'మీది మొత్తం థౌజండ్ అయింది రెండు లివర్లు ఎక్స్ ట్రా'.. ఈ డైలాగ్ చెప్పగానే ఈపాటికే మేటర్ అర్థమైపోయింటుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సోషల మీడియాలో తెగ పాపులర్ అయిపోతున్న కుమారి ఆంటీదే ఈ డైలాగ్. హైదరాబాద్‌లోని రోడ్డు సైడ్ మధ్యాహ్న భోజనం అమ్మే ఈవిడ.. ఫుడ్ వ్లాగర్స్ వల్ల చిన్న సైజు సెలబ్రిటీ అయిపోయింది. ఆల్రెడీ ఈమెని పలువురు ఇంటర్వ్యూ చేయగా.. ఇప్పుడు ఏకంగా ఓ టీవీ షోలో కూడా కనిపించింది.
(ఇదీ చదవండి: మాజీ భర్త గురించి ప్రశ్న.. క్లారిటీ ఇచ్చేసిన స్టార్ హీరోయిన్)
గత కొన్నాళ్ల నుంచి హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో నాన్ వెజ్ మీల్స్ విక్రయించే ఈమె.. అనుకోకుండా ఫేమస్ అయిపోయింది. దీంతో ఈమె షాప్ దగ్గరకు జనాలు ఎగబడ్డారు. ఈ క్రమంలోనే ట్రాఫిక్ అవుతుందని చెప్పి షాప్ మూసివేయడం.. ఈ గొడవపై ఏకంగా తెలంగాణ సీఎంఓ ఆఫీస్ నుంచి స్పందించడం. ఇప్పుడు యధావిధిగా మళ్లీ ఈమె బిజినెస్ రన్ అవుతుండటం.. ఇలా గత కొన్నాళ్ల నుంచి కుమారి ఆంటీ వార్తల్లో నిలుస్తోంది.
అయితే సోషల్ మీడియాలో ఈమె ఫేమస్ అయినప్పుడే ఇంకెందుకు లేటు.. టీవీ షోల్లో కూడా కనిపిస్తుందని ఊహించారు. ఇప్పుడు అదే జరిగింది. 'బిగ్‌బాస్ 7' కంటెస్టెంట్స్ అందరూ కలిసి తాజాగా ఓ షోలో పాల్గొన్నారు. ఇందులో కుమారి ఆంటీ కూడా పాల్గొంది. స్టేజీపైనే అందరికీ తన స్టైల్ ఫుడ్ తినిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈమెతో ఓ స్కిట్ కూడా చేయించారని టాక్.
(ఇదీ చదవండి: ఇన్నాళ్లకు ఓటీటీలోకి వచ్చేస్తున్న 'ద కేరళ స్టోరీ'.. రిలీజ్ డేట్ ఫిక్స్)
#BBUtsavam షో లో #KumariAunty !
— Rajesh Manne (@rajeshmanne1) February 6, 2024
అందరికీ NonVeg భోజనం కూడా... pic.twitter.com/SfmCzFSjOd
Comments
Please login to add a commentAdd a comment