బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ భర్త అరెస్ట్‌ | Bigg Boss Contestant And Actress Sofia Hayats Husband Arrested | Sakshi
Sakshi News home page

Published Thu, Aug 23 2018 11:59 AM | Last Updated on Thu, Aug 23 2018 12:02 PM

Bigg Boss Contestant And Actress Sofia Hayats Husband Arrested - Sakshi

భర్తతో నటి సోఫియా హయత్ (ఫైల్‌ ఫొటో)

లండన్‌ : బిగ్‌ బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ సోఫియా హయత్‌ భర్త వ్లాద్‌ స్టానెస్కును లండన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నటి ఫిర్యాదు మేరకు గత నెల రోజులుగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు వ్లాద్‌ను అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక వెబ్‌ మీడియా తెలిపింది. పోలీసుల కథనం ప్రకారం.. హిందీ బిగ్ బాస్ 7 షోలో అర్మాన్ కోహ్లీతో గొడవ వల్ల సిరీస్ మధ్యలోనే వైదొలగి పాపులర్ అయిన మోడల్ సోఫియా హయత్. సింగర్, మోడల్ అయిన సోఫియా 2016లో తాను నన్(సన్యాసిని) గా మారినట్లు ప్రకటించి.. ఆపై మేకప్ వాడుతున్నట్లు ఫొటోలు వైరల్ కావడంతో క్షమాపణ కూడా చెప్పారు.

2017లో రొమేనియాకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ వ్లాద్ స్టానెస్కును ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సోఫియా. గత కొంతకాలం నుంచి వీరి మధ్య విభేదాలున్నాయి. ఈ క్రమంలో తనను గొంతునులిమి హత్యాయత్నం చేశాడని ఆరోపిస్తూ భర్త వ్లాద్‌పై గత నెలలో లండన్‌ పోలీసులకు సోఫియా ఫిర్యాదు చేశారు. ఇంటీరియర్‌ డిజైనర్‌ అని చెప్పి భర్త వ్లాద్‌ తనను మోసం చేశారని నటి ఆరోపించారు. భర్త చోరీలకు పాల్పడుతూ మరింతగా దిగజారాడన్న మోడల్‌.. 10 లక్షల రూపాయలు విలువ చేసే తమ వివాహ ఉంగరాన్ని కూడా చోరీ చేసి కేవలం 1.5లక్షల రూపాయలకు విక్రయించాడని సోఫియా హయత్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

తన స్వదేశం రొమేనియాకు తిరిగివెళ్లనని భర్త వ్లాద్‌ తరచుగా తనతో చెప్పేవాడన్నారు. రొమేనియా ప్రభుత్వానికి అతడు బాకీ పడ్డాడని, ఈ కేసుకు భయపడి తన భర్త స్వదేశానికి వెళ్లాలంటే ఆందోళన చేందేవాడని పోలీసులకు వివరించారు. నెల రోజులు అన్వేషణ తర్వాత లండన్‌లోని ఓ షాపింగ్‌ మాల్‌లో సోఫియా భర్త వ్లాద్‌ను అదుపులోకి తీసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement