రైతుబిడ్డ బిగ్‌బాస్ ట్రోఫీ గెలవడం విశేషమనే చెప్పాలి. ఈ అరుదైన ఘనతను తెలుగు బిగ్‌బాస్ షోలో పల్లవిప్రశాంత్ సాధించగా ఇటీవల కన్నడ బిగ్‌బాస్ షోలోనూ ఇలాంటి అరుదైన ఘటన చోటు చేసుకుంది. కన్నడ బిగ్‌బాస్ పదకొండో సీజన్ విజేతగా రైతుబిడ్డ, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ హనుమంత (Hanumantha Lamani) నిలిచాడు. ఎలాంటి అంచనాలు లేకుండా వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్‌గా షోలో అడుగుపెట్టిన అతడు అందరి మనసులు గెలుచుకుని బిగ్‌బాస్ ట్రోఫీ అందుకున్నాడు. రూ.50 లక్షల ప్రైజ్‌మనీతో పాటు లగ్జరీ కారును సైతం సొంతం చేసుకున్నాడు.
గొర్రెలు మేపడమే ఇష్టం
అరకోటి అందుకున్న హనుమంత.. తనకు గొర్రెలు మేపడమే ఇష్టమని అంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. గొర్రెల్ని మేపడానికి వెళ్లడం నాకెంతో ఇష్టం. అప్పుడు నా వెంట ఎవరూ లేరు. ప్రశాంతంగా నా పని నేను చేసుకుంటూ పోయాను. ఇప్పుడది గుర్తు చేసుకుంటే ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఈ పనిని వదిలేయలేను. బిగ్‌బాస్ విషయానికి వస్తే.. బిగ్‌బాస్ హౌస్‌ను చాలా మిస్ అవుతున్నాను.
భగవంతుడి ఆశీస్సులున్నాయి
అక్కడ ట్రోఫీ గెలిచానంటే అది నా గెలుపు మాత్రమే కాదు. కర్ణాటక ప్రజల విజయం. వారు ఓటేయడం వల్లే నేను గెలిచాను. అలాగే నేను ఎంతగానో ఆరాధించే హనుమంతుడి ఆశీర్వాదాలు నాపై బలంగా ఉన్నాయి. ప్రతి శనివారం ఆంజనేయుడి గుడికి వెళ్లి పాటలు పాడేవాడిని. అందుకే ఈ రోజు నేనిక్కడున్నాను.
ఎవర్ని తీసుకొస్తే వారినే..
పెళ్లి విషయానికి వస్తే.. అమ్మానాన్న ఎవర్ని ఎంపిక చేస్తే వారినే వివాహం చేసుకుంటాను. నా పెళ్లికి అందర్నీ ఆహ్వానిస్తాను అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే హనుమంతు.. ఈ షో కంటే ముందు సంగీతంతో పరిచయం లేకపోయినా కన్నడ సరిగమప షో 15వ సీజన్‌లో పాల్గొన్నాడు. తన గాత్రంతో అందర్నీ మైమరిపించి షో రన్నరప్‌గా నిలిచాడు.
చదవండి: ఆ మాటలతో డిప్రెషన్‌లోకి వెళ్లాను
Comments
Please login to add a commentAdd a comment