రోహిత్ శర్మకు సోఫియా హయత్ అరుదైన గిఫ్ట్ | Sakshi
Sakshi News home page

రోహిత్ శర్మకు సోఫియా హయత్ అరుదైన గిఫ్ట్

Published Sat, Nov 15 2014 3:33 PM

రోహిత్ శర్మకు సోఫియా హయత్ అరుదైన గిఫ్ట్

రోహిత్ శర్మ డబుల్ సెంచరీ కొట్టి.. ప్రపంచంలోనే అత్యుత్తమ స్కోరు నమోదు చేయడంతో చాలామంది సంతోషించారు. అతడికి రకరకాలుగా అభినందనలు తెలిపారు, బహుమతులు కూడా ప్రకటించారు. అయితే.. అందరికంటే ఎక్కువగా స్పందించినది మాత్రం సోఫియా హయత్. బ్రిటిష్ నటి, గాయని, మోడల్ అయిన ఈమె.. అనేక భారతీయ ఆల్బంలలో కూడా చేసింది. అయితే తాజాగా ఆమె పేరు బయటకు రావడానికి, రోహిత్ శర్మకు ఆమె ఇచ్చిన బహుమానమే కారణం. పూర్తి నగ్నంగా మారి, ఓ ఫొటో తీయించుకుని.. దాన్ని ట్విట్టర్లో షేర్ చేసింది. తన నగ్న ఫొటోను రోహిత్ శర్మకు అంకితం చేస్తున్నట్లు అందులో పేర్కొంది. చరిత్రాత్మక స్కోరు చేసినందుకు అతడికీ బహుమతి ఇచ్చినట్లు చెప్పింది. భారతదేశం కూడా అందుకు గౌరవించాలని మరీ చెప్పింది.

Advertisement
 
Advertisement
 
Advertisement