
బిగ్‌బాస్ షో (Bigg Boss Reality Show) ముగిసింది. తమిళంలో ఎనిమిదో సీజన్, హిందీలో పద్దెనిమిదో సీజన్ విజయవంతంగా పూర్తయింది. జనవరి 19న ఈ రెండు భాషల్లో గ్రాండ్ ఫినాలే జరిగింది. తమిళ బిగ్‌బాస్ విషయానికి వస్తే యూట్యూబర్ ముత్తుకుమారన్ (Muthukumaran) విజేతగా నిలిచాడు. ఇతడు రూ.41 లక్షల ప్రైజ్‌మనీ అందుకున్నాడు. సౌందర్య ఫస్ట్ రన్నరప్‌గా, వీజే విశాల్ సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్‌కు విజయ్ సేతుపతి వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.
హిందీ రియాలిటీ షో విషయానికి వస్తే.. నటుడు కరణ్ వీర్ మెహ్రా (Karan Veer Mehra) బిగ్‌బాస్ ట్రోఫీ గెలిచాడు. గ్రాండ్ ఫినాలే స్టేజీపై హోస్ట్ సల్మాన్ ఖాన్ కరణ్‌ను విజేతగా ప్రకటించాడు. ఇతడు ట్రోఫీతో పాటు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ గెలుచుకున్నాడు. నటుడు వివియన్ డిసేన ఫస్ట్ రన్నరప్‌గా, యూట్యూబర్ రజత్ దలాల్ సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. కరణ్ ఇంతకుముందు ఖత్రోన్ కె ఖిలాడీ 14వ సీజన్ విజేతగా అవతరించాడు. ఇతడు పవిత్ర రిష్తా, యే రిష్తా క్యా కెహ్లాతా హై, పరి హూన్ మే, బడే అచ్చే లగ్తే హా, సాసురల్ సిమర్ కా, విరుద్ధ్ వంటి పలు సీరియల్స్‌లో నటించాడు.
చదవండి: అదివారం నాడు నాకో సెంటిమెంట్ ఉంది.. ఈ పని మాత్రం చేయను:బాలకృష్ణ
Comments
Please login to add a commentAdd a comment