anvesh
-
‘పల్లా’కు మతిభ్రమించింది.. : సుంకెట అన్వేష్‌రెడ్డి
నిజామాబాద్: జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకెట అన్వేష్‌రెడ్డి విమర్శించారు. నగరంలోని కాంగ్రెస్ భవన్లో శుక్రవారం ఆయన మాట్లాడారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి రైతు సమన్వయ సమితి ఉన్న అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రకతి వైపరీత్యాలు వచ్చినా స్పందించలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పంట నష్టపోయిన రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన పంటలపై సర్వే చేయిస్తున్నట్లు చెప్పారు. సర్వే కాకుండానే రెండు లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు రాజేశ్వర్‌రెడ్డి ఎలా చెబుతారని ప్రశ్నించారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బీన్‌హందాన్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గంగారెడ్డి, సిరికొండ గంగారెడ్డి, అల్లూరి మహేందర్ రెడ్డి, శశిధర్‌రెడ్డి, సుంకెట బుచ్చిరెడ్డి పాల్గొన్నారు. ఇవి చదవండి: పసుపుబోర్డు ఎక్కడుందో చెప్పాలి.. : ఎంపీ బాజిరెడ్డి -
ఉపాధ్యాయుడు విధులు ముగించుకొని.. ఇంటికి వెళ్తుండగా..
సాక్షి, ఆదిలాబాద్: ప్రతిరోజులాగే విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఓ ఉపాధ్యాయుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఘటన శుక్రవారం మండలంలోని చించోలి గ్రామం వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన రాథోడ్ అన్వేష్ (25) బోథ్ మండలంలోని పాట్నపూర్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. విధులు ముగించుకొని సాయంత్రం ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా బోలెరో వాహనాన్ని ఢీ కొనడంతో సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. ఎస్సై సాయన్న మృతదేహాన్ని బోథ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతుడి తండ్రి మోతిలాల్ సైతం ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. తండ్రికి ఒక్కడే కొడుకు కావడంతో కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి. -
చదువు గొప్పదనం నేపథ్యంలో...
‘‘రాక్షస కావ్యం’ బడ్జెట్ పరంగా చిన్న సినిమా. కానీ, కథ పరంగా పెద్ద సినిమా. పురాణాల్లోని జయవిజయ పాత్రల్ని స్ఫూర్తిగా తీసుకుని, కలియుగంలో వారు జన్మిస్తే ఎలా ఉంటుంది? అనే ఊహతో ‘రాక్షస కావ్యం’ తీశా’’ అని డైరెక్టర్ శ్రీమాన్ కీర్తీ అన్నారు. అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రాక్షస కావ్యం’. దాము రెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో దామురెడ్డి మాట్లాడుతూ–‘‘ఇదొక వైవిధ్యమైన ప్రయోగాత్మక చిత్రం. ఈ మూవీలో ఫ్యామిలీ డ్రామా, భావోద్వేగాలతో పాటు చదువు గొప్పదనాన్ని చెబుతున్నాం’’ అన్నారు. ‘‘ఇటీవల వేసిన ప్రీమియర్స్‌కి మంచి స్పందన వచ్చింది’’ అన్నారు అభయ్ నవీన్. నటీనటులు కుశాలిని, దయానంద్ రెడ్డి, యాదమ్మ రాజు, అన్వేష్ మైఖేల్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: నవీన్ రెడ్డి, వసుంధరా దేవి, ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్: ఉమేష్ చిక్కు. -
నాలోనూ ఆ భయం ఉంది – ‘దిల్’ రాజు
‘‘రాక్షస కావ్యం’ ట్రైలర్ బాగుంది. శ్రీమాన్ మేకింగ్, టేకింగ్ బాగున్నాయి. కొత్తవాళ్లతో ప్రోడ్యూసర్ దాము మంచి ప్రయత్నం చేశాడు’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రాక్షస కావ్యం’. శ్రీమాన్ కీర్తి దర్శకత్వంలో దాము రెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 6న విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్‌ను ‘దిల్’ రాజు విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘కరోనా తర్వాత ఓటీటీలో నెగిటివ్ కంటెంట్ బాగా పెరిగింది.. అదే సక్సెస్ అవుతోంది. నేను పాజిటివ్ కథతో ఓ మంచి సినిమా తీసినా చూడరేమో? అనే భయం కలుగుతోంది. ఎప్పుడూ హీరోలే గెలవాలా? విలన్లు గెలవొద్దా అనే పాయింట్‌తో ‘రాక్షస క్యావం’ చేశారు. నేటి ట్రెండ్‌కి, ప్రేక్షకులకు కావాల్సిన సినిమా ఇది’’ అన్నారు. -
వారి వల్లే స్టార్ అయ్యా: నాగార్జున
‘‘ఒకే రకమైన జానర్స్‌లో చేసిన పాత్రలే మళ్లీ మళ్లీ చేస్తే బోర్ కొడుతుంది. కొత్త దర్శకులైతే నా పాత్రలు కూడా కొత్తగా ఉంటాయి. నా నటన కూడా రొటీన్‌గా కాకుండా మారుతుందనే నమ్మకం ఉంది. అందుకే కొత్త డైరెక్టర్స్‌తో పని చేయడానికి ఆసక్తి చూపిస్తాను. నేను ఈ రోజు ఇంత పెద్ద స్టార్ అయ్యానంటే కేవలం కొత్త దర్శకులు, కొత్తదనం వల్లే’’ అని హీరో నాగార్జున అన్నారు. అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కిన చిత్రం ‘వైల్డ్‌డాగ్’. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో నాగార్జున చెప్పిన విశేషాలు. ► వాస్తవ సంఘటనలతో తెరకెక్కిన చిత్రం ‘వైల్డ్ డాగ్’. ఇలాంటి సినిమాలో కమర్షియల్ యాక్షన్‌కి వీలుండదు.. అందుకే ఒక కొత్త రకమైన యాక్షన్ ఎపిసోడ్స్‌ని ఈ సినిమాలో పెట్టాం. నాకు ఫిట్నెస్ అంటే ఇష్టం కావడంతో ఇందులో యాక్షన్ సీక్వెన్స్‌కి పెద్దగా కష్టపడలేదు. అయితే మనాలీలో యాక్షన్ సీక్వెన్స్ చేయడం కొంచెం కష్టం అనిపించింది. కానీ ఆ సీక్వెన్స్ ఆడియన్స్‌కి ఎగై్జటింగ్‌గా అనిపిస్తాయి. ► ఈ సినిమాలో ఏసీపీ విజయ్ వర్మగా నటించాను. ఒక మంచి భర్త, మంచి తండ్రితో పాటు మంచి ఎన్ఐఎ టీమ్ లీడర్‌గా కనిపిస్తాను. దేశంలో శాంతి భద్రతకు విఘాతం కలిగించే టెర్రరిస్ట్‌ను పట్టుకోవడమే విజయ్ వర్మ లక్ష్యం. ‘వైల్డ్ డాగ్’ కొత్త కమర్షియల్ ఫిల్మ్. ఈ సినిమా, నా పాత్ర అభిమానులందరికీ నచ్చుతుంది.. వారందరూ గర్వపడతారు. ► ట్రైలర్ చూసి సినిమాకి వెళ్లాలా? వద్దా? అని ప్రేక్షకులు ఓ నిర్ణయానికి వచ్చేస్తున్నారు. అందుకే సినిమాకి ఎంత జాగ్రత్తలు తీసుకున్నామో.. ట్రైలర్‌కి కూడా అంతే జాగ్రత్తలు తీసుకున్నాం. ► నా ప్రతి సినిమాని బాగా ప్రమోట్ చేస్తాను. అయితే ‘వైల్డ్ డాగ్’కి మాత్రం ఇంకొంచెం ఎక్కువ చేస్తున్నాను. ఎందుకంటే ఈ సినిమాలో నేనొక్కడే అందరికీ తెలుసు. దర్శకుడుతో సహా అందరూ కొత్తవాళ్లే.. పైగా ఇదొక న్యూ ఏజ్ ఫిల్మ్. ► నేను ‘శివ’ సినిమా చేస్తున్నప్పుడు వయొలెన్స్ ఎక్కువగా ఉంది.. మహిళలకు నచ్చదేమో అనుకున్నారు. కానీ, ఆ సినిమాను మహిళలు కూడా బాగా ఆదరించారు. ‘వైల్డ్ డాగ్’ సినిమా కూడా కుటుంబ ప్రేక్షకులకూ చేరువవుతుందనే నమ్మకం ఉంది. ► ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో నాది పవర్ఫుల్ పాత్ర. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నేను, నాగచైతన్య కలిసి చేయనున్న ‘బంగార్రాజు’ స్క్రిప్ట్ రెడీగా ఉంది. నేను, అఖిల్ కలసి ఓ యాక్షన్ మూవీ చేయాలనుంది. నేను నిర్మాతగా రాజ్ తరుణ్ హీరోగా కొత్త దర్శకుడితో ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆ తర్వాత వైష్ణవ్ తేజ్‌తో సినిమా ఉంటుంది. -
కోనేరు హంపి వివాహం వేడుక
-
హంపి వెడ్స్ అన్వేష్