bigg boss winner
-
గొర్రెల కాపరిగా కొనసాగుతా.. నాకదే ఇష్టం!: బిగ్‌బాస్ విన్నర్
రైతుబిడ్డ బిగ్‌బాస్ ట్రోఫీ గెలవడం విశేషమనే చెప్పాలి. ఈ అరుదైన ఘనతను తెలుగు బిగ్‌బాస్ షోలో పల్లవిప్రశాంత్ సాధించగా ఇటీవల కన్నడ బిగ్‌బాస్ షోలోనూ ఇలాంటి అరుదైన ఘటన చోటు చేసుకుంది. కన్నడ బిగ్‌బాస్ పదకొండో సీజన్ విజేతగా రైతుబిడ్డ, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ హనుమంత (Hanumantha Lamani) నిలిచాడు. ఎలాంటి అంచనాలు లేకుండా వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్‌గా షోలో అడుగుపెట్టిన అతడు అందరి మనసులు గెలుచుకుని బిగ్‌బాస్ ట్రోఫీ అందుకున్నాడు. రూ.50 లక్షల ప్రైజ్‌మనీతో పాటు లగ్జరీ కారును సైతం సొంతం చేసుకున్నాడు.గొర్రెలు మేపడమే ఇష్టంఅరకోటి అందుకున్న హనుమంత.. తనకు గొర్రెలు మేపడమే ఇష్టమని అంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. గొర్రెల్ని మేపడానికి వెళ్లడం నాకెంతో ఇష్టం. అప్పుడు నా వెంట ఎవరూ లేరు. ప్రశాంతంగా నా పని నేను చేసుకుంటూ పోయాను. ఇప్పుడది గుర్తు చేసుకుంటే ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఈ పనిని వదిలేయలేను. బిగ్‌బాస్ విషయానికి వస్తే.. బిగ్‌బాస్ హౌస్‌ను చాలా మిస్ అవుతున్నాను. భగవంతుడి ఆశీస్సులున్నాయిఅక్కడ ట్రోఫీ గెలిచానంటే అది నా గెలుపు మాత్రమే కాదు. కర్ణాటక ప్రజల విజయం. వారు ఓటేయడం వల్లే నేను గెలిచాను. అలాగే నేను ఎంతగానో ఆరాధించే హనుమంతుడి ఆశీర్వాదాలు నాపై బలంగా ఉన్నాయి. ప్రతి శనివారం ఆంజనేయుడి గుడికి వెళ్లి పాటలు పాడేవాడిని. అందుకే ఈ రోజు నేనిక్కడున్నాను.ఎవర్ని తీసుకొస్తే వారినే..పెళ్లి విషయానికి వస్తే.. అమ్మానాన్న ఎవర్ని ఎంపిక చేస్తే వారినే వివాహం చేసుకుంటాను. నా పెళ్లికి అందర్నీ ఆహ్వానిస్తాను అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే హనుమంతు.. ఈ షో కంటే ముందు సంగీతంతో పరిచయం లేకపోయినా కన్నడ సరిగమప షో 15వ సీజన్లో పాల్గొన్నాడు. తన గాత్రంతో అందర్నీ మైమరిపించి షో రన్నరప్‌గా నిలిచాడు. View this post on Instagram A post shared by 🧿ಹನುಮಂತ ಲಮಾಣಿ🧿 (@hanumantha_lamani_official_) చదవండి: ఆ మాటలతో డిప్రెషన్లోకి వెళ్లాను -
Bigg Boss: ఒకరికి రూ.40 లక్షలు, మరొకరికి రూ.50 లక్షలు..
బిగ్‌బాస్ షో (Bigg Boss Reality Show) ముగిసింది. తమిళంలో ఎనిమిదో సీజన్, హిందీలో పద్దెనిమిదో సీజన్ విజయవంతంగా పూర్తయింది. జనవరి 19న ఈ రెండు భాషల్లో గ్రాండ్ ఫినాలే జరిగింది. తమిళ బిగ్‌బాస్ విషయానికి వస్తే యూట్యూబర్ ముత్తుకుమారన్ (Muthukumaran) విజేతగా నిలిచాడు. ఇతడు రూ.41 లక్షల ప్రైజ్‌మనీ అందుకున్నాడు. సౌందర్య ఫస్ట్ రన్నరప్‌గా, వీజే విశాల్ సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్‌కు విజయ్ సేతుపతి వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.హిందీ రియాలిటీ షో విషయానికి వస్తే.. నటుడు కరణ్ వీర్ మెహ్రా (Karan Veer Mehra) బిగ్‌బాస్ ట్రోఫీ గెలిచాడు. గ్రాండ్ ఫినాలే స్టేజీపై హోస్ట్ సల్మాన్ ఖాన్ కరణ్‌ను విజేతగా ప్రకటించాడు. ఇతడు ట్రోఫీతో పాటు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ గెలుచుకున్నాడు. నటుడు వివియన్ డిసేన ఫస్ట్ రన్నరప్‌గా, యూట్యూబర్ రజత్ దలాల్ సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. కరణ్ ఇంతకుముందు ఖత్రోన్ కె ఖిలాడీ 14వ సీజన్ విజేతగా అవతరించాడు. ఇతడు పవిత్ర రిష్తా, యే రిష్తా క్యా కెహ్లాతా హై, పరి హూన్ మే, బడే అచ్చే లగ్తే హా, సాసురల్ సిమర్ కా, విరుద్ధ్ వంటి పలు సీరియల్స్‌లో నటించాడు. View this post on Instagram A post shared by Vijay Television (@vijaytelevision) View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) చదవండి: అదివారం నాడు నాకో సెంటిమెంట్ ఉంది.. ఈ పని మాత్రం చేయను:బాలకృష్ణ -
బిగ్ రియాలిటీ షో విన్నర్‌కు రూ.6 కోట్ల ప్రైజ్‌మనీ
బిగ్ బ్రదర్.. ఈ షోకు జిరాక్స్ కాపీయే బిగ్‌బాస్ రియాలిటీ షో. 1999లో పుట్టిన సంచాలనాత్మక టెలివిజన్ షో బిగ్ బ్రదర్. ఇప్పటివరకు 25 సీజన్లు కంప్లీట్ అవగా తాజాగా 26వ సీజన్ విజయవంతంగా పూర్తయింది. డైరెక్టర్ చెల్సీ బాహం విజేతగా నిలిచి 6 కోట్ల 30 లక్షల పైచిలుకు రూపాయలు (7,50,000 డాలర్లు) ప్రైజ్‌మనీగా గెలుచుకుంది.టైటిల్ విన్నర్ చెల్సీ బాహంరన్నరప్ ఎవరంటే?రెండో స్థానంలో ఉన్న కన్స్టక్షన్ ప్రాజెక్ట్ మేనేజర్ మకెన్సీ మన్బెక్ దాదాపు రూ.63 లక్షలు (75 వేల డాలర్లు) అందుకుంది. థెరపిస్ట్ కామ్ సలైవన్ బ్రౌన్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అమెరికా ఫేవరెట్ ప్లేయర్‌గా మోడల్ టుకర్ డెస్ లూరియర్స్ రూ.42 లక్షల మేర (50 వేల డాలర్లు) గెలుచుకున్నాడు. ఇకపోతే బిగ్ బ్రదర్ 26వ సీజన్ జూలై 17న ప్రారంభమైంది. 16 కంటెస్టెంట్లు హౌస్‌లో పాల్గొన్నారు. వీరి ప్రతి కదలికను రికార్డ్ చేసేందుకు హౌస్‌లో 90 కెమెరాలు, 100 మైక్రోఫోన్లు అమర్చారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ విన్నర్ తేజస్వి బోల్డ్ లుక్స్ (ఫోటోలు)
-
కవలలకు జన్మనిచ్చిన బిగ్‌బాస్ విజేత!
బుల్లితెర నటి, బిగ్‌బాస్ విజేత రుబీనా దిలక్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. తాను కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ విషయాన్ని నెల రోజుల తర్వాత రివీల్ చేసింది. నవంబర్ 27న గురునానక్ జయంతి సందర్భంగా జన్మించినట్లు ఆమె వెల్లడించింది. కానీ అంతకుముందే రుబీనా-అభినవ్ జంటకు ట్విన్స్ జన్మించినట్లు రుబీనా ఫిట్నెస్ ట్రైనర్ పోస్ట్ చేశారు. ఈ బుల్లితెర జంట తమ కుమార్తెల పేర్లను కూడా వెల్లడించారు. కవలలకు జీవా, ఈధా అనే పేర్లు పెట్టినట్లు తెలిపారు. పిల్లలు జన్మించి నెల రోజులు పూర్తి కావడంతో ఇంట్లో పూజలు నిర్వహించారు. తమ కూతుళ్లను చేతుల్లో పట్టుకుని కెమెరాల ముందు కనిపించారు. కాగా.. రుబీనా బుల్లితెర నటుడు అభినవ్ శుక్లాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తమ ఇన్‌స్టాలో రాస్తూ.. 'మా కుమార్తెలు జీవా, ఎధాలకు నెల రోజులు నిండాయని పంచుకోవడానికి చాలా సంతోషిస్తున్నా. గురుపురాబ్ లాంటి పవిత్రమైన రోజున ఆ దేవుడు ఆశీర్వదించాడు. ఈ సందర్భంగా దేవతలకు మా శుభాకాంక్షలు.' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు బుల్లితెర జంటకు అభినందనలు తెలుపుతున్నారు. కాగా.. ఈ జంట 2018లో సిమ్లాలో గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిద్దరు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్- 14 లో పాల్గొన్నారు. ఈ సీజన్ విజేతగా రుబీనా నిలిచింది. అభినవ్ ఇంట్లో పెద్దమనిషిగా ప్రశంసలు అందుకున్నారు. View this post on Instagram A post shared by Rubina Dilaik (@rubinadilaik) -
బిగ్‌బాస్ విన్నర్ రైతుబిడ్డకు నిరాశ.. తీర్పు వాయిదా
బిగ్‌బాస్ 7 గ్రాండ్ ఫినాలే రోజు జరిగిన పబ్లిక్ న్యూసెన్స్‌కు కారణమయ్యాడంటూ పల్లవి ప్రశాంత్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. స్టూడియో నుంచి వెళ్లిపోమని చెప్పినా వినకుండా తిరిగి స్టూడియో ఎదుట ప్రశాంత్ ర్యాలీ చేయడంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. అతడి అభిమానులు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తూ వికృత చేష్టలకు పాల్పడ్డారు. దీంతో తమను డ్యూటీ చేయకుండా అడ్డుకున్నాడంటూ ప్రశాంత్‌ను, అతడి సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసులు నమోదు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. మరోవైపు ప్రశాంత్.. తనపై నమోదైన కేసుల్లో బెయిల్ ఇవ్వాలంటూ నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన న్యాయస్థానం తీర్పును రేపటికి వాయిదా వేసింది. దీంతో ప్రశాంత్‌కు బెయిల్ వస్తుందా? లేదా? అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. చదవండి: నాకు, నా ఫ్యామిలీకి ఏదైనా జరిగితే ఆ ఐదుగురిదే బాధ్యత! -
నా పాట, అతడి ఆట జైలుపాలైంది.. ఏడ్చేసిన భోలె షావళి
బిగ్‌బాస్ 7 గ్రాండ్ ఫినాలే రోజు పబ్లిక్ న్యూసెన్స్‌కు కారణమయ్యాడంటూ పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఇంటర్వ్యూ ఇవ్వమని అడగడానికి వస్తే తమను అసభ్య పదజాలంతో దూషించాడని కొందరు యాంకర్లు ప్రశాంత్ మీద ఆరోపణలు చేశాడు. తనను కావాలని నెగెటివ్ చేస్తున్నారంటూ అరెస్టుకు ముందు ఆవేదన వ్యక్తం చేశాడు ప్రశాంత్. తాజాగా ప్రశాంత్‌ను అరెస్ట్ చేయడంపై సింగర్, బిగ్‌బాస్ 7 కంటెస్టెంట్ భోలె షావళి స్పందిస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. జనం కోసం ఆడాలి.. 'అతడు మట్టిబిడ్డ, రైతుబిడ్డ. ఎంతో పోరాటం చేసి గెలిచాడు. హౌస్‌లో టాస్కులు ఆడేటప్పుడు ఎన్నో దెబ్బలు తగిలేవి. అన్నా.. ఛాతీ దగ్గర నొప్పి లేస్తుంది, ఏమైనా అయితదా? అన్నా అని అడిగేవాడు. లేదు తమ్ముడు, నువ్వు జనం కోసం ఆడాలి. నీకు మంచి పేరుంది. నువ్వు ఆడాలి, నువ్వు గెలవాలి. నీకోసం పాట పాడటానికి వచ్చాను. నేను హౌస్‌లో లేకున్నా పర్వాలేదు. నేను బయట పాటతో బతుకుతాను. కానీ నువ్వు ఆటతోనే బతకాలి అని చెప్పాను. చివరకు నా పాట, ఆయన ఆట.. అంతా జైలుపాలైంది. చాలా బాధగా ఉంది. జనం స్పందించి ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి వరకు తీసుకెళ్లండి. ఆనందంలో ఏం చేశాడో తెలియలేదు లా అండ్ ఆర్డర్ అంటే ఏంటో కూడా ప్రశాంత్‌కు తెలియదు. అభిమానులు చాలామంది వచ్చారు. ఇంతమంది ఓటేస్తే గెలిచానన్న ఆనందంలో ఆయన ఏం చేశాడో ఆయనకే తెలియలేదు. ఆయన నేరం చేయలేదు. టైటిల్ గెలిచిన వ్యక్తి జైలుపాలైతే ఆయన ఎంత మానసిక క్షోభ పడతాడు. తనకు లా అండ్ ఆర్డర్ అంటే ఏంటో తెలియదు. తనకంత నాలెడ్జ్ లేదు. తనవల్ల ఇబ్బందులు ఎదురైతే.. పోలీసులకు నేను క్షమాపణలు తెలియజేస్తున్నాను' అంటూ కన్నీటిపర్యంతమయ్యాడు భోలె షావళి. హైకోర్టు అడ్వకేట్ వినోద్‌ను తన వెంట జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లిన భోలె న్యాయం కోసం పోరాడతానంటున్నాడు. చదవండి: నాకు, నా ఫ్యామిలీకి ఏదైనా జరిగితే ఆ ఐదుగురిదే బాధ్యత! -
'ఇది కేవలం గేమ్.. దయచేసి ఎవరూ పర్సనల్‌గా తీసుకోవద్దు'..విన్నర్ పోస్ట్ వైరల్!
టాలీవుడ్ అభిమానులను అలరించిన బిగ్‌బాస్ తెలుగు సీజన్-7 రియాలిటీ షో ఘనంగా ముగిసింది. ఈ సీజన్లో రైతుబిడ్డగా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. అంతా బాగానే ఉన్నా.. అయితే ఈ షో ముగిసిన తర్వాత జరిగిన దాడులే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఈ వివాదంపై బిగ్‌బాస్ సీజన్-2 విన్నర్ కౌశల్ స్పందించారు. ఈ మేరకు తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. బిగ్‌బాస్ షో కేవలం ఆట మాత్రమేనని అన్నారు. కౌశల్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'బిగ్‌బాస్ షో కేవలం ఆట మాత్రమేనని.. వ్యక్తిగతంగా తీసుకోకూడదని గుర్తుంచుకోవాలి. ఈ షోలో ఒకరితో ఒకరు పోటీపడిన తర్వాత కూడా, కంటెస్టెంట్లు బయటకు వచ్చి మంచి స్నేహితులుగా ఉంటారు. గేమ్‌ను గెలవడానికి వ్యూహాలు ఉపయోగించాల్సి రావచ్చు. కానీ చివరికీ ఇది కేవలం గేమ్ మాత్రమే. ఎవరూ దీన్ని సీరియస్‌గా పరిగణించకూడదు. ఒక పోటీదారుడి అభిమానులు.. ఇతర పోటీదారులపై భౌతికపరమైన దాడి చేయడం నిరుత్సాహానికి గురిచేసింది. ఇటువంటి ప్రవర్తన ఈ షో ప్రదర్శనకు ప్రతికూలంగా మారుతుంది. ఇలాంటి సంఘటనలు సెలబ్రిటీలను అందులో పాల్గొనకుండా చేసే ప్రమాదముంది. షో ముగిసిన తర్వాత కంటెస్టెంట్స్ వారి జీవితాలతో ముందుకు సాగనివ్వాలి. వీరు భావోద్వేగాలు కలిగిన నిజమైన వ్యక్తులు. కేవలం ఆటలోని పాత్రలు మాత్రమే కాదని గుర్తుంచుకోవడం ముఖ్యం. ఆడియన్స్‌గా మనం వారి వ్యక్తిగత జీవితాలను గౌరవిద్దాం' అని రాసుకొచ్చారు. కౌశల్ సోషల్ మీడియాలో రాస్తూ..' మనుషులుగా మన చర్యలే మన ప్రవర్తనను తెలియజేస్తాయి. ఇతరులతో సంభాషించేటప్పుడు.. ముఖ్యంగా మనం అభిమానించే వారితో మాట్లాడేప్పుడు దీన్ని గుర్తుంచుకోవడం ముఖ్యం. సోషల్ మీడియా ద్వారా ఎవరికైనా ప్రేమ, మద్దతును చూపించడం సహజమే. కానీ సరిహద్దులను ఎప్పుడూ దాటకూడదని గుర్తుంచుకోవడం ముఖ్యం. ఇది మన ప్రేమను చూపుతున్న వ్యక్తి మానసిక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇలాంటి వ్యక్తులు తమకు కుటుంబాలు ఉన్నాయనే వాస్తవాన్ని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. వారు కూడా మీరు చేసే పనుల ద్వారా ప్రభావితమవుతారు. ప్రొఫెషనల్ నటులుగా ఇండస్ట్రీలో ఎదగడానికి, వారి కుటుంబాల కోసం ఎంతో కష్టపడి పని చేస్తారు. వారు అనుభవించే బాధ, ఒత్తిడిని అర్థం చేసుకోవడం, వారితో గౌరవంగా ఉండటం మాకు ఎంతో సహాయపడుతుంది. మనం మనుషుల్లా ప్రవర్తిద్దాం. మన పట్ల, మన కుటుంబాల పట్ల మనం కోరుకునే దయ, సానుభూతిని ఇతరులతోనూ చూపిద్దాం. ఈ చిల్లర పనుల వల్ల కలిగే బాధ నాకు తెలుసు. దయచేసి ఆపండి. వారి జీవితాలను సంతోషంగా జీవించనివ్వండి' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Kaushal Manda (@kaushalmanda) -
బిగ్‌బాస్ విన్నర్ ప్రశాంత్‌కు అభిమాని ఊహించని గిఫ్ట్!
బిగ్‌బాస్ షోకి వెళ్తావా? నిన్నెవడు తీసుకుంటాడ్రా?.. అసలు స్టూడియో లోపలైనా అడుగుపెట్టగలవా? నీకంత సీన్ లేదులే.. పగటి కలలు కనకు.. ఇలా నానామాటలు అన్నారు.. ఎవరెంత హేళన చేసినా పట్టించుకోలేదు. ఎలాగైనా బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టాలని గట్టిగా ఫిక్సయ్యాడు. అందుకు తగ్గ ప్రయత్నాలు చేశాడు. అతడిలోని కసిని బిగ్‌బాస్ టీమ్ గుర్తించింది. కామన్ మ్యాన్ కేటగిరీలో రైతుబిడ్డను బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్లోకి తీసుకొచ్చింది. వైల్డ్‌గా ఆడాడు.. గతంలోనూ కామన్ మ్యాన్ కేటగిరీలో ఎంతోమంది వచ్చారు. కానీ ఎవరూ ప్రశాంత్ అంత ప్రభావం చూపలేకపోయారు. ఓటమికి ఛాన్సే ఇవ్వకూడదన్న చందంగా గెలుపు కోసం విజృంభించి ఆడాడు. తన కోపాన్ని, కసినంతా ఆటలో చూపించాడే కానీ అవతలి వారిపై చూపించలేదు. నామినేషన్స్‌లో ఎంత వైల్డ్‌గా రియాక్ట్ అయినా తర్వాత మాత్రం ఎటువంటి రాగద్వేషాలు మనసులో పెట్టుకోకుండా అందరితో ఇట్టే కలిసిపోయేవాడు. తనకు సాయం చేసినవారిని గుండెలో పెట్టుకుని చూసుకున్నాడు. సాయం చేయనివారికి సైతం అవకాశం వచ్చినప్పుడు వారివైపు నిలబడ్డాడు. రైతుబిడ్డకు ఊహించని గిఫ్ట్ ఇతడి నిష్కల్మమైన మనసు చూసి జనాలు ఓట్లు గుద్దారు. ఫలితంగా ప్రశాంత్ బిగ్‌బాస్ 7 విజేతగా నిలిచాడు. అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటకు వచ్చిన ప్రశాంత్‌కు జనం ఘనంగా స్వాగతం పలికారు. తాజాగా ఓ అభిమాని అయితే రైతుబిడ్డకు ఊహించని గిఫ్ట్ ఇచ్చాడు. యాదగిరిగుట్టలో లక్షలు విలువ చేసే భూమిని బహుమతిగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. యాదగిరి గుట్టకు సమీపంలోని వంగపల్లి దగ్గర రూ.15 లక్షలు విలువ చేసే ఓపెన్ ప్లాట్‌ను బహుమతిగా ఇస్తున్నట్లు వెల్లడించాడు. ప్రశాంత్‌కు భారీగానే ముట్టాయి త్వరలోనే ప్రశాంత్ పేరిట రిజిస్ట్రేషన్ చేయిస్తామని తెలిపాడు. ఇది తెలిసిన జనాలు రైతుబిడ్డకు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇప్పటికే ప్రశాంత్‌కు ప్రైజ్‌మనీ ద్వారా రూ.35 లక్షలు, పారితోషికం ద్వారా రూ.15 లక్షలు ముట్టాయి. ఇందులో సగం ట్యాక్స్‌ల రూపేణా ప్రభుత్వానికే చెల్లించాల్సి ఉంటుంది. ఈ నగదు కాకుండా అతడు కాస్ట్లీ కారు, రూ.15 లక్షల విలువ చేసే డైమండ్ నెక్లెస్ కూడా గెలుచుకోవడం విశేషం. చదవండి: బిగ్‌బాస్ 7 టైటిల్ ముద్దాడిన రైతుబిడ్డ.. ఆ బలమైన కారణాల వల్లే విజయం.. బిగ్‌బాస్ చాణక్యకు తగిన శాస్తి.. మాస్టర్ మైండ్ అని చెప్పి చివరకేమో అలా! -
ఆ ఫీలింగ్స్ గురించి ఆడవారిని మాట్లాడనివ్వరు: బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్!
హారర్ వెబ్ సిరీస్ రాగిణి ఎంఎంఎస్: రిటర్న్స్ 2తో తన కెరీర్ ప్రారంభించిన బ్యూటీ దివ్య అగర్వాల్. పలు రియాలిటీ షోల్లో భామ బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ -1 విన్నర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆమె కింక్(కిస్ ఇష్క్ ఎన్ కనెక్షన్స్) రియాలిటీ షో హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అంతేకాకుండా సమాజంలో భార్య, భర్తల మధ్య రిలేషన్‌పై మాట్లాడింది. ఆమె హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కింక్ షో గురించి ప్రస్తావించింది. (ఇది చదవండి: జవాన్ డైరెక్టర్‌పై నయన్ అసంతృప్తి.. కారణం అదేనా..!!) ఇంటర్వ్యూలో దివ్య మాట్లాడుతూ.. 'నా ప్రయాణం అద్భుతంగా సాగింది. వాస్తవానికి, నేను యుక్తవయస్సులో అమాయకంగా ఉన్నా. కానీ నా ఒరిజినాలిటీయే నన్ను ముందు నడిపిస్తుందని నమ్ముతున్నా. నేనెప్పుడూ కూడా అలా మాట్లాడటానికి భయపడను. భార్య, భర్తల మధ్య రిలేషన్ గురించి ఒపెన్గానే ఉంటాను. కానీ నాకు బాగా అర్థం చేసుకునే భర్త దొరికాడు.' అని చెప్పుకొచ్చింది. భార్య, భర్తల మధ్య రిలేషన్‌పై మాట్లాడుతూ.. 'మన సమాజంలో ఉన్న ఇబ్బంది ఏంటంటే మహిళలు తమ లైంగిక కోరికలను బయటకు చెప్పడాన్ని ప్రోత్సహించరు. ఎందుకంటే మన సమాజం ఇలాంటి వాటిపై మాట్లాడదు కూడా. ఈ అంశానికి సంబంధించి చాలా మందికి సందేహాలు ఉంటాయి. ఒక స్త్రీ తనకు, భర్తకు మధ్య ఏదో మిస్సయిందని భావించినప్పుడు.. తప్పనిసరిగా సాయం కోరుతుంది. భార్య భర్తల మధ్య సాన్నిహిత్యం, అనుకూలత మాత్రమే బంధానికి నిదర్శనం. మీరు మీ జీవితాంతం ఎవరితోనైనా ఉండాలని కోరుకుంటే ఇలాంటి సంభాషణలు చేయడం చాలా ముఖ్యం. అలాంటి పరిస్థితుల్లో తరచుగా తలెత్తే కమ్యూనికేషన్ గ్యాప్‌ను తగ్గించడానికి ఈ షో ద్వారా ప్రయత్నించడం నాకు సంతోషంగా ఉంది. ఇక్కడ భాగస్వాములిద్దరూ తమ భావాలను వ్యక్తపరచడం చాలా ముఖ్యం.' అని అన్నారు. (ఇది చదవండి: ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేసిన హీరోయిన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
ఎమ్మెల్యేగా పోటీ అంటూ ఊహాగానాలు.. రాహుల్ సిప్లిగంజ్ క్లారిటీ
ప్రముఖ సింగర్, బిగ్‌బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్ రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ గతకొద్ది రోజులుగా ప్రచారం ఊపందుకుంది. గోషామహల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్ ఉందంటూ రూమర్స్ జోరందుకున్నాయి. తాజాగా ఈ ఊహాగానాలపై రాహుల్ స్పందించాడు. తాను రాజకీయాల్లోకి రావడం లేదని క్లారిటీ ఇచ్చాడు. నేను ఆర్టిస్ట్‌ను.. రాజకీయాలకు నో 'నా మీద చాలా పుకార్లు, ఆరోపణలు వస్తున్నాయి.. నేను రాజకీయాల్లోకి రావడం లేదు. గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదు. రాజకీయ రంగప్రవేశం అంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. అన్ని పార్టీలలో ఉన్న అందరు నాయకులను నేను గౌరవిస్తాను. నేను ఒక ఆర్టిస్ట్‌ను.. అందరికీ వినోదం పంచడమే నా పని.. నా జీవితమంతా దానికే ధార పోస్తాను. అసలు నేను రాజకీయాల్లోకి వస్తున్నట్లు వార్తలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయో అర్థం కావడం లేదు. ఇది మరీ టూమచ్.. నేను సంగీతాన్నే నా కెరీర్‌గా ఎంచుకున్నాను. ఇందులో చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఏ పార్టీ నాకు ఆహ్వానాలు పంపలేదు. నేను కూడా ఎవరినీ ప్రత్యేకంగా కలవలేదు. దయచేసి ఈ రూమర్స్‌ను ఇక్కడితో ఆపేయండి..' అని నోట్ షేర్ చేశాడు. 'పుకార్లు రావడం సాధారణమే.. కానీ ఈ పుకారు మాత్రం మరీ టూమచ్‌గా ఉంది' క్యాప్షన్‌లో రాసుకొచ్చాడు. దీంతో అతడి రాజకీయ అరంగేట్రం అంటూ వస్తున్న వార్తలకు తెరపడింది. View this post on Instagram A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) చదవండి: సిగరెట్, గంజాయి.. ఊహించనన్ని చెడు అలవాట్లు, నాన్న జేబులో డబ్బులు కొట్టేసేవాడిని.. కొట్టడం.. -
ఆర్య సినిమా చేయనన్నాను, ఎందుకంటే?: శివ బాలాజీ
బిగ్‌బాస్ తొలి సీజన్ విన్నర్ శివ బాలాజీ ఎన్నో సినిమాల్లో తన అద్భుత నటనతో ప్రేక్షకులకు ఆకట్టుకున్నాడు. ఆయన పేరు చెప్పగానే ఆర్య, చందమామ, శంభో శివ భంభో వంటి సినిమాలు టక్కుమని కళ్లముందు మెదులుతాయి. తాజాగా అతడు ఓ షోలో తనకు పేరు తెచ్చిన సినిమాలపై ఆసక్తిక వ్యాఖ్యలు చేశాడు. 'సుకుమార్ గారు ఆర్య ఆడిషన్స్‌కు పిలిస్తే వెళ్లాను. వెంటనే ఓకే చేశారు. అయితే ఆ సినిమాలో నాది నెగెటివ్ పాత్ర కావడంతో చేయనని చెప్పేశాను. కానీ వాళ్లందరూ నాకు సర్ది చెప్పడంతో చివరికి ఒప్పుకున్నాను. అల్లు అర్జున్ ఆర్య సినిమా సమయంలో ఎంత ఆప్యాయంగా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉంటాడు. ఆర్య తర్వాత మల్టీస్టారర్ సినిమా అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. చేసుకుంటూ పోయాను. కానీ చందమామ సినిమా చేయడానికి చాలా భయపడ్డాను. డైరెక్టర్ కృష్ణవంశీ గారు చందమామ సినిమా కోసం ఆడిషన్ చేశారు. రాఖీ సినిమాలోని క్లైమాక్స్ డైలాగ్ చెప్పమని అడిగారు. నేను చెప్పిన తీరు ఆయనకు అంతగా నచ్చలేదు. ఆ విషయం అర్థమైన నేను ఈ సినిమాలో నటించే ఛాన్స్ రాదని ఫిక్సయ్యాను. కానీ కొన్ని రోజుల తర్వాత షూటింగ్‌కు రావాలని ఫోన్ కాల్ వచ్చింది. అపనమ్మకంగానే సెట్స్‌కు వెళ్లేవాడిని. షూటింగ్ జరుగుతున్నా నాకు నమ్మకం కలగలేదు. అసలు నన్ను ఈ సినిమాలో ఉంచుతారా? మధ్యలోనే తీసేస్తారా? అనుకుంటూనే చిత్రీకరణ పూర్తి చేశాను. తీరా సినిమా రిలీజై మంచి విజయం సాధించింది. చందమామ సక్సెస్ మీట్‌కు వెళ్లేటప్పుడు కృష్ణవంశీ పర్సనల్‌గా నా దగ్గరకు వచ్చి అందరితో కలిసిపోవాలి. లేదంటే నీలో ఉన్న ప్రతిభ ఎవరికీ తెలియకుండా పోతుంది అని చెప్పారు' అంటూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు శివబాలాజీ. చదవండి: రోడ్డు ప్రమాదానికి గురైన సింగర్, 10 సెకన్లలో జీవితమంతా.. బలవంతంగా బంధంలో ఉండే కంటే ఒంటరిగా ఉండటమే నయం: సదా -
వేరొకరితో ఎంగేజ్మెంట్, మాజీ ప్రియుడిచ్చిన నగలతో పంచాయితీ!
బిగ్‌బాస్ హిందీ ఓటీటీ విన్నర్ దివ్య అగర్వాల్, నటుడు వరుణ్ సూద్ కొంతకాలం ప్రేమించుకుని చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. వీరి జంటను చూసి చూడముచ్చటగా ఉందని సంబరపడిపోయారు ఫ్యాన్స్. కానీ గతేడాది ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో బ్రేకప్ చెప్పుకున్నారు. అదే సంవత్సరం వ్యాపారవేత్త అపూర్వ పడ్గోయెంకర్ తనకు ప్రపోజ్ చేయడంతో ఓకే చెప్పింది దివ్య. వీరిద్దరి నిశ్చితార్థం కూడా అయిపోగా త్వరలో పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే వరుణ్ గిఫ్ట్‌గా ఇచ్చిన నగలను దివ్య ఇంతవరకు తిరిగి ఇవ్వలేదంటూ ట్విటర్లో ఫైర్ అయింది నటుడి సోదరి అక్షిత. ఆమె మేనేజర్‌కు ఎన్నిసార్లు మేసేజ్ చేసినా కనీస రెస్పాన్స్ లేదని, ఇలా మౌనంగా కూర్చుంటే పట్టించుకునేలా కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి దివ్య వెంటనే స్పందిస్తూ.. చెవి కమ్మలు, వినాయకుడి లాకెట్ చేతిలో పట్టుకున్న ఫోటో షేర్ చేసి తిరిగిచ్చేస్తున్నాలే అని రాసుకొచ్చింది. అసలు వాటిని తానెప్పుడూ అడగలేదని, ఇంతవరకు వాటిని ధరించలేదు కూడా అని క్లారిటీ ఇచ్చింది. తన మేనేజర్ ఆరోగ్యం బాగోలేక ఆస్పత్రిలో ఉన్నాడని, అంత ముఖ్యమైనవైతే తనకే నేరుగా కాల్ చేసి అడగొచ్చుగా అని సెటైర్ వేసింది. Maine toh 10-11 din pehle message kiya tha unke manager ko. Aaj pata nai kyu reaction aa raha hai. Khamoshi ka fayda toh nai uthana chahiye na. — Akshita Sood (@AkshitaSood) February 22, 2023 Giving back the “jewellery”😂 pic.twitter.com/rHPGJ3J2AJ — Divya Agarwal (@Divyakitweet) February 23, 2023 That jersey was just on the show .. he took it back just after we came out of the house 😂 — Divya Agarwal (@Divyakitweet) February 23, 2023 Mujhe yaad bhi nai tha.. I never asked for it.. I never wore them.. it’s almost a year now.. my manager esha is in hospital.. usme bhi bichari calls me to remind me about this.. and if it was so important why wait — Divya Agarwal (@Divyakitweet) February 23, 2023 Haan toh ek saal baad yaad aaya ??? Jeene do bhai .. meri manager hospital me hai — Divya Agarwal (@Divyakitweet) February 23, 2023 చదవండి: కమెడియన్‌ను పెళ్లాడిన నటి, ఫోటోలు వైరల్ -
బిగ్‌బాస్ విన్నర్‌కు ప్రైజ్‌మనీతో పాటు బంగారం గిఫ్ట్!
బిగ్‌బాస్ రియాలిటీ షో పలు భాషల్లో విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఇటీవలే తెలుగులో ఆరో సీజన్ ముగియగా తాజాగా మరాఠీలో నాలుగో సీజన్‌కు గ్రాండ్‌గా ముగింపు పలికారు. వంద రోజుల పాటు హౌస్‌లో ఉండి ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హిందీ నటుడు అక్షయ్ కేల్కర్ ట్రోఫీ అందుకున్నాడు. యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా పేరు తెచ్చుకున్న అక్షయ్ ట్రోఫీతో పాటు గోల్డ్ బ్రాస్లెట్, రూ.15,55,000 నగదు సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్ బెస్ట్ కెప్టెన్‌గా అవతరించినందుకుగానూ మరో రూ.5 లక్షలు విలువైన చెక్ అందుకున్నాడు. వంద రోజులపైనే సాగిన ఈ షోకు నటుడు మహేశ్ మంజ్రేకర్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో అక్షయ్‌ను విన్నర్‌గా ప్రకటించాడు. ఇక ఈ షోలో అపూర్వ నెమ్లేకర్ ఫస్ట్ రన్నరప్‌గా, కిరణ్ సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. వివాదాస్పద నటి రాఖీ సావంత్ రూ.9 లక్షలతో పోటీ నుంచి వైదొలగింది. సీజన్ విన్నర్‌గా నిలిచిన అక్షయ్‌కు శుభాకాంక్షలు చెప్తున్నారు ఫ్యాన్స్. View this post on Instagram A post shared by Akshay Kelkar (@akshaykelkar) View this post on Instagram A post shared by Nirom मराठी (@nirom_marathi_official) చదవండి: కేజీఎఫ్ సినిమాలో యశ్ కనిపించడా? -
బిగ్‌బాస్ షో విన్నర్‌గా రేవంత్.. ఎవరెవరు ఏయే స్థానాల్లో ఉన్నారంటే?
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ విన్నర్‌గా రేవంత్ నిలిచారు. రన్నరప్‌గా శ్రీహాన్ నిలిచారు. ఈ గ్రాండ్ ఫినాలేలో మాజీ కంటెస్టెంట్ల డ్యాన్సులతో పాటు హీరోయిన్స్ స్పెషల్ డ్యాన్సులతో కనువిందు చేశారు. ఈ గ్రాండ్ ఫినాలేలో నిఖిల్, ధమాకా టీమ్ రవితేజ, శ్రీలీల, సీనియర్ హీరోయిన్ రాధ స్టేజీపై సందడి చేశారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన బిగ్‌బాస్ 6 తెలుగు గ్రాండ్ ఫినాలే వైభవంగా జరిగింది. వాల్తేరు వీరయ్య బాస్ పార్టీ సాంగ్‌తో కింగ్ నాగార్జున అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. ఇక వచ్చీ రావడంతో కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్‌ను ఆత్మీయంగా పలకరించాడు నాగ్. అనంతరం మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా బయటకు వచ్చేసిన శ్రీసత్యతో ముచ్చటించాడు. మరికాసేపట్లో పెళ్లి పెట్టుకుని పెళ్లికూతురి గెటప్‌లో గ్రాండ్ ఫినాలేకు వచ్చిన నేహా చౌదరిని చూసి అవాక్కయ్యాడు. ఈ షో ముగిసిన వెంటనే అందరూ మండపానికి వచ్చేసి తనను ఆశీర్వదించాలని కోరింది నేహా. బిగ్‌బాస్ మినీ అవార్డులు.. తర్వాత టాప్ ఫైనలిస్టులతో అవార్డుల పంపిణీ చేపట్టాడు నాగ్. అందులో భాగంగా ఐదు అవార్డులు ప్రవేశపెట్టాడు. మొదటగా బెస్ట్ చెఫ్ అవార్డు మెరీనాకు ఇవ్వాలన్నాడు రేవంత్. అందరికీ వంట చేసి పెడుతూనే గేమ్ ఆడేదని చెప్పాడు. దీంతో ఆ అవార్డును మెరీనాకు అందించాడు హోస్ట్. తర్వాత బెస్ట్ డ్యాన్సర్ అవార్డును ఫైమాకు ఇవ్వాలన్నాడు ఆదిరెడ్డి. ఆమె స్టేజీపైకి రాగానే చేతికి ముద్దు పెడతానంటూ ఆటపట్టించాడు నాగ్. దెబ్బకు హడలిపోయిన ఫైమా.. మీరు ముద్దులు ఇస్తే నాకు నిద్ర పట్టడం లేదంటూ దూరం జరిగింది. అనంతరం కీర్తి.. స్లీపింగ్ స్టార్ అవార్డును శ్రీసత్యకు ఇవ్వాలనడంతో నాగ్ దాన్ని ఆమెకు బహుకరించాడు. రోహిత్.. రాజ్ బెస్ట్ గేమర్ అని చెప్పడంతో అతడికి పురస్కారం ఇచ్చాడు నాగ్. శ్రీహాన్.. బెస్ట్ లవర్ బాయ్ అవార్డుకు అర్జున్ కల్యాణ్ పేరును సూచించాడు. దీంతో అతడు స్టేజీపై వచ్చి అవార్డు అందుకున్నాడు. తర్వాత యంగ్ హీరో నిఖిల్ గెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. హౌస్‌లోకి వెళ్లి టాప్-5 కంటెస్టెంట్స్‌లో ఒకరైన రోహిత్‌ను ఎలిమినేట్ చేసి తనతో పాటు బయటకు తీసుకొచ్చేశాడు. ధమాకా హీరోహీరోయిన్లు రవితేజ, శ్రీలీల స్టేజీపైకి వచ్చి జింతాత స్టెప్పుతో ఓ ఊపు ఊపారు. ఇంతలో ఆదిరెడ్డి ఎలిమినేట్ అయిపోయాడు. తర్వాత అతడు టాప్ 3 కంటెస్టెంట్ల గురించి మాట్లాడుతూ.. 'కీర్తి బిగ్‌బాస్ షోలో కనిపించడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆత్మహత్యలు ఆగుతాయి. అన్ని కష్టాల్లో ఉన్న ఆమె అంత ధైర్యంగా ముందుకెళ్లడం చాలామందికి ఇన్స్పిరేషన్. రేవంత్‌లో 20 తప్పులు ఉంటే 40 పాజిటివ్‌లు ఉంటాయి. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెను వదిలి వచ్చి హౌస్‌లో గేమ్ ఆడటం అంటే మామూలు విషయం కాదు. నాకంటే ఆ ముగ్గురు బాగా ఆడారు. కాబట్టి వాళ్లకంటే ముందే ఎలిమినేట్ అయినందుకు సంతోషంగా ఉంది' అన్నాడు. తర్వాత రవితేజ హౌస్‌లోకి వెళ్లి టాప్ 3 కంటెస్టెంట్లకు సూట్‌కేసు ఆఫర్ చేశాడు. ప్రైజ్‌మనీలో నుంచి పది శాతం మీ సొంతమని ఊదరగొట్టినా ఎవరూ పట్టించుకోలేదు. దాన్ని ముప్పై శాతానికి పెంచినా సరే వద్దే వద్దన్నట్లుగా సైలెంట్‌గా ఉండిపోయారు. దీంతో రవితేజ చేసేదేం లేక కీర్తి చేయి పట్టుకుని బయటకు తీసుకొచ్చాడు. ఇక హౌస్‌లో రేవంత్, శ్రీహాన్ మాత్రమే మిగిలారు. ఈసారి వారి కోసం నాగార్జున రంగంలోకి దిగాడు. గోల్డెన్ బ్రీఫ్‌కేసుతో హౌస్‌లోకి వెళ్లాడు. రూ.25 లక్షలున్న బ్రీఫ్‌కేసును ఎవరు సొంతం చేసుకుంటారని అడిగాడు. ఇద్దరూ వద్దనేసరికి ఆఫర్‌ను రూ.30 లక్షలకు పెంచాడు. ఆరోహి, కీర్తి, అభినయ, మెరీనా, రోహిత్, సుదీప మినహా మిగతా అందరూ శ్రీహాన్ సూట్‌కేసు తీసుకోవడమే మంచిదని చెప్పారు. అందరి అభిప్రాయం అడిగిన తర్వాత ఇద్దరూ సూట్‌కేసు తీసుకోవడానికి ససేమీరా అన్నారు. దీంతో నాగ్ ఆ డబ్బును రూ.40 లక్షలకు పెంచాడు. మొదట్లో సూట్‌కేసు తీసుకోవద్దన్న శ్రీహాన్ తండ్రి చివరికి తీసుకోమని చెప్పాడు. తండ్రి మాట విన్నాక శ్రీహాన్ అమ్మానాన్న కోసం తీసుకుంటున్నానన్నాడు. ఇద్దరినీ స్టేజీపైకి తీసుకొచ్చాక రేవంత్‌కు ట్రోఫీ బహుకరించడంతో పాటు పది లక్షల చెక్, 605 గజాల సువర్ణభూమి ప్లాట్‌ను అందించారు. చివరగా అందరికీ దిమ్మతిరిగిపోయే న్యూస్ చెప్పాడు నాగ్. బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారి ఇద్దరూ విన్నర్స్ అయ్యాడన్నాడు. అదెలాగంటే ట్రోఫీ అందుకుని రేవంత్ గెలిచాడని, కానీ ప్రేక్షకుల ఓట్లు శ్రీహాన్‌కే ఎక్కువ వచ్చాయని ట్విస్ట్ ఇచ్చాడు. ఏదేమైనా ట్రోఫీ అందుకుంది రేవంత్ కాబట్టి అతడిని అఫీషియల్ విన్నర్‌గా ప్రకటించాడు. -
ప్రియుడితో బిగ్‌బాస్ విన్నర్ ఎంగేజ్మెంట్.. బ్రేకప్ అయిన కొన్ని నెలలకే!
ప్రముఖ బిగ్‌బాస్ నటి, ఓటీటీ విన్నర్ దివ్య అగర్వాల్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. తాజాగా ఆమె పుట్టినరోజు సందర్భంగా ప్రియుడు ప్రపోజ్ చేయడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది భామ. బర్త్‌డే పార్టీలోనే ప్రియుడు అపూర్వ పడ్గాంకర్‌తో నిశ్చితార్థం చేసుకుంది. దీనికి సంబంధించిన తన ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఆమె ఇటీవల మాజీ ప్రియుడు వరుణ్ సూద్‌తో కొన్ని నెలల క్రితమే విడిపోయింది. పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. దివ్య అగర్వాల్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'నేను ఎప్పుడైనా నవ్వకపోవడం అనేది బహుశా ఎప్పటికీ జరగదు. జీవితం మెరుపులా మారుతోంది. ఈ ప్రయాణాన్ని పంచుకోవడానికి సరైన వ్యక్తిని ఎంచుకున్నా. అతని నా ప్రేమ ఎప్పటికీ వాగ్దానం. ఈ ప్రత్యేకమైన రోజుతో ఇకపై నేను ఒంటరిగా నడవను.' అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది బిగ్‌బాస్ బ్యూటీ. దీంతో వెంటనే ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియా వేదికగా పవిత్ర పునియా, మహి విజ్, రక్షందా ఖాన్, ఆర్తి సింగ్, జే భానుషాలి సహా అభిమానులు అభినందనలతో ముంచెత్తారు. దివ్య పుట్టినరోజు వేడుకకు ఆమె సన్నిహితులు కూడా హాజరయ్యారు. అపూర్వ పడ్గావ్కర్ ఎవరు?: అపూర్వ పడ్గాంకర్ ఒక వ్యాపారవేత్త. అతను ముంబైలో నాలుగు రెస్టారెంట్లు ఉన్నాయి. వరుణ్ సూద్‌తో డేటింగ్, బ్రేకప్: దివ్య ఇంతకుముందే వరుణ్ సూద్‌తో రిలేషన్షిప్లో ఉంది. అయితే ఈ ఏడాది మార్చిలో ఇద్దరూ విడిపోయారు. తన భవిష్యత్తును వరుణ్‌తో కొనసాగించలేనని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. విడిపోయాక కూడా వరుణ్, దివ్య స్నేహితులుగా కొనసాగుతున్నారు. వరుణ్, దివ్య 2018లో డేటింగ్ ప్రారంభించారు. View this post on Instagram A post shared by Divya AmarSanjay Agarwal (@divyaagarwal_official) -
నాకు హీరో కన్నా ఎక్కువ డబ్బులిచ్చారు: బుల్లితెర నటి
సెలబ్రిటీల కోసం పడిచచ్చేవాళ్లే కాదు వారిని చులకనగా చూసేవాళ్లూ చాలామందే ఉన్నారు. సన్నగా ఉంటే బక్కచిక్కిపోయిందని, బొద్దుగా ఉంటే లావుగా ఉందని, కురచగా ఉంటే ఎత్తూపొడుగు లేదని, హైట్ ఎక్కువ ఉంటే అన్ని పాత్రలకు సెట్టవ్వదని ఇలా నానామాటలు అంటుంటారు. హిందీ బిగ్‌బాస్ 15వ సీజన్ విన్నర్, నాగిని సీరియల్ నటి తేజస్వి ప్రకాశ్ కూడా ఇలాంటి బాడీ షేమింగ్ ట్రోల్స్ బాధితురాలే. దీని గురించి ఆమె మాట్లాడుతూ.. 'బరువు ఎక్కువగా ఉన్నవారినే కాదు, బక్కపలుచగా ఉన్నవారిని కూడా బాడీ షేమింగ్ చేస్తారు. నేనూ అలాంటి నెగెటివ్ కామెంట్లను ఫేస్ చేశాను. కొన్నిసార్లు నాకు కూడా బాడీ పర్ఫెక్ట్గా కనిపించేందుకు సర్జరీ చేసుకుంటే బాగుండనిపించింది. చాలామంది అదే పని చేశారు. కానీ ఇతరుల కామెంట్లతో నేనెందుకు మారాలని అనుకున్నాను. దేవుడు నన్ను ఎలా పుట్టించాడో అలాగే ఉండాలనుకున్నాను. నా బాయ్‌ఫ్రెండ్ కూడా నేను లడ్డూలా ఉంటేనే ఇష్టపడతాడు. కాబట్టి నన్ను నేను మార్చుకోనక్కర్లేదు' అని చెప్పుకొచ్చింది. ఇక ఇండస్ట్రీలో పనితనాన్ని గురించి మాట్లాడుతూ.. 'ఒకసారైతే నాకు హీరో కన్నా ఎక్కువ డబ్బులిచ్చారు. ఎందుకంటే వారు ఆ సమయంలో నేనే యాక్ట్ చేయాలని కోరుకున్నారు, అందుకే ఎక్కువ ముట్టజెప్పారు. దీన్నిబట్టి నేను చెప్పొచ్చేదేంటంటే మీ పనిలోని నైపుణ్యాన్ని బట్టే మీకు డబ్బులు చెల్లిస్తారు' అని చెప్పుకొచ్చింది తేజస్వి ప్రకాశ్. -
ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నా: ‘బిగ్‌బాస్’ విన్నర్
ఒకసారి నా ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే...అది సజావుగా జరిగిన ప్రయాణం మాత్రం కాదు. రకరకాల అవరోధాలు ఎదుర్కొన్నాను. అయితే ఎప్పుడూ నిరాశకు గురి కాలేదు. బిగ్‌బాస్ విజేతగా నిలవడం నాలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది’ అంటుంది తేజస్వి ప్రకాష్.బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించిన హిందీ బిగ్‌బాస్ సీజన్ 15 విజేతగా నిలిచారు తేజస్వి. ప్రతీక్ సెహజ్ పాల్- తేజస్విని మధ్య సాగిన టైటిల్ రేసులో చివరికి సీరియల్ నటి తేజస్విని ప్రకాశ్ విజయం సాధించింది. ముంబై యూనివర్శిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్‌లో పట్టా పుచ్చుకున్న తేజస్వి ప్రకాష్‌కు సంగీతం, నటన అనేవి ఇష్టమైన విషయాలు. దీనికి తన కుటుంబనేపథ్యం కూడా కారణం. స్టార్ ఇండియా పే టెలివిజన్ చానల్ ‘లైఫ్ ఓకే’తో తన యాక్టింగ్ కెరీర్ మొదలుపెట్టింది తేజస్వి. టెలివిజన్ షోలు, సినిమాల్లో స్పెషల్ అప్పియరెన్స్, వెబ్‌సిరీస్‌లు ఒక ఎత్తయితే రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 15 విన్నర్ కావడం మరో ఎత్తు. తన కెరీర్‌ను మరి కొన్ని అడుగులు ముందుకు నడిపించే విజయం ఇది. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ముంబై వీధుల్లో ఆటో నడిపిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్
Rahul Sipligunj Rides Auto On Streets In Mumbai Video Viral: బిగ్‌బాస్ సీజన్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్ ముంబై వీధుల్లో ఆటో నడిపాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది తన జీవితంలో లంబోర్ఘిని అని, దీని వల్ల చాలా విషయాలు నేర్చుకున్నానంటూ రాహుల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇక ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలె ముంబైలో జరిగింది. ఈ సందర్భంగా రాహుల్ ముంబై వెళ్లాడు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎంతగానో పాపులర్ అయిన నాటు నాటు సాంగ్‌ని రాహుల్ పాడిన సంగతి తెలిసిందే. ఇక వచ్చే ఏడాది జనవరి7న ఈ సినిమా విడుదల కానుంది. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాలో కొమురమ్ భీమ్‌గా తారక్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ పాత్రలు పోషించారు. చెర్రీకి జోడిగా బాలీవుడ్ క్యూటీ ఆలియాభట్, తారక్ సరసన హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్ నటించారు. View this post on Instagram A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) -
బిగ్‌బాస్ సీజన్-5 విన్నర్ ప్రైజ్‌మనీలో 'బిగ్' సర్ప్రైజ్
Bigg Boss 5 Telugu: BB5 Title Winner Prize Money Details: బిగ్‌బాస్ సీజన్-5 మరో మూడు వారాల్లో ముగియనుంది. ప్రస్తుతం టైటిల్ పోరులో మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే సన్నీ-షణ్నూకే అవకాశాలు ఎక్కువ. టైటిల్ రేస్ కూడా వీరిద్దరి మధ్యే జరుగుతుందన్నది పలువురి అభిప్రాయం. ఇక ట్రోఫీని ముద్దాడే విజేత ఎవరనే దాన్ని పక్కన పెడితే, బిగ్‌బాస్ విన్నర్‌కి ఇచ్చే ప్రైజ్‌మనీకి సంబంధించి ఆసక్తికర వార్త ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంది. గత సీజన్లతో పోలిస్తే బిగ్‌బాస్ సీజన్-5 విజేతకు డబుల్ బొనాంజ దక్కుతుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. బిగ్‌బాస్ విన్నర్‌కి గాను ఈసారి 50లక్షల రూపాయల ప్రైజ్‌మనీతో పాటు 25 లక్షల విలువైన ఫ్లాట్ కూడా దక్కుతుందని సమాచారం. ఇప్పటివరకు బిగ్‌బాస్ తెలుగు సీజన్లలో 50 లక్షల ప్రైజ్‌మనీ అన్నది అత్యధికం. కానీ ఈసారి తొలిసారిగా ఆ రికార్డును బ్రేక్‌చేస్తూ 50 లక్షల ప్రైజ్‌మనీకి అదనంగా పాతిక లక్షల విలువైన ఫ్లాట్ కూడా అందించనున్నట్లు సమాచారం. మరికొందరేమో ప్రైజ్‌మనీలో సగాన్ని తగ్గించి ఫ్లాట్ ఇస్తారని ప్రచారం చేస్తున్నారు. ఏది ఏమైనా బిగ్‌బాస్ సీజన్-5 విన్నర్‌గా ఎవరు నిలవనున్నారన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. -
ఒకరిని హీరో చేయడం కోసం మరొకరిని జీరో చేయకండి : సన్నీ తల్లి
Bigg Boss 5 Telugu, Sunny Mother Kalavathi Request To All BB5 Fans: బిగ్‌బాస్ ఫినాలే ఎపిసోడ్‌కు ఇంకా మూడు వారాలే మిగిలుంది. దీంతో బిగ్‌బాస్ సీజన్-5 విజేతగా ఎవరు నిలవనున్నారన్నది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం టాప్-1 పోటీలో సన్నీ, షణ్నూల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. సిరి చేసే అతివల్ల షణ్నూకి నెగిటిటివి పెరిగిందని, ఇది సన్నీకి ప్లస్ అవుతుందని పలువురు భావిస్తున్నారు. మొదటి నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉన్న సన్నీ టైటిల్ విన్నర్‌కి అర్హుడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికి తోడు వీకెండ్ ఎపిసోడ్లో సైతం మిగతా కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ సైతం సన్నీ టాప్-5లో కశ్చితంగా ఉంటాడని చెప్పడం మరింత బలం చేకూర్చింది. ఈ నేపథ్యంలో షణ్నూ- సన్నీ ఫ్యాన్స్ మధ్య కాస్త సోషల్ వార్ నడుస్తుంది. విన్నర్‌గా తేలేది అతడే అంటూ ఇద్దరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు ట్రోల్స్ చేస్తూ నెగిటివిని పెంచేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై సన్నీ తల్లి కళావతి స్పందించింది. 'ఎవరికి నచ్చితే వాళ్లకు ఓట్లు గెలిపించండి తప్పితే విమర్శించకండి అని విన్నవించుకున్నారు. అక్కడ అందరూ ఫ్రెండ్స్‌లా ఉన్నారు. నెగిటివ్ కామెంట్స్ చేయకండి. ఒకరిని హీరో చేయడం కోసం మరొకరిని జోరో చేయకండి' అని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. A request to all of you from kalavathi amma 😍#biggbosstelugu5 pic.twitter.com/Jw2bwrdJax — Sunny Vj (@vjsunnyofficial) November 28, 2021 -
అలాంటి వాళ్లు నా ఫ్యాన్ అని మాత్రం చెప్పుకోకండి: బిగ్‌బాస్ విన్నర్
Rubina Dilaik Slams Fans Who Harass Her For Gaining Weight: స్క్రీన్‌పై కనిపించేవాళ్లు ఎప్పుడూ ఫిట్‌గానే ఉండాలనే ధోరణిలో ఉంటారు కొందరు నెటిజన్లు. ఏమాత్రం లావైనా ట్రోలింగ్ చేస్తుంటారు. హీరోయిన్స్ విషయంలో ఈ ట్రోలింగ్ మరీ ఎక్కువగా ఉంటుంది. తాజాగా హిందీ బిగ్‌బాస్14 విన్నర్, నటి రుబీనా దిలేక్కు సైతం ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఇటీవలె కరోనా నుంచి కోలుకున్న ఆమె ఈ మధ్యకాలంలో బాగా బరువు పెరిగిపోయింది. దీంతో సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్ కూడా ఎక్కువైంది. బరువు పెరగడాన్ని చాలా పెద్ద సమస్యగా చిత్రీకరిస్తే కొందరు తనపై చేస్తున్న నెగిటివ్ కామెంట్స్‌పై రుబీనా స్పందించింది. 'నా ఫ్యాన్స్, శ్రేయాభిలాషులం అని చెప్పుకునేవారికి నేను బరువు పెరగడం మిమ్మల్ని ఎంతో బాధించిందని నాకు అర్థమవుతుంది. అందుకే అసలు కనికరం లేకుండా ద్వేషాన్ని వెల్లగక్కుతూ నాకు మెసేజ్‌లు, మెయిల్స్ పంపుతున్నారు. నేను లావుగా ఉండటం, మంచి డిజైనర్ బట్టలు దరించకపోవడం, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయకపోవడం మిమ్మల్ని నిరాశ పరిచిందని నాకు తెలుసు. మీకు టాలెంట్ కంటే ఫిజికల్‌గా ఎలా ఉండటం అన్నదే ముఖ్యం. అయితే మీకో శుభవార్త. ఇది నా జీవితం. దాంట్లో ఎన్నో దశలు ఉన్నాయి. అందులో మీరు కూడా ఒకటి. నేను నా అభిమానులను గౌరవిస్తాను. కాబట్టి ప్లీజ్ ఇలాంటి వాళ్లు నా ఫ్యాన్ అని చెప్పుకోకండి' అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. View this post on Instagram A post shared by Rubina Dilaik (@rubinadilaik) -
అనారోగ్య సమస్యలతో బిగ్‌బాస్-4 విజేత అభిజిత్
Bigg Boss Fame Abhijeet About His Movies: 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అభిజిత్ బిగ్‌బాస్ షోతో ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. కండబలంతో కాకుండా బుద్ది బలంతో గేమ్ ఆడడం ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది. మిస్టర్ కూల్‌తో పాటు మిస్టర్ పర్ఫెక్ట్గా ఎంతోమంది అమ్మాయిల మనసు దోచుకున్న అభిజిత్ బిగ్‌బాస్ సీజన్-4 విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. షో అనంతరం మిగతా కంటెస్టెంట్లు పలు బర్త్‌డే, ప్రైవేట్ పార్టీల్లో పాల్గొంటే అభిజిత్ మాత్రం ఎక్కువగా కనపడలేదు. అంతేకాకుండా సోహైల్, అఖిల్, అరియానా సహా పలువురు కంటెస్టెంట్లు వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా మారితే, సీజన్ విన్నర్‌గా నిలిచిన అభిజిత్ మాత్రం సెలైంట్ అయిపోయాడు. ఆ మధ్య మూడు ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు చెప్పిన అభిజిత్ ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. తాజాగా ట్విట్టర్లో 'ఆస్క్ మి ఎనీథింగ్' అనే సెషన్‌ను నిర్వహించిన అభిజిత్‌కు ఫ్యాన్స్ నుంచి కుప్పలు తెప్పలుగా క్వశ్చన్స్ వచ్చి పడ్డాయి. సినిమా అప్డేట్ గురించి చెప్పాల్సిందిగా పలువురు అభిమానులు ప్రశ్నల వర్షం కురిపించారు. దీనిపై స్పందించిన అభిజిత్.. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగోలేదని, అందుకే సినిమాలు చేయట్లేదని చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు. ఇప్పుడు తనకు ఆరోగ్యమే ఎక్కువ ముఖ్యం అని తెలిపాడు. అయితే ఎలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడో మాత్రం అభిజిత్ క్లారిటీ ఇవ్వలేదు. Guys, thanks so much for coming. It’s really difficult to see all your tweets but I can tell you that I have tried very much to reply to everyone. I only have one thing to say right now, my body is my only priority. Health is wealth 🙏🏽 — Abijeet (@Abijeet) September 12, 2021 -
సిద్దార్థ్ శుక్లా చివరి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వైరల్
RIP Sidharth Shukla: యువ నటుడు, బిగ్‌బాస్ విన్నర్ సిద్దార్థ్ శుక్లా హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఆయన అభిమానులు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన యుక్త వయసులోనే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడంపై విచారం వ్యక్తం చేస్తున్నారు. అతడితో పాటు హిందీ బిగ్‌బాస్ 13వ సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్లు, ఇతర బుల్లితెర ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు సిద్దార్థ్ మరణం ఇండస్ట్రీకి తీరని లోటని సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా చిన్నారి పెళ్లికూతురు(బాలికా వధు)తో దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్న సిద్దార్థ్ సోషల్ మీడియాలో చేసిన ఆఖరి పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. అందులో ఫ్రంట్ లైన్ వారియర్స్ సేవలకు సలాం చేస్తూనే పారాలింపిక్స్‌లో పతకాలు సాధించినవారికి శుభాకాంక్షలు తెలియజేశాడు. 'ఫ్రంట్‌లైన్ వారియర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు మీ ప్రాణాలను పణంగా పెడతారు. నిరంతరాయంగా పని చేస్తారు. కుటుంబాలతో కలిసి ఉండలేని రోగులకు ఓదార్పునిస్తారు. మీరు నిజంగా ధైర్యవంతులు. ఇలా ముందువరుసలో ఉండి పనిచేయడం అంత ఈజీయేం కాదు, మీ కష్టాన్ని మేము అభినందిస్తున్నాము. అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానున్న ముంబై డైరీస్ ఈ సూపర్ హీరోల త్యాగాలకు నిదర్శనం. ఈ సినిమా ట్రైలర్ ఆగస్టు 25న రిలీజ్ అవుతుంది' అని సిద్దార్థ్ తన ఇన్స్టాగ్రామ్ ఆఖరి పోస్ట్‌లో రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by Sidharth Shukla (@realsidharthshukla) ఇక ట్విటర్లో.. 'భారతీయులు మనం మరోసారి గర్వపడేలా చేస్తున్నారు. పారాలింపిక్స్‌లో బంగారు పతకాన్ని చేజిక్కించుకుని ప్రపంచ రికార్డు సాధించిన సుమిత్ అంటిల్, అవని లేఖారాలకు శుభాకాంక్షలు' అని పేర్కొన్నాడు. Indians making us proud over and over again… a World Record in addition to the #Gold in #Paralympics … congratulations #SumitAntil and #AvaniLekhara — Sidharth Shukla (@sidharth_shukla) August 30, 2021 -
Adipurush: నన్ను ఎవరూ సంప్రదించలేదు!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న భారీ చిత్రం ‘ఆదిపురుష్’. ఓమ్ రౌత్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించనున్నారు. ఇప్పటికే సీతగా కృతీసన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్‌ను ఎంపిక చేశారు. అలాగే ఓ కీలక పాత్ర పాత్రం బిగ్‌బాస్ విన్నర్‌ను సంప్రదించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. హిందీ బిగ్‌బాస్ 13వ సీజన్ విన్నర్ సిద్దార్థ్ శుక్లాను మేఘనాథ్ పాత్ర చేయనున్నారని, ఇప్పటికే మేకర్స్ ఆయనతో సంప్రదింపులు జరిపినట్లు బీటౌన్‌లో ఓ వార్త చక్కర్లు కొట్టింది. అయితే దీనిపై ఇంత వరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. తాజాగా ఇదే విషయంపై సిద్దార్థ్ శుక్లాను ప్రశ్నించగా..ఇప్పటివరకు తన వద్దకు ఎవరూ రాలేదని, ఇందులో నిజం ఉందో లేదా కూడా తనకు తెలియదని చెప్పారు. ఆదిపురుష్‌లో కీలకపాత్రకు సంబంధించి తనను ఎవరూ సంప్రదించలేదని చెప్పాడు. దీంతో ఈ రూమర్స్‌కు చెక్ పెట్టినట్లయ్యింది. హిందీలో బాలికా వధు, దిల్ సే దిల్ తక్ వంటి సీరియల్స్‌తో గుర్తింపు పొందిన సిద్దార్థ్..బిగ్‌బాస్ సీజన్13తో మరింత పాపులర్ అయ్యాడు.షెహ్నాజ్‌తో లవ్ ట్రాక్ అతనికి మరింత కలిసొచ్చింది. గత సీజన్ విన్నర్‌గా నిలిచిన సిద్దార్థ్ శుక్లా నటించిన 'బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్' అనే ఓ వెబ్‌సిరీస్ విడుదలకు రెడీగా ఉంది. ఈ సిరీస్ గత రెండు సీజన్లు విజయవంతం అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సిరీస్ మూడవ సీజన్‌ను ప్రముఖ నిర్మాత ఏక్తాకపూర్ ప్రొడ్యూస్ చేశారు. చదవండి : నటితో బిగ్‌బాస్ విన్నర్ లిప్‌లాక్.. వీడియో వైరల్ సుషాంత్ కేసు: సిద్ధార్థ్ కస్టడీకి కోర్టు అనుమతి -
Adipurush: కీలక పాత్రలో బిగ్‌బాస్ విన్నర్!
బాహుబలితో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారిపోతే తానాజీ: ది అన్సంగ్ వారియర్‌తో ఓం రౌత్ క్రేజీ డైరెక్టర్‌గా మారిపోయాడు. అలాంటిది వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందంటే అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి. ఈ అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా నటీనటులను ఎంపిక చేసుకుంటోంది ఆదిపురుష్ టీమ్. ఇప్పటికే సీతగా కృతీసన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్‌ను ఎంపిక చేయగా తాజాగా మరో ముఖ్య పాత్ర కోసం బిగ్‌బాస్ విన్నర్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. హిందీ బిగ్‌బాస్ 13వ సీజన్ విన్నర్ సిద్దార్థ్ శుక్లాను మేఘనాథ్ పాత్రలో నటించాల్సిందిగా దర్శకులు కోరినట్లు ఫిల్మీదునియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే ఇంతమంచి ఆఫర్‌ను సిద్దార్థ్ వదులుకునే అవకాశమే లేదు. పైగా పాన్ ఇండియా సినిమాలో నటించడమంటే దశ తిరిగినట్లే లెక్క. మరి ప్రభాస్ ఆదిపురుష్‌లో సిద్దార్థ్ ఉంటాడా? లేదా? అనేది క్లారిటీ రావాలంటే చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించేవరకు వేచి చూడాల్సిందే. మరోవైపు ఆదిపురుష్ రెండో షెడ్యూల్ ఇటీవలే ముంబైలో ముగిసింది. మూడో షెడ్యూల్‌ను కూడా అక్కడే చిత్రీకరించాలని అనుకున్నారు. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం షూటింగ్స్‌ను రద్దు చేయడంతో ఆ ఆలోచన విరమించుకున్న ఆదిపురుష్ టీం తాజా షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో జరిపేందుకు ప్లాన్ చేసింది. ఈ షెడ్యూల్ 45 రోజులకు పైగా కొనసాగుతుందని సమాచారం. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో వచ్చే ఏడాది ఆగస్టు 11న థియేటర్లలో విడుదల కానుంది. చదవండి: Kriti Sanon: అక్కడే నా సంతోషం! -
బిగ్‌బాస్ విన్నర్ తండ్రికి అస్వస్థత
హిందీ బిగ్‌బాస్ ఏడో సీజన్ విన్నర్ గౌహర్ ఖాన్ తండ్రి అస్వస్థతకు లోనయ్యారు. దీంతో అతడిని హుటాహుటిన ఆస్పత్రికి చేర్పించారు. ఈ విషయాన్ని గౌహర్ ఖాన్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో వెల్లడించింది. 'నా జీవితం నా పప్పా..' అంటూ అతడి చేయి పట్టుకుని ఉన్న ఫొటోను అభిమానులతో పంచుకుంది. తన తండ్రి వెంటనే కోలుకోవాలని ప్రార్థించండి అని ఫ్యాన్స్‌ను కోరింది. ఇక తండ్రిని చూసుకునేందుకు ఆమె షూటింగ్‌కు బ్రేక్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రాత్రి రెండు గంటలైనా కంటి మీద కునుకు లేకుండా తండ్రిని అంటిపెట్టుకుని ఉన్నానని ఓ ఫొటోను పంచుకుంది. కాగా ఈ బాలీవుడ్ నటి, కొరియోగ్రాఫర్ జైద్ దర్బార్‌ను డిసెంబర్ 25న పెళ్లాడింది. కోవిడ్ కారణంగా అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి నిఖా జరిగింది. జైద్ కంటే గౌహర్ ఎనిమిదేళ్లు పెద్దదైనప్పటికీ వారిది స్వచ్ఛమైన ప్రేమ అని, పెళ్లికి వయసుతో పని లేదంటూ వారి షాదీ దగ్గరుండి జరిపించాడు జైద్ తండ్రి, బాలీవుడ్ కంపోజర్ ఇస్మాయిల్ దర్బార్. కాగా మాజీ మోడల్ అయిన గౌహర్ అనేక టీవీ షోలలో కనిపించింది. హిందీ బిగ్‌బాస్ ఏడో సీజన్లో పాల్గొని విజేతగా అవతరించిన ఆమె 14వ సీజన్లోనూ హౌస్‌లోకి వెళ్లి వచ్చింది. ఇటీవలే ఆమె తాండవ్ వెబ్ సిరీస్‌లో నటించగా దానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమైన ఈ వెబ్ సిరీస్‌లో సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలో నటించాడు. చదవండి: భర్తను ఎత్తుకున్న నటి.. ఫోటో వైరల్ మండుటెండల్లో బాలీవుడ్ నటి డెడికేషన్, 4 రోజులుగా బిగ్‌బాస్ ఐదో సీజన్లో శ్రీరెడ్డి! -
విడాకులు తీసుకుందామనుకున్నాం.. బిగ్‌బాస్ మళ్లీ కలిపింది
బిగ్‌బాస్ హిందీ రియాల్టీ షోలో 143 రోజులు హౌస్‌లో ఉండి విజేతగా నిలిచింది టీవీ నటి రుబీనా దిలైక్. వాదనల్లో ఎదుటివారిని తల వాచిపోయేలా చేయగలిగే ఈ నటి బిగ్‌బాస్ షోలో ఉన్నన్ని రోజులు సోషల్ మీడియాలో బాగానే మద్దతు సంపాదించింది. విజేతగా వచ్చే కీర్తితో పాటు ఇదే షోలో పాల్గొన్న భర్త అభినవ్ శుక్లాతో తన వివాహబంధం గట్టిపడిందని చెబుతోంది. ‘విడాకులు తీసుకోవాల్సిన మేము ఈ షో వల్ల ఒకరినొకరం అర్థం చేసుకున్నాం’ అందామె. 33 ఏళ్ల ఈ సిమ్లా సెలబ్రిటీ పరిచయం... తెలుగు బిగ్‌బాస్ షో నాలుగుసార్లు జరిగితే ఒక్కసారి కూడా స్త్రీలు విజేతగా నిలువలేదు. కాని బిగ్‌బాస్ హిందీ షో 14 సీజన్లు గడిస్తే ఇప్పటికి ఐదారుసార్లు స్త్రీలు విజేతలుగా నిలిచారు. తాజాగా బిగ్‌బాస్ 14 విజేతగా టీవీ నటి రుబీనా దిలైక్ నిలిచింది. పేరు, గుర్తింపుతో పాటు ప్రైజ్‌మనీగా 36 లక్షల రూపాయలు ఆమెకు దక్కాయి. అయితే అదంత సులువుగా జరగలేదు. 143 రోజులు హౌస్‌లో 23 మంది కంటెస్టెంట్లు. 143 రోజులు. ముంబై శివార్లలోని గోరేగావ్‌లో వేసిన సెట్లో ఉండిపోవడం అంటే సామాన్యం కాదు. అక్టోబర్ 3న మొదలైన ఈ షో ఫిబ్రవరి 21న గ్రాండ్ ఫినాలెతో ముగిసింది. రుబీనా ఈ షోలో విజేతగా నిలిచింది. 33 ఏళ్ల రుబీనాది సిమ్లా. బాల్యంలోనే డిబేట్ ఛాంపియన్‌గా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ‘మిస్ సిమ్లా’గా ఆ తర్వాత ‘మిస్ నార్త్ ఇండియా’గా కిరీటాలు దక్కించుకుంది. ఆ తర్వాత 2008లో జీ టీవీలో ప్రసారమైన ‘ఛోటి బహూ’ సీరియల్‌తో గుర్తింపు పొందింది. ఆ తర్వాత ‘లైఫ్ ఓకే’ చానల్లో వచ్చిన ‘దేవోంకే దేవ్.. మహాదేవ్’ సీరియల్లో సీత పాత్ర పోషించింది. కాని ఆ గుర్తింపు వేరు ఇప్పుడు బిగ్‌బాస్‌తో వచ్చిన గుర్తింపు వేరు. కెమెరాకు ఎదురు నిలిచి బిగ్‌బాస్‌లో రుబీనాకు అన్నీ అనుకూలంగా లేవు. ఆమె ప్రతి ఒక్కరితో వాదనకు దిగేది. వాదన చేయడానికి వెనుకాడేది కాదు. మనకెందుకులే అని ఊరుకునేది కాదు. ఇది కొందరికి నచ్చలేదు. సల్మాన్ ఖాన్‌కు కూడా నచ్చలేదు. ‘ఈ సరంజామా తీసుకునా నువ్వు వచ్చింది’ అని అతను షోలో కామెంట్ చేయడంతో రుబీనా బాగా హర్ట్ అయ్యింది. షో నుంచి బయటకు వెళ్లిపోతానని హటం చేసింది. ఆ తర్వాత ఆ గొడవ సద్దుమణిగింది. కాని రుబీనాకు కొద్దిరోజుల్లోనే హౌస్‌లో బయట అభిమానులు ఏర్పడ్డారు. రుబీనా ప్రేమను పంచుతోంది అని హౌస్మేట్స్ అన్నారు. బయట రుబీనా అభిమానులు తమని తాము ‘రుబీహాలిక్స్’ అని పేరు పెట్టుకుని సపోర్ట్‌గా నిలిచారు. టాస్క్‌ల్లో రుబీనా పోరాట పటిమ కూడా అందరికీ నచ్చింది. రాహుల్ వైద్యా, నిక్కి తంబోలి భర్తతో అడుగుపెట్టి... లాక్డౌన్ అందరి జీవితాల్లో ఎలా సంక్షోభం తెచ్చిందో రుబీనా జీవితంలో కూడా అలాంటి సంక్షోభమే తెచ్చింది. ఆమె టీవీ నటుడు అభినవ్ శుక్లాను ప్రేమించి 2018లో వివాహం చేసుకుంది. కాని బిగ్‌బాస్ హౌస్‌లో ఎలాంటి వాదనలు నడిచేవో ఇంటిలో కూడా అలాంటి వాదనలే నడిచేవి. లాక్డౌన్ వల్ల ఇంట్లోనే ఇద్దరూ ఉండేసరికి గొడవలు శ్రుతి మించాయి. ‘కథ ఇలాగే ఉంటే మనం విడాకులు తీసుకుందాం. ముందు మనం ఆరు నెలలు దూరంగా ఉందాం’ అని అని భార్యాభర్తలు ఇద్దరూ అనుకున్నారు. అనుకోకుండా ఇద్దరికీ కలిపి బిగ్‌బాస్ హౌస్‌లో ప్రవేశం దొరికింది. బయటవారికి ఈ సమాచారం లేనందున ఇరువురూ అన్యోన్య దంపతుల ఖాతాలో హౌస్‌లో అడుగుపెట్టారని అనుకున్నారు. కాని షో కొనసాగే కొద్ది వారి మధ్య ఉన్న స్పర్థలు ప్రేక్షకులకు తెలిశాయి. ఆ తర్వాత వారు ఒకరినొకరు అర్థం చేసుకోవడం కూడా కనిపించింది. చాలా సందర్భాలలో ఒకరికి ఒకరు సపోర్ట్‌గా నిలిచారు. సల్మాన్ ఖాన్ తో రుబీనాకు గొడవ వచ్చినప్పుడు భర్త అభినవ్ ఆమెకు సర్ది చెప్పాడు. అంతేకాదు షోలో జరిగే ‘బెస్ట్ జోడీ’ కాంపిటీషన్లో ఈ భార్యాభర్తలే బెస్ట్‌గా నిలిచారు. ‘బిగ్‌బాస్ హౌస్‌కు కృతజ్ఞతలు. ఈ హౌస్‌లో ఉండటం వల్లే మేము ఒకరికి ఒకరం అర్థమయ్యాం. మా చేదు తగ్గింది. మేము కలిసి జీవించాలనుకుంటున్నాం’ అని షో ముగిశాక ఇద్దరూ అన్నారు. తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లో నటుడు వరుణ్ సందేశ్ తన భార్య వితికతో కలిసి పాల్గొన్నాడు. కాని వారికి ఇలాంటి సమస్య లేదు. సమస్య ఉన్న రుబీనాకు బిగ్‌బాస్‌లో ఉండటం లాభించింది. – సాక్షి ఫ్యామిలీ గట్టి పోటీ బిగ్‌బాస్ హౌస్‌లో రుబీనాకు గాయకుడు రాహుల్ వైద్యా నుంచి గట్టి పోటీ ఎదురయ్యింది. అతడికి కూడా ఫ్యాన్స్ మద్దతు లభించింది. విజేత అతడు కూడా కావచ్చునని అందరూ అనుకున్నారు. కాని రుబీనాకు కిరీటం దక్కింది. రాహుల్ వైద్య ఫస్ట్ రన్నర్ అప్‌గా నిలిచాడు. మరో నటి నిక్కి తంబోలి, నటుడు అలి గోని మూడు, నాలుగు స్థానాల్లో మిగిలారు. ‘తెలుగు నటి’ బిగ్‌బాస్ 14 హిందీ రియాలిటీ షోలో చివరి వరకూ గట్టి పోటీ ఇచ్చిన నిక్కి తంబోలి తెలుగులో ‘చీకటిగదిలో చితక్కొట్టుడు’ సినిమాలో నటించింది. ఆ తర్వాత ‘తిప్పరా మీసం’, ‘కాంచన 3’లో ముఖ్యపాత్రలు పోషించింది. బిగ్‌బాస్ విజేతగా నిలిచిన రుబీనా, నిక్కి కొత్తల్లో కీచులాడుకున్నా ఆ తర్వాత మంచి స్నేహితులయ్యారు. చదవండి: (బిగ్‌బాస్ విన్నర్‌గా రుబీనా, ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?) -
హిందీ బిగ్‌బాస్ 14 గ్రాండ్ ఫినాలే ఫోటోలు
-
బిగ్‌బాస్ విన్నర్‌గా రుబీనా, ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?
బిగ్‌బాస్ షో ఇప్పుడిది టెలివిజన్ రంగంలో ఒక సంచలనాత్మక షో. హిందీలో దీనికున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకే ఈ షోను తెలుగులో కూడా ప్రారంభించారు. తాజాగా, గత ఏడాది అక్టోబర్‌లో ప్రారంభమైన హిందీ బిగ్‌బాస్-14 షోకు కండల వీరుడు సల్మాన్‌ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించాడు. నాలుగున్నర నెలలపాటు సాగిన ఈ షోలో కంటెస్టంట్లు హోరాహోరీగా తలపడ్డారు. అయితే గ్రాండ్ ఫినాలెలో రుబీనా దిలైక్ ట్రోఫితోపాటు, 36 లక్షల ప్రైజ్‌మనీని సొంతం చేసుకున్నారు. దీనిలో రాహుల్ వైద్య రన్నరప్‌గా నిలిచాడు. కంటెస్టెంట్లకు బిగ్‌బాస్ ఎప్పటికప్పుడు కొత్త టాస్క్‌లు ఇస్తూ వారిని ఉత్సాహపరుస్తూ ఉండటం, కొత్తవారితో కలసి ప్రయాణం చేయడం, విలాసవంతమైన సౌకర్యాలకు దూరంగా ఉండటం వంటివి ఎన్నో ఈహౌస్లో చోటు చేసుకున్నాయి. కాగా, ఫైనల్ పాంచ్‌లో రుబినా దిలైక్, రాహుల్ వైద్య, అలీగొని, నిక్కితంబొలి, రాఖీ సావంత్ చేరుకున్నారు. వారికి హోస్ట్ సల్మాన్ ఖాన్ 14 లక్షలు తీసుకొని ఇంటినుంచి వెళ్లిపోయే ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఎవరికైతే ఇష్టమో వారు 30 సెకన్లలోపు బజర్ మోగించాలని తెలిపాడు. అయితే ఈ ఆఫర్‌ను అందిపుచ్చుకుని రాఖీసావంత్ రూ. 14లక్షలను తీసుకొని హౌజ్ నుంచి వెళ్లిపొతున్నట్లు తెలిపారు. ఆమె తర్వాత అలిగొని ఎలిమినేట్ అయ్యారు. నిక్కి తంబోలి షో నుంచి తొలగించబడ్డాడు. ప్రేక్షకుల ఓటింగ్‌ను కూడా పరిగణలోకి తీసుకున్నట్టు నిర్వహకులు తెలిపారు. కాగా, ఫైనల్ షోకు అతిథిగా వచ్చిన బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. షోలే సినిమాలోని పలు డైలాగ్‌లతో ప్రేక్షకులను ఉర్రుతలూగించారు. -
హార్ట్ సర్జరీ! బిగ్‌బాస్ విన్నర్ అభ్యర్థన
ముంబై: హిందీ బిగ్‌బాస్ 11వ సీజన్ విన్నర్ శిల్పా షిండే బంధువు తృప్తి పటేల్ షిండే గుండెకు శస్త్ర చికిత్స చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమె క్షేమంగా ఉండాలని ప్రార్థించమని శిల్పా అభిమానులను కోరింది. ఈ మేరకు తృప్తితో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసింది. "అభిమానులే నా దేవుళ్లు. కష్టసుఖాల్లో నా వెంట నిలబడుతున్న అభిమానులకు కృతజ్ఞతలు. నా దగ్గరి బంధువు తృప్తికి నానావతి ఆస్పత్రిలో హార్జ్ సర్జరీ జరగబోతుంది. ఆమెకు అంతా మంచి జరగాలని కోరుకోండి" అంటూ ఫ్యాన్స్‌ను అభ్యర్థించింది. (చదవండి: టీవీ నటుడి రెండో పెళ్లి) ఇదిలా వుంటే శిల్పా.. "బాబీ జీ ఘర్ పర్ హై"లో అనిత బాబీ పాత్రలో ఉత్తమ నటన కనబర్చావంటూ నేహా పెండ్సేను మెచ్చుకుంది. నిజానికి ఆ పాత్రను నటి సౌమ్య టండన్ కొన్నేళ్లుగా చేస్తోంది. అయితే ఈ మధ్యే ఆమె సీరియల్ నుంచి తప్పుకోవడంతో నేహా కొత్తగా ఆ స్థానంలో అడుగుపెట్టింది.. ఇక అదే సీరియల్లో అంగూరి బాబీగా మెప్పించిన శిల్పా సైతం తప్పుకోవడంతో ఆమె స్థానంలో శుభంగి ఆత్రే నటిస్తోంది. శిల్పా లాక్డౌన్లో "గ్యాంగ్స్ ఆఫ్ ఫిల్మిస్తాన్" అనే కామెడీ షోలోనూ పాల్గొంది. కానీ అది టీవీలో టెలికాస్ట్ కాకముందే షో నుంచి తప్పుకోవడం గమనార్హం. (చదవండి: స్నేహితుడిని పెళ్లాడిన బాలీవుడ్ సింగర్) View this post on Instagram A post shared by Shilpa Shinde (@shilpa_shinde_official) -
ఈ యంగ్ హీరోను గుర్తుపట్టారా?
పైన కనిపిస్తున్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో నానా హంగామా చేస్తోంది. తల్లి చంకనెక్కిన ఆ పాలబుగ్గల పసిపిల్లాడు ఎవరనుకుంటున్నారు? బిగ్‌బాస్ నాల్గో సీజన్లో బుద్దిబలంతో టాస్కులు గెలవడంతో పాటు అమ్మాయిల మనసు దోచుకున్న మిస్టర్ పర్ఫెక్ట్ అభిజిత్. చిన్నప్పుడు కూడా ఎంతో క్యూట్‌గా ఉన్న ఈ ఫొటో ఆయన అభిమానులకు విపరీతంగా ఆకర్షిస్తోంది. అమ్మ ప్రేమ అన్న క్యాప్షన్‌తో ఈ ఫొటోను అతడు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. కాగా ఓ స్పెషల్ ఎపిసోడ్లో అభి అమ్మ కూడా హౌస్‌లోకి అడుగు పెట్టి తెగ సందడి చేసిన విషయం తెలిసిందే. మీరు కొట్టుకోండి, అదే కదా మజా అంటూ కంటెస్టెంట్లతో ఫ్రెండ్లీగా కలిసిపోవడంతో ఆమె కూడా పాపులర్ అయింది. (చదవండి: బిగ్‌బాస్ : అభిజిత్‌కి రోహిత్ శర్మ ఊహించని గిఫ్ట్) కేవలం ఎక్స్పీరియన్స్ కోసమే బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చానన్న అభి తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్‌తో విజేతగా అవతరించి టైటిల్‌ను ఎగరేసుకుపోయాడు. ప్రేక్షకులు చూపించిన ప్రేమలో తడిసి ముద్దైన అతడు సోషల్ మీడియాలో వారికి నిత్యం టచ్‌లో ఉంటున్నాడు. ఆ మధ్య బిగ్‌బాస్ ప్రయాణంలో తనకు సపోర్ట్ చేసిన సెలబ్రిటీలను ప్రత్యేకంగా కలుసుకుని మరీ కృతజ్ఞతలు తెలిపాడు. ఈ మధ్యే తన స్నేహితుడు, క్రికెటర్ హనుమ విహారిని కలుసుకుని కబుర్లు చెప్పుకున్నారు. అయితే టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు అభి వీరాభిమాని అని తెలిసిన హనుమ విహారి ఈ విషయాన్ని హిట్‌మ్యాన్ చెవిన వేశాడు. దీంతో రోహిత్ అభికి ఫోన్ చేసి మాట్లాడటమే కాక ప్రేమతో తన జెర్సీని అతడికి గిఫ్ట్‌గా పంపించాడు. (చదవండి: ఇండియా లాక్డౌన్.. టైటిల్ పోస్టర్ విడుదల) View this post on Instagram A post shared by Abijeet (@abijeet11) -
కొత్తింట్లో అడుగుపెట్టిన బిగ్ బాస్ 2 విన్నర్ ఫొటోలు
-
కలల ఇంట్లోకి వెళ్లిన బిగ్‌బాస్ విన్నర్
బిగ్‌బాస్ రెండో సీజన్ విన్నర్ కౌశల్ మండా షోలోనే కాదు, షో ముగిశాక కూడా ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నాడు. కానీ ఆయనకున్న సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్‌తో విజేతగా అవతరించాడు. కాదు, కాదు, కౌశల్ ఆర్మీనే అతడిని విన్నర్‌గా నిలబెట్టింది. కౌశల్ ట్రోఫీ గెలుచుకోవడంతో ఆయన అభిమానులు సంబరాలు కూడా జరుపుకున్నారు. ఇక బిగ్‌బాస్ అయ్యాక అతడికి బోలెడు సినిమా ఛాన్సులు వచ్చాయంటూ వార్తలు సైతం గుప్పుమన్నాయి కానీ చివరాఖరకు అవన్నీ వట్టి పుకార్లుగానే మిగిలిపోయాయి. అయితే అప్పుడప్పుడూ టీవీ షోలలో మాత్రం తళుక్కున మెరుస్తుంటాడు. (చదవండి: బిగ్‌బాస్: అఖిల్‌కు ఊహించని బహుమతి) తాజాగా కౌశల్ తను కలలు గన్న కొత్తింట్లోకి కుటుంబ సమేతంగా అడుగు పెట్టాడు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. "ఇంటిని మించిన మంచిప్రదేశం మరేదీ ఉండదు" అంటూ సతీమణి నీలిమ, పిల్లలు నికుంజ్, లల్లితో కలిసి గృహ ప్రవేశం చేస్తున్న ఫొటోలను సైతం షేర్ చేశాడు. కొత్త ఏడాది కొత్తింట్లోకి వెళ్లిన కౌశల్‌కు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. (చదవండి: కత్తితో కేక్ కట్ చేసిన హీరో.. క్షమాపణలు) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by k a u s h a l M a n d a (@kaushalmanda) View this post on Instagram A post shared by k a u s h a l M a n d a (@kaushalmanda) -
సమంతతో ఆఫర్ కొట్టేసిన అభిజిత్
బిగ్‌బాస్ నాల్గో సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్లను చూసి జనాలు పెదవి విరిచారు. ముక్కూమొహం తెలీని వాళ్లను హౌస్‌లోకి పంపించారేంటని విమర్శలు గుప్పించారు. కానీ షో నడిచే కొద్దీ జనాలు వారికి తెలీకుండానే కంటెస్టెంట్లకు అభిమానులుగా మారిపోయారు. వారిని ఎలాగైనా గెలిపించాలన్న కసితో సోషల్ మీడియాలో ఆన్లైన్ యుద్ధాలు చేశారు. అంతిమంగా మెజారిటీ ప్రేక్షకుల మనసున్న దోచుకున్న అభిజితే విజేతగా అవతరించాడు. అయితే సీజన్ అలా ముగిసిందో లేదో వరుస ఆఫర్లు కంటెస్టెంట్ల ఇంటి ముందు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే సోహైల్ సినిమాలో ఒక్క రూపాయి తీసుకోకుండా నటిస్తామని మెగాస్టార్ చిరంజీవి, కమెడియన్ కింగ్ బ్రహ్మానందం మాటిచ్చారు. అటు దివి కూడా మెగాస్టార్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. సామ్‌తో అభిజిత్ ఈ క్రమంలో విన్నర్ అభిజిత్‌కు సైతం బంపరాఫర్ తగిలినట్లు కనిపిస్తోంది. హీరోయిన్ సమంత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సామ్‌జామ్‌కు అభిని ఆహ్వానించినట్లు సమాచారం. ఈమేరకు ఓ స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నారట. ఇదే నిజమైతే ఈ బిగ్‌బాస్ స్టార్ త్వరలోనే సమంతతో సందడి చేయనున్నాడు. ఓటీటీ వేదిక ఆహాలో నిర్వహిస్తున్న సామ్‌జామ్‌లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ మొదటి అతిథిగా హాజరయ్యారు. తర్వాత రానా, తమన్నా, రాకుల్ ప్రీత్‌సింగ్, నాగ్ అశ్విన్, క్రిష్ తదితరులు సామ్ షోలో మెరిశారు. మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ షోలో పాల్గొనగా దీనికి సంబంధించిన ప్రోమో వైరల్‌గా మారింది. చూస్తుంటే త్వరలోనే అభి కూడా ఈ షోలో ప్రత్యక్షమవనున్నట్లు తెలుస్తోంది. (చదవండి: బిగ్‌బాస్: అభిజిత్ విజయానికి కారణాలివే) అభికి సినిమా ఆఫర్లు కాగా 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాతో వెండితెరకు పరిచయమైన అభిజిత్ తర్వాత కనిపించకుండా పోయాడు. తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు బిగ్‌బాస్‌ను వేదికగా మలుచుకున్నాడు. హౌస్‌లో అడుగు పెట్టిన క్షణం నుంచి ఎక్కడా నోరు జారకుండా, గొడవల్లో దూరకుండా, మెచ్యూర్డ్‌గా మాట్లాడుతూ, తెలివిగా టాస్క్‌లు ఆడుతూ ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్నాడు. ఆయన సహనం, ప్రేమ, తెలివి, వ్యక్తిత్వం అన్నింటినీ మెచ్చి జనాలు బ్రహ్మరథం పట్టారు. అతడిని గెలిపించారు. ఇది అతడి లైఫ్‌కు టర్నింగ్ పాయింట్ కానుంది. మళ్లీ సినిమా అవకాశాలు వస్తున్నాయి..పలువురు దర్శకనిర్మాతలు అభికి కథలు వినిపిస్తున్నారట. ఈ క్రమంలో ఓ మంచి సినిమాలో ప్రధాన పాత్రలో నటించేందుకు అభి ఓకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. అభికి మళ్లీ హిట్ దొరికి హీరోగా నిలదొక్కుకోగలిగితే అతడి లైఫ్ మరింత బ్యూటిఫుల్ అవడం ఖాయం! (చదవండి: 'విజయ్ దేవరకొండను కిస్ చేయాలని ఉంది') -
అమలగారూ నాకు అమ్మే: అభిజీత్
బిగ్ స్క్రీన్‌లో నటించాలి. బిగ్ హౌస్‌లో జీవించాలి. రెండూ తెలిసిన కుర్రాడు అభిజీత్. సహజంగానే స్ట్రాంగ్. ‘రియాలిటీ’తో.. మరింత స్ట్రాంగ్ అయ్యాడు. విజేతగా నిలిచాడు. ‘ఈ విజయం వీక్షకుల కటాక్షమే’ అంటున్నాడు. సినిమా ఇండస్ట్రీలో డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన వాళ్లది గత తరం. ఇంజనీర్ అయ్యి సినిమాల్లోకి వస్తున్న తరం ఇప్పటిది. ఈ తరానికి నవ ప్రతినిధి అభిజీత్. ‘‘సినిమాకి ఉన్న అందం అది. ఎప్పటికీ వన్నె తగ్గని కళ అది. అందుకే ఈ ఆకర్షణకు లోనయ్యాను’’ అని పెద్దగా నవ్వేశాడు అభిజీత్. స్కూల్లో నేర్చుకున్నవి కాలేజ్‌లో మనల్ని నడిపిస్తాయి. కాలేజ్‌లో నేర్చుకున్నవి సమాజంలో నడిపిస్తాయి. చదువు సమాజంలోకి ధైర్యంగా నడిపించే సాధనం అయితే... సమాజం నుంచి నేర్చుకున్న జ్ఞానం మనిషిగా నిలబెడుతుంది. బిగ్‌బాస్ తనకు అలాంటి జ్ఞానాన్నే ఇచ్చిందని అన్నాడు అభిజీత్. ‘‘బిగ్‌బాస్ హౌస్‌లో జీవించడం మాత్రం జీవితంలో గొప్ప అనుభవం. ఒక మామూలు మనిషిని గొప్ప వ్యక్తిత్వంతో మలచగలిగిన శక్తి ఈ రియాలిటీ షోకి ఉంది. బిగ్‌బాస్‌లోకి వెళ్లక ముందు అభిజీత్‌కి, బిగ్‌బాస్ విజేతగా బయటకు వచ్చిన అభిజీత్‌కి మధ్య తేడా ఉంటుంది. ఆ మార్పును మీరే చూస్తారు’’ అని అన్నాడు అభిజీత్. ‘‘బిగ్‌బాస్ విజేత కావడం కంటే చిరంజీవి గారి చేతుల మీదుగా అవార్డు అందుకునే అదృష్టం నాకు ఎక్కువ ఆనందాన్నిస్తోంది. ఈ షోలో విజేతనయ్యాను కాబట్టే ఆ అదృష్టం దక్కింది. కాబట్టి బిగ్‌బాస్ విజేత అనే ట్యాగ్‌ని ఎప్పటికీ గౌరవిస్తాను. ఈ షో పట్ల గౌరవంగా ఉంటాను’’ అని చెప్పాడు. అమలగారూ నాకు అమ్మే మొదటి సినిమా ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో అమల కొడుకు అభిజీత్. ‘‘అమలగారు ఎంత కేరింగ్‌గా ఉండేవారంటే... ‘అభీ నువ్వు తిన్నావా’ అని అడిగేవారు. అంతటి సీనియర్ నటితో సీన్ అంటే ముందుగానే రెండు– మూడు రిహార్సల్స్ చూసుకుని సిద్ధంగా ఉండేవాళ్లం. కానీ ఆమె కొత్తవాళ్లు కదా భయపడతారేమోనని ‘ఓకేనా, ప్రిపరేషన్‌కి మరికొంత టైమ్ కావాలా’ అని అడిగేవారు. నాగార్జున సర్ నుంచి డెడికేషన్, డిసిప్లిన్ నేర్చుకున్నాను. మా సమస్యలను అర్థం చేసుకుని అందులో నుంచి ఒక పంచ్ వేసి మమ్మల్ని నార్మల్ చేయడానికి ప్రయత్నిస్తారాయన. అఖిల్ కూడా అమలగారిలాగానే ఉంటారు. ఆ కుటుంబం నుంచి చాలా నేర్చుకోవచ్చు’’ అంటూ నాగార్జున్ సర్ని అంత దగ్గరగా అన్ని రోజుల పాటు ఆయనతో కలిసి పని చేసే అవకాశం బిగ్‌బాస్ షో ద్వారా వచ్చిందని అభిజీత్ సంతోషంగా చెప్పాడు. ఇంకా స్ట్రాంగ్ అవాలి మంచి ప్రమాణాలున్న రిషీవ్యాలీ స్కూల్, జేఎన్టీయూ, మసాచుసెట్స్‌లో చదువు తనను వ్యక్తిగా దృఢంగా నిలబెట్టాయని చెప్పాడు అభిజీత్. ‘‘బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టే వరకు ‘నేను మెంటల్లీ చాలా స్ట్రాంగ్’ అనుకునే వాడిని. నేను మరింత స్ట్రాంగ్‌గా మారాలని హౌస్‌లోకి వెళ్లిన కొద్ది రోజుల్లోనే తెలిసింది. కొన్ని సందర్భాలు నన్ను ఎమోషనల్‌గా మార్చాయి. మానసికంగా బలహీన పరిచే సంఘటనలు కూడా ఎదురయ్యాయి. నేను తప్పు చేయలేదు కదా, ఎందుకిలా అవుతోంది అని బాధపడిన సందర్భాలున్నాయి. అయితే ఆందోళన, ఉద్వేగాలను అదుపులో ఉంచుకోగలిగిన నిగ్రహం నాలో ఉంది. అది నేను చదువుకున్న మంచి విద్యాసంస్థల శిక్షణతోనే వచ్చింది. నేను బలహీన పడిన ప్రతి సందర్భంలోనూ వీక్షకులు నాకు అండగా నిలిచారు. నన్ను విజేతగా నిలపడానికి వాళ్లందరూ ఇచ్చిన మద్దతు మర్చిపోలేనిది. నా కుటుంబం ఇచ్చినంత సహకారాన్ని నాకు తెలియని చాలా మంది నుంచి కూడా పొందగలగడం నిజంగా వరమే’’ అని తనకు ఓట్లేసి విజేతగా నిలిపిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియచేశాడు. నటనకే నా జీవితం నటనలో కెరీర్‌ను మలుచుకోవడం కాదు, నటన కోసం జీవితాన్ని అంకితం చేస్తానన్నాడు అభిజీత్. సినిమా థియేటర్, ఓటీటీ ఏదైనా సరే... నటనలోనే జీవితం, నటనతోనే జీవితం... అంటూ ‘మా అమ్మకు నన్ను తెర మీద చూడడం ఇష్టం’ అని అసలు రహస్యాన్ని బయటపెట్టాడు.‘‘మా నాన్న మాత్రం చదువుకుని ఉద్యోగం కానీ వ్యాపారంలో కానీ స్థిరపడాలని కోరుకున్నాడు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా అవకాశం వచ్చినప్పుడు అమ్మ నేను పెద్ద హీరోనైపోయినంతగా సంతోషపడింది. అమ్మ కోరుకున్నట్లు ‘హీరో అభిజీత్’గా గుర్తింపు తెచ్చుకోవాలనేది నా ఆకాంక్ష’’ అన్నాడు అభిజీత్. అమ్మాయి ఎంపిక ఇక జీవిత భాగస్వామిని నిర్ణయించే బాధ్యత అమ్మకే ఇచ్చేశానని చెప్పాడు ఈ బిగ్‌బాస్ తాజా విజేత. ‘‘ఈ రోజు నేను అందరి ఎదుట ఇలా నిలబడగలిగానంటే... అది నా ఒక్కడి సమర్థత, కాదు. అమ్మ, నాన్న, తమ్ముడు, నానమ్మ అందరి ఆశలు, ప్రయత్నం, శ్రమ ఉన్నాయి. వాళ్లు మంచి చదువుని, మంచి జీవితాన్నిచ్చారు. నా జీవితంలో, మా కుటుంబంలో చక్కగా ఇమిడిపోగలిగిన అమ్మాయి ఎంపిక కూడా మా అమ్మ అయితేనే కరెక్ట్‌గా చేయగలుగుతుంది. ఓకే... థాంక్యూ’’ అంటూ ఇంటర్వ్యూ ముగించాడు అభిజీత్. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
బిగ్‌బాస్ విన్నర్ ఇంట విషాదం
చెన్నై: తమిళ బిగ్‌బాస్ సీజన్ 1 విజేత ఆరవ్ నఫీజ్ ఇంట విషాదం నెలకొంది. ఆరవ్ తండ్రి నిదాన్ గుండెపోటుతో మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం ఒకటిన్నర గంటల ప్రాంతంలో గుండెపోటు రావడంతో ప్రాణాలు విడిచారు. చెన్నైలో మృతి చెందిన ఆయన భౌతిక కాయాన్ని అంత్యక్రియల కోసం స్వస్థలమైన నాగర్కోల్కు తరలించారు. ఆయన మరణం పట్ల పలువురు సెలబ్రిటీలు, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్లు, అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు. (చదవండి: మోనాల్ రెమ్యూనరేషన్ ఎంతంటే?) కాగా ఆరవ్ మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. 2016లో విజయ్ ఆంటోని 'భేతాళుడు' చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. తర్వాతి ఏడాది బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్‌లోకి వెళ్లి ట్రోఫీని ఎగరేసుకుపోయాడు. అయితే బిగ్‌బాస్ షోలో హీరోయిన్ ఓవియా అతడిని కిస్ చేయడంతో ఆరవ్ పేరు మార్మోగిపోయింది. ఆ తరువాత ఆమె అతడికి ప్రపోజ్ కూడా చేసింది. అలా కొంతకాలం పాటు వీళ్ల మధ్య ప్రేమాయణం నడిచింది. వీరికి సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ఆర్మీలు కూడా పుట్టుకొచ్చాయి. కానీ బిగ్‌బాస్ తర్వాత వీళ్ల మధ్య విబేధాలు తలెత్తాయి. ఒకానొక సమయంలో ఓవియా ఆత్మహత్యకు యత్నించినట్లు వార్తలు కూడా వెలువడ్డాయి. కాగా గత ఏడాదికాలంగా రేహితో ప్రేమలో ఉన్న ఆరవ్.. ఇరు వర్గాల పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నాడు. ప్రస్తుతం అతడు 'రాజా భీమ', 'మీందుమ్ ఆరగిల్ వా' సినిమాల్లో నటిస్తున్నాడు. (చదవండి: ప్రేయసిని పెళ్లాడనున్న బిగ్‌బాస్ విన్నర్!) -
హీరోయిన్‌తో బిగ్‌బాస్ విన్నర్ పెళ్లి!
చెన్నై: తమిళ్ బిగ్‌బాస్ సీజన్ 1 విన్నర్ ఆరవ్ నఫీజ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన స్నేహితురాలు, మోడల్ రేహీని పెళ్లిచేసుకోనున్నాడు. వచ్చే నెల ఆరో తేదీన అత్యంత సన్నిహితుల సమక్షంలో చెన్నైలో వీరి వివాహం జరుగనున్నట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక బిగ్‌బాస్ హౌజ్‌లో ఆరవ్.. నటి ఓవియాతో ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. ఈ జంట బిగ్‌బాస్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.(చదవండి:నిశ్చితార్థం చేసుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్) వీరి మధ్య ఉన్న కెమిస్ట్రీ, రొమాన్స్ కారణంగా షో రేటింగ్‌ను పెంచడంలో కీలక పాత్ర పోషించాయి. వీరికి ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఆర్మీలు కూడా పుట్టుకొచ్చాయి. అయితే బిగ్‌బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చాక కొన్నాళ్ల పాటు కలిసే ఉన్న ఆరవ్- ఓవియాల మధ్య అకస్మాత్తుగా విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఓవియా ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు కూడా అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. (చదవండి:తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లి) ఇక గత ఏడాదికాలంగా రేహితో ప్రేమలో ఉన్న ఆరవ్.. ఇరు వర్గాల పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. కెరీర్ విషయానికొస్తే.. ఆరవ్ నటించిన తొలి సినిమా రాజా భీమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోంది. దర్శకుడు నరేశ్ సంపత్ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కావాల్సి ఉండగా లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇక రేహి విషయానికొస్తే మోడల్‌గా కెరీర్ ఆరంభించిన ఆమె.. ప్రముఖ డైరెక్టర్ గౌతం మీనన్ రూపొందిస్తున్న ‘జోషువా ఇమాయి పోల్ కాకా’ అనే రొమాంటిక్ సినిమాతో హీరోయిన్గా పరిచయం కానుంది. -
లాక్డౌన్ : వినూత్నంగా బిగ్‌బాస్ విన్నర్ పెళ్లి..
న్యూఢిల్లీ : బిగ్‌బాస్ రియాలిటీ షో సీజన్ 2 విజేత అశుతోష్ కౌశిక్ ఓ ఇంటివాడయ్యాడు. అలీఘర్కు చెందిన అర్పితను ఆదివారం పెళ్లి చేసుకున్నాడు. నోయిడాలోని అశుతోష్ ఇంటి టెర్రస్‌పై జరిగిన ఈ పెళ్లికి పురోహితుడు కాకుండా కేవలం నలుగురు అతిథులు మాత్రమే హాజరయ్యారు. వరుడి తల్లి, సోదరి, వధువు తల్లి, సోదరుడు ఈ పెళ్లికి హాజరైన వారిలో ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను అశుతోష్ తన ఫేస్బుక్లో షేర్ చేశారు. తన పెళ్లిని నిరాడంబరంగా జరుపుకోవడం ద్వారా ఆదా అయిన డబ్బులను పీఎం కేర్స్‌కు విరాళంగా ఇవ్వనున్నట్టు అశుతోష్ తెలిపారు. అయితే ఆ మొత్తం ఎంత అన్నది అతను వెల్లడించలేదు. అలాగే తన యూట్యూబ్ చానల్ ద్వారా వస్తున్న మొత్తాన్ని కూడా చారిటీకి ఇవ్వనున్నట్టు చెప్పారు. టెలివిజన్ రియాలిటీ షో స్టార్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అశుతోష్.. రోడిస్ సీజన్ 5, బిగ్‌బాస్ సీజన్ 2 టైటిల్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా తాను కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే పెళ్లి చేసుకుంటానని తెలిపారు. పెళ్లి అనేది వ్యక్తిగత అంశమని.. దానికి పెద్ద సంఖ్యలో జనాలు, మ్యూజిక్, డ్యాన్స్‌లు ఎందుకని ప్రశ్నించారు. మరోవైపు ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతన్న నేపథ్యంలో పెళ్లిళ్లు, శుభకార్యాలు వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. కొందరు పెళ్లిలు చేసుకున్నప్పటికీ.. అతికొద్ది సమక్షంలో నిరాడంబరంగా జరుపుకుంటున్నారు. చదవండి : 'ఇంకోసారి నోరు జారితే డెడ్‌బాడీ కూడా దొరకదు' చిరు ఎంజాయ్ చేస్తున్న పాట ఇదే.. -
ఉరితాడు బిగుసుకున్నా షూటింగ్ ఆపలేదు!
న్యూఢిల్లీ: దాదాపు రెండు వారాల కిందట సినిమా షూటింగ్లో ఇద్దరు స్టంట్ మాస్టర్స్ చనిపోయారు. అయితే సరిగ్గా అలాంటి తరహాలోనే ఓ ప్రమాదం జరిగినా చివరికి ఆ నటుడు ప్రాణాలతో బయటపడ్డాడు. మెడకు నిజంగానే ఉరితాడు బిగుసుకున్నా షూటింగ్ మాత్రం ఆపలేదట. ఆ వివరాలిలా ఉన్నాయి.. టీవీ నటుడు, బిగ్ బాస్ షో మాజీ విన్నర్ అయిన ప్రిన్స్ నరుల 'బాదో బహు' అనే షోలో నటిస్తున్నాడు. అయితే ఓ సన్నివేశంలో భాగంగా అతడు ఉరివేసుకున్నట్లు నటించాలి. షో యూనిట్ అంతా పక్కా ప్లాన్ చేసుకున్నారు. సీన్ షూటింగ్ చేస్తున్నారు. ఇంతలో ఓ చైర్ ఎక్కిన బుల్లితెర నటుడు ప్రిన్స్ తన మెడకు ఉరితాడు బిగించుకున్నాడు. అయితే పొరపాటున ప్రిన్స్ నరుల తాను నిల్చున్న చైర్‌ను పక్కకు తన్నేశాడు. ఇక చూడండీ.. మెడకు తాడు బిగుసుకుపోయి అరవడం మొదలుపెట్టాడు. ఆ వెంటనే యూనిట్ వాళ్లు ప్రిన్స్ వద్దకువెళ్లి మెడకు ఉన్న తాడును తొలగించారు. ఆ నటుడి మెడకు స్వల్పగాయాలయ్యాయి. ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేయించారు. ఈ ఘటనపై నటుడు ప్రిన్స్ నరులా మాట్లాడుతూ.. 'నా కాలు కింద ఉన్న కుర్చీ పక్కకు జరగడంతో నిజంగానే చాలా భయపడ్డాను. మెడకు తాడు ఉన్నా కూడా డైరెక్టర్ కట్ చెప్పకుండా షూటింగ్ కంటిన్యూ చేశాడు. ఆ సీన్ చూస్తే అభిమానులు థ్రిల్ అవుతార' అని బిబ్ బాస్ మాజీ విన్నర్ చెప్పుకొచ్చాడు.