బిగ్‌బాస్ షోకి వెళ్తావా? నిన్నెవడు తీసుకుంటాడ్రా?.. అసలు స్టూడియో లోపలైనా అడుగుపెట్టగలవా? నీకంత సీన్ లేదులే.. పగటి కలలు కనకు.. ఇలా నానామాటలు అన్నారు.. ఎవరెంత హేళన చేసినా పట్టించుకోలేదు. ఎలాగైనా బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టాలని గట్టిగా ఫిక్సయ్యాడు. అందుకు తగ్గ ప్రయత్నాలు చేశాడు. అతడిలోని కసిని బిగ్‌బాస్ టీమ్ గుర్తించింది. కామన్ మ్యాన్ కేటగిరీలో రైతుబిడ్డను బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్‌లోకి తీసుకొచ్చింది.
వైల్డ్‌గా ఆడాడు..
గతంలోనూ కామన్ మ్యాన్ కేటగిరీలో ఎంతోమంది వచ్చారు. కానీ ఎవరూ ప్రశాంత్ అంత ప్రభావం చూపలేకపోయారు. ఓటమికి ఛాన్సే ఇవ్వకూడదన్న చందంగా గెలుపు కోసం విజృంభించి ఆడాడు. తన కోపాన్ని, కసినంతా ఆటలో చూపించాడే కానీ అవతలి వారిపై చూపించలేదు. నామినేషన్స్‌లో ఎంత వైల్డ్‌గా రియాక్ట్ అయినా తర్వాత మాత్రం ఎటువంటి రాగద్వేషాలు మనసులో పెట్టుకోకుండా అందరితో ఇట్టే కలిసిపోయేవాడు. తనకు సాయం చేసినవారిని గుండెలో పెట్టుకుని చూసుకున్నాడు. సాయం చేయనివారికి సైతం అవకాశం వచ్చినప్పుడు వారివైపు నిలబడ్డాడు.
రైతుబిడ్డకు ఊహించని గిఫ్ట్
ఇతడి నిష్కల్మమైన మనసు చూసి జనాలు ఓట్లు గుద్దారు. ఫలితంగా ప్రశాంత్ బిగ్‌బాస్ 7 విజేతగా నిలిచాడు. అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటకు వచ్చిన ప్రశాంత్‌కు జనం ఘనంగా స్వాగతం పలికారు. తాజాగా ఓ అభిమాని అయితే రైతుబిడ్డకు ఊహించని గిఫ్ట్ ఇచ్చాడు. యాదగిరిగుట్టలో లక్షలు విలువ చేసే భూమిని బహుమతిగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. యాదగిరి గుట్టకు సమీపంలోని వంగపల్లి దగ్గర రూ.15 లక్షలు విలువ చేసే ఓపెన్ ప్లాట్‌ను బహుమతిగా ఇస్తున్నట్లు వెల్లడించాడు.
ప్రశాంత్‌కు భారీగానే ముట్టాయి
త్వరలోనే ప్రశాంత్ పేరిట రిజిస్ట్రేషన్ చేయిస్తామని తెలిపాడు. ఇది తెలిసిన జనాలు రైతుబిడ్డకు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇప్పటికే ప్రశాంత్‌కు ప్రైజ్‌మనీ ద్వారా రూ.35 లక్షలు, పారితోషికం ద్వారా రూ.15 లక్షలు ముట్టాయి. ఇందులో సగం ట్యాక్స్‌ల రూపేణా ప్రభుత్వానికే చెల్లించాల్సి ఉంటుంది. ఈ నగదు కాకుండా అతడు కాస్ట్‌లీ కారు, రూ.15 లక్షల విలువ చేసే డైమండ్ నెక్లెస్ కూడా గెలుచుకోవడం విశేషం.
చదవండి: బిగ్‌బాస్ 7 టైటిల్ ముద్దాడిన రైతుబిడ్డ.. ఆ బలమైన కారణాల వల్లే విజయం..
బిగ్‌బాస్ చాణక్యకు తగిన శాస్తి.. మాస్టర్ మైండ్ అని చెప్పి చివరకేమో అలా!
Comments
Please login to add a commentAdd a comment