sofia hayat
-
రోహిత్ శర్మతో ప్రేమాయణం.. చివరకు సన్యాసినిగా మారిన హీరోయిన్!
సినిమా అనేది రంగుల ప్రపంచం. ఇక్కడ ఎవరి జీవితం ఎప్పుడు, ఎలా మారుతుందో చెప్పలేం. ఒక్క సినిమాతోనే స్టార్డమ్ పొందిన వాళ్లు కొంతమంది అయితే.. ఆ ఒక్క సినిమా చాన్స్ కూడా రాక ఇండస్ట్రీకే దూరమైనవాళ్లు మరికొంతమంది. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇది బాగా జరుగుతుంది. ఒకటి,రెండు సినిమాలు హిట్ అయితే చాలు.. దర్శకనిర్మాతలు ఆమె దగ్గర క్యూ కడతారు. కొన్నాళ్ల పాటు బాగానే ఉంటుంది. ఫ్లాప్ వస్తే మాత్రం చాలు.. పలకరించడానికి కూడా రారు. అందుకే చాలా మంది హీరోయిన్లు ఒకటి, రెండు సినిమాల్లో నటించి..ఆ తర్వాత వెండితెరకు కనుమరుగైపోతున్నారు. మరికొంత మంది అయితే కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకొని.. ఆ తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్నప్పటికీ... గ్లామర్ ప్రపంచాన్ని వదిలేసి సన్యాసినిగా మారింది. ఆమే బాలీవుడ్ బ్యూటీ సోఫియా హయత్. 20వ దశకంలో స్పెషల్ సాంగ్స్‌తో బాలీవుడ్లో ఓ ఊపు ఊపింది ఈ నటి. 2008లో క్యాష్అండ్ కర్రీ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సిక్స్ ఎక్స్, అక్సర్ 2 వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. హిందీ బిగ్‌బాస్ షో(2013) పాల్గొని మరింత ఫేమస్ అయింది. 2012లో ఇండియన్ క్రికెటర్ రోహిత్ శర్మతో ప్రేమలో పడి..కొన్నాళ్ల పాటు డేటింగ్ కూడా చేసినట్లు రూమర్స్ వచ్చాయి. అయితే 2015లో వీరిద్దరు విడిపోయారు. ఆ తర్వాత రోమేనియన్ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని..ఏడాదిలోపే విడాకులు తీసుకుంది. కొన్నాళ్లుగా పాటు ఒంటరిగా ఉన్న సోఫియా.. 2016లో ఇండస్ట్రీని వదిలి ఆధ్యాత్మిక బాట పట్టింది. భౌతిక ఆనందాల కంటే ఆధ్యాత్మికత మార్గమే ఉత్తమని, అందుకే ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నట్లు తెలిపింది. -
నటికి ఆపరేషన్.. మూడు వారాలు బెడ్‌పైనే, నడుద్దామన్నా..
అద్దం ముందు గంటలతరబడి నిలబడి రెడీ అయ్యే అమ్మాయిలందరో! అందాన్ని కాపాడుకోవడం కోసం, అందంగా కనిపించడం కోసం తహతహలాడిపోతుంటారు. సెలబ్రిటీలైతే ఈ విషయంలో ఒక మెట్టు ఎక్కువే ఉంటారు. చర్మ రక్షణ కోసం వారు సమయం, ఖర్చు రెండింటినీ వాడేస్తారు. చర్మంపై చిన్న గీత పడ్డా తట్టుకోలేరు. అలాంటిది బిగ్‌బాస్ బ్యూటీ, నటి, సింగర్ సోఫియా హయత్‌కు పెద్ద కష్టం వచ్చిపడింది. పొట్టపై మచ్చతో ఫోటోషూట్ సోఫియా కడుపులో 7 సెంటిమీటర్ల కణతి తయారవడంతో వైద్యులు ఆపరేషన్ చేసి దాన్ని తొలగించారు. ఆపరేషన్ అనంతరం పొట్టపై పొడవాటి కుట్లు వేశారు. ఈ కుట్లను చూపిస్తూ చిన్నపాటి ఫోటోషూట్ చేసింది సోఫియా హయత్. తన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ.. 'నేను ఈ సమస్య నుంచి సక్సెస్‌ఫుల్‌గా బయటపడినందుకు సంతోషంగా ఉంది. ఈ ఆపరేషన్ తర్వాత నా శక్తి అంతా నాకు తిరిగి లభించింది. నా పొట్టలో ఉన్న ఏడు సెం.మీ. కణతిని తీసేశారు. కానీ కోలుకోవడానికి చాలా సమయం పడుతోంది. నాకు ఫ్యామిలీ లేదు నాకిప్పుడు మానసిక ధైర్యం కూడా ముఖ్యం. నా శరీరం నడవడానికి, నిద్రించడానికి, బెడ్‌పై నుంచి లేవడానికి, ఏదైనా పట్టుకోవడానికి, ఆఖరికి బాత్రూమ్కు వెళ్లడానికి కూడా సహకరించడం లేదు. నాకంటూ ఎవరూ లేరు కాబట్టి నేనే ఎలాగోలా మ్యానేజ్ చేయాలి. కానీ నాకంటూ మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. లేడీ క్లాడియా, స్టర్మ్ ఆస్పత్రిలో నా వెంటే ఉన్నారు. వీళ్లే నా నిజమైన కుటుంబం. వాళ్లను నేను ఎంతగానో ప్రేమిస్తున్నానో వాళ్లు కూడా అంతే ప్రేమను తిరిగిస్తున్నారు. శరీరం వణికిపోతోంది ఆస్పత్రిలో నేను ఐదురోజులున్నాను. మూడు వారాలు బెడ్ రెస్ట్ ఇచ్చారు. నేను ఒక్కదాన్నే కావడంతో పక్కింటివాళ్లు నాకు కొంత సాయం చేశారు. కాస్త బయటకు వెళ్లి నడుద్దామనుకున్నప్పుడు నా పనిమనిషి సాయపడింది, అయితే నాలుగడుగులు వేయగానే నా శరీరం వణికిపోయింది. నేను ఎప్పుడూ ఫిట్‌గా, స్ట్రాంగ్‌గా ఉండేదాన్ని. అలాంటిది ఇప్పుడు కనీసం నడవలేకపోతున్నాను. ఇలాంటి సందర్భాల్లోనే మనుషుల నిజస్వరూపాలు కూడా బయటపడతాయి. ఎవరిది నిజమైన ప్రేమ, ఎవరు ఫేక్ అని తెలుసుకున్నాను. చాలామందికి నేను డబ్బిచ్చాను, రకరకాలుగా సాయం చేశాను. కానీ వాళ్ల నుంచి నాకేదీ తిరిగిరాలేదు. అలాంటివాళ్లకు దూరంగా ఉండటమే నయం అని ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Sofia Hayat (@sofiahayat) View this post on Instagram A post shared by Sofia Hayat (@sofiahayat) చదవండి: దానివల్లే శాకుంతలం సినిమా కలెక్షన్స్ రావట్లేదు -
రోహిత్ శర్మతో డేట్ చేశా: నటి బ్రేకప్ లవ్ స్టోరీ
రోహిత్ శర్మ.. క్రికెట్ మైదానంలో హిట్మన్గా ప్రసిద్ధుడు. ఇండియన్ ఒపెనింగ్ బాట్స్మన్. సోఫియా హయత్.. సంచలనాలకు మారుపేరు. బ్రిటిష్ మోడల్, సింగర్, యాక్ట్రెస్.. టెలివిజన్ పర్సనాలిటీ.. బిగ్‌బాస్ (హిందీ) పోటీదారు. ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. విరబూసి జీవితాలను పండించేలోపే వాడిపోయింది. ఆ ఫెయిల్యూర్ స్టోరీ ఎలా మొదలైందంటే.. 2012.. లండన్‌లోని ఓ క్లబ్లో రోహిత్‌ను కలిసింది సోఫియా. ఆమె నటించిన సినిమా పూర్తయిన సందర్భంగా ఇస్తున్న పార్టీలో. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా రోహిత్ ఆ పార్టీకి వచ్చాడు. ఇద్దరూ ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. అది మొదలు లండన్, ముంబై, ఢిల్లీలో జరిగిన ఇంకెన్నో పార్టీల్లో కలుసుకున్నారు. మంచి స్నేహితులుగా మారారు. ఇంకొన్నాళ్లకే ప్రేమికులయ్యారు. చెట్టాపట్టాల్.. చెట్టుపుట్టల్.. హాలిడేయింగ్స్.. సర్వసాధారణమే! కానీ ఆ ప్రేమను బయటపడనివ్వకుండా గుట్టుగానే దాచుకున్నారు. కాదు.. దాచుకున్నామని అనుకున్నారు. మీడియా పట్టేసింది. ఆ వార్తలను హెడ్‌లైన్స్‌గా మార్చి బాగా ప్రచారం చేసింది. ఇటు క్రికెట్ ఫీల్డ్‌లో.. అటు సినిమా, మోడలింగ్ ఫీల్డ్‌లో ఈ జంట ప్రేమ చర్చనీయాంశమైంది. అది ఆ ఇద్దరి చెవిన పడినా రూమర్ అన్నట్టుగానే పట్టించుకోలేదు. ఏనాడూ మీడియా ముందు గానీ.. సోషల్ మీడియాలో గానీ ప్రస్తావించలేదు. ఆ ఇద్దరి మధ్య బ్రేకప్ అయ్యాకే తమ మధ్య ప్రేమవ్యవహారం నడిచిందని ట్విటర్ వేదికగా ప్రకటించింది సోఫియా... ‘ఓకే.. ఈ వదంతులకు నేటితో.. ఫుల్స్టాప్ పెడుతున్నాను. యెస్..రోహిత్ శర్మతో నేను డేట్ చేశాను. కానీ ఇప్పుడా ప్రేమ బ్రేక్ అయిపోయింది. మళ్లీ మేం కలిసేది లేదు.. మా ఆ అనుబంధాన్ని పునరుద్ధరించుకునే ఆసక్తీ లేదు. ఇప్పుడు నేనో మంచి మనిషి తోడు కోసం వేచి చూస్తున్నాను’ అంటూ. నువ్వంటే నువ్వని.. మూడేళ్ల ముచ్చటగా 2015లో ముగిసిపోయిన ఆ బ్రేకప్‌కు కారణం రోహిత్ శర్మ అంటుంది సోఫియా. ‘సోఫియానే’ అంటారు రోహిత్ శర్మ సన్నిహితులు. ‘నా గురించి మీడియా ఎప్పుడు వివరం అడిగినా.. సోఫియా నా ఫ్యాన్ అనే చెప్పాడు తప్ప లవ్ అని చెప్పలేదు. నా గురించి నిజం చెప్పడానికి అంతగా ఇబ్బందిపడే వ్యక్తితో ప్రేమేంటి అని బ్రేకప్ చేసేసుకున్నా’ అని చెప్పింది సోఫియా ఒక ఇంటర్వ్యూలో. రోహిత్ శర్మ సన్నిహితుల కథనం ప్రకారం.. సోఫియా, విరాట్ కొహ్లీల స్నేహం. ఆమె.. విరాట్‌తో చెలిమి పెంచుకొని అతనితో చనువుగా మసలుకోవడం వల్లే రోహిత్.. సోఫియాకు దూరమయ్యాడని అంటారు. సోఫియాతో కలిసి ఉన్నప్పుడు రోహిత్ శర్మ తమ ప్రేమానుబంధం గురించి ఎలా పెదవి విప్పలేదో విడిపోయిన తర్వాతా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. కనీసం సోఫియా ట్వీట్లకు కౌంటర్ కూడా ఇవ్వలేదు. చదవండి: స్టూడియోలో వాంతులు చేసుకున్న ప్రదేశాన్ని శుభ్రం చేసేదాన్ని ‘రోహిత్‌ను పరిచయం చేస్తూ అతను క్రికెటర్ అని చెప్పాడు నా ఫ్రెండ్. అతను నాకు పరిచయం అయ్యేవరకు అతనో క్రికెటర్ అని నాకు తెలియదు. ఎందుకంటే క్రికెట్ అంటే నాకు పెద్దగా ఆసక్తి లేదు.. మ్యాచెస్‌ను చూడలేదు కూడా. కాని తొలి పరిచయంలోనే రోహిత్ నచ్చాడు. వాట్ ఏ కూల్ మ్యాన్ అనుకున్నాను. మా స్నేహం పెరిగే కొద్దీ నిజంగానే అతను మంచి మనిషిగానే కనిపించసాగాడు నాకు. చాలా సెన్సెటివ్. క్రికెట్ గురించి, ఫ్యాన్స్ గురించి చెప్పేవాడు. బాగా ఆడకపోతే ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చెప్పేవాడు. ఆ భావోద్వేగాల గురించి గంటలు గంటలు డిస్కస్ చేసుకునే వాళ్లం. అంతా బాగానే ఉంది.. సజావుగా సాగిపోతోంది అనుకుంటున్నప్పుడే రోహిత్‌ను ఒకసారి మీడియా అడిగింది ఆయన లైఫ్‌లో నేనేంటి అని. దానికి రోహిత్ అసలేం తడుముకోకుండా తను జస్ట్ ఫ్యాన్ అంతే. అంతకుమించి మరేం లేదు అని ఆన్సర్ చేశాడు.ఆ జవాబు.. చెప్పిన తీరును ఎందుకో రిసీవ్ చేసుకోలేకపోయాను. చాలా బాధపడ్డాను. ఇక ఆ ప్రేమ ముందుకు సాగదని అర్థమైంది. అందుకే వద్దనుకున్నాను’ అని ట్విటర్ ముఖంగా వెల్లడించింది. సోఫియాతో విడిపోయాక 2015లోనే రితికా సజ్దేను ప్రేమ వివాహం చేసుకున్నాడు రోహిత్. ఇప్పుడు వాళ్లకొక పాప సమైరా. సోఫియా.. తన జీవితాన్ని పుస్తకంగా రాసే పనిలో ఉంది. అందులో రోహిత్ శర్మతో తన ప్రేమ జీవితం కూడా ఉంటుందని చెప్పింది. - ఎస్సార్ చదవండి: వెబ్ సిరీస్‌తో పాపులారిటీ సంపాదించుకున్న మోడల్ -
పోర్నోగ్రఫీ కేసు: ముందే ‘అలాంటి’ సీన్స్ రిహార్సల్ చేయమన్నారు
Raj Kundra Case: పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను అరెస్ట్ చేయడం బాలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ కేసు గురించి ఇప్పటికే చాలా మంది బాలీవుడు నటీ,నటీమణులు పలు విషయాలు వెల్లడించారు తాజాగా నటి, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ సోఫియా హయత్ ఈ కేసు నేపథ్యంలో పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను బిగ్‌బాస్ షో చేస్తున్నప్పుడు ఓ ఏజెంట్ ఇంటిమేట్ సీన్స్ చేయాలని అభ్యర్థించాడని,అంతేకాకుండా షూటింగ్‌కి ముందే అలాంటి సీన్స్ రిహార్సల్స్ చేసి వీడియోలు పంపమని కోరాడని ఆరోపించింది. నిజంగా ప్రొఫెషనల్‌గా శృంగార సన్నివేశాలు చిత్రీకరించే వాళ్లు ఎవరూ ముందుగా అలాంటి సీన్స్ చేసి చూపించమని అడగరని చెప్పింది. గతంలో సోఫియా కొన్ని హాలీవుడ్ చిత్రాల్లో బెడ్ రూం సీన్స్‌లో నటించింది. అప్పుడు ఎవరూ తనని ముందుగా వచ్చి ‘రిహార్సల్స్’చేయమని అడగలేదని, అందుకే ఆ ఏజెంట్ మాటలను తాను నమ్మలేదని సోఫియా చెప్పుకొచ్చింది. బాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వాలనుకొనే అమ్మాయిలను కొంతమంది ఏజెట్లు మోసం చేసి, అశ్లీల చిత్రాలలో నటింపజేస్తున్నారని సోఫియా ఆరోపించింది. అవకాశాల పేరుతో పోర్న్ వీడియోలు చేయిస్త్నున్నారని మండిపడింది. ఇలా అమ్మాయిలను మోసం చేసి అశ్లీల సినిమాల్లో నటించేలా చేయడం అత్యాచారంతో సమానమని, అలాంటి వారి పట్ల కోర్టులు కఠినంగా వ్యవహరించాలని సోఫియా అభిప్రాయపడింది. -
బిగ్‌బాస్ కంటెస్టెంట్ భర్త అరెస్ట్
లండన్ : బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ సోఫియా హయత్ భర్త వ్లాద్ స్టానెస్కును లండన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నటి ఫిర్యాదు మేరకు గత నెల రోజులుగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు వ్లాద్‌ను అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక వెబ్ మీడియా తెలిపింది. పోలీసుల కథనం ప్రకారం.. హిందీ బిగ్ బాస్ 7 షోలో అర్మాన్ కోహ్లీతో గొడవ వల్ల సిరీస్ మధ్యలోనే వైదొలగి పాపులర్ అయిన మోడల్ సోఫియా హయత్. సింగర్, మోడల్ అయిన సోఫియా 2016లో తాను నన్(సన్యాసిని) గా మారినట్లు ప్రకటించి.. ఆపై మేకప్ వాడుతున్నట్లు ఫొటోలు వైరల్ కావడంతో క్షమాపణ కూడా చెప్పారు. 2017లో రొమేనియాకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ వ్లాద్ స్టానెస్కును ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సోఫియా. గత కొంతకాలం నుంచి వీరి మధ్య విభేదాలున్నాయి. ఈ క్రమంలో తనను గొంతునులిమి హత్యాయత్నం చేశాడని ఆరోపిస్తూ భర్త వ్లాద్పై గత నెలలో లండన్ పోలీసులకు సోఫియా ఫిర్యాదు చేశారు. ఇంటీరియర్ డిజైనర్ అని చెప్పి భర్త వ్లాద్ తనను మోసం చేశారని నటి ఆరోపించారు. భర్త చోరీలకు పాల్పడుతూ మరింతగా దిగజారాడన్న మోడల్.. 10 లక్షల రూపాయలు విలువ చేసే తమ వివాహ ఉంగరాన్ని కూడా చోరీ చేసి కేవలం 1.5లక్షల రూపాయలకు విక్రయించాడని సోఫియా హయత్ ఆవేదన వ్యక్తం చేశారు. తన స్వదేశం రొమేనియాకు తిరిగివెళ్లనని భర్త వ్లాద్ తరచుగా తనతో చెప్పేవాడన్నారు. రొమేనియా ప్రభుత్వానికి అతడు బాకీ పడ్డాడని, ఈ కేసుకు భయపడి తన భర్త స్వదేశానికి వెళ్లాలంటే ఆందోళన చేందేవాడని పోలీసులకు వివరించారు. నెల రోజులు అన్వేషణ తర్వాత లండన్‌లోని ఓ షాపింగ్ మాల్లో సోఫియా భర్త వ్లాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్‌తో అసభ్యంగా...
నటి, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ సోఫియా హయత్‌కు సోషల్ మీడియాలో మళ్లీ చేదు అనుభవం ఎదురయ్యింది. ఓ వ్యక్తి ఆమెకు అసభ్య సందేశాలు పంపాడు. తరచూ ఆమె చేసే పోస్టులు.. వాటికి కొందరు చేసే కామెంట్లు... ప్రతిగా ఆమె ఇచ్చే కౌంటర్... ఆ సంభాషణలంతా వెగటును పుట్టిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ వ్యక్తికి ఆమెకు మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో మాటల తుటాలు పేలాయి. సోఫియాపై అనుచిత కామెంట్.. ‘హాయ్ డియర్.. ఒక్క రాత్రికి నీ బుకింగ్ రేట్లు చెప్పగలవా?’ అంటూ ఓ వ్యక్తి ఆమె ఫోటోకు కామెంట్ చేశాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన సోఫియా‘ముందు మీ అమ్మను.. తర్వాత నీ చెల్లిని.. ఆ తర్వాత నీ భార్యను రేట్లు ఎంతో కనుక్కో.. తర్వాత నా రేటు చెప్తా’ అంటూ ఆమె బదులిచ్చారు. అయితే ఆ సంభాషణ అక్కడితో ఆగలేదు. ‘వాళ్లేం నీలాగ మొత్తం విప్పుకుని తిరగట్లేదు. గో టూ హెల్’ అంటూ అతగాడు మళ్లీ బదులిచ్చాడు. దానికి సోఫియా మళ్లీ బదులిస్తూ... ‘నిన్ను కనే సమయంలో మీ అమ్మ తన శరీరాన్ని చూపించే ఉంటుంది కదా. ఆ సంగతి నీకు ఎప్పుడూ చెప్పలేదా? ముందు నీ బుర్రను, ఆలోచల్ని సరిగ్గా ఉంచుకోరా..’ అంటూ ఆమె సమాధానమిచ్చారు. ఆ తర్వాత ఆ మాటల యుద్ధం మరింత ముదరటంతో ఆమె ఫ్యాన్స్ సాయం కోరింది. దీంతో ఆ వ్యక్తి తన చివరకు అకౌంట్‌ను డీ యాక్టివేట్ చేసేశాడు. -
సల్మాన్‌పై నటి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ముంబై : కృష్ణ జింకలను వెంటాడి చంపిన కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న సల్మాన్ ఖాన్‌కి చిత్ర పరిశ్రమ మొత్తం సానుభూతిని తెలియజేస్తోంది. సల్లూ భాయ్ త్వరగా బయటకు రావాలంటూ బాలీవుడ్ సెలబ్రిటీలంతా బలంగా కోరుకుంటున్నారు. అయితే బ్రిటీష్ సింగర్, బాలీవుడ్ నటి సోఫియా హయత్ మాత్రం సల్మాన్ జైలుకెళ్లటం చాలా సంతోషాన్నిస్తోందంటూ చేసిన పోస్ట్ దుమారాన్ని రేపుతోంది. ‘సల్మాన్ జైలుకెళ్లటం అతని కర్మ. చేసిన పాపాలకు అతను అనుభవిస్తున్నాడు. బాలీవుడ్లో అతనో బడా స్టార్. ఇండస్ట్రీ మొత్తం అతని కనుసైగలో నడుస్తుంది. అందుకే అతనికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు అంతా జంకుతున్నారు. కానీ, నాకు ఆ భయం లేదు. చేసిన దానికి అతను ప్రతిఫలం అనుభవిస్తున్నాడు. సల్మాన్ జైలుకెళ్లటం నాకు సంతోషాన్నిస్తోంది’ అంటూ భారత చట్టాలు ఆలస్యమైనా న్యాయాన్ని చేకూరుస్తాయంటూ... పెద్ద పోస్ట్‌నే ఆమె ఉంచింది. పైగా నో మోర్ హ్యుమన్ అంటూ సల్మాన్ పోస్టర్‌ను షేర్ చేసింది. ఇంగ్లీష్ టీవీ షోలతో పాపులర్ అయ్యి.. అర డజనుకు పైగా బాలీవుడ్ చిత్రాల్లో నటించింది సోఫియా హయత్(33) బిగ్ బాస్-7 కంటెస్టెంట్ కూడా. అయితే షో లో ఆమె తీరు వివాదాస్పదం కావటం.. పైగా ఆ తర్వాత ఆమెకు బాలీవుడ్ కలిసిరాకపోవటం రాకపోవటంతో బాలీవుడ్‌కు గుడ్ బై చెప్పేసింది. Karma gets you in the end...Many people are afraid to talk against Salman because they think he controls Bollywood. Well, I no longer serve my ego and therefore am not afraid to speak up. I am so happy that Salman has gone to jail for what he has done. Animals are so important to this planet and doing what he did and then mocking it was a huge act of his own self importance. Lots of children look up to him, and he has a responsibility to the young people.What is he showing the world when he does things like this? What lessons is he giving them? That it is ok to break the law, to kill animals and then mock it because he is a celebrity? In any western country he would have been vilified for this and the drink driving deaths that he caused. He has then reinvented himself as a charitable man to try and compensate his karma. Today, India has shown that no matter who you are, if you break the law, you are no bigger than the law. I have heard so many young people in India speak about how they are afraid to go to the police about crimes committed by others because they watch the tv and see how people with money and status get away with it because they have paid off the police or the judge or the lawyers. This happened to me when Armaan Kohli paid off 2 of my lawyers so that I could not continue with the case, Dolly Bindra also told me that Armaans family are powerful enough to put drugs in my bag at the airport and I would be in Jail. I had to then drop the case as all the lawyers I hired were paid off. Today, Hindustan can stand strong and hold its head up high to the world and show them that justice is held up in India, and today, all the poor people have been shown a glimmer of hope in their own fight for justice against those who have manipulated the law. Today I can say Hindustaan Zindabaad! A post shared by Sofia Hayat (@sofiahayat) on Apr 5, 2018 at 10:40am PDT -
నటికి అసభ్య సందేశం.. స్ట్రాంగ్ రిప్లై
సాక్షి, సినిమా : ఇంగ్లీష్ టీవీ షోలతో పాపులర్ అయ్యి.. అర డజనుకు పైగా బాలీవుడ్ చిత్రాల్లో నటించింది సోఫియా హయత్(33). అయితే పెద్దగా సక్సెస్ రాకపోవటంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసిన ఈ బ్రిటీష్ సింగర్ ఆ మధ్య సన్యాసం స్వీకరించి ఆమె వార్తల్లో నిలిచారు. మళ్లీ ఏమనిపించిందో ఏమో బాయ్ ఫ్రెండ్‌తో డేటింగ్ చేసి అతన్ని వివాహం చేసుకుంది. తర్వాత భర్తతో తరచూ హాట్ ఫోటోలు పెడుతూ.. చీప్ ట్రిక్స్ చేస్తోందంటూ ఫాలోవర్స్ నుంచి ఛీత్కారాలను ఆమె ఎదుర్కున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సందేశం చేశాడు. అది చూసి చిర్రెత్తుకొచ్చిన ఆమె అందుకు ప్రతిగానే బదులు ఇవ్వగా.. అది ఇప్పుడు వైరల్ అవుతోంది. అభిషేక్ సింగ్ అనే వ్యక్తి సోఫియాతో ఒక రాత్రి తనతో గడపాలని.. అందుకు రూ. 20 లక్షలు ఇస్తానంటూ ఆమెకు ఆఫర్ ఇచ్చాడు. అంతే ఆమెకు కోపం తెప్పించింది. ఆపై దానిని స్క్రీన్ షాట్ తీసి తన ఇన్‌స్ట్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ వ్యక్తికి సరైన సమాధానం ఇచ్చావ్ శభాష్.. అంటూ సోఫియా ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. సోఫియా చేసిన పోస్ట్ -
మరో వివాదంలో సోఫియా హయత్
బిగ్ బాస్ టీవీ షోతో పాపులర్ అయిన ఈ భామ, హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను హిటెక్కించింది. తరువాత అన్ని వదిలేసి మదర్ గాయాగా మారిపోయానంటూ షాక్ ఇచ్చింది. తరువాత మరోసారి మాట మార్చి పెళ్లి రెడీ అయిపోయింది. తనకు కాబోయే భర్తతో కలిసి మక్కా యాత్ర చేసిన ఈ బ్యూటి అక్కడ తనను వేదించారంటూ మరోసారి వివాదానికి తెర తీసింది. ఇలా రోజుకో వివాదంతో హల్ చల్ చేసిన సోఫియా.. ఇటీవలే వ్లాట్ స్టానెస్ ను పెళ్లాడింది. అయితే పెళ్లి తరువాత మరింత దూకుడు పెంచిన సోఫియా తన భర్తతో సన్నిహితంగా ఉన్న వీడియోను రిలీజ్ చేసింది. ఇలాంటి వీడియోలు ఆన్ లైన్ లో ఎన్నో ఉన్న సోఫియా పోస్ట్ చేసిన వీడియో మాత్రం మరోసారి వివాదానికి కారణమయ్యింది. గతంలో తన కాలు మీద స్వస్థిక్ గుర్తు టాటూ వేయించుకోవటం పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజాగా విడుదల చేసిన వీడియోలోనూ హిందూ దేవుళ్లను చూపించటంపై వివాదం మొదలైంది. సమాజిక కార్యకర్త అసద్ పటేల్ ఈ వీడియోపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వీడియో హిందువుల మనోభావాలు దెబ్బతీసేదిగా ఉందంటూ, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వివాదం పై సోఫియా హయత్ ఇంకా స్పందించలేదు. -
ఆ నటి పెళ్లైపోయింది.. ఫొటోలు వైరల్
లండన్: సన్యాసినిగా మారినట్లు ప్రకటించి గతంలో పెను సంచలనం సృష్టించిన నటి, మోడల్ సోఫియా హయత్ వివాహం లండన్‌లో జరిగింది. రొమేనియాకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ వ్లాద్ స్టానెస్కును ప్రేమించి పెళ్లి చేసుకుంది సోఫియా. రాజకుటుంబీకులు వివాహం చేసుకునే తరహాలో ముస్తాబైన సోఫియా జంట ఈజిప్టు సంస్కృతి, మరో రెండు సంప్రదాయాల ప్రకారం ఈ వేడుకను జరుపుకోనున్నట్లు ఆమె సన్నిహితులు తెలిపారు. గుర్రపు బగ్గీలో రాకుమారిలా వివాహవేడుకకు విచ్చేసిన సోఫియా హయత్ ను.. కొందరు సన్నిహితుల సమక్షంలో వ్లాద్ స్టానెస్కు వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. బిగ్ బాస్ 7 షోలో అర్మాన్ కోహ్లీతో గొడవ వల్ల సిరీస్ మధ్యలోనే వైదొలగి పాపులర్ అయిన మోడల్ సోఫియా హయత్. సింగర్, మోడల్ అయిన సోఫియా గతేడాది తాను నన్(సన్యాసిని) గా మారినట్లు ప్రకటించి.. ఆపై మేకప్ వాడుతున్నట్లు ఫొటోలు వైరల్ కావడంతో క్షమాపణ కూడా చెప్పింది. బాలీవుడ్ బాంబ్ రాఖీ సావంత్ ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలని సూచించిన ఆమె స్నేహితురాలు హయత్ చివరకు తనే సన్యాసం వదిలేసి.. పెళ్లి చేసుకుందని సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. తాను సన్నాసినిగా మారానని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని పేర్కొన్న హయత్.. సరిగ్గా ఏడాది పూర్తికాకముందే వైవాహిక జీవితంలో అడుగుపెట్టింది. -
రాఖీ సావంత్ పెళ్లి చేసుకుంటోందా?
బాలీవుడ్ ఐటెం బాంబ్ రాఖీ సావంత్ ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలని ఆమె బెస్ట్ ఫ్రెండ్, హాలీవుడ్ నటి, మోడల్ సోఫియా హయత్ అంటోంది. రాఖీ సావంత్ చాలా కష్టపడి పనిచేస్తుందని, రాళ్ల మీద నుంచి కూడా ప్రవహిస్తూనే వెళ్లే నదిలాంటిదని, ఆమె ఎప్పటికీ ఆగదని కూడా చెప్పింది. అమ్మాయిలంతా రాఖీని స్ఫూర్తిగా తీసుకోవాలని హితవు పలికింది. ఆమె తన స్నేహితురాలు కావడం తన అదృష్టని ఓ ప్రకటనలో చెప్పింది. కానీ తాను ఆమె గురించి ఆందోళన చెందుతున్నానని, వీలైనంత త్వరగా రాఖీ పెళ్లి చేసుకుంటనే మంచిదని.. కనీసం ఈ ఏడాదైనా ఆమె పెళ్లి చేసుకోవాలని సూచించింది. ఆమెకు మంచి సంబంధం కూడా వెతుకుతున్నట్లు సోఫియా హయత్ వివరించిందది. గతంలో మాలామాల్ వీక్లీ, క్రేజీ 4, 1920 లాంటి సినిమాల్లో నటించిన రాఖీ సావంత్.. ఆ తర్వాత 'రాఖీ కా స్వయంవర్' అనే రియాల్టీ షో నిర్వహించింది. అందులో ఈలేష్ పరుజన్‌వాలా అనే వ్యక్తిని ఎంచుకుంది కూడా. కానీ తర్వాత ఇద్దరూ విడిపోయారు. రాఖీని చాలామంది సరిగా అర్థం చేసుకోలేదని.. ఆమె సెక్స్ సింబల్లాగే కనిపించినా, లోపల మాత్రం రుషిలాంటిదని చెప్పింది. ఆమెను పెళ్లి చేసుకునేవారు ఎవరైనా చాలా అదృష్టవంతులని తెలిపింది. -
మేకప్ తో కనిపిస్తే నన్ను క్షమించండీ..!
బిగ్ బాస్ 7 సిరీస్ అనగానే మొదట గుర్తుకొచ్చే పేరు సోఫియా హయత్. ఎందుకంటే వైల్డ్ కాల్డ్ ఎంట్రీ ద్వారా ఎంటరైన అప్పటి టాప్ మోడల్.. అర్మాన్ కోహ్లీతో గొడవ వల్ల ఆమెను సిరీస్ మధ్యలోనే ఇంటికి పంపివేసిన విషయం తెలిసిందే. సింగర్, మోడల్ అయిన సోఫియా ఇటీవల నన్(సన్యాసిని) గా మారినట్లు ప్రకటించింది. అయితే కొన్ని వారాలుగా ఆమె మేకప్ వాడుతోందని, అందానికే ఇంకా ప్రాధాన్యం ఇస్తున్నదంటూ విమర్శులు వెల్లువెత్తాయి. 'మేం మేకప్ లేకున్నా చాలా అందంగా ఉంటాం. హెయిర్ కలర్, ఫ్యాషన్ ఫాలోయింగ్ లేకున్నా సరే' అందంగానే కనిపిస్తామంటోంది. నన్ గా మారిన తర్వాత ఎవరైనా తనను మేకప్ లో చూసినట్లుగా భావిస్తే ఉంటే దయచేసి నన్ను క్షమించండి అంటూ బహిరంగంగా ప్రకటించింది. అప్పటి జీవితం వేరు.. ఇప్పటి లైఫ్ వేరని, గతంలో తాను చేయించుకున్న సర్జరీల వల్లే ఇంకా అందంగా కనిపిస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. ఇక తనకు పెళ్లి చేసుకోవాలని, శృంగారంలో పాల్గొనాలనే ఆలోచనలు రావని అంటోంది. ఇకనుంచీ తాను తన పిల్లల కోసం బతుకుతానని, ప్రపంచం అంతటికీ తల్లినవుతానని చెప్పింది. ప్రేమించడం తప్పుకాదని, ప్రతి ఒక్కరూ ప్రేమ పొందగలగాలని ఆమె అభిప్రాయపడింది. గతంలో క్రికెటర్, మాజీ బాయ్ ఫ్రెండ్ రోహిత్ శర్మ 264 పరుగులు చేసినప్పుడు అతడికి బహుమతిగా తన నగ్న సెల్ఫీని ట్విట్టర్లో పోస్ట్ చేసి సంచలనం సృష్టించిన ఆమె ఇప్పుడు పూర్తిగా మారిపోయానని గతంలో చేసిన తప్పులు మళ్లీ చేసేందుకు సిద్ధంగా లేనని సోఫియా వివరించింది. -
నాడు నగ్న సెల్ఫీ.. నేడు నన్ అవతారం!
బిగ్ బాస్ 7 సిరీస్‌లో పాల్గొన్న సోఫియా హయత్ గుర్తుందా? వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎంటరైన ఈ టాప్ మోడల్.. ఇప్పుడు నన్‌గా మారిపోయింది. ఒకప్పటి హొయలు, అందచందాలు అన్నింటినీ పక్కన పెట్టేసి తన అసలైన రూపం ఇదీ అంటూ ఇన్స్టాగ్రామ్ ద్వారా జనం ముందుకు వచ్చింది. అప్పట్లో అర్మాన్ కోహ్లీతో గొడవ పెట్టుకున్న కారణంగా బిగ్ బాస్ 7 నుంచి మధ్యలోనే ఈ అమ్మడిని పంపేశారు. 2012లో ఈమె మాజీ బోయ్‌ఫ్రెండు రోహిత్ శర్మ 264 పరుగులు చేసినప్పుడు అతడికి బహుమతిగా తన నగ్న సెల్ఫీని ట్విట్టర్లో పోస్ట్ చేసి సంచలనం సృష్టించిన ఘనత కూడా ఈ బ్రిటిష్ మోడల్‌కు ఉంది. అప్పుడు అలా చేసినా, ఇప్పుడు నన్‌గా మారినా.. సోఫియా హయత్ ఏం చేసినా ఓ సంచలనంగానే ఉంటోంది. ఇప్పుడు తాను పూర్తిగా మారిపోయానని, తనను గయా సోఫియా మదర్ అని పిలవాలని చెబుతోంది. ఏంటి నమ్మకం కుదరడం లేదా.. ఫొటోలు చూసి చెప్పండి -
రోహిత్ శర్మకు సోఫియా హయత్ అరుదైన గిఫ్ట్
రోహిత్ శర్మ డబుల్ సెంచరీ కొట్టి.. ప్రపంచంలోనే అత్యుత్తమ స్కోరు నమోదు చేయడంతో చాలామంది సంతోషించారు. అతడికి రకరకాలుగా అభినందనలు తెలిపారు, బహుమతులు కూడా ప్రకటించారు. అయితే.. అందరికంటే ఎక్కువగా స్పందించినది మాత్రం సోఫియా హయత్. బ్రిటిష్ నటి, గాయని, మోడల్ అయిన ఈమె.. అనేక భారతీయ ఆల్బంలలో కూడా చేసింది. అయితే తాజాగా ఆమె పేరు బయటకు రావడానికి, రోహిత్ శర్మకు ఆమె ఇచ్చిన బహుమానమే కారణం. పూర్తి నగ్నంగా మారి, ఓ ఫొటో తీయించుకుని.. దాన్ని ట్విట్టర్లో షేర్ చేసింది. తన నగ్న ఫొటోను రోహిత్ శర్మకు అంకితం చేస్తున్నట్లు అందులో పేర్కొంది. చరిత్రాత్మక స్కోరు చేసినందుకు అతడికీ బహుమతి ఇచ్చినట్లు చెప్పింది. భారతదేశం కూడా అందుకు గౌరవించాలని మరీ చెప్పింది. Dedicating my nude shoot to Rohit Sharma for his historic score! Well done! This one is for you! Proud day for India! pic.twitter.com/ZZlgfs4O89 — Sofia Maria Hayat (@sofiahayat) November 13, 2014 ఆమె ఈ ఫొటో షేర్ చేయడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో విపరీతంగా వ్యాఖ్యలు వెల్లువెత్తాయి. దాంతో, అసలు నగ్న శరీరాలను చూపించడానికి ఎందుకు సిగ్గుపడాలని ఎదురు ప్రశ్నించింది. మన సొంత శరీరాల విషయంలో ఖైదీలుగా ఉండకూడదని, స్వేచ్ఛగా ఉంచాలని తెలిపింది. దేవుడు తనకు ఇంత మంచి శరీరం ఇచ్చినందుకు కృతజ్ఞతలు కూడా చెప్పింది. ఇక ఎవరో తన ఫొటోను ఫేస్బుక్లో షేర్ చేశారని, అయితే ఫేస్బుక్ మాత్రం దీన్ని అసభ్య చిత్రంగా కాకుండా.. ఓ కళారూపంగా భావించి వదిలేసిందని తెలిపింది. అందుకు ఫేస్‌బుక్‌కు కృతజ్ఞతలు కూడా చెప్పింది. Why should we be ashamed to show our bodies, we should feel liberated not prisoners of our own bodies! Thanking god for my body! — Sofia Maria Hayat (@sofiahayat) November 13, 2014 Some small minded idiot reported my pic to facebook. facebook thinks this is art and not obscene! Thankyou facebook! pic.twitter.com/3vtNERM2M1 — Sofia Maria Hayat (@sofiahayat) November 13, 2014 -
ఆర్మాన్ ను అంత తొందరగా ఎందుకు వదిలేశారో: సోఫియా
బాలీవుడ్ నటుడు, బిగ్ బాస్7 పాల్గొన్న ఆర్మాన్ కోహ్లీకి అంత తొందరగా బెయిల్ లభించడం తనకు ఆశ్చర్యం కలిగించింది అని బ్రిటిష్ గాయని, నటి సోఫియా హయత్ అన్నారు. అతన్ని ఎందుకు అంత తొందరగా వదిలిపెట్టారో అర్ధం కావడం లేదు అని అనుమానం వ్యక్తం చేసింది. ఫుటేజి చూసిన తర్వాత.. బలమైన సాక్ష్యం లభించినా అతన్ని ఎందుకు వదిలేశారలో తెలియడం లేదన్నారు. ఈ కేసు ను తన లాయర్ చూసుకుంటున్నాడని సోఫియా వెల్లడించింది. తాను మూడు సెక్షన్లతో కేసు నమోదు చేశా.. అయితే ఫుటేజ్ చూసిన తర్వాత మరికొన్ని సెక్షన్లను పోలీసులు జోడించారని తెలిపింది. డిసెంబర్ 28న జరిగే బిగ్ బాస్ ఫైనల్ లో భారీ మొత్తాన్ని గెలుచుకోవడానికి గుహార్ ఖాన్, వీజే ఆండీ, తనీషా ముఖర్జీ, సంగ్రామ్ సింగ్, ఎజాజ్ ఖాన్ పోటీ పడుతున్నారు. గుహార్ ఖాన్ బిగ్ బాస్ టైటిల్ గెలిచే అవకాశం ఉంది అని సోఫియా తెలిపారు. బిగ్ బాస్ 7' రియాల్టీ షోలో తనపై దాడి చేయడమే కాకుండా లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డిసెంబర్ 17 తేదిన బిగ్ బాస్ హౌజ్ నుంచి ఆర్మాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం జరిగిన కార్యక్రమంలో ఆర్మాన్ ను బిగ్ బాస్ నుంచి తప్పించారు. -
అర్మాన్ కోహ్లీ అరెస్టు.. బెయిలు
బాలీవుడ్ నటుడు అర్మాన్ కోహ్లీని పోలీసులు అరెస్టు చేశారు. బ్రిటిష్-పాకిస్థానీ నటి సోఫియా హయత్ ఫిర్యాదు మేరకు లోనావాలా పోలీసులు సోమవారం రాత్రి 11 గంటల సమయంలో అతడిని బిగ్ బాస్ హౌస్‌లోంచి తీసుకెళ్లారు. తనను బూతులు తిట్టి, కొట్టాడంటూ అర్మాన్ కోహ్లీపై సోఫియా హయత్ ముంబైలోని శాంతాక్రజ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వాళ్లు దర్యాప్తు నిమిత్తం లోనావాలా పోలీసులకు బదిలీ చేయగా, అక్కడి పోలీసులు.. కేసును దర్యాప్తు చేసి, కోహ్లీని అరెస్టు చేశారు. అనంతరం అర్మాన్ కోహ్లీకి బెయిల్ మంజూరైంది. స్థానిక కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. సోఫియా హయత్ ఫిర్యాదుతో అర్మాన్ కోహ్లీపై ఎఫ్ఐఆర్ నమోదుచేసినట్లు శాంతాక్రజ్ సీనియర్ ఇన్స్పెక్టర్ అరుణ్ చవాన్ తెలిపారు. కోహ్లీపై ఐపీసీ సెక్షన్లు 324, 504, 509, 506, 354ల కింద కేసులు నమోదయ్యాయి. ఇందులో లైంగిక వేధింపుల దగ్గర్నుంచి ప్రమాదకర ఆయుధాలతో గాయపర్చడం లాంటి నేరాలున్నాయి. పోలీసులు చాలా బాగా స్పందించారని, మర్యాదగా వ్యవహరించారని అన్నారు. అంతకుముందు బిగ్‌బాస్‌లోని తనీషా, అజాజ్ ఖాన్ తదితరులతో కూడా సోఫియాకు గొడవలయ్యాయి. అర్మాన్ కోహ్లీతో గొడవే హింసాత్మకంగా మారింది. -
బిగ్ బాస్7లో సోఫియా హయత్ పై దాడి చేసిన కోహ్లీ అరెస్ట్!
బిగ్ బాస్7 కార్యక్రమంలో పాల్గొన్న పాకిస్థాన్ కు చెందిన బ్రిటీన్ నటి సోఫియా హయత్ పై దాడి చేశారనే అరోపణలపై బాలీవుడ్ నటుడు అర్మాన్ కోహ్లీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో 'బిగ్ బాస్ 7' కార్యక్రమం మరోసారి వివాదస్పదంగా మారింది. హయత్ చేసిన ఫిర్యాదు మేరకే లోనావాలా లోని బిగ్ బాస్ హౌజ్ నుంచి పోలీసులు అరెస్ట్ చేశారు. బిగ్ బాస్ కార్యక్రమం నుంచి డిసెంబర్ 11 తేదిన హయత్ బయటకు వచ్చింది. ఆతర్వాత కోహ్లీపై శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ హౌజ్ లో తనను అసభ్య పదజాలంతో దూషించి.. కోహ్లీ తనపై చేయి చేసుకున్నాడని ఫిర్యాదులో హయత్ పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. హయత్ ఫిర్యాదు మేరకు అర్మాన్ కోహ్లీ, అరుణ్ చవాన్ లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, ఆతర్వాత ఫిర్యాదును లోనావాల పోలీస్ స్టేషన్ కు ట్రాన్స్ ఫర్ చేశామని పోలీసులు వెల్లడించారు. కోహ్లీపై 324, 504, 509, 506, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బిగ్ బాస్ 7 కార్యక్రమంలో నాకు తనిషా, ఎజాజ్ ఖాన్ ల మధ్య గొడవ జరిగింది. అయితే ఆర్మాన్ కోహ్లీతో జరిగిన వాదన హింసాత్మకంగా మారింది. పోలీసులకు ఫిర్యాదు చేశాను. పోలీసుల స్పందించిన తీరు అమోఘం అని ట్విటర్ లో హయత్ పేర్కొన్నారు. -
బిగ్‌బాస్‌లో బూతులు తిట్టి.. కొట్టారు: సోఫియా హయత్
బిగ్ బాస్ గేమ్‌షోలో సహ భాగస్వామిపై సోఫియా హయత్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బిగ్ బాస్ 7 షో నుంచి ఇటీవలే బయటకు పంపేసిన సోఫియా హయత్.. తనను అర్మాన్ కోహ్లీ అనే సహ భాగస్వామి బూతులు తిట్టేవాడని, కొట్టేవాడని పోలీసులకు తెలిపింది. ఈ మేరకు ఫిర్యాదు కూడా దాఖలుచేసింది. దాంతో పోలీసులు అర్మాన్ కోహ్లీపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు శాంతాక్రజ్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ అరుణ్ చవాన్ తెలిపారు. సోఫియా హయత్ వాంగ్మూలాన్ని నమోదు చేసిన తర్వాత, కోహ్లీపై ఐపీసీ సెక్షన్లు 323, 324 కింద కేసులు నమోదు చేశారు. బిగ్ బాస్ హౌస్‌లో ఉండగా అర్మాన్ తనను తరచు బూతులు తిట్టేవాడని సోఫియా వాపోయింది. బిగ్ బాస్ హౌస్ లోనావాలాలో ఉన్నందున దర్యాప్తు నిమిత్తం కేసును అక్కడకు పంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారం గురించి సోఫియా హయత్ ట్విట్టర్ ద్వారా కూడా పలు విషయాలు వెల్లడించింది. శాంతాక్రజ్ పోలీసులు చాలా ప్రొఫెషనల్‌గా, మర్యాదగా వ్యవహరించారని చెప్పింది.