'డాకు మహారాజ్'(Daaku Maharaaj) భారీ విజయం సాధించడంతో బాలకృష్ణ (Balakrishna) ఫుల్ జోష్‌లో ఉన్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే సుమారు రూ. 130 కోట్లు సాధించింది. దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కించిన ఈ సినిమాను నాగవంశీ నిర్మించారు. సినిమా సక్సెస్‌లో భాగంగా మూవీటీమ్ తాజాగా యాంకర్ సుమతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అయితే, బాలయ్యకు సండేతో(Sunday) ఉన్న ఒక సెంటిమెంట్ గురించి పంచుకున్నారు.
నిజ జీవితంలో ఒక సెంటిమెంట్ అనుసరిస్తానని బాలకృష్ణ ఇలా అన్నారు. ఆదివారం రోజు నేను నలుపు రంగు దుస్తులు అసలు ధరించను. ఆదివారం అంటే నాకు బ్లాక్ డేంజర్. ఒకవేళ అలా వేసుకుంటే నాకు చాలా ప్రమాదం. నాది మూలా నక్షత్రం కావడంతో ఆదివారం నలుపు మంచిది కాదని కొందరు చెప్పడంతో దానిని పాటిస్తున్నాను. ప్రత్యాది దేవతలు ఉంటారనేది నమ్ముతాను. అందుకే ఆదివారం నలుపు ధరించను. అయితే, ఓసారి ఆదిత్య 369 షూటింగ్ సమయంలో ఆదివారం బ్లాక్ డ్రెస్ ధరించాల్సి వచ్చింది.
అయితే, ఈ డ్రెస్ వద్దని నేను ముందే చెప్పాను. కానీ, దర్శకులు చెప్పారు కాబట్టి తప్పలేదు. ఏదో నష్టం జరగబోతుందని ముందే గ్రహించాను. అదేరోజు రాక రాక బాలసుబ్రమణ్యం కూడా షూటింగ్ సెట్స్‌లోకి వచ్చారు. ఆయన కళ్ల ముందే కిందపడిపోవడంతో నా నడుము విరిగింది. అయితే, ఆయన రావడం వల్లే ఇలా జరిగిందనుకొని ఆ తర్వాత బాలసుబ్రమణ్యం మళ్లీ షూటింగ్ ప్రాంతంలోకి రాలేదు. ఆయన కూడా చాలా కంగారుపడ్డారు.' అని ఆదివారంతో తనకు ఉన్న సెంటిమెంట్‌ను బాలయ్య పంచుకున్నారు.
(ఇదీ చదవండి: ఓటీటీలో డైరెక్ట్‌గా విడుదల కానున్న నయనతార, సిద్ధార్థ్ సినిమా)
యాంకర్ సుమతో మూవీ టీమ్ పాల్గొన్న ఇంటర్వ్యూ చాలా సరదాగా జరిగింది. బాలకృష్ణతో పాటు ఈ సినిమా డైరెక్టర్ బాబీ, హీరోయిన్లు ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పాల్గొన్నారు. తాను షూటింగ్ సమయంలో ప్రొడక్షన్ ఫుడ్డే తింటానని బాలయ్య వెల్లడించారు. ఇంటి పక్కనే షూటింగ్ జరుగుతున్నా కూడా అక్కడి ఆహారమే తింటానని ఆయన చెప్పారు.
బాలకృష్ణ జాతకాలను ఎక్కువగా నమ్ముతారనే సంగతి చాలామందికి తెలిసిందే.. ఏదైనా ఒక శుభకార్యం అంటూ మొదలుపెడితే ముహూర్తాలను అనుసరిస్తూనే ప్లాన్ చేసుకుంటారు. సినిమా రిలీజ్ డేట్, ట్రైలర్ రిలీజ్ డేట్ విషయంలో కూడా బాలయ్య సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఇస్తారు. ఆయన మెడలో రుద్రాక్షతో పాటు చేతికి జాతక ఉంగరాలు ధరిస్తారు. ప్రతిరోజు తెల్లవారుజామునే తన ఇంట్లో పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఆ తర్వాతే దిన చర్య ప్రారంభిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment