
బెట్టింగ్ యాప్ ప్రమోటర్లకు వెన్నులో వణుకు మొదలైంది. సామాన్యుల జీవితాలను బలి తీసుకుంటున్న బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినవారిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేస్తున్నారు. దీంతో తప్పు తెలుసుకున్న సుప్రిత, రీతూ చౌదరి వంటి సెలబ్రిటీలు మెట్టు దిగొచ్చి క్షమాపణలు చెప్తున్నారు. తెలిసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశామని, జనాలు వాటిని నమ్మొద్దని కోరుతున్నారు.
బెట్టింగ్ యాప్స్‌కు వ్యతిరేకంగా ఉద్యమం
ఎలాగైనా సరే ఈ బెట్టింగ్ భూతం నుంచి యువతను, పేద కుటుంబాలను కాపాడాలని పూనుకున్నారు హైదరాబాద్ మాజీ అడిషనల్ డీజీపీ, ప్రస్తుత ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. ఈ ఉద్యమం (#SayNoToBettingApps)లో యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు అన్వేష్ సైతం భాగమయ్యాడు. బెట్టింగ్ యాప్స్ హానికరం అని చెప్తూ.. వాటిని ప్రమోట్ చేసినవాళ్లను ఫుట్‌బాల్ ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth)ను సైతం ఏకిపారేశాడు. అతడు గతంలో క్రికెట్ బెట్టింగ్ యాప్ గురించి చేసిన వీడియోను రిలీజ్ చేశాడు.

రైతుబిడ్డ అంటేనే అసహ్యం: అన్వేష్
అనంతరం అన్వేష్ తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ.. ప్రపంచంలో నేను ఎక్కువ అసహ్యించుకునేది పల్లవి ప్రశాంత్‌నే! రైతుబిడ్డ.. రైతుబిడ్డ అంటూ సానుభూతితో గెలిచాడు. ప్రైజ్‌మనీ రైతులకు ఇస్తానన్నాడు.. కానీ ఇచ్చాడా? పోనీ.. దేశానికి రైతు వెన్నుముక అన్నవాడు ఏనాడైనా సేంద్రీయ వ్యవసాయం గురించో, రైతుల కష్టాల గురిందో వీడియోలు చేశాడా? లేదు.. డబ్బు కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి తనను నమ్మి గెలిపించిన జనాలకు నమ్మకద్రోహం చేశాడు.
ముష్టివాడిలా అడుక్కున్నాడు.. కోట్లకు పడగలెత్తాడు
రైతు పేరు వాడుకుని ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేసి ఈ వెధవ అందర్నీ మోసం చేశాడు. రైతు అంటేనే ఛీ అనేలా చేశాడు. నాకు రైతు అంటే ఎంతో గౌరవం. వారికోసం వీడియోలు కూడా చేశాను. కానీ వీడిని చూస్తేనే అసహ్యం. బిగ్‌బాస్‌కు వెళ్లేముందు దేహి అంటూ ముష్టివాడిలా అడుక్కున్నాడు. బయటకు వచ్చాక సూటు, బ్యాడ్జి.. ఆరుగురు సెక్యురిటీగార్డులు.., కార్లు! వీడికంత అవసరమా? బెట్టింగ్ యాప్స్‌తో ఒక్కొక్కరూ కోట్లకు పడగలెత్తారు.
నెక్స్ట్ పల్లవి ప్రశాంత్..
ఈ ఇన్‌ఫ్లూయెన్సర్ల వల్ల నష్టపోయినవాళ్లందరూ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లండి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం చట్టరీత్యా నేరం. కాబట్టి ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ల దగ్గర నుంచి నష్టపరిహారం తీసుకోండి. ఇలా చేస్తేకానీ ఎవరికీ సిగ్గు రాదు. ఆడేవాడు చచ్చిపోతుంటే ఆడించేవారు మాత్రం కోట్లు సంపాదిస్తున్నారు అని నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్ మండిపడ్డాడు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకుగానూ లోకల్ బాయ్ నాని, సన్నీయాదవ్, హర్షసాయిపై కేసులు నమోదయ్యాయి. నెక్స్ట్ పల్లవి ప్రశాంత్‌దే అన్న టాక్ వినిపిస్తోంది.
చదవండి: థియేటర్‌లో సినిమాల జోరు.. ఓటీటీలో ఏకంగా 15 చిత్రాలు/సిరీస్‌లు
Comments
Please login to add a commentAdd a comment