"బ్రహ్మాస్త్రం" నుంచి అందమైన మెలోడీ సాంగ్‌.. | Brahmastra: Kumkumala Video Song Released | Sakshi
Sakshi News home page

Brahmastra: "బ్రహ్మాస్త్రం" నుంచి 'కుంకుమల' వీడియో సాంగ్ రిలీజ్‌

Published Sun, Jul 17 2022 5:15 PM | Last Updated on Sun, Jul 17 2022 5:18 PM

Brahmastra: Kumkumala Video Song Released - Sakshi

Brahmastra: Kumkumala Video Song Released: భారీ ఫాంటాసి యాక్షన్ ఎంటర్ టైనర్‌గా బాలీవుడ్‌లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా సినిమా "బ్రహ్మాస్త్ర". ఈ సినిమా తెలుగులో "బ్రహ్మాస్త్రం" గా రిలీజ్ కానుంది. రాక్ స్టార్ రణ్‌బీర్ కపూర్, అలియా భట్ తొలిసారి జంటగా నటిస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబచ్చన్ తో పాటు టాలీవుడ్ కింగ్ నాగార్జున, నాగిన్‌ బ్యూటీ మౌనీ రాయ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ కూడా ఈ సినిమాలో కనిపిస్తారని టాక్‌. 

ఇదివరకు ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్‌, సాంగ్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా "బ్రహ్మాస్త్రం" చిత్ర యూనిట్ "కుంకుమల" వీడియో పాటను విడుదల చేసింది. ప్రీతమ్ స్వరపరచిన ఈ గీతాన్ని "సిద్ శ్రీరామ్" ఆలపించారు.  తెలుగులో చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 9న రిలీజ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుద‌ల చేయ‌నున్నారు. తెలుగులో ఈ చిత్రానికి దర్శక దిగ్గజం రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. 

చదవండి: పిల్లలు వద్దనుకోవడంపై ఉపాసన క్లారిటీ..
అలియా భట్‌కు కవలలు ? రణ్‌బీర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

మళ్లీ పొట్టి దుస్తుల్లో రష్మిక పాట్లు.. వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement