెంచరీతో (68) రాణించాడు. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్ స్కోర్‌తో పోలిస్తే ఆఫ్ఘనిస్తాన్ 113 పరుగులు ఎక్కువగా సాధించింది. జింబాబ్వే ఆటగాడు బ్రియాన్ బెన్నెట్ సెంచరీ సహా ఐదు వికెట్లు ప్రదర్శన నమోదు చేయడం మరో విశేషం.113 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే 5 ఓవర్ల అనంతరం వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. బెన్ కర్రన్ (23), జాయ్‌లార్డ్ గుంబీ (4) క్రీజ్‌లో ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు జింబాబ్వే ఇంకా 81 పరుగులు వెనుకపడి ఉంది. మ్యాచ్ చివరి రోజు రెండో సెషన్ ఆట కొనసాగుతుంది. కాగా, మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ల కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో టీ20, వన్డే సిరీస్‌లను ఆఫ్ఘనిస్తాన్ కైవసం చేసుకుంది. టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో నెగ్గిన ఆఫ్ఘన్లు.. వన్డే సిరీస్‌ను 2-0 తేడాతో గెలుచుకున్నారు. ప్రస్తుతం తొలి టెస్ట్ జరుగుతుండగా.. రెండో టెస్ట్ జనవరి 2న ప్రారంభంకానుంది. -
డబుల్ సెంచరీతో చెలరేగిన అఫ్గాన్ ఆటగాడు..
బులవాయో వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో జింబాబ్వేకు అఫ్గానిస్తాన్ ధీటుగా బదులిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొలి అఫ్గానిస్తాన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 425 పరుగులు చేసింది. అఫ్గాన్ ఇంకా 161 పరుగులు వెనంజలో ఉంది. 95/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన అఫ్గాన్ జట్టు వికెట్ నష్టపోకుండా 330 పరుగులు చేసింది.రహ్మత్ షా డబుల్ సెంచరీ..అఫ్గానిస్తాన్ ఫస్ట్ డౌన్ బ్యాటర్ రహ్మత్ షా (416 బంతుల్లో 23 ఫోర్లు, 3 సిక్స్‌లు 231 బ్యాటింగ్) ఆజేయ డబుల్ సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్ హష్మతుల్లా షాహిదీతో కలిసి ఇన్నింగ్స్‌ను అద్బుతంగా నడిపించాడు. రహ్మత్‌కు ఇదే తొలి టెస్టు డబుల్ సెంచరీ కావడం గమనార్హం. అతడితో పాటు షాహిదీ(276 బంతుల్లో 16 ఫోర్లు, 141 నాటౌట్) సెంచరీతో కదం తొక్కాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 361 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు.రహ్మత్ షా అరుదైన రికార్డు..ఇక ఈ మ్యాచ్‌లో ద్విశతకంతో చెలరేగిన రహ్మత్ షా ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో అఫ్గాన్ తరపున అత్యధిక స్కోర్ చేసిన ప్లేయర్‌గా రహ్మత్(231*) నిలిచాడు. గతంలో ఈ రికార్డు హష్మతుల్లా షాహిదీ(200) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో షాహిదీ ఆల్‌టైమ్ రికార్డును షా బ్రేక్ చేశాడు. అదే విధంగా టెస్టు మ్యాచ్‌లో ఒక రోజు మొత్తం వికెట్ కోల్పోకపోవడం ఇదే తొలిసారి 2019 తర్వాత ఇదే తొలిసారి.చదవండి: VHT 2024-25: పంజాబ్ ఓపెనర్ విధ్వంసం.. 14 ఫోర్లు, 10 సిక్స్‌లతో -
వన్డేలో 407 చే‘దంచేశారు’
వడోదర: భారత దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్లో రికార్డు లక్ష్యఛేదన నమోదైంది. పురుషుల అండర్–23 వన్డే టోర్నమెంట్లో సూపర్ ‘డబుల్’ ఫామ్‌లో ఉత్తరప్రదేశ్ (యూపీ) బ్యాటర్ సమీర్ రిజ్వీ (105 బంతుల్లో 202 నాటౌట్; 10 ఫోర్లు, 18 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరుస మ్యాచ్‌ల్లో రెండో అ‘ద్వితీయ’ సెంచరీ సాధించడంతో యూపీ 407 పరుగుల లక్ష్యాన్ని 41.2 ఓవర్లలోనే ఛేదించి దేశవాళీ క్రికెట్ పుటలకెక్కింది.జీఎస్ఎఫ్సీ మైదానంలో గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట సొంతగడ్డపై విదర్భ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 406 పరుగుల భారీస్కోరు చేసింది. టాపార్డర్ బ్యాటర్ దనిశ్ మాలేవర్ (123 బంతుల్లో 142; 16 ఫోర్లు, 4 సిక్స్‌లు), మిడిలార్డర్లో కెపె్టన్ ఫయాజ్ (62 బంతుల్లో 100; 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) ‘శత’క్కొట్టారు. మూడో వికెట్‌కు వీరిద్దరు 197 పరుగులు జోడించారు. తర్వాత జగ్జోత్ (26 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధాటిగా అర్ధసెంచరీ సాధించడంతో విదర్భ 400 పైచిలుకు భారీ స్కోరు చేసింది. అయితే ఈ సంతోషం ప్రత్యర్థి లక్ష్యఛేదనకు దిగడంతోనే ఆవిరైంది. ఓపెనర్లు శౌర్య సింగ్ (42 బంతుల్లో 62; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), స్వస్తిక్ (28 బంతుల్లో 41; 1 ఫోర్, 4 సిక్స్‌లు) 10.4 ఓవర్లలోనే 106 పరుగులు చకచకా జతచేశారు. ఈ మెరుపు శుభారంభం రికార్డు ఛేజింగ్‌కు బాటవేసింది. వన్‌డౌన్ బ్యాటర్ షోయబ్ సిద్దిఖీ (73 బంతుల్లో 96 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ రిజ్వీ అబేధ్యమైన మూడో వికెట్‌కు కేవలం 173 బంతుల్లోనే 296 పరుగులు ధనాధన్‌గా జతచేయడంతో ఉత్తర ప్రదేశ్ జట్టు 41.2 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసి గెలిచింది. ఈ టోర్నీలో సమీర్ గత మ్యాచ్‌లో త్రిపురపై కూడా (93 బంతుల్లో 201 నాటౌట్) డబుల్ సెంచరీతో కదంతొక్కాడు. ఈ రెండు సందర్భాల్లోనూ అతను అవుట్ కాకుండా అజేయంగా నిలవడం విశేషం. -
ధోని శిష్యుడి విధ్వంసం.. 20 సిక్స్‌లతో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ
బీసీసీఐ పురుషుల అండర్-23 స్టేట్ ఎ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ కెప్టెన్ సమీర్ రిజ్వీ విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో భాగంగా శనివారం త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో సమీర్ రిజ్వీ డబుల్ సెంచరీతో చెలరేగాడు. ప్రత్యర్ధి బౌలర్లను రిజ్వీ ఊచకోత కోశాడు. మైదానం నలుమూలల బౌండరీలు బాదుతూ అభిమానులను అలరించాడు.రిజ్వీ కేవలం 97 బంతుల్లో 13 ఫోర్లు, 20 సిక్సర్లతో 201 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఉత్తరప్రదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. సమీర్ రిజ్వీతో పాటు... శౌర్య సింగ్ (51; 9 ఫోర్లు, 1 సిక్స్), ఆదర్శ్ సింగ్ (52) హాఫ్‌సెంచరీలతో రాణించారు.అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన త్రిపుర జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 253 పరుగులకు పరిమితమైంది. ఆనంద్ (68), తన్మయ్ దాస్ (48) పోరాడినా లాభం లేకపోయింది. ఉత్తరప్రదేశ్ బౌలర్లలో కునాల్ త్యాగీ 3, విజయ్ కుమార్, వన్ష్ చౌదరి చెరో రెండు వికెట్లు తీశారు.రిజ్వీ అరుదైన ఘనత..కాగా ఈ మ్యాచ్‌లో ద్విశతకంతో మెరిసిన సమీర్ రిజ్వీ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. అండర్ 23 స్టేట్-ఎ ట్రోఫీ చరిత్రలో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ ఆటగాడిగా రిజ్వీ నిలిచాడు. అయితే ఈ టోర్నీలో రిజ్వీ చేసిన డబుల్ సెంచరీ లిస్ట్-ఎ క్రికెట్ కిందకి రాదు. లిస్ట్-ఎ క్రికెట్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు ప్రస్తుతం న్యూజిలాండ్ ఆటగాడు చాడ్ బోవ్స్ పేరిట ఉంది. కివీస్ దేశీవాళీ టోర్నీ ఫోర్డ్ ట్రోఫీలో బోవ్స్ కేవలం 103 బంతుల్లో ద్విశతకం సాధించాడు.చెన్నై టూ ఢిల్లీ.. ఐపీఎల్-2025 మెగా వేలంలో రిజ్వీని రూ. 95 లక్షలకకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. గత సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు రిజ్వీ ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్-2024 మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ సమీర్ రిజ్వీని 8.4 కోట్ల భారీ ధరకు అతడిని కొనుగోలు చేసింది. సీఎస్కే దిగ్గజం ఎంఎస్ ధోనితో కలిసి ఆడాడు. అతడి సూచనలు మెరకు ఒకట్రెండు మ్యాచ్‌ల్లో పర్వాలేదన్పించిన రిజ్వీ.. తర్వాతి మ్యాచ్‌ల్లో నిరాశపరిచాడు. ఐదు మ్యాచుల్లో కేవలం 51 పరుగులు మాత్రమే చేశాడు. 2️⃣0️⃣1️⃣* runs9️⃣7️⃣ balls2️⃣0️⃣ Sixes1️⃣3️⃣ foursWatch 🎥 highlights of Uttar Pradesh captain Sameer Rizvi's record-breaking fastest double century in Men's U23 State A Trophy, against Arunachal Pradesh in Vadodara 🔥#U23StateATrophy | @IDFCFIRSTBank pic.twitter.com/WiNI57Tii6— BCCI Domestic (@BCCIdomestic) December 21, 2024 -
విధ్వంసం.. డబుల్ సెంచరీతో చెలరేగిన సెహ్వాగ్ కొడుకు
టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నాడు. తండ్రికి తగ్గ తనయుడుగా నిరూపించుకుంటున్నాడు. కూచ్ బెహార్ ట్రోఫీ-2024లో ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్యవీర్..మేఘాలయతో జరుగుతున్న మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో చెలరేగాడు.తండ్రిలానే ప్రత్యర్ధి బౌలర్లను ఆర్యవీర్ ఊచకోత కోశాడు. తనదైన స్టైల్లో కేవలం 229 బంతుల్లోనే తన డబుల్ సెంచరీ మార్క్‌ను జూనియర్ సెహ్వాగ్ అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 34 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. ఆర్యవీర్ సరిగ్గా 200 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ల్లీ తమ తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 468 పరుగులు చేసింది. అతడితో పాటు ధన్యా నక్ర(98) పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇక ఢిల్లీ ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌లో 208 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.అరంగేట్రంలోనే అదుర్స్..ఈ ఏడాది అక్టోబర్‌లో ఆర్యవీర్ వినూ మన్కడ్ ట్రోఫీలో ఢిల్లీ తరపున ప్రొఫెషనల్ క్రికెట్లో అడుగు పెట్టాడు. తన డెబ్యూ మ్యాచ్‌లోనే ఆర్యవీర్ అదరగొట్టాడు. మణిపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 పరుగులు చేసిన తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని ఈ ఢిల్లీ చిచ్చరపిడుగు అందించాడు. ఆ తర్వాత ఆర్యవీర్ సెహ్వాగ్ తన ప్రతిభను చాటుకుంటూ వస్తున్నాడు. మరోవైపు ఆర్యవీర్ ఐపీఎల్లో ఆడితే చూడాలన్న తన కోరికను సెహ్వాగ్ ఇప్పటికే వెల్లడించాడు.చదవండి: IND vs AUS: టీమిండియాకు గుడ్ న్యూస్.. రోహిత్ శర్మ వచ్చేస్తున్నాడు! -
షేక్ రషీద్ డబుల్ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: కెప్టెన్ షేక్ రషీద్ (372 బంతుల్లో 203; 28 ఫోర్లు) డబుల్ సెంచరీ , తో చెలరేగడంతో హైదరాబాద్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 147 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న పోరులో ఓవర్‌నైట్ స్కోరు 168/2తో శుక్రవారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర జట్టు ఆట ముగిసే సమయానికి 143 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసింది. కరణ్ షిండే (221 బంతుల్లో 109; 12 ఫోర్లు) సెంచరీతో ఆకట్టుకోగా... షేక్ రషీద్ ద్విశతకంతో విజృంభించాడు. తాజా రంజీ సీజన్లో వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్న రషీద్ ఈసారి పూర్తి సాధికారికతతో బ్యాటింగ్ చేయగా... హైదరాబాద్ బౌలర్లు అతడిని కట్టడి చేయలేకపోయారు. ఆరంభంలో ఆచితూచి ఆడిన రషీద్... పరిస్థితులను ఆకలింపు చేసుకున్న అనంతరం ఎడాపెడా బౌండరీలతో స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో మూడో వికెట్‌కు కరణ్ షిండేతో కలిసి రషీద్ 236 పరుగులు జోడించి జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించి పెట్టాడు. హనుమ విహారి (0) డకౌట్ కాగా... వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ (33; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. హైదరాబాద్ బౌలర్లలో అనికేత్ రెడ్డి 4 వికెట్లు... చామా మిలింద్, రక్షణ్ రెడ్డి చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం యరా సందీప్ (73 బంతుల్లో 33 బ్యాటింగ్; 4 ఫోర్లు, 1 సిక్స్), లలిత్ మోహన్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
శ్రేయస్ అయ్యర్ ఊచకోత.. కెరీర్లో తొలి డబుల్ సెంచరీ
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్, ముంబై స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ తన ఫామ్‌ను తిరిగి అందుకున్నాడు. రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో భాగంగా బాంద్రా కుర్లా కాంప్లెక్స్ గ్రౌండ్ వేదికగా ఒడిశాతో జరుగుతున్న మ్యాచ్‌లో అయ్యర్ అద్భుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు.ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అయ్యర్ వన్డే తరహాలో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మైదానం నలుమూలల బౌండరీలు బాదుతూ తన సత్తా ఎంటో మరోసారి శ్రేయస్ చూపించాడు. ఈ క్రమంలో అయ్యర్ కేవలం 201 బంతుల్లో తన తొలి ఫస్ట్‌క్లాస్ డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.ఓవరాల్‌గా తొలి ఇన్నింగ్స్‌లో 228 బంతులు ఎదుర్కొన్న అయ్యర్.. 24 ఫోర్లు, 9 సిక్స్‌లతో 233 పరుగులు చేసి ఔటయ్యాడు. అయ్యర్‌తో పాటు సుద్దేశ్ లాడ్(150 బ్యాటింగ్) సెంచరీతో మెరిశాడు. వీరిద్దరి విధ్వంసం ఫలితంగా ముంబై తమ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. 117 ఓవర్లు ముగిసే సరికి ముంబై 4 వికెట్ల నష్టానికి 521 పరుగులు చేసింది.అయ్యర్ రీ ఎంట్రీ ఇస్తాడా?కాగా శ్రేయస్ అయ్యర్ తన పేలవ ఫామ్ కారణంగా భారత టెస్టు జట్టులో చోటు కోల్పోయాడు. అయ్యర్ చివరగా ఇండియా తరపున టెస్టుల్లో ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌పై ఆడాడు. తొలి టెస్టు ఆడిన అయ్యర్‌కు తన వెన్ను గాయం తిరగబెట్టడంతో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.ఆ తర్వాత రంజీల్లో ఆడాలన్న బీసీసీఐ అదేశాలు దిక్కరించడంతో అయ్యర్ తన సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయాడు. ఆ తర్వాత దిగివచ్చిన శ్రేయస్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఆడేందుకు సిదద్దమయ్యాడు. ఈ క్రమంలో బుచ్చిబాబు టోర్నీ, దులీప్ ట్రోఫీలో అతడు ఆడాడు. ఇప్పుడు రంజీ సీజన్లో కూడా ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇక అద్బుత డబుల్ సెంచరీతో అయ్యర్ తిరిగి భారత టెస్టు జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది.చదవండి: గుడ్‌న్యూస్ చెప్పిన పీవీ సింధు.. పునాది పడింది! -
ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. 103 బంతుల్లో 27 ఫోర్లు, 7 సిక్సర్లు
లిస్ట్-ఏ క్రికెట్లో (50 ఓవర్ల ఫార్మాట్) ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ నమోదైంది. న్యూజిలాండ్‌లో జరిగే ఫోర్డ్ ట్రోఫీలో క్యాంటర్బరీ ఆటగాడు చాడ్ బోవ్స్ 103 బంతుల్లో 27 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో డబుల్ సెంచరీ బాదాడు. క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఒటాగోతో జరిగిన మ్యాచ్‌లో బోవ్స్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌కు ముందు లిస్ట్-ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు ట్రవిస్ హెడ్, ఎన్ జగదీశన్ పేరిట ఉండేది. వీరిద్దరూ 114 బంతుల్లో డబుల్ సాధించారు. తాజాగా బోవ్స్.. హెడ్ (సౌత్ ఆస్ట్రేలియా), జగదీశన్ (తమిళనాడు) రికార్డును బద్దలు కొట్టాడు. View this post on Instagram A post shared by Canterbury Cricket (@canterbury.cricket)బోవ్స్ ఈ మ్యాచ్‌లో మరో ఘనత కూడా సాధించాడు. న్యూజిలాండ్ లిస్ట్-ఏ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్‌ను నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 110 బంతులు ఎదుర్కొని 205 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ లిస్ట్-ఏ చరిత్రలో అత్యధిక స్కోర్ రికార్డు జేమీ హౌ (222) పేరిట ఉంది.CHAD BOWES SMASHED THE FASTEST DOUBLE HUNDRED IN LIST A CRICKET HISTORY - 103 BALLS. 🤯 pic.twitter.com/sMbIUJnQBW— Mufaddal Vohra (@mufaddal_vohra) October 23, 2024మ్యాచ్ విషయానికొస్తే.. బోవ్స్ డబుల్ సెంచరీతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాంటర్బరీ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 343 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఒటాగో 103 పరుగులకే ఆలౌటై 240 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. చదవండి: న్యూజిలాండ్ టీమ్‌కు కొత్త కెప్టెన్ -
సెలక్టర్లకు వార్నింగ్.. డబుల్ సెంచరీతో చెలరేగిన పుజారా
భారత క్రికెట్ జట్టుకు దూరంగా ఉంటున్న వెటరన్ బ్యాటర్ ఛెతేశ్వర్ పుజారా మరోసారి ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో సత్తాచాటాడు. పుజారా ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో సౌరాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా రాజ్‌కోట్ వేదికగా ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పుజారా అద్బుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు. సౌరాష్ట్ర మొదటి ఇన్నింగ్స్‌లో 348 బంతుల్లో తన డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 22 ఫోర్లు ఉన్నాయి. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో పుజారాకు ఇది 18వ డబుల్ సెంచరీ కావడం గమనార్హం. అంతేకాకుండా పుజారా ఈ ఇన్నింగ్స్‌తో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 27,000 పరుగుల మైలు రాయిని అందుకున్నాడు. ఈ ఘనతను సాధించిన నాలుగో భారత క్రికెటర్‌గా పూజారా నిలిచాడు. ఈ జాబితాలో పూజారా కంటే ముందు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ ఉన్నారు. అదే విధంగా ఫస్ట్ క్లాస్‌లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో పూజారా నాలుగో స్ధానానికి ఎగబాకాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో డాన్ బ్రాడ్‌మన్(37) అగ్రస్ధానంలో ఉండగా .. తర్వాతి స్ధానాల్లో వాలీ హమండ్(36), హెన్రడన్(22), పూజారా(18) కొనసాగుతున్నారు. -
పాక్‌కు చుక్కలు.. హ్యారీ బ్రూక్ విధ్వంసకర డబుల్ సెంచరీ
ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్లు పరుగులు వరద పారిస్తున్నారు. మొదటి ఇన్నింగ్స్‌లో ఇప్పటికే జో రూట్ డబుల్ సెంచరీతో చెలరేగగా.. ఇప్పుడు ఈ జాబితాలోకి స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ చేరాడు. ముల్తాన్ టెస్టులో బ్రూక్ విధ్వంసకర డబుల్ సెంచరీతో మెరిశాడు. బ్యాటింగ్‌కు స్వర్గధామంలా ఉన్న ముల్తాన్ పిచ్‌పై బ్రూక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వన్డేను తలపిస్తూ పాక్ బౌలర్లను ఊతికారేశాడు. ఈ క్రమంలో కేవలం 18 ఫోర్లు, 1 సిక్సర్‌తో బ్రూక్ తొలి డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ప్రస్తుతం 218 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు.అది పిచ్ కాదు.. హైవే!తొలి టెస్టుకు సిద్దం చేసిన ముల్తాన్ పిచ్‌పై సర్వాత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వికెట్ ఏ మాత్రం టెస్ట్ క్రికెట్‌కు పనికిరాదని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. కనీసం స్వింగ్, టర్న్ లేకుండా హైవేలా ఉందని సెటైర్లు వేస్తున్నారు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఎటువంటి పిచ్ టెస్టు క్రికెట్‌ను నాశనం చేస్తుందని విమర్శలు గుప్పించాడు. ఇంగ్లండ్ ప్రస్తుతం తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 658 పరుగులు చేసింది. క్రీజులో హ్యారీ బ్రూక్(220), జో రూట్(259) ఉన్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 414 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. అంతకుముందు పాక్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 556 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లండ్ ప్రస్తుతం 111 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ దాదాపుగా డ్రా అయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.చదవండి: IND vs BAN: వారెవ్వా హార్దిక్.. సూపర్ మ్యాన్‌లా డైవ్ చేస్తూ! వీడియో First Test double ton for Harry Brook 💯💯#PAKvENG | #TestAtHome pic.twitter.com/ZjikCyBQpu— Pakistan Cricket (@TheRealPCB) October 10, 2024 -
షఫాలీ విశ్వరూపం
భారత మహిళా క్రికెటర్లా... మజాకా! దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో చెన్నైలో ఆరంభమైన ఏకైక టెస్టును టీమిండియా రికార్డుల జడివానతో మొదలుపెట్టింది. ‘ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ’... తొలి వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం... ఒకేరోజు అత్యధిక జట్టు స్కోరు... ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు... ఇలా ఒకటేమిటి అన్ని కలగలిపి అతివల క్రికెట్లో అపూర్వ రికార్డుల జాతరను మన మహిళల జట్టు ఆవిష్కరించింది. ఈ మ్యాచ్‌ను చూసిన వారందరికి ఆడుతోంది అమ్మాయిలేనా? జరుగుతోంది టెస్టా లేదంటే వన్డేనా అన్న అనుమానం కలగకమానదు. అంతలా... ఆకాశమే హద్దన్నట్లుగా హర్మన్‌ప్రీత్ బృందం సఫారీపై సూపర్‌గా ఆడింది. చెన్నై: భారత మహిళల క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో విశ్వరూపమే చూపెట్టింది. డాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ (197 బంతుల్లో 205; 23 ఫోర్లు, 8 సిక్స్‌లు) అంతర్జాతీయ మహిళల క్రికెట్లో వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించింది. మరో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (161 బంతుల్లో 149; 27 ఫోర్లు, 1 సిక్స్) కూడా సఫారీ బౌలర్లను చితగ్గొట్టి మరీ శతకాన్ని పూర్తి చేసుకుంది. దీంతో శుక్రవారం మొదలైన ఈ ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు తొలి రోజు ఆట ముగిసేసరికి 98 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి 525 పరుగుల భారీస్కోరు కాదు... ఒక్క రోజే రికార్డు స్కోరు నమోదు చేసింది. పరుగు... ప్రవాహమైందిలా! టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ చేపట్టింది. ఓపెనర్లు స్మృతి, షఫాలీ పరుగులు మొదలుపెట్టారు. ఇది పట్టాలెక్కగానే ప్రవాహం ఆ వెంటే రికార్డుల విధ్వంసం రోజంతా కొనసాగింది. 14వ ఓవర్లో భారత్ స్కోరు 50కి చేరింది. స్మృతి 78 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. దీంతోనే ఇది టెస్టు కాదని వన్డేనేమో అనే అనుమానం మొదలైంది.షఫాలీ 66 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించడం, జట్టు స్కోరు వన్డేలకు దీటుగా 24.4 ఓవర్లలోనే 100కు చేరడంతో ఇది ఏ మ్యాచ్ అబ్బా అని అభిమానులు క్రికెట్‌కు సంబంధించిన వెబ్సైట్లలో ఏ ఫార్మాట్ అనే ఎంక్వైరీ చేసుకునేలా చేసింది. లంచ్ విరామానికి 130/0 స్కోరు చేసింది. ఆ తర్వాత రెండో సెషన్లోనూ ఓపెనర్లు షఫాలీ, స్మృతిల బ్యాటింగ్ దూకుడుతో 39 ఓవర్లలోనే భారత్ 200 స్కోరును అవలీలగా దాటేసింది. ఈ క్రమంలో ముందుగా షఫాలీ 113 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకోగా, స్మృతి 122 బంతుల్లో శతకాన్ని సాధించింది. 194 బంతుల్లో ‘ద్విశతకం’ ఎట్టకేలకు 52వ ఓవర్లో స్మృతి అవుటైంది. 54వ ఓవర్లో జట్టు స్కోరు 300 పరుగులకు చేరుకుంది. అప్పుడు తెలిసొచ్చింది స్కోరైతే వన్డే తీరు... ఫార్మాట్ అయితే సంప్రదాయ పోరు అని! కాసేపటికే శుభా సతీశ్ (15) వెనుదిరిగింది. 334/2 స్కోరు వద్ద టీ బ్రేక్‌కు వెళ్లారు. తర్వాత జెమీమా రోడ్రిగ్స్ (94 బంతుల్లో 55; 8 ఫోర్లు) అండతో షఫాలీ 194 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించింది. 73వ ఓవర్లోనే భారత్ 400 పరుగుల మైలురాయిని వేగంగా అందుకుంది. షఫాలీ రనౌట్ కాగా... క్రీజులో పాతుకుపోయినా జెమీమా కూడా (85 బంతుల్లో) ఫిఫ్టీ సా«ధించింది. 95వ ఓవర్లో భారత్ 500 అసాధారణ స్కోరును ఒక్కరోజులోనే సాధించింది. స్కోరు వివరాలు భారత మహిళల తొలి ఇన్నింగ్స్: షఫాలీ వర్మ (రనౌట్) 205; స్మృతి (సి) డెర్క్సెన్ (బి) టకర్ 149; శుభ (సి) జాఫ్తా (బి) డి క్లెర్క్ 15; జెమీమా (సి) డి క్లెర్క్ (బి) టకర్ 55; హర్మన్‌ప్రీత్ (బ్యాటింగ్) 42; రిచా ఘోష్ (బ్యాటింగ్) 43; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (98 ఓవర్లలో 4 వికెట్లకు) 525. వికెట్ల పతనం: 1–292, 2–325, 3–411, 4–450. బౌలింగ్: క్లాస్ 14–2–63–0, డెర్క్సెన్ 11–0–60–0, నదినె 10–1–62–1, టుమి 10–0– 55–0, నొంకు లులెకొ లబ 24–1–113–0, డెల్మి టకర్ 26–1–141–2, సునె లుస్ 3–0–15–0.1 మహిళల క్రికెట్లో షఫాలీ 194 బంతుల్లో సాధించిన వేగవంతమైన డబుల్ సెంచరీ కొత్త రికార్డు. ఇదే ఏడాది దక్షిణాఫ్రికా జట్టుపైనే అనాబెల్ సదర్లాండ్ (ఆ్రస్టేలియా) 248 బంతుల్లో ద్విశతకం చేసింది. 2 మిథాలీ రాజ్ (214; 2002లో ఇంగ్లండ్‌పై) తర్వాత టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించిన రెండో భారతీయ మహిళా క్రికెటర్‌గా షఫాలీ నిలిచింది. 292 తొలి వికెట్‌కు షఫాలీ, స్మృతి జోడించిన పరుగులు. ఇది కొత్త ప్రపంచ రికార్డు. 2004లో పాక్ ఓపెనర్లు సాజీదా, కిరణ్ బలూచ్‌లు విండీస్‌పై తొలి వికెట్‌కు 241 పరుగులు జతచేశారు. 525 టెస్టు క్రికెట్లో మ్యాచ్ తొలిరోజుతోపాటు ఒకే రోజు అత్యధిక పరుగులు చేసిన జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. 1935లో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ తొలిరోజు 431 పరుగులు చేసింది. -
చరిత్ర సృష్టించిన "లేడీ సెహ్వాగ్".. ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ! వీడియో
చెపాక్ వేదికగా దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత ఓపెనర్ షఫాలీ వర్మ చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో షఫాలీ వర్మ విధ్వంసకర డబుల్ సెంచరీతో చెలరేగింది. టెస్టు క్రికెట్ అన్న విషయం మర్చిపోయిన షఫాలీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. సౌతాఫ్రికా బౌలర్లకు వర్మ చుక్కలు చూపించింది. షఫాలీ బౌండరీల వర్షం కురిపించింది. ఈ క్రమంలో కేవలం 194 బంతుల్లోనే తన తొలి డబుల్ సెంచరీ మార్క్‌ను షఫాలీ అందుకుంది. వరుసగా సిక్స్‌లు బాదుతూ షఫాలీ తన స్టైల్లో ద్విశతకం నమోదు చేసింది. ఓవరాల్‌గా 197 బంతులు ఎదుర్కొన్న షఫాలీ 27 ఫోర్లు, 8 సిక్స్‌లతో 205 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరింది. దురదృష్టవశాత్తూ రనౌట్ రూపంలో షఫాలీ వర్మ వెనుదిరిగింది. ఇక డబుల్ సెంచరీతో చెలరేగిన ఈ లేడీ సెహ్వాగ్.. పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంది.షఫాలీ సాధించిన రికార్డులు ఇవే..మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ నమోదు చేసిన ప్లేయర్‌గా షఫాలీ రికార్డులకెక్కింది. ఇప్పటివరకు ఈ రికార్డు ఆసీస్ ఆల్‌రౌండర్ అన్నాబెల్ సదర్లాండ్ పేరిట ఉండేది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సదర్లాండ్ 256 బంతుల్లో ద్విశతకం నమోదు చేసింది. తాజా మ్యాచ్‌లో కేవలం 194 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేసిన వర్మ.. అన్నాబెల్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేసింది. అదేవిధంగా టెస్టు క్రికెట్లో డబుల్ సెంచరీ చేసిన రెండో భారత మహిళా క్రికెటర్‌గా షఫాలీ నిలిచింది. షఫాలీ కంటే ముందు భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ టెస్టుల్లో ద్విశతకం నమోదు చేసింది. THE MOMENT SHAFALI VERMA CREATED HISTORY. ⭐- She scored Fastest Double Hundred in Women's Test Cricket History. 🔥 pic.twitter.com/94zBj5zY01— Tanuj Singh (@ImTanujSingh) June 28, 2024 -
ఆల్ టైమ్ రికార్డు.. ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. 20 ఫోర్లు, 21 సిక్సర్లతో..!
కౌంటీ క్రికెట్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ నమోదైంది. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్-2 పోటీల్లో భాగంగా ససెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లీసెస్టర్‌షైర్ ఆటగాడు లూయిస్ కింబర్ కేవలం 100 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించాడు. ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ చరిత్రలోనే ఇది వేగవంతమైన డబుల్ సెంచరీగా రికార్డైంది. గతంలో (2016) ఈ రికార్డు గ్లామోర్గన్ ఆటగాడు అనెరిన్ డొనాల్డ్ పేరిట ఉండేది. డొనాల్డ్ డెర్బిషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో 123 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. తాజాగా డొనాల్డ్ రికార్డును కింబర్ బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో కింబర్ 127 బంతులు ఎదుర్కొని 20 ఫోర్లు, 21 సిక్సర్ల సాయంతో 243 పరుగులు చేశాడు.ఫస్ట్‌క్లాస్ క్రికెట్ చరిత్రలో రెండో వేగవంతమైన డబుల్ సెంచరీ..ససెక్స్‌పై కింబర్ చేసిన డబుల్ సెంచరీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలోనే రెండో వేగవంతమైన డబుల్ సెంచరీగా రికార్డైంది. ఈ ఫార్మాట్లో వేగవంతమైన డబుల్ సెంచరీ రికార్డు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు షఫీగుల్లా పేరిట ఉంది. షఫీగుల్లా 2018లో కాబుల్ రీజియన్ తరఫున ఆడుతూ బూస్ట్ రీజియన్‌పై కేవలం 89 బంతుల్లోనే డబుల్ బాదాడు.ఫస్ట్ క్లాస్ క్రికెట్లో టాప్-5 వేగవంతమైన డబుల్ సెంచరీలు..షఫీగుల్లా - 89 బంతులు, కాబూల్ రీజియన్ vs బూస్ట్ రీజియన్, 2018లూయిస్ కింబర్ - 100 బంతులు, లీసెస్టర్‌షైర్ vs ససెక్స్, 2024తన్మయ్ అగర్వాల్ - 119 బంతులు, హైదరాబాద్ vs అరుణాచల్, 2024రవిశాస్త్రి - 123 బంతులు, బాంబే vs బరోడా, 1985అనెరిన్ డోనాల్డ్ - 123 బంతులు, గ్లామోర్గాన్ vs డెర్బీషైర్, 2016ఈ మ్యాచ్‌లో కింబర్ మరో ఆల్ టైమ్ కౌంటీ క్రికెట్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో కింబర్ కొట్టిన సిక్సర్లు (21) కౌంటీ క్రికెట్ చరిత్రలోనే ఓ బ్యాటర్ కొట్టిన అత్యధిక సిక్సర్లుగా రికార్డయ్యాయి. గతంలో ఈ రికార్డు ఇంగ్లండ్ ప్రస్తుత టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ (17 సిక్సర్లు) పేరిట ఉంది.కౌంటీ క్రికెట్లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు సాధించిన టాప్-4 ఆటగాళ్లు..21 - లూయిస్ కింబర్ vs ససెక్స్, 202417 - బెన్ స్టోక్స్ vs వోర్సెస్టర్షైర్, 202216 - ఆండ్రూ సైమండ్స్ vs గ్లామోర్గాన్, 199516 - గ్రాహం నేపియర్ vs సర్రే, 2011ఈ మ్యాచ్‌లో మరో ఆల్‌టైమ్ కౌంటీ రికార్డు కూడా నమోదైంది. ససెక్స్ బౌలర్ ఓలీ రాబిన్సన్ కౌంటీ క్రికెట్ చరిత్రలోనే ఓ ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా ఆల్‌టైమ్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. రాబిన్సన్ ఓ ఓవర్లో ఏకంగా 43 పరుగులు సమర్పించుకున్నాడు.కౌంటీ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న టాప్-3 బౌలర్లు...ఓలీ రాబిన్సన్- 43 పరుగులు- 2024అలెక్స్ ట్యూడర్- 38 పరుగులు- 1998షోయబ్ బషీర్- 38 పరుగులు- 2024ఈ మ్యాచ్‌లో కింబర్ మెరుపు డబుల్ సెంచరీతో విరుచుకుపడినా అతని జట్టు లిసెస్టర్‌షైర్ ఓటమిపాలవడం కొసమెరుపు. 464 పరుగుల లక్ష్య ఛేదనలో లీసెస్టర్‌షైర్ 446 పరుగులకే ఆలౌటై 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. -
IPL 2024: టీ20ల్లో తొలి డబుల్ సెంచరీ అతడిదే.. కేన్ మామ జోస్యం
బ్యాటర్ల సంపూర్ణ ఆధిపత్యం నడుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో టీ20 డబుల్ సెంచరీ అనేది ఎక్కువ దూరం లేదన్న విషయం అర్దమవుతుంది. బ్యాటర్ల ఊచకోత ధాటికి టీ20 డబుల్ ఇప్పుడా అప్పుడా అన్నట్లుంది. అతి త్వరలో ఈ అపురూప ఘట్టాన్ని చూడటం ఖాయమన్న విషయం తేలిపోయినప్పటికీ.. ఎవరు తొలి డబుల్ సాధిస్తారనే విషయంపై మాత్రం ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. జోస్ బట్లర్, రోహిత్ శర్మ సాధిస్తాడని కొందరంటుంటే.. ట్రవిస్ హెడ్, క్లాసెన్‌కు అవకాశం ఉందని మరికొందరంటున్నారు. వీరిద్దరి పేర్లే కాకుండా చాలామంది క్రికెటర్ల పేర్లు తొలి టీ20 డబుల్ రేసులో వినబడుతున్నాయి. ఈ విషయంపై చాలా మంది తరహాలోనే న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. టీ20ల్లో తొలి డబుల్ సెంచరీ చేసే ఛాన్స్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఉందని అభిప్రాయపడ్డాడు. రోహిత్‌కు వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన అనుభవం ఉంది కాబట్టి టీ20 డబుల్ అతనికి ఈజీ అవుతుందని అన్నాడు. రోహిత్ ఎలాగూ ఓపెనర్‌గానే బరిలోకి దిగుతాడు కాబట్టి ఏ క్షణంలోనైనా అతని బ్యాట్ నుంచి టీ20 డబుల్ జాలు వారే అవకాశం ఉందని తెలిపాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లోనే ఈ ఫీట్ నమోదైనా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నాడు. 2024 ఐపీఎల్లో బ్యాటర్ల దూకుడు చూస్తుంటే ఇది ఎంతో దూరం లేదని అనిపిస్తుందని పేర్కొన్నాడు. ఈ సీజన్లో బ్యాటర్ల విధ్వంసం రెట్టింపైందని.. ఈ సీజన్లో నమోదైన జట్టు స్కోర్లే ఇందుకు నిదర్శనమని గుర్తు చేశాడు. ఇదే సందర్భంగా కేన్ ఎంఎస్ ధోనిని తన ఆల్‌టైమ్ ఉత్తమ ఐపీఎల్ జట్టుకు కెప్టెన్‌గా ఎన్నుకున్నాడు. కాగా, టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉన్న విషయం తెలిసిందే. 2013 ఐపీఎల్లో గేల్ పూణే వారియర్స్‌పై 66 బంతుల్లో 175 (నాటౌట్) పరుగులు చేశాడు. టీ20ల్లో నేటి వరకు ఇదే అత్యుత్తమ స్కోర్‌గా చలామణి అవుతుంది. ప్రస్తుత పరిస్థితులకు చూస్తుంటే గేల్ రికార్డు మూడినట్లు అనిపిస్తుంది. -
వారెవ్వా జైశ్వాల్.. విధ్వంసకర డబుల్ సెంచరీ! ఇదేమి బాదుడు
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ దుమ్ములేపుతున్నాడు. రెండో టెస్టులో డబుల్ సెంచరీతో చెలరేగిన జైశ్వాల్.. ఇప్పుడు మరో ద్విశతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో విధ్వంసకర డబుల్ సెంచరీతో యశస్వీ చెలరేగాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బౌలర్లను జైశ్వాల్ ఊచకోత కోశాడు. సెంచరీ తర్వాత మూడో రోజు రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగి జైస్వాల్.. నాలుగో రోజు బ్యాటింగ్‌కు వచ్చి వీర విహారం చేశాడు. ఈ క్రమంలో జైశ్వాల్ కేవలం 231 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స్‌లతో తన డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 238 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్.. 14 ఫోర్లు, 12 సిక్సులతో అజేయంగా 214 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. కాగా జైశ్వాల్‌కు తన కెరీర్లో ఇది రెండో డబుల్ డబుల్ సెంచరీ కావడం గమనార్హం. అంతకుముందు వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో యశస్వీ 209 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. జైశ్వాల్‌తో పాటు శుబ్‌మన్ గిల్(91), అరంగేట్ర ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్(68*) అద్భుతంగా రాణించారు. దీంతో రెండో ఇన్నింగ్స్‌ను భారత జట్టు 430/4 పరుగుల భారీ స్కోర్ వద్ద తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఫలితంగా ఇంగ్లండ్ ముందు టీమిండియా 557 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. 𝙃𝙖𝙩-𝙩𝙧𝙞𝙘𝙠 𝙤𝙛 𝙎𝙄𝙓𝙀𝙎! 🔥 🔥 Yashasvi Jaiswal is smacking 'em all around the park! 💥💥💥 Follow the match ▶️ https://t.co/FM0hVG5pje#TeamIndia | #INDvENG | @ybj_19 | @IDFCFIRSTBank pic.twitter.com/OjJjt8bOsx — BCCI (@BCCI) February 18, 2024 -
నిసాంక 210 నాటౌట్
పల్లెకెలె: ఓపెనర్ పతున్ నిసాంక (139 బంతుల్లో 210 నాటౌట్; 20 ఫోర్లు, 8 సిక్స్‌లు) అజేయ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. ఫలితంగా అఫ్గానిస్తాన్‌తో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో శ్రీలంక 42 పరుగుల తేడాతో గెలిచింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలో నిలిచింది. ముందుగా లంక నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది. నిసాంక ప్రత్యర్థి బౌలింగ్‌పై కడదాకా విధ్వంసం కొనసాగించాడు. 88 బంతుల్లో సెంచరీ సాధించిన ఈ ఓపెనర్ ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో తర్వాతి 100 పరుగుల్ని కేవలం 48 బంతుల్లోనే సాధించడంతో 136 బంతుల్లో అతని డబుల్ సెంచరీ పూర్తయ్యింది. ఇప్పటివరకు వన్డేల్లో లంక టాప్ స్కోరర్‌గా నిలిచిన మాజీ ఓపెనర్ సనత్ జయసూర్య (189) ప్రేక్షకుడిగా హాజరైన ఈ మ్యాచ్‌లోనే నిసాంక అతని రికార్డును అతని కళ్లముందే బద్దలు కొట్టడం విశేషం. అవిష్క ఫెర్నాండో (88 బంతుల్లో 88; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు)తో తొలి వికెట్‌కు 182 పరుగులు జోడించిన నిసాంక... సమరవిక్రమ (45; 4 ఫోర్లు, 1 సిక్స్)తో మూడో వికెట్‌కు 120 పరుగులు జత చేశాడు. అనంతరం అఫ్గానిస్తాన్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 339 పరుగులు చేసి పోరాడి ఓడింది. 27/4 స్కోరు వద్ద కష్టాల్లో పడిన జట్టును అజ్మతుల్లా ఒమర్జాయ్ (115 బంతుల్లో 149 నాటౌట్; 13 ఫోర్లు, 6 సిక్స్‌లు), మొహమ్మద్ నబీ (130 బంతుల్లో 136; 15 ఫోర్లు, 3 సిక్స్‌లు) శతకాలతో నడిపించారు. ఇద్దరు ఆరో వికెట్‌కు 242 పరుగులు జోడించారు. శ్రీలంక బౌలర్లలో మదుషాన్ 75 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. రేపు ఇదే వేదికపై రెండో వన్డే జరుగుతుంది. 12 ఓవరాల్‌గా అంతర్జాతీయ వన్డే క్రికెట్లో నమోదైన డబుల్ సెంచరీల సంఖ్య. ఇందులో సగానికి (7)పైగా బాదింది భారత బ్యాటర్లే! ఒక్క రోహిత్ శర్మే మూడు ద్విశతకాలను సాధించాడు. భారత్ తరఫున సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్ ఈ జాబితాలో ఉన్నారు. మార్టిన్ గప్టిల్ (న్యూజిలాండ్), క్రిస్ గేల్ (వెస్టిండీస్), ఫఖర్ జమాన్ (పాకిస్తాన్), మ్యాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా) కూడా వన్డేల్లో డబుల్ సెంచరీలు చేశారు. 3 నిసాంకది వన్డేల్లో మూడో వేగవంతమైన డబుల్ సెంచరీ (138 బంతుల్లో). ఈ జాబితాలో మ్యాక్స్‌వెల్ (128 బంతుల్లో), ఇషాన్ కిషన్ (131 బంతుల్లో) ముందు వరుసలో ఉన్నారు. -
విధ్వంసకర డబుల్ సెంచరీ.. సెహ్వాగ్, క్రిస్ గేల్ రికార్డులు బద్దలు
వన్డే క్రికెట్లో మరో విధ్వంసకర డబుల్ సెంచరీ నమోదైంది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిస్సంక మెరుపు ద్విశతకంతో (139 బంతుల్లో 210 నాటౌట్; 20 ఫోర్లు, 8 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. కేవలం 136 బంతుల్లోనే డబుల్ సెంచరీ మార్కును చేరిన నిస్సంక.. వన్డేల్లో మూడో వేగవంతమైన డబుల్ సెంచరీ నమోదు చేశాడు. ఈ క్రమంలో క్రిస్ గేల్ (138 బంతుల్లో), వీరేంద్ర సెహ్వాగ్ (140 బంతుల్లో) లాంటి అరివీర భయంకరుల రికార్డులను అధిగమించాడు. వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు టీమిండియా ఆటగాడు ఇషాన్ కిషన్ పేరిట ఉంది. 2022లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కేవలం 126 బంతుల్లోనే డబుల్ బాదాడు. రెండో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు ఆసీస్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ (128) పేరిట ఉంది. తాజా డబుల్ సెంచరీతో నిస్సంక మరిన్ని రికార్డులు నమోదు చేశాడు. వన్డేల్లో డబుల్ నమోదు చేసిన తొలి శ్రీలంక ఆటగాడిగా, ఓవరాల్‌గా 12వ ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. నిస్సంకకు ముందు రోహిత శర్మ, మార్టిన్ గప్తిల్, సెమ్వాగ్, క్రిస్ గేల్, ఫకర్ జమాన్, ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, మ్యాక్స్‌వెల్, సచిన్ టెండూల్కర్ వన్డేల్లో డబుల్ మార్కును తాకారు. వీరిలో రోహిత్ శర్మ అత్యధికంగా మూడు వన్డే డబుల్‌లు సాధించాడు. మ్యాచ్ విషయానికొస్తే.. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక.. నిస్సంక విధ్వంసకర ద్విశతకంతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 381 పరుగుల భారీ స్కోర్ చేసింది. నిస్సంకతో పాటు మరో ఓపెనర్ అవిష్క ఫెర్నాండో (88), సమరవిక్రమ (45) రాణించారు. నిస్సంక ఊచకోత ధాటికి ప్రపంచలోకెల్లా మెరుగైన స్పిన్ అటాక్ కలిగిన ఆఫ్ఘన్లు చిగురుటాకుల్లా వణికిపోయారు. -
డబుల్ సెంచరీతో చెలరేగిన యశస్వీ జైశ్వాల్..
వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. 277 బంతుల్లో 18 ఫోర్లు, 7 సిక్స్‌లతో తన డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. భారత ఇన్నింగ్స్ 101 ఓవర్ వేసిన స్పిన్నర్ బషీర్ బౌలింగ్‌లో వరుసగా సిక్స్, ఫోర్ బాది జైశ్వాల్ తన డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. జైశ్వాల్‌కు తన అంతర్జాతీయ కెరీర్లో ఇదే తొలి ద్విశతకం కావడం విశేషం. రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ విఫలమైన చోట జైశ్వాల్ తన అద్బుత ఇన్నింగ్స్‌తో జట్టును ముందుండి నడిపించాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 290 బంతుల్లో 209 పరుగులు చేసి జైశ్వాల్ ఔటయ్యాడు. అండర్సన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి తన వికెట్‌ను జైశ్వాల్ కోల్పోయాడు.108 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 8 వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. DOUBLE CENTURY BY YASHASVI JAISWAL...!!!! 🔥 Monster innings #INDvsENG #INDvsENGTest #YashasviJaiswal pic.twitter.com/vK8IVGfZiZ — 𝐕𝐈𝐑𝐀𝐓𝕏𝐑𝐂𝐁 (@ProfKohli18) February 3, 2024 -
డబుల్ సెంచరీతో చెలరేగిన పుజారా.. టీమిండియాలోకి రీ ఎంట్రీ!?
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు భారత సెలక్టర్లకు వెటరన్ ఆటగాడు ఛతేశ్వర్ పుజారా తన బ్యాట్‌తోనే స్ట్రాంగ్ మెసేజ్ పంపాడు. రంజీట్రోఫీ-2024 సీజన్లో భాగంగా జార్ఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పుజారా డబుల్ సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 302 బంతుల్లో పుజారా తన డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అతడికి ఇది 17వ ఫస్ట్‌క్లాస్ సెంచరీ కావడం విశేషం. పుజారా ప్రస్తుతం 236 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో జార్ఖండ్ బౌలర్ల సహనానికి పరీక్షపెట్టాడు. అతడి వికెట్ పడగొట్టడానికి బౌలర్లు నానా తంటాలు పడుతున్నారు. ఇక డబుల్ సెంచరీతో చెలరేగిన పుజారా పలు అరుదైన ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన నాలుగో ఆటగాడిగా పుజారా నిలిచాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా లెజెండ్ సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ 37 డబుల్ సెంచరీలతో అగ్రస్దానంలో ఉన్నాడు. అదే విధంగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా పుజారా (19730) రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ లక్ష్మణ్(19729)ను పుజారా అధిగమించాడు. ఇక మూడో రోజు లంచ్ విరమానికి సౌరాష్ట్ర 119 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి 566 పరుగుల భారీ స్కోరు సాధించింది. టీమిండియాలోకి రీఎంట్రీ.. కాగా పుజారా చివరగా గతేడాది ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (2021-23) ఫైనల్లో భారత జట్టు తరపున ఆడాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో పుజారా దారుణంగా విఫలమయ్యాడు. ఆ తర్వాత సెలక్టర్లు అతడి పేరును పరిగణనలోకి తీసుకోలేదు. వెస్టిండీస్‌తో టెస్టులకు, ఇటీవల సౌతాఫ్రికాతో ముగిసిన టెస్టులకూ ఎంపిక చేయలేదు. అయితే జనవరిలో ఇంగ్లండ్‌తో స్వదేశంలో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ తలడనుంది. ఈ సిరీస్‌కు ముందు పుజారా అద్భుత ప్రదర్శన కనబరుస్తుండడంతో అతడి రీ ఎంట్రీ ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. -
Glenn Maxwell’s Wife Vini Raman: మాక్స్వెల్, వినీ రామన్ అపురూప (ఫొటోలు)
-
CWC 2023 AFG Vs AUS Highlights Pics: సాహో మ్యాక్సీ.. క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ (ఫొటోలు)
-
ఒకే ఒక్కడు మ్యాక్స్ ‘వెల్డన్’
ఆ్రస్టేలియా విజయలక్ష్యం 292... 18.3 ఓవర్ల వరకు ఆ జట్టు స్కోరు 91/7... ఇక ఐదుసార్లు విశ్వవిజేత ఆ్రస్టేలియాకు అఫ్గానిస్తాన్ చేతిలో ఘోర పరాభవం లాంఛనమేనని అందరూ భావించారు. కానీ గ్లెన్ మ్యాక్స్‌వెల్... కలిసొచ్చిన అదృష్టం (లైఫ్‌లు)... క్రీజులో కదల్లేకపోయిన దైన్యం... ఒకదాని తర్వాత ఒకటి వెంబడించినా... అదృష్టాన్ని అందిపుచ్చుకొని, కష్టాన్ని పంటిబిగువన భరించి ఈ ప్రపంచకప్‌కే అసాధారణ ‘షో’కు తెచ్చాడు. అఫ్గాన్ చేతుల్లో పడిన సంచలనాన్ని మ్యాక్సీ ఒంటిచేత్తో లాక్కున్నాడు. ఆ ఒక్కడే ఆసీస్ సైన్యంగా మారి గెలిచేదాకా నిలిచాడు. కాళ్లు కదలనీయలేకపోయినా... ఉక్కు పిడికిలితో బ్యాట్ పట్టి కొండంత లక్ష్యాన్ని కరిగించాడు. డబుల్ సెంచరీతో ఈ ప్రపంచకప్‌కే వన్నె తెచ్చాడు. ముంబై: నవంబర్ 19న వన్డే వరల్డ్‌కప్ ఫైనల్... టైటిల్ పోరు ఎవరి మధ్యయినా జరగొచ్చు... విజేత ఎవరైనా కావొచ్చు. కానీ ఈ ప్రపంచకప్ అంటే తప్పక గుర్తుండే క్రికెటర్ మాత్రం ఒక్కడే! అతడే మ్యాక్స్‌వెల్! ఛేదించలేని లక్ష్యం. కొండంత కష్టం కళ్లముందుంటే... కఠిన సవాల్ సైతం సలామ్ కొట్టేలా ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మ్యాక్స్‌వెల్ (128 బంతుల్లో 201 నాటౌట్; 21 ఫోర్లు, 10 సిక్స్‌లు) అద్భుత ఇన్నింగ్స్ ఆడేశాడు. ఓటమి కోరల్లోంచి లాగి... మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియాను ఒంటిచేత్తో సెమీఫైనల్‌కు తీసుకెళ్లాడు. అందరూ ముఖమంత కళ్లు చేసుకొని చూసిన ఈ మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ మహిమతో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్‌పై గెలిచింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్తాన్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. ఓపెనర్ ఇబ్రహీమ్ జద్రాన్ (143 బంతుల్లో 129 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ సెంచరీ చేశాడు. ఆఖర్లో రషీద్ ఖాన్ (18 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరిపించాడు. హాజల్‌వుడ్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం ఆ్రస్టేలియా 46.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 293 పరుగులు చేసి గెలిచింది. ఈ 293 పరుగుల్లో 201 మ్యాక్స్‌వెల్ ఒక్కడివే అంటేనే ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లే చేయలేదనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దీంతో అఫ్గాన్ బౌలర్లు నవీనుల్ (2/47), రషీద్ (2/44), ఒమర్జాయ్ (2/52) చిందించిన చెమట... పడగొట్టిన వికెట్లు వృథా అయ్యాయి. జబర్దస్త్ జద్రాన్... ఓపెనర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ (25 బంతుల్లో 21; 2 ఫోర్లు) నిష్క్రమించగా, ఇబ్రహీమ్ జద్రాన్ ఆద్యంతం ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. ఈ క్రమంలో జద్రాన్ 62 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. రహ్మత్ షా (44 బంతుల్లో 30; 1 ఫోర్) కుదురుగా ఆడగా అఫ్గాన్ 21వ ఓవర్లో 100 పరుగులు దాటింది. రెండో వికెట్‌కు ఇద్దరు కలిసి 83 పరుగులు జోడించారు. ఆ తర్వాత కెప్టెన్ హష్మతుల్లా (26; 2 ఫోర్లు) చేసింది తక్కువే అయినా మూడో వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. జద్రాన్‌కు జతయిన అజ్మతుల్లా ఒమర్జాయ్ (18 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడటంతో 41వ ఓవర్లో అఫ్గాన్ 200 స్కోరు చేరింది. జద్రాన్ 131 బంతుల్లో అఫ్గాన్ తరఫున తొలి శతకాన్ని లిఖించాడు. ఒక్కడే అయినా... ఒంటరి కాదు విక్టరీ! హెడ్ (0) ఖాతా తెరువలేదు. మిచెల్ మామార్ష్ (24), వార్నర్ (18)లు గొప్పగా ఆడలేదు. ఇంగ్లిస్ (0), లబుషేన్ (14), స్టొయినిస్ (6)లు అంతే! అఫ్గాన్ బౌలర్లకు కలిసికట్టుగా దాసోహమయ్యారు. జట్టు స్కోరు 50కి ముందే (49/4) ఆసీస్ నలుగురు టాప్ బ్యాటర్లను... వందకు ముందు (91/7) మిగిలిపోయిన బ్యాటింగ్ అస్త్రాలను కోల్పోయింది. గెలుపు సంగతి దేవుడెరుగు! అసలు ప్రపంచకప్‌లలోనే ఫేవరెట్, ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ పరువు సంగతి ఏంటి? ఎంత భారీతేడాతో ఓడుతుందనే కళ్లే మ్యాచ్‌ను చూశాయి. కలిసొచ్చిన రివ్యూలు, మిస్ క్యాచ్‌లు ఒమర్జాయ్ 9వ ఓవర్ తొలి బంతికే వార్నర్, రెండో బంతికి ఇంగ్లిస్‌లను అవుట్ చేశాడు. జట్టుస్కోరు 49/4 వద్ద మ్యాక్స్‌వెల్ క్రీజులోకి వచ్చాడు. బౌలర్ ‘హ్యాట్రిక్’ కోసం ప్రయత్నించాడు. ఎల్బీకోసం రివ్యూకు సైతం వెళ్లాడు. కానీ బంతి మ్యాక్సీ బ్యాట్ అంచును తాకి కీపర్‌కు చాలా ముందుగా పడింది. దీంతో అఫ్గాన్‌కు ఫలితం దక్కలేదు. ఆ తర్వాత 22వ ఓవర్లో రెండుసార్లు... ఎల్బీగా అంపైర్ అవుటిస్తే రివ్యూతో బయటపడ్డాడు. అదే ఓవర్లో ముజీబ్ జారవిడిచిన క్యాచ్‌తో, కాసేపయ్యాక నబీ అందుకోలేకపోయిన క్యాచ్‌తో బతికి బయటపడ్డాక వెనుదిరిగి చూసుకోలేదు. అప్పటికీ మ్యాక్సీ కనీసం 35 పరుగులైనా చేయలేదు. రాత మార్చిన ఘనుడు మ్యాక్స్‌వెల్ భారీ హిట్టింగ్‌కు, మ్యాచ్ విన్నింగ్ షాట్లకు పెట్టింది పేరు. కానీ పెద్ద లక్ష్యం, అంతదూరం ఎలా పయనిస్తాడో అనుకుంటే... జతకూడిన కమిన్స్‌తో కలిసి జట్టు రాతను తన బ్యాట్‌తో మార్చేశాడు. 20 ఓవర్లదాకా మ్యాక్సీ సాధారణ ఆటే ఆడాడు. 51 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేశాడు. నూర్ అహ్మద్ వేసిన 29వ ఓవర్లో 2 వరుస సిక్సర్లతో గేర్ మార్చాడు. స్పిన్నర్లపై దూకుడు పెంచి బౌండరీలు, సిక్సర్లతో శివమెత్తాడు. దీంతో ఛేదించాల్సిన రన్‌రేట్ తగ్గుతూ వచ్చింది. 76 బంతుల్లోనే శతక్కొట్టిన మ్యాక్సీ డబుల్ సెంచరీకి అవసరమైన బంతులు 128 మాత్రమే! బతికించిన ముజీబ్ ఓవర్లోనే ముగించి... సునాయాసమైన క్యాచ్‌ను నేలపాలుచేసిన ముజీబ్ 47వ ఓవర్ వేశాడు. అప్పటికీ 24 బంతుల్లో 21 పరుగులు కావాలి. అయితే మ్యాక్సీ 0, 6, 6, 4, 6లతో ఆ ఓవర్ కూడా పూర్తవకముందే లక్ష్యాన్ని, తన డబుల్ సెంచరీని ముగించాడు. మ్యాక్సీ, కమిన్స్‌లు అబేధ్యమైన 8వ వికెట్‌కు 202 పరుగుల భాగస్వామ్యం జోడించడంతో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. 2006లో భారత్‌పై 8వ వికెట్‌కు దక్షిణాఫ్రికా బ్యాటర్స్ జస్టిన్ కెంప్, అండ్రూ హాల్ చేసిన 138 పరుగుల భాగస్వామ్యం కనుమరుగైంది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ పరుగులు 201 నాటౌట్ బంతులు 128 4 x 21; 6 x 10 1 x 39; 2 x 9 స్ట్రయిక్‌రేట్ 157.03 201 వన్డేల్లో ఆ్రస్టేలియా తరఫున తొలి డబుల్ సెంచరీతోపాటు అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్‌గా మ్యాక్స్‌వెల్ నిలిచాడు. షేన్ వాట్సన్ (185 నాటౌట్; 2011లో బంగ్లాదేశ్‌పై మిర్పూర్లో) పేరిట ఉన్న రికార్డును మ్యాక్స్‌వెల్ బద్దలు కొట్టాడు. 3 ప్రపంచకప్ చరిత్రలో నమోదైన డబుల్ సెంచరీలు. గతంలో న్యూజిలాండ్‌కు చెందిన మార్టిన్ గప్టిల్ (237 నాటౌట్; వెస్టిండీస్‌పై 2015లో వెల్లింగ్టన్లో), వెస్టిండీస్ స్టార్ క్రిస్ గేల్ (215; జింబాబ్వేపై 2015లో కాన్బెర్రాలో) ఈ ఘనత సాధించారు. 2 వన్డేల్లో వేగవంతంగా డబుల్ సెంచరీ చేసిన రెండో ప్లేయర్‌గా మ్యాక్స్‌వెల్ (128 బంతుల్లో) నిలిచాడు. ఈ రికార్డు భారత ప్లేయర్ ఇషాన్ కిషన్ (126 బంతుల్లో; 2022లో బంగ్లాదేశ్‌పై చిట్టగాంగ్‌లో) పేరిట ఉంది. 1 వన్డేల్లో ఛేజింగ్ చేస్తూ అత్యధిక స్కోరు సాధించిన ప్లేయర్‌గా మ్యాక్స్‌వెల్ నిలిచాడు. పాకిస్తాన్ ప్లేయర్ ఫఖర్ జమాన్ (193; 2021లో దక్షిణాఫ్రికాపై జొహన్నెస్‌బర్గ్‌లో) పేరిట ఉన్న రికార్డును మ్యాక్స్‌వెల్ సవరించాడు. 2 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సిక్స్‌లు కొట్టిన క్రికెటర్ల జాబితాలో మ్యాక్స్‌వెల్ (43) మూడో స్థానానికి చేరుకున్నాడు. క్రిస్ గేల్ (49), రోహిత్ శర్మ (45) వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. స్కోరు వివరాలు అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) స్టార్క్ (బి) హాజల్‌వుడ్ 21; జద్రాన్ (నాటౌట్) 129; రహ్మత్ (సి) హాజల్‌వుడ్ (బి) మ్యాక్స్‌వెల్ 30; హష్మతుల్లా (బి) స్టార్క్) 26; ఒమర్జాయ్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) జంపా 22; నబీ (బి) హాజల్ వుడ్ 12; రషీద్ (నాటౌట్) 35; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 291. వికెట్ల పతనం: 1–38, 2–121, 3–173, 4–210, 5–233. బౌలింగ్: స్టార్క్ 9–0–70–1, హాజల్‌వుడ్ 9–0–39–2, మ్యాక్స్‌వెల్ 10–0– 55–1, కమిన్స్ 8–0–47–0, జంపా 10–0– 58–1, హెడ్ 3–0–15–0, స్టొయినిస్ 1–0– 2–0. ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: వార్నర్ (బి) ఒమర్జాయ్ 18; హెడ్ (సి) ఇక్రామ్ (బి) నవీనుల్ 0; మామార్ష్ (ఎల్బీడబ్ల్యూ) (బి) నవీనుల్ 24; లబుషేన్ (రనౌట్) 14; ఇంగ్లిస్ (సి) జద్రాన్ (బి) ఒమరాŠజ్య్ 0; మ్యాక్స్‌వెల్ (నాటౌట్) 201; స్టొయినిస్ (ఎల్బీడబ్ల్యూ) (బి) రషీద్ 6; స్టార్క్ (సి) ఇక్రామ్ (బి) రషీద్ 3; కమిన్స్ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (46.5 ఓవర్లలో 7 వికెట్లకు) 293. వికెట్ల పతనం: 1–4, 2–43, 3–49, 4–49, 5–69, 6–87, 7–91. బౌలింగ్: ముజీబ్ 8.5–1–72–0, నవీనుల్ 9–0–47–2, ఒమర్జాయ్ 7–1–52–2, రషీద్ ఖాన్ 10–0–44–2, నూర్ అహ్మద్ 10–1–53–0, నబీ 2–0–20–0. ప్రపంచకప్‌లో నేడు ఇంగ్లండ్ x నెదర్లాండ్స్ వేదిక: పుణే మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
వన్డే ఫార్మాట్లో మరో డబుల్ సెంచరీ.. ఈసారి..!
రాయల్ లండన్ వన్డే కప్-2023లో నార్తంప్టన్‌షైర్ ఓపెనర్, టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షా చేసిన విధ్వంకర ద్విశతకం (153 బంతుల్లో 244; 28 ఫోర్లు, 11 సిక్సర్లు) మరువక ముందే మరో డబుల్ సెంచరీ నమోదైంది. సోమర్‌సెట్‌తో ఇవాళ (ఆగస్ట్ 13) జరుగుతున్న మ్యాచ్‌లో గ్లోసెస్టర్‌షైర్ కెప్టెన్ జేమ్స్ బ్రేసీ అజేయ డబుల్ సెంచరీతో (151 బంతుల్లో 224 నాటౌట్; 30 ఫోర్లు, 5 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. బ్రేసీతో పాటు మరో ఓపెనర్ క్రిస్ డెంట్ (38 బంతుల్లో 65; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), ఓలివర్ ప్రైస్ (83 బంతుల్లో 77; 8 ఫోర్లు, సిక్స్), ఆఖర్లో గ్రేమ్ వాన్ బుర్రెన్ (12 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో గ్లోసెస్టర్‌షైర్ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 454 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. సోమర్సెట్ బౌలర్లలో లాంగ్రిడ్జ్, జార్జ్ థామస్, షోయబ్ బషీర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ టోర్నీలో డబుల్ సెంచరీలు నమోదైన రెండు సందర్భాల్లో ప్రత్యర్ధి సోమర్సెటే కావడం విశేషం. నార్తంప్టన్‌షైర్‌తో మ్యాచ్‌లో పృథ్వీ షా, గ్లోసెస్టర్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో జేమ్స్ బ్రేసీ సోమర్సెట్ బౌలర్లను ఆడుకున్నారు. ఈ మ్యాచ్‌లో సోమర్సెట్ బౌలర్లందరూ 9కిపైగా యావరేజ్‌తో పరుగులు సమర్పించుకున్నారు. లాంగ్రిడ్జ్ను (8 ఓవర్లలో 5 పరుగులు) అయితే బ్రేసీ, బుర్రెన్ ఊచకోత కోశారు. లిస్ట్-ఏ క్రికెట్లో ఏడో అత్యధిక స్కోర్.. లిస్ట్-ఏ క్రికెట్లో (అంతర్జాతీయ, దేశవాలీ వన్డేలు) ఏడో అత్యధిక స్కోర్ నమోదైంది. సోమర్‌సెట్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గ్లోసెస్టర్‌షైర్ రికార్డు స్థాయిలో 454 పరుగులు స్కోర్ చేసింది. ఈ ఫార్మాట్లో అత్యధిక స్కోర్ రికార్డు తమిళనాడు పేరిట ఉంది. 2022లో అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు జట్టు రికార్డు స్థాయిలో 506 పరుగులు చేసింది. లిస్ట్-ఏ క్రికెట్లో ఓ జట్టు 500 పరుగుల మార్కును దాటడం ఇదే మొదటిసారి. దీని తర్వాత అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు ఇంగ్లండ్ పేరిట ఉంది. 2022లో నెదార్లండ్స్తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ టీమ్ 498 పరుగులు స్కోర్ చేసింది. పదో అత్యధిక వ్యక్తిగత స్కోర్.. లిస్ట్-ఏ క్రికెట్లో పదో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదైంది. సోమర్‌సెట్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గ్లోసెస్టర్‌షైర్ ఆటగాడు జేమ్స్ బ్రేసీ (151 బంతుల్లో 224 నాటౌట్; 30 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ డబుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ తమిళనాడు ఆటగాడు ఎన్ జగదీశన్ (277) పేరిట ఉంది. అతని తర్వాత అలిస్టర్ బ్రౌన్ (268), రోహిత్ శర్మ (264), షార్ట్ (257), శిఖర్ ధవన్ (248),పృథ్వీ షా (244), మార్టిన్ గప్తిల్ (237), ట్రవిస్ హెడ్ (230), డంక్ (229), పృథ్వీ షా (227) ఉన్నారు. -
పృథ్వీ షా సునామీ ఇన్నింగ్స్.. 129 బంతుల్లో డబుల్ సెంచరీ! కానీ...
Prithvi Shaw Slams Double Century- Fans Reacts- లండన్: ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో తొలిసారి ఆడుతున్న భారత క్రికెటర్ పృథ్వీ షా దేశవాళీ వన్డే కప్‌లో డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. సోమర్‌సెట్‌తో బుధవారం జరిగిన వన్డే మ్యాచ్‌లో నార్తంప్టన్‌షైర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న 23 ఏళ్ల పృథ్వీ షా విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మెరిశాడు. 153 బంతులు ఆడిన పృథ్వీ షా 28 ఫోర్లు, 11 సిక్స్‌లతో 244 పరుగులు సాధించి ఇన్నింగ్స్ చివరి ఓవర్లో అవుటయ్యాడు. పృథ్వీ షా అసాధారణ బ్యాటింగ్‌తో మొదట బ్యాటింగ్‌కు దిగిన నార్తంప్టన్‌షైర్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 415 పరుగులు సాధించింది. అనంతరం సోమర్సెట్ జట్టు 45.1 ఓవర్లలో 328 పరుగులకు ఆలౌటై 87 పరుగుల తేడాతో ఓడిపోయింది. రికార్డుల పృథ్వీ నార్తంప్టన్‌షైర్ జట్టు తరఫున మూడో మ్యాచ్ ఆడిన పృథ్వీ షా 81 బంతుల్లో సెంచరీ చేయగా... డబుల్ సెంచరీని 129 బంతుల్లో దాటాడు. ముంబైకి చెందిన పృథ్వీ షాకిది లిస్ట్ ‘ఎ’ క్రికెట్లో (దేశవాళీ, అంతర్జాతీయ వన్డేలు) రెండో డబుల్ సెంచరీ కావడం విశేషం. లిస్ట్ ‘ఎ’లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ల లిస్టులో మాత్రం.. జాబితాలో పృథ్వీ షాది ఆరో స్థానం. ఈ జాబితాలో తమిళనాడు క్రికెటర్ నారాయణ్ జగదీశన్ (277; అరుణాచల్‌ప్రదేశ్‌పై 2022లో) టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. అప్పటి నుంచి నో ఛాన్స్! 2021లో భారత దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో పుదుచ్చేరిపై పృథ్వీ షా 227 పరుగులతో అజేయంగా నిలిచాడు. 2021 జూలైలో చివరిసారి శ్రీలంక పర్యటనలో భారత జట్టుకు ఆడిన పృథ్వీ షా ఆ తర్వాత ఫామ్ కోల్పోయి జాతీయ జట్టుకు దూరమయ్యాడు. ఇక తాజాగా ఇంగ్లండ్‌లో అతడు బ్యాట్ ఝులిపించడంతో టీమిండియా సెలక్టర్లను ఉద్దేశించి అభిమానులు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. మన వాళ్ల ప్రతిభను మనం గుర్తించకపోతే ఇదిగో ఇలాగే పక్క దేశాల్లో ఆడుకుంటారంటూ ఫైర్ అవుతున్నారు. ఇకనైనా పృథ్వీ వంటి వాళ్లకు అవకాశాలు ఇవ్వాలని సూచిస్తున్నారు. చదవండి: మా కెప్టెన్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు.. అదే నా మెదడును తొలిచేసింది! అందుకే.. ✅ Sixth-highest score in List A history ✅ Second-highest List A score in 🏴 ✅ Highest-ever List A score for @NorthantsCCC @PrithviShaw with one of the all-time great knocks 👑#MBODC23 pic.twitter.com/NfXH7RHfqk — Metro Bank One Day Cup (@onedaycup) August 9, 2023 -
పేట్రేగిపోయిన పృథ్వీ షా.. భారీ ద్విశతకం, 28 ఫోర్లు, 11 సిక్సర్లతో విధ్వంసం
టీమిండియా యంగ్ ఓపెనర్, ముంబై ఆటగాడు పృథ్వీ షా ఇంగ్లండ్ దేశవాలీ వన్డే టోర్నీ (లిస్ట్-ఏ క్రికెట్), మెట్రో బ్యాంక్ వన్డే కప్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సోమర్‌సెట్‌తో ఇవాళ (ఆగస్ట్ 9) జరిగిన మ్యాచ్‌లో భారీ ద్విశతం (153 బంతుల్లో 244; 28 ఫోర్లు, 11 సిక్సర్లు) బాది ఆల్‌టైమ్ రికార్డులు బద్దలుకొట్టాడు. ఫలితంగా అతను ప్రాతినిథ్యం వహిస్తున్న నార్తంప్టన్‌షైర్ తొలుత బ్యాటింగ్ చేస్తూ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 415 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. ✅ Sixth-highest score in List A history ✅ Second-highest List A score in 🏴 ✅ Highest-ever List A score for @NorthantsCCC @PrithviShaw with one of the all-time great knocks 👑#MBODC23 pic.twitter.com/NfXH7RHfqk — Metro Bank One Day Cup (@onedaycup) August 9, 2023 ఓపెనర్‌గా బరిలోకి దిగిన షా డబుల్ సెంచరీతో విధ్వంసం సృష్టించగా.. సామ్ వైట్‌మ్యాన్ (54), రికార్డో వాస్కో (47), ఎమిలియో గే (30) రాణించారు. సోమర్ సెట్ బౌలర్లలో జాక్ బ్రూక్స్ 3 వికెట్లు పడగొట్టగా.. డానీ లాంబ్ 2, షోయబ్ బషీర్, జార్జ్ థామస్ తలో వికెట్ దక్కించుకున్నారు. షా విధ్వంసం ధాటికి సోమర్సెట్ బౌలర్లంతా ఊచకోతకు గురయ్యారు. ప్రతి బౌలర్ దాదాపు 9 రన్‌రేట్‌తో పరుగులు సమర్పించుకున్నాడు. 🚨 PRITHVI SHAW HAS 200! 🚨#MBODC23 pic.twitter.com/GeVYVD3o6z — Metro Bank One Day Cup (@onedaycup) August 9, 2023 పృథ్వీ షా డబుల్ సెంచరీ విశేషాలు.. ఈ టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌ల్లో కలిపి 60 పరుగులు చేసిన పృథ్వీ షా.. ఇంగ్లండ్ డొమెస్టిక్ క్రికెట్లో తన మూడో అప్పియరెన్స్లోనే డబుల్ సెంచరీ బాదాడు. ఇదే టోర్నీతో షా ఇంగ్లండ్ డొమెస్టిక్ సర్క్యూట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో 153 బంతులను ఎదుర్కొన్న షా 28 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 244 పరుగులు చేసి, ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అలాగే ఈ టోర్నీ డబుల్ సెంచరీ చేసిన మూడో ఆటగాడిగానూ రికార్డుల్లోకెక్కాడు. ఈ టోర్నీ చరిత్రలో డబుల్ సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 129 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేసిన షా.. ఇంగ్లండ్ లిస్ట్-ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన షా.. ఇంగ్లండ్ లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు చతేశ్వర్ పుజారా (174) పేరిట ఉంది. లిస్ట్-ఏ చరిత్రలో ఆరో అత్యధిక వ్యక్తిగత స్కోర్ ఇంగ్లండ్ లిస్ట్-ఏ క్రికెట్లో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నార్తంప్టన్‌షైర్ తరఫున హైయెస్ట్ లిస్ట్-ఏ స్కోర్ ఇంగ్లండ్ లిస్ట్-ఏ క్రికెట్లో డబుల్ సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడు లిస్ట్-ఏ క్రికెట్లో రెండు వేర్వేరు దేశాల్లో డబుల్ సెంచరీలు చేసిన తొలి ఆటగాడు. భారత దేశవాలీ వన్డే టోర్నీలోనూ షా ఓ డబుల్ సెంచరీ చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్లో రోహిత్ శర్మ (3) తర్వాత అత్యధిక డబుల్ సెంచరీలు (2) 100 on the shirt, 100 on the scoreboard 💯 Prithvi Shaw goes full @nassercricket with his celebration! #MBODC23 pic.twitter.com/5UJLbrF2uQ — Metro Bank One Day Cup (@onedaycup) August 9, 2023 Highest List A individual score for Prithvi Shaw. He surpassed his previous best 227*pic.twitter.com/fI783vh7JH — Don Cricket 🏏 (@doncricket_) August 9, 2023 Prithvi Shaw in 2023: Scored his maiden triple hundred - 379 in 383 balls in the Ranji Trophy. Scored 244 in 153 balls in the Royal London One Day Cup. pic.twitter.com/QhG2tOyaWk — Mufaddal Vohra (@mufaddal_vohra) August 9, 2023 -
లంక గడ్డపై డబుల్ సెంచరీ బాదిన తొలి ఓపెనర్‌గా..
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్తాన్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ డబుల్ సెంచరీతో మెరిశాడు. 322 బంతులెదుర్కొన్న షఫీక్ 19 ఫోర్లు, 4 సిక్సర్లతో డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కాగా టెస్టు క్రికెట్లో అబ్దుల్లా షఫీక్‌కు ఇదే తొలి డబుల్ సెంచరీ కావడం విశేషం. కాగా 23 ఏళ్ల వయసున్న అబ్దుల్లా షఫీక్ పాక్ తరపున డబుల్ సెంచరీ బాదిన మూడో యంగెస్ట్ క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. ఇంతకముందు జావెద్ మియాందాద్, హనీఫ్ మొహమ్మద్‌లు ఈ ఘనత సాధించారు. ఇక లంక గడ్డపై డబుల్ సెంచరీ బాదిన తొలి పాక్ ఓపెనర్‌గానూ అబ్దుల్లా షఫీక్ చరిత్రకెక్కాడు. A true champion knock 🔥❤️ 200 hundred from @imabd28 #SLvPAK #SLvsPAK #AbdullahShafique pic.twitter.com/c2m4ldK3m8 — Mir kashi👑 (@oya_kojuu) July 26, 2023 ఇక రెండో టెస్టులో పాకిస్తాన్ పట్టు బిగిస్తోంది. ఇప్పటికే తొలి టెస్టు గెలిచిన పాక్ సిరీస్ క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. ప్రస్తుతం పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 110 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్లు కోల్పోయి 458 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫీక్‌కు(200 నాటౌట్) అగా సల్మాన్(80 బంతుల్లో 70 బ్యాటింగ్) చక్కగా సహకరిస్తున్నాడు. ఆశితో ఫెర్నాండో మూడు వికెట్లు తీయగా.. ప్రభాత్ జయసూరియా ఒక వికెట్ పడగొట్టాడు. ఇప్పటివరకు పాకిస్తాన్ 292 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆటకు ఇంకా రెండు రోజులు సమయం ఉండడం.. వరుణుడు అడ్డుపడకపోతే మాత్రం పాకిస్తాన్ విజయాన్ని ఆపడం లంకకు కష్టసాధ్యమనే చెప్పొచ్చు. అంతకముందు లంక తొలి ఇన్నింగ్స్‌లో 166 పరుగులకే కుప్పకూలింది.ధనుంజయ డిసిల్వా 57, దినేశ్ చండిమల్ 34 మినహా మిగతావారు పెద్దగా రాణించలేకపోయారు. పాక్ బౌలర్లలో అబ్రర్ అహ్మద్ నాలుగు వికెట్లు తీయగా.. నసీమ్ షా మూడు, షాహిన్ అఫ్రిది ఒక వికెట్ తీశాడు. 🌟 First visiting opener to score a double 💯 at SSC, Colombo 🌟 Third-youngest double-centurion for 🇵🇰 after Javed Miandad and Hanif Mohammad@imabd28 scores a magnificent maiden double ton 🙌#SLvPAK pic.twitter.com/3zGaD0pnKl — Pakistan Cricket (@TheRealPCB) July 26, 2023 Maiden Double Hundred - Take a bow, Abdullah Shafique! 🌟 He is now the third youngest Pakistan batter to score a Test double ton after Javed Miandad and Hanif Mohammad 💯👌#CricketTwitter #SLvPAK #WTC25 #PakBall #abdullahshafique pic.twitter.com/QvRxprwC7J — CricWick (@CricWick) July 26, 2023 చదవండి: Saud Shakeel: అజేయ డబుల్ సెంచరీతో అదరగొట్టి.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలతో పాటు! Abdullah Shafique: సెంచరీతో మెరిసిన పాక్ ఓపెనర్.. భారీ ఆధిక్యం దిశగా -
చరిత్ర సృష్టించిన పాక్ బ్యాటర్.. డబుల్ సెంచరీతో..!
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో పాకిస్తాన్ మిడిలార్డర్ బ్యాటర్ సౌద్ షకీల్ చరిత్ర సృష్టించాడు. శ్రీలంకలో డబుల్ సెంచరీ (208 నాటౌట్) సాధించిన తొలి పాకిస్తాన్ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో శ్రీలంకలో అత్యధిక స్కోర్ రికార్డు మహ్మద్ హఫీజ్ (196) పేరిట ఉండేది. ఈ మ్యాచ్‌లో షకీల్.. హఫీజ్ రికార్డును తిరగరాశాడు. కెరీర్లో ఆడుతున్నది ఆరో టెస్ట్ మ్యాచే అయినా ఎంతో అనుభవజ్ఞుడిలా బ్యాటింగ్ చేసిన షకీల్.. వ్యక్తిగత రికార్డుతో పాటు టెయిలెండర్ల సహకారంతో తన జట్టుకు అతిమూల్యమైన పరుగులు సమకూర్చాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు (73/4) బరిలోకి దిగిన షకీల్.. అఘా సల్మాన్ (83), నౌమన్ అలీ (25), నసీం షా (78 బంతుల్లో 6) సాయంతో తన జట్టుకు భారీ స్కోర్ అందించాడు. షకీల్ సూపర్ డబుల్ సెంచరీతో కదం తొక్కడంతో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 461 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బౌలర్లలో రమేశ్ మెండిస్ 5 వికెట్లతో చెలరేగగా.. ప్రభాత్ జయసూర్య 3, విశ్వ ఫెర్నాండో, కసున్ రజిత తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 312 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. ధనంజయ డిసిల్వ (122) సెంచరీతో కదం తొక్కగా.. ఏంజెలో మాథ్యూస్ అర్ధసెంచరీతో (64) రాణించాడు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, నసీం షా, అబ్రార్ అహ్మద్ తలో 3 వికెట్లు, అఘా సల్మాన్ ఓ వికెట్ పడగొట్టాడు. కాగా, కెరీర్లో 11 ఇన్నింగ్స్‌ల్లో 2 సెంచరీలు, 5 అర్ధసెంచరీల సాయంతో 98.50 సగటున 788 పరుగులు చేసిన షకీల్‌పై సోషల్‌మీడియా ప్రశంసల వర్షం కురిపిస్తుంది. పాక్ అభిమానులు 27 ఏళ్ల ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌ను ఆకాశానికెత్తుతున్నారు. టెస్ట్ క్రికెట్లో సంచలనాలు సృష్టిస్తున్న డెవాన్ కాన్వే, హ్యారీ బ్రూక్‌లతో పోలుస్తున్నారు. -
బర్త్‌డేకు ఒక్కరోజు ముందు.. ఓపెనర్‌గా డబుల్ సెంచరీ
వన్డేల్లో ఎంఎస్ ధోని అత్యధిక స్కోరు ఎంత అని అడిగితే టక్కున వచ్చే సమాధానం.. శ్రీలంకపై 183* పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్. అంతకముందు పాకిస్తాన్‌పై 148 పరుగుల ఇన్నింగ్స్ ఆడినప్పటికి అంతగా పేరు రాలేదు. కానీ 183 పరుగులు ఇన్నింగ్స్ మాత్రం ధోని కెరీర్లో టర్నింగ్ పాయింట్‌గా నిలిచిందనడంలో సందేహం అవసరం లేదు. ఇక్కడి నుంచి ధోని కొట్టిన హెలికాప్టర్ షాట్లు బాగా ఫేమస్ అయ్యాయి. అయితే ధోని ఈ రెండు ఇన్నింగ్స్‌లను మిడిలార్డర్లో వచ్చి ఆడినవే. మరి ధోని ఓపెనర్‌గా డబుల్ సెంచరీ బాదాడన్న విషయం మీకు తెలుసా? అవును ఓపెనర్‌గా ధోని డబుల్ సెంచరీ బాదాడు. కానీ అంతర్జాతీయ క్రికెట్లో కాదు.. దేశవాలీ క్రికెట్లో. తన పుట్టినరోజుకు ఒక్కరోజు ముందు ధోని ఈ అద్బుత ఇన్నింగ్స్‌ను ఆడడం ఇక్కడ మరో విశేషం. జూన్ 6, 2005లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా ధోని షామ్ బజార్ క్లబ్ తరపున 50 ఓవర్ల మ్యాచ్ ఆడాడు. పి-సేన్ టోర్నమెంట్లో భాగంగా జార్జ్ టెలిగ్రాఫ్‌తో షామ్ బజార్ క్లబ్ జట్టు తలపడింది. ఆ మ్యాచ్‌కు వచ్చిన అభిమానులను ధోని నిరాశపరచలేదు. ప్రత్యర్థి జట్టు బౌలర్లను చీల్చి చెండాడుతూ కేవలం 126 బంతుల్లోనే 207 పరుగులు బాదాడు. బ్యాట్‌కు చిల్లుపడిందా అన్నట్లుగా స్టేడియాన్ని సిక్సర్ల వర్షంతో మోతెక్కించాడు. ఆరోజు ధోని ఇన్నింగ్స్‌లో 10 సిక్సర్లు ఉండడం విశేషం. ఈ విషయాన్ని టెలిగ్రాఫ్ పత్రిక మరుసటి రోజు పెద్ద హెడ్‌లైన్స్‌తో ప్రచురించింది. ఇప్పటికి ధోని డబుల్ సెంచరీకి 18 ఏళ్ల పూర్తయిన సందర్భం.. ఇవాళ ధోని బర్త్‌డే సందర్భంగా ఆ విషయాన్ని గుర్తుచేసుకుంటూ బెంగాల్ క్రికెట్ అసోసియేష్(CAB) పంచుకుంది. అయితే అంతర్జాతీయ క్రికెట్లో ధోని 2006లో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో ఓపెనర్‌గా వచ్చి 106 బంతుల్లో 96 పరుగులు చేసి ఔటయ్యాడు. కేవలం నాలుగు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. వన్డే కెరీర్లో ఓపెనర్‌గా ధోనికిదే అత్యధిక స్కోరు. ఇక ధోనికి వన్డేల్లో డబుల్ సెంచరీ లేకపోయినప్పటికి.. టెస్టుల్లో ఆ ముచ్చటను తీర్చుకున్నాడు. 2012-13లో చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ధోని ఈ ఫీట్ సాధించాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 265 బంతులాడిన ధోని 224 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో 24 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. On MS Dhoni's 42nd birthday, I found this report from 7th June 2005. It was about Dhoni hitting 207 off just 126 balls with 10 6s for Shyambazar Club against George Telegraph in the P Sen tournament at the Eden Gardens. pic.twitter.com/HbZNIHTD1o — Joy Bhattacharjya (@joybhattacharj) July 7, 2023 ఇక టీమిండియా కెప్టెన్‌గా ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఎంఎస్ ధోని ఇవాళ(జూలై 7న) 42వ పడిలోకి అడుగుపెట్టాడు. టీమిండియా క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా గుర్తింపు పొందిన ఎంఎస్ ధోని 2007లో టి20 ప్రపంచకప్, 2011లో వన్డే వరల్డ్‌కప్, 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోపీ ఇలా మూడు టైటిల్స్ గెలిచిన ఏకైక భారత కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు.అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి మూడేళ్లు కావొస్తున్నా అతని క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 16వ సీజన్ చాలు ధోని క్రేజ్ ఏంటో చెప్పడానికి. ఇక ఐపీఎల్లో సీఎస్కేను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపి అక్కడా సక్సెస్ఫుల్ కెప్టెన్ అయ్యాడు.2004లో టీమిండియాలో కీపర్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా అరంగేట్రం చేసిన ధోని.. సుమారు 15 సంవత్సరాల పాటు అంతర్జాతీయ కెరీర్లో జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. ధోని కెరీర్లో 90 టెస్టుల్లో 4876 పరుగులు, 350 వన్డేల్లో 10,773 పరుగులు, 98 టి20ల్లో 1617 పరుగులు చేశాడు. చదవండి: '30 లక్షలు సంపాదించి రాంచీలో ప్రశాంతంగా బతికేస్తా' ధోనికి వాళ్లంటే ఇష్టం! ‘ఏకైక’ క్రికెటర్‌గా ఎన్నెన్నో ఘనతలు! 42 ఆసక్తికర విషయాలు -
డబుల్ సెంచరీతో చెలరేగిన మయాంక్ అగర్వాల్
టీమిండియాకు దూరమైన మయాంక్ అగర్వాల్ రంజీ క్రికెట్లో మాత్రం దుమ్మురేపుతున్నాడు. సౌరాష్ట్రతో జరుగుతున్న సెమీఫైనల్లో ఈ కర్ణాటక కెప్టెన్ గురువారం డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. 626 నిమిషాల పాటు క్రీజులో గడిపిన మయాంక్ 429 బంతులెదుర్కొని 249 పరుగులు చేశాడు. మయాంక్ ఇన్నింగ్స్‌లో 28 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. ఫలితంగా కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌట్ కాగా అందులో మయాంక్వే 249 పరుగులు ఉండడం విశేషం. ఒక రకంగా అతనిది వన్‌మ్యాన్ షో అని చెప్పొచ్చు. ఇక శ్రీనివాస్ శరత్ 66 పరుగులతో సహకరించాడు. సౌరాష్ట్ర బౌలర్లలో చేతన్ సకారియా, కె పటేల్‌లు చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. చిరాగ్ జానీ, ప్రేరక్ మన్కడ్‌లు తలా ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన సౌరాష్ట్ర వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది. బెంగాల్ వర్సెస్ మధ్యప్రదేశ్, రంజీ రెండో సెమీఫైనల్ బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు ఆలౌటైంది. అనుస్తుప్ మజుందార్ (120 పరుగులు), సుదీప్ గరామీ(112 పరుగులు) శతకాలతో చెలరేగగా.. వికెట్ కీపర్ అభిషేక్ పోరెల్ 51 పరుగులు చేశాడు. అనంతరం మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 21 పరుగులు చేసింది. Mayank Agarwal's celebration when he completed his double hundred in Ranji trophy semi-final. pic.twitter.com/ckG0ez5ebh — CricketMAN2 (@ImTanujSingh) February 9, 2023 చదవండి: Ravindra Jadeja: పాంచ్ పటాకా.. ఆటతో పాటు తీరు కూడా కొత్తగా -
చరిత్ర సృష్టించిన తేజ్‌నరైన్ చంద్రపాల్.. తండ్రిని మించిపోయాడు..!
టెస్ట్ క్రికెట్లో వెస్టిండీస్ యువ ఓపెనర్ తేజ్‌నరైన్ చంద్రపాల్, తన తండ్రి శివ్‌నరైన్ చంద్రపాల్‌తో కలిసి ఎవరికీ సాధ్యంకాని ఓ అరుదైన ఫీట్‌ను సాధించాడు. ఈ క్రమంలో తేజ్‌నరైన్ తన తండ్రిని కూడా వెనక్కునెట్టాడు. వివరాల్లోకి వెళితే.. జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో తేజ్‌నరైన్ అజేయ డబుల్ సెంచరీ (467 బంతుల్లో 207 నాటౌట్; 16 ఫోర్లు, 3 సిక్సర్లు) సాధించి, తన జట్టును పటిష్ట స్థితిలో ఉంచాడు. The moment Tagenarine Chanderpaul complete his maiden double hundred in Test cricket - The future of West Indies cricket.pic.twitter.com/2ZRmKZ7ZUV — CricketMAN2 (@ImTanujSingh) February 6, 2023 కెరీర్లో మూడో టెస్ట్‌లోనే డబుల్ సెంచరీ సాధించిన తేజ్.. అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్ విభాగంలో తండ్రి శివ్నరైన్నే మించిపోయాడు. శివ్‌నరైన్ 164 టెస్ట్‌ల కెరీర్లో 203 నాటౌట్ అత్యధిక స్కోర్ కాగా.. తేజ్ తన మూడో టెస్ట్‌లో తండ్రి అత్యధిక స్కోర్‌ను అధిగమించి తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు. ఈ క్రమంలో తండ్రి కొడుకుల జోడీ క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కానీ ఓ యూనిక్ రికార్డును సొంతం చేసుకుంది. టెస్ట్ క్రికెట్లో డబుల్ సెంచరీలు సాధించిన తొట్టతొలి తండ్రి కొడుకుల జోడీగా శివ్-తేజ్ జోడీ రికార్డుల్లోకెక్కింది. క్రికెట్ చరిత్రలో ఏ తండ్రి కొడుకులు ఈ ఘనత సాధించలేదు. భారత్‌కు చెందిన తండ్రి కొడుకులు లాలా అమర్నాథ్-మొహిందర్ అమర్నాథ్, విజయ్ మంజ్రేకర్-సంజయ్ మంజ్రేకర్, ఇఫ్తికార్ (ఇంగ్లండ్)-మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ టెస్ట్‌ల్లో సెంచరీలు చేసినప్పటికీ తండ్రి కొడుకులు ఇద్దరూ డబుల్ సెంచరీలు మాత్రం సాధించలేకపోయారు. తేజ్‌నరైన్ కెరీర్లో 5 ఇన్నింగ్స్‌లు ఆడి హాఫ్ సెంచరీ, సెంచరీ, డబుల్ సెంచరీ సాయంతో 91.75 సగటున 367 పరుగులు చేశాడు. మరోపక్క తేజ్ తండ్రి శివ్‌నరైన్ 1994-15 మధ్యకాలంలో 164 టెస్ట్‌ల్లో 51.4 సగటున 30 సెంచరీలు, 66 హాఫ్‌సెంచరీల సాయంతో 11867 పరుగులు చేశాడు. అలాగే 268 వన్డేల్లో 11 సెంచరీలు, 59 హాఫ్‌సెంచరీల సాయంతో 8778 పరుగులు, 22 టీ20ల్లో 343 పరుగులు చేసి విండీస్ దిగ్గజ బ్యాటర్ అనిపించుకున్నాడు. ఇదిలా ఉంటే, 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం జింబాబ్వేలో పర్యటిస్తున్న విండీస్ టీమ్.. తొలి టెస్ట్‌లో 447/6 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తేజ్నరైన్తో పాటు కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ (182) సెంచరీ చేశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే.. 11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 25 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఇంకా రెండు రోజుల ఆట మాత్రమే మిగిలి ఉంది. -
సునాయాసంగా డబుల్ సెంచరీలు బాదేస్తున్న టీమిండియా ఓపెనర్లు.. గిల్ తర్వాత మరొకరు
Ranji Trophy 2022-23 KAR VS KER: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా కేరళతో జరిగిన ఎలైట్ గ్రూప్-సి మ్యాచ్‌లో కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (208; 17 ఫోర్లు, 5 సిక్సర్) డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు. మయాంక్‌కు జతగా నికిన్ జోస్ (54), శరత్ (53), శుభంగ్ హేగ్డే (50 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో కర్ణాటక 485/9 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కేరళ సచిన్ బేబీ (141) సెంచరీతో అదరగొట్టడంతో తొలి ఇన్నింగ్స్‌లో 342 పరుగులకు ఆలౌటైంది. కేరళ స్కోర్ రెండో ఇన్నింగ్స్‌లో 96/4 వద్ద ఉండగా.. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. సునాయాసంగా డబుల్ సెంచరీలు.. ఇటీవలి కాలంలో టీమిండియా ఆటగాళ్లు ఫార్మాట్లకతీతంగా డబుల్ సెంచరీలు బాదేస్తున్న విషయం విధితమే. రెండు రోజుల కిందట హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీతో (208) విధ్వంసం సృష్టించగా.. తాజాగా మరో టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (208) రంజీల్లో ఈ ఫీట్ సాధించాడు. మయాంక్ టెస్ట్‌ల్లోనూ భారత్ తరఫున డబుల్ సెంచరీ (243) చేశాడు. కాగా, ప్రస్తుత రంజీ సీజన్లో మయాంక్‌తో పాటు టీమిండియా ఆటగాళ్లు పృథ్వీ షా, కేదార్ జాదవ్, మనన్ వోహ్రా, పునిత్ బిస్త్, మహ్మద్ సైఫ్, తరువార్ కోహ్లి డబుల్ సెంచరీలతో విరుచుకుపడ్డారు. వీరిలో పృథ్వీ షా ఏకంగా ట్రిపుల్ సెంచరీ (379) చేశాడు. గతేడాది బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ బంగ్లాదేశ్‌పై 131 బంతుల్లో 24 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 210 పరుగులు చేశాడు. తాజాగా గిల్ చేసిన ద్విశతకంతో అంతర్జాతీయ వన్డేల్లో డబుల్ సెంచరీల సంఖ్య 10కి చేరింది. ఈ 10లో 7 భారత ఆటగాళ్లు చేసినవే కాగా, ఈ ఫీట్ సాధించిన వారంతా ఓపెనర్లే కావడం విశేషం. వన్డేల్లో డబుల్ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల వివరాలు.. సచిన్ టెండూల్కర్ (2010లో సౌతాఫ్రికాపై 200 నాటౌట్), వీరేంద్ర సెహ్వాగ్ (2011లో వెస్టిండీస్‌పై 219), రోహిత్ శర్మ (2013లో ఆసీస్‌పై 209), రోహిత్ శర్మ (2014లో శ్రీలంకపై 264), క్రిస్ గేల్ (2015లో జింబాబ్వేపై 215), మార్టిన్ గప్తిల్ (2015లో వెస్టిండీస్‌పై 237*), రోహిత్ శర్మ (2017లో శ్రీలంకపై 208*), ఫకర్ జమాన్ (2018లో జింబాబ్వేపై 210*), ఇషాన్ కిషన్ (2022లో బంగ్లాదేశ్‌పై 210), శుభ్‌మన్ గిల్ (2023లో న్యూజిలాండ్‌పై 208) -
ఎలా ఔటయ్యాడో చూడు.. ఇంకెప్పుడు నేర్చుకుంటాడు.. గిల్ తండ్రి అసంతృప్తి
హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో నిన్న (జనవరి 18) జరిగిన వన్డేలో టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీతో (149 బంతుల్లో 209; 19 ఫోర్లు, 9 సిక్సర్లు) విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌కు ముందు గిల్ శ్రీలంకపై మూడో వన్డేలో సెంచరీ సాధించిన అనంతరం అతని తండ్రి లఖ్విందర్ గిల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. గిల్ సహచరుడు, పంజాబ్ ఆటగాడు గురుకీరత్ సింగ్ మాన్ కథనం మేరకు.. శ్రీలంకపై గిల్ సెంచరీ సాధించాక ఔటైన విధానంపై లఖ్విందర్ అసంతృప్తి వ్యక్తం చేశాడట. లఖ్విందర్ గురుకీరత్‌తో మాట్లాడుతూ.. మంచి ఆరంభం లభించాక సెంచరీ చేశాడు, ఓకే.. డబుల్ సెంచరీ చేసే అవకాశం ఉన్నా, ఎలా ఔటయ్యాడో చూడు.. ఇలాంటి అవకాశాలు ప్రతిసారి రావు.. ఇంకెప్పుడు నేర్చుకుంటాడు అని అన్నాడట. This is what dreams are made of 💙🇮🇳🇮🇳 pic.twitter.com/rD3n4aHvfz — Shubman Gill (@ShubmanGill) January 19, 2023 లఖ్విందర్ చేసిన ఈ వ్యాఖ్యలు గిల్ కివీస్‌పై డబుల్ సెంచరీ చేశాక సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. తండ్రి మందలింపును ఛాలెంజ్‌గా తీసుకుని గిల్ డబుల్ సెంచరీ కొట్టాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి తండ్రి గైడెన్స్‌లో పెరిగే క్రికెటర్లు అద్భుతాలు సృష్టిస్తారని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ICYMI - 𝙒𝙃𝘼𝙏. 𝘼. 𝙆𝙉𝙊𝘾𝙆! 💪 💪 That celebration says it ALL 👌 👌 Follow the match 👉 https://t.co/IQq47h2W47 #TeamIndia | #INDvNZ | @ShubmanGill pic.twitter.com/OSwcj0t1sd — BCCI (@BCCI) January 18, 2023 కాగా, 2021 ఆస్ట్రేలియా పర్యటనలో (గబ్బా టెస్ట్‌లో) గిల్ 91 పరుగుల వద్ద ఔటయ్యాక కూడా లఖ్విందర్ ఇలాంటి వ్యాఖ్యలే చేశాడట. గిల్‌పై చిన్నప్పటి నుంచి ఎన్నో అంచనాలు పెట్టుకున్న లఖ్విందర్.. గిల్ అనవసర షాట్లు ఆడి వికెట్ సమర్పించుకుంటే అస్సలు ఒప్పుకునే వాడు కాదట. వన్డేల్లో జింబాబ్వేపై తన తొలి సెంచరీ చేసిన సందర్భంగా గిల్.. ఈ విషయాలు స్వయంగా వెల్లడించాడు. అంతకుమందు మ్యాచ్‌లో 33 పరుగుల వద్ద ఔటైనప్పుడు తన తండ్రి కొట్టినంత పని చేశాడు.. అందుకే ఈ సెంచరీ నా తండ్రికి అంకితం అంటూ తొలి వన్డే సెంచరీ అనంతరం పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ సందర్భంగా గిల్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే, 3 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో నిన్న జరిగిన తొలి వన్డేలో టీమిండియా అతికష్టం మీద 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమిండియా నిర్ధేశించిన 350 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. మైఖేల్ బ్రేస్‌వెల్ (78 బంతుల్లో 140; 12 ఫోర్లు, 10 సిక్సర్లు) విధ్వంకర శతకంతో గడగడలాడించినప్పటికీ, ఆఖరి ఓవర్లో అతను ఔట్ కావడంతో టీమిండియా విజయం సాధించగలిగింది. -
డబుల్ సెంచరీ కొట్టాలంటే మనోళ్లే.. పదిలో ఏడు మనవే.. మరో విశేషమేమిటంటే..?
వన్డే క్రికెట్లో సెంచరీ సాధించాలంటే ముక్కీ మూలిగి, 150, 200 బంతులను ఎదుర్కొని, ఆఖరి ఓవర్లలో ఆ మార్కును దాటే రోజులు పోయాయి. టీ20 క్రికెట్ పుణ్యమా అని వన్డే క్రికెట్లోనూ వేగం పెరగడంతో ఆటగాళ్లు తృణప్రాయంగా సెంచరీలు బాదేస్తున్నారు. ఒకప్పుడు సెంచరీ సాధించాలంటే ఓపెనర్లు లేదా వన్‌డౌన్, టూ డౌన్లలో వచ్చే ఆటగాళ్లకు మాత్రమే సాధ్యమయ్యేది. అయితే ప్రస్తుత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆరు, ఏడు స్థానాల్లో వచ్చే ఆటగాళ్లు కూడా అలవోకగా సెంచరీలు కొట్టేస్తున్నారు. ఓపెనింగ్ వచ్చే ఆటగాళ్లైతే బఠానీలు నమిలినంత ఈజీగా డబుల్ సెంచరీలు బాదేస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ శుభ్‌మన్ గిల్. ఈ భారత యువ ఓపెనర్ ఇవాళ (జనవరి 18) న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో 149 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 208 పరుగులు చేశాడు. ఇంతకు కొద్ది రోజుల ముందే (డిసెంబర్ 10, 2022) మరో భారత ఓపెనర్ ఇషాన్ కిషన్ బంగ్లాదేశ్‌పై 131 బంతుల్లో 24 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 210 పరుగులు చేశాడు. మొత్తంగా ఇప్పటివరకు వన్డేల్లో 10 డబుల్ సెంచరీలు నమోదు కాగా, అందులో భారత ఆటగాళ్లు సాధించినవి ఏడు ఉండటం విశేషం. మరో విశేషమేమిటంటే ఈ పది డబుల్ సెంచరీలు కూడా ఓపెనర్లు సాధించినవే కావడం. వన్డేల్లో తొట్ట తొలి డబుల్ సెంచరీ సాధించింది క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్. 2010 ఫిబ్రవరి 24న గ్వాలియర్‌లో సౌతాఫ్రికాపై సచిన్ 200 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆతర్వాత వీరేంద్ర సెహ్వాగ్ (2011లో వెస్టిండీస్‌పై 219), రోహిత్ శర్మ (2013లో ఆసీస్‌పై 209), రోహిత్ శర్మ (2014లో శ్రీలంకపై 264), క్రిస్ గేల్ (2015లో జింబాబ్వేపై 215), మార్టిన్ గప్తిల్ (2015లో వెస్టిండీస్‌పై 237*), రోహిత్ శర్మ (2017లో శ్రీలంకపై 208*), ఫకర్ జమాన్ (2018లో జింబాబ్వేపై 210*), ఇషాన్ కిషన్ (2022లో బంగ్లాదేశ్‌పై 210), శుభ్‌మన్ గిల్ (2023లో న్యూజిలాండ్‌పై 208) డబుల్ సెంచరీలు సాధించారు. మహిళల క్రికెట్ విషయానికొస్తే.. ఈ విభాగంలోనూ రెండు డబుల్ సెంచరీలు నమోదయ్యాయి. ఆస్ట్రేలియాకు చెందిన బెలిండా క్లార్క్ 1997లోనే డెన్మార్క్‌పై 229* పరుగులు సాధించింది. ఆ తర్వాత 2018లో న్యూజిలాండ్‌కు చెందిన అమెలియా కెర్ ఐర్లాండ్‌పై 232* పరుగులు సాధించింది. ఓవరాల్‌గా చూస్తే.. వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ సాధించింది బెలిండా క్లార్క్ కాగా, అత్యధిక డబుల్ సెంచరీలు సాధించింది రోహిత్ శర్మ (3). ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు ఇషాన్ కిషన్ (126) పేరిట ఉండగా, అత్యంత పిన్న వయసులో ఈ ఫీట్ సాధించిన ఘనత శుభ్‌మన్ గిల్ (23 ఏళ్ల 132 రోజులు) పేరిట నమోదై ఉంది. -
డబుల్ సెంచరీతో రికార్డుల మోత మోగించిన శుభ్‌మన్ గిల్
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 145 బంతులను ఎదుర్కొన్న గిల్.. 19 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 208 పరుగులు చేశాడు. అంతర్జాతీయ కెరీర్లో తొలిసారి ఈ ఫీట్ (డబుల్ సెంచరీ) సాధించిన గిల్ హ్యాట్రిక్ సిక్సర్లతో 200 మార్క్‌ను చేరుకున్నాడు. డబుల్ సెంచరీ సాధించే క్రమంలో గిల్ పలు రికార్డులను బద్దలు కొట్టాడు. అవేంటంటే.. అత్యంత పిన్న వయసులో (23 ఏళ్ల 132 రోజులు) డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు. ఇంతకుముందు ఈ రికార్డు ఇషాన్ కిషన్ (24 ఏళ్ల 145 రోజులు) పేరిట ఉండేది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో అత్యధిక స్కోర్ రికార్డు. గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ (2009లో ఆసీస్‌పై 175 పరుగులు) పేరిట ఉండేది. ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరర్ (గిల్, 208), రెండో అత్యధిక స్కోరర్ (రోహిత్, 34) మధ్య రన్స్ గ్యాప్ రికార్డు. ఈ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. హిట్‌మ్యాన్ 264 పరుగులు చేసిన మ్యాచ్‌లో రెండో అత్యధిక స్కోరర్‌గా విరాట్ కోహ్లి (66) ఉన్నాడు. వీరిద్దరి మధ్య 198 పరుగుల తేడా ఉంది. ఇవాళ్టి మ్యాచ్‌లో గిల్, రోహిత్‌ల మధ్య 174 పరుగుల తేడాతో ఉంది. రన్స్ గ్యాప్ రికార్డ్స్ జాబితాలో గిల్ది మూడో స్థానం. వన్డేల్లో న్యూజిలాండ్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోర్. గతంలో ఈ రికార్డు సచిన్ (186 నాటౌట్) పేరిట ఉండేది. వరుస వన్డే ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ, డబుల్ సెంచరీతో పాటు హ్యాట్రిక్ సిక్సర్లతో డబుల్ సెంచరీ పూర్తి చేసిన ఘనత. అతి తక్కువ వన్డేల్లో (19) 3 సెంచరీలు చేసిన ఆటగాడిగా శిఖర్ ధవన్ (17) తర్వాతి స్థానం. వన్డేల్లో అతి వేగంగా (19 మ్యాచ్‌ల్లో) 1000 పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా రికార్డు. ఈ రికార్డు పాక్ ఆటగాడు ఫకర్ జమాన్ (18) పేరిట ఉంది. భారత్ తరఫున అతి వేగంగా 1000 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు. విరాట్ కోహ్లి, శిఖర్ ధవన్ (24 మ్యాచ్‌లు) సంయుక్తంగా రెండో ప్లేస్‌లో ఉన్నారు. -
హ్యాట్రిక్ సిక్సర్లతో డబుల్ సెంచరీ పూర్తి చేసిన గిల్.. టీమిండియా భారీ స్కోర్
హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 18) జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (149 బంతుల్లో 208; 19 ఫోర్లు, 9 సిక్సర్లు) డబుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన గిల్.. వన్డేల్లో పలు రికార్డులు బద్దలు కొట్టడంతో పాటు వరుస ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ, డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. గిల్ విధ్వంసం ధాటికి భారత్ నిర్ణీత ఓవర్లలో 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (34), సూర్యకుమార్ యాదవ్ (31), హార్ధిక్ పాండ్యా (28) ఓ మోస్తరుగా రాణించగా.. విరాట్ కోహ్లి (8), ఇషాన్ కిషన్ (5), వాషింగ్టన్ సుందర్ (12), శార్దూల్ ఠాకూర్ (3) నిరాశపరిచారు. కివీస్ బౌలర్లలో హెన్రీ షిప్లే, డారిల్ మిచెల్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. ఫెర్గూసన్, టిక్నర్, సాంట్నర్, తలో వికెట్ సాధించారు. -
PAK vs NZ, 1st Test day 4: విలియమ్సన్ డబుల్ సెంచరీ
కరాచీ: పాకిస్తాన్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ (200 నాటౌట్; 21 ఫోర్లు, 1 సిక్స్) అజేయ డబుల్ సెంచరీతో కదంతొక్కాడు. దీంతో పర్యాటక జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగుల ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్ స్కోరు 440/6తో గురువారం నాలుగో రోజు ఆట కొనసాగించిన కివీస్ తొలి ఇన్నింగ్స్‌ను 194.5 ఓవర్లలో 612/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఓవర్‌నైట్ బ్యాటర్లు విలియమ్సన్, ఇష్ సోధి (65; 11 ఫోర్లు) ఏడో వికెట్‌కు 159 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇష్ అర్ధసెంచరీ సాధించాడు. తర్వాత 595 స్కోరు వద్ద ఇష్ సోధి నిష్క్రమించడంతో రెండు పరుగుల వ్యవధిలో సౌతీ (0), వాగ్నెర్ (0) వికెట్లను కోల్పోయింది. ఎజాజ్ పటేల్ (0 నాటౌట్) అండతో విలియమ్సన్ డబుల్ సెంచరీ పూర్తి చేసుకోగానే కివీస్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అబ్రార్ అహ్మద్‌కు 5 వికెట్లు దక్కాయి. తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన పాకిస్తాన్ ఆట ముగిసే సమయానికి 31 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫీక్ (17), షాన్ మసూద్ (10) నిష్క్రమించగా... ఇమామ్ (45 బ్యాటింగ్), నౌమన్ అలీ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. నేడు ఆటకు ఆఖరు రోజు కాగా... పాకిస్తాన్ ఇంకా 97 పరుగుల వెనుకంజలో ఉంది. కివీస్ బౌలర్లు చకచకా వికెట్లు తీయగలిగితే మ్యాచ్ చేతిలోకి వస్తుంది. విలియమ్సన్ కెరీర్లో ఇది ఐదో డబుల్ సెంచరీ. న్యూజిలాండ్ తరఫున అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన ప్లేయర్‌గా బ్రెండన్ మెకల్లమ్ (4) పేరిట ఉన్న రికార్డును విలియమ్సన్ బద్దలు కొట్టాడు. -
కేన్ మామ డబుల్ సెంచరీ.. కివీస్ తరపున తొలి బ్యాటర్‌గా
పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ డబుల్ సెంచరీతో మెరిశాడు. మూడోరోజు ఆటలో సెంచరీతో మెరిసిన విలియమ్సన్ తాజా డబుల్ సెంచరీతో కొన్ని రికార్డులు బద్దలు కొట్టాడు. విలియమ్సన్ ఖాతాలో టెస్టుల్లో ఇది ఐడో డబుల్ సెంచరీ. కివీస్ తరపున అత్యధిక డబుల్ సెంచరీలు బాదిన తొలి క్రికెటర్‌గా కేన్ విలియమ్సన్ చరిత్ర సృష్టించాడు. ఇంతకముందు బ్రెండన్ మెక్కల్లమ్ నాలుగు డబుల్ సెంచరీలు బాదాడు. తాజాగా కేన్ మామ ఆ రికార్డును బద్దలు కొట్టాడు. ►ఇక ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో టెస్టుల్లో ఎక్కువ డబుల్ సెంచరీలు కింగ్ కోహ్లి పేరిట ఉన్నాయి. కోహ్లి టెస్టుల్లో ఇప్పటివరకు ఏడు డబుల్ సెంచరీలు బాది తొలి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత రెండో స్థానం కేన్ విలియమ్సన్‌దే కావడం విశేషం. కేన్ మామ ఐదు డబుల్ సెంచరీలతో రెండో స్థానంలో నిలిచాడు. ►ఇక కేన్ విలియమ్సన్ ఆఖరిసారి సెంచరీ, డబుల్ సెంచరీ కొట్టింది పాకిస్తాన్‌పైనే. 2021 జనవరిలో క్రైస్ట్‌చర్చి వేదికగా పాక్‌తో జరిగిన టెస్టులో ఏకకాలంలో సెంచరీ, డబుల్ సెంచరీ సాధించాడు. అప్పుడు కేన్ విలియమ్సన్ 238 పరుగులు చేశాడు. తాజాగా రెండేళ్ల తర్వాత మళ్లీ అదే పాక్ జట్టుపై సెంచరీ చేయడంతో పాటు ఈసారి కూడా డబుల్ సెంచరీ ఫీట్ సాధించాడు. పాక్‌పై టెస్టుల్లో ఒకే మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో సెంచరీ, డబుల్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా కేన్ విలియమ్సన్ నిలిచాడు. పాక్, కివీస్‌ల తొలి టెస్టు డ్రాగా ముగిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. జీవం లేని పిచ్‌పై బ్యాటర్లు పండుగ చేసుకుంటున్నారు. తాజాగా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ రెండు వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. ఇమాముల్ హక్ 45, నుమన్ అలీ 4 పరుగులతో ఆడుతున్నారు. పాక్ ఇంకా 97 పరుగులు వెనుకబడి ఉంది. అంతకముందు న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 612 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కేన్ విలియమ్సన్(200 నాటౌట్).. ఇష్ సోదీ 65 పరుగులు చేయగా.. టామ్ లాథమ్ సెంచరీ మెరిశాడు. Fifth Test double century for Kane Williamson. A fantastic effort 💯💯#PAKvNZ | #TayyariKiwiHai pic.twitter.com/tEOiqMRYJB — Pakistan Cricket (@TheRealPCB) December 29, 2022 -
దెబ్బ అదుర్స్.. ఒక్క ఇన్నింగ్స్‌తో అన్నింటికి చెక్
గత కొన్నిరోజులుగా ఆస్ట్రేలియా క్రికెట్ మీడియాలో డేవిడ్ వార్నర్ పేరు హాట్ టాపిక్. కారణం కెప్టెన్సీ విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియాతో సున్నం పెట్టుకోవడమే. 2018లో బాల్ టాంపరింగ్ వివాదం అతని మెడకు చుట్టుకొని రెండేళ్ల నిషేధంతో పాటు ఆసీస్‌కు కెప్టెన్ కాకుండా లైఫ్‌టైమ్ బ్యాన్ విధించింది. అయితే తనపై కెప్టెన్సీ లైఫ్‌టైమ్ బ్యాన్ ఎత్తివేయాలంటూ క్రికెట్ ఆస్ట్రేలియాకు అప్పీల్ చేసుకుంటే కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. సొంత బోర్డు నుంచే కనీస మద్దతు కరువవడంతో తెగ బాధపడిపోయిన వార్నర్..'' మీ కెప్టెన్సీకో దండం.. నా అప్పీల్‌ను వెనక్కి తీసుకుంటున్నాని.. ఇకపై ఆ విషయం కూడా ఎత్తను'' అంటూ క్రికెట్ ఆస్ట్రేలియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. వార్నర్ తీరుపై స్పందించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. ''కెప్టెన్సీ కాదు ముందు మీ ఆటతీరులో దమ్ము చూపించండి.. అప్పుడు కెప్టెన్సీపై చర్చకు రండి'' అంటూ పరోక్షంగా వార్నర్‌కు సవాల్ విసిరింది. నిజానికి వార్నర్ కూడా అంత గొప్ప ఫామ్‌లో అయితే లేడనే చెప్పాలి. ఇటీవలే ముగిసిన టి20 వరల్డ్‌కప్‌లోనూ వార్నర్ పెద్దగా ప్రభావం చూపించింది లేదు. అందునా టెస్టుల్లో వార్నర్ మెరిసి చాలా కాలమైపోయింది. వార్నర్ బ్యాట్ నుంచి శతకం జాలువారి మూడేళ్లు కావొస్తుంది. దీనికి తోడు ఆటను పక్కనబెట్టి కెప్టెన్సీ అంశంపై క్రికెట్ ఆస్ట్రేలియాతో సున్నం పెట్టుకోవడం సొంత అభిమానులకు కూడా నచ్చలేదు. అన్ని వైపుల నుంచి వార్నర్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. క్రికెట్ ఆస్ట్రేలియా చేసిన కామెంట్స్‌ను వార్నర్ సీరియస్‌గా తీసుకున్నాడనిపించింది. ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో తనపై వస్తున్న విమర్శలన్నింటికి చెక్ పెట్టాడు. మెల్బోర్న్ వేదికగా దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన రెండో టెస్టు వార్నర్ కెరీర్లో వందో టెస్టు కావడం విశేషం. తన వందో టెస్టులో సెంచరీతో మెరిసి అన్నింటికి సమాధానం చెప్పాలనుకున్నాడు. అనుకున్నట్లుగానే తన పంతం నెరవేర్చుకున్నాడు డేవిడ్ వార్నర్. శతకంతో మెరవడమే సూపర్ అనుకుంటే.. ఏకంగా డబుల్ సెంచరీతో కథం తొక్కి సరికొత్త రికార్డులు నెలకొల్పాడు. దాదాపు 1089 రోజులు శతకం లేకుండా కొనసాగిన వార్నర్ ఇన్నింగ్స్‌లకు ఇది మరో టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఏ బోర్డు అయితే తనకు సవాల్ విసిరిందో అదే బోర్డుతో చప్పట్లు కొట్టించుకున్నాడు వార్నర్. ఇది అందరికి సాధ్యం కాదు. కచ్చితంగా వార్నర్ కెరీర్లో ఈ ఇన్నింగ్స్ ఎప్పటికి మధురానుభూతిగా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు. A double century for David Warner! But his #OhWhatAFeeling jump comes at a cost! 😬#AUSvSA | @Toyota_Aus pic.twitter.com/RqJLcQpWHa — cricket.com.au (@cricketcomau) December 27, 2022 చదవండి: వారీ ఎంత పని జరిగే.. గట్టిగా తాకుంటే ప్రాణం పోయేదే! -
ప్రపంచంలో ఏ బౌలర్‌కు సాధ్యం కాని ‘ఘనత’! ఆడేసుకుంటున్న నెటిజన్లు
Australia vs South Africa, 2nd Test- David Warner: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు సోషల్ మీడియా వేదికగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు మూడేళ్ల తర్వాత సెంచరీ సాధించి.. ఆపై దానిని ద్విశతకంగా మలిచిన అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరుగుతున్న రెండో టెస్టు సందర్భంగా వార్నర్ ద్విశతకం సాధించాడు. ఈ నేపథ్యంలో వార్నర్ భార్య కాండిస్ సైతం ఆనందంలో తేలిపోతోంది. భర్త ఆట తీరు పట్ల హర్షం వ్యక్తం చేసిన ఆమె.. విమర్శకులకు చురకలు అంటించింది. ఇప్పటికైనా వార్నర్‌కు దూరంగా ఉండాలని... అతడిని ఒక మాట అనాలంటే ఆలోచించుకోవాలనే ఉద్దేశంలో కామెంట్లు చేసింది. వామ్మో అన్ని వేల వికెట్లా!? ఇక డబుల్ సెంచరీ హీరో వార్నర్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతున్న వేళ.. ఆస్ట్రేలియా- దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ బ్రాడ్‌కాస్టర్ ఫాక్స్ స్పోర్ట్స్ చేసిన తప్పిదం కూడా వైరల్‌గా మారింది. వార్నర్ సుదీర్ఘ కెరీర్లో గణాంకాలు కోట్ చేస్తూ.. పరుగుల స్థానంలో వికెట్లు అని గ్రాఫిక్‌ను డిస్ప్లే చేసింది. ఇక ముందు కూడా ఎవరూ ఉండరు! ఈ మేరకు 100 టెస్టుల్లో 7922 వికెట్లు, 141 వన్డేల్లో 6007 వికెట్లు, 99 టీ20లలో 2894 వికెట్లు అని చూపించింది. ఈ విషయాన్ని పసిగట్టిన నెటిజన్లు స్క్రీన్షాట్లు తీసి.. బ్రాడ్‌కాస్టర్ తీరుపై సైటైర్లు వేస్తున్నారు. ‘‘దాదాపు 16 వేల వికెట్లు.. క్రికెట్ చరిత్రలో ఇలాంటి బౌలర్ లేడు. ఇక ముందు రాబోడు. ఈ లెక్కన ఒక్క మ్యాచ్‌లో వార్నర్ 79 వికెట్లు తీశాడా? ఇంతకంటే గొప్ప విషయం ఏమీ ఉండదు. 1400 హండ్రెడ్ వికెట్ హాల్.. సూపర్‌స్టార్ రజనీకాంత్ చిట్టి రోబోకైనా ఇది సాధ్యమవుతుందా? అంటూ ట్రోల్ చేస్తున్నారు. కాగా 200 పరుగుల మార్కును అందుకున్న తర్వాత వార్నర్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. చదవండి: Babar Azam: పాంటింగ్ రికార్డు బద్దలు కొట్టిన బాబర్ ఆజం! సెహ్వాగ్‌లా అలా! IPL 2023: అన్న త్యాగం వల్లే ఇలా కోటీశ్వరుడిగా.. నాన్నను మిస్ అవుతున్నా! వాళ్లతో కలిసి ఆడతా David Warner the greatest bowler in the history of Australian cricket. #AUSvSA pic.twitter.com/H74sMPwrFT — Dan Liebke (@LiebCricket) December 26, 2022 79 wickets/match is a lot, honestly. Easily the greatest bowler of all time. https://t.co/zCoBeFjK5N — Abhishek Mukherjee (@ovshake42) December 26, 2022 Man man man !!! What a bowler. 14 Hundred wicket haul is not a joke 🥺!!! Warner is GOATofGOATofGOAT https://t.co/emPDQqbggr pic.twitter.com/6nFpYm6IOO — Rakshit Bhagwat Kathawate (@rkathawate098) December 26, 2022 A double century for David Warner! But his #OhWhatAFeeling jump comes at a cost! 😬#AUSvSA | @Toyota_Aus pic.twitter.com/RqJLcQpWHa — cricket.com.au (@cricketcomau) December 27, 2022 -
1089 రోజుల తర్వాత ఏకంగా డబుల్ సెంచరీ.. తొలి బ్యాటర్‌గా! కానీ అంతలోనే
Australia vs South Africa, 2nd Test: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ టెస్టుల్లో మూడో డబుల్ సెంచరీ సాధించాడు. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లో ఈ మైలురాయిని అందుకున్నాడు. దాదాపు 1089 రోజుల తర్వాత శతకం బాదిన వార్నర్.. వందను డబుల్ సెంచరీగా మలచడంలో సఫలమయ్యాడు. మెల్బోర్న్ వేదికగా రెండో రోజు ఆటలో రబడ బౌలింగ్‌లో 100 పరుగుల మార్కు అందుకున్న ఈ ఓపెనర్.. లుంగి ఎంగిడి బౌలింగ్‌లో 200 రన్స్ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే పలు రికార్డులు నమోదు చేసిన వార్నర్ మరో అరుదైన ఘనత సాధించాడు. తొలి ఆసీస్ బ్యాటర్‌గా 100వ టెస్టులో ద్విశతకం బాదిన మొదటి ఆస్ట్రేలియా క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఇంతకుముందు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ గతేడాది ఫిబ్రవరిలో ఈ ఫీట్ నమోదు చేశాడు. రిటైర్డ్ హర్ట్ ఇక దాదాపుగా మూడేళ్ల తర్వాత ఈ మేరకు అద్భుత ఇన్నింగ్స్ ఆడి తనపై వస్తున్న విమర్శలకు గట్టిగా సమాధానమిచ్చిన వార్నర్.. పట్టరాని సంతోషంలో మునిగిపోయాడు. అభిమానులకు అభివాదం చేస్తూ ఎగిరి గంతేశాడు. అయితే, ఈ సందర్భంగా వార్నర్ కాలి కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. 253 బంతుల్లో 200 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద భారంగా మైదానాన్ని వీడాడు. చదవండి: Babar Azam: పాంటింగ్ రికార్డు బద్దలు కొట్టిన బాబర్ ఆజం! సెహ్వాగ్‌లా అలా! Suryakumar Yadav: సీక్రెట్ రివీల్ చేసిన సూర్యకుమార్.. వాళ్ల వల్లే ఇలా! కేకేఆర్ నుంచి మారిన తర్వాతే A double century for David Warner! But his #OhWhatAFeeling jump comes at a cost! 😬#AUSvSA | @Toyota_Aus pic.twitter.com/RqJLcQpWHa — cricket.com.au (@cricketcomau) December 27, 2022 -
సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్.. 5 రోజుల వ్యవధిలో మరోసారి విధ్వంసం
Ranji Trophy 2022-23: పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ 5 రోజుల వ్యవధిలో మరోసారి రెచ్చిపోయాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో (డిసెంబర్ 10) డబుల్ సెంచరీతో (131 బంతుల్లో 210; 24 ఫోర్లు, 10 సిక్సర్లు) విరుచుకుపడిన అతను.. రంజీ ట్రోఫీ 2022-23లో భాగంగా కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. ఆట మూడో రోజు (డిసెంబర్ 15) బరిలోకి దిగిన ఇషాన్ (జార్ఖండ్).. 195 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్లతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఎండ్‌తో అతనికి సౌరభ్ తివారీ (97) తోడవ్వడంతో జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 340 పరుగులకు ఆలౌటైంది. అంతకుముందు అక్షయ్ చంద్రన్ (150) భారీ సెంచరీతో చెలరేగడంతో కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 475 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆర్ ప్రేమ్ (79), కున్నుమ్మల్ (50), సంజూ శాంసన్ (72), సిజిమోన్ (83) అర్ధసెంచరీలతో రాణించారు. 135 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కేరళ మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 195 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. రోహన్ ప్రేమ్ (25), షౌన్ రోజర్ (28) క్రీజ్‌లో ఉన్నారు. కేరళ బౌలర్ జలజ్ సక్సేనా తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టగా.. జార్ఖండ్ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ తొలి ఇన్నింగ్స్‌లో 5, రెండో ఇన్నింగ్స్‌లో ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఆటలో మరో రోజు మాత్రమే మిగిలి ఉండటంతో ఫలితం తేలేది లేనిది అనుమానంగా మారింది. -
ఇషాన్ కిషన్ ఖాతాలో మరో రికార్డు.. క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడిగా..!
Ishan Kishan Double Hundred: పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. నిన్న (డిసెంబర్ 10) బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేల్లో సుడిగాలి ద్విశతకంతో (131 బంతుల్లో 210; 24 ఫోర్లు, 1 సిక్సర్లు) విరుచుకుపడి, పలు ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన ఈ జార్ఖండ్ ఆటగాడు.. వన్డే క్రికెట్ చరిత్రలో ఏ ఆటగాడి పేరిట లేని ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డేల్లో ఒక్క సెంచరీ కూడా లేకుండా డైరెక్ట్‌గా డబుల్ సెంచరీ క్లబ్లో చేరిన తొలి ఆటగాడిగా ఇషాన్ కిషన్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. కెరీర్లో తొమ్మిదో ఇన్నింగ్స్‌లోనే డబుల్ సాధించిన ఇషాన్.. ఈ ఘనత సాధించిన అతి పిన్నవయస్కుడిగా (24 ఏళ్ల 145 రోజులు), ఫాస్టెస్ట్ డబుల్ సెంచూరియన్‌గా (126 బంతులు) పలు రికార్డులు బద్దలు కొట్టాడు. ఇషాన్.. డబుల్ సెంచరీని 9వ ఇన్నింగ్స్‌లోనే సాధించగా, ఈ ఘనత సాధించేందుకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు 431 ఇన్నింగ్స్‌లు, టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌కు 234 ఇన్నింగ్స్‌లు, త్రీ టైమ్ డబుల్ సెంచూరియన్ రోహిత్ శర్మకు 103 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో టీమిండియా 227 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ, కోహ్లి (113) సెంచరీతో కదం తొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది. అనంతరం 410 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా జట్టు.. టీమిండియా బౌలర్ల దాటికి 182 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో షకీబ్ అల్ హసన్ (43) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, ఉమ్రాన్ మాలిక్ చెరో రెండు వికెట్లు.. కుల్దీప్, సుందర్, సిరాజ్ తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించినప్పటికి, సిరీస్ మాత్రం గెలవలేకపోయింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన భారత్.. ఆఖరి మ్యాచ్‌లో గెలిచి ఆధిక్యాన్ని 2-1కు తగ్గించగలిగింది. ఇరు జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు డిసెంబర్ 14 నుంచి మొదలుకానుంది. -
ఇషాన్ కిషన్ గర్ల్‌ఫ్రెండ్ పోస్ట్ వైరల్! ఇంతకీ ఆమె ఎవరంటే!
Bangladesh vs India, 3rd ODI- Ishan Kishan: జార్ఖండ్ యంగ్ డైనమైట్, టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్‌పై ప్రశంసల వర్షం కొనసాగుతోంది. కెరీర్లో తొలి సెంచరీనే డబుల్ సెంచరీగా మలిచి ప్రపంచ రికార్డు సృష్టించిన ఈ యువ వికెట్ కీపర్ అభిమానుల నీరాజనాలు అందుకుంటున్నాడు. దీంతో ఇషాన్ పేరుతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. అద్భుతమైన ఇన్నింగ్స్... నిన్ను ఎంత ప్రశంసించినా తక్కువే అంటూ టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ కొనియాడగా.. టీమిండియాకు కావాల్సింది ఇలాంటి ఆటగాడే కదా అని వీరేంద్ర సెహ్వాగ్ మెచ్చుకున్నాడు. ఇక స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. ఇషూ నిన్ను చూస్తే గర్వంగా ఉందంటూ ట్వీట్ చేశాడు. ఇషూ ఇన్నింగ్స్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన మరో స్టార్, రన్‌మెషీన్ విరాట్ కోహ్లి సైతం సూపర్ ఇన్నింగ్స్ అంటూ ప్రశంసించాడు. ఇదిలా ఉంటే.. ఇషాన్ కిషన్‌కు ఓ స్పెషల్ పర్సన్ నుంచి అందిన విషెస్ నెట్టింట చర్చకు దారితీశాయి. ఆమె ఎవరా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఎవరీ అదితి?! ఆమె పేరు అదితి హుండియా. ఇషాన్ జీవితంలో ముఖ్యమైన వ్యక్తి, అతడి గర్ల్‌ఫ్రెండ్‌గా ప్రచారంలో ఉంది. మిస్ ఇండియా ఫైనలిస్టు అయిన అదితి.. మోడల్‌గా కెరీర్‌ను కొనసాగిస్తోంది. ఈ ఇద్దరు పలుమార్లు జంటగా కెమెరాలకు చిక్కారు. దీంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ కథనాలు పుట్టుకొచ్చాయి. అయితే, ఇషాన్ గానీ, అదితి గానీ తమ బంధం గురించి ఎలాంటి ప్రకటనా చేయలేదు. తాజాగా బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలో ఇషాన్ ద్విశతకం బాదడంతో అదితి అతడిపై ప్రశంసలు కురిపిస్తూ చేసిన పోస్టు వైరల్‌గా మారింది. ఇషాన్‌ను ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో పంచుకున్న అదితి.. రెడ్ హార్ట్ ఎమోజీతో ప్రేమను చాటుకుంది. అతడి స్పెషల్ ఇన్నింగ్స్‌కు సంబంధించి బీసీసీఐ చేసిన పోస్టును కూడా రీషేర్ చేసింది. దీంతో ఇషాన్- అదితి పేర్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బంగ్లాదేశ్‌తో మూడో వన్డే ఇషాన్ కిషన్ రికార్డులు... ►వన్డే క్రికెట్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ (126 బంతులు; పాత రికార్డు క్రిస్ గేల్ (138 బంతులు; 2015లో జింబాబ్వేపై) ►చిన్న వయసులో ద్విశతకం (24 ఏళ్ల 145 రోజులు; పాత రికార్డు రోహిత్ శర్మ (26 ఏళ్ల 186 రోజలు; 2013లో ఆస్ట్రేలియాపై), భారత్ తరఫున అతి తక్కువ (103) బంతుల్లో 150 పరుగుల మార్క్ (పాత రికార్డు సెహ్వాగ్ 112 బంతుల్లో; 2011లో వెస్టిండీస్‌పై) ►ఇక వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ఏడో క్రికెటర్ ఇషాన్ కిషన్. ఇంతకు ముందు రోహిత్ శర్మ మూడు సార్లు ద్విశతకం బాదగా.. సచిన్, సెహ్వాగ్, క్రిస్ గేల్, మార్టిన్ గప్టిల్, ఫఖర్ జమాన్ ఈ ఘనత సాధించారు. చదవండి: IND vs BAN: ఒక్కడి చేతిలో బంగ్లా ఓడింది.. 28 పరుగులు తక్కువ! అదే జరిగితే AUS vs WI: 77 పరుగులకే కుప్పకూలిన విండీస్.. 419 పరుగుల తేడాతో ఆసీస్ ఘన విజయం -
Ishan Kishan: 'ఔట్ కాకపోయుంటే ట్రిపుల్ సెంచరీ బాదేవాడిని'
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో కదం తొక్కిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్.. 131 బంతుల్లోనే ఏకంగా 210 పరుగులు చేసి భారత్ భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. డబుల్ సెంచరీ చేసే క్రమంలో ఇషాన్.. 24 బౌండరీలు, 10 సిక్సర్లు బాదాడు. ఇక విరాట్ కోహ్లీతో కలిసి రెండో వికెట్‌కు 290 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. 85 బంతుల్లో సెంచరీ చేసిన ఇషాన్.. 126 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించాడు. తద్వారా భారత దిగ్గజ బ్యాటర్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మల సరసన నిలిచాడు. టీమిండియా ఇన్నింగ్స్ అనంతరం ఇషాన్ కిషన్ ఇంటర్య్వూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''పిచ్ బ్యాటింగ్ కు సహకరిస్తున్నది. నేను బ్యాటింగ్ కు వెళ్లగానే అనుకున్నది ఒక్కటే. బంతి బాదడానికి అనువుగా ఉంటే బాదేయడమే. అందులో మరో ఆలోచనే లేదు. ఈ మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేయడం ద్వారా నా పేరు దిగ్గజాల సరసన ఉండటం నన్ను నేనే నమ్మలేకపోతున్నా. నేను ఇన్నింగ్స్ మొత్తం బ్యాటింగ్ చేసి ఉంటే ట్రిపుల్ సెంచరీ కూడా సాధించేవాడినేమో. విరాట్ భయ్యాతో బ్యాటింగ్ చేయడం బాగుంటుంది. నేను 90లలో ఉన్నప్పుడు దూకుడుగా ఆడుతుంటే నా దగ్గరికి వచ్చి ముందు సింగిల్స్ తీయమని చెప్పాడు. నేను దానినే ఫాలో అయ్యాను. వాస్తవానికి నేను సిక్సర్ తో సెంచరీ చేద్దామనుకున్నా. సూర్య భాయ్ (సూర్యకుమార్ యాదవ్)తో కూడా చాట్ చేశాను. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నేను ఒత్తిడి తీసుకోదలుచుకోలేదు. నాకొచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నా'' అని పేర్కొన్నాడు. -
చేతులు కాలాకా ఆకులు పట్టుకోవడం అంటే ఇదే!
బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చిన టీమిండియా మూడు వన్డేల సిరీస్‌ను 2-0తేడాతో ఆతిథ్య జట్టుకు కోల్పోయింది. బంగ్లాదేశ్ గడ్డపై టీమిండియా వన్డే సిరీస్ ఓడిపోవడం ఇది వరుసగా రెండోసారి. ఇక చేతులు కాలాకా ఆకులు పట్టుకున్నట్లుగా తయారైంది టీమిండియా పరిస్థితి. వన్డే సిరీస్ కోల్పోయాకా టీమిండియాకు జ్ఞానోదయం అయినట్లుంది. వరుసగా విఫలమవుతున్నప్పటికి ధావన్‌కు అవకాశాలిస్తూనే వచ్చారు తప్ప ఇషాన్ కిషన్‌ను కనీసం పరిగణలోకి తీసుకోలేదు. దీంతో ఇషాన్‌కు తొలి రెండు వన్డేల్లో అసలు అవకాశమే దక్కలేదు. అయితే రోహిత్ గాయం ఇషాన్ కిషన్‌కు కలిసి వచ్చింది. హిట్‌మ్యాన్ గాయంతో మూడో వన్డేకు దూరం కావడంతో అతని స్థానంలో ఇషాన్ తుది జట్టులోకి వచ్చాడు. తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్న ఇషాన్ వచ్చీ రావడంతోనే డబుల్ సెంచరీ సాధించి ఔరా అనిపించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ మార్క్ అందుకున్న తొలి క్రికెటర్‌గా ఇషాన్ కొత్త రికార్డు నెలకొల్పాడు. ఒకవేళ ఇషాన్ కిషన్‌ను తొలి రెండు వన్డేల్లో ఆడించి ఉంటే పరిస్థితి కచ్చితంగా వేరుగా ఉండేదని అభిమానులు అభిప్రాయపడ్డారు. ఇక మూడో వన్డేలో డబుల్ సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్ ఓవరాల్‌గా 131 బంతుల్లో 210 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 24 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. ఇక వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన నాలుగో భారత క్రికెటర్‌గా కిషన్ రికార్డులకెక్కాడు. అంతకుముందు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ ఈ ఘనతను సాధించారు. ఇక ఓవరాల్‌గా ఈ రికార్డు సాధించిన జాబితాలో కిషాన్ ఏడో స్థానంలో నిలిచాడు. చదవండి: చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా -
ఇషాన్ కిషన్ విధ్వంసం.. డబుల్ సెంచరీతో చెలరేగిన జార్ఖండ్ డైన్‌మేట్
బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలో టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ అద్భుతమైన డబుల్ సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ స్థానంలో బరిలోకి దిగిన కిషన్.. బంగ్లాదేశ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో 131 బంతులు ఎదుర్కొన్న కిషన్ 23 ఫోర్లు, 10 సిక్స్‌లతో 210 పరుగులు చేశాడు. కాగా కిషన్ తన డబుల్ సెంచరీని కేవలం 126 బంతుల్లోనే పూర్తి చేశాడు. కిషన్ తన కెరీర్లో తొలి సెంచరీనే ద్విశతకంగా మలుచుకున్నాడు. ఇక వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన నాలుగో భారత క్రికెటర్‌గా కిషన్ రికార్డులకెక్కాడు. అంతకుముందు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ ఈ ఘనతను సాధించారు. ఇక ఓవరాల్‌గా ఈ రికార్డు సాధించిన జాబితాలో కిషాన్ ఏడో స్థానంలో నిలిచాడు. చదవండి: IND vs BAN: బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్.. 12 ఏళ్ల తర్వాత భారత బౌలర్ రీ ఎంట్రీ! -
Vijay Hazare Trophy: సమర్థ్ 200
న్యూఢిల్లీ: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో ఆదివారం అద్భుతం చోటు చేసుకుంది. ఇక్కడి జామియా మిలియా యూనివర్సిటీ మైదానంలో మణిపూర్‌తో జరిగిన ఎలైట్ గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో సౌరాష్ట్ర జట్టు పరుగుల వరద పారించింది. ఏకంగా 282 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. ఓపెనర్ సమర్థ్ వ్యాస్ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. 131 బంతులు ఆడిన సమర్థ్ 20 ఫోర్లు, 9 సిక్స్‌లతో సరిగ్గా 200 పరుగులు సాధించి అవుటయ్యాడు. మరో ఓపెనర్ హార్విక్ దేశాయ్ (107 బంతుల్లో 100; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 36.3 ఓవర్లలో 282 పరుగులు జోడించడం విశేషం. సమర్థ్, హార్విక్ మెరుపు ఇన్నింగ్స్‌తో తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 397 పరుగులు సాధించింది. 398 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మణిపూర్‌ను సౌరాష్ట్ర ఎడంచేతి వాటం స్పిన్నర్ ధర్మేంద్రసింగ్ జడేజా తిప్పేశాడు. 32 ఏళ్ల ధర్మేంద్రసింగ్ 10 ఓవర్లు వేసి కేవలం 10 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. దాంతో మణిపూర్ 41.4 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. -
టీ20 మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేసిన కరేబియన్ ఆటగాడు
-
వెస్టిండీస్ ఆల్ రౌండర్ తుపాన్ ఇన్నింగ్స్.. టీ20ల్లో డబుల్ సెంచరీ
వెస్టిండీస్ ఆల్ రౌండర్ రఖీమ్ కార్న్‌వాల్ టీ20 క్రికెట్లో డబుల్ సాధించాడు. అట్లాంటా ఓపెన్-2022లో అట్లాంటా ఫైర్ జట్టుకు కార్న్‌వాల్ ప్రాతినిద్యం వహిస్తున్నాడు. ఈ లీగ్‌లో భాగంగా బుధవారం స్క్వేర్ డ్రైవ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కార్న్‌వాల్ 77 బంతుల్లో 205 పరుగులో ఆజేయంగా నిలిచాడు. అతడి తుపాన్ ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, 22 సిక్స్‌లు ఉన్నాయి. కార్న్‌వాల్ సునామీ ఇన్నింగ్స్ ఫలితంగా అట్లాంటా జట్టు 20 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 326 పరుగులు చేసింది. ఇక కార్న్‌వాల్ డబుల్ సెంచరీ విషయాన్ని ప్రఖ్యాత గణాంకవేత్త మోహన్‌దాస్ మీనన్ ట్విటర్ వేదికగా తెలిపారు. "వెస్టిండీస్ ఆల్‌రౌండర్ రఖీమ్ కార్న్‌వాల్ అట్లాంటా ఓపెన్-2022లో అట్లాంటా ఫైర్ తరపున ఆడుతున్నాడు. West Indian Rahkeem Cornwall, while playing for Atlanta Fire, blasted an unbeaten 205 in just 77 balls (SR 266.23) that included 22 sixes and 17 fours in an American T20 competition known as the Atlanta Open. A prize money of $75,000 is available to the winning team. — Mohandas Menon (@mohanstatsman) October 6, 2022 అతడు స్క్వేర్ డ్రైవ్ జట్టుపై కేవలం 77 బంతుల్లో 22 సిక్స్‌లు, 17 ఫోర్లతో 205 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ టోర్నీలో విజేత జట్టుకు 75 వేల డాలర్ల ప్రైజ్ మనీ అందిస్తారని" మీనన్ పేర్కొన్నాడు. అదే విధంగా అతడి హిట్టింగ్‌కు సంబంధించిన వీడియోను మైనర్ లీగ్ క్రికెట్ కూడా ట్విటర్లో షేర్ చేసింది. కాగా ఇటీవల ముగిసిన కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో కూడా కార్న్‌వాల్ విధ్వంసం సృష్టించాడు. View this post on Instagram A post shared by Atlanta Fire Cricket (@atlantafirecricket) ARE YOU NOT ENTERTAINED?! Rahkeem Cornwall put Atlanta Fire on top with a DOUBLE century going 205*(77) with 2️⃣2️⃣ MASSIVE sixes 🤯🤯🤯 pic.twitter.com/1iRfyniiUw — Minor League Cricket (@MiLCricket) October 6, 2022 View this post on Instagram A post shared by Atlanta Fire Cricket (@atlantafirecricket) చదవండి: Womens Asia Cup 2022: పాకిస్తాన్‌కు భారీ షాకిచ్చిన థాయ్‌లాండ్.. క్రికెట్ చరిత్రలో తొలి విజయం -
దుమ్మురేపిన జైస్వాల్.. తొలి మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీ!
దులీప్ ట్రోఫీ అరంగేట్ర మ్యాచ్‌లోనే ముంబై యువ ఆటగాడు, వెస్ట్ జోన్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ అదరగొట్టాడు. నార్త్ ఈస్ట్ జోన్‌తో జరుగుతోన్న తొలి క్వార్టర్ ఫైనల్లో యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 321 బంతులు ఎదర్కొన్న జైస్వాల్.. 18 ఫోర్లు, 6 సిక్సర్లతో 228 పరుగులు సాధించాడు. జైస్వాల్‌ను అభినందిస్తూ.. రాజస్తాన్ రాయల్స్ ట్వీట్ చేసింది. ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్‌కు జైస్వాల్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో అతడితో పాటు టీమిండియా వెటరన్ ఆటగాడు, వెస్ట్ జోన్ కెప్టెన్ ఆజింక్యా రహానే కూడా ద్విశతకం సాధించాడు. 228 on his #DuleepTrophy debut. 👌💗 Jaiswal was bemisaal. 💥 pic.twitter.com/4wzmtJ0VP5 — Rajasthan Royals (@rajasthanroyals) September 9, 2022 ఈ మ్యాచ్‌లో 207 పరుగులు చేసి రహానే ఆజేయంగా నిలిచాడు. మరో వైపు ఓపెనర్ పృథ్వీ షా(113) సెంచరీతో చెలరేగాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో వెస్ట్ జోన్ రెండు వికెట్లు కోల్పోయి 590 పరుగుల భారీ స్కోర్ సాధించింది. https://t.co/OQ75iKb2f4 — Rockstar MK 🇮🇳 (@RockstarMK11) September 9, 2022 చదవండి: Duleep Trophy 2022: డబుల్ సెంచరీతో చెలరేగిన అజింక్య రహానే... -
డబుల్ సెంచరీతో చెలరేగిన అజింక్య రహానే...
చెన్నై: భారత టెస్టు జట్టులో కోల్పోయిన స్థానాన్ని మళ్లీ సాధించాలని పట్టుదలగా ఉన్న అజింక్య రహానే దేశవాళీ సీజన్‌ను ఘనంగా ప్రారంభించాడు. నార్త్ ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో వెస్ట్‌జోన్ బ్యాటర్ రహానే (264 బంతుల్లో 207 బ్యాటింగ్; 18 ఫోర్లు, 6 సిక్స్‌లు) డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. అతనికి తోడు యశస్వి జైస్వాల్ (321 బంతుల్లో 228; 22 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా ద్విశతకం బాదడం విశేషం. ఫలితంగా రెండో రోజు ఆట ముగిసే సరికి వెస్ట్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 590 పరుగులు చేసింది. ఓపెనర్ పృథ్వీ షా (121 బంతుల్లో 113; 11 ఫోర్లు, 5 సిక్స్‌లు) కూడా శతకం సాధించాడు. బలమైన వెస్ట్‌జోన్ బ్యాటింగ్ లైనప్ ముందు అనామక జట్టుగా నార్త్ ఈస్ట్ తేలిపోయింది. చదవండి: Asia Cup 2022: పాక్‌కు షాకిచ్చిన శ్రీలంక.. 5 వికెట్ల తేడాతో ఘన విజయం -
Ind Vs WI: సరిగ్గా ఇదే రోజు.. విండీస్ గడ్డ మీద కోహ్లి అరుదైన రికార్డు.. కానీ ఇప్పుడు!
ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్ పర్యటనలో ఉంది. మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు అక్కడికి వెళ్లింది. ఆతిథ్య జట్టుతో శుక్రవారం(జూలై 22) వన్డే సిరీస్ ఆరంభించనుంది. కాగా, ఇటీవల తరచుగా విఫలమవుతున్న భారత మాజీ సారథి, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి విండీస్ టూర్‌కు దూరమయ్యాడు. ఫామ్‌లేమి కారణంగా విమర్శలు ఎదుర్కొంటున్న అతడు ప్రస్తుతం సెలవులో ఉన్నాడు. అయితే, ఆరేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు విండీస్ గడ్డ మీద కోహ్లి అరుదైన రికార్డు సాధించాడు. విదేశీ గడ్డ మీద టెస్టుల్లో ద్విశతకం సాధించిన తొలి భారత కెప్టెన్‌గా నిలిచి తన సత్తా ఏమిటో నిరూపించుకున్నాడు. ఆనాడు.. సరిగ్గా ఇదే రోజు.. 2016లో కోహ్లి సేన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు వెస్టిండీస్‌కు వెళ్లింది. ఈ క్రమంలో ఆంటిగ్వా వేదికగా సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం వేదికగా.. జూలై 21న ఇరు జట్ల మధ్య మొదటి టెస్టు ఆరంభమైంది. భారత్ ఇన్నింగ్స్ ఆరంభించిన మురళీ విజయ్(7) పూర్తిగా నిరాశ పరచగా మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 84 పరుగులతో రాణించాడు. ఇక నయావాల్ ఛతేశ్వర్ పుజారా 67 బంతులు ఎదుర్కొని 16 పరుగులకే పెవిలియన్ చేరాడు. PC: BCCI కోహ్లి డబుల్ సెంచరీ.. అశ్విన్ విశ్వరూపం ఈ క్రమంలో రెండో రోజు ఆట(జూలై 22)లో భాగంగా కెప్టెన్ విరాట్ కోహ్లి డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 283 బంతులు ఎదుర్కొన్న అతడు 24 ఫోర్ల సాయంతో 200 పరుగులు చేశాడు. తద్వారా విదేశాల్లో టెస్టు ఫార్మాట్లో ద్విశతకం చేసిన టీమిండియా కెప్టెన్‌గా అరుదైన ఘనత సాధించాడు. ఇక కోహ్లి అద్బుత ఇన్నింగ్స్‌కు తోడు రవిచంద్రన్ అశ్విన్ 113 పరుగులు చేయగా.. అమిత్ మిశ్రా 53 పరుగులతో రాణించాడు. దీంతో భారత్ 8 వికెట్ల నష్టానికి 566 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఆ తర్వాత విండీస్ 243 పరుగులకే మొదటి ఇన్నింగ్స్ ముగించగా.. టీమిండియా ఫాలో ఆడించింది. ఈ క్రమంలో జేసన్ హోల్డర్ సారథ్యంలోని ఆతిథ్య వెస్టిండీస్ టీమిండియా చేతిలో 92 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. PC: Virat Kohli Twitter సెంచరీతో పాటు.. 7 వికెట్లు కూల్చి విండీస్ పతనం శాసించిన అశ్విన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక ఈ సిరీస్‌ను కోహ్లి సేన 2-0తేడాతో సొంతం చేసుకుంది. మొదటి, మూడో టెస్టులు టీమిండియా గెలవగా.. రెండు, నాలుగు మ్యాచ్‌లను విండీస్ డ్రా చేసుకుంది. కాగా నాడు కెప్టెన్‌గా అరుదైన ఘనత సాధించిన కోహ్లి.. నేడు జట్టులో స్థానం కోల్పోవడంపై అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత కోహ్లిని మళ్లీ చూడాలని ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. Time flies 🇮🇳#20June #TestDebut pic.twitter.com/eIktcGLg6i — Virat Kohli (@imVkohli) June 20, 2022 చదవండి: Ind Vs WI 1st ODI: రుతురాజ్‌కు నో ఛాన్స్! ధావన్‌తో ఓపెనర్‌గా అతడే! ఇక ఫినిషర్‌గా ఎవరంటే.. 'West Indies is a great opportunity for the youngsters to get exposure and play, says #TeamIndia ODI Captain @SDhawan25 ahead of #WIvIND series. pic.twitter.com/PBelvII28c — BCCI (@BCCI) July 21, 2022 -
పుజారా డబుల్ సెంచరీ.. 118 ఏళ్లలో తొలి ఆటగాడిగా
టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజరా కౌంటీ క్రికెట్లో అదరగొడుతున్నాడు. ససెక్స్‌కు స్టాండింగ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పుజారా డబుల్ సెంచరీ సాధించాడు. మిడిలెసెక్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పుజారా ఈ ఫీట్ అందుకున్నాడు. 368 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో డబుల్ సెంచరీ మార్క్ అందుకున్న పుజారాకు ససెక్స్ తరపున ఈ ఏడాది ఇది మూడో డబుల్ సెంచరీ కావడం విశేషం. ఈ నేపథ్యంలోనే పుజారా ఒక అరుదైన రికార్డును బద్దలు కొట్టాడు. 118 ఏళ్లలో సింగిల్ కౌంటీ డివిజన్లో ససెక్స్ తరపున మూడు డబుల్ సెంచరీలు బాదిన తొలి ఆటగాడిగా పుజారా రికార్డులకెక్కాడు. ఈ ఏడాది ససెక్స్ తరపున డెర్బీషైర్‌తో మ్యాచ్‌లో తొలి డబుల్ సెంచరీ మార్క్ అందుకున్న పుజారా.. ఆ తర్వాత డుర్హమ్‌తో మ్యాచ్‌లో మరో డబుల్ సెంచరీ బాదాడు. తాజాగా మిడిలెసెక్స్‌తో మ్యాచ్‌లో ముచ్చటగా మూడో డబుల్ శతకం సాధించాడు. ఇక కౌంటీల్లో మిడిల్సెక్స్ ప్రత్యర్థిగా అత్యధిక స్కోరు సాధించిన భారత ఆటగాళ్లలో పుజారా(231 పరుగులు, ససెక్స్) తొలి స్థానంలో నిలిచాడు. పుజారా తర్వాత వీరేంద్ర సెహ్వాగ్(130 పరుగులు, లీస్టర్‌షైర్), రవిశాస్త్రి(127 పరుగులు, గ్లామ్), అబ్దుల్ ఖాదీర్(112 పరుగులు, వార్విక్షైర్), పియూష్ చావ్లా( 112 పరుగులు, సోమర్సెట్) ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే పుజారా 231 పరుగులు చేసి ఔట్ కాగానే ససెక్స్ ఇన్నింగ్స్ 523 పరుగుల వద్ద ముగిసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన మిడిలెసెక్స్ వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. టీమిండియా టెస్టు స్పెషలిస్ట్‌గా ముద్రపడిన పుజారా దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో విఫలం కావడంతో జట్టులో చోటు కోల్పోయాడు. దీంతో పుజారా కౌంటీలు ఆడేందుకు వెళ్లి ససెక్స్ తరపున సెంచరీలు, డబుల్ సెంచరీలతో చెలరేగాడు. ఇంతకముందు మిడిలెసెక్స్‌తో జరిగిన ఒక మ్యాచ్‌లో 170 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన పుజారాకు ఇటీవలే ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టుకు టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైనప్పటికి పుజారా రెండో ఇన్నింగ్స్‌లో అర్థశతకం సాధించి తన ఫామ్‌ను కంటిన్యూ చేశాడు. A batting masterclass at Lord's. 🌟 Superb, @cheteshwar1. 👏 2⃣0⃣0⃣ pic.twitter.com/IQ0e3G25WD — Sussex Cricket (@SussexCCC) July 20, 2022 చదవండి: కౌంటీల్లో వాషింగ్టన్ సుందర్ అదిరిపోయే అరంగేట్రం -
SL Vs Aus: చండిమాల్ డబుల్ సెంచరీ.. ప్రశంసల జల్లు! ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు!
ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్ దినేశ్ చండిమాల్ అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. కెరీర్లో తొలిసారిగా ద్విశతకం నమోదు చేశాడు. శ్రీలంక మొదటి ఇన్నింగ్స్‌లో భాగంగా చండిమాల్ 206 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మొత్తంగా 326 బంతులు ఎదుర్కొన్న అతడు 16 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాగా టెస్టుల్లో చండిమాల్‌కు ఇది మొదటి ద్విశతకం. సిక్సర్‌తో ఈ ఫీట్ నమోదు చేయడం గమనార్హం. అదే విధంగా ఆస్ట్రేలియాపై అత్యధిక స్కోరు నమోదు చేసిన శ్రీలంక ఆటగాడిగా అతడు నిలిచాడు. ఇక చండిమాల్ అద్భుత ఇన్నింగ్స్ నేపథ్యంలో ఆతిథ్య శ్రీలంక 554 పరుగుల భారీ స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. ఈ నేపథ్యంలో చండిమాల్‌పై సోషల్ మీడియా ప్రశంసల జల్లు కురుస్తోంది. టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘నిన్న రాత్రి సూర్యకుమార్ యాదవ్.. ఈరోజు చండిమాల్.. వేర్వేరు ఫార్మాట్లు.. వేర్వేరు శైలి.. కానీ ఎంతో ఆసక్తిగా మ్యాచ్‌ను తిలకించేలా అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు’’ అంటూ ఇండియా- ఇంగ్లండ్ మూడో టీ20, ఆసీస్-లంక టెస్టు మ్యాచ్‌ను ఉద్దేశించి కామెంట్ చేశాడు. ఇతర ఆటగాళ్లు, నెటిజన్లు సైతం చండిమాల్‌ను ప్రశంసిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. కాగా మూడు టీ20లు, 5 వన్డేలు, రెండు టెస్టులు ఆడే నిమిత్తం ఆస్ట్రేలియా ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తోంది. టీ20 సిరీస్ పర్యాటక ఆసీస్ సొంతం కాగా.. వన్డే సిరీస్‌ను ఆతిథ్య లంక కైవసం చేసుకుంది. ఇక మొదటి టెస్టులో ఆసీస్ 10 వికెట్ల తేడాతో గెలుపొందగా.. రెండో మ్యాచ్‌లో లంక గట్టిపోటీనిస్తోంది. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా నాలుగో రోజు ఆటలో లంక బౌలర్ ప్రభాత్ జయసూర్య బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆసీస్ 151 పరుగులకే ఆలౌట్ అయింది. శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా రెండో టెస్టు: టాస్: ఆస్ట్రేలియా- బ్యాటింగ్ ఆసీస్ తొలి ఇన్నింగ్స్: 364-10 (110 ఓవర్లు) శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 554-10 (181 ఓవర్లు) ఆసీస్ రెండో ఇన్నింగ్స్: ఆసీస్ రెండో ఇన్నింగ్స్: 151-10 (41 ఓవర్లు) చదవండి: Surya Kumar Yadav: ప్రపంచ రికార్డు సృష్టించిన సూర్యకుమార్ యాదవ్! మాక్సీ రికార్డు బద్దలు.. మరెన్నో! Rohit Sharma- Virat Kohli: కోహ్లికి అండగా నిలిచిన రోహిత్ శర్మ.. అతడు చేసింది కరెక్టే! అయినా కపిల్ దేవ్... Dinesh Chandimal has torn strips off the Aussie attack, scoring an unbeaten 206* - bringing up his double century with two huge sixes, one of which ended up on the streets of Galle 🇱🇰🏏 LATEST 👉 https://t.co/pOShHsRakQ pic.twitter.com/AuBg6KpuIR — Telegraph Sport (@telegraph_sport) July 11, 2022 Dinesh Chandimal Completed his 200 with a Sixxxx #SLvAUS 🇱🇰#Dineshchandimal #lka #SLC #LKA pic.twitter.com/QXZHncw1fX — Talk True With ME (@TalkTrueWithME) July 11, 2022 -
రహానే స్థానంలో అరంగేట్రం.. డబుల్ సెంచరీతో కొత్త చరిత్ర
రంజీ క్రికెట్ అంటే దేశవాలీలో ఎనలేని క్రేజ్. ఎందుకంటే టీమిండియాలోకి రావాలంటే ఏ ఆటగాడైనా తన ఆటేంటో రంజీల్లో రుచి చూపించాల్సిందే. ఇప్పుడంటే ఐపీఎల్ లాంటి లీగ్స్ వల్ల యువ క్రికెటర్లు ఎందరో వస్తున్నారు కానీ.. ఒకప్పుడు రంజీ ట్రోపీయే ఎందరో ఆటగాళ్లను వెలుగులోకి తెచ్చింది. తాజాగా రంజీ ట్రోపీలో భాగంగా ముంబై, ఉత్తరాఖండ్ మధ్య రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబైకి ఆరంభంలో ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు పృథ్వీ షా(21), యశస్వి జైశ్వాల్(35)లు తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. అప్పుడు క్రీజులోకి వచ్చాడు సువేద్ పార్కర్.. పేరు కొత్తగా వింటున్నప్పటికి రహానే స్థానంలో ముంబై తరపున రంజీ ట్రోపీలో అరంగేట్రం చేశాడు. గాయంతో దూరమైన రహానే విలువ తెలియకుండా బ్యాటింగ్ కొనసాగించిన సువేద్ పార్కర్ డెబ్యూ మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. దురదృష్టవశాత్తూ రనౌట్ అయిన సువేద్ పార్కర్.. తాను ఔటయ్యే వరకు నిలకడైన ఆటతీరుతో అదరగొట్టాడు. 447 బంతుల్లో 21 ఫోర్లు, 4 సిక్సర్లతో 252 పరుగులు చేశాడు. రంజీల్లో ముంబై తరపున అరంగేట్రం మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా సువేద్ పార్కర్ చరిత్ర సృష్టించాడు. ఇంతకముందు ముంబై ప్రస్తుత కోచ్ అమోల్ మజుందార్ మాత్రమే ఈ ఘనత సాధించాడు. ముంబై తరపున 1993-94 రంజీ సీజన్లో హర్యానాతో జరిగిన మ్యాచ్‌లో 260 పరుగులు సాధించి చరిత్ర సృష్టించాడు. తాజాగా ఆ రికార్డును సువేద్ పార్కర్ బ్రేక్ చేశాడు. ఇక సువేద్ పార్కర్ దాటికి ముంబై తొలి ఇన్నింగ్స్‌ను వికెట్ల నష్టానికి 647 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. సువేద్తో పాటు సర్ఫరాజ్ ఖాన్ 153, ఆర్మాన్ జాఫర్ 60 పరుగులతో రాణించారు. చివర్లో షామ్స్ ములాని 59 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక గాయంతో రహానే రంజీ ట్రోపీకి దూరమైన సంగతి తెలిసిందే. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో మూడు, నాలుగు వారాలు రహానే రెస్ట్ అవసరం ఉంది. ప్రస్తుతం బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీలో రీహాబిలిటేషన్‌లో ఉన్నాడు. ఇక సువేద్ పార్కర్ 2001 ఏప్రిల్ 6న ముంబైలో జన్మించాడు. చదవండి: Sarfaraz Khan: అదరగొట్టిన సర్ఫరాజ్.. ట్రిపుల్ సెంచరీ, 2 డబుల్ సెంచరీలు, 3 సెంచరీలు! -
డబుల్ చేజార్చుకున్న లంక క్రికెటర్.. టెస్ట్ క్రికెట్లో అరుదైన రికార్డు
ఐపీఎల్ 2022 సీజన్ రంజుగా సాగుతున్న వేళ టెస్ట్ క్రికెట్లో ఓ అరుదైన రికార్డు నమోదైంది. బంగ్లాదేశ్-శ్రీలంక జట్ల మధ్య చట్టోగ్రామ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో శ్రీలంక వెటరన్ ఆల్‌రౌండర్ ఏంజలో మాథ్యూస్ ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ చేసే సువర్ణావకాశాన్ని కోల్పోయాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. 153 ఓవర్లలో 397 పరుగులకు ఆలౌటైంది. కుశాల్ మెండిస్ (54), దినేశ్ చండీమాల్ (66) అర్ధ సెంచరీలతో రాణించగా.. ఏంజలో మాథ్యూస్ చెలరేగిపోయాడు. ఈ ఇన్నింగ్స్‌లో 397 బంతులను ఎదుర్కొన్న మాథ్యూస్.. 19 ఫోర్లు, సిక్సర్ సాయంతో 199 పరుగులు చేసి ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. నయీమ్ బౌలింగ్‌లో అనవసర షాట్ ఆడిన మాథ్యూస్ తృటిలో కెరీర్లో రెండో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. తద్వారా టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్న 12వ ఆటగాడిగా, మూడో లంక క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 1984లో పాక్ ఆటగాడు ముదస్సర్ నాజర్ భారత్‌పై, 1986లో మహ్మద్ అజహారుద్దీన్ శ్రీలంకపై, 1997లో మాథ్యూ ఇలియట్ (ఆసీస్) ఇంగ్లండ్‌పై, అదే ఏడాది సనత్ జయసూర్య భారత్‌పై, 1999లో స్టీవ్ వా వెస్టిండీస్‌పై, 2006లో యూనిస్ ఖాన్ భారత్‌పై, 2008లో ఇయాన్ బెల్ సౌతాఫ్రికాపై, 2015లో స్టీవ్ స్మిత్ వెస్టిండీస్‌పై, 2016లో కేఎల్ రాహుల్ ఇంగ్లండ్‌పై, 2017లో డీన్ ఎల్గర్ బంగ్లాదేశ్‌పై, 2020లో డెప్లెసిస్ శ్రీలంకపై డబుల్ చేసే అవకాశాన్ని పరుగు తేడాతో కోల్పోయారు. అంతకుముందు మాథ్యూస్ 2009లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 99 పరుగుల వద్ద ఔటయ్యాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో సెంచరీ, డబుల్ సెంచరీని పరుగు తేడాతో మిస్ ఏకైక క్రికెటర్‌గా మాథ్యూస్ రికార్డు సాధించాడు. కాగా, శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ వికెట్ నష్టపోకుండా 76 పరుగులు చేసింది. హసన్ రాయ్ (31), తమీమ్ ఇక్బాల్ (35) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 397 పరుగులకు ఆలౌటైంది. నయీమ్ 6 వికెట్లతో సత్తా చాటగా, వెటరన్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ 3 వికెట్లు పడగొట్టాడు. చదవండి: ఐపీఎల్ ఎఫెక్ట్.. ఇంగ్లండ్ పర్యటనకు రహానే దూరం -
చతేశ్వర్ పుజారా అజేయ డబుల్ సెంచరీ
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో భాగంగా సస్సెక్స్ జట్టు తరఫున ఆడిన తొలి మ్యాచ్‌లోనే భారత ప్లేయర్ చతేశ్వర్ పుజారా అదరగొట్టాడు. డెర్బీషైర్‌తో ‘డ్రా’గా ముగిసిన ఈ మ్యాచ్‌లో పుజారా (201 నాటౌట్; 23 ఫోర్లు), టామ్ హైన్స్ (243; 22 ఫోర్లు) డబుల్ సెంచరీలు సాధించారు. దాంతో ఫాలోఆన్ ఆడుతూ ఓవర్‌నైట్ స్కోరు 278/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సస్సెక్స్ జట్టు 176.1 ఓవర్లలో 3 వికెట్లకు 513 పరుగులు చేసి మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. -
యశ్ ధుల్ వీర విజృంభణ.. డబుల్ సెంచరీతో చెలరేగిన ఢిల్లీ డైనమైట్
Yash Dhull Scores Double Century: అండర్-19 ప్రపంచకప్ 2022లో యువ భారత్‌ను జగజ్జేతగా నిలిపిన యశ్ ధుల్.. అరంగేట్రం రంజీ సీజన్లోనే అదరగొడుతున్నాడు. ఆరంగ్రేటం మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ(113, 113 నాటౌట్) సెంచరీ బాది చరిత్ర సృష్టించిన ధుల్.. తాజాగా ఛత్తీస్‌ఘడ్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయమైన డబుల్ సెంచరీ (200; 26 ఫోర్లు)తో సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఛత్తీస్‌ఘడ్ అమన్‌దీప్ కారే (156 నాటౌట్), శశాంక్ సింగ్ (122) శతకాలతో రాణించడంతో 482/9 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన ఢిల్లీ 295 పరుగులకే ఆలౌటై ఫాలోఆన్ ఆడింది. ఈ క్రమంలో యశ్ ధుల్, దృవ్ షోరే (100; 13 ఫోర్లు), నితీశ్ రాణా (57 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభించడంతో ఢిల్లీ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 396 పరుగులు చేసి, మ్యాచ్‌ను డ్రా చేసుకోగలిగింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ధుల్ 29 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ప్రస్తుత రంజీ సీజన్లో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడిన ధుల్ 479 పరుగులు చేశాడు. ఇందులో డబుల్ సెంచరీ, రెండు సెంచరీలు ఉన్నాయి. చదవండి: శతకం చేజార్చుకున్న ఉస్మాన్ ఖ్వాజా.. పాక్‌కు ధీటుగా బదులిస్తున్న ఆసీస్ -
డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు
కింగ్స్టన్ వేదికగా బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. టెస్టుల్లో అతడికి ఇది రెండో డబుల్ సెంచరీ కావడం విశేషం. 373 బంతులు ఎదర్కొన్న లాథమ్ 34 ఫోర్లు, 2 సిక్స్‌లతో 252 పరుగులు సాధించాడు. ఇక న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 521-6 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. లాథమ్‌తో పాటు కాన్వే కూడా సెంచరీతో రాణించడంతో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేయగల్గింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో టామ్ లాథమ్(252), కాన్వే (109), బ్లండల్(57) పరుగులతో టాప్ స్కోరర్లు గా నిలిచారు. బంగ్లాదేశ్ బౌలర్లలో టాస్కిన్ అహ్మద్ 4 వికెట్లు పడగొట్టగా, షారిఫుల్ ఇస్లాం ఒక వికెట్ సాధించాడు. ఇక తొలి టెస్టులో ఎదురైన పరాభవానికి విజయంతో ప్రతీకారం తీర్చుకోవాలని న్యూజిలాండ్ భావిస్తోంది. చదవండి: IND Vs SA 3rd Test: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్ -
Suryakumar Yadav: సూర్య డబుల్ సెంచరీ.. 152 బంతుల్లో 249 పరుగులు!
టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ డబుల్ సెంచరీతో మెరిశాడు. 152 బంతుల్లో 249 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇందులో 37 ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. పోలీస్ ఇన్విటేషన్ షీల్డ్ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో భాగంగా ఈ ఫీట్ నమోదు చేశాడు. ఈ టోర్నమెంట్లో పార్సీ జింఖానా క్లబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు ఈ ముంబై బ్యాటర్. ఈ క్రమంలో పయ్యాడే ఎస్సీ జట్టుతో జరిగిన ఫైనల్లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఈ మేరకు పరుగులు రాబట్టాడు. ఈ నేపథ్యంలో సూర్య మాట్లాడుతూ... ‘‘గ్రౌండ్ చిన్నదిగా ఉంది. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాను. సహచర ఆటగాళ్లు వచ్చి అభినందిస్తుంటే.. అప్పుడు డబుల్ సెంచరీ పూర్తైందని అర్థమైంది. వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టాలని అనుకున్నాను. అదే జరిగింది’’ అని హర్షం వ్యక్తం చేశాడు. కాగా ఇటీవల న్యూజిలాండ్‌తో స్వదేశంలో ముగిసిన టీ20 సిరీస్‌లో భాగంగా జైపూర్ మ్యాచ్‌లో అదరగొట్టిన సూర్య.. ఆ తర్వాత పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. విజయ్ హజారే ట్రోఫీ టోర్నీలోనూ స్థాయికి తగ్గట్లుగా రాణించలేకపోయాడు. అయితే, ప్రస్తుత ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నానన్న సూర్య... ఎక్కువసేపు క్రీజులో ఉండటం, షాట్లు ఆడటం వల్ల మంచి ప్రాక్టీసు లభించిందన్నాడు. కాగా ఫైనల్లో భాగంగా 24 నుంచి 26 వరకు జింఖానా- పయ్యాడే జట్ల మధ్య ఫైనల్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: SA Vs IND: "ఫామ్‌లో లేడని కోహ్లిని తప్పిస్తారా.. రహానే విషయంలో మాత్రం ఎందుకు అలా" -
ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. ఆస్ట్రేలియా క్రికెటర్ సరికొత్త రికార్డు
Travis Head hits fastest-ever List A double- century: లిస్ట్-ఏ క్రికెట్లో ఆస్ట్రేలియా ఆటగాడు ట్రెవీస్ హెడ్ తన పేరిట సరికొత్త రికార్డును లిఖించుకున్నాడు. ఆస్ట్రేలియా డొమాస్టిక్ వన్డే కప్‌లో భాగంగా క్వీన్స్‌లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం 114 బంతుల్లో హెడ్.. డబుల్ సెంచరీ సాధించాడు. దీంతో లిస్ట్-ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 127 బంతుల్లో 28 ఫోర్లు, 8 సిక్స్‌లతో 230 పరుగులు సాధించాడు. లిస్ట్- ఏ క్రికెట్లో రెండు సార్లు డబుల్ సెంచరీ సాధించిన మూడో ఆటగాడిగా హెడ్ మరో ఘనత సాధించాడు. కాగా ఆస్ట్రేలియా లిస్ట్- ఏ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రెండో ఆటగాడిగా హెడ్ రికార్డులకెక్కాడు. మార్ష్ కప్‌లో 257 పరుగులు చేసిన డీ ఆర్సీ షార్ట్ అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా ఉన్నాడు. అయితే వన్డే క్రికెట్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్‌గా రోహిత్ శర్మ ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వర్షం కారణంగా 48 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆస్ట్రేలియా 392 పరగుల భారీ లక్ష్యాన్ని క్వీన్స్లాండ్ ముందట ఉంచింది. 392 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన క్వీన్స్లాండ్ 40 ఓవర్లలో 312 పరుగులకే ఆలౌటైంది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 67 పరుగుల తేడాతో సౌత్ ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇక హెడ్ ఆస్ట్రేలియా తరుపున 2018లో చివరిసారిగా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడాడు. చదవండి: IPL 2022 Mega Auction: రైనా సహా ఆ ముగ్గురి ఖేల్ ఖతమైనట్టే..! https://t.co/NaQmQhq7fs — varun seggari (@SeggariVarun) October 13, 2021 -
టీ20 క్రికెట్ చరిత్రలో తొలి డబుల్ సెంచరీ
న్యూఢిల్లీ: టీ 20 క్రికెట్ చరిత్రలో తొలి డబుల్ సెంచరీ నమోదైంది. 79 బంతుల్లో 205 పరుగులు చేసిన ఢిల్లీ క్రికెటర్ సుబోధ్ భాటి సరి కొత్త చరిత్ర సృష్టించాడు. 20 ఓవర్ల ఫార్మాట్లో అత్యధిక పరుగులు సాధించిన తొలి భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. దేశ రాజధానిలో ఆదివారం జరిగిన ఓ క్లబ్ మ్యాచ్‌లో ఢిల్లీ ఎలెవన్ జట్టు తరఫున బరిలోకి దిగిన సుబోధ్ భాటి.. ప్రత్యర్థి సింబా జట్టుపై ఈ ఘనత సాధించాడు. ఓపెనర్ వచ్చిన సుబోధ్ అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు,17 సిక్సర్లు ఉండడం గమనార్హం. తొలి 100 పరుగులను ఈ రంజీ ఆటగాడు కేవలం 17 బంతుల్లో సాధించడం విశేషం. దీంతో ఢిల్లీ ఎలెవన్ జట్టు 20 ఓవర్లలో రెండు వికెట్లకు 256 పరుగులు చేసింది. సుబోధ్ భాటితో పాటు సచిన్ భాటి 33 బంతుల్లో 25 పరుగులు చేయగా, కెప్టెన్ వికాస్ భాటి ఆరు పరుగులు చేశాడు. అంతకు ముందు టీ 20 క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన రికార్డు క్రిస్‌గేల్ పేరున ఉంది. యునివర్సల్ బాస్ 2013 ఐపిఎల్‌లో పూణే వారియర్స్ పైన 66 బంతుల్లో 175 సాధించాడు. తరువాత ట్రై-సిరీస్‌లో జింబాబ్వేపై ఆరోన్ ఫించ్ 76 బంతుల్లో 172 పరుగులు చేసి తర్వాత స్థానంలో ఉన్నాడు. ఇక సుబోధ్ భాటి కెరీర్ విషయానికొస్తే 24 లిస్ట్-ఎ, 39 టీ 20 మ్యాచ్‌ల్లో ఢిల్లీకు ప్రాతినిధ్యం వహించాడు. -
టెస్ట్ క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు..
లండన్: న్యూజిలాండ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ డెవాన్ కాన్వే అరంగేట్రం ఇన్నింగ్స్‌తోనే ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్శించాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో తన అరంగేట్రం ఇన్నింగ్స్‌లోనే డబుల్ సెంచరీ సాధించి, టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఈ అరుదైన ఘనత సాధించిన ఆరో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గతంలో టిప్ ఫోస్టర్(287), జాక్ రుడాల్ఫ్(222*), లారెన్స్ రోవ్(214), మాథ్యూ సింక్లెయిర్(214), బ్రెండన్ కురుప్పు(201*)లు టెస్ట్ డెబ్యూలో డబుల్ కొట్టారు. మాథ్యూ సింక్లెయిర్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో కివీస్ ఆటగాడిగా కాన్వే రికార్డు నెలకొల్పాడు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో కాన్వే మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ డెబ్యూలో బౌండరీతో సెంచరీని, సిక్సర్‌తో ద్విశతకాన్ని సాధించిన తొలి ఆటగాడిగా చరిత్రపుటల్లోకెక్కాడు. అంతకుముందు తొలి రోజు ఆటలో లార్డ్స్ మైదానంలో గంగూలీ 25 ఏళ్ల కిందట నెలకొల్పిన రికార్డును బద్దలుకొట్టిన కాన్వే.. తాజాగా డబుల్ సాధించి అరుదైన క్రికెటర్ల క్లబ్‌లోకి చేరాడు. కాగా, ఈ మ్యాచ్‌లో కాన్వే(347 బంతుల్లో 200; 22 ఫోర్లు, సిక్స్) ఒక్కడే ద్విశతకంతో పోరాడటంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకు ఆలౌటైంది. అతనికి హెన్నీ నికోల్స్(61), నీల్ వాగ్నర్(25 నాటౌట్) సహకరించడంతో కివీస్ గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో అరంగేట్రం బౌలర్ రాబిన్సన్ 4 వికెట్లు పడగొట్టగా, మార్క్ వుడ్ 3, అండర్సన్ 2 వికెట్లు పడగొట్టారు. చదవండి: కోహ్లీతో నన్ను పోల్చకండి.. అతని స్టైల్ వేరు, నా స్టైల్ వేరు -
అఫ్ఘనిస్తాన్ తరఫున తొలి టెస్టు క్రికెటర్‌గా
అబుదాబి: హష్మతుల్లా షాహిది అఫ్ఘనిస్తాన్ క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. జింబాబ్వేతో జరుగుతోన్న రెండో టెస్టులో అజేయ డబుల్ సెంచరీ (443 బంతుల్లో 200 నాటౌట్; 21 ఫోర్లు, 1 సిక్స్) సాధించడం ద్వారా అఫ్ఘనిస్తాన్ తరఫున టెస్టుల్లో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా అవతరించాడు. అతడితో పాటు కెపె్టన్ అస్గర్ అఫ్గాన్ కూడా శతకం (257 బంతుల్లో 164; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు) బాదడంతో... ఓవర్‌నైట్ స్కోరు 307/3తో రెండో రోజు ఆట కొనసాగించిన అఫ్ఘనిస్తాన్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 4 వికెట్లకు 545 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. హష్మతుల్లా, అస్గర్ నాలుగో వికెట్‌కు 307 పరుగులు జోడించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే గురువారం ఆట ముగిసే సమయానికి తమ తొలి ఇన్నింగ్స్‌లో 17 ఓవర్లలో వికెట్‌నష్టపోకుండా 50 పరుగులు చేసింది. చదవండి: పొలార్డ్ క్షమాపణలు చెప్పాడు.. తొలి వన్డేలో వెస్టిండీస్ విజయం నార్త్‌సౌండ్: వికెట్ కీపర్ షై హోప్ సెంచరీ (133 బంతు ల్లో 110; 12 ఫోర్లు, 1 సిక్స్)కి ఎవిన్ లూయిస్ బాధ్యతాయుత బ్యాటింగ్ (65) తోడవ్వడంతో శ్రీలంకతో ఆరంభమైన వన్డే సిరీస్‌లో వెస్టిండీస్ శుభారంభం చేసింది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధ రాత్రి దాటాక ముగిసిన తొలి వన్డేలో విండీస్ జట్టు 8 వికెట్లతో శ్రీలంకపై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది. దనుష్క గుణతిలక (55), దిముత్ కరుణరత్నే (52), ఆషెన్ బండార (50) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 47 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 236 పరుగులు చేసి గెలిచింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షై హోప్, లూయిస్ తొలి వికెట్‌కు 143 పరుగులు జోడించి విండీస్‌కు శుభారం భం అందించారు. చివర్లో డారెన్ బ్రావో (37 నాటౌట్) రాణించడంతో విండీస్‌కు విజయం దక్కింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండో వన్డే నేడు జరుగుతుంది. చదవండి: 2025లోనా.. ఇంకెవరు నేనే ఉంటా: జడేజా -
డబుల్ సెంచరీ.. ఆపై మ్యాచ్‌ను గెలిపించాడు
చట్టోగ్రామ్: టెస్టు క్రికెట్ చరిత్రలో మరో చిరస్మరణీయ ఘట్టం ఆవిష్కృతమైంది. బంగ్లాదేశ్‌తో చట్టోగ్రామ్ లో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. బంగ్లాదేశ్ విధించిన 395 పరుగుల విజయలక్ష్యాన్ని విండీస్ 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కాగా విండీస్ గెలుపులో మొత్తం క్రెడిట్ కైల్ మేయర్స్దే అని చెప్పాలి. అరంగేట్రం మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీతో అదరగొట్టడమేగాక ఒంటిచేత్తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. మొత్తం 310 బంతులు ఎదుర్కొన్న మేయర్స్ 201 పరుగులు చేయగా.. అతని ఇన్నింగ్స్‌లో 20 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో విండీస్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. కాగా మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించిన కైల్ మేయర్స్ పలు అరుదైన రికార్డులు సాధించాడు. ►అరంగేట్రం మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీ సాధించిన 6వ ఆటగాడిగా.. రెండో విండీస్ ఆటగాడిగా రికార్డు. ► ఇంతకముందు గ్రీనిడ్జ్ అరంగేట్రం టెస్టులో డబుల్ సెంచరీ చేసిన తొలి విండీస్ ఆటగాడు. ►టెస్టు మ్యాచ్‌లో నాలుగో ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ సాధించిన వారిలో 6వ స్థానం. ► అరంగేట్రంలోనే అత్యధిక స్కోరు సాధించిన జాబితాలో 5వ స్థానం. చేజింగ్ రికార్డులు: ►విండీస్ చేధించిన 395 పరుగుల విజయలక్ష్యం అత్యధిక చేదనల్లో ఆరో స్థానంలో నిలిచింది. ►395 పరుగులు లక్ష్యాన్ని చేధించిన విండీస్ .. ఆసియా గడ్డపై అత్యధిక చేదనల్లో తొలి స్థానం. చదవండి: ఏంటి పంత్.. ఈసారి కూడా అలాగేనా! భారత్‌కు ఫాలోఆన్ గండం తప్పేనా! -
డబుల్ సెంచరీ.. రూట్ రికార్డుల మోత
చెన్నై: భీకర ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ టీమిండియాతో చెన్నైలో జరుగుతున్న తొలి టెస్టులో డబుల్ సెంచరీ చేశాడు. రూట్ (377 బంతుల్లో 218; 19 ఫోర్లు, 2 సిక్సర్లు) గ్రేట్ ఇన్నింగ్స్‌తో పర్యాటక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి ఇప్పటికి 481 స్కోరుతో ఉంది. ప్రస్తుతం రెండో రోజు మూడో సెషన్ కొనసాగుతుండగా.. జోస్ బట్లర్ (5), డొమినిక్ బెస్ (1) క్రీజులో ఉన్నారు. సిబ్లీ 87, బెన్ స్టోక్స్ 82 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, అశ్విన్, నదీం తలో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. పిచ్ నుంచి సహకారం లేకపోవడంతో వికెట్లు కూల్చేందుకు టీమిండియా బౌలర్లు చెమటోడ్చక తప్పడం లేదు.(చదవండి: India Vs England 2021: వరుస ఓవర్లలో 2 వికెట్లు) రికార్డుల రూట్.. 2021లో రూట్ ఆడిన మూడు టెస్టుల్లో రెండు డబుల్ సెంచరీలు చేశాడు. శ్రీలంక పర్యటనలో రూట్ చలవతో ఇంగ్లండ్ రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. 100వ టెస్టు ఆడుతున్న ఈ ఇంగ్లిష్ బ్యాట్స్‌మన్‌కు ఇది ఐదో డబుల్ సెంచరీ. 100 వ టెస్టులో అత్యధిక పరుగులు చేసిన ఇంజామామ్ ఉల్ హక్ 184 పరుగుల రికార్డను రూట్ తిరగరాశాడు. శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల్లో వరుసగా.. 228, 184 పరుగులు చేశాడు. చెన్నై టెస్టులో డబుల్ సెంచరీ సాధించి.. ఆసియా ఖండంలో వరసగా మూడు సెంచరీలు చేసిన క్రికెటర్‌గా రికార్డు. 100 టెస్టులో 100 బాదిన 9వ బ్యాట్స్‌మన్ రూట్. ఇక ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ తన తొలి టెస్టును (నాగ్‌పూర్–2012), 50వ టెస్టును (విశాఖపట్నం–2016), 100వ టెస్టును (చెన్నై–2021) భారత్‌పై భారత్‌లోనే ఆడటం విశేషం. -
వీరు విధ్వంసానికి తొమ్మిదేళ్లు
ముంబై : వీరేంద్ర సెహ్వాగ్ అంటేనే విధ్వంసానికి పెట్టింది పేరు. బరిలోకి దిగాడంటే చాలు.. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే. ఫామ్‌లో ఉంటే అతన్ని ఆపడం ఎవరి తరం కాదు. ఆరంభం నుంచే సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడుతూ బౌలర్లను మానసికంగా దెబ్బతీసేవాడు. కాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అప్పటికే డబుల్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. డబుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా సచిన్ రికార్డులకెక్కాడు. అప్పటికే వన్డేల్లో ఎన్నో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడిన సెహ్వాగ్ డబుల్ సెంచరీపై కన్నేశాడు. (చదవండి : 'తన కెరీర్‌ను తానే నాశనం చేసుకున్నాడు') ఆరోజు రానే వచ్చింది. డిసెంబర్ 8, 2011.. ఇండోర్ వేదికగా వెస్టిండీస్‌తో నాలుగో వన్డే.. అప్పటికే టీమిండియా ఐదు వన్డేల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఏంచుకుంది. సచిన్ ఈ టోర్నీకి దూరంగా ఉండడంతో గంభీర్‌తో కలిసి సెహ్వాగ్ ఇన్నింగ్స్ ఆరంభించాడు. సెహ్వాగ్ విధ్వంసం సృష్టించబోతున్నాడని పాపం విండీస్ ఊహించి ఉండదు. మ్యాచ్ తొలి 5 ఓవర్లు నెమ్మదిగా సాగిన టీమిండియా బ్యాటింగ్ ఆ తర్వాత ఒక్కసారిగా మారిపోయింది. ఏ బౌలర్‌ను వదలని సెహ్వాగ్ ఊచకోత కోశాడు. కొడితే బౌండరీ .. లేదంటే సిక్సర్ అనేంతలా వీరు విధ్వంసం కొనసాగింది. కేవలం 149 బంతుల్లోనే 219 పరుగులు చేసిన సెహ్వాగ్ తన తొలి డబుల్ సెంచరీ.. వన్డే చరిత్రలో రెండో డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. సెహ్వాగ్ ఇన్నింగ్స్‌లో 25 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. అప్పటివరకు సచిన్ పేరిట ఉన్న 200 పరుగులు అత్యధిక స్కోరును తన పేరిట లిఖించుకున్నాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ సెహ్వాగ్ రికార్డును బ్రేక్ చేయడమే కాకుండా వన్డేలో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అలా భారత్ నుంచి ముగ్గురు క్రికెటర్లు డబుల్ సెంచరీ ఫీట్‌ను సాధించడం మరో విశేషంగా చెప్పవచ్చు. కాగా సెహ్వాగ్ వన్డేల్లోనే కాదు.. టెస్టుల్లోనూ రెండు ట్రిపుల్ సెంచరీలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అలా వన్డేల్లో, టెస్టుల్లో ఈ అరుదైన ఫీట్‌ను సాధించిన వారిలో సెహ్వాగ్ తర్వాత గేల్ మాత్రమే ఉన్నాడు. (చదవండి : మీరే కాదు.. నేనూ మిస్సవుతున్నా : కోహ్లి) -
ఒడిదొడుకుల మధ్య డబుల్ సెంచరీ
కొత్త డెరివేటివ్ సిరీస్ తొలి రోజు దేశీ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ లాభాల డబుల్ సెంచరీ సాధించింది. 207 పాయింట్లు పెరిగి 39,957కు చేరగా.. నిఫ్టీ 60 పాయింట్లు పుంజుకుని 11,731 వద్ద ట్రేడవుతోంది. క్యూ3(జులై- సెప్టెంబర్)లో ఆర్థిక వ్యవస్థ 33 శాతం పురోగమించడంతో గురువారం యూఎస్ మార్కెట్లు 0.5-1.5 శాతం మధ్య ఎగశాయి. అయితే ఆసియాలో అధిక శాతం మార్కెట్లు నీరసంగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో తొలుత 39,636 వరకూ వెనకడుగు వేసిన సెన్సెక్స్ తదుపరి 39,980 వరకూ జంప్‌చేసింది. మీడియా, రియల్టీ జోరు ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడగా.. మీడియా, రియల్టీ, మెటల్, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్స్ 1.6-1 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో అదానీ పోర్ట్స్, ఇండస్ఇండ్, కోల్ ఇండియా, విప్రో, హిందాల్కో, టాటా మోటార్స్, ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ లైఫ్ 2.4-1.3 శాతం మధ్య ఎగశాయి. అయితే పవర్‌గ్రిడ్, ఐషర్, మారుతీ, కొటక్ బ్యాంక్, హెచ్‌యూఎల్, ఐసీఐసీఐ, బజాజ్ ఫైనాన్స్ 1-0.3 శాతం మధ్య డీలాపడ్డాయి. ఐడియా అప్ డెరివేటివ్స్‌లో ఐడియా, ఆర్ఈసీ, టీవీఎస్ మోటార్, గోద్రెజ్ ప్రాపర్టీస్, అమరరాజా, నౌకరీ, జీ, హెచ్‌పీసీఎల్, పీఎఫ్సీ 5-2.2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క టాటా కెమికల్స్, ఇండిగో, ఐసీఐసీఐ లంబార్డ్, గోద్రెజ్ సీపీ, బీవోబీ, బంధన్ బ్యాంక్ 3.2-0.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిఢ్, స్మాల్ క్యాప్స్ 1-0.7 శాతం మధ్య పెరిగాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,177 లాభపడగా.. కేవలం 404 నష్టాలతో ట్రేడవుతున్నాయి. -
26 ఫోర్లతో డబుల్ సెంచరీ
బెంగళూరు: టీమిండియా వాల్, దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ వారసుడు సమిత్ ద్రవిడ్ తండ్రిదగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. రెండు నెలల వ్యవధిలో రెండో డబుల్ సెంచరీ సాధించి సత్తా చాటాడు. తన స్కూల్ మాల్యా అదితి ఇంటర్నేషనల్(ఎంఏఐ) తరపున బరిలోకి బ్యాట్ ఝళిపించాడు. బీటీఆర్ షీల్డ్ అండర్-14 గ్రూప్ వన్ డివిజన్ 2 టోర్నమెంట్లో ద్విశతకంతో జూనియర్ ద్రవిడ్ చెలరేగాడు. కేవలం 144 బంతుల్లోనే 26 ఫోర్లు, సిక్సర్‌తో 211 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. సమిత్ విజృంభణతో ఎంఏఐ టీమ్ 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 386 పరుగులు భారీ స్కోరు చేసింది. ఎంఏఐతో పోటీ పడిన బీజీఎస్ నేషనల్ పబ్లిక్ స్కూల్ జట్టు వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసి 132 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. క్రికెట్లో సత్తా చాటడం సమిత్ ద్రవిడ్ కొత్త కాదు. అండర్-14 ఇంటర్ జోనల్ టోర్నమెంట్లో భాగంగా గతేడాది డిసెంబర్ 20న జరిగిన మ్యాచ్‌లో వైస్ ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టు తరపున బరిలోకి సమిత్ డబుల్ సెంచరీ(201)తో మోత మోగించాడు. అండర్-12 విభాగంలో 2015లో జరిగిన టోర్నమెంట్లో మూడు అర్ధసెంచరీలు బాదడంతో సమిత్ పతాక శీర్షికలకు ఎక్కాడు. అప్పటి నుంచి స్థిరంగా రాణిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకుంటున్నాడు. (చదవండి: సచిన్‌ను గంగూలీ వదలట్లేదుగా!) -
మొన్న ట్రిపుల్ సెంచరీ.. మళ్లీ డబుల్ సెంచరీ
ధర్మశాల: రంజీ ట్రోఫీలో ముంబై బ్యాట్స్‌మన్ సర్ఫరాజ్ ఖాన్ జోరు కొనసాగుతోంది. వారం రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించిన సర్ఫరాజ్ ఖాన్.. తాజాగా హిమాచల్‌ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించాడు. సోమవారం ప్రారంభమైన మ్యాచ్‌లో తొలి రోజు మూడో సెషన్లో సర్ఫరాజ్ డబుల్ సెంచరీ నమోదు చేశాడు. ఆది నుంచి హిమాచల్ ప్రదేశ్ బౌలర్లపై విరుచుకుపడ్డ సర్పరాజ్ వందకుపైగా స్టైక్‌రేట్‌తో డబుల్ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం ద్విశతకతంతో అజేయంగా నిలిచి మరో ట్రిపుల్ సెంచరీ దిశగా సాగుతున్నాడు.(ఇక్కడ చదవండి: సర్ఫరాజ్ ట్రిపుల్ సెంచరీ) 213 బంతుల్లో 32 ఫోర్లు, 4 సిక్సర్లతో 226 పరుగులతో ఉన్నాడు. కాగా, రెండో రోజు ఆటకు వరుణుడు అంతరాయం కల్గించాడు. దాంతో మ్యాచ్ ప్రారంభం కావడానికి ఆలస్యం కానుంది.నిన్నటి ఆటలో 71 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ముంబై జట్టును సర్ఫరాజ్ తన వీరోచిత బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. బౌలర్ ఎవరన్నది చూడకుండా బౌండరీలే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ క్రమంలోనే తొలుత సెంచరీ పూర్తి చేసుకున్న సర్ఫరాజ్.. దాన్ని డబుల్ సెంచరీగా మార్చుకున్నాడు. ఐదో వికెట్‌కు ఆదిత్య తారేతో కలిసి 140 భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి అజేయంగా ఉన్న సర్ఫరాజ్ ఖాన్.. రెండో రోజు ఆటలో మరి డబుల్ సెంచరీని ట్రిపుల్‌గా మార్చుకుంటాడో లేదో చూడాలి. -
రూట్ డబుల్ సెంచరీ
హామిల్టన్: మూడో రోజు సెంచరీతో అలరించిన ఇంగ్లండ్ సారథి జో రూట్ నాలుగో రోజు కూడా అదే జోరు కొనసాగిస్తూ కెరీర్లో మూడో డబుల్ సెంచరీ (441 బంతుల్లో 226; 22 ఫోర్లు, సిక్స్) సాధించాడు. ఫలితంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 162.5 ఓవర్లలో 476 పరుగులకు ఆలౌటైంది. 101 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది. ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 34 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది. విలియమ్సన్ (37 బ్యాటింగ్), టేలర్ (31 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
వాట్లింగ్ వాట్ ఏ రికార్డు..
మౌంట్ మాంగని (న్యూజిలాండ్): ద్విశతకం సాధించిన తొలి న్యూజిలాండ్ వికెట్ కీపర్‌గా వాట్లింగ్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో వాట్లింగ్(205; 473 బంతుల్లో 24 ఫోర్లు, 1 సిక్సర్) అద్వితీయమైన ఆటతీరుతో జట్టును కష్టకాలంలో ఆదుకున్నాడు. ఆదుకోవడమే కాకుండా డబుల్ సెంచరీతో కివీస్‌కు భారీ ఆధిక్యాన్ని అందించాడు. వాట్లాంగ్కు తోడు సాన్ట్నెర్ (126; 269 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో వాట్లింగ్‌కు అండగా నిలిచాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 261 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇక వాట్లింగ్ డబుల్ సెంచరీ సాధించడంతో కివీస్ దిగ్గజ ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్ రికార్డు తుడుచుపెట్టుకపోయింది. ఇప్పటివరకు అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన కివీస్ వికెట్ కీపర్‌గా మెకల్లమ్(185; బంగ్లాదేశ్‌పై 2010లో) రికార్డును ఈ వికెట్ కీపర్ బ్రేక్ చేశాడు. ఇక ఓవరాల్‌గా టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించిన తొమ్మిదో వికెట్ కీపర్‌గా వాట్లింగ్ నిలిచాడు. ఈ జాబితాలో కుమార సంగక్కర అత్యధిక డబుల్ సెంచరీలతో తొలి స్థానంలో ఉండగా.. అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన వికెట్ కీపర్‌గా జింబాబ్వే మాజీ క్రికెటర్ ఆండ్రీ ఫ్లవర్(232 నాటౌట్; భారత్‌పై 2000లో) రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. ఇక టీమిండియా తరుపున ఏకైక డబుల్ సెంచరీ సాధించిన వికెట్ కీపర్‌గా మాజీ సారథి ఎంఎస్ ధోని(224; ఆస్ట్రేలియాపై 2013లో) నిలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో వాట్లింగ్, సాన్ట్నెర్ రాణించడంతో కివీస్ 615/9 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ బర్న్స్(31) , డొమినిక్ సిబ్లీ(12), జాక్ లీచ్(0) పూర్తిగా విఫలమయ్యారు. ప్రస్తుతం జోయ్ డెన్లీ(7 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఇంగ్లండ్ ఇంకా 207 పరుగుల వెనుకంజలో ఉంది. ఇంకా ఒక రోజు ఆట మాత్రమే మిగిలి ఉంది. ఇంగ్లండ్ ఓటమి నుంచి తప్పించుకోవాలంటే సారథి రూట్, ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ రాణింపుపైనే ఆధారపడి ఉంది. -
‘సగర్వా’ల్ 243
ఒకే రోజు ఏకంగా 407 పరుగులు... చివరి సెషన్‌లోనైతే 30 ఓవర్లలోనే 190 పరుగులు... ఒక బ్యాట్స్‌మన్ డబుల్ సెంచరీ, మరో ముగ్గురు అర్ధ సెంచరీలు...తలా వందకు పైగా పరుగులు సమర్పించుకున్న నలుగురు బౌలర్లు... బంగ్లాదేశ్‌పై భారత బ్యాట్స్‌మెన్ కొనసాగించిన ఊచకోతకు ఇది నిదర్శనం. పేరుకు టెస్టు మ్యాచే అయినా పరిమిత ఓవర్లలాగే ఆడిన టీమిండియా దూకుడు ముందు ప్రత్యర్థి తేలి పోయింది. మయాంక్ అగర్వాల్ ద్విశతకం శుక్రవారం ఆటలో హైలైట్‌గా నిలవగా, ఇప్పటికే 343 పరుగుల ఆధిక్యం సాధించిన టీమిండియా ఖాతాలో మరో గెలుపు చేరడం దాదాపుగా ఖాయమైపోయింది. కోహ్లిని డకౌట్ చేశామన్న ఆనందం తప్పిస్తే రెండో రోజే పూర్తిగా చేతులెత్తేసిన బంగ్లాదేశ్‌ను ఓటమి పలకరిస్తోంది. ఇండోర్: బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో భారత్ విజయంపై గురి పెట్టింది. మ్యాచ్ రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నిం గ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 493 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (330 బంతుల్లో 243; 28 ఫోర్లు, 8 సిక్సర్లు) డబుల్ సెంచరీతో చెలరేగాడు. అజింక్య రహానే (172 బంతుల్లో 86; 9 ఫోర్లు), రవీంద్ర జడేజా (76 బంతుల్లో 60 బ్యాటింగ్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), చతేశ్వర్ పుజారా (72 బంతుల్లో 54; 9 ఫోర్లు) కూడా రాణించారు. జాయెద్‌కు 4 వికెట్లు దక్కాయి. ప్రస్తుతం జడేజాతో పాటు ఉమేశ్ యాదవ్ (10 బంతుల్లో 25 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లు) క్రీజ్‌లో ఉన్నాడు. మయాంక్ వరుసగా పుజారాతో 91, రహానేతో 190, జడేజాతో 123 పరుగులు జోడించడం విశేషం. భారత్ ఇన్నింగ్స్‌ను ఎప్పుడు డిక్లేర్ చేయాలనేది ఇంకా నిర్ణయించుకోలేదు. కోహ్లి డకౌట్... ఓవర్‌నైట్ స్కోరు 86/1తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ తొందరగానే పుజారా వికెట్ కోల్పోయింది. జాయెద్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి 68 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న పుజారా... జాయెద్ తర్వాతి ఓవర్లోనే వెనుదిరిగాడు. భారత్‌కు వెంటనే మరో షాక్ తగిలింది. జాయెద్ తన తర్వాతి ఓవర్లోనే కోహ్లి (0)ని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. కోహ్లి కెరీర్లో ఇది పదో డకౌట్. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించడంతో రివ్యూ కోరిన బంగ్లా ఫలితం సాధించింది. దాంతో స్టేడియంలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలముకుంది. రహానే జోరు... కోహ్లి పెవిలియన్ చేరాక బరిలోకి దిగిన రహానే తనదైన శైలిలో చక్కటి షాట్లు ఆడాడు. జాయెద్ ఓవర్లోనే రెండు ఫోర్లతో అతను తను ఉద్దేశాన్ని ప్రదర్శించాడు. ఈ క్రమంలో రహానే టెస్టుల్లో 4 వేల పరుగుల మైలురాయిని దాటాడు. లంచ్ తర్వాత 105 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, మయాంక్‌తో భాగస్వామ్యం వంద పరుగులు దాటింది. మరికొన్ని అందమైన డ్రైవ్‌లు ఆడి సెంచరీకి చేరువవుతున్న దశలో ఒక తప్పుడు షాట్‌తో రహానే ఇన్నింగ్స్ ముగిసింది. జాయెద్ వేసిన బంతిని కట్ చేయబోగా డీప్ పాయింట్లో ఫీల్డర్ చేతికి చిక్కింది. భారత్ కోల్పోయిన తొలి 4 వికెట్లు జాయెద్ ఖాతా లోనే చేరడం విశేషం. ఆ తర్వాత వచ్చిన జడేజా దూకుడుగా ఆడటంతో స్కోరు వేగంగా దూసుకు పోయింది. 72 బంతుల్లో జడేజా అర్ధ సెంచరీ పూర్తయింది. సాహా (12) విఫలమైనా... చివర్లో ఉమేశ్ భారీ షాట్లతో వినోదం పంచాడు. జాయెద్ ఓవర్లో ఫోర్, సిక్స్ కొట్టిన అతను ... ఇబాదత్ వేసిన ఓవర్లో వరుసగా 2 సిక్సర్లు బాదాడు. సూపర్ బ్యాటింగ్... మయాంక్ తన ఇన్నింగ్స్‌లో తొమ్మిది సార్లు క్రీజ్ వదిలి ముందుకు దూసుకొచ్చి షాట్లు ఆడాడు. ఇందులో ఒక్కసారి మినహా ఎనిమిది సార్లు ఆ షాట్లు సిక్సర్లుగా మారాయి. తన బ్యాటింగ్‌పై అతనికున్న నమ్మకం, ఆత్మవిశ్వాసం ఎలాంటిదో ఇది చూపిస్తుంది. శుక్రవారం అద్భుత ప్రదర్శన కనబర్చిన మయాంక్ ఎక్కడా ఒక్కసారి కూడా కనీసం తడబడలేదు. 96 శాతం బంతులను అతను పూర్తి నియంత్రణతో ఎదుర్కోవడం విశేషం. డబుల్ సెంచరీని కూడా అతను సిక్సర్‌తో పూర్తి చేయడం సెహ్వాగ్ శైలిని గుర్తుకు తెచ్చింది. నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడిన అతను మైదానం నలుమూలలా షాట్లు బాదాడు. ముఖ్యంగా బంగ్లా ఎన్నో ఆశలు పెట్టుకున్న ఇద్దరు స్పిన్నర్లు తైజుల్, మెహదీలను మయాంక్ చితక్కొట్టాడు. వీరిద్దరి బౌలింగ్‌లోనే 19 బౌండరీలు బాదడం పరిస్థితిని సూచిస్తోంది. తొలి రోజు ఇన్నింగ్స్ మొదటి బంతినే ఫోర్‌గా మలచి పరుగుల ఖాతా తెరిచిన మయాంక్ విధ్వంసం రెండో రోజు దాదాపు చివరి వరకు సాగింది. రెండో రోజు ఇబాదత్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టడంతో 98 బం తుల్లో అతని అర్ధసెంచరీ పూర్తయింది. ఇది ఆరంభం మాత్రమే... అసలు ఆట ఇంకా ముందుంది అన్నట్లుగా అగర్వాల్ దూసుకుపోయాడు. మెహదీ ఓవర్లో బౌలర్ తల మీదుగా అతను నేరుగా ఒక చూడచక్కటి సిక్సర్ బాదాడు. అతని ఎనిమిది సిక్సర్ల జాబితాలో ఇది మొదటిది. 82 పరుగుల వద్ద మెహదీ బౌలింగ్‌లోనే అంపైర్ ఎల్బీగా ప్రకటించాడు. అయితే రివ్యూ కోరిన మయాంక్ బతికిపోయాడు. లంచ్ తర్వాత ఇబాదత్ ఓవర్లో డీప్ మిడ్‌వికెట్ దిశగా ఆడి రెండు పరుగులు తీయడంతో 183 బంతుల్లో అతని సెంచరీ పూర్తయింది. ప్రత్యర్థి పేలవ బౌలింగ్‌ను సొమ్ము చేసుకున్న మయాంక్ మరికొన్ని అద్భుతమైన స్ట్రోక్‌లు ఆడాడు. తైజుల్ బౌలింగ్‌లో అతను ఎక్స్ట్రా కవర్ మీదుగా కొట్టిన ‘ఇన్సైడ్ అవుట్’ సిక్సర్ రోజు మొత్తానికే హైలైట్‌గా నిలిచింది! 234 బంతుల్లో అతను 150 పరుగుల మార్క్‌ను చేరుకున్నాడు. ఆ తర్వాత కూడా అలసట లేకుండా, ఎక్కడా తగ్గకుండా పరుగుల వరద పారించాడు. ఇబాదత్ ఓవర్లో ఫోర్‌తో అతను 190ల్లోకి ప్రవేశించాడు. పెవిలియన్ నుంచి భారత జట్టు సభ్యులంతా ప్రోత్సహిస్తుండగా తర్వాతి ఓవర్లోనే మయాంక్ మరో మైలురాయిని దాటాడు. మెహదీ బౌలింగ్‌లో దూసుకొచ్చి వైడ్ లాంగాన్ మీదుగా భారీ సిక్సర్ కొట్టడంతో అతని డబుల్ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత మరింత వేగంగా ఆడిన ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్ 26 బంతుల్లోనే చకచకా 41 పరుగులు రాబట్టాడు. ఎట్టకేలకు మెహదీ హసన్ బౌలింగ్‌లో ఈ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ముగిసింది. స్వీప్ షాట్ ఆడబోయిన అతను డీప్ మిడ్ వికెట్లో జాయెద్ చక్కటి క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. ఇండోర్ ప్రేక్షకులు అభినందనలతో హోరెత్తిస్తుండగా మయాంక్ పెవిలియన్ చేరాడు. 76, 42, 77, 5, 16, 55, 4, 215, 7, 108, 10, 243... టెస్టు కెరీర్ తొలి 12 ఇన్నింగ్స్‌లలో మయాంక్ స్కోర్లు ఇవి. మూడు అర్ధ సెంచరీలు, మూడు సెంచరీలు ఉండగా... అందులో రెండు డబుల్ సెంచరీలే! ఈ పరుగుల ప్రవాహం ఇలాగే కొనసాగించగల సత్తా మయాంక్‌లో ఉందని మళ్లీ రుజువైంది. మరోవైపు శుక్రవారమంతా అగర్వాల్ ఆటను చూస్తూ ఇమ్రుల్ కైస్ మాత్రం తనలో తానే ఎంతగానో కుమిలిపోయి ఉంటాడు. తొలి రోజు 32 పరుగుల వద్ద మయాంక్ ఇచ్చిన అతి సునాయాస క్యాచ్‌ను స్లిప్‌లో అతనే వదిలేశాడు మరి! ►12 రెండో డబుల్ సెంచరీ చేసేందుకు మయాంక్‌కు పట్టిన ఇన్నింగ్స్‌లు. వినోద్ కాంబ్లీ (5) మాత్రమే అంతకంటే తక్కువ ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించగా, బ్రాడ్‌మన్‌కు 13 ఇన్నింగ్స్ పట్టాయి. ►8 మయాంక్ కొట్టిన సిక్సర్ల సంఖ్య. భారత్ తరఫున ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో ఇదే అత్యధికం. గతంలో నవ్‌జ్యోత్ సిద్ధూ (8–శ్రీలంకపై 1994లో) సాధించిన ఘనతను మయాంక్ సమం చేశాడు. 300 కావాలి... ఆటలో సహచరులను ప్రోత్సహించడంలో కెప్టెన్ కోహ్లి ఎప్పుడూ ముందుంటాడు. శుక్రవారం అది మరోసారి స్పష్టంగా కనిపించింది. కోహ్లికి, మైదానంలో ఉన్న మయాంక్‌కు మధ్య సైగలతోనే మాటలు నడిచాయి. మయాంక్ సెంచరీ దాటిన తర్వాత ఇంకా ఆడమంటూ చేతితో కోహ్లి సంజ్ఞలు చేశాడు. 150 దాటిన తర్వాత డబుల్ సెంచరీ కావాలంటూ రెండు వేళ్లు చూపించాడు. 200 పరుగులకు చేరగానే పని పూర్తయిందన్నట్లుగా కోహ్లి వైపు మయాంక్ రెండు వేళ్లు చూపించాడు. ఇది సరిపోదు...ఇంకా కావాలి, ట్రిపుల్ సెంచరీకి ప్రయత్నించు అన్నట్లుగా విరాట్ మళ్లీ మూడు వేళ్లతో సైగ చేయడం విశేషం. మయాంక్ కొంత వరకు ప్రయత్నించినా చివరకు ‘ట్రిపుల్’ సాధ్యం కాలేదు కానీ కెప్టెన్ పదే పదే ఆదేశాలిచ్చినట్లు, దానిని తాను పాటించినట్లుగా బ్యాటింగ్ సాగడం అరుదుగా కనిపించే దృశ్యం. తొలి సెషన్ ఓవర్లు: 28, పరుగులు: 102, వికెట్లు: 2 రెండో సెషన్ ఓవర్లు: 30, పరుగులు: 115, వికెట్లు: 0 మూడో సెషన్ ఓవర్లు: 30, పరుగులు: 190, వికెట్లు: 3 స్కోరు వివరాలు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్:150; భారత్ తొలి ఇన్నింగ్స్: మయాంక్ (సి) జాయెద్ (బి) మెహదీ హసన్ 243; రోహిత్ (సి) లిటన్ దాస్ (బి) జాయెద్ 6; పుజారా (సి) సబ్–సైఫ్ హసన్ (బి) జాయెద్ 54; కోహ్లి (ఎల్బీ) (బి) జాయెద్ 0; రహానే (సి) తైజుల్ (బి) జాయెద్ 86; జడేజా (బ్యాటింగ్) 60; సాహా (బి) ఇబాదత్ 12; ఉమేశ్ యాదవ్ (బ్యాటింగ్) 25; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (114 ఓవర్లలో 6 వికెట్లకు) 493. వికెట్ల పతనం: 1–14; 2–105; 3–119; 4–309; 5–432; 6–454. బౌలింగ్: ఇబాదత్ 31–5–115–1; అబూ జాయెద్ 25–3–108–4; తైజుల్ 28–4– 120–0; మెహదీ హసన్ 27–0–125–1; మహ్ముదుల్లా 3–0–24–0. -
196 పరుగుల వద్ద.. అచ్చం అతనిలాగే..!!
ఇండోర్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండోరోజు టీమిండియా ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ సాధించాడు. దీంతో టీమిండియా మూడో సెషన్ సమయానికి 282 పరుగుల ఆదిక్యంలో కొనసాగుతోంది. జట్టు స్కోరు 432 వద్ద అగర్వాల్ (330 బంతుల్లో 243; 28 ఫోర్లు, 8 సిక్స్‌లు) భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. రవీంద్ర జడేజా (66 బంతుల్లో 46; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), వృద్ధిమాన్ సాహా (5 బంతుల్లో 6) క్రీజులో ఉన్నారు. టెస్టుల్లో మాయంక్‌కు ఇది రెండో డబుల్ సెంచరీ కావడం విశేషం. మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మాదిరిగా.. రెండో డబుల్ సెంచరీ సాధించే సమయంలో 196 పరుగుల వద్ద మయాంక్ సిక్స్ కొట్టడం మరో విశేషం. (చదవండి : మయాంక్ మళ్లీ బాదేశాడు..) ఇక ఈ ద్విశతకంతో మయాంక్ పలు రికార్డులను తిరగరాశాడు. లెజెండరీ బ్యాట్స్‌మన్ డాన్ బ్రాడ్‌మన్, లారన్స్ రోయి, వినోద్ కాంబ్లీ రికార్డులను అతను తుడిచిపెట్టాడు. కాంబ్లీ 5 ఇన్సింగ్స్‌లలో డబుల్ సెంచరీ సాధించగా.. మయాంక్ 12 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఘనత సాధించాడు. బ్రాడ్‌మన్ 13 ఇన్సింగ్స్‌లు, లారన్స్ రోయి 14 ఇన్సింగ్స్‌లలో ద్విశతకాలు సాధించారు. ఇక భారత్ తరపున టెస్టుల్లో రెండు డబుల్ సెంచరీలు చేసిన ఐదో ఓపెనర్‌గా మయాంక్ నిలిచాడు. అంతకుముందు సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్, వినోద్ మన్కడ్, వసీం జాఫర్ ఉన్నారు. -
‘4 దగ్గర లైఫ్ ఇచ్చారు.. 264 కొట్టాడు’
భారత క్రికెట్‌కు దూకుడు మంత్రం నేర్పింది వీరేంద్ర సెహ్వాగ్.. అనడంలో ఎలాంటి సందేహం లేదు. సెహ్వాగ్ తర్వాత మరి ఆ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు? అప్పుడే వచ్చాడు మట్టిలో మాణిక్యం అనుకోవాలో.. సముద్రంలో సునామీ అనుకోవాలో.. బౌలర్ల్ హిట్ లిస్ట్‌లో ఉండే ఆ హిట్ మ్యాన్ ఎవరో ఇప్పటికే అర్థమైందనుకుంటా. టీమిండియా ఓపెనర్, సిక్సర్ల కింగ్, సెహ్వాగ్ స్క్వేర్, అభిమానులు ముద్దుగా పిలిచే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఇప్పటికే చరిత్ర పుటల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. (చదవండి: ప్రతీ క్షణం అతడి గురించే చర్చ) వన్డే క్రికెట్లో అసాధ్యమనుకునే డబుల్ సెంచరీని అవలీలగా మూడు సార్లు సాధించి తానేంటో నిరూపించుకున్నాడు రోహిత్ శర్మ. తొలి డబుల్ సెంచరీ సాధించనప్పుడు ఏదో గాలి వాటమనుకున్నారు.. రెండో ద్విశతకం సాధించనప్పుడు ప్రత్యర్థి జట్టుకే కాదు.. భారత ఫ్యాన్స్‌కు నిద్రలోనూ రోహిత్ బ్యాటింగే గుర్తొచ్చేదంటే అతిశయోక్తి కాదు. బౌండరీ నలువైపులా చూడముచ్చటైన షాట్లు.. ఆకాశమే హద్దుగా భారీ సిక్సర్లు.. రోహిత్ దెబ్బకు ప్రత్యర్థి బౌలర్లు బంతులు ఎక్కడ వేయాలో దిక్కుతోచక పసిపిల్లలయ్యారు. ఈ అపూర్వ ఘట్టం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా శ్రీలంకతో జరిగిన నాలుగో వన్డేలో చోటుచేసుకుంది. రోహిత్ విశ్వరూపం ప్రదర్శించి 264 పరుగులు చేసిన ఆ మ్యాచ్ జరిగి నేటికి ఐదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా రోహిత్ సాధించిన ఘనతను గుర్తుచేస్తూ ఐసీసీ, బీసీసీఐ ట్వీట్ చేసింది. అంతేకాకుండా హిట్‌మ్యాన్‌కు శుభాకాంక్షలు తెలిపింది. ఇక ఆ మ్యాచ్‌లో 173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సర్ల సహాయంతో 264 పరుగులు చేసి వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇప్పటికీ ఆ రికార్డు చెక్కుచెదరలేదు. ఇక ట్రిపుల్ సెంచరీ సాధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదు అనే రీతిలో రోహిత్ బ్యాటింగ్ సాగింది. అయితే ఆ మ్యాచ్‌లో రోహిత్ నాలుగు పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్‌ను లంక ఆల్‌రౌండర్ తిశార పెరీరా నేలపాలు చేశాడు. దీంతో లంక భారీ మూల్యం చెల్లించుకోక తప్పలేదు. ముఖ్యంగా ఆ క్యాచ్ వదిలేసినందుకు పెరీరా ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో.. ఇక రోహిత్ సునామీ ఇన్నింగ్స్‌కు టీమిండియా నాలుగు వందలకుపైగా స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్‌లో 153 పరుగుల భారీ తేడాతో కోహ్లి సేన ఘన విజయం సాధించింది. అంతకుముందు.. ఆ తర్వాత రోహిత్ శర్మ తొలి డబుల్ సెంచరీ ఆస్ట్రేలియాపై సాధించాడు. 2013లో నవంబర్ 2న బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ తొలి డబుల్ సెంచరీ సాధించాడు. దీంతో టీమిండియాలో అతడికి సుస్థిర స్థానం ఖాయమైంది. ఇక ఆ తర్వాత ఏడాది శ్రీలంకపై 264 పరుగులు సాధించాడు. అనంతరం 2017లో లంకపై మరోసారి తన ప్రతాపం చూపించాడు. ఆ మ్యాచ్‌లో ఏకంగా 208 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ట్రిపుల్ డబుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. రోహిత్‌తో పాటు ఇంకెవరు? వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చరిత్రలో నిలిచిపోయాడు. 2010లో దక్షిణాఫ్రికాపై ఆ ఘనత సాధించి వన్డేల్లోనూ ద్విశతకం సాధించవచ్చని సచిన్ ప్రాక్టికల్‌గా రుజువు చేసి చూపించాడు. ఇక సచిన్ శిష్యుడు వీరేంద్ర సెహ్వాగ్ గురువు దారిలోనే పయనించాడు. 2011లో ఇండోర్ స్టేడియంలో వెస్టిండీస్‌పై 219 పరుగులు సాధించి గురువును మించిన శిష్యుడయ్యాడు. న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ మార్టిన్ గప్టిల్ వెస్టిండీస్‌పై(237 నాటౌట్), యూనివర్సల్ స్టార్ క్రిస్ గేల్ జింబాబ్వే(215)పై ద్విశతకాలు నమోదు చేశారు. అయితే అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ఇప్పటివరకు రెండు అంతకంటే ఎక్కువ డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్ రోహిత్ శర్మ. (చదవండి: మనసులో మాట బయటపెట్టిన రోహిత్) #OnThisDay in 2014, Rohit Sharma went big! The Indian opener smashed 264, the highest ever ODI score 🤯 The worst part? Sri Lanka dropped him when he was on 4 🤦 pic.twitter.com/E6wowdoGUL — ICC (@ICC) November 13, 2019 -
‘నువ్వు డబుల్ సెంచరీ కొట్టాలి’
కరాచీ: పాకిస్తాన్ వైస్ కెప్టెన్ బాబర్ అజామ్ వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించాలని మాజీ క్రికెట్ షాహిద్ ఆఫ్రిది ఆకాంక్షించాడు. స్థిరంగా ఆడుతున్న అజామ్ పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు వెన్నుముఖ లాంటి వాడని ప్రశంసించాడు. సోమవారం కరాచీలో శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో బాబర్ అజామ్ 11వ సెంచరీ సాధించి విరాట్ కోహ్లిని వెనక్కు నెట్టాడు. వన్డేల్లో వేగవంతంగా 11వ శతకాన్ని నమోదు చేసిన జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ నేపథ్యంలో అజామ్‌పై వీడియోను తన యూట్యూబ్ చానల్లో ఆఫ్రిది షేర్ చేశాడు. ‘బాబర్ అజామ్ మూడో వన్డేలో సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడాలని కోరుకుంటున్నాను. నువ్వు 50 పరుగుల టైప్ ఆటగాడివి కాదు. 100, 150 లేదా 200 పరుగులు సాధించే సత్తా ఉన్నోడివి. టీమ్‌కు నువ్వు వెన్నుముఖ లాంటివాడివి. పాకిస్తాన్ జట్టు తరపున స్థిరంగా రాణిస్తున్న ఆటగాడివి’ అంటూ ఆఫ్రిది పేర్కొన్నాడు. వన్డేల్లో ఆరుగురు బ్యాట్స్మెన్లు మాత్రమే డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నారు. పాకిస్తాన్ నుంచి ఫఖర్ జమాన్ డబుల్ సెంచరీ(210 నాటౌట్) సాధించాడు. ఫామ్‌లో ఉన్న బాబర్ అజామ్ ద్విశతకం బాది జమాన్ సరసన చేరాలని ఆఫ్రిది ఆకాంక్షించాడు. శ్రీలంకతో నేడు జరుగుతున్న మూడో వన్డేలో అజామ్ ఎలా ఆడతాడో చూడాలి. (చదవండి: కోహ్లిని వెనక్కినెట్టేశాడు..) -
ఆషెస్ సిరీస్‌లో దుమ్మురేపుతున్న స్టీవ్ స్మిత్
-
స్మిత్ సూపర్ డబుల్
మాంచెస్టర్: యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (319 బంతుల్లో 211; 24 ఫోర్లు, 2 సిక్స్‌లు)ను తక్కువ స్కోరుకే ఔట్ చేయడం ఇక ఇంగ్లండ్ బౌలర్ల తరం కాదేమో? ఔను మరి...! ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం లొంగని విధంగా ఆడుతున్నాడతను. తనంతట తాను వికెట్ ఇస్తే అదే గొప్పని వారు భావించేలా భీకర ఫామ్‌తో పరుగులు చేస్తున్నాడు. స్మిత్ అద్భుత ఆటతో డబుల్ సెంచరీ బాదడంతో ఇక్కడ జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను 497/8 వద్ద డిక్లేర్ చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 170/3తో గురువారం ఆట కొనసాగించిన ఆసీస్... స్మిత్‌కు తోడు కెప్టెన్ టిమ్ పైన్ (127 బంతుల్లో 58; 8 ఫోర్లు), లోయరార్డర్లో మిచెల్ స్టార్క్ (58 బంతుల్లో 54 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించడంతో భారీ స్కోరు అందుకుంది. అంతకుముందు హెడ్ (19), వేడ్ (16) త్వరగానే వెనుదిరిగినా స్మిత్... పైన్‌తో ఆరో వికెట్‌కు 145 పరుగులు; 8వ వికెట్‌కు స్టార్క్‌తో కలిసి 51 పరుగులు జోడించి జట్టును నిలిపాడు. ఈ క్రమంలో 160 బంతుల్లో సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 118 పరుగుల వద్ద స్పిన్నర్ లీచ్ బౌలింగ్‌లో స్లిప్‌లో స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చినా అది నోబాల్ కావడంతో అతడికి లైఫ్ లభించింది. దీనిని సద్వినియోగం చేసుకుంటూ కెరీర్లో మూడో ద్విశతకం (310 బంతుల్లో) సాధించాడు. అనంతరం సైతం సాధికారికంగా కనిపించిన అతడు... పార్ట్‌టైమ్ స్పిన్నర్ జో రూట్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్‌నకు యత్నించి ఔటయ్యాడు. చివర్లో స్టార్క్, లయన్ (26 బంతుల్లో 26; 4 ఫోర్లు) జోడీ ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడింది. ముఖ్యంగా స్టార్క్ బౌండరీలు, సిక్స్‌లతో చెలరేగాడు. 49 బంతుల్లోనే వీరు 59 పరుగులు జోడించారు. ఆసీస్ చివరి 10 ఓవర్లలో 80పైగా పరుగులు చేయడం విశేషం. తర్వాత తొలి ఇన్నింగ్స్‌కు దిగిన ఇంగ్లండ్ రోజు ముగిసేసరికి ఓపెనర్ డెన్లీ (4) వికెట్ కోల్పోయి 23 పరుగులు చేసింది. -
శుబ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ
టరొబా (ట్రినిడాడ్ అండ్ టొబాగో): వెస్టిండీస్ ‘ఎ’తో జరుగుతున్న అనధికారిక మూడో టెస్టులో భారత్ ‘ఎ’ బ్యాట్స్‌మన్ శుబ్‌మన్ గిల్ (204 నాటౌట్; 19 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. ఈ క్రమంలో శుబ్‌మన్ (19 ఏళ్ల 334 రోజులు) ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో పిన్న వయస్కులో డబుల్ సెంచరీ చేసిన భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. 17 ఏళ్లుగా గౌతమ్ గంభీర్ పేరిట ఉన్న ఈ రికార్డును శుబ్‌మన్ బద్దలు కొట్టాడు. 2002లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో బోర్డు ప్రెసిడెంట్స్ తరఫున గంభీర్ (20 ఏళ్ల 124 రోజులు) 218 స్కోరు చేశాడు. డబుల్ సెంచరీ చేసే క్రమంలో తెలుగుతేజం, కెప్టెన్ హనుమ విహారి (118 నాటౌట్; 10 ఫోర్లు, 1సిక్స్)తో కలిసి శుబ్‌మన్ అబేధ్యమైన ఐదో వికెట్‌కు 315 పరుగులు జోడించాడు. దీంతో భారత్ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌ను 90 ఓవర్లలో 4 వికెట్లకు 365 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం 373 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ‘ఎ’ కడపటి వార్తలందేసరికి రెండో ఇన్నింగ్స్‌లో 83 ఓవర్లలో 3 వికెట్లకు 242 పరుగులు చేసింది. -
విలియమ్సన్ అజేయ డబుల్ సెంచరీ
హామిల్టన్: కెప్టెన్ కేన్ విలియమ్సన్ (257 బంతుల్లో 200 నాటౌట్; 19 ఫోర్లు) అజేయ డబుల్ సెంచరీ బాదడంతో... బంగ్లాదేశ్‌తో ఇక్కడ జరుగుతున్న మొదటి టెస్టులో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌ను 715/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. న్యూజిలాండ్ టెస్టు చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు. 2014లో పాకిస్తాన్‌పై చేసిన 690 పరుగులే ఇప్పటివరకు దాని అత్యుత్తమం. దీంతోపాటు ప్రత్యర్థిపై తమ టెస్టు చరిత్రలోనే అత్యధికంగా 481 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. 451/4తో మూడో రోజు శనివారం ఆట కొనసాగించిన కివీస్‌ను విలియమ్సన్... వాగ్నర్ (47), వాట్లింగ్ (31), గ్రాండ్‌హోమ్ (76 నాటౌట్) తోడుగా ముందుకు నడిపించాడు. విలియమ్సన్ డబుల్ సెంచరీ పూర్తికాగానే కివీస్ డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. సౌమ్య సర్కార్ (39 బ్యాటింగ్), కెప్టెన్ మహ్మూ దుల్లా (15 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
పుజారా డబుల్ సెంచరీ మిస్
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా తృటిలో డబుల్ సెంచరీ చేసే అవకాశం కోల్పోయాడు. ద్విశతకానికి ఏడు పరుగుల దూరంలో అతడు అవుటయ్యాడు. 373 బంతుల్లో 22 ఫోర్లతో 193 పరుగులు చేసి లయన్ బౌలింగ్‌లో ఆరో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. డబుల్ సెంచరీ చేజారడంతో నిరాశగా మైదానాన్ని వీడాడు. టీమిండియా 491/6 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. రిషబ్ పంత్ అర్ధ సెంచరీ చేశాడు. అతడికి తోడుగా రవీంద్ర జడేజా(25) క్రీజ్‌లో ఉన్నాడు. (మొదటి రోజు...మనదే జోరు) టెస్టుల్లో పుజారా ఇప్పటివరకు మూడు డబుల్ సెంచరీలు చేశాడు. ఇందులో రెండు ఆస్ట్రేలియాపైనే సాధించడం విశేషం. టెస్టుల్లో అతడి వ్యక్తిగత అత్యధిక స్కోరు 206 నాటౌట్. 2012, నవంబర్‌లో అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడీ స్కోరు సాధించాడు. 2013, మే నెలలో హైదరాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 204 పరుగులు చేశాడు. 2017, మార్చిలో ఆసీస్‌తోనే జరిగిన మ్యాచ్‌లోనూ డబుల్ సెంచరీ(202) కొట్టాడు. -
‘సిక్సర’ పిడుగు... ఆసీస్ కుర్రాడు
అడిలైడ్: ఆస్ట్రేలియా టీనేజ్ క్రికెటర్ ఓలీ డేవిస్ తన బ్యాట్‌తో అండర్–19 వన్డే క్రికెట్లో కొత్త చరిత్ర లిఖించాడు. వరుస 6 బంతుల్లో 6 సిక్సర్లతో పాటు డబుల్ సెంచరీ రికార్డుని సొంతం చేసుకున్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అండర్–19 వన్డే నేషనల్ చాంపియన్‌షిప్‌కు సిక్సర్ల సునామీతో ఘన ఆరంభాన్నిచ్చాడు. సోమవారమే మొదలైన ఈ టోర్నీలో న్యూసౌత్‌వేల్స్ మెట్రో కెప్టెన్, 18 ఏళ్ల డేవిస్... నార్తర్న్ టెరిటరీ (ఎన్టీ) జట్టుపై చెలరేగాడు. 115 బంతుల్లో 14 ఫోర్లు, 17 సిక్సర్లతో 207 పరుగులు చేసి ఈ వన్డే చాంపియన్‌షిప్‌లో ‘డబుల్’ చరిత్రను తనపేర రాసుకున్నాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ఒకే మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు (16) కొట్టిన రోహిత్ శర్మ (భారత్), డివిలియర్స్ (దక్షిణాఫ్రికా), క్రిస్ గేల్ (వెస్టిండీస్)లను మించిపోయాడు. 100 పరుగులను 74 బంతుల్లో పూర్తిచేసిన ఈ సిడ్నీ సంచలనం తర్వాతి 100 పరుగులను కేవలం 39 బంతుల్లోనే సాధించడం విశేషం. ఎన్టీ స్పిన్నర్ జాక్ జేమ్స్ వేసిన 40వ ఓవర్లో అతను వరుస ఆరు బంతుల్ని ఆరు సిక్సర్లుగా మలిచాడు. గతంలో గ్యారీ సోబర్స్ (వెస్టిండీస్), రవిశాస్త్రి (భారత్), హెర్షల్ గిబ్స్ (దక్షిణాఫ్రికా), యువరాజ్ సింగ్ (భారత్), జోర్డాన్ క్లార్క్ (ఇంగ్లండ్) వరుస ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టారు. గిబ్స్, యువరాజ్ సింగ్ అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో... సోబర్స్, జోర్డాన్ క్లార్క్ కౌంటీ క్రికెట్లో... రవిశాస్త్రి రంజీ క్రికెట్లో ఈ ఘనత సాధించారు. ఓలీ డేవిస్ ధాటికి ఈ మ్యాచ్‌లో న్యూసౌత్‌వేల్స్ మెట్రో 50 ఓవర్లలో 4 వికెట్లకు 406 పరుగుల భారీస్కోరు చేయగా, నార్తర్న్ టెరిటరీ 238 పరుగుల వద్ద ఆలౌటైంది. మెట్రో జట్టు 168 పరుగులతో జయభేరి మోగించింది. -
వారెవ్వా.. టీ20ల్లోనూ డబుల్ సెంచరీ!
దుబాయ్ : పరుగుల విధ్వంసానికే కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే పొట్టి క్రికెట్లోనూ డబుల్ సెంచరీ నమోదైంది. దుబాయ్ వేదికగా క్లబ్ క్రికెట్ ఆధ్వర్యంలో జరిగిన అలియన్స్ టీ20 లీగ్‌లో ఈ అద్భుత రికార్డు ఆవిష్కృతమైంది. స్పోర్టింగ్ క్రికెట్ క్లబ్ తరపున బరిలోకి దిగిన 19 ఏళ్ల కేవీ హరికృష్ణ 78 బంతుల్లో 22 ఫోర్లు, 14 సిక్సర్లతో 208 పరుగులతో సరికొత్త రికార్డు సృష్టించాడు. యూఏఈ అండర్-19 ఆటగాడైన హరికృష్ణ 36 బౌండరీల(సిక్సర్లు)తోనే 172 పరుగులు సాధించడం విశేషం. హరికృష్ణ భారీ ఇన్నింగ్స్‌తో ఆ జట్టు.. మెకోస్ క్రికెట్ క్లబ్‌కు 251 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. అయితే ఈ మ్యాచ్‌లో హరికృష్ణ జట్టు ఓడిపోవడం గమనార్హం. ప్రత్యర్థి ఆటగాళ్లు 17 ఓవర్లోనే ఆ భారీ లక్ష్యాన్ని ఛేదించడం కొసమెరుపు. జట్టు ఓడినా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మాత్రం హరికృష్ణనే వరించింది. ఐపీఎల్ ఆడటమే నా లక్ష్యం టీ20 చరిత్రలోనే డబుల్ సెంచరీ సాధించిన ఈ యువ ఆటగాడు తన లక్ష్యం మాత్రం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), ఇతర టీ20 లీగ్‌ల్లో ఆడటమేనని తెలిపాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. భారీ షాట్లతో పరుగుల చేయడాన్ని తానెప్పుడు ఆస్వాదిస్తానని, గతంలో 36 బంతుల్లోనే సెంచరీ చేసిన అనుభవం ఉందని చెప్పుకొచ్చాడు. అఫ్గాన్ ప్రీమియర్ లీగ్ ఆడిన హరికృష్ణ, అక్కడ అంతర్జాతీయ క్రికెటర్ల శిక్షణతో రాటుదేలాడు. అలాగే భారత క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ సూచనలు తీసుకున్నాడు. ఇక అంతర్జాతీయ టీ20ల్లోనూ ఇప్పటి వరకు డబుల్ సెంచరీ నమోదు కాలేదు. ఐపీఎల్-2013లో వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్ సాధించిన 175 (నాటౌట్) పరుగులే ఇప్పటి వరకు అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం గమనార్హం. చదవండి: టి20ల్లో ‘విన్’డీసే -
ద్విశతక వీరుడు
శ్రీకాకుళం న్యూకాలనీ: సిక్కోలు యువ సంచలనం మద్దెల సూర్యకిరణ్ క్రికెట్లో జిల్లా పేరు నిలబెడుతున్నాడు. ఆంధ్రా జట్టుకు నాయకత్వం వహిస్తున్న కిరణ్ (జిల్లా నుంచి మొదటి వ్యక్తి) అంతర్రాష్ట్ర క్రికెట్ టోర్నీలో డబుల్ సెంచరీ చేసి సత్తా చాటాడు. విజయ్ మర్చెంట్ అంతర్ రాష్ట్ర అండర్–16 క్రికెట్ పోటీల్లో పాల్గొనేందుకు ముందు హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహిస్తున్న అంతర్ రాష్ట్రాల ట్ర యాంగ్లర్ సిరీస్(ఇండివిడ్యువల్ మ్యాచ్‌లు)లో డబుల్ సెంచరీతో అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ నెల 5 నుంచి హిమాచల్‌ప్రదేశ్–1 జట్టుతో జరిగిన మూడు రోజుల క్రికెట్ మ్యాచ్‌లో వన్ డౌన్ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగిన కిరణ్ 376 బంతులను ఎదుర్కొని 229 పరుగులు చేశాడు. ఇందులో 37 బౌండరీలు, ఒక భారీ సిక్సర్ ఉండటం విశేషం. జిల్లా నుంచి ఇంతవరకు ఎవరూ ఈ స్థాయిలో క్రికెట్లో రాణించలేదు. ఈ మ్యాచ్‌లోనే కాదు హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగులు, పశ్చిమబెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 55 పరుగులు చేశాడు. మూడో మ్యాచ్‌లో డబుల్‌సెంచరీతో హోరెత్తించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అం దుకున్నాడు. సూర్యకిరణ్ సత్తా చాటడంపై జిల్లా క్రికెట్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. జిల్లాకు గర్వకారణంగా నిలిచిన సూర్యకిరణ్‌ను శ్రీకాకుళం జిల్లా బాలురు బాలికల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర ఎన్వీ నాయుడు, జేవీ భాస్కరరావు, ఉపాధ్యాక్షులు బోయిన రమేష్, పి.సూర్యారావు, కోశాధికారి గిరిధరరావు, కార్యవర్గ సభ్యులు, కోచ్‌లు అభినందించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో.. చిన్ననాటి నుంచి క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న సూర్యకిరణ్ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అంచెలంచెలుగా ఎదిగాడు. తల్లిదండ్రులు మద్దెల వరప్రసాద్, విజయలక్ష్మి, చెల్లి (మైథిలి). తండ్రి సివి ల్ కానిస్టేబుల్. తల్లి గృహిణి. వరప్రసాద్ రేగిడి ఆమదాలవలస పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరి స్వస్థలం ఎచ్చెర్ల మండలంలోని షేర్‌మహ్మద్ పురం గ్రామం. అయితే ప్రస్తుతం వరప్రసాద్ ఉద్యోగ రీత్యా పాలకొండలో నివా సం ఉంటున్నారు. సూర్యకిరణ్ ప్రస్తుతం విజ యనగరంలోని ఓ కళాశాలలో ఇంటర్మీడియెట్ ఫస్టియర్ (సీఈఓ గ్రూప్) చదువుతున్నాడు. బ్యాటింగే ప్రధాన బలం 2012లో శిక్షణ ఆరంభించిన సూర్యకిరణ్‌కు బ్యా టింగే బలం. ఏ స్థానంలో అయినా కుదురుకుని మంచి టెక్నిక్‌తో బ్యాటింగ్ చేయడం ఈ రైట్ హ్యాండర్ ప్రత్యేకత. 2013లో జిల్లా అండర్–14 జట్టుకు ఎంపికయ్యాడు. అది మొదలు వెనుదిరి గి చూడలేదు. 2014, 2015ల్లో అండర్–14 ఆంధ్రా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2016, 17లో అండర్–16 జట్లకు ఎంపికై సత్తాచాటాడు. అంతర్రాష్ట్ర పోటీల్లో పాల్గొన్న మొద టి మ్యాచ్‌లోనే 65 పరుగులు చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. అక్కడి నుంచి అవకాశం దొరికిన ప్రతి చోటా పరుగులు సాధిస్తూ సెలెక్టర్లను మెప్పిస్తున్నాడు. స్పిన్ బౌలర్‌గానూ జట్టుకు సేవలందించగలడు. జాతీయ జట్టుకు ఎంపికే లక్ష్యంగా అంచెలంచెలుగా రాణిన్నాడు. జాతీయ జట్టుకు ఎంపికే లక్ష్యం నన్ను నిరంతరం మా పేరెంట్స్, కోచ్‌లు, క్రికెట్ సంఘ పెద్దలు ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం నిలకడగా రాణిస్తున్నాను. డబుల్ సెంచరీ సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఇదే స్ఫూర్తితో మరిన్ని భారీ స్కోర్లు చేస్తానన్న నమ్మకం కలిగింది. రంజీ జట్టుకు ఎంపికై, అక్కడ రాణించి తర్వాత జాతీయ జట్టుకే ఎంపికే లక్ష్యంగా ఆడతాను. జిల్లాకు, రాష్ట్రానికి గౌరవాన్ని తీసుకొస్తాను. – మద్దెల సూర్యకిరణ్, ఆంధ్రా జట్టు కెప్టెన్, అండర్–16 -
మహిళా క్రికెట్లో ఓ అద్భుతం
సాక్షి, హైదరాబాద్ : సరిగ్గా 16 ఏళ్ల క్రితం మహిళా క్రికెట్లో ఓ అద్భుతం చోటుచేసుకుంది. ఓ 19 ఏళ్ల అమ్మాయి అసాధారణ బ్యాటింగ్‌తో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంది. క్రికెట్ అంటే పడిచచ్చే భారత్‌లో మహిళా క్రికెట్‌పై కూడా ఆసక్తి పెరిగేలా తొలి బీజం వేసింది. భారత్ తరపున తొలి డబుల్ సెంచరీ సాధించడమే కాకుండా అప్పటికి మహిళా టెస్టు చరిత్రలో ఎవరూ అందుకోని ఘనతను అందుకొని శిఖరాన నిలిచింది. ఆమె ఎవరో కాదు.. రెండుసార్లు భారత మహిళా జట్టు ప్రపంచకప్ ఫైనల్‌కు చేర్చిన రథసారథి, మన హైదరాబాద్ క్వీన్ మిథాలీ రాజ్. ఆమె తన కెరీర్లో సాధించిన డబుల్ సెంచరీకి నేటికి సరిగ్గా 16 ఏళ్లు. ఈ డబుల్ సెంచరీని గుర్తు చేస్తూ మహిళా బీసీసీఐ ట్వీట్ చేసింది. 2002, ఆగస్టు 16న ఇంగ్లండ్‌తో జరిగిన టాంటన్ టెస్టులో 19 ఏళ్ల మిథాలీ రెచ్చిపోయింది. 407 బంతుల్లో 19 ఫోర్లతో 214 పరుగులు చేసి భారత్ తరపున తొలి డబుల్ సెంచరీ సాధించిన మహిళా క్రికెటర్‌గా.. ఓవరాల్‌గా ఐదో క్రికెటర్‌గా గుర్తింపు పొందింది. అప్పటికే వ్యక్తిగత అత్యధిక పరుగులు సాధించిన మహిళా క్రికెటర్‌గా రికార్డు నమోదు చేసింది. ఆ తర్వాత 2004లో పాక్ మహిళా క్రికెటర్ కిరణ్ బలుచ్ వెస్టిండీస్ 242 పరుగులు సాధించి మిథాలీ రికార్డును బ్రేక్ చేసింది. ఈ ఇన్నింగ్స్ తర్వాతే భారత మహిళా క్రికెట్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. మిథాలీ స్పూర్తితో ఎంతో మంది యువతులు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నారు. చదవండి: ట్రోలింగ్‌కు మిథాలీ సూపర్ కౌంటర్! -
అభినవ్ డబుల్ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఎ–2 డివిజన్ రెండు రోజుల క్రికెట్ లీగ్‌లో బాలాజీ కోల్ట్స్ బ్యాట్స్‌మన్ జి. అభినవ్ (246 బంతుల్లో 208; 20 ఫోర్లు, 5 సిక్సర్లు) డబుల్ సెంచరీతో చెలరేగాడు. దీంతో సాయిసత్య సీసీ జట్టుతో సోమవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో బాలాజీ కోల్ట్స్ భారీస్కోరు సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బాలాజీ కోల్ట్స్ తొలిరోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 8 వికెట్లకు 442 పరుగులు సాధించింది. అభినవ్ ద్విశతకంతో మెరవగా, ప్రథమేశ్ (90) కొద్దిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. జి. గోపీకృష్ణ రెడ్డి (59), ఎ. జయచంద్ర (39) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో సూరజ్ సక్సేనా 4 వికెట్లు దక్కించుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల వివరాలు ఎంసీసీ: 144 (భాను ప్రకాశ్ 91; ఎన్. నితిన్ సాయి 5/46), హైదరాబాద్ టైటాన్స్: 150/1 (రోహిత్ సాగర్ 86 నాటౌట్). ఫ్యూచర్‌స్టార్: 184 (ఇషాన్‌శర్మ 42; పృథ్వీ రెడ్డి 3/22, రమణ 3/60, ఇబ్రహీం ఖాన్ 3/28), హెచ్‌పీఎస్–బేగంపేట: 116 (డి. సిద్ధార్థ్ ఆనంద్ 31; సందీప్ యాదవ్ 5/55). బడ్డింగ్ స్టార్: 170 (జమీరుద్దీన్ 44, ఫర్హాన్ 40; అమీర్ 3/43, రమావత్ సురేశ్ 5/60), అపెక్స్ సీసీ: 171/5 (విక్రాంత్ 43, నారాయణ 71; తౌసీఫ్ 3/43). డెక్కన్ బ్లూస్: 95 (రాహుల్ 3/15, జె. హరీశ్ కుమార్ 5/38), క్లాసిక్ సీసీ: 93 (సాయితేజ రెడ్డి 37, అక్షయ్ 6/33, దీపక్ 3/23). విశాక సీసీ: 89 (టి. అక్షయ్ 31; కె. చంద్రకాంత్ 4/37, వి. భార్గవ్ ఆనంద్ 5/33), పోస్టల్: 93/1 (టి. విజయ్ కుమార్ 65). జై భగవతి: 195 (పి. శివ 42, మొహమ్మద్ సక్లాయిన్ 59; రోహిత్ గిరివర్ధన్ 5/65, సాత్విక్‌రెడ్డి 3/54), గౌడ్స్ ఎలెవన్:138/4 (సాత్విక్‌రెడ్డి 108). కాంకర్డ్: 336 (వై. సాయి వరుణ్ 62, జి. హేమంత్ 58, ఆర్. ప్రణీత్ 80, టి. ఆరోన్ పాల్; వినయ్ 3/39, అద్నాన్ అహ్మద్ 3/100). సీసీఓబీ: 367/8 (అర్షద్ 59, మీర్జా బేగ్ 136; సౌరవ్ 3/67, వికాస్ 4/103), వీనస్ సైబర్టెక్తో మ్యాచ్. ఖల్సా: 181 (ఆర్యన్ 40; అజ్మత్ ఖాన్ 3/41, ప్రమేశ్ పాండే 4/22), న్యూబ్లూస్: 85/3 (అజిత్ సింగ్ 39, ఆర్యన్ సింగ్ 3/35). నేషనల్: 247 (మొహమ్మద్ ఖాలిద్ 87, ఎస్కే మొహమ్మద్ 47; నితీశ్ 5/70, సుమిత్ 3/39), ఉస్మానియాతో మ్యాచ్. మహమూద్ సీసీ: 285 (హుస్సేన్ 92, భరత్‌రాజ్ 51; మొహమ్మద్ హష్మీ 5/76, విశాల్ సింగ్ 3/92), గ్రీన్‌టర్ఫ్: 13/1 (7 ఓవర్లలో). రోహిత్ ఎలెవన్: 341/9 (సాత్విక్ భరద్వాజ్ 46, అర్జున్ చౌదరి 44, గంగా సింగ్ 43, అబ్దుల్ 50; విశేష్ 4/88), పాషాబీడీతో మ్యాచ్. -
అజేయంగా 370 పరుగులు చేశాడు!
బులవాయో: అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ఫఖర్ ‘జమానా’ మొదలైంది. పరిమిత ఓవర్ల క్రికెట్ ఫార్మెట్లోకి అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే పాకిస్థాన్ ఓపెనర్ ఫఖర్ జమాన్ రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఈ క్రమంలో వన్డే క్రికెట్లో వేగవంతంగా 1000 పరుగులు మైలురాయిని అందుకున్నాడు. తాజాగా జింబాబ్వేతో జరిగిన ఐదు వన్డేల ద్వైపాక్షిక సిరీస్‌లో ఫఖర్ పరుగుల పండుగ చేసుకున్నాడు. అత్యద్భుతంగా రాణించి బ్యాటింగ్‌లో పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. ఐదు వన్డేల ద్వైపాక్షిక సిరీస్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఘనత కూడా దక్కించుకున్నాడు. ఐదు మ్యాచ్‌ల్లో 257.5 సగటుతో 515 పరుగులు చేశాడు. ఇందులో డబుల్ సెంచరీ(210), సెంచరీ(117), రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి. ఈ ఐదు వన్డేల్లో మూడుసార్లు అతడు నాటౌట్‌గా నిలవడం విశేషం. అంటే అజేయంగా 370 పరుగులు సాధించాడన్న మాట. 28 ఏళ్ల ఫఖర్ జమాన్ అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ఇప్పటివరకు 18 మ్యాచ్‌లాడి 76.07 సగటుతో మొత్తం 1065 పరుగులు చేశాడు. అందులో మూడు సెంచరీలు, ఆరు అర్ధ సెంచరీలున్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 210 పరుగులు నాటౌట్. ఐదు వన్డేల ద్వైపాక్షిక సిరీస్‌ల్లో అత్యధిక పరుగులు.. 1. ఫఖర్ జమాన్(515)- పాకిస్తాన్ 2. హెచ్. మసకజ్జా(467) - జింబాబ్వే 3. సల్మాన్‌భట్(451)- పాకిస్తాన్ 4. మహ్మద్ హఫీజ్(448)- పాకిస్తాన్ 5. రోహిత్ శర్మ(441)- భారత్ -
ఫఖర్ సరికొత్త వన్డే రికార్డు
బులవాయో: జింబాబ్వేతో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా నాల్గో వన్డేలో డబుల్ సెంచరీ సాధించి ఆ ఘనత సాధించిన తొలి పాకిస్తాన్ క్రికెటర్‌గా రికార్డు సృష్టించిన ఫఖర్ జమాన్ మరో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఆదివారం చివరిదైన ఐదో వన్డేలో ఫఖర్ జమాన్(85; 83 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సర్) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఫలితంగా వన్డేల్లో వెయ్యి పరుగుల క్లబ్లో చేరిపోయాడు. ఈ క్రమంలోనే వన్డేల్లో వేగవంతంగా 1,000 పరుగుల మైలురాయిని అందుకున్న బ్యాట్స్‌మన్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌కు ముందు వెయ్యి పరుగుల ఘనతను చేరడానికి 20 పరుగుల దూరంలో ఉన్న ఫఖర్ దాన్ని సునాయాసంగా చేరుకున్నాడు. దాంతో విండీస్ దిగ్గజ క్రికెటర్ వివ్ రిచర్డ్స్, కెవిన్ పీటర్సన్, డికాక్, బాబర్ అజమ్ల రికార్డును బ్రేక్ చేశాడు. వీరంతా వన్డేల్లో వెయ్యి పరుగుల మార్కును చేరడానికి 21 ఇన్నింగ్స్‌లు తీసుకోగా, ఫఖర్ జమాన్ 18వ వన్డేలోనే ఈ ఘనత సాధించాడు. గతేడాది ఇంగ్లండ్ వేదికగా జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేసిన ఫఖర్.. ఆ టోర్నీలో మొత్తంగా 252 పరుగులు చేశాడు. ఆ టోర్నీ ఫైనల్లో భారత్‌పై అతను సమయోచిత శతకం బాది టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించడంతో ఫఖర్ జమాన్ పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత.. వన్డే జట్టులో నమ్మదగిన ఆటగాడిగా కొనసాగుతున్న జమాన్.. తాజాగా జింబాబ్వేతో వన్డే సిరీస్‌లోనూ పరుగుల మోత మోగిస్తున్నాడు. ఈ సిరీస్‌లో ఐదు వన్డేల్లో జమాన్ వరుస ఇన్నింగ్స్‌ల్లో (60, 117 నాటౌట్, 43 నాటౌట్, 210 నాటౌట్, 85) దుమ్ములేపాడు. చదవండి: నయా 'జమానా' -
రిచర్డ్స్, కోహ్లి రికార్డుపై కన్నేశాడు..
బులవాయో: జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించి ఆ ఘనత సాధించిన తొలి పాకిస్తాన్ క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పిన ఫఖర్ జమాన్.. ఇప్పుడు వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు వివ్ రిచర్డ్స్ రికార్డుపై కన్నేశాడు. అదేంటంటే.. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో వేగవంతంగా వెయ్యి పరుగులు సాధించడం. ఇప్పటి వరకు 17 వన్డే మ్యాచ్‌లాడిన ఫఖర్ 17 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 980 పరుగులు సాధించాడు. మరో 20 పరుగులు చేస్తే అతడు వెయ్యి పరుగుల క్లబ్లో చేరతాడు. విరాట్ కోహ్లీ 24 ఇన్నింగ్స్‌ల ద్వారా 2008లో వెయ్యి పరుగుల క్లబ్లో చేరగా.. వెస్టిండీస్ ఆటగాడు వివ్ రిచర్డ్స్ 21ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను అందుకున్నాడు. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా పాక్-జింబాబ్వే మధ్య ఆదివారం చివరి వన్డే జరగనుంది. ఈ మ్యాచ్‌లో 20 పరుగులు చేస్తే చాలు ఫఖర్ అంతర్జాతీయ వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. కేవలం 18 ఇన్నింగ్స్‌ల ద్వారానే ఈ ఘనత సాధించిన మొదటి ఆటగాడు అవుతాడు. ఐదు వన్డేల సిరీస్‌ను పాక్ ఇప్పటికే 4-0తో కైవసం చేసుకుంది. చదవండి: నయా 'జమానా' -
17వ మ్యాచ్‌లోనే అద్భుతాన్ని చేశాడు!
సరిగ్గా సంవత్సరం క్రితం వన్డే క్రికెట్లో అడుగు పెట్టిన ఫఖర్ జమాన్ తన 17వ మ్యాచ్‌లోనే అద్భుతం చేసి చూపించాడు. గతంలో పాకిస్తాన్ దిగ్గజాలెవరికీ సాధ్యంకాని అరుదైన ఘనతను అందుకొని శిఖరాన నిలిచాడు. 45 ఏళ్ల పాకిస్తాన్ వన్డే క్రికెట్ చరిత్రలో డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా నిలిచిన జమాన్... 1997 నుంచి సయీద్ అన్వర్ (194) పేరిట ఉన్న అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డును అధిగమించాడు. జింబాబ్వే పేలవ బౌలింగ్‌పై చెలరేగిన జమాన్, మరో ఓపెనర్ ఇమామ్–ఉల్–హఖ్ కలిసి తొలి వికెట్‌కు 304 పరుగుల కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పగా, పాక్ వన్డేల్లో తమ అత్యధిక స్కోరు నమోదు చేయడం మరో విశేషం. బులవాయో: ‘జింబాబ్వేపై పాకిస్తాన్ జట్టు సాధిస్తున్న విజయాలు నాకేమీ సంతృప్తి కలిగించడం లేదు. గెలిచినా అంతా కళావిహీనంగా ఉంది. అత్యద్భుత బౌలింగ్ కానీ 50 బంతుల్లో 100 పరుగులు లాంటి ప్రదర్శనలు కనిపించడం లేదు. ఒక్కరైనా 200 పరుగులు చేసేందుకు ప్రయత్నించవచ్చు కదా. జింబాబ్వేపై కొట్టలేకపోతే మరెక్కడ కొడతారు’... నాలుగు రోజుల క్రితం పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా తన జట్టు గురించి చేసిన వ్యాఖ్యలు ఇవి. జట్టు మొత్తం సంగతేమో కానీ ఓపెనర్ ఫఖర్ జమాన్లో మాత్రం ఈ మాటలు స్ఫూర్తి రగిలించాయేమో! ఆకాశమే హద్దుగా చెలరేగిన అతను పాక్ తరఫున తొలి డబుల్ సెంచరీతో సమాధానమిచ్చాడు. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో అనేక కొత్త రికార్డులు పాక్ వశమయ్యాయి. ఫఖర్ జమాన్ (156 బంతుల్లో 210 నాటౌట్; 24 ఫోర్లు, 5 సిక్సర్లు) డబుల్ సెంచరీతో సత్తా చాటడంతో శుక్రవారం జింబాబ్వేతో జరిగిన నాలుగో వన్డేలో పాక్ 244 పరుగుల భారీ తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. ఇమామ్–ఉల్–హఖ్ (122 బంతుల్లో 113; 8 ఫోర్లు) కూడా శతకంతో చెలరేగగా, చివర్లో ఆసిఫ్ అలీ (22 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడుగా ఆడటంతో పాక్ 50 ఓవర్లలో వికెట్ నష్టానికి 399 పరుగులు చేసింది. అనంతరం జింబాబ్వే 42.4 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌటైంది. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ (4/28), ఉస్మాన్ ఖాన్ (2/23) రాణించారు. పరుగుల పరంగా పాకిస్తాన్‌కు ఇది రెండో అతి పెద్ద విజయం. ఇరు జట్ల మధ్య చివరి వన్డే ఆదివారం జరుగనుంది. జమాన్ ఇన్నింగ్స్ సాగిందిలా... పాక్ ఇన్నింగ్స్‌లో తొలి 22 బంతుల్లో ఫఖర్‌కు ఒక్క బంతి కూడా ఆడే అవకాశం రాలేదు. అనంతరం కొన్ని చక్కటి బౌండరీలు కొట్టిన అతను 51 బంతుల్లో (7 ఫోర్లతో) అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా సాధారణంగానే ఆడిన అతను శతకం మార్క్‌ను అందుకునేందుకు మరో 41 (4 ఫోర్లు, 1 సిక్స్) బంతులు తీసుకున్నాడు. అతని కెరీర్లో ఇది మూడో సెంచరీ. ఆ తర్వాత అసలు దూకుడు మొదలైంది. డబుల్ సెంచరీ చేరేందుకు ఫఖర్‌కు 56 బంతులు మాత్రమే అవసరమయ్యాయి. సెంచరీ నుంచి డబుల్ సెంచరీ మధ్యలో 13 ఫోర్లు, 4 సిక్సర్లు బాది 78 పరుగులు బౌండరీల ద్వారానే రాబట్టాడు. ముజరబాని వేసిన 47వ ఓవర్ ఐదో బంతిని కవర్స్ దిశగా బౌండరీకి తరలించడంతో జమాన్ ద్విశతకం పూర్తయింది. ►మ్యాచ్‌కు ముందు కోచ్ మికీ ఆర్థర్ మనం టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకుందాం. ఈసారి డబుల్ సెంచరీ కోసం నువ్వు ప్రయత్నించు అని చెప్పారు. అదే పట్టుదలతో ఆడా. అది నిజం కావడం చాలా సంతోషంగా ఉంది.– ఫఖర్ జమాన్ ►6 వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ఆరో ఆటగాడు ఫఖర్ జమాన్. ఓవరాల్‌గా ఇది ఎనిమిదో డబుల్ సెంచరీ. రోహిత్ శర్మ ఒక్కడే మూడు సాధించాడు. ►1 వన్డేల్లో ఫఖర్, ఇమామ్ తొలి వికెట్‌కు 304 పరుగులు జత చేసి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పారు. 2006లో జయసూర్య–తరంగ కలిసి ఇంగ్లండ్‌పై జోడించిన 286 పరుగుల రికార్డును వీరు బద్దలు కొట్టారు. మొత్తంగా ఏ వికెట్‌కైనా 300కు పైగా పరుగులు జత చేసిన నాలుగో జోడి ఇది. ►1 పాక్ తరఫున ఫఖర్ (210ఏ) అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించాడు. 1997లో భారత్‌పై సయీద్ అన్వర్ చేసిన 194 పరుగుల రికార్డును అతను దాటాడు. ►1 పాకిస్తాన్‌కు వన్డేల్లో ఇదే అత్యధిక స్కోరు. 2010లో బంగ్లాదేశ్‌పై సాధించిన 385 పరుగుల స్కోరును ఆ జట్టు అధిగమించింది. ‘ఫఖర్’గా నిలిచిన సైనికుడు! కెరీర్లో ఆడింది 17 వన్డేలే! అయినా భారత క్రికెట్ అభిమానులు మాత్రం ఫఖర్ జమాన్‌ను అంత తొందరగా మర్చిపోలేరు. సంవత్సరం క్రితం చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో చెలరేగి కోహ్లి సేన టైటిల్ అవకాశాలు దెబ్బ తీసిన ఆటగాడిగానే మనకు గుర్తుండిపోయాడు. తన కెరీర్ నాలుగో మ్యాచ్‌లోనే చిరకాల ప్రత్యర్థిపై చేసిన సెంచరీ అతడిని ఒక్కసారిగా హీరోను చేసింది. ఎంతగా అంటే అతని స్వస్థలం కట్లాంగ్ పట్టణంలో ఒక చౌరస్తాకు పాత పేరు తొలగించి ‘ఫఖర్ జమాన్ చౌక్’గా అధికారికంగా ప్రభుత్వం మార్చేసింది. ఈ ఏడాది కాలంలో అతను తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ‘వన్ మ్యాచ్ వండర్’గా నిలిచిపోకుండా రెగ్యులర్ ఓపెనర్‌గా తన స్థానాన్ని పటిష్టం చేసుకున్నాడు. న్యూజిలాండ్ గడ్డపై పాకిస్తాన్ చిత్తుగా ఓడిన వన్డే సిరీస్‌లో ప్రతికూల పరిస్థితుల మధ్య జమాన్ చేసిన రెండు అర్ధ సెంచరీలు అతని ఆటలో ఉన్న నాణ్యతకు అద్దంపట్టాయి. పాక్ దిగ్గజం సయీద్ అన్వర్‌ను అభిమానించే, అతనిలాగే ఎడంచేతి వాటం ఓపెనింగ్ శైలి కలిగిన జమాన్... అదే అన్వర్ రికార్డును బద్దలు కొట్టడాన్ని గొప్పగా భావిస్తున్నాడు. 28 ఏళ్ల ఫఖర్‌ను జట్టు సహచరులు ‘సైనికుడు’ అని పిలుస్తారు. పూర్తి స్థాయిలో క్రికెటర్‌గా మారక ముందు జమాన్ పాకిస్తాన్ నేవీలో ఆరేళ్ల పాటు సెయిలర్‌గా పని చేశాడు. 2007లో ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ఏమాత్రం బాగా లేకపోవడంతో తప్పనిసరై అతను ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. అప్పటికే క్రికెట్‌పై ఆసక్తి ఉన్న ఫఖర్ ప్రతిభను గుర్తించి పాకిస్తాన్ నేవల్ క్రికెట్ అకాడమీ కోచ్ అతడిని తమ జట్టులోకి తీసుకున్నాడు. అక్కడే జమాన్ ఆట మరింత మెరుగు పడింది. వేర్వేరు దేశాల సైనికులకు సంబంధించి వరల్డ్ కప్‌లాంటి ‘ఇంటర్నేషనల్ డిఫెన్స్ క్రికెట్ చాలెంజ్ టోర్నీ’ 2012లో పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించిన ఈ క్రికెటర్ తమ జట్టును విజేతగా నిలపడంతో కీలక పాత్ర పోషించాడు. 2013లో నేవీని వదిలి రెగ్యులర్ క్రికెట్ బరిలోకి దిగడంతో ఫఖర్ దశ తిరిగింది. దేశవాళీ క్రికెట్లో వరుసగా నాలుగేళ్ల పాటు నిలకడగా రాణించడంతో పాటు పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో మెరుపు ప్రదర్శన అతనికి జాతీయ టి20 జట్టులో చోటు కల్పించింది. ఆ తర్వాత వన్డేల్లోనూ సత్తా చాటడంతో రెండు ఫార్మాట్లలోనూ అతను వెనుదిరిగి చూడాల్సిన పని లేకపోయింది. ఇదే పర్యటనలో ఆస్ట్రేలియాపై టి20 మ్యాచ్‌లో 46 బంతుల్లో చేసిన 91 పరుగులు పొట్టి ఫార్మాట్లో కూడా ఫఖర్ ఆట పదును చూపించాయి. ఉర్దూలో ఫఖర్ అనే పదానికి గర్వకారణం అని అర్థం. ఇప్పుడు ఒక్క పాకిస్తాన్‌లోనే కాకుండా క్రికెట్ ప్రపంచం మొత్తంలో కూడా సార్థక నామధేయుడిగా అతను కనిపిస్తున్నాడు. – సాక్షి క్రీడావిభాగం -
మహిళా క్రికెట్లో అ‘ద్వితీయ’ శతకం
డబ్లిన్: మహిళా క్రికెట్లో మరో సంచలనం నమోదయింది. ఐర్లాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్ క్రీడాకారిణులు రికార్డుల మోత మోగిస్తున్నారు. తొలి వన్డేలో 490 పరుగులు సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పగా, తాజాగా నామమాత్రమైన మూడో వన్డేలో అమిలియా కెర్ డబుల్ సెంచరీ(232; 145 బంతుల్లో 31 ఫోర్లు, 2 సిక్సర్లు) సాధించటంతో పలు రికార్డులు తిరగరాశారు. మహిళా క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించడంతో పాటు, అతి చిన్న వయసులోనే(17 సంవత్సరాల 243 రోజులు) ఈ రికార్డు సాధించిన ప్లేయర్‌గా సంచలనం సృష్టించారు. కాగా ఇప్పటివరకు మహిళా క్రికెట్లో ఇది రెండో ద్విశతకం మాత్రమే, మొదటి డబుల్ సెంచరీ ఆస్ట్రేలియా క్రీడాకారిణి బెలిందా క్లార్క్(229) సాధించారు. ఇక ఓవరాల్‌గా అంతర్జాతీయ వన్డే చరిత్రలో డబుల్ సెంచరీ సాధించిన ఏడో వ్యక్తిగా (రోహిత్ శర్మ మూడు డబుల్ సెంచరీలు సాధించాడు) అమిలియా కెర్ ఈ ఘనత సాధించారు. -
తొలి ఆసియా క్రికెటర్‌గా..
నాగ్‌పూర్: వయసు మీద పడుతున్నా క్రికెట్లో విశేషంగా రాణిస్తూ రికార్డులు మోత మోగిస్తున్నాడు టీమిండియా వెటరన్ క్రికెటర్ వసీం జాఫర్. ఇరానీ కప్‌లో భాగంగా రెస్టాఫ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో విదర్భ ఆటగాడు జాఫర్ డబుల్ సెంచరీ సాధించాడు. తద్వారా క్రికెట్ చరిత్రలో 40 ఏళ్ల వయసులో డబుల్ సెంచరీ చేసిన ఐదో భారత ఆటగాడిగా జాఫర్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అదే సమయంలో లేటు వయసులో 250కి పైగా పరుగులు సాధించిన తొలి ఆసియా క్రికెటర్‌గా జాఫర్ గుర్తింపు సాధించాడు. బుధవారం తొలి రోజు ఆటలో 53 సెంచరీ సాధించిన జాఫర్.. దాన్ని ఈరోజు డబుల్ సెంచరీగా మలుచుకున్నాడు. -
ప్రపంచ రికార్డుకు 8 ఏళ్లు.
-
ఆ ప్రపంచ రికార్డుకు 8 ఏళ్లు.!
సాక్షి, స్పోర్ట్స్ : సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం ఇదే రోజు క్రికెట్ చరిత్రలో ఓ రికార్డు నమోదైంది. అప్పటి వరకు కనీసం ఎవరి ఊహకందని ఫీట్ సుసాధ్యమైంది. ఆ ఒక్క రికార్డు క్రికెట్ స్వరూపాన్నే మార్చేసింది. పలు ప్రపంచ రికార్డులు నమోదు చేసిన క్రికెట్ గాడ్, భారత దిగ్గజం సచిన్ టెండూల్కరే ఈ రికార్డును సైతం నమోదు చేశాడు. అదే ప్రపంచ క్రికెట్లో నమోదైన తొలి డబుల్ సెంచరీ.. 2010 ఫిబ్రవరి 24న ఇండోర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో సచిన్ డబుల్ సెంచరీ సాధించి ఈ ఘనతను సొంతం చేసుకున్న తొలి బ్యాట్స్‌మన్‌గా చరిత్రకెక్కాడు. ఎవరికీ సాధ్యం కాని ఫీట్‌ను సాధించి క్రికెట్లో ఓ కొత్త అధ్యాయానికి తెరలేపాడు. ఈ మ్యాచ్‌లో 147 బంతులను ఎదుర్కొన్న సచిన్ 25 ఫోర్లు, 3 సిక్స్‌ర్లతో 200 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో భారత్ వన్డేల్లో రెండో అత్యధిక స్కోర్ 401 పరుగులు నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్ 153 పరుగుల తేడాతో సఫారీలపై ఘనవిజయం సాధించింది. తొలుత నెమ్మదిగా ఆడిన సచిన్ 90 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ వేగం పెంచి కేవలం 57 బంతుల్లోనే మరో వంద పరుగులు బాదాడు. ఇక 25 ఫోర్ల ద్వారానే 100 పరుగులు రాబట్టడం విశేషం. అప్పటికి వన్డేల్లో ఈ 200 పరుగు అత్యధికం కాగా.. మరో ఏడాదికి డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(219) పరుగులతో డబుల్ సాధించి గురువుకు మించిన శిష్యుడని పించుకున్నాడు. ఇక అనంతరం టీమిండియా మరో ఓపెనర్ రోహిత్ శర్మ ఏకంగా మూడు సార్లు ఈ ఘనత సాధించి డబుల్ సెంచరీలు చేయడం సులవని నిరూపించిన విషయం తెలిసిందే. గేల్ డబుల్ సైతం ఇదే రోజు.! కాకతాళీయమో ఏమో కానీ వెస్డిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్ సైతం డబుల్ సెంచరీ ఇదే రోజు నమోదు చేయడం విశేషం. 2015 ప్రపంచకప్‌లో ఫిబ్రవరి 24న జింబాబ్వేతో కాన్ బెర్రాలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో గేల్ 10 ఫోర్లు, 16 సిక్స్‌లతో 215 పరుగుల చేసి అవుటయ్యాడు. -
అందులోను రోహిత్ శర్మనే టాప్!
శ్రీలంకతో వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పెద్ద దెబ్బ. అనుకోని విధంగా తొలి వన్డే మ్యాచ్‌లో ఘోర పరాజయం. అంతే రోహిత్‌పై వచ్చిన కామెంట్లు అన్నీ ఇన్నీ కాదు. కెప్టెన్‌గా పనికిరాడని కొందరు, ఇదేమైనా ముంబై ఇండియన్స్ టీం అనుకున్నావా అంటూ రోహిత్‌పై సటైర్లూ పడ్డాయి. అయినా రోహిత్ నోరు మెదపలేదు. డిసెంబర్ 13 రెండో వన్డే రోజు రానే వచ్చింది. మొదటి వన్డేలో ఓడిపోయామే అన్న పగనో, కామెంట్లు ఎదుర్కోవాల్సి వచ్చిందనే కోపమో తెలీదు కానీ రోహిత్ రెచ్చిపోయాడు. ఆకాశమే హద్దు అన్నట్లుగా డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు. ఇప్పటి వరకూ ఎవరకీ సాధ్యం కానీ, తన పేరు మీదే ఉన్న డబుల్ సెంచరీల రికార్దును తిరగరాశాడు. అయితే రోహిత్ డబుల్ సెంచరీని పొగుడ్తూ ఐసీసీ సోషల్‌మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. అంతే రోహిత్‌ను అభినందిస్తూ 17 రోజుల్లో ఆపోస్టుకు దాదాపు 2లక్షల98 వేల లైకులు వచ్చాయి. 2017లో ఐసీసీ పెట్టిన పోస్టులన్నింటిలోకి రోహిత్ పోస్టుకే ఎక్కువ లైకులు వచ్చాయి. A historic third ODI double century from @ImRo45 was the most liked moment of 2017 on ICC instagram with over 298,000 likes! ❤️ Make sure you follow for all of the best photos from the world of cricket! 🏏 ➡️ https://t.co/GI2Z1V2WRP pic.twitter.com/BAfYjV4N7R — ICC (@ICC) December 31, 2017 -
డబుల్ సెంచరీలు ఎలా చేయాలో చెప్పు..!
న్యూఢిల్లీ : బాలీవుడ్ నటి అనుష్కను పెళ్లి చేసుకున్న భారత క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కొహ్లీకి వైఎస్ కెప్టెన్ రోహిత్ శర్మ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు చెప్పిన విషయం తెలిసిందే. ‘పెళ్లి టిప్స్ హ్యాండ్‌బుక్‌ను నీకు అందజేస్తాను’ అనేది ఆ ట్వీట్ సారాంశం. అంతేకాదు ఇంటిపేరును మార్చుకోవద్దని అనుష్కకు సలహా కూడా ఇచ్చారు రోహిత్. తాజాగా కొహ్లీ.. రోహిత్ ట్వీట్‌పై స్పందించారు. పెళ్లి టిప్స్ హ్యాండ్ బుక్‌తో పాటు డబుల్ సెంచరీల హ్యాండ్ బుక్‌ను కూడా ఇవ్వాలని కోరారు. శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో రోహిత్ మరోమారు డబుల్ సెంచరీ బాదిన విషయం తెలిసిందే. Congratulations you two! @imVkohli , I’ll share the husband handbook with you. @AnushkaSharma , keep the surname 😏 — Rohit Sharma (@ImRo45) December 12, 2017 Haha thanks Rohit, and please do share the Double Hundred Handbook as well. 😀 — Virat Kohli (@imVkohli) December 19, 2017 -
‘రోహిత్ శర్మ ఫొటోతో 200 నోట్లు’
మొహాలి: వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘హిట్‌మాన్’ను పొడుగుతూ అభిమానులు, ప్రముఖులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. రోహిత్ శర్మ గౌరవార్థం అతడి ఫొటోతో భారత ప్రభుత్వం 200 రూపాయల నోట్లు ముద్రించాలని ఓ అభిమాని సలహాయిచ్చాడు. విరాట్ కోహ్లి, అనుష్క శర్మ పిల్లల పెళ్లి నాటికి కూడా రోహిత్ శర్మ మూడో డబుల్ సెంచరీ గురించి క్రికెట్ అభిమానులు మాట్లాడుకుంటారని వీరాభిమాని ఒకరు చమత్కరించారు. పెళ్లిరోజున భార్య రితికకు రోహిత్ మర్చిపోలేని బహుమతి ఇచ్చాడని మరికొంత మంది మెచ్చుకున్నారు. మంచినీళ్లు తాగినంత సులువుగా ద్విశతకాలు బాదేస్తున్నాడని సంబరపడిపోయారు. నిలబడి అతడికి సెల్యూట్ చేయాలని మరికొందరు సూచించారు. రోహిత్ ఈ రోజు ఆడిన ఆట చాలా గొప్పగా ఉందని పలువురు క్రికెటర్లు ప్రశంసించారు. 110 బంతుల్లో సెంచరీ చేసిన రోహిత్.. తర్వాతి వంద పరుగులను కేవలం 35 బంతుల్లో పూర్తి చేయడం అద్భుతమని వీరేంద్ర సెహ్వాగ్ కొనియాడు. రోహిత్ బ్యాటింగ్ చూడటానికి ఎల్లప్పుడూ ఆసక్తి చూపిస్తానని సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. అమితాబ్ బచ్చన్, సౌరవ్ గంగూలీ తదితరులు రోహిత్‌ను ప్రశంసించారు. కాగా, మొహాలి వన్డేలో డబుల్ సెంచరీ సాధించిన వెంటనే రోహిత్ శర్మ పేరు ట్విటర్లో ట్రెండింగ్‌గా మారింది. అతడిని అభినందిస్తూ ట్వీట్లు పోటెత్తాయి. -
లక్మల్‌పై కసితీర్చుకున్న రోహిత్.!
మొహాలీ: భారత్-శ్రీలంక మధ్య జరిగిన రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ శ్రీలంక బౌలర్ లక్మల్‌పై కసి తీర్చుకున్నాడు. తొలి వన్డేల్లో 4 వికెట్లతో భారత ఘోర పరాభావాన్ని శాసించిన లక్మల్‌కు ఈ మ్యాచ్‌లో రోహిత్ తన బ్యాట్‌తో బదులిచ్చాడు. ధర్మశాల మ్యాచ్‌లో లక్మల్ రోహిత్(2)ను పెవిలియన్‌కు పంపించిన విషయం తెలిసిందే. రోహిత్ ఆడిన వరుస 9 బంతుల్లో 7 సిక్సులు బాది రికార్డు నమోదు చేశాడు. రెండో వన్డేల్లో లక్మల్ వేసిన 43 ఓవర్లో రోహిత్ వరుస సిక్సులతో విరుచుకుపడ్డాడు. నాలుగు బంతుల్లో నాలుగు సిక్సులు బాది లక్మల్‌కు ముచ్చెమటలు పట్టించాడు. లక్మల్ వేసిన ఓ వైడ్‌ను కలుపుకొని ఈ ఓవర్లో భారత్‌కు 26 పరుగులు జమయ్యాయి. ఇక అనంతరం ప్రదీప్ బౌలింగ్‌లో మరో మూడు బంతులు ఎదుర్కొన్న రోహిత్ మరో రెండు సిక్సులు, పెరీరా బౌలింగ్‌లో మరో సిక్స్ బాదాడు. దీంతో రోహిత్ వరుస 9 బంతుల్లో 7 సిక్సులు బాదినట్లైంది. రోహిత్ ‘డబుల్’ రికార్డులు ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలు సాధించిన రోహిత్.. తాజా డబుల్‌తో వన్డే చరిత్రలో మూడు డబుల్ సెంచరీలు బాదిన తొలి క్రికెటర్‌గా రికార్డు నమోదు చేశాడు. ఇక వన్డే చరిత్రలో మెత్తం 7 డబుల్ సెంచరీలు నమోదు కాగా రోహిత్‌వే 3 డబుల్ సెంచరీలు కావడం విశేషం. రోహిత్ తొలి డబుల్(209) సెంచరీ 2013లో ఆస్ట్రేలియాపై చిన్నస్వామి స్టేడియంలో నమోదు చేశాడు. ఇక ఇదే శ్రీలంకపై రెండో డబుల్ సెంచరీ(264)ను 2014లో ఈడెన్ గార్డెన్స్‌లో సాధించాడు. మిగతా నాలుగు డబుల్ సెంచరీలు సచిన్ టెండూల్కర్(200) , సెహ్వాగ్(219), క్రిస్‌గేల్ (215) మార్టిన్గప్టిల్ (237)ల పేరిట ఉన్నాయి. ♦ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో కెప్టెన్‌గా రికార్డు నమోదు చేశాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు సెహ్వాగ్(219) పేరిట ఉంది. 2011 డిసెంబర్ 8న ఇండోర్ వేదికగా వెస్టిండీస్‌పై సెహ్వాగ్ డబుల్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌కు సెహ్వాగ్ కెప్టెన్సీ వహించడంతో ఈ రికార్డు తన సొంతమైంది. ♦ శ్రీలంకపై అత్యధిక పరుగుల చేసిన తొలి కెప్టెన్‌గా గుర్తింపు పొందాడు. -
రో’హిట్’ డబుల్ సెంచరీ
-
రోహిత్ డబుల్ సెంచరీ.. లంకకు భారీ లక్ష్యం
మొహాలీ: భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో వన్డేల్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డు డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. దీంతో లంకకు 393 పరుగుల భారీ లక్ష్యం నిర్ధేశించారు. భారత్ 50 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 392 పరుగులు చేసింది. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ(208 నాటౌట్), ధావన్(68)లు మంచి శుభారంభాన్ని అందించారు. 10 ఓవర్లలోపు నెమ్మదిగా ఆడిన ఈ జోడి అనంతరం చెలరేగింది. ఈ దశలో ధావన్ కెరీర్లో 35వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. జట్టు స్కోరు 115 పరుగుల వద్ద ధావన్ క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌తో రోహిత్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. తొలి మ్యాచ్‌లో దారుణంగా విఫలమై కెప్టెన్‌గా చెత్త రికార్డు మూటగట్టుకున్న రోహిత్ అంతకంతకు లంక బౌలర్లపై బదులు తీర్చుకున్నాడు. 110 బంతుల్లో రోహిత్ 8 ఫోర్లు ఒక సిక్సుతో కెరీర్లో 16వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం శ్రేయస్ అయ్యర్ 50 బంతుల్లో 5 ఫోర్లతో కెరీర్ తొలి అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం చెలరేగిన ఈ ఇద్దరు స్కోరు బోర్డును పరుగెత్తించారు. రోహిత్ డబుల్ సెంచరీ.. అరంగేట్ర మ్యాచ్ అనుభవంతో తొలుత ఆచితూచి ఆడిన అయ్యర్ హాఫ్ సెంచరీ అనంతరం తన ఐపీఎల్ అనుభవాన్ని ప్రదర్శించాడు. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకపడుతూ లంక బౌలర్లను ఓ ఆట ఆడాడు. వేగంగా ఆడుతూ తన అసలైన సత్తా ఎంటో నిరూపించుకున్నాడు. మరోవైపు రోహిత్ కూడా సెంచరీ అనంతరం చెలరేగి ఆడాడు. లక్మల్ వేసిన 43వ ఓవర్లో ఏకంగా 4 సిక్సులతో విరుచుకుపడ్డాడు. దీంతో 18 బంతుల్లోనే మరో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ దశలో శ్రేయస్ అయ్యర్ (88) భారీ షాట్‌కు ప్రయత్నించి శతకాన్ని చేజార్చుకున్నాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన ధోని(7) ఓ సిక్సు కొట్టి అవుటయ్యాడు. ఇక చివర్లో రోహిత్ 151 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. ఈ విధ్వంసానికి లంక బౌలర్లు పరుగులివ్వడంలో పొటీ పడ్డారు. తొలి మ్యాచ్‌లో విజృంభించిన లక్మల్(71), ప్రదీప్‌లు(103) పరుగులు సమర్పించుకున్నారు. చివరి బంతికి పాండ్యా(8) క్యాచ్ అవుటయ్యాడు. లంక బౌలర్లలో పెరీరాకు మూడు సచిత్ పతిరాణకు ఓ వికెట్ దక్కింది. గర్జించిన భారత బ్యాట్స్‌మెన్ -
ఆ విధ్వంసానికి ఆరేళ్లు పూర్తి..!
సాక్షి, హైదరాబాద్: ఆరేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. సిక్సర్లు, ఫోర్లతో బౌలర్లపై విరుచుకుపడుతూ.. వన్డే కెరీర్లో తొలి డబుల్ సెంచరీతో పాటు ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. అంతకు ముందు తన గురువు సచిన్ పేరిటి ఉన్న ఈ రికార్డును అధిగమించాడు. వన్డే చరిత్రలో రెండో డబుల్ సెంచరీ సాధించిన రెండో బ్యాట్స్‌మనే కాకుండా.. అప్పటికి వన్డే క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. తరువాత ఈ రికార్డును భారత ఆటగాడు రోహిత్ శర్మ(264) అధిగమించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 8, 2011లో ఇండోర్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో వన్డేలో సెహ్వాగ్ 149 బంతుల్లో ఏకంగా 25 ఫోర్లు, 7 సిక్సులతో 219 పరుగులు చేశాడు. దీంతో భారత్ 418 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్ విండీస్‌పై 153 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వన్డేల్లో భారత్ జట్టు నమోదు చేసిన అత్యధిక పరుగులు (418) కూడా ఇవే కావడం విశేషం. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు కలిగిన క్రికెటర్ల జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్ మూడో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ(264), గప్టిల్(237) అతడికంటే ముందున్నారు. -
కోహ్లి కదం తొక్కగా...
విరాట్ కోహ్లి ఎప్పటిలాగే తనకు అలవాటైన రీతిలో మళ్లీ పరుగుల వరద పారించాడు. టెస్టుల్లో బ్యాటింగ్ చేయడం ఇంత సులువా అన్నట్లుగా చూడచక్కటి షాట్లతో మురిపించాడు. గత మ్యాచ్ సెంచరీ జోరును కొనసాగిస్తూ ఈసారి ‘డబుల్’తో అదరగొట్టగా... నేనూ టెస్టు ఆడగలనంటూ మరోవైపు నుంచి రోహిత్ శర్మ శతకంతో అండగా నిలిచాడు. మూడో రోజు వీరిద్దరి దెబ్బకు లంక కుదేలైంది. గతి తప్పిన బౌలింగ్, పేలవ ఫీల్డింగ్, మైదానంలో ఆటగాళ్లలో అలసట, అసహనం... వెరసి శ్రీలంక ఓటమిని ఆహ్వానిస్తోంది. గత మ్యాచ్‌లో భారత్‌ను దెబ్బ తీసిన ఇద్దరు పేసర్లు ఈ సారి మన బ్యాటింగ్ జోరుకు పరుగులు ఇవ్వడంలో సెంచరీ దాటగా... కోహ్లితో పోటీ పడిన దిల్రువాన్ పెరీరా ఏకంగా డబుల్ సెంచరీ చేసేశాడు. 405 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఇప్పటికే మ్యాచ్‌ను గుప్పిట బిగించిన టీమిండియా... నాలుగో రోజే నాగ్‌పూర్‌లో ఆట ముగించే అవకాశం ఉంది. నాగ్‌పూర్: తొలి టెస్టులో దురదృష్టవశాత్తూ తమ చేజారిన విజయాన్ని ఈసారి భారత్ ఒడిసి పట్టుకునే ప్రయత్నంలో ఉంది. ఇక్కడి జామ్తా మైదానంలో జరుగుతున్న రెండో టెస్టులో కోహ్లి సేన భారీ గెలుపుపై కన్నేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో 405 పరుగులు వెనుకబడిన శ్రీలంక మ్యాచ్ మూడో రోజు ఆదివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ కోల్పోయి 21 పరుగులు చేసింది. ఆ జట్టు మరో 384 పరుగులు వెనుకబడి ఉంది. శ్రీలంక ఫామ్, భారత బౌలర్ల జోరు చూస్తే ఆ జట్టు నాలుగో రోజంతా నిలబడటం కూడా కష్టంగా కనిపిస్తోంది. అంతకుముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 6 వికెట్ల నష్టానికి 610 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. విరాట్ కోహ్లి (267 బంతుల్లో 213; 17 ఫోర్లు, 2 సిక్సర్లు) కెరీర్లో ఐదో డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఇది అతని కెరీర్లో 19వ శతకం కావడం విశేషం. కోహ్లితో పాటు రోహిత్ శర్మ (160 బంతుల్లో 102 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) టెస్టుల్లో మూడో సెంచరీ సాధించడంతో భారత్ భారీ స్కోరు చేయగలిగింది. వీరిద్దరు ఐదో వికెట్‌కు 173 పరుగులు జోడించడం విశేషం. మొత్తంగా మూడో రోజు 78.1 ఓవర్లు ఆడిన భారత్ 298 పరుగులు సాధించింది. లంక బౌలర్లలో దిల్రువాన్ పెరీరాకు 3 వికెట్లు దక్కాయి. కొనసాగిన జోరు... మూడో రోజు ఆరంభంలోనే భారత్ ఆట జట్టు ఉద్దేశాన్ని స్పష్టం చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 312/2తో ఆదివారం బరిలోకి దిగిన భారత్ రోజంతా లంకపై తమ ఆధిపత్యం ప్రదర్శించింది. పుజారా తనదైన శైలిలో ఆడుతూ తొలి పరుగు కోసం 23 బంతులు తీసుకోగా... కోహ్లి మాత్రం లక్మల్ ఓవర్లో రెండు బౌండరీలు బాది దూకుడుకు శ్రీకారం చుట్టాడు. ఈ క్రమంలోనే లక్మల్ బౌలింగ్‌లో లెగ్‌సైడ్ దిశగా సింగిల్ తీసి విరాట్ 130 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే లంచ్‌కు కాస్త ముందు షనక వేసిన యార్కర్‌కు పుజారా (362 బంతుల్లో 143; 14 ఫోర్లు) బౌల్డ్ కావడంతో 183 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. 29 ఓవర్ల తొలి సెషన్లో భారత్ 92 పరుగులు జోడించింది. అయితే విరామం తర్వాత వెంటనే రహానే (2) వికెట్ తీయడంలో లంక సఫలమైంది. ఇద్దరూ పోటీగా... కోహ్లి, రోహిత్ జోడి జత కలిసిన తర్వాత భారత్ స్కోరు వేగం మరింత పెరిగింది. వీరిద్దరు వన్డే శైలిలో ఒకరితో మరొకరు పోటీ పడుతూ పరుగులు సాధించారు. 13 నెలల విరామం తర్వాత టెస్టు మ్యాచ్ బరిలోకి దిగిన రోహిత్ తనకు దక్కిన అవకాశాన్ని సమర్థంగా ఉపయోగించుకున్నాడు. పెరీరా బౌలిం గ్లో ముందుకొచ్చి లాంగాన్ మీదుగా సిక్సర్ బాదడంతో 193 బంతుల్లోనే కోహ్లి 150 పరుగులు పూర్తయ్యాయి. మరోవైపు హెరాత్ బౌలింగ్‌లో బౌండరీలతో చెలరేగిన రోహిత్ 98 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. టీ విరామం ముగిసిన తర్వాత కాసేపటికి పెరీరా బౌలింగ్‌లో సిక్సర్‌తో 195కు చేరిన కోహ్లి, అతని తర్వాతి ఓవర్లో లాంగాన్ దిశగా సింగిల్ తీసి డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. చివరకు పెరీరా బౌలింగ్‌లోనే కోహ్లి అవుట్ కాగా...అశ్విన్ (5) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. అయితే మరో ఎండ్‌లో వేగం పెంచిన రోహిత్ షనక బౌలింగ్‌లో మూడు పరుగులు తీసి సెంచరీని అందుకున్నాడు. దాంతో భారత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఇషాంత్ దెబ్బకు... రెండు రోజుల పాటు ఫీల్డింగ్ చేసిన తర్వాత తీవ్రంగా అలసిన లంకకు రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే షాక్ తగిలింది. ఇషాంత్ వేసిన రెండో బంతిని ఆడకుండా వదిలేసి సమరవిక్రమ (0) క్లీన్‌బౌల్డయ్యాడు. అయితే కరుణరత్నే, తిరిమన్నె మిగిలిన 8.4 ఓవర్లను జాగ్రత్తగా ఆడి మరో ప్రమాదం లేకుండా రోజును ముగించారు. స్కోరు వివరాలు శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 205; భారత్ తొలి ఇన్నింగ్స్: రాహుల్ (బి) గమగే 7; విజయ్ (సి) పెరీరా (బి) హెరాత్ 128; పుజారా (బి) షనక 143; కోహ్లి (సి) తిరిమన్నె (బి) పెరీరా 213; రహానే (సి) కరుణరత్నే (బి) పెరీరా 2; రోహిత్ (నాటౌట్) 102; అశ్విన్ (బి) పెరీరా 5; సాహా (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (176.1 ఓవర్లలో 6 వికెట్లకు డిక్లేర్డ్) 610. వికెట్ల పతనం: 1–7; 2–216; 3–399; 4–410; 5–583; 6–597. బౌలింగ్: లక్మల్ 29–2–111–0; గమగే 35–8–97–1; హెరాత్ 39–11–81–1; షనక 26.1–4–103–1; పెరీరా 45–2–202–3; కరుణరత్నే 2–0–8–0. శ్రీలంక రెండో ఇన్నింగ్స్: సమరవిక్రమ (బి) ఇషాంత్ 0; కరుణరత్నే (బ్యాటింగ్) 11; తిరిమన్నే (బ్యాటింగ్) 9; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (9 ఓవర్లలో వికెట్ నష్టానికి) 21. వికెట్ల పతనం: 1–0. బౌలింగ్: ఇషాంత్ 4–1–15–1; అశ్విన్ 4–3–5–0; జడేజా 1–1–0–0. 3 రోహిత్ శర్మ కెరీర్లో (22వ టెస్టు) ఇది మూడో సెంచరీ. 2013లో తన తొలి రెండు టెస్టుల్లోనే రెండు శతకాలు బాదిన రోహిత్... నాలుగేళ్ల తర్వాత ఈ సెంచరీ చేయడానికి ముందు మిగిలిన 19 టెస్టుల్లో 7 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. వీర విరాట్... విరాట్ కోహ్లి సెంచరీల మోత మోగించడం కొత్త కాదు. ప్రతీ మ్యాచ్‌కు ఒక్కో కొత్త రికార్డు తన ఖాతాలో వేసుకోవడం కూడా కొత్త కాదు. అదే జోరు, అదే శైలి, షాట్లు ఆడేటప్పుడు ఎక్కడ లేని ఆత్మవిశ్వాసం, సాధికారత... తనకు మాత్రమే సాధ్యం అనిపించేలా సాగుతున్న ఆట. కోల్‌కతా టెస్టులో సహచరుల అండ కరువైన కఠిన పరిస్థితుల్లో సెంచరీ చేయగలిగిన అతను... 216/2 స్కోరుతో అప్పటికే ఆధిక్యం కూడా లభించేసి అంతా బాగున్న స్థితిలో బరిలోకి దిగి స్కోరు చేయకుంటే ఆశ్చర్యపడాలి కానీ ఈ తరహాలో పరుగుల వరద పారించడం అనూహ్యం ఏమీ కాదు! అయితే ఇక్కడ కూడా అతను తనదైన క్లాస్‌ను చూపించాడు. ఈ ఇన్నింగ్స్ కూడా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా, అప్పటికే కుంగిపోయిన లంకన్లను మరింత చావు దెబ్బ కొట్టేలా నిర్దాక్షిణ్యంగా సాగింది. చెత్త బంతులను బౌండరీకి తరలించడమే కాదు... ఫీల్డర్ల మధ్య ఖాళీలను సరిగ్గా అంచనా వేస్తూ డీప్‌లోకి కొట్టి సింగిల్స్, డబుల్స్ కూడా అతను చురుగ్గా తీస్తూ పోయాడు. పెరీరా బౌలింగ్‌లో 111 వద్ద వెనక్కి జరిగి మిడాఫ్ మీదుగా కొట్టిన ఫోర్, 188 వద్ద అతని బౌలింగ్‌లోనే ముందుకొచ్చి మిడ్ వికెట్ మీదుగా బాదిన బౌండరీ ఈ ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచాయి. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా దాదాపు 80 స్ట్రైక్‌రేట్‌తో సాగిన కోహ్లి ఇన్నింగ్స్ అతని ప్రత్యేకతను మరోసారి చూపించింది. కోహ్లి క్రీజ్‌లో ఉన్న సమయంలో మరో ఎండ్‌లో ఇతర బ్యాట్స్‌మెన్ ప్లస్ ఎక్స్‌ట్రాలు కలిపి చూస్తే 299 బంతుల్లో 51.51 స్ట్రైక్‌రేట్‌తో 154 పరుగులే వచ్చాయంటే కోహ్లి ఎంత దూకుడుగా ఆడాడో అర్థమవుతుంది. చివరకు నన్ను అవుట్ చేయడం మీ వల్ల ఏం అవుతుందిలే, నేనే వికెట్ ఇస్తాను అన్నట్లుగా బంతిని గాల్లోకి లేపి క్యాచ్ ఇస్తే గానీ కోహ్లిని ఆపడం లంక వల్ల కాలేదు. పరుగులు చేయడం మాత్రమే కాదు... అవి గెలుపు కోసం ఉపయోగపడాలన్నదే కోహ్లి మంత్రం. జట్టుకు దూకుడు నేర్పిన అతని నాయకత్వంలో భారత్ గత 27 టెస్టుల్లో 20 గెలవగలిగింది. వీటిలో 2201 పరుగులతో కెప్టెన్‌గా కోహ్లినే అగ్రస్థానంలో ఉన్నాడు. ఆశ్చర్యకరంగా అనిపించినా... దిగ్గజం సునీల్ గావస్కర్ 34 సెంచరీల్లో కేవలం 6 మాత్రమే జట్టుకు విజయానికి ఉపయోగపడ్డాయి! గత ఏడాది జులైకి ముందు విరాట్ కోహ్లి ఖాతాలో 11 సెంచరీలు ఉన్నాయి. ఒక్కసారి మాత్రమే 150 పరుగుల స్కోరు దాటగలిగాడు. కానీ వెస్టిండీస్‌తో నార్త్ సౌండ్‌లో జరిగిన టెస్టునుంచి కోహ్లి కొత్త రూపం కనిపించింది. అప్పటి నుంచి చేసిన 8 సెంచరీల్లో 5 డబుల్ సెంచరీలు ఉండటం కోహ్లి గొప్పతనం ఏమిటో చెబుతుంది. గత నాలుగు డబుల్ సెంచరీల్లో భారత్ గెలవగా... ఈసారి కూడా విజయానికి చేరువలో ఉంది. కెరీర్ ఆరంభంలో వివాదాస్పద ప్రవర్తనతో కోహ్లిని చాలా మంది ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్‌తో పోల్చారు. ఇప్పుడు జట్టును ముందుం డి నడిపించడంలో అతనికి పాంటింగ్‌తో పోలిక సరిగ్గా సరిపోతుంది. తమ కెప్టెన్సీ కెరీర్లో ఎక్కువ భాగం బ్రియాన్ లారాకు తన స్థాయి బ్యాట్స్‌మెన్ సహచరులు గానీ, సరైన బౌలింగ్ వనరులు గానీ లేకపోగా... సచిన్‌కు అద్భుతమైన బ్యాటింగ్ అండగా ఉన్నా, బౌలర్లు ఉపయోగపడలేకపోయారు. భవిష్యత్తు సంగతి చెప్పలేకపోయినా, ప్రస్తుతానికి కోహ్లికి మాత్రం ఈ రెండు వనరులు అందుబాటులో ఉండటంతో ఆటగాడిగా, కెప్టెన్‌గా కూడా కోహ్లి జైత్రయాత్ర కొనసాగుతోంది. రాబోయే దక్షిణాఫ్రికా సిరీస్‌లోనూ అతను ఇదే ఫామ్ కొనసాగిస్తే భారత్‌కు తిరుగుండదు. 10 టెస్టులు, వన్డేలు కలిపి కోహ్లి 2017లో సాధించిన సెంచరీలు. ఒకే ఏడాది అత్యధిక సెంచరీలు సాధించిన కెప్టెన్‌గా గతంలో పాంటింగ్ (9), గ్రేమ్ స్మిత్ (9) పేరిట ఉన్న రికార్డును అతను సవరించాడు. 12 కెప్టెన్‌గా టెస్టుల్లో కోహ్లి సెంచరీల సంఖ్య. గావస్కర్ (11)ను విరాట్ అధిగమించాడు. 5 కోహ్లి కెరీర్లో సాధించిన డబుల్ సెంచరీలు. భారత్ ఆటగాళ్ళలో సచిన్ (6), సెహ్వాగ్ (6) మాత్రమే అతనికంటే ముందున్నారు. ఓవరాల్‌గా కెప్టెన్ హోదాలో ఐదు డబుల్ సెంచరీలు చేసిన కోహ్లి, బ్రియాన్ లారా (5)తో సమంగా నిలిచాడు. 3 ఒకే ఇన్నింగ్స్‌లో నలుగురు భారత ఆటగాళ్లు సెంచరీలు చేయడం ఇది మూడో సారి. కోహ్లి ప్రతీ మ్యాచ్‌కు రాటుదేలుతున్నాడు. గావస్కర్, సచిన్‌ల తర్వాత ఈ తరంలో కోహ్లిదే ఆ స్థానం. విరాట్ ఆస్ట్రేలియా గడ్డపై వరుస సెంచరీలు సాధించాడు. దక్షిణాఫ్రికాలో కూడా శతకం నమోదు చేశాడు. ఇంగ్లండ్‌లో విఫలమైన సమయంలో అతను పాత కోహ్లి మాత్రమే. ఈసారి అక్కడ కూడా చెలరేగి తన పరుగుల దాహం తీర్చుకుంటాడని ఆశిస్తున్నా. – సౌరవ్ గంగూలీ, భారత మాజీ కెప్టెన్ -
ఈ రోజు రో'హిట్' స్పెషల్
న్యూఢిల్లీ: ఈ రోజు భారత క్రికెట్ అభిమానులకు చిరస్మరణీయమైనది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు వెరీ వెరీ స్పెషల్. సరిగ్గా మూడేళ్ల క్రితం శ్రీలంకపై రోహిత్ శర్మ ఆడిన సంచలన ఇన్నింగ్స్ గుర్తుండే ఉంటుంది. 2014, నవంబర్ 13వ తేదీన కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్ లో లంకేయులతో జరిగిన వన్డేలో రోహిత్ శర్మ రెచ్చిపోయాడు. తనదైన శైలిలో లంక బౌలింగ్ ఉతికి ఆరేసిన రోహిత్.. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సర్లతో 264 పరుగులు చేశాడు. దాదాపు 225 నిమిషాల పాటు క్రీజ్ లో ఉన్న రోహిత్ శర్మ బౌండరీలే లక్ష్యంగా చెలరేగిపోయాడు ఈ క్రమంలోనే వన్డేల్లో అత్యధిక స్కోరును నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు పుస్తకాల్లో నిలిచాడు. ఇదే ఇప్పటికీ వన్డేల్లోఅత్యధిక స్కోరు. ఆ మ్యాచ్ లో భారత జట్టు 153 పరుగుల తేడాతో లంకపై గెలిచింది. వన్డే ఫార్మాట్ లో రెండు సార్లు డబుల్ సెంచరీ చేసిన ఘనత రోహిత్ శర్మదే కావడం మరో విశేషం. 2013లో నవంబర్ 2వ తేదీన బెంగళూరులో ఆసీస్ తో జరిగిన వన్డేలో రోహిత్ శర్మ(209) తొలి డబుల్ సెంచరీ చేశాడు. ఆపై ఏడాది కాలంలోనే మరో డబుల్ సెంచరీ రోహిత్ ఖాతాలో చేరడం విశేషం. భారత్ తరపున వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ఆటగాళ్లలో రోహిత్ శర్మతో పాటు వీరేంద్ర సెహ్వాగ్(219), సచిన్ టెండూల్కర్(200 నాటౌట్)లు ఉన్నారు. -
మహిళా క్రికెట్ లో మరో సంచలనం
ఔరంగాబాద్:మహిళా క్రికెట్ మరో సంచలనం నమోదైంది. అండర్-19 వన్డే క్రికెట్ టోర్నమెంట్ లో 16 ఏళ్ల ముంబై క్రీడాకారిణి జెమిమాహ్ రోడ్రిగ్జ్ డబుల్ సెంచరీతో అదరగొట్టింది. తద్వారా అండర్-19 మహిళా వన్డే క్రికెట్ లో డబుల్ సెంచరీ చేసిన రెండో భారత క్రీడాకారిణిగా రోడ్రిగ్జ్ నిలిచింది. ఔరంగాబాద్ వేదికగా సౌరాష్ట్రతో జరిగిన 50 ఓవర్ల మ్యాచ్ లో ముంబై తరపున బరిలోకి దిగిన రోడ్రిగ్జ్ ద్విశతకాన్ని సాధించింది. 163 బంతుల్లో 202 పరుగులతో దుమ్ములేపింది. 52 బంతుల్లో 53 పరుగులు చేసి నెమ్మదిగా బ్యాటింగ్ కొనసాగించిన రోడ్రిగ్జ్.. 83 బంతుల్లో శతకం నమోదు చేసింది. ఆపై దూకుడుగా ఆడిన ఆమె డబుల్ సెంచరీ చేసి అజేయంగా నిలిచింది. ఫలితంగా మహిళా అండర్ -19 వన్డే క్రికెట్ లో డబుల్ సెంచరీ చేసిన రెండో భారత క్రీడాకారిణిగా రోడ్రిగ్జ్ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. గతంలో స్మృతి మందన 224 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. 2013లో జరిగిన మందన సాధించిన డబుల్ సెంచరీనే అండర్ 19లో తొలి ద్విశతకం. -
రికార్డు బ్రేక్ చేశాడు!
రాజ్‌కోట్: క్రికెటర్ చతేశ్వర్ పుజారా ఖాతాలో మరో రికార్డు చేరింది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అత్యధికంగా డబుల్ సెంచరీలు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా పుజారా రికార్డు నెలకొల్పాడు. జార్ఖండ్ జట్టుతో జరుగుతోన్న రంజీ మ్యాచ్‌లో గురువారం అతడు ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో పుజారా(204; 28 ఫోర్లు) డబుల్ సెంచరీ సాధించాడు. కెరీర్లో అతడికిది 12వ డబుల్ సెంచరీ. విజయ్ మర్చంట్ (11) పేరిట ఉన్న రికార్డును ఈ సౌరాష్ట్ర బ్యాట్స్‌మన్ బద్దలు కొట్టాడు. సునీల్ గవాస్కర్, విజయ్ హజారే, రాహుల్ ద్రవిడ్ తమ కెరీర్లో పదేసి డబుల్ సెంచరీలు సాధించారు. వీరిలో మూడు ట్రిఫుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్ పుజారానే కావడం విశేషం. అతడితో సమానంగా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మాత్రమే మూడు ట్రిఫుల్ సెంచరీలు బాదాడు. టెస్టు ఆటగాడిగా ముద్రపడిన పుజారా ఇప్పటివరకు 51 టెస్టులు ఆడి 48.32 సగటుతో 4,107 పరుగులు చేశాడు. ఇందులో 13 సెంచరీలు, 15 అర్ధసెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 206 పరుగులు. 5 వన్డేలు మాత్రమే ఆడి కేవలం 51 పరుగులు సాధించాడు. ఒక్క అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లోనూ అతడికి ఆడే ఛాన్స్ దక్కలేదు. ఇప్పటివరకు 158 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన పుజారా 41 సెంచరీలతో 12,538 పరుగులు చేశాడు. -
'ఎప్పటికైనా రోహిత్ రికార్డ్ నేనే బద్దలుకొడతా'
వన్డే క్రికెట్లో సెంచరీలకు, డబుల్ సెంచరీలకు, రికార్డులకు మారుపేరైన జట్టు టీమిండియా. ఇదివరకే వన్డే మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మలు అద్భుత ద్విశతకాలను సాధించారు. వీరితో పాటు డబుల్ సాధించిన మరో విధ్వంసక క్రికెటర్ మార్టిన్ గప్టిల్. అయితే అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును రోహిత్ (264 పరుగులు) తన పేరిట లిఖించుకున్నాడు. కానీ రోహిత్ పేరిట ఉన్న ఈ రికార్డును అధిగమిస్తానని చాలెంజ్ విసిరాడు న్యూజిలాండ్ క్రికెటర్ గప్టిల్. వన్డే మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగుల జాబితాలో రోహిత్ తర్వాతి స్థానం గప్టిల్ (237 పరుగులు)దేనన్న విషయం తెలిసిందే. 264 అంటేనే అసాధ్యమైన పని తనకు తెలుసునని అయితే ఏదో ఒకరోజు కచ్చితంగా తానే రోహిత్ రికార్డును బద్ధలుకొడతానని గప్టిల్ ధీమా వ్యక్తం చేశాడు. గతంలో 189, 180 పరుగుల భారీ ఇన్నింగ్స్‌లతో తాను డబుల్ సెంచరీలు చేజార్చుకున్నానని, అయితే 237 పరుగుల ఇన్నింగ్స్‌తో ఆ కోరిక నెరవేరిందన్నాడు గప్టిల్. అయితే రోహిత్ (264) రికార్డుపేనే తాను దృష్టి పెట్టానని, ఎప్పటికైనా ఆ అరుదైన ఫీట్‌ను అధిగమించి అద్భుత రికార్డును తన ఖాతాలో వేసుకోవాలని ఈ కివీస్ స్టార్ క్రికెటర్ ఉందన్నాడు. -
భరత్, సుమంత్ డబుల్ సెంచరీలు
కేఎస్‌సీఏ టోర్నీ ఫైనల్లో ఆంధ్ర జట్టు సాక్షి, విజయవాడ: కెప్టెన్ శ్రీకర్ భరత్, సుమంత్ డబుల్ సెంచరీలు సాధించడంతో... కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) ఆధ్వర్యంలో మైసూరులో జరుగుతోన్న తిమ్మ ప్పయ్య ఇన్విటేషన్ జాతీయ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. కేఎస్‌సీఏ ఎలెవన్‌తో శనివారం ముగిసిన ఈ మూడు రోజుల మ్యాచ్‌లో ఫలితాన్ని టాస్ ద్వారా నిర్ణయించారు. మ్యాచ్‌లో రెండు జట్ల తొలి ఇన్నింగ్స్ పూర్తి కాకపోవడంతో టోర్నీ నిబంధనల ప్రకారం విజేతను నిర్ణయించడానికి టాస్ నిర్వహించగా... ఇందులో ఆంధ్ర జట్టును విజయం వరించింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర జట్టు 191.3 ఓవర్లలో 6 వికెట్లకు 591 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. శ్రీకర్ భరత్ (492 బంతుల్లో 218; 26 ఫోర్లు, 2 సిక్స్‌లు), సుమంత్ (363 బంతుల్లో 202 నాటౌట్; 21 ఫోర్లు, ఒక సిక్స్) డబుల్ సెంచరీలతో కదంతొక్కారు. అనంతరం కేఎస్‌సీఏ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 310 పరుగులు చేయడంతో మ్యాచ్ ‘డ్రా’ అయింది. అభిషేక్ రెడ్డి (155 నాటౌట్; 16 ఫోర్లు), మయాంక్ అగర్వాల్ (100 నాటౌట్; 12 ఫోర్లు) సెంచరీలు సాధించారు. -
అమిత్ అజేయ డబుల్ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: ఎ–1 డివిజన్ మూడు రోజుల క్రికెట్ లీగ్‌లో ఏఓసీ జట్టు బ్యాట్స్‌మన్ అమిత్ పచేరా (354 బంతుల్లో 221 నాటౌట్; 27 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అజేయ డబుల్ సెంచరీతో చెలరేగి జట్టుకు భారీస్కోరును అందించాడు. దీంతో కేంబ్రిడ్జ్ ఎలెవన్ జట్టుతో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో ఏఓసీ జట్టు తొలి ఇన్నింగ్స్‌ను 122 ఓవర్లలో 8 వికెట్లకు 481 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అమిత్‌తో పాటు విష్ణు తివారీ (253 బంతుల్లో 148; 21 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో చెలరేగాడు. ప్రత్యర్థి బౌలర్లలో హర్మీత్ సింగ్ 5 వికెట్లతో ఆకట్టుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కేంబ్రిడ్జ్ ఎలెవన్ జట్టు తడబడింది. రెండోరోజు ఆటముగిసే సమయానికి 54 ఓవర్లలో 8 వికెట్లకు 158 పరుగులతో నిలిచింది. అనురాగ్ హరిదాస్ (42) రాణించాడు. ఏఓసీ బౌలర్లలో అభిషేక్ 3 వికెట్లు పడగొట్టాడు. ప్రణీత్, హిమాన్షు శతకాలు స్పోర్టింగ్ ఎలెవన్ జట్టుతో జరుగుతోన్న మరో మ్యాచ్‌లో ఇన్కమ్ ట్యాక్స్ జట్టు దీటుగా బదులిస్తోంది. బుధవారం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇన్కమ్ ట్యాక్స్ ఆటముగిసే సమయానికి 66 ఓవర్లలో 3 వికెట్లకు 298 పరుగులతో నిలిచింది. ప్రణీత్ కుమార్ (192 బంతుల్లో 141 బ్యాటింగ్; 16 ఫోర్లు, 4 సిక్సర్లు), హిమాన్షు జోషి (183 బంతుల్లో 126; 17 ఫోర్లు) సెంచరీలతో కదం తొక్కారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 358/6తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన స్పోర్టింగ్ ఎలెవన్ జట్టు 107.4 ఓవర్లలో 440 పరుగులకు ఆలౌటైంది. మొహమ్మద్ ఫైజల్ అల్వి (47) రాణించాడు. ఇన్కమ్ ట్యాక్స్ బౌలర్లలో హిమాన్షు జోషి 3 వికెట్లు దక్కించుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు డెక్కన్ క్రానికల్ తొలి ఇన్నింగ్స్: 285/3 (బి. రేవంత్ 57, వరుణ్ గౌడ్ 56 బ్యాటింగ్, సాయి ప్రజ్ఞయ్ రెడ్డి 119 బ్యాటింగ్), ఆంధ్రాబ్యాంక్‌తో మ్యాచ్. ఆర్. దయానంద్ తొలి ఇన్నింగ్స్: 260/9 (వై. చైతన్య కృష్ణ 46, కుషాల్ పర్వేజ్ జిల్లా 118; జి. అనికేత్ రెడ్డి 4/95, పి. సాకేత్ సాయిరామ్ 3/66), బీడీఎల్‌తో మ్యాచ్. జెమిని ఫ్రెండ్స్ తొలి ఇన్నింగ్స్: 283 (ఆకాశ్ సనా 5/53), కాంటినెంటల్ తొలి ఇన్నింగ్స్: 178 (సి. దుర్గేశ్ 65 నాటౌట్; సంకేత్ 3/75). ఎవర్గ్రీన్ తొలి ఇన్నింగ్స్: 179, హైదరాబాద్ బాట్లింగ్ తొలి ఇన్నింగ్స్: 134 (ఆశ్రిత్ 34, మధు 36; ప్రణీత్ రెడ్డి 6/36). ఇండియా సిమెంట్స్: 132 (హృషికేశ్ 37; బి. సుధాకర్ 5/53, షేక్ మహబూబ్ పాషా 3/ 21); ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ తొలి ఇన్నింగ్స్: 147/3 (ఎస్సీ మొహంతి 79, ఎం. సురేశ్ 61). -
రోహిత్ రాయుడు డబుల్ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: ఎ–1 డివిజన్ మూడు రోజుల క్రికెట్ లీగ్‌లో జై హనుమాన్ జట్టు బ్యాట్స్‌మన్ రోహిత్ రాయుడు (402 బంతుల్లో 207; 15 ఫోర్లు, 4 సిక్సర్లు) డబుల్ సెంచరీతో చెలరేగాడు. దీంతో స్పోర్టింగ్ ఎలెవన్‌తో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో జై హనుమాన్ జట్టు భారీస్కోరు సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 238/4తో రెండోరోజు బుధవారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన జై హనుమాన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 154 ఓవర్లలో 430 పరుగులు చేసింది. తొలిరోజు సెంచరీతో ఆకట్టుకున్న రోహిత్ రాయుడు రెండో రోజు ఆటలో దాన్ని డబుల్ సెంచరీగా మలిచి ఈ సీజన్లో తన జోరును కొనసాగిస్తున్నాడు. ప్రత్యర్థి బౌలర్లలో తనయ్ త్యాగరాజన్ 6 వికెట్లతో ఆకట్టుకున్నాడు. అనంతరం బరిలోకి దిగిన స్పోర్టింగ్ ఎలెవన్ జట్టు రెండోరోజు ఆట ముగిసే సమయానికి 28 ఓవర్లలో 2 వికెట్లకు 88 పరుగులతో నిలిచింది. తన్మయ్ అగర్వాల్ (30), తనయ్ త్యాగరాజన్ (30) క్రీజులో ఉన్నారు. కాంటినెంటల్ జట్టుతో జరుగుతోన్న మరో మ్యాచ్‌లో కేంబ్రిడ్జ్ జట్టు బ్యాట్స్‌మన్ మాన్సింగ్ రమేశ్ (290 బంతుల్లో 212 నాటౌట్; 21 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ ద్విశతకంతో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌ను కేంబ్రిడ్జ్ ఎలెవన్ జట్టు 100 ఓవర్లలో 434 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. జె. మల్లికార్జున్ (100 బంతుల్లో 107; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకంతో ఆకట్టుకోగా, సుజిత్ మనోహర్ (75) అర్ధసెంచరీ చేశాడు. తర్వాత కాంటినెంటల్ జట్టు ఆటముగిసే సమయానికి 2 ఓవర్లలో వికెట్ నష్టానికి 3 పరుగులతో ఉంది. ఇతర మ్యాచ్‌ల వివరాలు ఎస్బీఐ తొలి ఇన్నింగ్స్: 391/9 (బి. సుమంత్ 66, ఆకాశ్ భండారి 34; శ్రవణ్ 3/42, పుష్కర్ వల్లూరు 3/89), డెక్కన్ క్రానికల్ తొలి ఇన్నింగ్స్: 153 (సందీప్ రాజన్ 49; రవికిరణ్ 3/32, ఆకాశ్ భండారి (5/76), డెక్కన్ క్రానికల్ రెండో ఇన్నింగ్స్ (ఫాలోఆన్): 15/2 (10 ఓవర్లలో). ఆంధ్రాబ్యాంక్ తొలి ఇన్నింగ్స్: 196, బీడీఎల్ తొలి ఇన్నింగ్స్: 184 (చంద్రశేఖర్ 57, సాకేత్ సాయిరామ్ 38; రవితేజ 3/38), ఆంధ్రాబ్యాంక్ రెండో ఇన్నింగ్స్: 184/6 (ఆశిష్ రెడ్డి 55, అభినవ్ కుమార్ 36; సాకేత్ సాయిరామ్ 5/73), ఈఎంసీసీ తొలి ఇన్నింగ్స్: 318/5 (ఎన్. శరత్ ముదిరాజ్ 87, బెంజమిన్ 112, షేక్ సొహైల్ 63 బ్యాటింగ్), ఆర్. దయానంద్‌తో మ్యాచ్. పూల్ ‘బి’ మ్యాచ్‌ల వివరాలు ఏఓసీ తొలి ఇన్నింగ్స్: 232 హైదరాబాద్ బాట్లింగ్ తొలి ఇన్నింగ్స్: 216 (వినయ్ గౌడ్ 34, రవీందర్ రెడ్డి 77, ఎస్ పాండే 5/48), ఏఓసీ రెండో ఇన్నింగ్స్: 140/5 (శ్రీ చరణ్ 3/37); జెమిని ఫ్రెండ్స్ తొలి ఇన్నింగ్స్: 344 (మీర్ సయ్యద్ అలీ 40; ఏ. జయసూర్య 5/49), ఇండియా సిమెంట్స్ తొలి ఇన్నింగ్స్: 127 (సి. రాకేశ్ కుమార్ 52; అబ్దుల్ అల్ ఖురేషి 5/40), ఇండియా సిమెంట్స్ రెండో ఇన్నింగ్స్ (ఫాలోఆన్): 130/4 (ఎంఎస్ఆర్ చరణ్ 83). ఎవర్గ్రీన్ తొలి ఇన్నింగ్స్: 133, ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ తొలి ఇన్నింగ్స్: 240 (ఎస్. చిరంజీవి 54, ఏ. రాకేశ్44; సుఖైన్ జైన్ 4/60, ఆదిత్య తోమర్ 3/56), ఎవర్గ్రీన్ రెండో ఇన్నింగ్స్: 80/5 (వై. జగదీశ్ కుమార్ 3/24). -
21 సిక్సర్లు.. 16 ఫోర్లు!
ఈ ఏడాది ఢిల్లీకి చెందిన మోహిత్ అహ్లవాట్ ఏకంగా టీ 20లో ట్రిపుల్ సెంచరీ కొట్టి పొట్టి ఫార్మాట్ లో ఆ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా కొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. సాధారణంగా పొట్టి ఫార్మాట్లో డబుల్ సెంచరీ చేయడం చాలా కష్టం. ఏ స్థాయిలో చూసినా 20 ఓవర్ల పరిమిత క్రికెట్ లో డబుల్ సెంచరీ చేసిన ఆటగాళ్లు చాలా అరుదు. అయితే ప్రస్తుతం పొట్టి ఫార్మాట్ లో మరింత జోరు పెరిగందనే చెప్పాలి. తాజాగా అఫ్ఘానిస్తాన్ ఆటగాడు షఫీఖుల్లా షఫక్ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. స్థానికంగా జరిగిన ట్వంటీ 20 టోర్నమెంట్ లో ఖతీజ్ క్రికెట్ అకాడమీ తరపున ఆడిన షఫిక్(214) డబుల్ సెంచరీ సాధించాడు. 71 బంతుల్లో 21 సిక్సర్లు, 16 ఫోర్లతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి ద్విశతకం నమోదు చేశాడు. షఫిక్ దూకుడుతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 351 పరుగులు భారీ స్కోరు చేసింది. గత మూడు టీ 20 వరల్డ్ కప్‌ల నుంచి అఫ్ఘాన్ జాతీయ జట్టులో షఫికుల్లా రెగ్యులర్ సభ్యుడు. 2012, 2014, 2016 ల్లో జరిగిన ట్వంటీ 20 వరల్డ్ కప్ ల్లో షఫికుల్లా అఫ్ఘాన్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2014 వరల్డ్ టీ 20లో హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్ లో 24 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. ఇది ఆ దేశం తరపున ఫాస్టెస్ట్ రికార్డుగా నమోదు కావడం విశేషం కాగా, ఆ మ్యాచ్ లో అఫ్ఘాన్ గెలిచి వరల్డ్ టీ 20లో తొలి గెలుపును అందుకోవడం మరొక విశేషం. -
13 ఏళ్ల వయస్సు నుంచే అలవాటైంది..
సుదీర్ఘ ఇన్నింగ్స్‌లపై చతేశ్వర్ పుజారా ధర్మశాల: రాంచీ టెస్టులో 500కు పైగా బంతులను ఎదుర్కొని పుజారా చేసిన డబుల్ సెంచరీ అపూర్వం. అయితే ఈ సహనం తనకు 13 ఏళ్ల చిన్నవయస్సు నుంచే అలవాటైందని చెబుతున్నాడు. ‘ఓపిగ్గా ఆడడమనేది నా కఠినశ్రమతోనే అలవడింది. నాకు ఎనిమిదేళ్ల వయస్సున్నప్పటి నుంచే క్రికెట్ ఆడడం ప్రారంభించాను. 13 ఏళ్లప్పుడు తొలిసారిగా రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించాను. అప్పటి నుంచి ఈ ఫార్మాట్లో ఆడుతూనే ఉన్నాను. దేశవాళీల్లో నిరంతరం ఆడిన అనుభవంతో పాటు కఠిన ప్రాక్టీస్ కూడా ఓపిగ్గా ఆడేందుకు తోడ్పడింది. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడంతోనే ఇలాంటి సుదీర్ఘ ఇన్నింగ్స్ నమోదవుతాయి’ అని పుజారా అన్నాడు. గ్రేడ్ ‘ఎ’లో చేరడంపై తను స్పందించడానికి నిరాకరించాడు. ప్రస్తుతం సిరీస్ మధ్యలో ఉన్నామని, కాంట్రాక్ట్ గురించి మాట్లాడదలుచుకోలేదని అన్నాడు. ధర్మశాల బౌన్సీ వికెట్‌పై తమకెలాంటి ఆందోళన లేదని, ఇక్కడ గతంలోనూ చాలా క్రికెట్ ఆడామని గుర్తుచేశాడు. సిరీస్ పోటాపోటీగా సాగుతున్నప్పటికీ దురదృష్టవశాత్తూ మ్యాచ్‌కు సంబంధం లేని విషయాలపై మీడియా దృష్టి పెడుతోందని పుజారా అన్నాడు. కోహ్లిని ట్రంప్‌తో పోల్చడం బాధించిందన్నాడు. ‘అలాంటి కామెంట్స్ శోచనీయం. కోహ్లికి మేం పూర్తిగా మద్దతునిస్తున్నాం. క్రికెట్‌కు తను గొప్ప అంబాసిడర్‌లాంటి వాడు’ అని పుజారా స్పష్టం చేశాడు. -
మనోజ్ 210 నాటౌట్
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీఏ ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో శాంతి ఎలెవన్ బ్యాట్స్‌మన్ మనోజ్ కుమార్ (114 బంతుల్లో 210 నాటౌట్; 28 ఫోర్లు, 7 సిక్సర్లు) అజేయ డబుల్ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. దీంతో యూనివర్సల్ సీసీతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 299 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన శాంతి ఎలెవన్ జట్టు 40 ఓవర్లలో 4 వికెట్లకు 362 పరుగుల భారీ స్కోరు చేసింది. మనోజ్ అజేయ డబుల్ సెంచరీతో యూనివర్సల్ సీసీ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. సుమంత్ (60), కిరణ్ (41) ఆకట్టుకున్నారు. అనంతరం 363 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన యూనివర్సల్ సీసీ జట్టు 40 ఓవర్లలో 63 పరుగులకు ఆలౌటై ఓడిపోరుుంది. శాంతి ఎలెవన్ బౌలర్లలో బి. రాహుల్ రెడ్డి 5 వికెట్లతో చెలరేగాడు. -
రైలు షేర్ల దౌడు..
ముంబై: లాభాల్లో డబుల్ సెంచరీ మంగళవారం నాటి మార్కెట్ రైల్ కౌంటర్ కు మాంచి డిమాండ్ పుట్టింది. ముఖ్యంగా మార్కెట్ జోరుకు మద్దతిస్తున్న ఫైనాన్షియల్, ఆటో, రియల్టీ రంగాలకు తోడు రైల్ షేర్లు కూడా జత కలిశాయి. కొనుగోళ్లతో ఈ షేర్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా హిందుస్తాన్ రెక్టిఫయర్స్ 7శాతం టిటాగడ్ వేగన్స్ 6 శాతం టెక్స్మాకో రైల్ 6 శాతం లాభపడ్డాయి. అలాగే కాళిందీ రైల్ 6 , టిటాగర్ వేగన్, 6 టెక్స్ రైల్ 6 శాతం, స్టోన్ ఇండియా 5 శాతం, హెర్క్యులస్ హోయిస్ట్ 1.6 లాభాల్లో ట్రేడ్ అవుతుండడం విశేషం. -
సందీప్ అజేయ డబుల్ సెంచరీ
ముంబై: సర్వీసెస్ బౌలర్లపై హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ బావనక సందీప్ (332 బంతుల్లో 203 నాటౌట్; 22 ఫోర్లు, 3 సిక్సర్లు), సి.వి. మిలింద్ (208 బంతుల్లో 136; 18 ఫోర్లు, 3 సిక్స్‌లు) కదంతొక్కారు. రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్ రెండో రోజు ఆటలో సందీప్ అజేయ డబుల్ సెంచరీ సాధించగా, మిలింద్ శతక్కొట్టాడు. వీరిద్దరి రికార్డు భాగస్వామ్యంతో హైదరాబాద్ తొలి ఇన్నింగ్సలో 156.5 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 580 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. 303/7 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం ఆట కొనసాగించిన హైదరాబాద్‌ను సందీప్, మిలింద్ భారీస్కోరు దిశగా నడిపించారు. ఈ క్రమంలో తొలి సెషన్లో సందీప్ సెంచరీ పూర్తి చేశాడు. మిలింద్ కూడా క్రీజ్‌లో పాతుకుపోవడంతో పరుగులు రావడం సులభమైంది. వ్యక్తిగత స్కోరు 61, 62 వద్ద ప్రత్యర్థి ఫీల్డర్లు రెండు క్యాచ్‌లు జారవిడవడంతో బతికిపోయిన మిలింద్ సెంచరీ దిశగా దూసుకుపోయాడు. సర్వీసెస్ బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ ఇద్దరూ జట్టు స్కోరును పెంచారు. వీరి జోరుతో హైదరాబాద్ స్కోరు చూస్తుండగానే 400, 500 పరుగులు దాటింది. సర్వీసెస్ బౌలర్లు రెండు సెషన్ల పాటు శ్రమించినప్పటికీ ఈ జోడీని విడదీయలేకపోయారు. మిలింద్ కూడా సెంచరీ పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఎనిమిదో వికెట్‌కు 267 పరుగులు జోడించాక... జట్టు స్కోరు 543 పరుగుల వద్ద మిలింద్ ఎనిమిదో వికెట్‌గా నిష్క్రమించాడు. తర్వాత వచ్చిన సిరాజ్ (6) అండతో టీ విరామం అనంతరం సందీప్ డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 580 పరుగుల వద్ద సిరాజ్ ఔటవడంతో ఇన్నింగ్‌సను డిక్లేర్ చేశారు. సర్వీసెస్ బౌలర్లలో రౌషన్ రాజ్‌కు 5 వికెట్లు లభించారుు. తర్వాత తొలి ఇన్నింగ్స ఆడిన సర్వీసెస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 20 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 77 పరుగులు చేసింది. ఓపెనర్ అన్షుల్ గుప్తా (9) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగగా, ఆట నిలిచే సమయానికి నకుల్ వర్మ (34 బ్యాటింగ్), రవి చౌహాన్ (23 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
పరుగుల వరద ఆగలేదు
-
పరుగుల వరద ఆగలేదు
విరాట్ కోహ్లి డబుల్ సెంచరీ రహానే భారీ శతకం 365 పరుగుల రికార్డు భాగస్వామ్యం తొలి ఇన్నింగ్స్ లో భారత్ 557/5 డిక్లేర్డ్ న్యూజిలాండ్‌తో చివరి టెస్టు విరాట్ కోహ్లి ఎక్కడా తగ్గలేదు... సెంచరీ నుంచి అలవోకగా డబుల్ సెంచరీ మైలురాయిని అందుకొని తన ఆటను, స్థాయిని ప్రదర్శించాడు. ద్విశతకం కొట్టి నాలుగు టెస్టులే అయింది. అంతలోనే బ్యాటింగ్‌లో తడబడుతున్నారని అనేశారు... కానీ భారీ స్కోరు ఎంతో దూరంలో లేదని ఈ మ్యాచ్‌కు ముందు చెప్పిన కోహ్లి, ఇప్పుడు దానిని చేసి చూపించాడు. మరోసారి డబుల్ సెంచరీతో గతంలో భారత కెప్టెన్‌గా ఎవరికీ సాధ్యం కాని ఘనతను సాధించాడు. బౌన్సర్లు శరీరాన్ని బలంగా తాకాయి... షార్ట్ పిచ్ బంతులు ఒంటిపై ముద్రలు వేశాయి... కానీ రహానే తొణకలేదు. అతని పట్టుదల ముందు ప్రత్యర్థి బౌలర్లు తేలిపోయారు. అతని అంకితభావానికి పరుగులు దాసోహమయ్యాయి. త్రుటిలో డబుల్ సెంచరీ చేజార్చుకున్నా అమూల్యమైన ఇన్నింగ్స్ తో రహానే తన విలువేమిటో చూపించాడు. ఒకరితో మరొకరు పోటీ పడుతూ సాగిన కోహ్లి, రహానేల కళాత్మక బ్యాటింగ్ పలు రికార్డులను తుడిచి పెట్టేసింది. ఏకంగా 365 పరుగులతో భారత్ తరఫున నాలుగో వికెట్‌కు వీరిద్దరు అత్యుత్తమ భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరి ఆటతో మూడో టెస్టుపైనా రెండో రోజే భారత్ పట్టు బిగించగా... ఇక కివీస్ ఏ మాత్రం పోరాడుతుందనేది ఆసక్తికరం. ఇండోర్: మూడో టెస్టులో తొలిరోజే మొదలైన భారత్ పరుగుల ప్రవాహం రెండో రోజూ ఆగలేదు. కోహ్లి, రహానే అద్భుత ఆటతో న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌లోనూ దాదాపుగా చేతులెత్తేసింది. ఆదివారం భారత్ తమ తొలి ఇన్నింగ్‌సను 5 వికెట్ల నష్టానికి 557 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (366 బంతుల్లో 211; 20 ఫోర్లు) డబుల్ సెంచరీ సాధించగా, అజింక్య రహానే (381 బంతుల్లో 188; 18 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆ అవకాశం కోల్పోయాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 365 పరుగులు జోడించడం విశేషం. ఆ తర్వాత రోహిత్ శర్మ (63 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స ఆడాడు. అనంతరం న్యూజిలాండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. గప్టిల్ (17), లాథమ్ (6) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుత భారత స్కోరు, పిచ్ బౌలింగ్‌కు అనుకూలిస్తున్న తీరు చూస్తే మూడో రోజు కివీస్‌కు కష్టాలు తప్పకపోవచ్చు. తొలి సెషన్: తగ్గని దూకుడు ఓవర్‌నైట్ స్కోరు 267/3తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ అదే జోరు కొనసాగించింది. కోహ్లి, రహానే ఇద్దరూ ఒకరితో మరొకరు పోటీ పడుతూ అలవోకగా పరుగులు సాధించారు. పేసర్ హెన్రీ మాత్రం వరుసగా షార్ట్ పిచ్ బంతులతో రహానేను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో రహానే 210 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని కెరీర్లో ఇది ఎనిమిదో సెంచరీ కావడం విశేషం. కివీస్ బౌలర్లు పూర్తిగా విఫలం కావడంతో కోహ్లి, రహానే చకచకా పరుగులు తీశారు. ఈ సెషన్లో ఆ జట్టు కనీసం ఒక్క మెరుుడిన్ ఓవర్ కూడా వేయలేకపోయింది. ఓవర్లు: 27, పరుగులు: 91, వికెట్లు: 0 రెండో సెషన్: కోహ్లి డబుల్ లంచ్ అనంతరం భారత బ్యాట్స్‌మెన్ మరింత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. 273 బంతుల్లో 150 పరుగుల మార్క్ చేరుకున్న కోహ్లి తనదైన శైలిలో చూడచక్కటి షాట్లు ఆడాడు. నీషమ్ బౌలింగ్‌లో కొట్టిన కవర్‌డ్రైవ్, సాన్‌ట్నర్ ఓవర్లో ఆడిన రివర్స్ షాట్ అతని ఇన్నింగ్సలో హైలైట్‌గా నిలిచాయి. ఎట్టకేలకు హెన్రీ వేసిన బంతిని డీప్ స్క్వేర్ దిశగా పంపి 347 బంతుల్లో కోహ్లి డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శతవిధాలా ప్రయత్నించినా ఈ జోడీని విడదీయలేకపోయిన న్యూజిలాండ్, ఈ టెస్టులో వరుసగా మూడో సెషన్లో కూడా వికెట్ పడగొట్టడంలో విఫలమైంది. ఓవర్లు: 30, పరుగులు: 98, వికెట్లు: 0 మూడో సెషన్: రహానే మిస్ విరామం తర్వాత తొలి ఓవర్లోనే కోహ్లి అద్భుత ఇన్నింగ్స ముగిసింది. పటేల్ బౌలింగ్‌లో అతను వికెట్ల ముందు దొరిగిపోవడంతో రికార్డు భాగస్వామ్యానికి తెర పడింది. మరో వైపు ద్విశతకం దిశగా దూసుకుపోరుున రహానేను దురదృష్టం వెంటాడింది. బౌల్ట్ వేసిన బంతిని డ్రైవ్ చేయబోయి కీపర్‌కు క్యాచ్ ఇవ్వడంతో రహానే డబుల్ అవకాశాన్ని కోల్పోయాడు. ఈ దశలో రోహిత్ దూకుడుగా ఆడి భారత్ మరింత భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అతనికి జడేజా (17 నాటౌట్)నుంచి మంచి సహకారం లభించింది. వీరిద్దరు 9.5 ఓవర్లలోనే ఆరో వికెట్‌కు 53 పరుగులు జోడించడం విశేషం. 62 బంతుల్లో రోహిత్ సిరీస్‌లో మూడో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఆ వెంటనే భారత ఇన్నింగ్స్ ను కోహ్లి డిక్లేర్ చేశాడు. అనంతరం న్యూజిలాండ్ ఓపెనర్లు జాగ్రత్తగా ఇన్నింగ్స ఆరంభించారు. కొన్ని ఉత్కంఠ క్షణాలు ఎదురైనా వారిద్దరు వికెట్ పడకుండా ఆటను ముగించగలిగారు. ఓవర్లు: 22, పరుగులు: 101, వికెట్లు: 2 (భారత్) ఓవర్లు: 9, పరుగులు: 28, వికెట్లు: 0 (కివీస్) స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్ : విజయ్ (సి) లాథమ్ (బి) పటేల్ 10; గంభీర్ (ఎల్బీ) (బి) బౌల్ట్ 29; పుజారా (బి) సాన్‌ట్నర్ 41; కోహ్లి (ఎల్బీ) (బి) పటేల్ 211; రహానే (సి) వాట్లింగ్ (బి) బౌల్ట్ 188; రోహిత్ (నాటౌట్) 51; జడేజా (నాటౌట్) 17; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (169 ఓవర్లలో 5 వికెట్లకు డిక్లేర్డ్) 557. వికెట్ల పతనం: 1-26; 2-60; 3-100; 4-465; 5-504. బౌలింగ్: బౌల్ట్ 32-2-113-2; హెన్రీ 35-3-127-0; పటేల్ 40-5-120-2; సాన్‌ట్నర్ 44-4-137-1; నీషమ్ 18-1-53-0. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ : గప్టిల్ (బ్యాటింగ్) 17; లాథమ్ (బ్యాటింగ్) 6; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 28. బౌలింగ్: షమీ 2-0-5-0; ఉమేశ్ 2-0-7-0; అశ్విన్ 3-1-9-0; జడేజా 2-1-2-0. ఓకే రహానే రెండో రోజు ఆటలో మొదటినుంచి రహానేపై హెన్రీ వరుసగా షార్ట్ పిచ్ బంతులు సంధించాడు. ఆరో ఓవర్లో హెన్రీ విసిరిన బౌన్సర్ నుంచి తప్పించుకునే క్రమంలో రహానే తల వెనక్కి తిప్పినా, పూర్తిగా నియంత్రణలో లేకపోయాడు. దాంతో బంతి నేరుగా అతని హెల్మెట్ వెనుక భాగంలో సరిగ్గా చెవి పైన బలంగా తగిలింది. దాంతో అతను కొద్దిగా షాక్‌కు గురయ్యాడు. వెంటనే హెన్రీతో పాటు ఇతర కివీస్ ఆటగాళ్లు ఆందోళనగా బ్యాట్స్‌మన్ వద్దకు వచ్చేశారు. అయితే ఫిజియో స్వల్ప చికిత్స తర్వాత రహానే సాధారణ స్థితికి వచ్చేశాడు. అయితే ఆ తర్వాతి బంతిని కూడా హెన్రీ బౌన్సర్ విసరడం విశేషం! ఈ ఇన్నింగ్స నాకెంతో ప్రత్యేకం. చిరకాలం గుర్తుండిపోతుంది. 100/3 నుంచి మరో 365 పరుగులు జోడించడం నిజంగా అద్భుతం. తొలి రోజుతో పోలిస్తే ఈ రోజు చాలా స్వేచ్ఛగా ఆడాను. షార్ట్ పిచ్ బంతులతో ఇబ్బంది పడిన మాట వాస్తవం. దీనిని ఒప్పుకోవడంలో సిగ్గు పడాల్సిందేమీ లేదు. అయితే పట్టుదలగా నిలబడగలిగా. అందుకే ఈ సెంచరీ అమితానందం ఇస్తే, టెస్టు క్రికెట్ గొప్పతనం ఏమిటో కూడా నాకు తెలిసింది. - రహానే జడేజాకు జరిమానా పదే పదే హెచ్చరించిన తర్వాత కూడా పిచ్‌పై పరుగెత్తిన జడేజాపై ఐసీసీ చర్యలు తీసుకుంది. అంపైర్లు ఫిర్యాదుపై స్పందిస్తూ... జడేజా మ్యాచ్ ఫీజులో 50 శాతం కోతతో పాటు 3 డీ మెరిట్ పాయింట్లు శిక్షగా విధించింది. రెండేళ్ల లోపు ఈ పాయింట్ల సంఖ్య 4కు చేరితే తీవ్రతను బట్టి మ్యాచ్ నిషేధానికి గురయ్యే అవకాశం ఉంది. భారత్ తరఫున నాలుగో వికెట్‌కు ఇదే (365) అత్యుత్తమ భాగస్వామ్యం. గతంలో సచిన్, లక్ష్మణ్ నెలకొల్పిన (353-సిడ్నీ) భాగస్వామ్యాన్ని కోహ్లి, రహానే అధిగమించారు. భారత్ తరఫున ఏ వికెట్‌కై నా ఇది ఐదో అత్యుత్తమ భాగస్వామ్యం. కెప్టెన్‌గా రెండు డబుల్ సెంచరీలు చేసిన ఏకై క భారత ఆటగాడు కోహ్లి. సచిన్ (2010) తర్వాత ఒకే ఏడాది రెండు డబుల్ సెంచరీలు భారత బ్యాట్స్‌మన్ కూడా అతనే. జడేజా కావాలనే చేశాడా! భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన తర్వాత న్యూజిలాండ్ ఓపెనర్లు బ్యాటింగ్ చేసేందుకు అప్పుడే క్రీజ్‌లోకి వస్తున్నారు. ఇంకా మన ఫీల్డర్లు పూర్తిగా సిద్ధం కూడా కాలేదు. ఒక్క బంతి కూడా పడలేదు. కానీ స్కోరు బోర్డు మాత్రం 5/0గా చూపించింది! ఇవి భారత్‌కు అంపైర్లు విధించిన పెనాల్టీ పరుగులు. అంతకు కొద్దిసేపు ముందు రవీంద్ర జడేజా పిచ్‌పై పరుగెత్తినందుకు శిక్షగా ఆట ఆరంభానికి ముందే కివీస్ స్కోరులో ఐదు పరుగులు వచ్చి చేరారుు. తను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జడేజా షాట్ ఆడి పిచ్పైనుంచే పరుగు తీశాడు. ఒకసారి హెచ్చరించిన అంపైర్లు రెండో సారి అలాగే చేయడంతో పెనాల్టీని విధించారు. ఇది పాత నిబంధనే అరుునా చాలా అరుదుగా మాత్రమే అమల్లో కనిపించింది. అయితే పొరపాటున కాకుండా పిచ్ నుంచి మరింత సహకారం పొందేందుకు జడేజా కావాలని దీనిని చేసినట్లు కూడా వినిపించింది! సరిగ్గా క్రీజ్‌కు సమీపంలో ఫుట్ మార్క్‌లు ఏర్పడటం వల్ల బంతి విపరీతంగా టర్న్ అయి స్పిన్‌కు బాగా అనుకూలిస్తుంది. అలాంటి పరిస్థితిని సృష్టించేందుకే ’సర్’ ఇలాంటి వ్యూహం పాటించాడా అనేదే సందేహం! -
హర్‌ప్రీత్ సింగ్ డబుల్ సెంచరీ
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో ఉత్తరప్రదేశ్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ భారీ స్కోరు సాధించింది. హర్‌ప్రీత్ సింగ్ (274 బంతుల్లో 216 నాటౌట్; 25 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుత ఇన్నింగ్స్ తో డబుల్ సెంచరీ సాధించగా..... మధ్యప్రదేశ్ 125.5 ఓవర్లలో 465 పరుగులు చేసి ఆలౌటైందిది. అంకిత్ శర్మ (61) రాణించాడు. యూపీ బౌలర్లలో ఇంతియాజ్ మూడు వికెట్లు తీయగా... కుల్దీప్, రాజ్‌పుత్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. అనంతరం ఉత్తరప్రదేశ్ తమ తొలి ఇన్నింగ్సలో 47 ఓవర్లలో 5 వికెట్లకు 131 పరుగులు చేసింది. ఏకలవ్య ద్వివేది 37 పరుగులతో, కుల్దీప్ యాదవ్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. సర్ఫరాజ్ ఖాన్ (17) నిరాశపరచగా... పీయూష్ చావ్లా 22 పరుగులు చేశాడు. కెప్టెన్ రైనా ఇంకా బ్యాటింగ్‌కు దిగకపోవడం విశేషం. ఎంపీ బౌలర్ గౌరవ్ యాదవ్ మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు. -
పుజారా డబుల్ సెంచరీ
శామ్యూల్ జాక్సన్ శతకం ఇండియా బ్లూ 693/6 డిక్లేర్డ్ ఇండియా గ్రీన్ తొలి ఇన్నింగ్స్ 16/2 గ్రేటర్ నోయిడా: చతేశ్వర్ పుజారా తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ అజేయ డబుల్ సెంచరీ (363 బంతుల్లో 256 నాటౌట్; 28 ఫోర్లు)తో చెలరేగాడు. దీంతో దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఇండియా బ్లూ తమ తొలి ఇన్నింగ్స్‌ను 168.2 ఓవర్లలో 693 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. శామ్యూల్ జాక్సన్ (204 బంతుల్లో 134; 15 ఫోర్లు; 2 సిక్సర్లు) సెంచరీ సాధించగా రవీంద్ర జడేజా (66 బంతుల్లో 48; 3 ఫోర్లు; 2 సిక్సర్లు) రాణించాడు. అంతకుముందు 362/3 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన బ్లూ జట్టు... అదే స్కోరు వద్ద దినేశ్ కార్తీక్ (69 బంతుల్లో 55; 8 ఫోర్లు) వికెట్ కోల్పోయింది. అయితే జాక్సన్ సహకారంతో పుజారా చెలరేగాడు. వీరిద్దరి అద్భుత ఆటతీరుతో రెడ్ బౌలర్లు బెంబేలెత్తారు. ఐదో వికెట్‌కు ఏకంగా 243 పరుగులు జత చేరాయి. అమిత్ మిశ్రాకు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇండియా రెడ్ రెండు పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది. రోజు ముగిసే సమయానికి 9 ఓవర్లలో మరో వికెట్ కోల్పోకుండా 16 పరుగులతో ఉంది. క్రీజులో శిఖర్ ధావన్ (14 బ్యాటింగ్), యువరాజ్ పరుగులేమీ చేయకుండా ఉన్నారు. -
సాత్విక్ డబుల్ సెంచరీ
హైదరాబాద్: హెచ్‌సీఏ ఎ-డివిజన్ వన్డే క్రికెట్లో ఆల్ సెయింట్స్ హైస్కూల్ కుర్రాడు సాత్విక్ రెడ్డి (118 బంతుల్లో 213; 18 ఫోర్లు, 11 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. భారీ సిక్సర్లు, చూడచక్కని బౌండరీలతో మెరుపు వేగంతో డబుల్ సెంచరీని నమోదు చేశాడు. దీంతో ఆల్‌సెయింట్స్ గ్రౌండ్స్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 306 పరుగుల తేడాతో ధ్రువ్ ఎలెవన్‌పై భారీ విజయం సాధించింది. మొదట ఆల్‌సెయింట్స్ జట్టు 49.1 ఓవర్లలో 373 పరుగులు చేసి ఆలౌటైంది. సాత్విక్, సయ్యద్ యూసుఫ్ తమీమ్ (70 బంతుల్లో 80; 2 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి భారీస్కోరుకు బాటలు వేశాడు. డేన్ జాన్స్‌న్‌కు 5 వికెట్లు దక్కాయి. తర్వాత ధ్రువ్ ఎలెవన్ 67 పరుగులకే ఆలౌటైంది. ముస్తాక్ అహ్మద్ 3, నీల్ చక్రవర్తి 2 వికెట్లు తీశారు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు గన్‌రాక్ సీసీ: 102 (ఆకాశ్ 32; రోహిత్ యాదవ్ 7/15), సెయింట్ ప్యాట్రిక్స్: 105/1 (సాయి వినయ్ 52 నాటౌట్, సాహిల్ కృష్ణ 35). రోషనారా: 316 (శ్రీకాంత్ రెడ్డి 108 నాటౌట్, ఇర్ఫాన్ ఖాన్ 60; విజయ్ 2/35, వరప్రసాద్ 2/39), వాకర్‌టౌన్: 140 (చంటి 62; బెంజమిన్ 5/25, ఉదయ్ కుమార్ 3/20). అమీర్‌పేట్: 305/9 (ఆశిష్ యాదవ్ 129, గురిందర్ సింగ్ 53; అభినవ్ 5/51, సమీర్ 2/36), విక్టోరియా: 68 (అభినవ్ 30; నైరుత్ రెడ్డి 5/20, చందన్ 4/16). సౌతెండ్ రేమండ్స్: 122 (హాజి 38; దీపక్ 5/26, సాహిల్ 3/33), యాదవ్ డెయిరీ: 123/1 (ప్రణీత్ 53 నాటౌట్). హైదరాబాద్ పేట్రియాట్స్: 283 (మహేశ్ 120, పవన్ 60; అనిరుధ్ 3/32, కార్తీశ్ 3/60), టీమ్ కున్: 190/9 (అనిరుధ్ 107; ప్రణయ్ 4/38). -
కోహ్లికి జూనియర్ రిచర్డ్స్ కానుక
అంటిగ్వా: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో డబుల్ సెంచరీతో చెలరేగిన భారత టెస్టు క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి అనూహ్య కానుక అందుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌ను ఇదివరకే విండీస్ బ్యాటింగ్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ ప్రశంసించగా ఇప్పుడు రిచర్డ్స్ తనయుడు కూడా ఈ జాబితాలో చేరాడు. అయితే ఊరికే ప్రశంసలతోనే కాకుండా తన చిత్రకళానైపుణ్యాన్ని జోడించి కోహ్లి బ్యాట్ పెకైత్తి అభివాదం చేస్తున్న చిత్రాన్ని అతడు కానుకగా అందించాడు. 18 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన మాలి రిచర్డ్స్ నేరుగా హోటల్ గదికి వెళ్లి మరీ ఈ పెయింటింగ్‌ను అందించాడు. ‘కెరీర్లో తొలి డబుల్ సెంచరీ సాధించినందుకు గుర్తుగా కోహ్లికి ఏదైనా ఇద్దామనుకున్నాం. అంతే ఒకే రోజులో ఈ చిత్రాన్ని నా స్నేహితుడి సహకారంతో చిత్రించాను’ అని మాలి తెలిపాడు. -
62 ఏళ్ల తర్వాత ఓ ఇంగ్లండ్ బ్యాట్స్ మన్..
మాంచెస్టర్: ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో జో రూట్ ఒకడు. విరాట్ కోహ్లీ, స్టీవెన్ స్మిత్, కేన్ విలియమ్సన్, రూట్.. ఈ ఆటగాళ్లు అన్ని ఫార్మాట్లలోనూ దుమ్మురేపుతున్నారు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జో రూట్ (406 బంతుల్లో 254; 27 ఫోర్లు) కెరీర్లో రెండో డబుల్ సెంచరీ చేసి అరుదైన ఫీట్ సాధించాడు. 62 ఏళ్ల తర్వాత ఓ ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ స్వదేశంలో పాకిస్తాన్ పై డబుల్ సెంచరీ చేసిన రికార్డును రూట్ తన ఖాతాలో వేసుకున్కనాడు. కుక్ సెంచరీకి రూట్ విధ్వంసం తోడవ్వడంతో పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 152.2 ఓవర్లలో 8 వికెట్లకు 589 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. స్వదేశంలో పాక్‌పై డబుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. గత కొన్న రూట్ డబుల్ సెంచరీ.. వ్యక్తిగత రికార్డులు: రెండు లేదా అంతకన్నా ఎక్కువ డబుల్ సెంచరీలు చేసిన ఇంగ్లండ్ మూడో ఆటగాడు రూట్. గతంలో అలిస్టర్ కుక్ మూడు డబుల్ సెంచరీలు చేయగా, కెవిన్ పీటర్సన్ రెండు ద్విశతకాలు చేశాడు. స్వదేశంలో పాకిస్తాన్ పై ఇంగ్లండ్ ఆటగాడు డబుల్ సెంచరీ చేయడం 62 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 1954లో డెనిస్ కాంప్టన్ నాటింగ్ హామ్ టెస్టులో (278) ఈ ఫీట్ సాధించాడు. పాకిస్తాన్ పై డబుల్ సెంచరీ నమోదు చేసిన నాల్గవ ఆటగాడు జో రూట్. ఇప్పటివరకూ డెనిస్ కాంప్టన్ (278), కుక్ (263), టెడ్ డెక్టర్స్ (205) మాత్రమే ఈ ఘనత సాధించారు. రూట్ కెరీర్లో ఇది రెండో డబుల్ సెంచరీ. 2014లో లార్డ్స్ టెస్టులో శ్రీలంకపై (200) తొలి డబుల్. -
అందుకే డబుల్ సెంచరీ చేశాను..!
నార్త్ సౌండ్(ఆంటిగ్వా): ఇతర ఆటగాళ్లు ఎవరైనా ఒత్తిడిలో ఉంటే ఆడటం చాలా కష్టమని, తమ వల్ల కాలేదని చెబుతుంటారు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం చాలా స్పెషల్. ఒత్తిడి తనకు మరింత ఎనర్జీని ఇస్తుందని వ్యాఖ్యానించాడు. ఆంటిగ్వా టెస్టులో డబుల్ సెంచరీ(200) చేయడానికి కారణాలను వెల్లడించాడు. వెస్టిండీస్‌లో మెరుగ్గా ఆడలేడని నాపై విమర్శలున్నాయని, అయితే ఇక్కడ కూడా తాను అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాలని వంద కోట్ల భారత అభిమానులు కోరుకుంటున్నారని తెలిపాడు. ఆ ఒత్తిడినే తనకు ఆశీర్వాదంగా భావించి మెరుగైన ఇన్నింగ్స్ ఆడినట్లు చెప్పాడు. ఐదేళ్ల కింద ఇక్కడ మూడు టెస్టులాడినా కేవలం 76 పరుగులే చేయడం తనను నిరాశకు గురిచేసిందన్నాడు. ఈసారి కోహ్లీ విండీస్ గడ్డపై రాణించాలని ఫ్యాన్స్ కోరుకున్నారని, ప్రస్తుతం అది సాధ్యమైందని అభిప్రాయపడ్డాడు. సెంచరీనే నమోదు చేయని గడ్డపై ఏకంగా డబుల్ సెంచరీ సాధించినందుకు ఈ సిరీస్ తనకెప్పుడూ ప్రత్యేకమేనని కోహ్లీ అంటున్నాడు. క్రీజులో ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉండాలని భావిస్తుంటానని, అందుకే మరో ఎండ్ లో కూడా తానే ఉన్నట్లు ఫీలవుతుంటానని మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు. విదేశాల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి భారత కెప్టెన్‌గా కోహ్లి నిలిచాడు. గతంలో ఉన్న అజహర్ (192) రికార్డును సవరించాడు. ఉపఖండం బయట 2006 తర్వాత డబుల్ సెంచరీ చేసిన భారత ఆటగాడు కోహ్లీ. విండీస్ గడ్డపై డబుల్ సెంచరీ చేసిన ఐదో భారత ఆటగాడు కోహ్లి. గతంలో ఎంఎస్ ధోనీ, సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, మన్సూర్ అలీఖాన్ పటౌడీ మాత్రమే ఈ ఘనత సాధించారు. -
విరాట్ సెంచరీలు ఒక్కటీ చూడలేదు..!
నార్త్ సౌండ్(ఆంటిగ్వా): వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(200) వీర విహారానికి విండీస్ మాజీ దిగ్గజం సర్ వివియన్ రిచర్డ్స్ ఫిదా అయిపోయాడు. ఈ విషయాన్ని రిచర్డ్స్ స్వయంగా వెల్లడించాడు. 'వివియన్ రిచర్డ్స్ ఇంటర్నేషనల్ స్డేడియంలో ప్రాక్టీస్ సెషన్లో ఉన్న సమయంలో భారత ఆటగాళ్లను నేను కలిశాను. ఆ సందర్భంగా విరాట్ కోహ్లీకి నేను ఆల్ ది బెస్ట్ చెప్పాను. అయితే ఈ విధంగా డబుల్ సెంచరీ సాధిస్తాడని మాత్రం అసలు ఊహించలేదు' అని రిచర్డ్స్ పేర్కొన్నాడు. బ్యాట్స్‌మన్ గా కోహ్లీ ఇన్నింగ్స్ ను ఆస్వాదించానని, సంప్రదాయ షాట్లతో అలరించాడని కోహ్లీని కొనియాడాడు. తాను కూడా విండీస్ బయట తొలి డబుల్ సెంచరీ సాధించానని, ఇప్పుడు విరాట్ అదే పని చేసి చూపించాడని చెప్పాడు. నిజం చెప్పాలంటే విదేశాలలో ఆడుతున్నామంటే ఆటగాళ్ల మీద కాస్త ఒత్తిడి ఉంటుంది. అయితే ఏకాగ్రతతో ఏదైనా సాధ్యం చేయవచ్చని కోహ్లీ నిరూపించాడు. విరాట్ ఇన్నింగ్స్ చూడని వారు చాలా కోల్పోయారు, నాకు అవకావం లేదు.. కోహ్లీ సెంచరీ చేయడం తొలిసారి చూశాను. అది కూడా ఏకంగా డబుల్ సెంచరీ ఇన్నింగ్స్ అని విండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ తెలిపాడు. -
విరాట్ విశ్వరూపం.. అశ్విన్ అదుర్స్
► కెరీర్లో తొలి డబుల్ సెంచరీ చేసిన కోహ్లీ ► తొలి టెస్టులో భారత్ ఆధిపత్యం ► తొలి ఇన్నింగ్స్ 566/8 (డిక్లెర్డ్) నార్త్ సౌండ్ (ఆంటిగ్వా): వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి డబుల్ సెంచరీ (283 బంతుల్లో 200; 24 ఫోర్లు)కి తోడు ఆల్ రౌండర్ అశ్విన్ సెంచరీ (253 బంతుల్లో 113 ; 12 ఫోర్లు) స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించడంతో భారీ స్కోరు చేసింది. దీంతో రెండో రోజు కూడా భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. ఓవర్ నైట్ స్కోరు 302/4 తో బ్యాటింగ్ కు దిగిన భారత్ 566 పరుగుల వద్ద అమిత్ మిశ్రా(68 బంతుల్లో 53; 6 ఫోర్లు) 8వ వికెట్ గా ఔట్ కాగానే భారత్ తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన విండీస్ రెండో రోజు మ్యాచ్ ముగిసే సమయానికి వికెట్ కోల్పోయి 31 పరుగులు చేసింది. ఓవర్ నైట్ స్కోరు 302/4 తో రెండోరోజు బ్యాటింగ్ కు దిగిన కోహ్లీ, అశ్విన్ మొదట డిఫెన్స్‌కు ప్రాధాన్యమిచ్చారు. విండీస్ పేసర్లు బౌన్సర్లు, పదునైన పేస్ బౌలింగ్‌తో దాడులు చేసినా వీరు మాత్రం ఒత్తిడికి గురికాలేదు. 43 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్‌ను కీపర్ వదిలేయడంతో ఊపిరి పీల్చుకున్న అశ్విన్ 127 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు. విరాట్ కూడా జోరు చూపడంతో తొలి సెషన్లో భారత్ వికెట్ కోల్పోకుండా 102 పరుగులు చేసింది. కానీ లంచ్ తర్వాత రెండో బంతికే గాబ్రియెల్ బౌలింగ్ లో కోహ్లి అవుట్ కావడంతో ఐదో వికెట్‌కు 168 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. బ్రాత్వైట్కు మూడు వికెట్లు కోహ్లి ఔటయ్యాక క్రీజులోకొచ్చిన సాహా (88 బంతుల్లో 40; 1 ఫోర్, 1 సిక్సర్) ఫర్వాలేదనిపించాడు. అయితే బ్రాత్ వైట్ బౌలింగ్ లో ముందుకొచ్చి ఆడగా సాహా స్టంప్ ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మిశ్రా సహకారంలో అశ్విన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బ్రాత్ వైట్ మరోసారి భారత్‌ను దెబ్బతీశాడు. స్కోరు వేగాన్ని పెంచేందుకు యత్నించిన అశ్విన్ బ్రాత్‌వైట్ బౌలింగ్ లో గాబ్రియెల్ కు క్యాచ్ ఇచ్చి ఏడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. షమీ(9 బంతుల్లో 17; 2 సిక్సులు) దూకుడుగా ఆడుతుంటే మరోవైపు మిశ్రా హాఫ్ సెంచరీ (53) చేసి బ్రాత్ వైట్ బౌలింగ్ లో హోల్డర్ క్యాచ్ పట్టడంతో భారత్ 8వ వికెట్ కోల్పోయింది. అప్పటికి 161.5 ఓవర్లలో భారత్ స్కోరు 566/8. మిశ్రా ఔట కాగానే కెప్టెన్ కోహ్లీ ఇన్నింగ్స్ డిక్లెర్ చేశాడు. విండీస్ బౌలర్లలో బిషూ, బ్రాత్‌వైట్ చెరో 3 వికెట్లు పడగొట్టగా, గాబ్రియెల్ రెండు వికెట్లు తీశాడు. బ్యాటింగ్ కు దిగిన విండీస్ 16 ఓవర్లలో వికెట్ కోల్పోయి 31 పరుగులు చేసింది. బ్రాత్‌వైట్ (11), బిషూ(0) క్రీజులో ఉన్నారు. జట్టు స్కోరు 30 పరుగుల వద్ద షమీ బౌలింగ్ లో ఔటయ్యాడు. -
చెలరేగిన కొహ్లీ: తొలి డబుల్ సెంచరీ
-
కయూమ్ అజేయ డబుల్ సెంచరీ
► మాంచెస్టర్ 461/6 డిక్లేర్డ్ ► ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్ సాక్షి, హైదరాబాద్: కయూమ్ (262 బంతుల్లో 218 నాటౌట్; 31 ఫోర్లు) అజేయ డబుల్ సెంచరీ సాధించడంతో మాంచెస్టర్ భారీ స్కోరు చేసింది. ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో డెక్కన్ బ్లూస్‌తో గురువారం మొదలైన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేపట్టిన మాంచెస్టర్ 6 వికెట్లకు 461 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. రాజ్ కుమార్ (126) సెంచరీ చేశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన డెక్కన్ బ్లూస్ మొదటి రోజు ఆట నిలిచే సమయానికి వికెట్ నష్టానికి 17 పరుగులు చేసింది. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు కొసరాజు: 162/9 (విశ్వజిత్ మహాపాత్ర 66; సోమశేఖర్ 4/29), శ్రీచక్ర: 88/2 (సోమశేఖర్ 40). నేషనల్ సీసీ: 107 (త్రిశాంత్ గుప్తా 7/51), గ్రీన్‌టర్ఫ్: 99 (సయ్యద్ అస్కారి 43; సుమిత్ జోషి 8/39). అగర్వాల్ సీనియర్స్: 303 (సాయివ్రత్ రెడ్డి 186, మహ్మద్ అబిద్ 3/93), బాలా జీ కోల్ట్స్: 59/5 (ఫయాజ్ 31 బ్యాటింగ్). ఆక్స్ఫర్డ్ బ్లూస్: 160 (నర్సింహ 5/45), క్లాసిక్: 8/1. హైదరాబాద్ టైటాన్స్: 111/9 (రవూఫ్ 31; సురేశ్ 5/36), ఉదయ్ 3/29). బ్రదర్స్ ఎలెవన్: 147 (అజీమ్ వార్సి 45; సాయిపూర్ణానంద్ 5/52, అలంకృత్ 5/42), క్రౌన్ సీసీ: 81/6 (రాజశేఖర్‌రెడ్డి 30; నొమన్ అఫ్సర్ 3/28). బడ్డింగ్ స్టార్స్: 137/8 (భరత్ 64 బ్యాటింగ్; సైఫుద్దీన్ 5/48). జిందా తిలిస్మాత్: 285 (మధు కుమార్ 68, అజారుద్దీన్ 75; అఖిల్ 3/58, ఆదిత్య 3/47). ఉస్మానియా: 199 (మోజెస్ 64; అర్జున్ 3/58), అవర్స్ సీసీ: 24/2 సాయిసత్య: 207/6 (నారాయణ 60, అరవిం ద్ 61 బ్యాటింగ్; ఆశిష్ 3/38), గెలాక్సీతో మ్యాచ్. -
రవిశాస్త్రి 'రికార్డు' సమం!
కొల్విన్ బే(బ్రిటన్): ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో మరో సంచలనం నమోదైంది. బ్రిటన్ వేదికగా డెర్భీషైర్తో జరిగిన నాలుగురోజుల కంట్రీ చాంపియన్ షిప్లో గ్లామోర్గాన్ ఆటగాడు అనూరిన్ డొనాల్డ్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. 123 బంతుల్లో ద్విశతకాన్ని నమోదు చేసి ఆ ఫీట్‌ను వేగంగా సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో వేగంగా డబుల్ సెంచరీ చేసిన ఘనత భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి పేరిట ఉంది. 1985లో బరోడాతో రంజీ మ్యాచ్‌లో రవిశాస్త్రి వేగంగా డబుల్ సెంచరీ సాధించాడు. రవిశాస్త్రి 123 బంతుల్లోనే ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీని సాధించగా, ఇన్నాళ్లకు డొనాల్డ్ కూడా ఆ రికార్డును సరిగ్గా 123 బంతుల్లోనే ద్వితకాన్ని సాధించడం విశేషం. గ్లామోర్గాన్ తొలి ఇన్నింగ్స్ లో డొనాల్డ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఓవరాల్ గా 136 బంతుల్లో 26 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో 234 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో డొనాల్డ్ రాణించడంతో గ్లామోర్గాన్ తన తొలి ఇన్నింగ్స్‌లో 518 పరుగుల భారీ స్కోరు చేసింది. -
వోజెస్ ‘డబుల్ సెంచరీ’
* తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 562 ఆలౌట్ * న్యూజిలాండ్‌తో రెండో టెస్టు వెల్లింగ్టన్: ఆడమ్ వోజెస్ (364 బంతుల్లో 239; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) డబుల్ సెంచరీతో చెలరేగడంతో... న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 154.2 ఓవర్లలో 562 పరుగుల భారీస్కోరు చేసి ఆలౌటైంది. దీంతో కంగారులకు 379 పరుగుల ఆధిక్యం లభించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ ఆదివారం మూడోరోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 62.3 ఓవర్లలో 4 వికెట్లకు 178 పరుగులు చేసింది. నికోలస్ (31 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. లాథమ్ (63), గప్టిల్ (45) ఫర్వాలేదనిపించినా... విలియమ్సన్ (22), మెకల్లమ్ (10) నిరాశపర్చారు. లయోన్ 2 వికెట్లు తీశాడు. ప్రస్తుతం కివీస్ ఇంకా 201 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు 463/6 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన ఆసీస్ ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ వోజెస్, సిడెల్ (49) నిలకడగా ఆడారు. ఈ ఇద్దరు ఏడో వికెట్‌కు 99 పరుగులు జోడించారు. ఈ క్రమంలో వోజెస్ 329 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సౌతీ, బౌల్ట్, బ్రాస్‌వెల్, అండర్సన్, క్రెయిగ్ తలా రెండు వికెట్లు తీశారు. -
వోజెస్ సూపర్ డబుల్
ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 583/4 డిక్లేర్డ్ విండీస్ 207/6 హోబర్ట్: ఆడమ్ వోజెస్ (285 బంతుల్లో 269 నాటౌట్; 33 ఫోర్లు) కెరీర్లో తొలిసారిగా డబుల్ సెంచరీ నమోదు చేయడంతో పాటు షాన్ మార్ష్ (266 బంతుల్లో 182; 15 ఫోర్లు; 1 సిక్స్)తో కలిసి టెస్టు క్రికెట్ చరిత్రలో నాలుగో వికెట్‌కు 449 పరుగుల అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో శుక్రవారం రెండో రోజు ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 114 ఓవర్లలో నాలుగు వికెట్లకు 583 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆసీస్ గడ్డపై కూడా ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం. వారికన్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన విండీస్‌ను స్పిన్నర్ లియోన్ (3/43) దెబ్బతీశాడు. దీంతో రోజు ముగిసే సమయానికి 65 ఓవర్లలో ఆరు వికెట్లకు 207 పరుగులు చేసింది. విండీస్ ఇంకా 376 పరుగులు వెనుకబడి ఉంది. డారెన్ బ్రేవో (159 బంతుల్లో 94 బ్యాటింగ్; 17 ఫోర్లు) ఒక్కడే పోరాడుతున్నాడు. అతనికి జతగా క్రీజులో రోచ్ (89 బంతుల్లో 31 బ్యాటింగ్; 3 ఫోర్లు) ఉన్నాడు. హాజెల్‌వుడ్‌కు రెండు వికెట్లు దక్కాయి. -
గుర్కీరత్ డబుల్
జడేజాకు ఆరు వికెట్లు ఉమేశ్ యాదవ్ సెంచరీ రంజీ ట్రోఫీ రౌండప్ మొహాలీ: భారత వన్డే జట్టులోకి ఎంపికైన గుర్కీరత్ సింగ్ రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో సత్తా చాటాడు. రైల్వేస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుర్కీరత్ (207 బంతుల్లో 201 నాటౌట్; 25 ఫోర్లు, 5 సిక్సర్లు) డబుల్ సెంచరీ నమోదు చేశాడు. మ్యాచ్ రెండో రోజు శుక్రవారం గీతాన్ష్ ఖేరా (102 నాటౌట్) సెంచరీ చేయడంతో పంజాబ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 5 వికెట్ల నష్టానికి 604 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. యువరాజ్ సింగ్ (23) విఫలమయ్యాడు. అనంతరం రైల్వేస్ వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసింది. రాజ్‌కోట్: రవీంద్ర జడేజా (6/27) చెలరేగడంతో సౌరాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్‌లో త్రిపుర తొలి ఇన్నింగ్స్‌లో 103 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో 307 పరుగులు చేసిన సౌరాష్ట్రకు 204 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. అనంతరం ఫాలోఆన్‌లో త్రిపుర 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. నాగపూర్: భారత పేసర్ ఉమేశ్ యాదవ్ (119 బంతుల్లో 128 నాటౌట్; 7 ఫోర్లు, 7 సిక్సర్లు) దూకుడైన బ్యాటింగ్‌తో ఒడిషాతో జరుగుతున్న మ్యాచ్‌లో విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 467 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం ఒడిషా 2 వికెట్లకు 79 పరుగులు చేసింది. మొరాదాబాద్: మొహమ్మద్ సైఫ్ (287 బంతుల్లో 198; 18 ఫోర్లు, 1 సిక్స్), సర్ఫరాజ్ ఖాన్ (164 బంతుల్లో 155; 15 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులతో మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ 5 వికెట్లకు 656 పరుగులు చేసింది. -
కళాత్మక విధ్వంసం
ప్రతి షాట్ ఓ కళాఖండం... ఓ కళాకారుడి కుంచె నుంచి జాలువారిన చిత్రాల్లా అందంగా... అంతకు మించి ఆహ్లాదంగా... గప్టిల్ ఆడిన ఇన్నింగ్స్ క్లాస్. ఆ స్ట్రెయిట్ డ్రైవ్‌లు చూడటానికి రెండు కళ్లూ చాలవు. కళాత్మకంగా ఫీల్డర్ల మధ్య ఖాళీల్లోంచి పంపిన బౌండరీలను పొగడటానికి మాటలు లేవు. మిడ్ వికెట్‌లోకి బలంగా బాదిన సిక్సర్ల గురించి రాయడానికి అక్షరాలు సరిపోవు. ఎవడైనా బౌండరీ లైన్ చూసి కొడతాడు... లేదంటే ప్రేక్షకుల స్టాండ్స్‌లోకి కొడతాడు. అదేంటో... గప్టిల్ గురి పెట్టి స్టేడియం కప్పు మీదకి కొట్టాడు. బంతి బ్యాట్‌ని తాకిన క్షణం నుంచి అది బయటపడేదాకా... ఏదో టెన్నిస్ మ్యాచ్ చూస్తున్నట్టు ఫీల్డర్లు అలా తలలు తిప్పుతూ చూడటం తప్ప ఏం చేయలేని పరిస్థితి. ఓ అద్భుతమైన యార్కర్ బౌండరీ లైన్ దాటుతుంటే... ఓ బలమైన బౌన్సర్ సిక్సర్‌గా మారుతుంటే... ఏ బౌలర్ అయినా ఏం చేయగలడు. హ్యాట్సాఫ్... గప్టిల్ అనడం తప్ప..! సాక్షి క్రీడావిభాగం వన్డేల్లో డబుల్ సెంచరీ అనేది ఇప్పుడు చాలా సాధారణంగా మారిందనే అనుకోవాలి. ఈ ప్రపంచకప్‌లోనే రెండోసారి ఈ ఘనత వచ్చేసింది. అయితే గప్టిల్ ఈ రికార్డు సాధిస్తాడనేది ఈ మ్యాచ్‌కు ముందు ఊహకు కూడా రాని ఆలోచన. ఇప్పటివరకు వన్డేల్లో వచ్చిన ఐదు డబుల్ సెంచరీలతో పోలిస్తే... గప్టిల్ ఆడిన ఇన్నింగ్స్ అద్భుతం అనుకోవాలి. ఎందుకంటే... ఇది ప్రపంచకప్‌లో నాకౌట్ మ్యాచ్. క్వార్టర్ ఫైనల్లో ప్రతి బ్యాట్స్‌మన్‌పై ఒత్తిడి ఉంటుంది. ముఖ్యంగా ఓపెనర్‌పై ఈ ఒత్తిడి చాలా ఎక్కువ. దీనిని అధిగమిస్తూ ఈ స్థాయిలో ఆడటం అంటే... వాహ్... నిజంగా అమోఘమే. ఆడిన తొలి బంతికే అద్భుతమైన డ్రైవ్‌తో బౌండరీ సాధించిన గప్టిల్... తాను ఎదుర్కొన్న మూడో బంతిని స్క్వేర్‌లెగ్‌లో నేరుగా శామ్యూల్స్ చేతుల్లోకే కొట్టాడు. కానీ శామ్యూల్స్ వదిలేశాడు. ఆ తర్వాత గప్టిల్ ఎక్కడా తడబడలేదు. అద్భుతమైన క్రికెట్ షాట్స్ ఆడాడు. కట్, డ్రైవ్, పుల్ ఇలా అన్నీ సంప్రదాయబద్దమైన షాట్లు ఆడి చూపించాడు. ఇటీవల కాలంలో బాగా పెరిగిన రివర్స్ స్వీప్‌లు, స్కూప్‌లు, స్విచ్ హిట్లు లేవు. సెకండాఫ్ సూపర్ గప్టిల్ ఆడిన 163 బంతుల్లో 65 డాట్ బాల్స్ ఉన్నాయి. అంటే మంచి బంతుల్ని గౌరవించాడు. తన జోన్లో పడ్డ ప్రతి చెత్త బంతినీ బౌండరీ దాటించాడు. 64 బంతుల్లో అర్ధసెంచరీ, 111 బంతుల్లో సెంచరీ చేసేవరకు కూడా గప్టిల్‌లో ఇలాంటి విధ్వంసకర కోణం ఒకటి ఉంటుందని తెలీదు. సెంచరీ నుంచి డబుల్ సెంచరీకి రావడానికి కేవలం 41 బంతులు సరిపోయాయి. ఈ మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్ ఆడిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై గప్టిల్ సెంచరీ చేశాడు. టోర్నీ మొత్తం బాగానే ఆడినా బంగ్లాతో మ్యాచ్ ద్వారా పూర్తిగా ఫామ్‌లోకి వచ్చాడు. అది ఇప్పుడు వెస్టిండీస్ కొంప ముంచింది. న్యూజిలాండ్‌లోని చాలా మైదానాలతో పోలిస్తే వెల్లింగ్టన్ చిన్నదేం కాదు. తను కొట్టిన రెండు సిక్సర్లు 100 మీటర్లపైనే వెళ్లాయి. కాబట్టి గప్టిల్ డబుల్‌ను మైదానం చిన్నదనో, ప్రత్యర్థి బౌలింగ్ బాగాలేదనో తక్కువ చేయలేం. మెకల్లమ్ నీడలో.... కెరీర్లో ఆడిన తొలి వన్డేలోనే (2009) సెంచరీ చేసిన గప్టిల్... దక్షిణాఫ్రికాతో టి20లోనూ సెంచరీ చేశాడు. అయినా మెకల్లమ్, రాస్ టేలర్లాంటి స్టార్ హిట్టర్స్ ఉన్న జట్టులో తనో క్లాస్ ఆటగాడిగానే మిగిలాడు తప్ప... ప్రధాన హిట్టర్ అని ఎప్పుడూ, ఎవరూ భావించలేదు. పూర్తిగా క్లాస్ షాట్స్ ఆడటం వల్ల కూడా ఇలా అనుకుని ఉండొచ్చు. ఇంగ్లండ్ మీద 2013లో వన్డేలో 189 పరుగులు చేసి, న్యూజిలాండ్ తరఫున ఈ ఫార్మాట్లో టాప్ స్కోరర్‌గా రికార్డు సృష్టించాడు. అయినా మెకల్లమ్ నీడలో ఉండిపోయాడు తప్ప... ఆరేళ్ల కెరీర్ ముగిసినా రావలసినంత పేరు రాలేదు. 2013 తర్వాత దాదాపు రెండేళ్ల పాటు తను ఫామ్‌లో లేడు. ప్రపంచకప్‌కు ముందు న్యూజిలాండ్ జట్టు శ్రీలంకతో సిరీస్ ఆడింది. అందులో తొలి మ్యాచ్‌లో గప్టిల్ డకౌట్ అయ్యాడు. తనని తీసేసి లాథమ్‌ను ఓపెనర్‌గా తీసుకోవాలనే డిమాండ్ పెరిగింది. కానీ న్యూజిలాండ్ సెలక్టర్లు గప్టిల్‌ను నమ్మారు. ఒకవేళ తీసేసి ఉంటే ఈ కొత్త చరిత్రను ఎవరూ చూసేవారు కాదు. తన మీద జట్టు ఉంచిన నమ్మకానికి గప్టిల్ న్యాయం చేశాడు. మొత్తానికి ఈ ఇన్నింగ్స్ ద్వారా వన్డేల్లో ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాట్స్‌మన్ జాబితాలోకి గప్టిల్ కూడా చేరిపోయాడు. -
ఆమ్లా డబుల్ సెంచరీ
అరంగేట్రంలో వాన్ జిల్ సెంచరీ దక్షిణాఫ్రికా 552/5 డిక్లేర్డ్ విండీస్‌తో తొలి టెస్టు సెంచూరియన్: దక్షిణాఫ్రికా కెప్టెన్ హషీమ్ ఆమ్లా (371 బంతుల్లో 208; 22 ఫోర్లు) కెరీర్లో మూడో డబుల్ సెంచరీ సాధించాడు. అలాగే తన తొలి టెస్టులోనే స్టియాన్ వాన్ జిల్ (130 బంతుల్లో 101 నాటౌట్; 15 ఫోర్లు) అదరగొట్టే ఆటతీరుతో సెంచరీ సాధించాడు. దీంతో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో సఫారీ జట్టు రెండో రోజు గురువారం 140.3 ఓవర్లలో ఐదు వికెట్లకు 552 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. టీ విరామానికి అరగంట ముందు తమ ఇన్నింగ్స్‌ను ముగించినా... వర్షం కారణంగా విండీస్ బ్యాటింగ్‌కు దిగలేకపోయింది. అంతకుముందు 340/3 ఓవర్‌నైట్ స్కోరుతో తమ తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సఫారీ తొలి సెషన్లోనే డివిలియర్స్ (235 బంతుల్లో 152; 16 ఫోర్లు; 2 సిక్సర్లు) వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత ఆమ్లాకు 27 ఏళ్ల వాన్ జిల్ నుంచి చక్కటి సహకారం లభించింది. ఈ జోడి విండీస్ పసలేని బౌలింగ్‌ను ఓ ఆటాడుకుంది. 180 పరుగుల వద్ద అవుటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్న ఆమ్లా 359 బంతుల్లో ద్విశతకం సాధించాడు. స్వదేశంలో తనకిది తొలి డబుల్. అటు వాన్ జిల్ కూడా మెరుగ్గా రాణించి 129 బంతుల్లోనే తొలి సెంచరీ సాధించాడు. అరంగేట్ర టెస్టులో శతకం సాధించిన ఐదో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. వీరిద్దరు కలిసి ఐదో వికెట్‌కు 155 పరుగులు జోడించారు. రోచ్, బెన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. -
40 ఓవర్ల మ్యాచ్‌లో డబుల్ సెంచరీ
స్కూల్ క్రికెట్లో హైదరాబాద్ కుర్రాడి ఘనత సాక్షి, హైదరాబాద్: వన్డేలో (50 ఓవర్ల మ్యాచ్) డబుల్ సెంచరీ కొడితే ఆశ్చర్యపోతాం. అలాంటిది 40 ఓవర్ల మ్యాచ్‌లోనే ఓ క్రికెటర్ డబుల్ సెంచరీబాదితే... కచ్చితంగా అది అద్భుతమే. హైదరాబాద్‌లోని ఓ స్కూల్ పిల్లాడు ఈ ఘనత సాధించాడు. బ్రదర్ జాన్ ఆఫ్ గాడ్ అండర్-14 ఇంటర్ స్కూల్ నాకౌట్ టోర్నీలో... డీఆర్ఎస్తో జరిగిన మ్యాచ్‌లో కేంద్రీయ విద్యాలయ (కేవీ) జట్టుకు చెందిన కృష్ణకాంత్ తివారి (200) అద్భుతంగా ఆడి డబుల్ సెంచరీ చేశాడు. కృష్ణకాంత్ జోరుతో కేవీ జట్టు 40 ఓవర్లలో 8 వికెట్లకు 334 పరుగుల భారీ స్కోరు సాధించింది. తర్వాత డీఆర్ఎస్ జట్టు 18.3 ఓవర్లలో కేవలం 52 పరుగులకే ఆలౌటయింది. దీంతో కేవీ జట్టు 282 పరుగుల భారీతేడాతో గెలిచింది. -
రోహిత్ శర్మకు సోఫియా హయత్ అరుదైన గిఫ్ట్
రోహిత్ శర్మ డబుల్ సెంచరీ కొట్టి.. ప్రపంచంలోనే అత్యుత్తమ స్కోరు నమోదు చేయడంతో చాలామంది సంతోషించారు. అతడికి రకరకాలుగా అభినందనలు తెలిపారు, బహుమతులు కూడా ప్రకటించారు. అయితే.. అందరికంటే ఎక్కువగా స్పందించినది మాత్రం సోఫియా హయత్. బ్రిటిష్ నటి, గాయని, మోడల్ అయిన ఈమె.. అనేక భారతీయ ఆల్బంలలో కూడా చేసింది. అయితే తాజాగా ఆమె పేరు బయటకు రావడానికి, రోహిత్ శర్మకు ఆమె ఇచ్చిన బహుమానమే కారణం. పూర్తి నగ్నంగా మారి, ఓ ఫొటో తీయించుకుని.. దాన్ని ట్విట్టర్లో షేర్ చేసింది. తన నగ్న ఫొటోను రోహిత్ శర్మకు అంకితం చేస్తున్నట్లు అందులో పేర్కొంది. చరిత్రాత్మక స్కోరు చేసినందుకు అతడికీ బహుమతి ఇచ్చినట్లు చెప్పింది. భారతదేశం కూడా అందుకు గౌరవించాలని మరీ చెప్పింది. Dedicating my nude shoot to Rohit Sharma for his historic score! Well done! This one is for you! Proud day for India! pic.twitter.com/ZZlgfs4O89 — Sofia Maria Hayat (@sofiahayat) November 13, 2014 ఆమె ఈ ఫొటో షేర్ చేయడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో విపరీతంగా వ్యాఖ్యలు వెల్లువెత్తాయి. దాంతో, అసలు నగ్న శరీరాలను చూపించడానికి ఎందుకు సిగ్గుపడాలని ఎదురు ప్రశ్నించింది. మన సొంత శరీరాల విషయంలో ఖైదీలుగా ఉండకూడదని, స్వేచ్ఛగా ఉంచాలని తెలిపింది. దేవుడు తనకు ఇంత మంచి శరీరం ఇచ్చినందుకు కృతజ్ఞతలు కూడా చెప్పింది. ఇక ఎవరో తన ఫొటోను ఫేస్బుక్లో షేర్ చేశారని, అయితే ఫేస్బుక్ మాత్రం దీన్ని అసభ్య చిత్రంగా కాకుండా.. ఓ కళారూపంగా భావించి వదిలేసిందని తెలిపింది. అందుకు ఫేస్‌బుక్‌కు కృతజ్ఞతలు కూడా చెప్పింది. Why should we be ashamed to show our bodies, we should feel liberated not prisoners of our own bodies! Thanking god for my body! — Sofia Maria Hayat (@sofiahayat) November 13, 2014 Some small minded idiot reported my pic to facebook. facebook thinks this is art and not obscene! Thankyou facebook! pic.twitter.com/3vtNERM2M1 — Sofia Maria Hayat (@sofiahayat) November 13, 2014 -
264 పరుగులకు రూ. 2.64 లక్షల నజరానా
కోల్ కతా: వన్డేల్లో సరికొత్త రికార్డు సృష్టించిన టీమిండియా బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మకు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ నజరానా అందజేసింది. వన్డేల్లో అత్యధికంగా 264 పరుగులు చేసినందుకు అతడికి రూ. 2.64 లక్షల నగదు బహుమతి ప్రకటించింది. ఈడెన్ గార్డన్స్ లో మ్యాచ్ ముగిసిన తర్వాత అతడికి ఈ నజరానా అందజేసింది. గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ డబుల్ సెంచరీ(264) సాధించాడు. ఈ మ్యాచ్ లో భారత్ 153 పరుగుల భారీ తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. వన్డేల్లో రోహిత్ శర్మకు ఇది రెండో ద్విశతకం. -
ట్విటర్ లో రోహిత్ శర్మపై అభినందనల వెల్లువ!
భారత డాషింగ్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ ప్రపంచ క్రికెట్ లో రికార్డులను తిరగరాశాడు. వన్డేలలో వ్యక్తిగతంగా అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ గా రికార్డు పుటల్లోకి ఎక్కాడు. రోహిత్ శర్మ గతంలో 209 పరుగులు చేయగా, తాజాగా కోల్ కతా లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో 264 పరుగులు చేసి అవుటయ్యాడు. రోహిత్ శర్మ సాధించిన అరుదైన ఫీట్ పై పలువురు ట్విటర్ లో అభినందించారు.What a great innings by @ImRo45 .Huge. Congratulations on this terrific run marathon.— Mohammad Kaif (@KaifSays) November 13, 2014 Wow !! What a special knock from a special player. Congrats @ImRo45 on an outstanding knock. Keep it up buddy @BCCI #IndvsSL — VVS Laxman (@VVSLaxman281) November 13, 2014 My congratulations to Rohit Sharma @ImRo45 for record 264 runs in One Day Cricket, A milestone for any batsman. President GCA — Amit Shah (@AmitShahOffice) November 13, 2014 I wonder if Sri Lanka can chase down @ImRo45 ... They require 265 to win the one match series.... #IndvsSL — Michael Vaughan (@MichaelVaughan) November 13, 2014 Incredible innings and record by @ImRo45 ! Wow ! well done boy! Many congrats on your achievement — Azhar Mahmood (@AzharMahmood11) November 13, 2014 Very well batted Rohit.thats Rohit for everyone,sheer talent.Enjoy and Witness the class in action. — Mahendra Singh Dhoni (@msdhoni) November 13, 2014 If Rohit doesn't get out he will certainly get 250 today — Mahendra Singh Dhoni (@msdhoni) November 13, 2014 Well done brothaman @ImRo45 !!! Really enjoyed watching u bat ! Way to go buddy .... — zaheer khan (@ImZaheer) November 13, 2014 Rohit Sharma... That is class!! #wellplayed #onlyplayerwith2ODIdoubles @ImRo45 — Glenn Maxwell (@Gmaxi_32) November 13, 2014 Talk about coming back with a bang. Rohit Sharma you beauty.What an innings and what class. First person to score 2 double hundreds in ODIs — Akhil Akkineni (@AkhilAkkineni8) November 13, 2014 That awkward moment when #RohitSharma c Jayawardene b Kulasekara 264 (173b 33x4 9x6) SR: 152.60 Dafaq is 264 :O — Raj Thackeray (@Madan_Chikna) November 13, 2014 Well done brothaman @ImRo45 !!! Really enjoyed watching u bat ! Way to go buddy .... — zaheer khan (@ImZaheer) November 13, 2014 Well played @ImRo45..special innings from a special player.#amazing — Ajit Agarkar (@imAagarkar) November 13, 2014 @ImRo45 u beauty ! Amazing to watch such control of batting ! Great knock brothaman — yuvraj singh (@YUVSTRONG12) November 13, 2014 Talk about coming back with a bang. Rohit Sharma you beauty.What an innings and what class. First person to score 2 double hundreds in ODIs — Akhil Akkineni (@AkhilAkkineni8) November 13, 2014 Congratulations to @ImRo45, who has become the first cricketer to hit 2 double-centuries in ODIs #stattrick #IndvSL pic.twitter.com/DTg78oKvwS — ICC (@ICC) November 13, 2014 Just so fluent and easy from @ImRo45. In this form he does make cricket look a very easy game — Harsha Bhogle (@bhogleharsha) November 13, 2014 And while I was having my afternoon nap @ImRo45 breaks a world record with 264! Wow! — Rajdeep Sardesai (@sardesairajdeep) November 13, 2014 -
8 వేల పరుగులు పూర్తి చేసిన యూనిస్ ఖాన్
అబుదాబి: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ యూనిస్ ఖాన్ డబుల్ సెంచరీ సాధించాడు. 344 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లతో ద్విశతకం పూర్తి చేశాడు. టెస్టుల్లో 8 వేల మైలురాయిని యూనిస్ చేరుకున్నాడు. 181 పరుగుల వ్యక్తిగత స్కోరు అతడు 8 వేల పరుగులు పూర్తి చేశాడు. 93వ టెస్టులో అతడీ ఘనత సాధించాడు. జావేద్ మియందాద్(8829), ఇంజమాముల్ హక్(8829) తర్వాత 8వేల పరుగులు పూర్తి చేసిన మూడో బ్యాట్స్‌మన్ గా యూనిస్ నిలిచాడు. ఆస్ట్రేలియా జట్టుపై 89 ఏళ్ల తర్వాత వరుసగా మూడు సెంచరీలు చేసిన ఘనత కూడా అతడు స్వంతం చేసుకున్నాడు. -
చరణ్ డబుల్ సెంచరీ
ఎంసీసీపై గెలాక్సీ ఘనవిజయం ఎ2-డివిజన్ రెండు రోజుల లీగ్ సాక్షి, హైదరాబాద్: గెలాక్సీ బ్యాట్స్‌మన్ ఎంఎస్ఆర్ చరణ్ (202 నాటౌట్) డబుల్ సెంచరీతో చెలరేగడంతో ఎంసీసీపై ఆ జట్టు 107 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఎ-2 డివిజన్ రెండు రోజుల లీగ్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గెలాక్సీ మూడు వికెట్ల నష్టానికి 354 పరుగుల భారీ స్కోరు సాధించింది. చరణ్‌కు తోడు యశ్ కపాడియా (57) రాణించాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఎంసీసీ జట్టు 247 పరుగులకే ఆలౌటైంది. అనురాగ్ హరిదాస్ (60), ప్రిన్స్ ఓజా (55)లు అర్ధసెంచరీలు సాధించినా.. ఇతర బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. గెలాక్సీ బౌలర్లు భరత్ రాజ్ (4/58), సుమిత్ జోషి (3/46) రాణించి ఎంసీసీ వెన్నువిరిచారు. మెగా సిటీ గెలుపు ఆక్స్ఫర్డ్ బ్లూస్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో మెగా సిటీ జట్టు 60 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన మెగా సిటీ.. సొహైల్ (107) సెంచరీకి తోడు శ్రీకర్ (86) రాణించడంతో 298 పరుగుల స్కోరు చేసింది. అయితే ఆక్స్ఫర్డ్ బ్యాట్స్‌మన్ అమిత్‌సింగ్ (107) సెంచరీ సాధించినా లక్ష్యఛేదనలో విఫలమైన ఆ జట్టు 238 పరుగులకే ఆలౌటైంది. మెగా సిటీ బౌలర్ ఎన్. అనిరుధ్ (4/62) రాణించాడు. మరో మ్యాచ్‌లో నేషనల్ జట్టు 9 వికెట్ల తేడాతో సాయి సత్య జట్టు చేతిలో ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన నేషనల్ జట్టు 110 పరుగులకే కుప్పకూలింది. సాయి సత్య జట్టు బౌలర్ విశ్వనాథ్ (5/33) రాణించాడు. అనంతరం సాయిసత్య జట్టు వికెట్ మాత్రమే కోల్పోయి 114 పరుగులు చేసి గెలిచింది. ఎల్. సతీష్‌రెడ్డి అర్ధసెంచరీ (62 నాటౌట్)తో జట్టును గెలిపించాడు. రాణించిన మజీద్ అంతర్ జిల్లా రెండు రోజుల లీగ్ చాంపియన్‌షిప్‌లో నల్లగొండ బ్యాట్స్‌మన్ ఎస్.కె. మజీద్ అర్ధసెంచరీ (88 నాటౌట్)తో రాణించాడు. ఆదిలాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలిరోజు ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. అనంతరం ఆదిలాబాద్ 178 పరుగులకు ఆలౌటైంది. మరో మ్యాచ్‌లో మెదక్ 7 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేయగా... కరీంనగర్ 8 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. -
వంశీవర్ధన్ వీరవిహారం
బాట్లింగ్, ఎంపీ కోల్ట్స్ మ్యాచ్ డ్రా ఎ1-డివిజన్ మూడు రోజుల లీగ్ సాక్షి, హైదరాబాద్: ఎ1-డివిజన్ మూడు రోజుల లీగ్‌లో హైదరాబాద్ బాట్లింగ్, ఎంపీ కోల్ట్స్ మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే బాట్లింగ్ బ్యాట్స్‌మన్ వంశీవర్ధన్ రెడ్డి (274 బంతుల్లో 201 నాటౌట్, 24 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో జట్టుకు 194 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. దీంతో బాట్లింగ్‌కు 10, కోల్ట్స్‌కు 3 పాయింట్లు లభించాయి. 156/4 స్కోరుతో గురువారం చివరి రోజు ఆటప్రారంభించిన హైదరాబాద్ బాట్లింగ్.. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ వంశీ అజేయ డబుల్ సెంచరీ సాధించడంతో తొలి ఇన్నింగ్స్‌ను 327/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఎంపీ కోల్ట్స్ బౌలర్ అమన్ ఐలవత్ 3 వికెట్లు తీశాడు. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆడిన ఎంపీ కోల్ట్స్ మ్యాచ్ ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 103 పరుగులు చేసింది. జయ్ పాండే (46 నాటౌట్), ఆకాశ్ కులకర్ణి (36 నాటౌట్) రాణించారు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు ఆంధ్రాబ్యాంక్ తొలి ఇన్నింగ్స్: 423/5 డిక్లేర్డ్; కేంబ్రిడ్జ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 175, రెండో ఇన్నింగ్స్: 238 (ప్రశాంత్ అవస్తి 68; షోయబ్ 3/25, అమోల్ షిండే 3/60) ఈఎంసీసీ తొలి ఇన్నింగ్స్: 308, రెండో ఇన్నింగ్స్: 206/3 (ఆకాశ్ 103 నాటౌట్, టి.రవితేజ 83), ఎస్బీహెచ్ తొలి ఇన్నింగ్స్: 400 (ఆకాశ్ భండారి 77, చైతన్య 65; హర్ష 4/48, అమ్రుద్దీన్ 4/64) ఆర్.దయానంద్ తొలి ఇన్నింగ్స్: 208, రెండో ఇన్నింగ్స్: 253/9 (శశాంక్ నాగ్ 76, వికాస్ 62; ప్రత్యూష్ 4/68, అహ్మద్ అస్కరి 3/67), ఫలక్‌నుమా తొలి ఇన్నింగ్స్: 161, రెండో ఇన్నింగ్స్: 36/2. సుమంత్, యతిన్ సెంచరీలు కొల్లా సుమంత్ (157 బంతుల్లో 151 నాటౌట్, 18 ఫోర్లు), యతిన్ రెడ్డి (227 బంతుల్లో 115, 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో బీడీఎల్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 65 పరుగుల ఆధిక్యం లభించింది. కాంటినెంటల్ తో డ్రా అయిన ఈ మ్యాచ్‌లో బీడీఎల్‌కు 5, కాంటినెంటల్ కు 2 పాయింట్లు దక్కాయి. చివరి రోజు ఆటలో బీడీఎల్ 6 వికెట్లకు 459 పరుగులు చేసింది. కాంటినెంటల్ తొలి ఇన్నింగ్స్‌లో 394 పరుగులు చేసింది. మెహదీహసన్‌కు 6 వికెట్లు ఎన్స్‌కాన్స్, దక్షిణ మధ్య రైల్వే జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కూడా డ్రాగా ముగిసింది. ఎన్స్‌కాన్స్ బౌలర్ మెహదీహసన్ (6/123) బౌలింగ్‌లో రాణించడంతో రైల్వే తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 345 పరుగులు చేసింది. 440/8 స్కోరు చేసిన ఎన్స్‌కాన్స్‌కు తొలి ఇన్నింగ్స్ లో 95 పరుగుల ఆధిక్యం లభించింది. -
విహారి వీర విహారం!
పోర్వోరిమ్: హైదరాబాద్ బ్యాట్స్‌మన్ గాదె హనుమ విహారి ఈ సీజన్లో తన అద్భుత ఫామ్‌ను కొనసాగించాడు. ఈ ఏడాది నాలుగు అర్ధ సెంచరీలు సాధించిన విహారి కీలకమైన మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా గోవాతో ఇక్కడ జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించింది. విహారి (378 బంతుల్లో 201 నాటౌట్; 24 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ ద్విశతకంతో పాటు కీపర్ హబీబ్ అహ్మద్ (94 బంతుల్లో 78 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్) కూడా రాణించడంతో హైదరాబాద్ 171 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 514 పరుగుల స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. వీరిద్దరు ఏడో వికెట్‌కు అభేద్యంగా 33.3 ఓవర్లలోనే 172 పరుగులు జోడించడం విశేషం. అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన గోవా 7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 9 పరుగులు చేసింది. భారీ భాగస్వామ్యం... 234/3 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం ఆట ప్రారంభించిన హైదరాబాద్ తొలి రోజుకంటే వేగంగా ఆడింది. విహారి, సందీప్ కలసి చక్కటి సమన్వయంతో ఇన్నింగ్స్‌ను కొనసాగించారు. ఈ క్రమంలో సందీప్ కెరీర్లో ఎనిమిదో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు నిలకడగా ఆడిన విహారి కూడా సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. విహారి ఫస్ట్‌క్లాస్ కెరీర్లో ఇది రెండో సెంచరీ. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 137 పరుగులు జోడించిన అనంతరం గడేకర్ బౌలింగ్‌లో బందేకర్కు క్యాచ్ ఇచ్చి సందీప్ నిష్ర్కమించాడు. ఆ తర్వాతి ఓవర్లోనే అహ్మద్ ఖాద్రీ (0) వెనుదిరగ్గా... షిండే (7) కూడా ఎక్కువ సేపు నిలబడలేకపోయాడు. ఈ దశలో విహారితో హబీబ్ అహ్మద్ జత కలిశాడు. వీరిద్దరు అనూహ్య వేగంతో ధాటిగా ఆడి పరుగులు పిండుకున్నారు. 5.13 పరుగుల రన్‌రేట్‌తో ఈ భాగస్వామ్యం సాగింది. 20 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల కెరీర్లో ఒకే ఒక సిక్స్ కొట్టిన విహారి... ఈ ఇన్నింగ్స్‌లో 3 సిక్సర్లు బాదడం విశేషం! ఇదే జోరులో హబీబ్ తన కెరీర్లో తొలి అర్ధ సెంచరీని అందుకున్నాడు. మరి కొద్ది సేపటికే తన అత్యధిక స్కోరు (191)ను అధిగమించిన విహారి... తొలి డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దాంతో హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఐదేళ్ల తర్వాత... హైదరాబాద్ తరఫున ఒక బ్యాట్స్‌మన్ రంజీ ట్రోఫీలో ఐదేళ్ల తర్వాత డబుల్ సెంచరీ సాధించడం విశేషం. 2008-09 సీజన్లో భాగంగా రాజస్థాన్ జట్టుతో ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో వీవీఎస్ లక్ష్మణ్ 224 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఉన్న జట్టు సభ్యులలో కూడా విహారి ఒక్కడి ఖాతాలోనే ద్విశతకం ఉంది. -
రాస్ టేలర్ డబుల్ సెంచరీ
డునెడిన్: రాస్ టేలర్ (319 బంతుల్లో 217 నాటౌట్; 23 ఫోర్లు) కెరీర్లో తొలి డబుల్ సెంచరీ నమోదు చేయడంతో... వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ భారీ స్కోరు చేసింది. బుధవారం రెండో రోజు కివీస్ తొలి ఇన్నింగ్స్‌ను 153.1 ఓవర్లలో 9 వికెట్లకు 609 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ ఆట ముగిసే సమయానికి 24 ఓవర్లలో 2 వికెట్లకు 67 పరుగులు చేసింది. డారెన్ బ్రేవో (37 బ్యాటింగ్), శామ్యూల్స్ (14 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. బోల్ట్, సౌతీకి చెరో వికెట్ దక్కింది. అంతకుముందు 367/3 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన కివీస్ ఆరంభంలోనే మెకల్లమ్ (113) వికెట్‌ను కోల్పోయింది. దీంతో టేలర్, మెకల్లమ్ మధ్య నాలుగో వికెట్‌కు 195 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. విండీస్‌పై కివీస్‌కు ఇది రికార్డు భాగస్వామ్యం. తర్వాత వచ్చిన అండర్సన్ (0) విఫలమైనా... వాట్లింగ్ (41) నిలకడగా ఆడాడు. టేలర్‌కు చక్కని సహకారం అందిస్తూ ఆరో వికెట్‌కు 84 పరుగులు జోడించి అవుటయ్యాడు. చివర్లో సౌతీ (2) నిరాశపర్చినా... సోధి (35), వాగ్నేర్ (37)లు మాత్రం సమర్థంగా ఆడారు. ఈ ఇద్దరి అండతో చెలరేగిన టేలర్ 295 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. న్యూజిలాండ్ తరఫున ‘డబుల్’ సాధించిన 13వ బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు. -
'సిక్స్'ర పిడుగు!
లేజీ ఆటగాడిగా ముద్ర పడిన రోహిత్‌శర్మ జూలు విధిలించాడు. క్రేజీ ఆటతో తన సత్తా ఏంటో కంగారూలకు రుచి చూపించాడు. సిక్సర్ల సునామీ సృష్టించాడు. 'డబుల్' వాయింపుతో ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సిరీస్ నెగ్గాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో వీ(హీ)రోచిత ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకభూమిక పోషించాడు. రో'హిట్'తో 57 పరుగులతో ఆసీస్‌ను ఓడించి ధోని సేన 3-2 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియాతో శనివారం జరిగిన చివరి వన్డేలో రోహిత్ శర్మ డబుల్ సెంచరీ(209) సాధించాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన మూడో బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. 16 సిక్సర్లతో అతడీ ఘనత సాధించాడు. 15 సిక్సర్లతో షేన్ వాట్సన్(ఆస్ట్రేలియా) పేరిట రికార్డును రోహిత్ తిరగరాశాడు. వన్డేల్లో డబుల్ సెంచరీలు చేసిన ముగ్గురు భారత్ ఆటగాళ్లే కావడం విశేషం. అంతేకాదు తానెంతో ఆరాధించే సచిన్ టెండూల్కర్‌ను రోహిత్ శర్మ అధిగమించడం విశేషం. వన్డేల్లో సచిన్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 200 కాగా, రోహిత్ 209 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రెండో బ్యాట్స్‌మెన్‌గా అతడు నిలిచాడు. వీరేంద్ర సెహ్వాగ్(219) రోహిత్ కంటే ముందున్నాడు. విశేషమేమిటంటే సచిన్, రోహిత్ డబుల్ సెంచరీలకు కెప్టెన్ ధోని ప్రత్యక్ష సాక్షిగా నిలిచాడు. ఈ ఇద్దరూ ద్విశతకాలు సాధించినప్పడు అదర్ ఇండ్లో 'లక్కీ' ధోని ఉన్నాడు. వెస్టిండీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌లోనూ చోటు దక్కించుకున్న రోహిత్ ఈ ఫార్మాట్లోనూ సత్తా చాటాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. -
రోహిత్ శర్మ తొలి డబుల్ సెంచరీ, ఆసీస్ టార్గెట్ 384
బెంగళూరు: చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో శనివారమిక్కడ జరుగుతున్న ఏడవ ‘ఫైనల్’ వన్డేలో మరోసారి భారత్ దీపావళి టపాసు గట్టిగానే పేలింది. భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 383 పరుగులు చేసి ఆసీస్‌కు 384 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ముందుంచింది. ఈ సిరిస్‌లో ఓపెనర్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ తనదైనా శైలిలో ధీటుగా ఆడుతూ 158 బంతుల్లో 12ఫోర్లు, 16 సిక్స్‌లతో 209 పరుగుల అధ్బుతమైన ఇన్నింగ్ ఆడి తొలి డబుల్ సెంచరీ పూర్తిచేశాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన.. మూడో బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. ఆసీస్ వేసిన చెత్తబంతులను ఆడిందే తడువుగా వచ్చిన బంతి వచ్చినట్టుగా రోహిత్ బౌండరీలను దాటించాడు. రోహిత్ శర్మ ఆది నుంచి నిలకడగా రాణిస్తూ తన బ్యాటింగ్‌తో విమర్శకులను సైతం అబ్బురపరిచాడు. ఒక్కమాటలో చెప్పాలంటే.. రోహిత్ శర్మ క్రికెట్ అభిమానులకు మంచి `దీపావళి ధమాకా` అందించాడు. తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత ఓపెనర్ శేఖర్ ధావన్, రోహిత్ శర్మ భాగస్వామ్యంతో భారత్‌కు శుభారంభాన్ని ఇచ్చారు. శేఖర్ ధావన్ అదేరీతిలో మెరుపువేగంతో దూకుడుగా ఆడుతూ పరుగుల పటాసులు పేల్చాడు. ధావన్ 57 బంతుల్లో 9ఫోర్లతో 60 పరుగులు చేసి చక్కని ఇన్నింగ్స్ ఆడాడు. అంతలో దోహిర్తి బౌలింగ్‌లో ఎల్బిడబ్య్లూ తో పెవిలీయన్‌కు వెళ్లక తప్పలేదు. శేఖర్ ధావన్ ఔట్ కావడంతో వీరాట్ కోహ్లి రంగప్రవేశం చేశాడు. పరుగు తీసేందుకు విపలయత్నం చేశాడు. దీంతో కోహ్లి కూడా పెవిలీయన్ బాట పట్టాడు. ఆ తరువాత వచ్చిన ఆటగాళ్లు వరుసుగా సురేష్ రైనా (30బంతుల్లో 2 ఫోర్లుతో) 28 పరుగులు, యువరాజ్ సింగ్ (14బంతుల్లో 1 సిక్స్‌తో) 12 పరుగులకే పరిమితమైయ్యారు. వీరిద్దరి టాపాసులు ఒకరితరువాత ఒకరివి క్రీజులో వరుసుగా తుస్సుమన్నాయి. అప్పటికే ఆరంభం నుంచి విజయుడై దూసుకెళ్తున్న రోహిత్ శర్మ నిలకడగా రాణిస్తూ తన బ్యాటింగ్‌తో ఆసీస్ జట్టుకు చుక్కలు చూపించాడు. రోహిత్‌కు తోడుగా బరిలోకి దిగిన భారత్ కెప్టెన్ ధోనీ (38బంతుల్లో 7ఫోర్లు, 2 సిక్స్) 62 పరుగులు చేసి ఔటైయ్యాడు. అయితే ఆసీస్ బౌలర్ మెకె బౌలింగ్‌లో హెన్రిక్యివ్స్ క్యాచ్ పట్టుకోవడంతో రోహిత్ ఔట్ కాగా, ధోనీ రన్ ఔట్ అయ్యాడు. ఆసీస్ బౌలర్లు మెకె, పల్కనర్ తలో వికెట్ తీసుకోగా, దొహర్తీ 2 వికెట్లు తీసుకున్నాడు. అంతకముందు టాస్‌గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆసీస్ భారత్‌పై ప్రతికారం తీర్చుకునేందుకు సిద్ధమవుతున్న తరుణంలో వరుణుడు సహాకరించలేదు. ఈ సిరీస్ విజేతను నిర్దేశించే మ్యాచ్ కావడంతో రెండు జట్లూ నాణ్యమైన క్రికెట్ ఆడేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. కాగా, నాగ్‌పూర్‌లో భారీ స్కోరు చేసినా మ్యాచ్‌ను ఆసీస్ చేజార్చుకున్న విషయం తెలిసిందే.