
బాలీవుడ్ నటి, మోడల్ ఎరికా ఫెర్నాండెజ్ బ్రహ్మస్త్ర సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇటీవల విడుదలైన ఈ మూవీపై సోషల్ మీడియా వేదికగా ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించారు. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ప్రయత్నం గొప్పదే.. కానీ సినిమా విజయవంతం కాలేదని వ్యంగ్యంగా మాట్లాడారు. అలాగే ప్రతి ఒక్కరూ తమ తప్పుల నుంచి నేర్చుకుంటారని తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
(చదవండి: Brahmastra Twitter Review: 'బ్రహ్మస్త్ర' 'టాక్ ఏలా ఉందంటే?)
ఎరికా ఫెర్నాండెజ్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆస్క్ మీ ఎనీథింగ్ అనే ఓ సెషన్‌ను నిర్వహించింది. అందులో పాల్గొన్న ఓ అభిమాని మీరు బ్రహ్మాస్త్ర సినిమాను చూశారా అన్న ప్రశ్నకు నటి స్పందిస్తూ .. 'అవును, నేను సినిమా చూసాను. ఇది గొప్ప ప్రయత్నం కానీ.. విజయవంతం కాలేదని' రిప్లై ఇచ్చారు. విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చింది. అలాగే దర్శకుడు నటీనటులు, కథనంపై మరింత ఫోకస్ పెట్టాల్సిందని సలహా ఇచ్చింది.
ఇలాంటి వాటితో ప్రతి ఒక్కరు తమ తప్పుల నుంచి మరింత నేర్చుకుంటారని పేర్కొంది. ఇది కేవలం తన అభిప్రాయం మాత్రమేనని తెలిపింది. బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళంలో సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment