Alia Bhatt And Ranbir Kapoor Respond On Their Wedding: బాలీవుడ్ లవ్‌బర్డ్స్ వరసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇప్పటికే విక్కీ కౌశల్-కత్రినా కైఫ్‌లు పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. అయితే ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతారాని ఎదురు చూస్తున్న ఓ స్టార్ సెలబ్రెటీ జంట మాత్రం ఇదిగో అదిగో అంటూ దాటేస్తున్నారు. వారే అలియా భట్-రణ్‌బీర్ కపూర్. వీరిద్దరూ పెళ్లి అంటూ గతేడాది నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ వారి వివాహ ముహుర్తం మాత్రం ఫిక్స్ అవ్వడం లేదు. డిసెంబర్‌లో పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి. కానీ అది కూడా పుకారుగానే మిగిపోయింది. బ్రహ్మాస్త్ర షూటింగ్ తర్వాత పెళ్లి చేసుకుంటామని రణ్‌బీర్-అలియాలే చెప్పుకొచ్చారు.
చదవండి: ఆర్టీసీ క్రాస్ రోడ్డు సంధ్య థియేటర్లో అల్లు అర్జున్ ఫ్యామిలీ సందడి
ఈ మూవీ షూటింగ్ అయిపోయింది, ఫస్ట్‌పార్ట్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. కానీ వారు ఒక్కటయ్యేది ఎప్పుడనేది స్పష్టత రావడం లేదు. దీంతో రణ్‌బీర్-అలియాల పెళ్లి సస్పెన్స్‌లో పడిపింది. ఈ క్రమంలో వారి తాజా చిత్రం బ్రహ్మాస్త్ర మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్ ఈవెంట్‌లో ఈ జంట ఫ్యాన్స్‌తో ఇంటారాక్ట్ అయ్యింది. ఈ సందర్భంగా పలువురు రణ్‌బీర్-అలియాలను అడగాలకున్న ప్రశ్నలను ఓ పేపర్‌లో రాసి ఇచ్చారు. ఈవెంట్‌లో ఆ చిట్టిలు ఓపెస్ చేసి ప్రశ్నలు చదివి వాటికి సమాధాం ఇచ్చారు ఈ లవ్‌బర్డ్స్. ఈ క్రమంలో ఓ అభిమాని నుంచి ‘మీ పెళ్లి ఎప్పుడు’ ప్రశ్న ఎదురైంది. దీనికి రణ్‌బీర్ ఆసక్తిగా స్పందించాడు. ‘ఒకే గతేడాది నుంచి పలువురు సెలబ్రెటీలు పెళ్లి చేసుకోవడం చూస్తూనే ఉన్నాం.
చదవండి: సమంత స్పెషల్ సాంగ్‌ను చుట్టుముడుతున్న వివాదాలు, తమిళంలోనూ వ్యతిరేకత
నాకు కూడా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని ఉంది. సరే మనది ఎప్పుడు(మన పెళ్లి ఎప్పుడు అవుతుంది)’అంటూ అలియా వైపు చూస్తు అన్నాడు. దీనికి అలియా నన్ను అడుగుతావేంటి? అని సమాధానం ఇచ్చి అందరికి షాక్ ఇచ్చింది. ఇక వీరు తీరు చూసి నెటిజన్లు ఇప్పట్లో వీరిద్దరూ పెళ్లి చేసుకునేలా కనిపించడం లేదంటూ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇదిలా ఉంటే బ్రహ్మాస్త్ర మూవీ విడుదల తర్వాతే అలియా-రణ్‌బీర్‌లు పెళ్లి పీటలు ఎక్కాలని అనుకుంటున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. ఎందుకంటే వీరిద్దరూ కలిసి జంటగా నటించిన తొలి సినిమా బ్రహ్మస్త్ర. అందుకే ఈ మూవీ విడుదల అనంతరం ఒక్కటవ్వాలని వారిద్దరూ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment