ఆ నటి పెళ్లైపోయింది.. ఫొటోలు వైరల్ | Sofia Hayat got married to boy friend Vlad Stanescu | Sakshi
Sakshi News home page

ఆ నటి పెళ్లైపోయింది.. ఫొటోలు వైరల్

Published Fri, Apr 28 2017 5:37 PM | Last Updated on Tue, Sep 5 2017 9:55 AM

ఆ నటి పెళ్లైపోయింది.. ఫొటోలు వైరల్

ఆ నటి పెళ్లైపోయింది.. ఫొటోలు వైరల్

లండన్: సన్యాసినిగా మారినట్లు ప్రకటించి గతంలో పెను సంచలనం సృష్టించిన నటి, మోడల్ సోఫియా హయత్ వివాహం లండన్‌లో జరిగింది. రొమేనియాకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ వ్లాద్ స్టానెస్కును ప్రేమించి పెళ్లి చేసుకుంది సోఫియా. రాజకుటుంబీకులు వివాహం చేసుకునే తరహాలో ముస్తాబైన సోఫియా జంట ఈజిప్టు సంస్కృతి, మరో రెండు సంప్రదాయాల ప్రకారం ఈ వేడుకను జరుపుకోనున్నట్లు ఆమె సన్నిహితులు తెలిపారు. గుర్రపు బగ్గీలో రాకుమారిలా వివాహవేడుకకు విచ్చేసిన సోఫియా హయత్ ను.. కొందరు సన్నిహితుల సమక్షంలో వ్లాద్ స్టానెస్కు వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

బిగ్ బాస్ 7 షోలో అర్మాన్ కోహ్లీతో గొడవ వల్ల సిరీస్ మధ్యలోనే వైదొలగి పాపులర్ అయిన మోడల్ సోఫియా హయత్. సింగర్, మోడల్ అయిన సోఫియా గతేడాది తాను నన్(సన్యాసిని) గా మారినట్లు ప్రకటించి.. ఆపై మేకప్ వాడుతున్నట్లు ఫొటోలు వైరల్ కావడంతో క్షమాపణ కూడా చెప్పింది.  

బాలీవుడ్ బాంబ్ రాఖీ సావంత్ ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలని సూచించిన ఆమె స్నేహితురాలు హయత్ చివరకు తనే సన్యాసం వదిలేసి.. పెళ్లి చేసుకుందని సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. తాను సన్నాసినిగా మారానని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని పేర్కొన్న హయత్.. సరిగ్గా ఏడాది పూర్తికాకముందే వైవాహిక జీవితంలో అడుగుపెట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement