Photo: MI Twitter
మ్యాచ్ ఏదైనా సరే గెలుపోటమలు సహజం. ఆరోజు మ్యాచ్‌లో ఎవరు బాగా ఆడితే వారినే విజయం వరిస్తుందనేది అక్షర సత్యం. ఈ మాటలు ఒక్కోసారి మాత్రమే నిజం కాకపోవచ్చు.. కానీ అన్నిసార్లు బాగా ఆడివారిదే అంతిమంగా విజయం. ఇక క్రికెట్‌లోనూ జరిగేది ఇదే. రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో గెలిచేది ఎవరో ఒకరే. అయితే గెలవడానికి బాగా ఆడితే సరిపోదు.. ఒక్కోసారి అదృష్టం కూడా కలిసి రావాలి.
మరి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నార్రా అంటే మంగళవారం ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించి ఐపీఎల్ 16వ సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది.ఇక్కడివరకు బాగానే ఉంది. అయితే మ్యాచ్ గెలిచాకా స్వయంగా ముంబై ఫ్రాంచైజీ తమ ట్విటర్‌లో ఆర్‌సీబీని ట్రోల్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టింది. మీరు కర్మను నమ్ముకున్నారు.. మేము మాత్రం శర్మని నమ్మాం అని ట్వీట్ చేసింది. ముంబై ఇండియన్స్ ఇంత ఆవేశంగా పోస్ట్ చేయడం వెనుక ఒక బలమైన కారణం ఉంది.
సీజన్‌లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌ను ఆర్‌సీబీతో ఆడింది. ఆ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. కోహ్లి, డుప్లెసిస్‌లు చెలరేగడంతో ఆర్‌సీబీ 172 పరుగుల లక్ష్యాన్ని 17 ఓవర్లలోనే అందుకుంది. అయితే ఈ మ్యాచ్ ఆర్‌సీబీ హోంగ్రౌండ్ బెంగళూరులో జరిగింది. మ్యాచ్‌కు వచ్చిన అభిమానులు కాస్త హద్దుమీరి ప్రవర్తించారు. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ సమయంలో రోహిత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు.. 'రోహిత్ వడాపావ్(#Rohit Vadapav)' అంటూ హేళన చేశారు. అంతేకాదు పలుమార్లు ముంబై ఆటగాళ్లను కించపరిచేలా నినాదాలు చేశారు. ఇవన్నీ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి నచ్చలేదు. అయితే తాజాగా ముంబై గెలవడంతో ఫ్రాంచైజీ ఆర్‌సీబీకి వార్నింగ్ ఇస్తూ ఈ పోస్టును పెట్టింది.
మరి ఇదే పోస్టు ఎందుకు పెట్టిందంటే.. ముంబై ఇండియన్స్‌పై గెలిచిన ఆర్‌సీబీ ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటములను చవిచూసింది. ఇక లక్నోతో జరిగిన మ్యాచ్‌లో అయితే ఆర్‌సీబీ ఓడిన తీరు అందరికి గుర్తుండే ఉంటుంది. ఆఖరి ఓవర్ వరకు థ్రిల్లింగ్‌గా సాగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఓటమి పాలయ్యింది. మొదట నికోలస్ పూరన్, మార్కస్ స్టోయినిస్‌లు తమ వీరోచిత బ్యాటింగ్‌తో ఆర్‌సీబీ నుంచి మ్యాచ్‌ను లాగేసుకొనే ప్రయత్నం చేశారు.
అయితే చివరి ఓవర్లలో ఆర్‌సీబీ ఫుంజుకుంది. కర్మ ఫలితం ఇలాగే రాసి ఉంటే ఓటమిని మాత్రం ఎవరు తప్పించగలరు.. ఆరోజు లక్నో చేతిలో ఆర్‌సీబీ ఓడిపోవాలని రాసి ఉన్నట్లుంది. ఇక హర్షల్ పటేల్ వేసిన ఆఖరి ఓవర్లో రెండు వికెట్లు పడ్డప్పటికి.. మన్కడింగ్ చేసినప్పటికి.. ఆర్‌సీబీకి కలిసి రాలేదు. అందుకే మ్యాచ్ ఓడిపోయింది. దీనిని దృష్టిలో పెట్టుకొనే ఇవాళ ముంబై ఇండియన్స్ ఆర్‌సీబీని హెచ్చరిస్తూ తమదైన శైలిలో ట్వీట్ చేసింది.
𝗛𝗜𝗧𝗠𝗔𝗡 hai, ROar toh karega 🤷♂️😉💙#OneFamily #DCvMI #MumbaiMeriJaan #MumbaiIndians #IPL2023 #TATAIPL @ImRo45 pic.twitter.com/su2eJKDj05
— Mumbai Indians (@mipaltan) April 12, 2023
చదవండి: భార్య రితికాతో ఆసక్తికర సంభాషణ.. మధ్యలో ఈ సామీ ఎవరు?
Comments
Please login to add a commentAdd a comment