Brahmastra Movie
-
నేషనల్ అవార్డ్స్ లో బాలీవుడ్ కి బిగ్ షాక్
-
ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)
-
9 రోజులుగా ఆస్పత్రిలో ఉన్నా.. మీ అందరికీ రుణపడి ఉంటా: హీరోయిన్
మౌనీ రాయ్ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది నాగిని సీరియల్. ఆ సీరియల్‌తోనే ఎక్కువ ఫేమ్‌ను తెచ్చుకుంది. గతేడాది బాలీవుడ్లో ఆమె నటించిన బ్రహ్మస్త్ర చిత్రం మరింత గుర్తింపును తీసుకొచ్చింది. ఆ సినిమాలో విలన్‌గా నటించి అందరినీ ఆకట్టుకుంది బాలీవుడ్ భామ మౌనీ రాయ్. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ తెగ వైరలవుతోంది. ఇటీవలే ఆస్పత్రిలో చికిత్స తీసుకుని కోలుకున్నానని పోస్ట్ చేసింది. ఈ మేరకు తన ఇన్‌స్టాలో ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. (ఇది చదవండి: 'బేబీ' ఫేమ్ వైష్ణవి కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్.. హీరో ఎవరంటే ) మౌనీ తన ఇన్‌స్టాలో రాస్తూ..' 9 రోజులుగా ఆసుపత్రిలో ఉన్నా. నాకు తెలిసిన దానికంటే లోతైన ఆలోచనలతో మునిగిపోయా. ప్రస్తుతం నేను ఇంటికి తిరిగి వచ్చా. నెమ్మదిగా కోలుకుంటున్నా. కానీ బాగానే ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా మేలు కోసం తమ విలువైన సమయాన్ని వెచ్చించి నా స్నేహితులకు, నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్న వైద్యులు, నర్సులకు కృతజ్ఞతలు. మీలాగా నన్ను చూసుకునే వారు ఎవరూ లేరు. నీకు ఎప్పటికీ రుణపడి ఉంటా.' అంటూ తన భర్త నంబియార్‌పై ప్రశంసలు కురిపించింది. అయితే తన అనారోగ్యానికి సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. (ఇది చదవండి: నిజంగానే అతీంద్రియ శక్తులున్నాయా?.. అయితే ఈ సినిమా చూడాల్సిందే!) View this post on Instagram A post shared by mon (@imouniroy) -
మూడేళ్ల తర్వాతే బ్రహ్మాస్త్రం పార్ట్ 2
‘బ్రహ్మాస్త్రం’ చిత్రంలోని తర్వాతి భాగాలను చూడాలనుకుంటున్న ప్రేక్షకులు మరింత సమయం వేచి ఉండక తప్పదు. దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న హిందీ ట్రయాలజీ ‘బ్రహ్మాస్త్ర’. మూడు భాగాల ‘బ్రహ్మాస్త్రం’లోని తొలి భాగం ‘బ్రహ్మాస్త్ర: పా ర్ట్ వన్ శివ’ గత ఏడాది సెప్టెంబరు 9న విడుదలై, ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ హీరో హీరోయిన్లుగా అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పా త్రల్లో ఈ చిత్రం రూ΄పొందింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో కరణ్ జోహార్ నిర్మించారు. కాగా ‘బ్రహ్మాస్త్ర’ ట్రయాలజీలోని రెండో భాగం ‘బ్రహ్మాస్త్ర: పా ర్టు 2 దేవ్’, ‘బ్రహ్మాస్త్ర’ థర్డ్ పా ర్టులను వరుసగా 2026 డిసెంబరు, 2027 డిసెంబరులో విడుదల చేయనున్నట్లు దర్శకుడు అయాన్ ముఖర్జీ మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ‘‘బ్రహ్మాస్త్ర: పా ర్ట్ 1 శివ’కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో సెకండ్ పా ర్ట్, థర్డ్ పా ర్ట్ స్క్రిప్ట్స్‌పై మరింత ఫోకస్ పెట్టాను. అలాగే ఈ రెండు సినిమాలను ఏడాది గ్యాప్‌లో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని పేర్కొన్నారు దర్శకుడు అయాన్ ముఖర్జీ. అలాగే తాను మరో సినిమాకు దర్శకత్వం వహించే చాన్స్ ఉందని, సరైన టైమ్‌లో ఆ విషయాన్ని వెల్లడిస్తానని కూడా అయాన్ పేర్కొన్నారు. దాంతో ఇది ‘వార్ 2’ సినిమా గురించే అనే ఊహాగానాలు మొదలయ్యాయి. -
ఆ అవార్డు అందుకునే అర్హత లేదనిపిస్తోంది: రణ్‌బీర్
బాలీవుడ్ దంపతులు, స్టార్ హీరోహీరోయిన్స్ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గెలుచుకున్నారు. బ్రహ్మాస్త్ర సినిమాకు గానూ రణ్‌బీర్ ఉత్తమ నటుడిగా, గంగూబాయి కఠియావాడికిగానూ ఆలియా ఉత్తమనటిగా ఈ అవార్డులు పొందారు. తాజాగా తనకు ఈ పురస్కారం రావడంపై రణ్‌బీర్ స్పందించాడు. 'తు జూఠీ మై మక్కార్' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఛండీఘడ్లో పర్యటిస్తున్న రణ్‌బీర్ ఈ అంశంపై మాట్లాడుతూ.. 'దాదాసాహెబ్ ఫాల్కే రావడం సంతోషంగా ఉంది. కానీ బ్రహ్మాస్త్రలో నేను మరీ అత్యద్భుతంగా ఏమీ నటించలేదని నా అభిప్రాయం. ఈ పురస్కారానికి నేను పూర్తి అర్హుడిని కాదనిపిస్తోంది. ఆలియాకు అయితే తన కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించింది. ఏదైనా అవార్డు వచ్చిందంటే హమ్మయ్య మా సినిమాకు మంచి రిజల్స్ వచ్చింది అని హ్యాపీగా ఫీలవుతాం. మరో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేవరకు ఏ టెన్షన్ లేకుండా ఉంటాం' అని చెప్పుకొచ్చాడు. ఇటీవలి కాలంలో తనకు బాగా నచ్చిన పర్ఫామెన్స్‌ల గురించి చెప్తూ పుష్పలో అల్లు అర్జున్, గంగూబాయి కఠియావాడిలో ఆలియా అలాగే ఆర్ఆర్ఆర్లో రాజమౌళి పనితనం తనను బాగా ఆకట్టుకున్నాయన్నాడు. కాగా బ్రహ్మాస్త్ర గతేడాది సెప్టెంబర్ 9న రిలీజై సూపర్ హిట్ సాధించింది. Icon star @alluarjun performance in #Pushpa impacted me a lot as an audience & an actor - #RanbirKapoorpic.twitter.com/xX96TwiQc3 — Bunny - Youth Icon Of India (@BunnyYouthIcon) February 22, 2023 చదవండి: వేరొకరితో ఎంగేజ్మెంట్.. మాజీ ప్రియుడిచ్చిన నగలు మాత్రం.. -
DPIFF Awards 2023: ఉత్తమ నటుడు రణ్‌బీర్, నటి అలియా.. ఆర్ఆర్ఆర్కు అవార్డు
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ ఖాతాలో మరో అరుదైన అవార్డు చేరింది. చలన చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘దాదా సాహేబ్ ఫాల్కే ఇంటర్నెషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’లో బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా అవార్డు సొంతం చేసుకుంది. పలువురు సినీ తారల సమక్షంలో సోమవారం రాత్రి ముంబైలో దాదా సాహేబ్ ఫాల్కే ఇంటర్నెషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది. ఈ సందర్భంగా విజేతలను ప్రకటించి అవార్డులు అందజేశారు. View this post on Instagram A post shared by Dadasaheb Phalke -DPIFF Awards (@dpiff_official) ‘కాంతార’సినిమాలో నటనకు గాను కన్నడ హీరో రిషబ్ శెట్టికి మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్‌గా అవార్డు దక్కించుకున్నారు. ఉత్తమ చిత్రంగా ‘ది కశ్మీర్ ఫైల్స్’.. ఉత్తమ నటుడిగా రణ్‌బీర్ కపూర్(బ్రహ్మాస్త్ర), ఉత్తమ నటిగా అలియా భట్(గంగూబాయి కాఠియావాడి) అవార్డులను పొందారు. ఇక 2023 సంవత్సరానికి గాను దాదా సాహెబ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డును ప్రముఖ నటి రేఖ అందుకున్నారు. టెలివిజన్ రంగంలో ఉత్తమ నటుడిగా జైన్ ఇమాన్ ఉత్తమ నటిగా తేజస్వీ ప్రకాశ్ అవార్డులు అందుకోగా.. వెబ్ సిరీస్ విభాగంలో బెస్ట్ వెబ్‌సీరీస్‌గా రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్, ఉత్తమ నటుడు జిమ్ సార్బ్(రాకెట్ బాయ్స్) అవార్డుల పొందారు. దాదా సాహేబ్ ఫాల్కే ఇంటర్నెషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ విజేతలు వీరే ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ : ఆర్ఆర్ఆర్ ఉత్తమ చిత్రం: ది కశ్మీర్ ఫైల్స్ ఉత్తమ దర్శకుడు: ఆర్. బాల్కి(చుప్: ది రివెంజ్ ఆఫ్ ఆర్టిస్ట్) ఉత్తమ నటుడు: రణ్‌బీర్ కపూర్(బ్రహ్మాస్త్ర-1) మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్: రిషబ్ శెట్టి(కాంతార) ఉత్తమ నటి: అలియా భట్(గంగూబాయి కాఠియావాడి) మోస్ట్ వర్సటైల్ యాక్టర్: అనుపమ్ ఖేర్ క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ : వరుణ్ ధావన్(బేడియా) క్రిటిక్స్ ఉత్తమ నటి: విద్యాబాలన్(జల్సా) బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్: సాచిత్ తాండన్) -
ఓ పెద్ద కథ ..రెండు సినిమాలు
అన్ని సినిమాలకూ కథ ఉంటుంది. కొన్ని సినిమాలకు పెద్ద కథ ఉంటుంది. అయితే ఆ పెద్ద కథని రెండున్నర గంటల్లో చూపించలేరు. అందుకే రెండు మూడు భాగాలుగా చూపిస్తారు. అలా ఈ ఏడాది ఇటు సౌత్ అటు నార్త్‌లో ‘పార్ట్ 2’ సినిమాలు చాలానే రానున్నాయి. తొలి భాగం విడుదలై, ఘనవిజయం సాధించిన నేపథ్యంలో మలి భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక కొన్ని చిత్రాలైతే తొలి, మలి భాగం రెండూ ఆన్సెట్స్లో ఉన్నాయి. ఈ చిత్రాల గురించి తెలుసుకుందాం. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఈ చిత్రం తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ 2021 డిసెంబరులో రిలీజై సూపర్‌హిట్ అయింది. దీంతో మలి భాగం ‘పుష్ప: ది రైజ్’పై మరింత ఫోకస్ పెట్టింది ఈ టీమ్. ఈ సినిమా షూటింగ్ వైజాగ్‌లో జరుగుతోంది. ‘పుష్ప: ది రూల్’ను ఈ ఏడాదే రిలీజ్ చేయా లనుకుంటున్నారు. మరోవైపు మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన హిస్టారికల్ ఫిల్మ్ ‘పొన్నియిన్ సెల్వన్’. విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రం తొలి భాగం గత ఏడాది సెప్టెంబరులో విడుదలై ఘనవిజయం సాధించింది. ఆల్రెడీ షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న రెండో భాగం ఈ ఏడాది ఏప్రిల్ 28న విడుదల కానుంది. అలాగే తమిళంలో ‘వడ చెన్నై’, ‘అసురన్’ వంటి సూపర్ హిట్స్‌ను అందించిన దర్శకుడు వెట్రిమారన్ ప్రస్తుతం ‘విడుదలై’ అనే సినిమాను తీస్తున్నారు. విజయ్ సేతుపతి, సూరి హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. రెండు భాగాలకు సంబంధించిన మేజర్ షూటింగ్ పూర్తయింది. మొదటి భాగాన్ని ఈ ఏడాది వేసవిలో, రెండో బాగాన్ని ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలనుకుంటున్నారు. అదే విధంగా మరో తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కించిన తమిళ చిత్రం ‘వెందు తనిందదు కాడు’ (తెలుగులో ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు) చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగం గత ఏడాది సెప్టెంబరులో విడుదలైంది. మలి భాగం రిలీజ్‌పై త్వరలో ఓ స్పష్టత రానుంది. అదే విధంగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలోనే విక్రమ్ హీరోగా ‘ధృవనక్షత్రం’ అనే సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందకు రానుందని కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. తొలి భాగాన్ని ఈ ఏడాదిలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అటు మలయాళంలో ‘రామ్’ రెండు భాగాలుగా రూపొందుతోంది. మోహన్‌లాల్‌కు ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ వంటి హిట్స్‌ను అందించిన జీతూ జోసెఫ్ ఈ సినిమాకు దర్శకుడు. సౌత్‌లోనే కాదు నార్త్‌లోనూ ఈ ట్రెండ్ కనిపిస్తోంది. రణ్‌బీర్ కపూర్ హీరోగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. ట్రయాలజీగా ఈ సినిమాను తీస్తున్నారు. తొలి భాగం విడుదలైన విషయం తెలిసిందే. మలి భాగం త్వరలోనే సెట్స్‌కి వెళ్లనుంది. అలాగే జాన్ అబ్రహాం హీరోగా రూపొందిన ‘ఎటాక్’ తొలి భాగం గత ఏడాది ఏప్రిల్‌లో రిలీజైంది. మలి భాగం రెడీ అవుతోంది. ఇవే కాదు.. రెండు భాగాల చిత్రాలు కొన్ని సెట్స్‌లో, ఇంకొన్ని చర్చల దశల్లో ఉన్నాయి. ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ కె’, ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ‘సలార్’ చిత్రాలు చేస్తున్నారు ప్రభాస్. ఈ చిత్రాలు రెండు భాగాలుగా విడుదల కానున్నాయని టాక్. అలాగే హీరో ఎన్టీఆర్, దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్లో ఓ సినిమా ఉందనే టాక్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుందని, తొలి భాగంలో ఎన్టీఆర్ హీరోగా, రెండో భాగంలో ధనుష్ హీరోగా కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక సూర్య హీరోగా శివ డైరెక్షన్లో రూపొందుతున్న చిత్రం కూడా రెండు భాగాలుగా వస్తుందని టాక్. ఇంకా బాలీవుడ్ నిర్మాతలతో కలిసి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, రామాయణం ఆధారంగా ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా రెండు భాగాలు రానుందని టాక్. -
బ్రహ్మాస్త్ర 2 లో యశ్.. కరణ్ జోహార్ క్లారిటీ
-
గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేసిన సినిమాలు ఇవే..!
-
గూగుల్ సెర్చ్‌లో ఆ సినిమానే టాప్.. ఆర్ఆర్ఆర్ ఎక్కడంటే?
బాలీవుడ్ జంట అలియా భట్, రణ్‌బీర్ కపూర్ జంటగా తెరకెక్కిన చిత్రం 'బ్రహ్మస్త్ర-పార్ట్ 1'. ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్, మౌని రాయ్ ప్రత్యేక పాత్రల్లో నటించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది. విజువల్ వండర్‌గా ఈ సినిమా పలు రికార్డులు సాధించింది. అయితే ఈ ఏడాది అత్యధికంగా గూగుల్‌లో వెతికిన చిత్రంగా నిలిచింది. కేజీఎఫ్- 2, ది కాశ్మీర్ ఫైల్స్, కాంతారను వెనక్కినెట్టి 2022లో అత్యధికంగా గూగుల్ సెర్చ్ చేసిన భారతీయ చిత్రంగా రికార్డు సాధించింది. గూగుల్ సెర్చ్ ఇంజిన్ 'ఇయర్ ఇన్ సెర్చ్ 2022'ని ఆవిష్కరించింది. ఈ ఏడాది 11 నెలల్లో ఎక్కువగా ట్రెండింగ్‌లో ఉన్న జాబితాను ప్రకటించింది. అధిక బడ్జెట్‌తో తెరకెక్కిన ఫాంటసీ అడ్వెంచర్ మూవీ రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ జాబితాలో రెండోస్థానంలో కేజీఎఫ్-2, మూడో స్థానంలో ది కశ్మీర్ ఫైల్స్, నాలుగో స్థానంలో ఆర్ఆర్ఆర్, ఐదో స్థానంలో కాంతార నిలిచాయి. ఆ తరువాత వరుసగా పుష్ప-ది రైజ్, విక్రమ్, లాల్ సింగ్ చద్ధా, దృశ్యం-2, థోర్-లవ్ అండ్ థండర్ సినిమాలు ఉన్నాయి. అల్లు అర్జున్ హిట్ మూవీ పుష్ప: ది రైజ్ గతేడాది విడుదలైనప్పటికీ 2022లోనూ ఆధిపత్యం చెలాయించింది. మొదటి పది స్థానాల్లో దక్షిణాదికి చెందిన ఐదు చిత్రాలు ఉండగా.. కేవలం నాలుగు హిందీ చిత్రాలు మాత్రమే చోటు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. -
బ్రహ్మాస్త్ర- 2లో విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ క్లారిటీ ఇదే..!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ బ్రహ్మస్త్ర. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించారు. ఈ సినిమా బాక్సాపీస్ వద్ద సక్సెస్ సాధించింది. సెప్టెంబర్ 9న పాన్ ఇండియా స్థాయిలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషించారు. కరణ్ జోహార్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం ఓటీటీలో ఈ చిత్రం సందడి చేస్తోంది. (చదవండి: ఓటీటీకి వచ్చేసిన బ్రహ్మాస్త్ర మూవీ, అక్కడ అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్) అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా నిర్మించడమే కాకుండా. రెండు భాగాలుగా తీసుకొస్తున్నట్లు అయాన్ ముఖర్జీ గతంలోనే ప్రకటించారు. త్వరలోనే బ్రహ్మస్త్ర పార్ట్-2 షూటింగ్ పనులను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. బ్రహ్మాస్త్ర పార్ట్ -2పై సోషల్ మీడియాలో పలు రకాల రూమర్లు వచ్చాయి. ముఖ్యంగా ఈ సినిమాలో దేవ్ పాత్రలో పలువురు హీరోలు నటించబోతున్నారని వార్తలు హల్చల్ చేశాయి. దేవ్ పాత్రలో రణవీర్, యశ్, హృతిక్ రోషన్ వంటి హీరోలు నటిస్తున్నారని ఇప్పటికే ఎంతో మంది పేర్లు బయటకు వచ్చాయి. తాజాగా చిత్ర నిర్మాత కరణ్ జోహార్ విజయ్ దేవరకొండ పేరును సూచించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. లైగర్ హీరో విజయ్ దేవరకొండను బ్రహ్మాస్త్ర-2లో తీసుకోవడానికి నిర్మాత ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తలపై డైరెక్టర్ అయాన్ ముఖర్జీ స్పందించారు. బ్రహ్మాస్త్ర సినిమాలో దేవ్ పాత్రపై వస్తున్న హైప్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇటీవల హృతిక్, రణవీర్, యశ్ నటిస్తున్నారని వార్లలొచ్చాయి. అందుకే ఈ పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారని చెప్పిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదంటూ అయాన్ వ్యంగ్యంగా మాట్లాడారు. దేవ్ పాత్రలో ఎవరు నటిస్తారనే విషయం ఇంకా ఫైనల్ కాలేదని తెలిపారు. విజయ్ దేవరకొండ నటిస్తున్నారనే విషయంలో కూడా ఏమాత్రం వాస్తవం లేదన్నారు. డైరెక్టర్ కామెంట్స్‌తో దేవ్ పాత్రపై వస్తున్న వార్తలకు చెక్ పడింది. -
ఓటీటీకి వచ్చేసిన బ్రహ్మాస్త్ర మూవీ, అక్కడ అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్
బాలీవుడ్ క్యూట్ కపుల్ ఆలియాభట్-రణ్‌బీర్ కపూర్ జంటగా తెరకెక్కిన విజువల్ వండర్ 'బ్రహ్మస్త్ర'. ఎన్నో అంచనాల మధ్య సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా భారీ మొత్తంలో వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రాన్ని దర్శక ధీరుడు రాజమౌళి తెలుగులో సమర్పించాడు. బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ ‘కింగ్’ నాగార్జున, మౌనీ రాయ్‌లు కీలకలు పాత్రలు పోషించిన బ్రహ్మస్త్ర ఇప్పుడు ఓటీటీకి వచ్చేసింది. ఇప్పటికే ఈమూవీ ఓటీటీ రైట్స్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ భారీ ఢీల్కు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: ‘జాతిరత్నాలు’ డైరెక్టర్‌కు అరుదైన వ్యాధి, అప్పుడు మెదడు పని చేయదట! నవంబర్ 4న ఈ చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకువస్తున్నట్లు హాట్‌స్టార్ ఇటీవల అధికారిక ప్రకటన ఇచ్చింది. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి నుంచి ఈ మూవీని అందుబాటులోకి తీసుకువచ్చింది. కేవలం హిందీలోనే కాదు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ ప్రస్తుతం డిస్నీ ప్లజ్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. సెప్టెంబర్ 9న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ మూవీ దేశవ్యాప్తంగా రూ. 270 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రాన్ని పూర్తిగా 5 భాగాలుగా రూపొందించనున్నట్లు గతంలో డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెలిపాడు. ఇందులో మొదటి పార్ట్ శివ పేరుతో రిలీజ్ అయి సూపర్ హిట్‌గా నిలిచింది. త్వరలోనే ఈ మూవీ సెకండ్ పార్ట్ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుందట. చదవండి: ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టి నటించిన తెలుగు మూవీ తెలుసా? -
బ్రహ్మస్త్ర-2లో కేజీఎఫ్ హీరో.. కరణ్ జోహార్ క్లారిటీ..!
కేజీఎఫ్ హీరో యశ్ పరిచయం అక్కర్లేని పేరు. అంతలా పేరు తీసుకొచ్చింది. రాఖీభాయ్‌గా యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ సినిమా తర్వాత యశ్ తన తర్వాత ప్రాజెక్టులపై ఎలాంటి ప్రకటనలు చేయలేదు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరలవుతోంది. బాలీవుడ్‌కు ప్రముఖ నిర్మాతలు యశ్‌ను సంప్రదించారన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటికే ఆయనకు బాలీవుడ్ ఆఫర్లు వచ్చాయని టాక్. కరణ్ జోహార్ తెరకెక్కిస్తున్న బ్రహ్మస్త్ర- పార్ట్2 కోసం యశ్‌ను సంప్రదించారని నెట్టింట్లో వైరలైంది. అయితే ఈ విషయంపై బ్రహ్మస్త్ర నిర్మాత కరణ్ జోహార్ స్పందించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. బ్రహ్మాస్త్ర- 2లో దేవ్ పాత్రలో నటించడానికి హృతిక్ రోషన్ మొదటి ఎంపిక అని కరణ్ వెల్లడించారు. మీడియాలో వచ్చిన వార్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 'ఇవన్నీ చెత్త.. ఆ పాత్ర కోసం మేము ఎవరినీ సంప్రదించలేదు' అని కొట్టిపారేశారు. బాలీవుడ్ దర్శకుడు రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా మహాభారతం ఆధారంగా ‘కర్ణ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమాలో ప్రధాన పాత్ర కోసం యశ్‌ను సంప్రదించారని మరో టాక్. ఇది ఎంతవరకు నిజమో అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. -
ఇంటింటికీ వెళ్లి చెప్పాలా? నాకు వేరే లైఫే లేదా?: హీరో
స్టార్ జంట రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ సెప్టెంబర్ 9న విడుదలైంది. విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.425 కోట్లు రాబట్టింది. థియేటర్లలో సందడి చేసిన బ్రహ్మాస్త్ర నవంబర్ 4 నుంచి హాట్స్టార్లోకి రాబోతోంది. సినిమా రిలీజ్‌కు ముందే ప్రమోషన్ల మీద ప్రమోషన్లు చేసింది చిత్రయూనిట్. ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌కు కూడా ప్రమోషన్స్ చేయడం నావల్ల కాదంటున్నాడు రణ్‌బీర్. ఈ మేరకు ఓ వీడియోను ఆలియా భట్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో హీరో ఓ ఫోన్‌కాల్ మాట్లాడుతూ.. 'ఇక నా వల్ల కాదు బ్రదర్. బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ చేసేశాం కదా! అయాన్ ముఖర్జీతో కూడా పనైపోయింది. ఇప్పుడేమంటావ్.. బ్రహ్మాస్త్ర హాట్‌స్టార్‌లో వస్తుందా? అంటే మళ్లీ ప్రమోషన్లు చేయాలా? సినిమాలో కూడా ఆలియా అన్నిసార్లు శివ శివ అని స్మరించలేదేమో.. ప్రతి ఈవెంట్లో కేసరియా(కుంకుమలా నువ్వు..) పాట పాడి ఆమె గొంతు పోయింది. పదేపదే స్టేజీ మీద డ్యాన్స్ చేసీ చేసీ నేనూ ఓ దెయ్యంలా మారిపోతున్నా.. బ్రహ్మాస్త్ర లోగో లాంచ్ చేసినప్పుడు 150 డ్రోన్లతో స్వీట్లు పంచాం. ఇంకా ఏం చేయాలి? ఇంటింటికీ వెళ్లి సోదరసోదరీమణులారా.. హాట్‌స్టార్‌లో బ్రహ్మాస్త్ర రాబోతోంది, దయచేసి చూడండి అని అడగాలా? అసలు అయాన్ ఏమనుకుంటున్నాడు? నాకు బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ కాకుండా వేరే జీవితమే లేదనుకుంటున్నాడా? నేను త్వరలో తండ్రిని కాబోతున్నాను, అది నా జీవితంలోనే గొప్ప విషయం' అని చెప్పుకొచ్చాడు. ఇలా మాట్లాడుతున్న సమయంలో డైరెక్టర్ అయాన్ నుంచి ఫోన్ కాల్ రావడంతో లిఫ్ట్ చేసిన రణ్‌బీర్.. 'హేయ్ అయాన్.. తప్పకుండా చేద్దాం. ప్రమోషన్స్ చేసి తీరాల్సిందే. ప్రతి ఒక్కరూ బ్రహ్మాస్త్ర చూడాలి' అంటూ ప్రమోషన్స్ చేసేందుకు రెడీ అయిపోయాడు. View this post on Instagram A post shared by Alia Bhatt 🤍☀️ (@aliaabhatt) -
అఫీషియల్: ఓటీటీలోకి బ్రహ్మాస్త్ర, ఎప్పటినుంచంటే?
స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, హీరోయిన్ ఆలియా భట్ జంటగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ తెలుగులో బ్రహ్మాస్త్రం పేరుతో రిలీజైంది. ఇందులో నాగిని నటి మౌనీరాయ్, కింగ్ నాగార్జున, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదలై భారీ విజయం అందుకున్న ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం హాట్‌స్టార్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే! ఈ సినిమా నవంబర్ 4 నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి రానున్నట్లు హాట్‌స్టార్ అధికారికంగా ప్రకటించింది. మరింకే, థియేటర్లో ఈ సినిమా చూడటం మిస్ అయినవాళ్లు వచ్చే నెల 4వ తారీఖు నుంచి హాట్‌స్టార్‌లో ఎప్పుడైనా చూసేయండి! The World of Ancient Indian Astras is coming to Disney+ Hotstar on November 4. #BrahmastraOnHotstar pic.twitter.com/chmZBI6grk — Disney+ Hotstar (@DisneyPlusHS) October 23, 2022 చదవండి: ఉదయ్ కిరణ్‌తో ఐదు సినిమాలకు సంతకం చేశా: పింకీ పవిత్ర నరేశ్ బ్రేకప్ -
‘బ్రహ్మాస్త్ర’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! ఆ రోజు నుంచి స్ట్రీమింగ్..
బాలీవుడ్ క్యూట్ కపుల్ ఆలియాభట్-రణ్‌బీర్ కపూర్ జంటగా తెరకెక్కిన విజువల్ వండర్ 'బ్రహ్మస్త్ర'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ మొత్తంలో వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా బ్రహ్మస్త్రం పేరుతో తెలుగులోనూ విడుదలైన సంగతి తెలిసిందే. బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, మౌనీ రాయ్ కీలకపాత్రలు పోషించారు. చదవండి: సుకుమార్-దేవిశ్రీ మధ్య రెమ్యునరేషన్ చిచ్చు! అసలేం జరిగింది? భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ త్వరలోనే ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దీపావళి సందర్భంగా బ్రహ్మస్త్ర మూవీ వచ్చేవారంలో ఓటీటీలోకి రానుంది. అక్టోబర్ 23 నుంచి ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుందని సినీవర్గాల నుంచి సమాచారం. త్వరలోనే దీనిపై హాట్‌స్టార్ అధికారిక ప్రకటన కూడా ఇవ్వనుందని తెలుస్తోంది. -
ప్రస్తుతం బాలీవుడ్ కన్ను ఈ ట్రయాలజీపైనేనా?
ఫ్రాంచైజీ, రీమేక్స్, బయోపిక్స్ ట్రెండ్ల తర్వాత బాలీవుడ్ ప్రస్తుతం ట్రయాలజీ (ఒకే కథను మూడు భాగాలుగా) ట్రై చేస్తోంది. అరడజను ట్రయాలజీ ఫిలింస్ వెండితెరపైకి రానున్నాయి. ఆ ‘ట్రైయాలజీ’ చిత్రాల వివరాల్లోకి వెళితే... బ్రహ్మాస్త్రం ఐదేళ్లుగా సినీ లవర్స్ ‘బ్రహ్మాస్త్ర’ ట్రయాలజీ గురించి వింటూనే ఉన్నారు. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా, అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీరాయ్ కీలక పాత్రల్లో ‘బ్రహ్మాస్త్ర’ ట్రయాలజీలోని తొలి భాగం ‘బ్రహ్మాస్త్ర: శివ’ రూపొందింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమా దక్షిణాది వెర్షన్‌కు రాజమౌళి సమర్పకులుగా ఉండటం విశేషం. ఈ ఏడాది సెప్టెంబరు 9న ఈ చిత్రం విడుదలైంది. ఇప్పుడు ‘బ్రహ్మాస్త్ర’ రెండు, మూడు భాగాలపై ఫోకస్ పెట్టారు మేకర్స్. రెండో భాగంలోని ప్రధాన పాత్రల కోసం హృతిక్‌రోషన్ , రణ్వీర్ సింగ్, దీపికా పదుకోనె పేర్లు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇతిహాసాల ఆధారంగా...! ట్రయాలజీ ఫిలింస్ తీసేంత స్కోప్ రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలకు ఉంది. ఆల్రెడీ బాలీవుడ్ ప్రముఖ దర్శకులు నితీష్ తివారి, రవి ఉడయార్లు కలిసి రామాయణం ఆధారంగా ఓ ట్రయాలజీని ప్లాన్ చేశారు. అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రా వంటి అగ్ర నిర్మాతలు ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు. దాదాపు ఏడాదిన్నరగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇక ఈ ప్రాజెక్ట్‌లో ప్రధాన పాత్రధారులుగా మహేశ్‌బాబు, రామ్‌చరణ్, హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ వంటి స్టార్ల తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే మహాభారతంలోని అశ్వత్థామ పాత్ర ఆధారంగా హిందీలో ఓ ట్రయాలజీ రూపుదిద్దుకోనుంది. ‘ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ అనే టైటిల్‌ను కూడా ప్రకటించారు. విక్కీ కౌశల్ టైటిల్ రోల్ చేయనున్న ఈ చిత్రానికి అదిత్య థార్ దర్శకత్వం వహిస్తారు. అలాగే ‘మహాభారతం’ ఆధారంగా సింగపూర్‌కు చెందిన కృష్ణ ఉదయశంకర్ రాసిన ‘ది ఆర్యావతార క్రానికల్స్’ (గోవింద, కౌరవ, కురుక్షేత్ర) పుస్తకం హక్కులను సోనమ్ కపూర్ దక్కించు కున్నారు. ‘ది ఆర్యావతార క్రానికల్స్’ను ట్రయాలజీగా నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు సోనమ్ పేర్కొన్నారు. ఇంకా ‘మహాభారతం’ ఆధారంగా ఓ సినిమా చేయాలన్నది తన డ్రీమ్ అని దర్శకుడు రాజమౌళి పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కూడా ట్రయాలజీనే అనే వార్తలు వినిపిస్తున్నాయి. కొత్త నాగిని వెండితెరపై నాగిని అనగానే హిందీలో శ్రీదేవి, రీనా రాయ్, రేఖ గుర్తుకు వస్తారు. ఈ జాబితాలో హీరోయిన్ శ్రద్ధా కపూర్ పేరు చేరనుంది. ‘నాగిని’ ట్రయాలజీలో నటించేందుకు శ్రద్ధా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విశాల్ ఫురియా దర్శకత్వంలో ఈ ట్రయాలజీని నిఖిల్ ద్వివేది నిర్మించనున్నారు. ఛత్రపతి మహావీరుడు ఛత్రపతి శివాజీ జీవితంతో ఓ ట్రయాలజీని నిర్మించనున్నట్లు నటుడు, నిర్మాత రితేష్ దేశ్‌ముఖ్ రెండేళ్ల క్రితం ప్రకటించారు. ఈ ట్రయాలజీని తెరకెక్కించేందుకు మరాఠీ దర్శకులు ‘సైరట్’ ఫేమ్ నాగరాజ్ మంజులే, రవీంద్ర జాదవ్‌ల పేర్లు తెరపైకి వచ్చాయి. శక్తిమాన్ ఇక బుల్లితెర, వెండితెర సూపర్ హీరోస్‌లలో శక్తిమాన్‌కు ఆడియన్స్‌లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సూపర్ హీరో క్రేజ్‌ను క్యాష్ చేసుకునే దిశలో ఇప్పటికే పలువురు నిర్మాతలు సినిమాలు తీశారు. తాజాగా అగ్ర నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ‘శక్తిమాన్’ టైటిల్‌తో ఓ సినిమాను ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించింది. ట్రయాలజీగా రూపొందించేందుకు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని, టైటిల్ రోల్లో రణ్వీర్ సింగ్ కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇవే కాదు.. మూడు భాగాల చిత్రాలు మరికొన్ని తెరపైకి వచ్చే చాన్స్ ఉంది. -
బ్రహ్మస్త్ర సాంగ్.. ఆ డిలీటెడ్ సీన్ మీరు చూశారా?
ఆలియాభట్, రణ్‌బీర్ కపూర్ జంటగా బాలీవుడ్లో విజువల్ వండర్‌గా తెరకెక్కిన చిత్రం 'బ్రహ్మాస్త్ర'. సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. మొదట ఈ సినిమాపై నెగెటివ్ టాక్ వచ్చినా ఆ తర్వాత కలెక్షన్లతో దూసుకెళ్లింది. దాదాపు ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తాజాగా ఈ చిత్రంలోని ఓ వీడియో సాంగ్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ వీడియోలో డిలీటెడ్ సీన్ కూడా ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అలియా భట్ ఇన్‌స్టా వేదికగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ సాంగ్‌లో అలియా భట్, రణబీర్ కపూర్ మధ్య 'తొలగించబడిన సీన్' చూసి చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటను ప్రముఖ గాయకులు శ్రేయా ఘోషల్, తుషార్ జోషి ఆలపించారు. ఆ సీన్లో ఆలియా చెవిపోగులతో నారింజ రంగు దుస్తులను ధరించి కనిపించింది. ఈ చిత్ర నిర్మాత కరణ్ జోహార్ ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడంచారు. ఈ సినిమాలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, మౌనీ రాయ్ కీలకపాత్రలు పోషించారు. For when love cannot be explained in words, you’ll have #RasiyaReprise. Video out now. ❤️https://t.co/4PyPh95zbl#Brahmastra — BRAHMĀSTRA (@BrahmastraFilm) October 7, 2022 View this post on Instagram A post shared by Alia Bhatt 🤍☀️ (@aliaabhatt) -
బ్రహ్మస్త్ర కలెక్షన్లపై దర్శకుడు క్లారిటీ.. 25 రోజుల్లోనే..!
ఆలియాభట్, రణ్‌బీర్ కపూర్ జంటగా బాలీవుడ్లో విజువల్ వండర్‌గా తెరకెక్కిన చిత్రం 'బ్రహ్మాస్త్ర'. సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. మొదట ఈ సినిమాపై నెగెటివ్ టాక్ వచ్చినా ఆ తర్వాత కలెక్షన్లతో దూసుకెళ్లింది. దాదాపు ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, మౌనీ రాయ్ కీలకపాత్రలు పోషించారు. ( చదవండి: ఓటీటీకి 'బ్రహ్మస్త్ర' .. అప్పుడేనా?) అయితే ఈ సినిమా కలెక్షన్లపై కాస్త గందరగోళం ఏర్పడింది. తాజాగా ఈ మూవీ సాధించిన కలెక్షన్లపై దర్శకుడు అయాన్ ముఖర్జీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తన ఇన్‌స్టాలో రాస్తూ ' 2022లో ప్రపంచవ్యాప్తంగా నంబర్ వన్‌గా నిలిచిన హిందీ మూవీ. ఇందుకు మీ అందరికి ధన్యవాదాలు. హ్యాపీ నవమి' అంటూ క్యాప్షన్‌తో కలెక్షన్ల వివరాలతో ఓ కొత్త పోస్టర్‌ను పోస్ట్ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా 25 రోజుల్లో బ్రహ్మాస్త్ర రూ.425 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టిందని పోస్టర్లో తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా భూల్ భులయ్యా 2, ది కశ్మీర్ ఫైల్స్ సినిమాల కలెక్షన్ల కంటే ఎక్కువ మొత్తం బ్రహ్మాస్త్రకు వచ్చినట్లు అయాన్ వెల్లడించాడు. అయితే ఈ సినిమా చిత్రీకరణ సమయంలో బడ్జెట్ అనూహ్యంగా పెరిగినట్లు చెప్పారు అయాన్ ముఖర్జీ. View this post on Instagram A post shared by Ayan Mukerji (@ayan_mukerji) -
ఓటీటీకి 'బ్రహ్మస్త్ర' .. అప్పుడేనా?
బాలీవుడ్ ప్రేమజంట ఆలియాభట్, రణ్‌బీర్ కపూర్ జంటగా తెరకెక్కిన విజువల్ వండర్ 'బ్రహ్మస్త్ర'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా భారీ మొత్తంలో వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా బ్రహ్మస్త్రం పేరుతో తెలుగులోనూ విడుదలైంది. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, మౌనీ రాయ్ కీలకపాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకొచ్చింది. (చదవండి: దసరా సెలవుల్లో బ్రహ్మస్త్ర బంపర్ ఆఫర్.. థియేటర్లలో రూ.100 కే చూడొచ్చు) తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌పై టాక్ నడుస్తోంది. ఈ సినిమా అక్టోబర్‌లోనే స్ట్రీమింగ్ రానున్నట్లు సమాచారం. అక్టోబర్ రెండో వారంలో వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే బ్రహ్మస్త్రను చూడాలనుకుంటున్న అభిమానులకు పండగే. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ డిస్నీ+హాట్ స్టార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. -
దసరా సెలవుల్లో బ్రహ్మస్త్ర బంపర్ ఆఫర్.. థియేటర్లలో రూ.100 కే చూడొచ్చు
బాలీవుడ్లో బాక్సాఫీస్ వద్ద రికార్డుస్థాయిలో వసూళ్లు రాబట్టిన చిత్రం 'బ్రహ్మస్త్ర'. బాలీవుడ్ ప్రేమజంట రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్ నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఇటీవలే వరల్ట్ వైడ్ రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సినిమాల క్లబ్లో చేరింది. ఈ సినిమాను మిస్సవుతున్న వారి కోసం చిత్ర యూనిట్ సరికొత్త ప్లాన్‌తో ముందుకొచ్చింది. ఇప్పటికే ఈనెల 23న మల్టీప్లెక్స్‌ల్లో కేవలం రూ.75 కే సినిమా చూడవచ్చని బంపర్ ఆఫర్ ప్రకటించింది. దీంతో ప్రేక్షకుల నుంచి ఒక్కసారిగా ఊహించని రీతిలో స్పందన వచ్చింది. తాజాగా దసరా సెలవుల్లోనూ మరో బంపర్ ఆఫర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఈనెల 29 వరకు కేవలం రూ.100 కే మల్టీప్లెక్స్‌ల్లో సినిమా చూడవచ్చని చిత్ర యూనిట్ ప్రకటించింది. దసరా సెలవులను కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేసే వారికి ఈ ఆఫర్ మంచి సువర్ణావకాశం. ఇంకేముంది కుటుంబ సమేతంగా బ్రహ్మస్త్రను చూసేయండి. (చదవండి: ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మస్త్ర రికార్డ్.. తొలివారం ఎన్ని కోట్లంటే..!) బాలీవుడ్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఈ చిత్రం బ్రహ్మస్త్రం పేరుతో తెలుగులో విడుదలైంది. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, మౌనీ రాయ్ కీలకపాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. Celebrate Navratri with #Brahmastra! Enjoy this visual spectacle on big screens for just Rs. 100 + GST from 26th September to 29th September. Book your tickets now! BMS - https://t.co/qjPVPFdZfT Paytm - https://t.co/eVmK21uC8n T&C Apply* pic.twitter.com/vz7Du38dUG — BRAHMĀSTRA (@BrahmastraFilm) September 25, 2022 -
బ్రహ్మాస్త్రకు వారిద్దరు రెమ్యునరేషన్ తీసుకోలేదా.. అందులో నిజమెంత?
బాలీవుడ్ రొమాంటిక్ జోడీ ఆలియాభట్, రణ్‌బీర్ కపూర్ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'బ్రహ్మాస్త్ర'. ఇటీవల విడుదలైన చిత్రం బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సాధించింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనిరాయ్ కీలక పాత్రల్లో పోషించారు. అయితే ఈ సినిమా బడ్జెట్, కలెక్షన్స్ విషయంలో పలు రకాల వదంతులు వ్యాపించాయి. ఈ సినిమా బడ్జెట్ పెరిగడంతో.. అలియాభట్, రణ్‌బీర్ కపూర్ రెమ్యునరేషన్ తీసుకోలేదనే రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై తాజాగా సినిమా దర్శకుడు అయాన్ ముఖర్జీ క్లారిటీ ఇచ్చారు. అయాన్ ముఖర్జీ మాట్లాడుతూ ‘చాలా మంది త్యాగాలతో ఈ చిత్రాన్ని నిర్మించాం. ఈ సినిమాలో నటించినందుకు రణ్‌బీర్ ఎలాంటి డబ్బులు తీసుకోలేదు. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. అలియాభట్ ఈ ప్రాజెక్టులో 2014లో జాయినైంది. ఆమెకు ఈ చిత్రానికి ఇచ్చిన పారితోషికం ప్రస్తుతం తాను తీసుకుంటున్న దానికి చాలా తక్కువ. మేం సినిమా పూర్తి చేసే సమయానికి అలియా కూడా ఈ చిత్రంలో భాగమైంది’ అని అన్నారు. (చదవండి: బిగ్‌బాస్ షో.. ఆ స్టార్ హీరో పారితోషికం భారీగా తగ్గనుందా..!) రెమ్యునరేషన్‌పై వస్తున్న వార్తలపై రణ్‌బీర్ కపూర్ కూడా స్పష్టత ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘ నిజానికి నేను బ్రహ్మాస్త్ర మొదటి భాగానికి పారితోషికం తీసుకోలేదు. ఎందుకంటే నేను ఈ చిత్రానికి నిర్మాతను కూడా. కానీ నేను అంతకు మించి పొందాను. ఈ సినిమాను మూడు భాగాలుగా తీయగలమనే నమ్మకం ఉంది. ఒక నటుడిగా నేను ఇంతకంటే పొందగలిగేది ఏముంటుంది. ఈ సినిమా నుంచి చాలా నేర్చుకున్నాను’’ అని అన్నారు. " -
మూవీ లవర్స్‌కి బంపర్ ఆఫర్.. 75 రూపాయలకే సినిమా చూడొచ్చు
మూవీ లవర్స్‌కి గుడ్‌న్యూస్. మల్టీప్లెక్సుల్లో కేవతం 75 రూపాయలకే సినిమా చూసే ఛాన్స్ రాబోతుంది. సాధారణంగా మల్టీప్లెక్సుల్లో 250 నుంచి 400వరకు( పెద్ద సినిమాలకు) టికెట్ రేటు ఉంటుంది. సెప్టెంబర్ 23న జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) ఈ అవకాశం కల్పిస్తోంది. దీంతో ఆ ఒక్కరోజు అన్ని మల్టీప్లెక్స్‌లలో రూ.75కే అన్ని సినిమాలు చూడొచ్చు. అన్ని ప్రధాన నగరాల్లోని PVR, INOX, ఏషియన్ వంటి మల్టీప్లెక్స్ థియేటర్లలో ఈ డిస్కౌంట్ రేటుకే టికెట్లు లభించనున్నాయి. అయితే ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్లకు మాత్రం అదనపు చార్జీలు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం స్క్రీనింగ్ అవుతున్న భారీ బడ్జెట్ సినిమాల్లో బ్రహ్మస్త్ర ఉంది. ఆలియాభట్, రణ్‌బీర్ కపూర్ జంటగా నటించిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని 2డీతో పాటు 3డీలో వీక్షించొచ్చు. ప్రస్తుతం ఈ సినిమా టికెట్ ధర రూ. 330గా ఉంది. సో నేషనల్ మూవీ డే రోజున కేవలం 75 రూపాయలకే ఈ భారీ బడ్జెట్ మూవీని చూసే ఛాన్స్ కొట్టేయండి. -
బ్రహ్మస్త్రపై కేఆర్కే సంచలన కామెంట్స్.. ఇదొక పెద్ద..!
బాలీవుడ్ సినీ క్రిటిక్‌గా పాపులర్ అయిన కమల్ ఆర్ ఖాన్ (కేఆర్కే) బ్రహ్మాస్త్రపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల విడుదలైన రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ మూవీని తనదైన శైలిలో విమర్శించారు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కేఆర్కే మరోసారి సంచలనాత్మక ప్రకటన చేశారు. బ్రహ్మస్త్ర ఒక పెద్ద డిజాస్టర్ అని బాంబు పేల్చారు. ఈ వ్యాఖ్యలకు తనను నిందించవద్దని నిర్మాత కరణ్ జోహార్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. మరోసారి సంచలన వ్యాఖ్యలతో ఒక్కసారిగా బాలీవుడ్‌ను షేక్ చేశారాయన. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఓ పెద్ద ఫెయిల్యూర్ అని అభివర్ణించారు. బాలీవుడ్లో ఇతర సినిమాల్లాగే ఇది కూడా పెద్ద వైఫల్యమని చిత్రబృందానికి దిమ్మతిరిగే షాకిచ్చారు. కేఆర్కే సోషల్ మీడియాలో స్పందిస్తూ ' అలియా భట్, రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్ర చిత్రాన్ని నేను సమీక్ష చేయలేదు, అయినప్పటికీ ప్రజలు సినిమా చూసేందుకు థియేటర్లకు వెళ్లలేదు. అందుకే ఇదొక పెద్ద డిజాస్టర్. ఇతర బాలీవుడ్ నిర్మాతల్లాగే కరణ్ జోహార్ తన వైఫల్యానికి నన్ను నిందించరని ఆశిస్తున్నా" అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. I didn’t review film #Brahmastra still people didn’t go to theatres to watch it. So it has become a disaster. Hope @karanjohar won’t blame me for the failure like many other Bollywood people. — KRK (@kamaalrkhan) September 16, 2022 కాగా కేఆర్కే హిందీ బిగ్‌బాస్-3లో పాల్గొన్నారు. పలు హిందీ సినిమాల్లో నటించినా ఆయనకు అంతగా గుర్తింపు రాలేదు. అయితే నటీనటులపై తరచూ వివాదస్పద వ్యాఖ్యలతో ఆయన తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. బాలీవుడ్ నటులైన సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్, అమిర్ ఖాన్, షారుక్ ఖాన్ల మీద ఎప్పుడూ విమర్శలు చేస్తూ పాపులారిటీ దక్కించుకున్నారు. బాలీవుడ్ స్టార్స్‌పై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించే కేఆర్కే చుట్టూ నిత్యం వివాదాలు అల్లుకునే ఉంటాయి. 2020లోఆయన చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదమైంది. దీంతో కమల్ ఆర్ ఖాన్ (కేఆర్కే)ను గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. -
బ్రహ్మస్త్ర జంటపై రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన ఆలియా భట్
బ్రహ్మస్త్ర సక్సెస్ తర్వాత రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ మరోసారి తెరను పంచుకోనున్నారా? ఇద్దరు కలిసి మరో రొమాంటిక్ కామెడీ చిత్రంలో నటించనున్నారా? అన్న అభిమానుల సందేహాలకు తెరదించింది ఈ బాలీవుడ్ జంట. తామిద్దరం ప్రస్తుతానికి మరే చిత్రంలో నటించడం తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ ప్రకటనతో సోషల్ మీడియాలో వస్తున్న రూమర్లకు తెరదించారు. (చదవండి: ఎయిర్‌పోర్ట్‌లో బ్రహ్మస్త్ర జంట సర్ప్రైజ్.. ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్) రూమర్లపై రణ్‌బీర్ కపూర్ స్పందిస్తూ 'మా ఇద్దరి నిజ జీవితంలో సరదాగా ఉన్నాం. ప్రస్తుతానికి మేమిద్దరం మరే చిత్రంలోనూ నటించడం లేదని' అన్నారు. అయితే ఆలియాభట్ మాట్లాడుతూ నేను రూమర్ల గురించి విన్నాను. కానీ మా తరువాత చిత్రం బ్రహ్మస్త్ర పార్ట్ -2 మాత్రమేనని తేల్చేసింది. బ్రహ్మస్త్ర కాకుండా అయాన్ ముఖర్జీ ఇతర సినిమాల్లో నటించడానికి అనుమతి ఇస్తారో లేదో తెలియదని (నవ్వుతూ) చెప్పింది. పెళ్లయ్యాక రణ్‌బీర్ కపూర్, అలియా భట్ మొదటిసారిగా ఇటీవల విడుదలైన బ్రహ్మాస్త్రలో నటించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం సక్సెస్‌తో మరోసారి ఈ రొమాంటిక్ బాలీవుడ్ జంట స్క్రీన్‌ను పంచుకోనున్నట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.