వీసీ సజ్జనార్‌ హెచ్చరిక.. వీళ్లను తక్షణమే అన్‌ఫాలో చేయండి | VC Sajjanar And Naa Anveshana Comments On Social Media Influencers | Sakshi
Sakshi News home page

వీసీ సజ్జనార్‌ హెచ్చరిక.. వీళ్లను తక్షణమే అన్‌ఫాలో చేయండి

Published Sun, Mar 16 2025 8:32 AM | Last Updated on Sun, Mar 16 2025 8:40 AM

VC Sajjanar And Naa Anveshana Comments On Social Media Influencers

బెట్టింగ్‌ యాప్స్‌, వాటిని ప్రమోట్‌ చేస్తున్న సోషల్‌మీడియా ఇన్‌ప్లూయెన్స‌ర్ల‌కు టీజీఆర్టీసీ ఎండీ, ఐపీఎస్‌ అధికారి వీసీ సజ్జనార్‌ (VC Sajjanar)  చుక్కలు చూపుతున్నారు. ఇంతకాలం కొనసాగిన తమ ఆగడాలకు ఆయన ఫుల్‌స్టాప్‌ పెడుతున్నారు. కాసులకు కక్కుర్తిపడి వాటికి ప్రచారం చేయొద్దని ఇప్పటికే ఆయన పలుమార్లు హెచ్చరించారు. అయినప్పటికీ వారిలో మార్పు రాకపోవడంతో కేసులు నమోదు అయ్యేలా చైతన్యం తీసుకొచ్చారు. దీంతో చాలామంది యూట్యూబర్స్‌ బెట్టింగ్‌ యాప్స్‌కు వ్యతిరేఖంగా ఆయనతో చేతులు కలిపేందుకు ముందుకు వస్తున్నారు.

మొన్న వైజాగ్ లోకల్ బాయ్ నాని, నిన్న భయ్యా సన్నీ యాదవ్.. నేడు హర్ష సాయిల  బాగోతాన్ని వీసీ సజ్జనార్ ‘ఎక్స్’ వేదికగా బయటపెట్టారు. రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావొచ్చని సోషల్ మీడియాలో వారు విడుదల చేసే వీడియోల వల్ల అమాయకులు ఆన్‌లైన్ బెట్టింగ్ మహమ్మారికి బానిసలవుతున్నారని ఆయన మండిపడ్డారు. ఈ క్రమంలో వారి బంగారు జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. ఈ క్రమంలో యూట్యూబర్‌ హర్ష సాయి గురించి సజ్జనార్‌ ఇలా చెప్పుకొచ్చారు. 'హర్ష సాయి చేస్తున్న‌దే త‌ప్పు.. అదేదో సంఘ‌సేవ చేస్తున్న‌ట్టు ఎంత గొప్ప‌లు చెప్పుకుంటున్నాడో ఈ వీడియోలో చూడండి. తాను బెట్టింగ్ యాప్‌ల‌ను ప్ర‌మోట్ చేయ‌కుంటే ఎవ‌రో ఒక‌రు చేస్తార‌ని ఈయ‌న చేస్తున్నాడ‌ట. ఏమైనా బుద్దుందా అస‌లు!

ఎంతో మంది అమాయ‌కుల ప్రాణాలు ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బలైతుంటే క‌నీసం ప‌శ్చాత్తాపం కూడా లేదు. వీళ్లకు డ‌బ్బే ముఖ్యం, డ‌బ్బే స‌ర్వ‌స్వం.. ఎవ‌రూ ఎక్క‌డ పోయినా, స‌మాజం, బంధాలు, బంధుత్వాలు చిన్నాభిన్న‌మైన వాళ్లకు సంబంధం లేదు. ఈయ‌న‌కు రూ. 100 కోట్ల నుంచి రూ. 500 కోట్ల వ‌ర‌కు ఆఫ‌ర్ చేశార‌ట‌. అంత మొత్తంలో డ‌బ్బు ఎక్క‌డి నుంచి వ‌స్తుందో ఆలోచించండి. మీ ఫాలోయింగ్‌ని మార్కెట్‌లో పెట్టి కోట్ల‌కు కోట్లు సంపాదిస్తున్న ఇలాంటి వాళ్ల‌నా.. మీరు ఫాలో అవుతోంది. వెంట‌నే ఈ బెట్టింగ్ ఇన్‌ప్లూయెన్స‌ర్ల‌ను అన్‌ఫాలో చేయండి. వారి అకౌంట్ల‌ను రిపోర్ట్ కొట్టండి. ఆన్‌లైన్ బెట్టింగ్ భూతాన్ని అంత‌మొందించ‌డంలో మీ వంతు బాధ్య‌త‌ను నిర్వ‌ర్తించండి.' అంటూ ఆయన సూచించారు. దీంతో సోషల్‌మీడియాలో సజ్జనార్‌ పేరు మారుమ్రోగిపోతుంది.

వాళ్లకు చుక్కులు చూపించిన అన్వేష్‌
ముఖ్యంగా యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది ఫాలోవర్స్‌ ఉన్న తెలుగు ట్రావెలర్‌ నా అన్వేషణ.. 'అన్వేష్‌' చాలారోజుల నుంచే బెట్టింగ్‌ యాప్స్‌పై వ్యతిరేఖంగా పోరాటం చేస్తున్నాడు. ఈ క్రమంలో వందల కొద్ది వీడియోలను తన యూట్యుబ్‌లో పోస్ట్‌ చేశాడు. అసలు బెట్టింగ్‌ యాప్స్‌ వల్ల జరిగే నష్టాలను తెరపైకి తీసుకొచ్చాడు. ఆపై వాటిని ప్రమోట్‌ చేస్తున్న లోకల్ బాయ్ నాని,  భయ్యా సన్నీ యాదవ్, హర్ష సాయి, ఇమ్రాన్‌ వంటి వారిని హెచ్చరిస్తూనే పలు వీడియోలతో వారికి చుక్కులు చూపించాడు. దీంతో అన్వేష్‌కు మద్ధతుగా చాలామంది నెటిజన్లు నిలిచారు. ఈ క్రమంలో వీసీ సజ్జనార్‌ కూడా అన్వేష్‌తో ఒక లైవ్‌ వీడియో ప్రోగ్రామ్‌ చేశారు. దానిని తన యూట్యూబ్‌లో ఆయన షేర్‌ చేయడంతో సుమారు రెండు మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి. 

 ఎంతో మంది IPS, IASలు ఉన్నారు. కానీ, బెట్టింగ్ యాప్స్‌ మీద మాట్లాడింది సజ్జనార్ సార్ మాత్రమే అంటూ ఆయన అభిమానులు కామెంట్‌ రూపంలో చెబుతున్నారు. ఈ వీడియోతో రెండు రాష్ట్రాల తెలుగువారి మనసులు గెలిచేసావ్ అంటూ అన్వేష్‌పై ప్రశంసలు వస్తున్నాయి. అన్వేష్‌ లాంటి యూట్యూబర్‌ను ఫాలో అవుతున్నందుకు చాలా గర్వపడుతున్నానని ఒక నెటిజన్‌ పేర్కొనడం విశేషం.  ఐపీఎస్‌ సజ్జనార్‌తో ఇంటర్వ్యూ చేసిన అన్వేష్‌కు సోషల్‌మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ పెరిగిపోయింది. ఆ వీడియో కింద కామెంట్లు అన్నీ కూడా వారిని ప్రశంసిస్తూ ఉండటం విశేషం.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement