హీరోయిన్‌తో బిగ్‌బాస్‌ విన్నర్ పెళ్లి‌! | Bigg Boss Tamil Season 1 Winner Arav Nafeez To Marry Actress Raahei | Sakshi
Sakshi News home page

ప్రేయసిని పెళ్లాడనున్న బిగ్‌బాస్‌ విన్నర్‌!

Published Thu, Aug 27 2020 12:27 PM | Last Updated on Thu, Aug 27 2020 3:24 PM

Bigg Boss Tamil Season 1 Winner Arav Nafeez To Marry Actress Raahei - Sakshi

చెన్నై: తమిళ్‌ బిగ్‌బాస్‌ సీజన్‌ 1 విన్నర్‌ ఆరవ్‌ నఫీజ్‌ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన స్నేహితురాలు, మోడల్‌ రేహీని పెళ్లిచేసుకోనున్నాడు. వచ్చే నెల ఆరో తేదీన అత్యంత సన్నిహితుల సమక్షంలో చెన్నైలో వీరి వివాహం జరుగనున్నట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఆరవ్‌.. నటి ఓవియాతో ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. ఈ జంట బిగ్‌బాస్‌ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.(చదవండి:నిశ్చితార్థం చేసుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్‌)

వీరి మధ్య ఉన్న కెమిస్ట్రీ, రొమాన్స్‌ కారణంగా షో రేటింగ్‌ను పెంచడంలో కీలక పాత్ర పోషించాయి. వీరికి ప్రత్యేకంగా ఫ్యాన్స్‌ ఆర్మీలు కూడా పుట్టుకొచ్చాయి. అయితే బిగ్‌బాస్‌ హౌజ్‌ నుంచి బయటకు వచ్చాక కొన్నాళ్ల పాటు కలిసే ఉన్న ఆరవ్‌- ఓవియాల మధ్య అకస్మాత్తుగా విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఓవియా ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు కూడా అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. (చదవండి:తండ్రి కాబోతున్న విరాట్‌ కోహ్లి)

ఇక గత ఏడాదికాలంగా రేహితో ప్రేమలో ఉన్న ఆరవ్‌.. ఇరు వర్గాల పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. కెరీర్‌ విషయానికొస్తే.. ఆరవ్‌ నటించిన తొలి సినిమా రాజా భీమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకొంటోంది. దర్శకుడు నరేశ్‌ సంపత్‌ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కావాల్సి ఉండగా లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. ఇక రేహి విషయానికొస్తే మోడల్‌గా కెరీర్‌ ఆరంభించిన ఆమె.. ప్రముఖ డైరెక్టర్‌ గౌతం మీనన్‌ రూపొందిస్తున్న ‘జోషువా ఇమాయి పోల్‌ కాకా’ అనే రొమాంటిక్‌ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement