
కొన్ని సినిమాలు మనసును పట్టి కుదుపుతాయి. గతాన్ని, మనసుకైన గాయాల్ని గుర్తు చేస్తాయి. అలా దో పట్టి సినిమా కూడా గడిచిపోయిన చేదు జ్ఞాపకాలను గుర్తు చేసిందంటోంది గాలి పటం హీరోయిన్ ఎరికా ఫెర్నాండేజ్ (Erica Fernandes). తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎరికా మాట్లాడుతూ.. నా ప్రేమకథ అందమైనదేమీ కాదు, హింసాత్మకమైనది. అతడు నాపై చేయి చేసుకునేవాడు. అది రానురానూ ఎక్కువయ్యేది. అతడి దుర్మార్గపు ప్రవర్తన గురించి బయటకు చెప్పాలనిపించేది.. కానీ పెదవి కిందే అణిచేశాను.
న్యాయ వ్యవస్థపై నమ్మకం లేదు
ఒక నటిగా నేను ఏం చెప్పినా, ఏం చేసినా అది ఒక వార్తవుతుంది. పోలీసుల దగ్గరకు వెళ్దామంటే అది కూడా న్యూసే అవుతుంది. మీడియా నా వెంటపడుతుంది. అతడి పేరు చెప్పకుండా ఉందామంటే ఎవరినో ఒకరిని నాతో లింక్ చేస్తారు. పైగా నేను పోలీసులను కలిసినంతమాత్రాన న్యాయం జరుగుతుందా? అన్న ఆలోచన నా మెదడును తొలిచేసింది. న్యాయ వ్యవస్థపై నాకు అంతగా నమ్మకం లేదు. అందులోనూ నేనేదో పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నానని కూడా విమర్శిస్తారు.

(చదవండి: ప్రేయసితో వయసు ముదిరిన హీరో చెట్టాపట్టాల్.. మాజీ భార్యలకూ ఓకే)
మాయని మచ్చగా..
అందుకే మౌనంగానే ఉండిపోయాను. ఒంటరిగానే పోరాడాను. అయినా ఆ రిలేషన్ నా జీవితంలోనే ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది. సినిమాల్లో ప్రేమించిన అమ్మాయిని టార్చర్ పెట్టే సన్నివేశాలు చూసినప్పుడు నా ఫ్లాష్‌బ్యాక్ అంతా ఒక్కసారిగా కళ్లముందుకు వస్తుంటుంది. దో పట్టి సినిమా చూసినప్పుడు అదే జరిగింది. ఆ సినిమా చూస్తూ నేను నా గతంలోకి వెళ్లిపోయాను. ఆ విష సంబంధాల నుంచి బయటపడేందుకు, ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది అని చెప్పుకొచ్చింది.
సినీ ప్రయాణం
ఎరికా ఫెర్నాండేజ్.. అయింతు అయింతు అయింతు అనే తమిళ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. తెలుగులో గాలిపటం, డేగ (తమిళంలో విరాట్టు సినిమా) చిత్రాల్లో కథానాయికగా మెప్పించింది. తర్వాత బుల్లితెరకు షిఫ్ట్ అయింది. కసౌటీ జిందగీ కే, కుచ్ రంగ్ ప్యార్‌కే ఐసే భీ: నయీ కహానీ సీరియల్స్‌లో మెరిసింది. లవ్ అధురా అనే వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేసింది.
చదవండి: ఐటం సాంగ్‌లో మల్లెపూలతో హీరోయిన్.. సీక్రెట్ బయటపెట్టిన డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment