బిగ్ బ్రదర్.. ఈ షోకు జిరాక్స్ కాపీయే బిగ్‌బాస్ రియాలిటీ షో. 1999లో పుట్టిన సంచాలనాత్మక టెలివిజన్ షో బిగ్ బ్రదర్. ఇప్పటివరకు 25 సీజన్లు కంప్లీట్ అవగా తాజాగా 26వ సీజన్ విజయవంతంగా పూర్తయింది. డైరెక్టర్ చెల్సీ బాహం విజేతగా నిలిచి 6 కోట్ల 30 లక్షల పైచిలుకు రూపాయలు (7,50,000 డాలర్లు) ప్రైజ్‌మనీగా గెలుచుకుంది.
టైటిల్ విన్నర్ చెల్సీ బాహం
రన్నరప్ ఎవరంటే?
రెండో స్థానంలో ఉన్న కన్‌స్టక్షన్ ప్రాజెక్ట్ మేనేజర్ మకెన్సీ మన్‌బెక్ దాదాపు రూ.63 లక్షలు (75 వేల డాలర్లు) అందుకుంది. థెరపిస్ట్ కామ్ సలైవన్ బ్రౌన్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అమెరికా ఫేవరెట్ ప్లేయర్‌గా మోడల్ టుకర్ డెస్ లూరియర్స్ రూ.42 లక్షల మేర (50 వేల డాలర్లు) గెలుచుకున్నాడు.
ఇకపోతే బిగ్ బ్రదర్ 26వ సీజన్ జూలై 17న ప్రారంభమైంది. 16 కంటెస్టెంట్లు హౌస్‌లో పాల్గొన్నారు. వీరి ప్రతి కదలికను రికార్డ్ చేసేందుకు హౌస్‌లో 90 కెమెరాలు, 100 మైక్రోఫోన్లు అమర్చారు.
Comments
Please login to add a commentAdd a comment