confirms
-
టాటా మోటార్స్ ఏడీఎస్కు టాటా
న్యూఢిల్లీ: అమెరికన్ డిపాజిటరీ షేర్ల(ఏడీఎస్‌లు)ను స్వచ్చందంగా డీలిస్ట్ చేస్తున్నట్లు ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్ తాజాగా పేర్కొంది. సాధారణ షేర్లను ప్రతిబింబించే వీటిని న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీ నుంచి డీలిస్ట్ చేస్తున్నట్లు తెలియజేసింది. సోమవారం(23న) ట్రేడింగ్ ముగిశాక ఓవర్ ద కౌంటర్ మార్కెట్లో వీటి ట్రేడింగ్ నిలిచిపోనున్నట్లు వెల్లడించింది. ఏడీఎస్‌లు కలిగిన వాటాదారులు వీటిని సాధారణ షేర్లుగా మార్పిడి చేసుకునేందుకు 2023 జులై24లోగా ఎక్స్ఛేంజీ లోని డిపాజిటరీవద్ద దాఖలు చేయవలసి ఉంటుందని టాటా మోటార్స్ తెలియజేసింది. కాగా.. దేశీయంగా బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్టయిన టాటా మోటార్స్ ఈక్విటీ షేర్లపై ఈ ప్రభావం ఉండబోదని కంపెనీ స్పష్టం చేసింది. -
ట్విటర్ డీల్: మస్క్ మరోసారి సంచలన నిర్ణయం!
న్యూఢిల్లీ: ట్విటర్ కొనుగోలుకు సంబంధించి టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ మరోసారి కీలక ప్రకటన చేశారు. 44 బిలియన్ల డాలర్ల ట్విటర్ డీల్‌ను అతి త్వరలోనే పూర్తి చేయనున్నారట. ట్విటర్ కొనుగోలుకు సంబంధిత నిధులు సమకూర్చుకుంటున్న మస్క్ శుక్రవారం నాటికి కొనుగోలును పూర్తి చేయాలని భావిస్తున్నారట. ఈ మేరకు సహ-పెట్టుబడిదారులకు మస్క్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. డీల్‌కు నిధులు సమకూర్చే బ్యాంకర్లతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కాల్లో ట్విటర్ కొనుగోలు డీల్‌ను త్వరలోనే ముగించాలని మస్క్ నిర్ణయించినట్టు వార్త లొచ్చాయి. ముఖ్యంఆ సీక్వోయా క్యాపిటల్, బినాన్స్, ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ , ఇతరులతో సహా ఈక్విటీ పెట్టుబడిదారులు మస్క్ లాయర్ల నుండి ఫైనాన్సింగ్ కమిట్మెంట్కు సంబంధించిన పత్రాలను అందుకున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. డెలావేర్ కోర్టు న్యాయమూర్తి గడువు నేపథ్యంలో శుక్రవారం నాటికి లావాదేవీని పూర్తి చేసేలా మస్క్ ప్లాన్ చేస్తున్నాడని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే కొనుగోలు నిధులు సమకూర్చిన బ్యాంకులు తుది రుణ ఫైనాన్సింగ్ ఒప్పందాన్ని పూర్తి చేశాయని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. అయితే తాజా పరిణామంపై, మస్క్ లాయర్లుగానీ, ట్విటర్ గానీ అధికారింగా ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. -
నేను సింగిల్, కాదు మింగిల్.. ఏం చెప్పాలో తెలియట్లేదు: అనుపమ పరమేశ్వరన్
Anupama Parameswaran Reveals Her Love Life In Latest Interview: ‘ప్రేమమ్’ మూవీతో సినీ పరిశ్రమకు పరిచయమైంది మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. చేసింది కొన్ని సినిమాలే అయినా అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. సినిమాల్లో డిసెంట్ రోల్స్ ఎంచుకుంటూ అందం, అభినయంతో ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది. ఎక్కువ సమయంలో సోషల్ మీడియాలో గడిపే అనుపమ తరచూ తన ఫొటోలను, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు చేరువుగా ఉంటోంది. ఈ క్రమంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇటీవల రౌడీబాయ్స్ మూవీతో సందడి చేసిన అనుపమ ప్రస్తుతం కార్తికేయ 2, 18 పేజీస్, బటర్ ఫ్లై సినిమాల్లో నటిస్తోంది. తాజాగా ఈ క్యూట్గుమ్మ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రిలేషన్‌షిప్‌పై ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'నాకు లవ్ మ్యారేజ్‌పై మంచి అభిప్రాయమే ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న కపుల్స్‌ను చూస్తుంటే ముచ్చటగా అనిపిస్తుంది. నాకు కూడా ప్రేమ వివాహమే చేసుకోవాలని ఉంది. మా పేరేంట్స్‌కు కూడా ఈ విషయం తెలుసు. నేను పెళ్లంటు చేసుకుంటే కచ్చితంగా లవ్ మ్యారెజే చేసుకుంటా. నేను సింగిల్.. కాదు మింగిల్.. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే నా రిలేషన్షిప్ స్టేటస్ నాకు కూడా సరిగ్గా తెలియట్లేదు. నేనైతే ప్రేమలో ఉన్నా.. మరి అవతలి సైడ్ నుంచి ఏమనుకుంటున్నారో తెలియదు. ప్రస్తుతం వన్ సైడ్ లవ్ అని చెప్పగలను.' అంటూ తెలిపింది అనుపమ పరమేశ్వరన్. చదవండి: లిప్ లాక్ సీన్లు.. అందుకే ఆ రేంజ్లో అనుపమ రెమ్యునరేషన్! -
కరోనా బారిన బాలీవుడ్ స్టార్ హీరో
సాక్షి,ముంబై: ఒకవైపు దేశంలో కరోనా వైరస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. మరోవైపు కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కోవిడ్-19కేసులు పెరుగుతున్నాయి. తాజాగా బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్ కరోనా బారిన పడ్డారు. దీనిపై ఆర్కే తల్లి, నటి నీతూ కపూర్ తన ఇన్‌స్టాలో రణబీర్ ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చారు. ఈ సందర్భంగా తన కుమారుడి ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపిన ఆమె ప్రస్తుతం రణబీర్ కోలుకుంటున్నాడనీ, అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నట్టు చెప్పారు. దీంతో కార్యక్రమాలకు బ్రేక్ చెప్పి రణబీర్ స్వీయ నిర్బంధంలో ఉన్నాడు. మరోవైపు ముంబైలో, గత నెలతో పోల్చితే కోవిడ్-19 రోగుల సంఖ్య దాదాపు 89 శాతం పెరిగింది. అంధేరి (వెస్ట్), చెంబూర్, గోవాండితో సహా ఎనిమిది వార్డుల్లో కేసుల నమోదు భారీగా పెరిగింది. దీంతో మహారాష్ట్రలోని థానేలో మార్చి 13 నుంచి - 31 వరకు 11 హాట్స్పాట్లలో లాక్డౌన్ ప్రకటించారు. కాగా రణబీర్, అలియా భట్ జంటగా, అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న బ్రహ్మాస్త్ర చిత్రం ఈ ఏడాది విడుదలకు సిద్ధమవుతోంది. జగ్ జగ్ జీయో షూటింగ్ సందర్భంగా నీతూకపూర్, నటుడు వరుణ్‌ధావన్ కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) -
తనే నా గర్ల్ ఫ్రెండ్, త్వరలోనే పెళ్లి : రణ్‌బీర్
సాక్షి,ముంబై: మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్, చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్ ఎట్టకేలకు తన మనసులోని మాటను బయట పెట్టేశాడు. పలు ప్రేమాయాణాలు నడిపిన ఈ బాలీవుడ్ హీరో రణ్‌బీర్ తన ప్రేమికురాలు అలియా భట్ అని తేల్చి చెప్పేశాడు. త్వరలోనే తమ పెళ్లి జరగనుందంటూ ఫ్యాన్స్‌కు తీపి కబురందించాడు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా తమ వివాహం వాయిదా పడిందని, లేదంటే ఈ పాటికే పెళ్లి జరిగి ఉండేదని రణ్‌బీర్ వ్యాఖ్యానించారు. దీనిపై ఇంతకంటే ఇప్పుడేమీ చెప్పలేను, కానీ త్వరలోనే పెళ్లి చేసుకుందా మనుకుంటున్నామని తెలిపారు. ఒక ఇంటర్వ్యూలో రణబీర్ తమ పెళ్లి కబురును తాజాగా ధృవీకరించారు. కాగా రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'బ్రహ్మాస్త్ర' అమితాబ్ బచ్చన్, మౌనిరాయ్ ,నాగార్జున, డింపుల్ కపాడియా ఇతర కీలక పాత్రలుపోషించారు. ఫాంటసీ అడ్వెంచర్ ఫ్రాంచైజీగా భావిస్తున్న ఈ చిత్రంలో రణబీర్ శివ పాత్రలో, అలియా ఇషా అనే పాత్రలో అలరించనున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్లు, కత్రినా, దీపికా పదుకోన్‌తో బ్రేకప్ తరువాత అలియాతో ప్రేమలో పడ్డాడు రణ్‌బీర్. ఈ నేపథ్యంలో వీరి పెళ్లిపై పలు ఊహాగానాలు హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. -
బ్రిటన్‌లోనే నీరవ్: సీబీఐ కీలక చర్య
సాక్షి, న్యూఢిల్లీ: అతిపెద్ద బ్యాంకింగ్ స్కాంకు సంబంధించి సీబీఐ కీలక సమాచారాన్ని సేకరించింది. దాదాపు రూ.14000 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్ మోడీ యునైటెడ్ కింగ్ డమ్ (యుకె)లోనే ఉన్నట్టు సీబీఐ సోమవారం వెల్లడించింది. ఈ మేరకు బ్రిటన్ అధికారులు సమాచారం ఇచ్చినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. వేలకోట్ల రుణాలను ఎగొట్టి లండన్‌కు చెక్కేసిన బిలియనీర్ వజ్రాల వ్యాపారి నీరవ్‌ను తమకు అప్పగించాలని కోరినట్టు తెలిపింది. నీరవ్ మోదీ అప్పగించాల్సిందిగా సీబీఐ హోమ్ మంత్రిత్వ శాఖ ద్వారా దరఖాస్తు చేసింది. ఈ దరఖాస్తును విదేశాంగ శాఖ బ్రిటన్‌కు పంపిస్తుంది. అలాగే నీరవ్ మోదీని అదుపులోకి తీసుకోవాల్సిందిగా సీబీఐ యుకె అధికార యంత్రాంగాన్ని కోరింది. దేశంలోనే అతి పెద్ద బ్యాంక్ స్కామ్ పీఎన్బీ కుంభకోణం వెలుగులోకి రాకముందే నీరవ్ మోదీ, భార్య అమీ మోదీ, సోదరుడు నిశాల్ మోదీ మామ మెహుల్ చోక్సీ విదేశాలకు చెక్కేశారు. ఈ కేసు విచారణలో భాగంగా మోదీ, చోక్సీల పాస్‌పోర్ట్‌లను రద్దు చేసింది. అలాగే ఇంటర్ పోల్ కూడా మాల్యాకు వ్యతిరేకంగా రెడ్ కార్నర్ నోటీసును జారీ చేసింది. అటు ప్రభుత్వ బ్యాంకుల నుంచి రూ.9,వేల కోట్లు రుణం తీసుకొని ఎగ్గొట్టి లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కూడా లండన్‌కు పారిపోయిన సంగతి తెలిసిందే. -
హెచ్‌టీసీ కన్ఫాం చేసింది
న్యూఢిల్లీ: గూగుల్ ఆండ్రాయిడ్ తాజా వెర్షన్ 7.0 నోగట్ తో హెచ్ టీసీ స్మార్ట్ ఫోన్ల తయారీకి రంగం సిద్ధమైంది. తమ అప్ కమింగ్ మోడ్సల్ ను గూగుల్ అండ్రాయిడ్ వెర్షన్ నోగట్ తో అప్ డేట్ చేయనున్నట్టు వెల్లడించింది. ఈ ఏడాది చివరికి ఆండ్రాయిడ్ 7.0 వెర్షన్ తో అప్ డేట్ చేస్తామని ట్టిట్టర్ ద్వారా తెలిపింది. ఈ అప్ డేట్ తేదీని త్వరలోనే వెల్లడిస్తామని చెప్పింది ఈ ఏడాది ఫోర్త్ క్వార్టర్ లో హెచ్ టీసీ10ను నౌగట్ వెర్షన్ తో అప్ డేట్ చేసే మొదటి స్మార్ట్ ఫోన్ కానుంది. .వన్ ఎం 9, వన్ ఎ 9 డివైజ్ లను నౌగట్ తో లాంచ్ చేయనున్నట్టు తెలిపింది. అయితే ఈ ఏడాది చివరికా, లేక 2017 ఫస్ట్ క్వార్టర్ లోనా అనేది స్పష్టంగా పేర్కొనలేదు. కాగా గూగుల్ నెక్సస్ స్మార్ట్ ఫోన్ల తయారీలో హెచ్‌టీసీ భాగస్వామ్య వార్తలను ఇటీవల హెచ్‌టీసీ ధృవీకరించిన సంగతి తెలిసిందే. ఆండ్రాయిడ్ తాజా వెర్షన్ 7.0 నోగట్ తో పనిచేసేలా రెండు కొత్త నెక్సస్ స్మార్ట్ ఫోన్లను తయారీచేస్తున్నామని హెచ్ టీసీ రిపోర్టు చేసింది. We’re excited to receive final shipping Android 7.0 Nougat software from Google! pic.twitter.com/BNbQBpgddK — HTC (@htc) August 24, 2016 -
సెబీ సంచలన నిర్ణయం
ముంబై: మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ 19 సంస్థలపై నిషేధాన్ని ధృవీకరిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. స్టాక్ ఎక్స్ఛేంజీల యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా అక్రమ మార్గాల్లో డబ్బులు సంపాదించిన కేసులో ఈ నిర్ణయం తీసుకుంది. మనీలాండరింగ్,పన్నుఎగవేసినకేసులో ఇంకా విచారణ కొనసాగుతున్నందున 19సంస్థలు/వ్యక్తులపై నిషేధాన్ని ధ్రువీకరిస్తున్నట్లు సెబీ బుధవారం జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. జూన్ 29, 2015 నాటి మధ్యంతర ఉత్తర్వులు తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు అమలులో ఉంటాయి సెబి ఒక ప్రకటనలో వెల్లడించింది. గత ఏడాది జారీ చేసిన తాత్కాలిక ఉత్తర్వుల్లో నాలుగు కంపెనీలు, ప్రస్తుత19 సంస్థలు సహా 235 ఇతర సంస్థల పై నిషేధం విధించింది. సెక్యూరిటీల మార్కెట్ నుంచి నగదు బదిలీ ద్వారా రూ 614 కోట్ల అక్రమ లాభాలు ఆర్జించినట్టు పేర్కొంది. ఎకో ఫ్రెండ్లీ ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్, ఎస్టీమ్ బయో ఆర్గానిక్ ఫుడ్ ప్రాసెసింగ్, ఛానెల్ నైన్ ఎంటర్టైన్మెంట్, హెచ్పీసీ బయోసైన్సెస్ కంపెనీ షేర్లలో అవకతవకలు జరిగాయని సెబీ ఆరోపణ. జనవరి 1, 2013 - డిసెంబరు 31, 2014 మధ్య ఈ షేర్ల ట్రేడింగ్ లో షేర్ల పరిమాణం భారీగా పెరిగింద. కృత్రిమ ప్రాధాన్యత కేటాయింపులు, ఫేర్ల ధర, పరిమాణాన్ని పెంచడం ద్వారా అక్రమ లాభాలను ఆర్జించి స్టాక్ మార్కెట్ ను దుర్వినియోగం చేసిన ఆరోపణలపై సెబీ ప్రాథమిక విచారణలో అక్రమాలు వెలుగు చూశాయి. మరోవైపు ఈ వ్యవహారంలో తదుపరి విచారణ కొనసాగుతుందని సెబీ అధికారి వెల్లడించారు. కాగా, గతేడాది జూన్‌లో జారీ చేసిన తాత్కాలిక ఆదేశాలను సవరించడం లేదా వెనక్కి తీసుకోవడానికి ఎలాంటి కారణమూ కనిపించలేదని సెబీ సభ్యుడు రాజీవ్ కుమార్ అగర్వాల్ పేర్కొన్నారు. దీంతో సెబీ ఈ కంపెనీలపై నిషేధాన్ని ధ్రువీకరించిందన్నారు. ఈ 19 సంస్థలు/వ్యక్తుల్లో మధుకర్ దూబే, సతేంద్ర కుమార్, కోర్ క్యాపిటల్ సర్వీసెస్, మేఫెయిర్ ఇన్ ఫో సొల్యూషన్స్, చేతన్ ప్రకాశ్, అసిఫా జమాల్, ప్రకాశ్ గుప్తా, అభిషేక్ గుప్తాలున్నారు. -
బీజేపీ- టీడీపీ మధ్య తేలని సీట్ల వ్యవహారం
-
'మా విమానానికి బాంబు బెదిరింపు నిజమే'
సింగపూర్: తమ విమానానికి బాంబు బెదిరింపు వచ్చిందని సింగపూర్ ఎయిర్‌లైన్స్(ఎస్ఐఏ) స్పష్టం చేసింది. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి సింగపూర్‌కు బయలుదేరిన విమానం ఎస్ క్యూ 001కు ఉగ్రవాదులు బాంబు హెచ్చరికలు చేశారని, దాంతో విమానాన్ని చాంఘీ విమానాశ్రయంవద్ద సురక్షితంగా దించివేశామని చెప్పారు. దీనివల్ల ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బంది కలిగిందని, వారి సామాను తీసుకునేందుకు దాదాపు రెండున్నర గంటలు ఎదురుచూడాల్సి వచ్చిందని , అందుకు చింతిస్తున్నామని అన్నారు. తొలుత బాంబు బెదిరింపు విషయాన్ని అధికారులకు చెప్పామని, అయితే, భద్రతా కారణాల దృష్ట్యా వివరాలు చెప్పకుండా చాలా జాగ్రత్తగా విమానాన్ని దించివేసేలా చేశామన్నారు. చివరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నామని చెప్పారు. -
ఈ నెల 23న త్రిష ఎంగేజ్మెంట్