erica fernandes
-
ఛాన్సులు ఇచ్చినట్లే ఇచ్చి లాక్కున్నారు: గాలిపటం హీరోయిన్
ఎరికా ఫెర్నాండేజ్.. సీరియల్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మోస్ట్ గ్లామరస్ బుల్లితెర నటిగా అవార్డులు అందుకున్న ఈ బ్యూటీ గాలిపటం, డేగ సినిమాల్లో హీరోయిన్గా నటించింది. హిందీలో 'బబ్లూ హ్యాపీ హై' అని ఒకే ఒక్క సినిమా చేసింది. నెపోటిజం వల్ల తనకు సినీ ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలే రాకుండా పోయాయని, వచ్చిన అవకాశాలను కూడా సెలబ్రిటీ కిడ్స్ ఎగరేసుకుపోయారని చెప్తోంది. ఆడిషన్‌కు వెళ్లేదాన్ని తాజాగా ఆమె మాట్లాడుతూ.. 'దక్షిణాది చిత్రపరిశ్రమలో నేను ఓ సినిమాకు సంతకం చేశాను. రెండు, మూడు రోజులు షూటింగ్ అయ్యాక నన్ను తీసేశారని తెలిసింది. అప్పుడే నాకు బాలీవుడ్లో ఎందుకు ట్రై చేయకూడదు అనిపించింది. చాలాసార్లు ఆడిషన్‌కు వెళ్లాను. ఆల్మోస్ట్ ఓకే అయిపోయిందనుకునే సమయంలో ఫేమస్ సెలబ్రిటీల కూతుర్లను హీరోయిన్గా సెలక్ట్ చేసేవారు. నన్ను పక్కన పెట్టేసేవారు. ఎంతో బాధేసేది. సినిమా అవకాశాల్లేనప్పుడు సీరియల్స్ చేశాను. మళ్లీ టీవీకి ఎందుకు వెళ్తున్నావని అడిగేవారు. ఏదైనా పనే అని నమ్మాను. సినిమా రోల్స్ అయినా, సీరియల్ పాత్రలయినా అన్నింటినీ అంతే గౌరవంగా స్వీకరించాను' అని చెప్పుకొచ్చింది. ఆ తిరస్కరణల వల్లే బాడీ షేమింగ్ గురించి మాట్లాడుతూ.. 'గతంలో నేను ఎంత క్షోభ అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. బక్కపలుచగా ఉండటంతో చాలా ప్రాజెక్టుల్లో నాకు ఛాన్సులు వచ్చినట్లే వచ్చి చేజారాయి. ఆత్మనూన్యతకు లోనయ్యాను. కానీ ఆ తిరస్కరణ వల్లే నేను మరింత బలంగా తయారయ్యాను' అని చెప్పుకొచ్చింది. ఇటీవలే ఎరికా 'లవ్ అధూర' అనే వెబ్ సిరీస్ చేసింది. చదవండి: వచ్చి ఇక్కడ పడుండు అని అరిచారు.. అన్నం కూడా తినబుద్ధి కాలే! -
బ్రహ్మస్త్రపై బాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్.. గొప్ప ప్రయత్నమే.. కానీ..!
బాలీవుడ్ నటి, మోడల్ ఎరికా ఫెర్నాండెజ్ బ్రహ్మస్త్ర సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇటీవల విడుదలైన ఈ మూవీపై సోషల్ మీడియా వేదికగా ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించారు. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ప్రయత్నం గొప్పదే.. కానీ సినిమా విజయవంతం కాలేదని వ్యంగ్యంగా మాట్లాడారు. అలాగే ప్రతి ఒక్కరూ తమ తప్పుల నుంచి నేర్చుకుంటారని తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. (చదవండి: Brahmastra Twitter Review: 'బ్రహ్మస్త్ర' 'టాక్ ఏలా ఉందంటే?) ఎరికా ఫెర్నాండెజ్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆస్క్ మీ ఎనీథింగ్ అనే ఓ సెషన్‌ను నిర్వహించింది. అందులో పాల్గొన్న ఓ అభిమాని మీరు బ్రహ్మాస్త్ర సినిమాను చూశారా అన్న ప్రశ్నకు నటి స్పందిస్తూ .. 'అవును, నేను సినిమా చూసాను. ఇది గొప్ప ప్రయత్నం కానీ.. విజయవంతం కాలేదని' రిప్లై ఇచ్చారు. విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చింది. అలాగే దర్శకుడు నటీనటులు, కథనంపై మరింత ఫోకస్ పెట్టాల్సిందని సలహా ఇచ్చింది. ఇలాంటి వాటితో ప్రతి ఒక్కరు తమ తప్పుల నుంచి మరింత నేర్చుకుంటారని పేర్కొంది. ఇది కేవలం తన అభిప్రాయం మాత్రమేనని తెలిపింది. బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళంలో సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. -
సౌత్‌లో అలా చేసేవారు, అవమానంగా అనిపించేది: నటి
ఇండస్ట్రీలో ఎంతోమంది బాడీ షేమింగ్‌కు గురయ్యారు. సన్నగా ఉంటే బొద్దుగా ఉండాలని, బొద్దుగా ఉన్నవారినేమో కాస్త సన్నబడాలని నటీమణుల మీద ఒత్తిడి తెచ్చేవారు. ఇలాంటి పరిస్థితే నటి ఎరికా ఫెర్నాండేజ్‌కు ఎదురైందట. ఈ విషయాన్ని ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. 'అప్పట్లో సౌత్‌లో హీరోయిన్లు కొంత బొద్దుగా ఉంటే ఇష్టపడేవారు. నేనేమో సన్నగా ఉండేదాన్ని. అందుకని నా శరీరంపై ప్యాడ్స్ పెట్టి మేనేజ్ చేయడానికి ప్రయత్నించేవాళ్లు. వాళ్లు అలా చేస్తుంటే నాకు మహా సిగ్గుగా అనిపించేది. చాలా అవమానంగా ఫీలయ్యేదాన్ని. ప్యాడ్స్ పెట్టుకుని నటించేందుకు అసౌకర్యంగా, ఇబ్బందిగా ఉండేది. వాళ్లు కోరుకున్నట్లు నేను లేనేంటా అని చాలాసార్లు బాధపడ్డాను. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. అందరినీ యాక్సెప్ట్ చేస్తున్నారు. అది సంతోషకరమైన పరిణామం' అని ఎరికా చెప్పుకొచ్చింది. కాగా 2011లో పాంటలూన్స్ ఫెమినా మిస్ ఫ్రెష్ ఫేస్, 2010, 2011లో పాంటలూన్స్ ఫెమినా మిస్ మహారాష్ట్ర అవార్డులు గెలుచుకుంది ఎరికా ఫెర్నాండేజ్. ఇక సినిమాల విషయానికి వస్తే 'గాలిపటం' సినిమాలో కథానాయికగా అలరించిన ఎరికా పలు తమిళ, కన్నడ చిత్రాల్లో నటిస్తోంది. బాలీవుడ్‌లోనూ 'కుచ్ రంగ్ ప్యార్ కే ఐసేభీ' చిత్రంలో ఓ పాత్రలో మెరిసింది. -
ఇంట్లో ఉంటే ఆకలి, బయటకు వెళితే కరోనా: నటి భావోద్వేగం
కరోనా రోజురోజుకు దేశవ్యాప్తంగా కోరలు చాస్తోంది. రోజురోజుకు మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య రెట్టింపు అవుతోంది. ఇక సినీ పరిశ్రమలో కోవిడ్ ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. దీంతో పలు షూటింగ్‌లు వాయిదా పడగా.. మరికొన్ని కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ పరిమిత సిబ్బందితో షూటింగ్‌లు జరుపుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మోడల్, టీవీ నటి ఎరికా ఫెర్నాండేజ్ ఈ ఆందోళకర పరిస్థితుల్లో సైతం పని చేయాల్సిన అవసరం ఉందటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఓ ఛానల్ నిర్వహించిన ఆన్లైన్ ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ.. ఏం జరిగినా చివరకు మనం పని చేయాల్సిందే. ఎందుకంటే మన కుటుంబాలను పోషించుకునే బాధ్యత మనపై ఉంది. దీనికంటే మనకు వేరే దారి లేదు. నా కుటుంబాన్ని పోషించుకోవాలంటే నేను పనిచేయాల్సిందే. ఇది కేవలం విలువల కోసం కాదు.. పని అంటే పని అంతే. ఒకవేళ నేను నటిని కాకుండా ఏదైనా ఆఫీసులో ఉద్యోగిని కూడా అది కూడా చేయాలి కదా. నా ఫ్యామిలీని పోషించుకోవాల్సిన అవసరం నాకుంది. అంతేకాదు ఈ బాధ్యతల నుంచి ఎవరూ, ఎవరిని కూడా భర్తీ చేయలేరు. అలాంటప్పడు మనం ఎంతకాలమని పని లేకుండా ఇంట్లోనే ఉండగలం. ఇప్పటికే 8 నెలలుగా నేను ఇంట్లోనే ఉంటున్నాను. ఇంకేంతకాలం ఇలాగే ఉండాలి. ఇప్పుడు బయటకు వెళ్లి పని చేయాల్సిన సమయం వచ్చింది’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అలాగే కోరోనా వల్ల ఇలాగే ఇంకొంతకాలం పని లేకుండా ఉంటే తిండిలేక ప్రాణాలు పోయే పరిస్థితి కూడా రావొచ్చంటూ ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. బయటకు వెళితే కరోనాతో.. ఇంట్లో ఉంటే ఆకలితో పోరాడాల్సిందేనని ఎరికా ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ‘కసౌజీ జిందగీ కే 2’ సీరియల్ నిలిపివేయడంపై ఆమె మాట్లాడుతూ.. ‘కరోనా కారణంగా ఈ ప్రాజెక్ట్‌ను ఆపేశారు. ఎందుకంటే ఎప్పటికైనా ఈ ప్రాజెక్ట్‌ను తిరిగి ప్రారంభించొచ్చు. కానీ మనిషి పోతే తిరిగి తీసుకురాలేము. ఈ కారణం వల్లే ప్రాజెక్ట్‌ను నిలిపివేశారని అనుకుంటున్న’ అని ఎరికా పేర్కొంది. కాగా ఆమె పలు హిందీలో సీరియల్స్‌తో పాటు తెలుగులో ‘గాలి పటం’, ‘డేగ’ వంటి సినిమాలు, కన్నడ, తమిళం మూవీస్‌లో సైతం నటించింది. -
రైలులో జరిగే కథ!
థాయిలాండ్ నుంచి మలేసియా వెళ్లే రైలు అది. ఆ రైలు ప్రయాణంలో జరిగే ఓ కథతో రూపొందిన చిత్రం ‘డేగ’. సుజీవ్, ఎరికా ఫెర్నాండెజ్ జంటగా జేవీ రామారావు సమర్పణలో స్వీయదర్శకత్వంలో కుమార్ రావెళ్ల నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 28న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా కుమార్ రావెళ్ళ మాట్లాడుతూ -‘‘ఇది రొమాంటిక్, లవ్, యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ. ముఖ్యంగా రన్నింగ్ ట్రైన్లో తీసిన ఫైట్ ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేస్తుంది. ధరణ్‌కుమార్ స్వరపరచిన పాటలకు కూడా అద్భుతమైన స్పందన లభిస్తోంది. ‘రంగ్ దే బసంతి’ ఫేం నరేశ్ అయ్యర్, కథానాయిక ఆండ్రియా ఓ ప్రత్యేక పాటకు కాలు కదిపారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకునే విధంగా ఉంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సహనిర్మాత: పి.వి. రవికుమార్. -
సినిమా రివ్యూ: గాలిపటం
నటీనటలు: ఆది, క్రిస్టినా అఖీవా, ఎరికా ఫెర్నాండెజ్, రాహుల్ రవీంద్రన్, పోసాని, హేమ, ప్రగతి, సప్తగిరి తదితరులు సినిమాటోగ్రఫి: కే.బుజ్జి సంగీతం: భీమ్స్ సెసిరోలియో కథ, స్క్రీన్ ప్లే: సంపత్ నంది నిర్మాతలు: సంపత్ నంది, కిరణ్ ముప్పవరపు, విజయకుమార్ వట్టికూటి దర్శకత్వం: నవీన్ గాంధీ ప్లస్ పాయింట్స్: డైలాగ్స్ ఫోటోగ్రఫి మైనస్ పాయింట్స్: కథ, కథనం దర్శకుడిగా టాలీవుడ్ లో సుపరిచితులైన సంపతి నంది నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం 'గాలిపటం'. రొమాంటిక్ లవ్ స్టోరికి 'పవనిజం' అనే ఎక్స్ ట్రా కోటింగ్ ఇచ్చి ప్రేక్షకుల్లో గాలిపటంపై అంచనాలు పెంచడంలో 'సంపత్ నంది' సఫలమయ్యారు. తన మార్కు డైలాగ్స్ తో యూత్ కు కనెక్ట్ అయ్యేలా నిర్మించామనే ప్రచారంతో ముందుకు వచ్చిన 'గాలి పటం' ప్రేక్షకుల అంచనాల మేరకు ఎగిరిందా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే! కార్తీక్(ఆది), స్వాతి(ఎరికా ఫెర్నాండెజ్) కొత్తగా పెళ్లై.. ఒకే కంపెనీలో పనిచేసే సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. వ్యక్తిగత విభేదాల కారణంగా పెళ్లైన ఏడాదిలోపే స్నేహపూరితమైన వాతావరణంలో విడిపోవాలని నిర్ణయించుకుంటారు. ఈ నేపథ్యంలో పెళ్లికి ముందే కార్తీక్ కు పరిణిత (క్రిస్టినా) అమ్మాయితో ప్రేమ వ్యవహారం, స్వాతి జీవితంలో ఆరవ్ రెడ్డి (రాహుల్)తో అఫైర్ ఉన్నట్టు తెలుస్తుంది. పెద్దలు కుదిర్చిన పెళ్లిని కాదనుకుని మాజీ ప్రియురాలితో కార్తీక్, ప్రియుడితో స్వాతి జీవించాలనుకుంటారు. ప్రేమను కాదని పెద్దలు కుదిర్చిన పెళ్లిని కార్తీక్ ఎందుకు చేసుకున్నాడు? అఫైర్ వదులుకుని స్వాతి కార్తీక్ ను ఎందుకు పెళ్లి చేసుకుంది? చివరకు ఆరవ్, స్వాతి, కార్తీక్, పరిణితలు ఒక్కటవుతారా? లేక స్వాతి, కార్తీక్ లే కలిసి ఉండాలని కోరుకుంటారా అనే ప్రశ్నలకు దర్శకుడు నవీన్ గాంధీతో కలిసి సంపత్ నంది ఇచ్చిన సమాధానమే 'గాలిపటం'. సమీక్ష: ప్రస్తుత సాఫ్ట్ వేర్ యుగంలో యువతీ, యువకుల తీరుతెన్నులను ప్రధాన అంశంగా చేసుకుని ప్రేమ, పెళ్లి అంశాలను జోడించి అల్లుకున్న కథకు సామాజిక అంశాలను అక్కడ జొప్పించడమే కాకుండా వినోదాత్మకంగా చెప్పాలని సంపత్ నంది, నవీన్ గాంధీ చేసిన ప్రయత్నం కొంత సపలమైందని చెప్పవచ్చు. అయితే గాలిపటం చిత్రంలో డైలాగ్స్ పై పెట్టినంత దృష్టి.. కథ, కథనాలపై మరికొంత కేర్ తీసుకుని ఉంటే సంపత్ నందికి మరింత భిన్నమైన ఫలితం లభించి ఉండేది. డైలాగ్స్ అక్కడ బ్రహ్మండంగా పేలాయి. కాని కొన్ని కీలక సన్నివేశాల్లో భావోద్వేగాన్ని డైలాగ్స్ ఓవర్ టేక్ చేసి ఇదేం గోలరా అనే ఫిలింగ్ కలుగుతుంది. కొన్ని సామాజిక అంశాలను తెరపై చూపించడానికి ఎంచుకున్న పద్దతి కరెక్ట్ కాదనిపించినా.. కమర్షియల్ అంశాలను మేళవించి.. చివరికి మంచి అంశాన్ని ప్రేక్షకులకు చేరవేశాడనే విషయం బోధపడుతుంది. బామ్మల సీన్ల కన్విన్స్ చేయడానికి కొంత ఇబ్బంది ఉన్నా, భార్గవి దంపతుల మధ్య సన్నివేశాలు ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించేలా ఉన్నాయి. అయితే ప్రీ క్లైమాక్స్ వరకు కథను బాలెన్స్ గా ముందుకు తీసుకుపోవడంలో సక్సెస్ అయ్యారు. అయితే క్లైమాక్స్ పాయింట్ ను చెప్పడానికి మధ్యలో వినోదం పేరుతో కొన్ని సీన్లను హడావిడిగా చేర్చినట్టు అనిపిస్తుంది. అయితే తాను ఎంచుకున్న ముగింపుకు చేరవేయడానికి జోడించిన ట్విస్టులు అంతగా మెప్పించలేకపోవడం ఓ మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఏదిఏమైనా తాను అల్లుకున్న పాయింట్ తో ఆది, క్రిస్టినా, ఎరికాల నుంచి మంచి నటనను రాబట్టుకున్నారు. ఆదికి ముఖ్యంగా కొంత నటనకు స్కోప్ ఉన్న పాత్రే లభించింది. రాహుల్ కు పెద్దగా ఉపయోగపడని, కెరీర్ కు తోడ్పాడనందించని పాత్రే దక్కింది. క్రిస్టినా, ఎరికాలు గ్లామర్ తో ఆకట్టుకున్నారు. ఇక మిగితా క్యారెక్టర్లు పర్వాలేదనిపించే రేంజ్ లో ఉన్నాయి. ఈ చిత్రానికి కే.బుజ్జి అందించిన సినిమాటోగ్రఫి, భీమ్స్ సంగీతం అదనపు ఆకర్షణ. సంపత్ నంది టీమ్ నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి. చివరగా యూత్ కు కనెక్ట్ అయ్యే అంశాలు పుష్కలంగా ఉన్నా... ఫ్యామిలీ ఆడియెన్స్ ను థియేటర్ కు రప్పించడంపైనా 'గాలిపటం' విజయం ఆధారపడిఉంది. ట్యాగ్: తక్కువ వ్యాలిడిటితో ఎక్కువ రీఛార్జ్ -
గాలిపటం మూవీ న్యూ స్టిల్స్
-
యువతరానికి పండగే
దర్శకుడు సంపత్‌నంది నిర్మాతగా మారి, కిరణ్ ముప్పవరపు, విజయ్‌కుమార్ వట్టికూటిలతో కలిసి నిర్మించిన చిత్రం ‘గాలిపటం’. ఆది, ఎరికా ఫెర్నాండేజ్, క్రిస్టినా ఆకిహివా ప్రధాన పాత్రధారులు. నవీన్‌గాంధీ దర్శకుడు. ఆగస్ట్ తొలివారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా సంపత్‌నంది మాట్లాడుతూ -‘‘పేరుకు తగ్గట్టే విభిన్నంగా ఉంటుందీ సినిమా. యువతరం పండుగ చేసుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. భీమ్స్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన వస్తోంది. ఆది నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ’’ అని చెప్పారు. ‘గాలిపటం’ తనకు ప్రత్యేకమైన సినిమా అని, సాంకేతికంగా ఈ సినిమా ఓ అద్భుతమని, తాను ఇష్టంగా చేసిన సినిమా ఇదని ఆది తెలిపారు. సంపత్‌నంది, ఆయన టీమ్ కలిసి అంకితభావంతో పనిచేసి, ఓ అందమైన అద్భుతంగా ఈ చిత్రాన్ని మలిచారని నిర్మాతల్లో ఒకరైన విజయ్‌కుమార్ వట్టికూటి అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కె.బుజ్జి, నిర్మాణం: సంపత్‌నంది టీమ్ వర్క్స్. -
గాలిపటం మూవీ వర్కింగి స్టిల్స్
-
గాలిపటం మూవీ ఆడియో వేడుకా
-
గాలిపటం మూవీ స్టిల్స్