కరోనా బారిన బాలీవుడ్‌ స్టార్‌ హీరో | Ranbir Kapoor tests COVID-19 positive, confirms Neetu Kapoor | Sakshi
Sakshi News home page

కరోనా బారిన బాలీవుడ్‌ స్టార్‌ హీరో

Published Tue, Mar 9 2021 12:55 PM | Last Updated on Tue, Mar 9 2021 2:45 PM

Ranbir Kapoor tests COVID-19 positive, confirms Neetu Kapoor - Sakshi

సాక్షి,ముంబై: ఒకవైపు దేశంలో కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతోంది. మరోవైపు కరోనా వైరస్ ‌మళ్లీ పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మహమ్మారి మళ్లీ కోరలు  చాస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కోవిడ్‌-19కేసులు పెరుగుతున్నాయి.  తాజాగా బాలీవుడ్‌ యంగ్‌ హీరో రణబీర్ కపూర్  కరోనా బారిన పడ్డారు. దీనిపై ఆర్‌కే తల్లి, నటి నీతూ కపూర్‌  తన ఇన్‌స్టాలో రణబీర్‌ ఆరోగ్యంపై  అప్‌డేట్ ఇచ్చారు. ఈ సందర్భంగా  తన కుమారుడి ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపిన ఆమె ప్రస్తుతం రణబీర్‌ కోలుకుంటున్నాడనీ, అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నట్టు చెప్పారు. దీంతో కార్యక్రమాలకు  బ్రేక్‌  చెప్పి రణబీర్‌ స్వీయ నిర్బంధంలో ఉన్నాడు.

మరోవైపు ముంబైలో, గత నెలతో పోల్చితే కోవిడ్-19 రోగుల సంఖ్య దాదాపు 89 శాతం పెరిగింది. అంధేరి (వెస్ట్), చెంబూర్, గోవాండితో సహా ఎనిమిది వార్డుల్లో కేసుల నమోదు  భారీగా పెరిగింది. దీంతో మహారాష్ట్రలోని థానేలో మార్చి 13 నుంచి - 31 వరకు 11 హాట్‌స్పాట్లలో లాక్‌డౌన్‌ ప్రకటించారు. కాగా రణబీర్‌, అలియా భట్ జంటగా, అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న బ్రహ్మాస్త్ర చిత్రం ఈ ఏడాది విడుదలకు సిద్ధమవుతోంది. జగ్ జగ్ జీయో షూటింగ్ సందర్భంగా నీతూకపూర్‌, నటుడు వరుణ్‌ధావన్‌ కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement