
బిగ్‌బాస్ 7 గ్రాండ్ ఫినాలే రోజు జరిగిన పబ్లిక్ న్యూసెన్స్‌కు కారణమయ్యాడంటూ పల్లవి ప్రశాంత్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. స్టూడియో నుంచి వెళ్లిపోమని చెప్పినా వినకుండా తిరిగి స్టూడియో ఎదుట ప్రశాంత్ ర్యాలీ చేయడంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. అతడి అభిమానులు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తూ వికృత చేష్టలకు పాల్పడ్డారు.
దీంతో తమను డ్యూటీ చేయకుండా అడ్డుకున్నాడంటూ ప్రశాంత్‌ను, అతడి సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసులు నమోదు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. మరోవైపు ప్రశాంత్.. తనపై నమోదైన కేసుల్లో బెయిల్ ఇవ్వాలంటూ నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన న్యాయస్థానం తీర్పును రేపటికి వాయిదా వేసింది. దీంతో ప్రశాంత్‌కు బెయిల్ వస్తుందా? లేదా? అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
చదవండి: నాకు, నా ఫ్యామిలీకి ఏదైనా జరిగితే ఆ ఐదుగురిదే బాధ్యత!
Comments
Please login to add a commentAdd a comment