బిగ్‌బాస్ రెండో సీజన్ విన్నర్ కౌశల్ మండా షోలోనే కాదు, షో ముగిశాక కూడా ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నాడు. కానీ ఆయనకున్న సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్‌తో విజేతగా అవతరించాడు. కాదు, కాదు, కౌశల్ ఆర్మీనే అతడిని విన్నర్‌గా నిలబెట్టింది. కౌశల్ ట్రోఫీ గెలుచుకోవడంతో ఆయన అభిమానులు సంబరాలు కూడా జరుపుకున్నారు. ఇక బిగ్‌బాస్ అయ్యాక అతడికి బోలెడు సినిమా ఛాన్సులు వచ్చాయంటూ వార్తలు సైతం గుప్పుమన్నాయి కానీ చివరాఖరకు అవన్నీ వట్టి పుకార్లుగానే మిగిలిపోయాయి. అయితే అప్పుడప్పుడూ టీవీ షోలలో మాత్రం తళుక్కున మెరుస్తుంటాడు. (చదవండి: బిగ్‌బాస్: అఖిల్‌కు ఊహించని బహుమతి)
తాజాగా కౌశల్ తను కలలు గన్న కొత్తింట్లోకి కుటుంబ సమేతంగా అడుగు పెట్టాడు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. "ఇంటిని మించిన మంచిప్రదేశం మరేదీ ఉండదు" అంటూ సతీమణి నీలిమ, పిల్లలు నికుంజ్, లల్లితో కలిసి గృహ ప్రవేశం చేస్తున్న ఫొటోలను సైతం షేర్ చేశాడు. కొత్త ఏడాది కొత్తింట్లోకి వెళ్లిన కౌశల్‌కు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. (చదవండి: కత్తితో కేక్ కట్ చేసిన హీరో.. క్షమాపణలు)
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment