Divya Agarwal Reacts To Accusations of Ex BF, Varun Sood Sister About Jewellery - Sakshi
Sakshi News home page

Divya Agarwal: మాజీ బాయ్‌ఫ్రెండ్‌ నగలు తనదగ్గరే పెట్టుకున్న నటి, నటుడి సోదరి ఫైర్‌!

Published Thu, Feb 23 2023 7:04 PM | Last Updated on Thu, Feb 23 2023 7:27 PM

Divya Agarwal Reacts To Accusations Of Ex BF, Varun Sood Sister About Jewellery - Sakshi

బిగ్‌బాస్‌ హిందీ ఓటీటీ విన్నర్‌ దివ్య అగర్వాల్‌, నటుడు వరుణ్‌ సూద్‌ కొంతకాలం ప్రేమించుకుని చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. వీరి జంటను చూసి చూడముచ్చటగా ఉందని సంబరపడిపోయారు ఫ్యాన్స్‌. కానీ గతేడాది ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో బ్రేకప్‌ చెప్పుకున్నారు. అదే సంవత్సరం వ్యాపారవేత్త అపూర్వ పడ్‌గోయెంకర్‌ తనకు ప్రపోజ్‌ చేయడంతో ఓకే చెప్పింది దివ్య. వీరిద్దరి నిశ్చితార్థం కూడా అయిపోగా త్వరలో పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే వరుణ్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన నగలను దివ్య ఇంతవరకు తిరిగి ఇవ్వలేదంటూ ట్విటర్‌లో ఫైర్‌ అయింది నటుడి సోదరి అక్షిత.

ఆమె మేనేజర్‌కు ఎన్నిసార్లు మేసేజ్‌ చేసినా కనీస రెస్పాన్స్‌ లేదని, ఇలా మౌనంగా కూర్చుంటే పట్టించుకునేలా కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి దివ్య వెంటనే స్పందిస్తూ.. చెవి కమ్మలు, వినాయకుడి లాకెట్‌ చేతిలో పట్టుకున్న ఫోటో షేర్‌ చేసి తిరిగిచ్చేస్తున్నాలే అని రాసుకొచ్చింది. అసలు వాటిని తానెప్పుడూ అడగలేదని, ఇంతవరకు వాటిని ధరించలేదు కూడా అని క్లారిటీ ఇచ్చింది. తన మేనేజర్‌ ఆరోగ్యం బాగోలేక ఆస్పత్రిలో ఉన్నాడని, అంత ముఖ్యమైనవైతే తనకే నేరుగా కాల్‌ చేసి అడగొచ్చుగా అని సెటైర్‌ వేసింది.

చదవండి: కమెడియన్‌ను పెళ్లాడిన నటి, ఫోటోలు వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement