Sam Jam With Abhijeet: Samantha Sam Jam Show Invited Bigg Boss 4 Telugu Winner Abhijeet - Sakshi
Sakshi News home page

సామ్‌ జామ్‌కు అభిజిత్‌!

Published Wed, Dec 23 2020 4:11 PM | Last Updated on Wed, Dec 23 2020 8:55 PM

Sam Jam With Bigg Boss Telugu 4 Winner Abhijeet - Sakshi

బిగ్‌బాస్ నాల్గో సీజన్‌లో పాల్గొన్న కంటెస్టెంట్లను చూసి జనాలు పెదవి విరిచారు. ముక్కూమొహం తెలీని వాళ్లను హౌస్‌లోకి పంపించారేంటని విమర్శలు గుప్పించారు. కానీ షో నడిచే కొద్దీ జనాలు వారికి తెలీకుండానే కంటెస్టెంట్లకు అభిమానులుగా మారిపోయారు. వారిని ఎలాగైనా గెలిపించాలన్న కసితో సోషల్‌ మీడియాలో ఆన్‌లైన్‌ యుద్ధాలు చేశారు. అంతిమంగా మెజారిటీ ప్రేక్షకుల మనసున్న దోచుకున్న అభిజితే విజేతగా అవతరించాడు. అయితే సీజన్‌ అలా ముగిసిందో లేదో వరుస ఆఫర్లు కంటెస్టెంట్ల ఇంటి ముందు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే సోహైల్‌ సినిమాలో ఒక్క రూపాయి తీసుకోకుండా నటిస్తామని మెగాస్టార్‌ చిరంజీవి, కమెడియన్‌ కింగ్‌  బ్రహ్మానందం మాటిచ్చారు. అటు దివి కూడా మెగాస్టార్‌ సినిమాలో నటించే ఛాన్స్‌ కొట్టేసింది. 

సామ్‌తో అభిజిత్‌
ఈ క్రమంలో విన్నర్‌ అభిజిత్‌కు సైతం బంపరాఫర్‌ తగిలినట్లు కనిపిస్తోంది. హీరోయిన్‌ సమంత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సామ్‌జామ్‌కు అభిని ఆహ్వానించినట్లు సమాచారం. ఈమేరకు ఓ స్పెషల్ ఎపిసోడ్‌ ప్లాన్‌ చేస్తున్నారట. ఇదే నిజమైతే ఈ బిగ్‌బాస్‌ స్టార్‌ త్వరలోనే సమంతతో సందడి చేయనున్నాడు. ఓటీటీ వేదిక ఆహాలో నిర్వహిస్తున్న సామ్‌జామ్‌లో రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ మొదటి అతిథిగా హాజరయ్యారు. తర్వాత రానా, తమన్నా, రాకుల్‌ ప్రీత్‌సింగ్‌, నాగ్‌ అశ్విన్‌, క్రిష్‌ తదితరులు సామ్‌ షోలో మెరిశారు. మెగాస్టార్‌ చిరంజీవి సైతం ఈ షోలో పాల్గొనగా దీనికి సంబంధించిన ప్రోమో వైరల్‌గా మారింది. చూస్తుంటే త్వరలోనే అభి కూడా ఈ షోలో ప్రత్యక్షమవనున్నట్లు తెలుస్తోంది. (చదవండి: బిగ్‌బాస్‌: అభిజిత్‌ విజయానికి కారణాలివే)

అభికి సినిమా ఆఫర్లు
కాగా 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్'‌ సినిమాతో వెండితెరకు పరిచయమైన అభిజిత్‌ తర్వాత కనిపించకుండా పోయాడు. తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించేందుకు బిగ్‌బాస్‌ను వేదికగా మలుచుకున్నాడు. హౌస్‌లో అడుగు పెట్టిన క్షణం నుంచి ఎక్కడా నోరు జారకుండా, గొడవల్లో దూరకుండా, మెచ్యూర్డ్‌గా మాట్లాడుతూ, తెలివిగా టాస్క్‌లు ఆడుతూ ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్నాడు. ఆయన సహనం, ప్రేమ, తెలివి, వ్యక్తిత్వం అన్నింటినీ మెచ్చి జనాలు ‍బ్రహ్మరథం పట్టారు. అతడిని గెలిపించారు. ఇది అతడి లైఫ్‌కు టర్నింగ్‌ పాయింట్‌ కానుంది. మళ్లీ సినిమా అవకాశాలు వస్తున్నాయి..పలువురు దర్శకనిర్మాతలు అభికి కథలు వినిపిస్తున్నారట. ఈ క్రమంలో ఓ మంచి సినిమాలో ప్రధాన పాత్రలో నటించేందుకు అభి ఓకే చెప్పినట్లు టాక్‌ వినిపిస్తోంది. అభికి మళ్లీ హిట్‌ దొరికి హీరోగా నిలదొక్కుకోగలిగితే అతడి లైఫ్‌ మరింత బ్యూటిఫుల్‌ అవడం ఖాయం! (చదవండి: 'విజయ్‌ దేవరకొండను కిస్‌‌ చేయాలని ఉంది')

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement