![I Faced Many Obstacles, Bigg Boss 15 Winner Tejasswi Prakash Says - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/4/bigg-boss-winner.gif.webp?itok=Wvn5qnxJ)
ఒకసారి నా ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే...అది సజావుగా జరిగిన ప్రయాణం మాత్రం కాదు. రకరకాల అవరోధాలు ఎదుర్కొన్నాను. అయితే ఎప్పుడూ నిరాశకు గురి కాలేదు. బిగ్‌బాస్ విజేతగా నిలవడం నాలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది’ అంటుంది తేజస్వి ప్రకాష్.బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించిన హిందీ బిగ్‌బాస్ సీజన్ 15 విజేతగా నిలిచారు తేజస్వి. ప్రతీక్ సెహజ్ పాల్- తేజస్విని మధ్య సాగిన టైటిల్ రేసులో చివరికి సీరియల్ నటి తేజస్విని ప్రకాశ్ విజయం సాధించింది.
ముంబై యూనివర్శిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్‌లో పట్టా పుచ్చుకున్న తేజస్వి ప్రకాష్‌కు సంగీతం, నటన అనేవి ఇష్టమైన విషయాలు. దీనికి తన కుటుంబనేపథ్యం కూడా కారణం. స్టార్ ఇండియా పే టెలివిజన్ చానల్ ‘లైఫ్ ఓకే’తో తన యాక్టింగ్ కెరీర్ మొదలుపెట్టింది తేజస్వి. టెలివిజన్ షోలు, సినిమాల్లో స్పెషల్ అప్పియరెన్స్, వెబ్‌సిరీస్‌లు ఒక ఎత్తయితే రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 15 విన్నర్ కావడం మరో ఎత్తు. తన కెరీర్‌ను మరి కొన్ని అడుగులు ముందుకు నడిపించే విజయం ఇది.
Comments
Please login to add a commentAdd a comment